అదృశ్యమయ్యాడు..శవమై తేలాడు | desappear man cought died | Sakshi
Sakshi News home page

అదృశ్యమయ్యాడు..శవమై తేలాడు

Published Tue, Jul 12 2016 1:38 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

అదృశ్యమయ్యాడు..శవమై తేలాడు - Sakshi

అదృశ్యమయ్యాడు..శవమై తేలాడు

రంగంపేట కొత్తచెరువు తూములో మృతదేహం
హత్య చేశారని  కుటుంబ సభ్యుల ఆరోపణ

 కొల్చారం : మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన వడ్ల రాజశేఖర్ (28) ఈ నెల 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే అతడు సోమవారం రంగంపేటకు సమీపంలోని కొత్తచెరువు తూములో శవమై కనిపించాడు. కొల్చారం ఎస్సై విద్యాసాగర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..  రంగంపేటకు చెందిన వడ్ల రాజశేఖర్(28) గ్రామంలో మోటర్ మెకానిక్ షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 6న భార్య హేమలతకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో  మెదక్‌లోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని తల్లిగారి ఇంటికి వెళ్లమని రంగంపేటలో బస్సు ఎక్కించాడు.

అనంతరం రాజశేఖర్ 9గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చిందంటూ స్నేహితులకు చెప్పి బయటకు వెళ్లినట్లు తెలిపారు. అదే రాత్రి భార్యను తిరిగి ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు. అనంతంరం ఫోన్ స్విచ్‌ఆఫ్ అయింది. విషయం గమనించిన భార్య హేమలత  మరుసటిరోజు ఇంటికి చేరుకుంది. రాజశేఖర్ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఈ నెల 9న శనివారం కొల్చారం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తి అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రంగంపేటలోని కొత్త చెరువు అలుగు నుంచి  వాసన వస్తుండడంతో అక్కడి రైతులు పోలీసులకు చెప్పారు. కొల్చారం ఎస్సై విద్యాసాగర్ సిబ్బందితో కలిసి తూము కాలువలోకి దిగి చూడగా శవం కనిపించింది. మృతదేహం రాజశేఖర్‌దిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 హత్య చేశారు: కుటుంబీకులు
రాజశేఖర్‌ను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హత్య చేసి చంపివేసినట్లు అతడి భార్య హేమలత, తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీ కొడుకును ఎలాగైనా చంపేస్తానంటూ ఇంటికి వచ్చి బెదిరించి వెళ్లాడని, అదే ఈ రోజు నిజమైందని వారు ఫిర్యాదు చేశారు. మృతుడికి రెండున్నర ఏళ్ళ కూతురు రక్షిత ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement