కొద్ది గంటల్లోనే పెళ్లి...వరుడు అదృశ్యం | groom disappears before wedding | Sakshi
Sakshi News home page

కొద్ది గంటల్లోనే పెళ్లి...వరుడు అదృశ్యం

Published Fri, Apr 1 2016 7:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

groom disappears before wedding

కొద్ది గంటల్లోనే వివాహ వేడుక జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....అడ్డగుట్టలోని వడ్డెర బస్తీలో నివసించే సఫీ(25) తుకారాంగేట్‌లోని రియోపాయింట్ హోటల్ సమీపంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తుంటాడు.

 

అయితే, కొద్ది రోజుల క్రితం సఫీకి మౌలాలీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేందుకు సఫీ ముందుకు వచ్చాడు. మార్చి నెల 31వ తేదీ రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఏం జరిగిందో తెలియదు కాని గురువారం ఉదయం నుంచి పెళ్లి కొడుకు సఫీ కనిపించకుండా పోయాడు. మధ్యాహ్నం వరకు చూసినా అతడి జాడ తెలియలేదు. తెలిసిన వాళ్లందరినీ వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు శుక్రవారం తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement