Addagutta
-
బాలికపై హోంగార్డు లైంగిక దాడి
అడ్డగుట్ట: మాయమాటలతో మభ్యపెట్టి ఓ మైనర్ బాలికపై హోం గార్డు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడ్డగుట్టలోని కమ్యూనిటీహాలు ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ (40) హోంగార్డు. హైద్రాబాద్ సీసీఎస్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో బాలికను మభ్యపెట్టి మోసం చేశాడు. బాలిక ఇంట్లో ఎవరూలేని సమయం చూసి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు. కాగా, బాలికకు రెండు రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. బాధితులు స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: దారుణం: భార్య ఆత్మను వెళ్లగొట్టాలని కూతురునే.. నిర్లక్ష్యపు నడక, బైకర్ అతివేగం.. మీరు మారరా! -
కొద్ది గంటల్లోనే పెళ్లి...వరుడు అదృశ్యం
కొద్ది గంటల్లోనే వివాహ వేడుక జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....అడ్డగుట్టలోని వడ్డెర బస్తీలో నివసించే సఫీ(25) తుకారాంగేట్‌లోని రియోపాయింట్ హోటల్ సమీపంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అయితే, కొద్ది రోజుల క్రితం సఫీకి మౌలాలీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేందుకు సఫీ ముందుకు వచ్చాడు. మార్చి నెల 31వ తేదీ రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఏం జరిగిందో తెలియదు కాని గురువారం ఉదయం నుంచి పెళ్లి కొడుకు సఫీ కనిపించకుండా పోయాడు. మధ్యాహ్నం వరకు చూసినా అతడి జాడ తెలియలేదు. తెలిసిన వాళ్లందరినీ వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు శుక్రవారం తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించారు. -
మద్యం మత్తులో స్నేహితుడిని చంపేశారు..
అడ్డగుట్ట (హైదరాబాద్) : వీకెండ్లో మద్యం పార్టీ నిర్వహించుకున్న నలుగురు స్నేహితులు.. ఆ మత్తులో మాటా మాటా అనుకోవడంతో ఇద్దరు యువకులు కలిసి మరో స్నేహితుడిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. ఇది చూసి తీవ్ర భయాందోళనకు గురైన మరో స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటిరోజు తాపీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ స్నేహితుడిని హతమార్చామని లొంగిపోయారు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ కరణ్‌కుమార్ సింగ్ తెలిపిన కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా దాసిరెడ్డి గూడెంకు చెందిన కొమిరెళ్లి ప్రదీప్‌రెడ్డి (24) ఆగస్టులో నగరానికి వచ్చి శాంతినగర్‌లోని అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. 'మా ఊరి అమ్మాయినే ప్రేమిస్తావా..' శాంతినగర్‌లో నివసించే ప్రదీప్‌రెడ్డి ఇంటికి శనివారం తన స్నేహితులు ఉదయ్, నాగేశ్వర్రావు, లింగస్వామిలు రావడంతో రాత్రి సుమారు 8.30 గంటలకు విందు ఏర్పాటు చేసి, మద్యం పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో ఉన్న ఉదయ్‌కిరణ్ తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తను మీ గ్రామంలోనే ఉంటుందని, ఎలాగైనా ఆ అమ్మాయిని నువ్వే ఒప్పించాలని ప్రదీప్‌రెడ్డితో ఆవేశంగా చెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రదీప్‌రెడ్డి క్షణికావేశంలో మా ఊరి అమ్మాయినే ప్రేమిస్తావా అని అంటూ పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌లో ఉదయ్‌కిరణ్ తలపై కొట్టాడు. ఆ వెంటనే మరో స్నేహితుడు నాగేశ్వర్రావు ఒక చిన్న కత్తితో ఉదయ్ ఛాతిలో, కడుపులో పొడిచాడు. లింగస్వామి ఎంత ఆపడానికి ప్రయత్నించినా వినకుండా ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులు తీవ్రంగా కొట్టి, కత్తితో పొడిచి ఉదయ్‌ను హతమార్చారు. ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్న వీరిని చూసి లింగస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఉదయ్‌కిరణ్‌ను హత్య చేసిన ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులు ఇద్దరు అతని మృతదేహాన్ని రూమ్‌లోనే ఉంచి బయటి నుంచి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఆదివారం రాత్రి సుమారు 11 గంటలకు స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో జరిగిన సంఘటన గురించి వివరించి హత్య చేసింది తామేనని చెప్పి లొంగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రూమ్‌లో ఉన్న పది బీరు బాటిళ్లు, బేస్‌బాల్ బ్యాట్, చిన్న కత్తి, వికెట్లను లాలాగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న లింగస్వామి కోసం గాలిస్తున్నామన్నారు. -
'సికింద్రాబాద్‌లో స్థానికుడిని గెలిపించండి'
సికింద్రాబాద్: చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందరం కలిసి ఒక్కటై ఈ వ్యవస్థను మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని విడగొట్టారు కానీ తెలుగుజాతిని విడగొట్టలేరన్నారు. సీమాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా తెలంగాణను ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. తెలంగాణలో ఖమ్మం తప్ప మిగతా ప్రాంతాల్లో ఓదార్పుయాత్ర చేయలేకపోయానని గుర్తు చేశారు. ఎన్నికలయ్యాక తన సోదరి షర్మిల తెలంగాణలో ఓదార్పుయాత్ర కొనసాగిస్తుందని తెలిపారు. 1950 తర్వాత సికింద్రాబాద్‌లో స్థానికుడికి ఏ పార్టీ టికెట్ ఇచ్చిన పాపాన పోలేదని, వైఎస్సార్ సీపీ మాత్రమే స్థానికుడికి టికెట్ ఇచ్చిందని తెలిపారు. స్థానికుడైన ఆదం విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎం.డి. సాజిత్ అలిని సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించాలని ఓటర్లకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.