'సికింద్రాబాద్‌లో స్థానికుడిని గెలిపించండి' | Secunderabad people should vote for local candidate, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

'సికింద్రాబాద్‌లో స్థానికుడిని గెలిపించండి'

Published Sun, Apr 27 2014 8:39 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

'సికింద్రాబాద్‌లో స్థానికుడిని గెలిపించండి' - Sakshi

'సికింద్రాబాద్‌లో స్థానికుడిని గెలిపించండి'

సికింద్రాబాద్‌: చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందరం కలిసి ఒక్కటై ఈ వ్యవస్థను మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు.

రాష్ట్రాన్ని విడగొట్టారు కానీ తెలుగుజాతిని విడగొట్టలేరన్నారు. సీమాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా తెలంగాణను ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. తెలంగాణలో ఖమ్మం తప్ప మిగతా ప్రాంతాల్లో ఓదార్పుయాత్ర చేయలేకపోయానని గుర్తు చేశారు. ఎన్నికలయ్యాక తన సోదరి షర్మిల తెలంగాణలో ఓదార్పుయాత్ర కొనసాగిస్తుందని తెలిపారు.

1950 తర్వాత సికింద్రాబాద్‌లో స్థానికుడికి ఏ పార్టీ టికెట్‌ ఇచ్చిన పాపాన పోలేదని, వైఎస్సార్ సీపీ మాత్రమే స్థానికుడికి టికెట్‌ ఇచ్చిందని తెలిపారు. స్థానికుడైన ఆదం విజయ్‌కుమార్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎం.డి. సాజిత్ అలిని సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించాలని ఓటర్లకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement