Shafi
-
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మలయాళ దర్శకుడైన షఫీ(56)కి ఈనెల 16న హార్ట్ స్ట్రోక్ రావడంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు పది రోజుల చికిత్స పొందుతూ కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఆయన మరణం పట్ల ప్రముఖ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, చియాన్ విక్రమ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రియమైన స్నేహితుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చియాన్ విక్రమ్ ట్విటర్ వేదిక విచారం వ్యక్తం చేశారు. డైరెక్టర్ షఫీలో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విక్రమ్ ట్విటర్లో రాస్తూ "ఈ రోజు ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. అంతాకాదు ఈ ప్రపంచం ఒక అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. జీవితంలోని క్షణాలలో అందాన్ని చూడగల వ్యక్తి. అతను మన మధ్య లేకపోవచ్చు.. కానీ అతనితో ఉన్న క్షణాలు ఎల్లప్పుడూ గుర్తుకొస్తాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడి పార్థిస్తున్నా. నిన్ను మిస్సవుతున్నా కానీ ఎప్పటికీ మర్చిపోలేము " అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. డైరెక్టర్ మృతి పట్ల హీరో విష్ణు ఉన్నికృష్ణన్ నివాళులర్పించారు.కాగా.. షఫీ అసలు రషీద్ కాగా.. సినిమాల్లోకి వచ్చాక షఫీ పేరుతోనే ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కామెడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో వన్ మ్యాన్ షో మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో 10 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మలయాళంలో పులివాల్ కళ్యాణం, తొమ్మనుమ్ మక్కలుమ్, మాయావి, మరికొండొరు కుంజాడు లాంటి చిత్రాలను తెరకెక్కించారు. చివరిసారిగా 2022లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆనందం పరమానందం’ దర్శకుడిగా వ్యవహరించారు. Today, I lost a dear friend and the world lost an incredible storyteller. He was one of the most fun loving & sensitive souls I’ve ever known, someone who could see the beauty in life’s simplest moments.He may no longer walk among us, but he will always live in the laughter,… pic.twitter.com/HS8xytCvPi— Vikram (@chiyaan) January 26, 2025 -
Lok sabha elections 2024: పోటీ కేరళలో.. ప్రచారం గల్ఫ్‌లో!
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్‌కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్‌లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఇ.శ్రీధరన్‌పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు. -
నా నీ ప్రేమకథ సినిమా రివ్యూ
రివ్యూ : ‘నా నీ ప్రేమ కథ’ తారాగణం : అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి, రమ్య శ్రీ, అజయ్ ఘోష్, షఫీ, ఫిష్ వెంకట్, అన్నపూర్ణమ్మ తదితరులు రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్ కెమెరా : ఎంఎస్ కిరణ్ కుమార్ సంగీతం : ఎమ్ ఎల్ పి రాజా ఎడిటర్ : నందమూరి హరి నిర్మాణం: పిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: పోత్నాక్ శ్రవణ్ కుమార్ కథ నాని (అముద శ్రీనివాస్) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తాడు. అజయ్ ఘోష్ గ్రామ పెద్ద. ఆయన కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్ చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొంతూరుకి తిరిగొస్తుంది. నాని నందినిని ప్రేమిస్తాడు. గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకుని నందిని తండ్రి నాయుడు (అజయ్ ఘోష్) నానిని చంపాలనుకుంటాడు. అదే అమ్మాయిని ప్రేమిస్తున్న గుణ (షఫి) నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని రక్షించడం.. తనలో వచ్చిన మార్పా? లేక నమ్మించి గొంతు కోసేందుకు ప్లాన్ చేశాడా? తర్వాత ఏం జరిగింది? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఇది ముగ్గురి మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నానిని రక్షించిన సమయంలో గుణలో వచ్చిన మార్పు, దాని వెనకున్న సస్పెన్స్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అయితే ఇక్కడ దర్శకుడే హీరో కావడం సినిమాకు కొంత మైనస్‌గా మారింది. అటు హీరో పని, ఇటు దర్శకుడి బాధ్యత రెండూ తన భుజాన వేసుకోవడంతో అక్కడక్కడా పట్టు తప్పిపోయాడు. రెండింటిని సక్రమంగా నిర్వర్తించాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో అక్కడక్కడా డైరెక్షన్ మీద పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. హీరో పాత్రలో బాగానే నటించాడు, కానీ హీరో స్థానంలో మరొకరిని తీసుకుని ఉండుంటే అతని మీద ఒత్తిడి తగ్గి అవుట్‌పుట్ ఇంకాస్త మెరుగ్గా వచ్చేది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి పర్వాలేదనిపించారు. సిటీలో డాక్టర్ చదివి వచ్చినప్పటికీ గ్రామీణ మూలాలు మరచిపోకుండా సాంప్రాదాయంగా కనిపించడంలో కారుణ్య వంద శాతం సక్సెస్ అయింది. షఫీ గుణ పాత్రలో చక్కగా సెట్టయ్యాడు. అజయ్‌ఘోష్ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... దర్శకుడు ప్రేమ, భావోద్వేగపు సన్నివేశాలను అద్భుతంగా మలచాలని ప్రయత్నించాడు, కానీ కొంతమేరకే సఫలీకృతమయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కెమెరా పనితీరు బానే ఉంది. కానీ, సినిమాలో అక్కడక్కడా దృశ్యాలు డల్‌గా అనిపించాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించదు. రొటీన్ ప్రేమకథే కావడంతో చాలా సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేస్తాడు. చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ -
సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఆక్టర్ షఫీ
-
కేరళ నరబలి కేసు: పోర్న్ సినిమాల్లో నటిస్తే రూ.10 లక్షలు!
కేరళలోని పతనంతిట్ట ఎలంతూరు నరబలి ఉదంతంలో.. వెన్నులో వణుకుపుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను ప్రేరేపించడంతో పాటు బాధితులకు డబ్బు ఆశతో ఎర చూపించడం, ఆపై వాళ్లను తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా బలి ఇవ్వడం.. ఇలా దాదాపు ప్రతీ దాంట్లోనూ మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అంతేకాదు స్థానికంగా 12 మంది మహిళల మిస్సింగ్ కేసుకు.. వీళ్లకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేరళ జంట నరబలి కేసులో షఫీ(52) ఆకృత్యాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతారని షఫీ చెప్పిన మాయమాటలతో తాము ఎలా నేరం చేశామన్నది భగవల్ సింగ్- లైలా దంపతులు పోలీసులకు వివరించారు. ఈ వివరాలను, దర్యాప్తులో వెలుగు చూసిన మరిన్ని విషయాలను పోలీసులు మీడియాకు తాజాగా వివరించారు. ఈ ఉదంతం కంటే ముందే షఫీపై కొన్ని కేసులు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో ఆమెను లైంగికంగా హింసించగా.. అదే ఆనవాలు ఇప్పుడు రోసిలీ, పద్మమ్ ఒంటిపై అయిన గాయాల్లోనూ కనిపించాయి. నిందితులు భగవల్ సింగ్, అతని భార్య లైలా షఫీ ఓ సైకోపాత్. కేరళ ఎర్నాకులం జిల్లా పెరుంబవూరులో పుట్టిపెరిగాడు. ఆరో తరగతి దాకా చదువుకున్న అతనికి వివాహం కూడా అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడేళ్ల మనవరాలు కూడా ఉంది. డ్రైవర్ నుంచి మెకానిక్ వరకు చాలా ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం కొచ్చిలో ఒక చిన్న హోటల్ని నడుపుతున్నాడు. బాధితులిద్దరూ తరచూ ఈ హోటల్‌కు వెళ్తుండేవాళ్లని, ఈ క్రమంలో వాళ్ల మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చే మహిళల్లో కుటుంబాలకు దూరంగా, బాధల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని తన సైకో గుణం బయటపెట్టేవాడని పోలీసులు వివరించారు. అయితే షఫీ కుటుంబం మాత్రం అతనిలో ఏనాడూ తమకు ఎలాంటి సైకో గుణం కనిపించేది కాదని అంటోంది. భగవల్ సింగ్ ఇంటి బయట గుమిగూడిన జనం పైశాచిక ఆనందం కోసమే.. లైంగిక ఆనందం కోసం షఫీ ఎక్కడిదాకా అయినా వెళ్తాడు. చంపేందుకు కూడా వెనకాడడు. ఈ క్రమంలో గతంలో కొందరు సెక్స్ వర్కర్లపై అతను దాడి కూడా చేసినట్లు తేలింది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్లను ట్రాప్ చేసేందుకు ఫేస్బుక్లో డాక్టర్ శ్రీదేవి అనే పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచాడు. ఈ అకౌంట్ ద్వారానే ఆర్థికంగా చితికిపోయి ఉన్న భగవల్ సింగ్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. భగవల్ సింగ్ ఓ ట్రెడిషినల్ హీలర్.. మసాజ్ థెరపిస్ట్. మూడేళ్ల పాటు ఆ పరిచయం కొనసాగి.. చివరకు తనను తాను మంత్రగాడిగా చెప్పుకుని.. కష్టాలు తొలగిస్తానని వాళ్లను నమ్మబలికాడు. అలా ఈ జంట ద్వారా ఇతరులను వేధించి.. మానసిక ఆనందం పొందాలని యత్నించాడు. కనిపించకుండా పోయిన రోజు సీసీ ఫుటేజ్‌లో పద్మమ్ పోర్న్ సినిమాల ఆఫర్‌తో.. భర్తకు దూరంగా ఉంటూ.. లాటరీ టికెట్లు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్న రోసిలీని మొదట టార్గెట్ చేశాడు షఫీ. పోర్న్ చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. దీంతో డబ్బు కోసం ఆమె ఆ పనికి సిద్ధపడింది. జూన్ 6వ తేదీన ఆమె షఫీ వెంట వెళ్లగా.. తిరిగి రాలేదు. ఒంటరి మహిళ కావడంతో ఆమె అదృశ్యం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్మమ్ను అదే తరహాలో టార్గెట్ చేశాడు షఫీ. తనకు పడక సుఖం అందిస్తే.. రూ.15 వేలు ఇస్తానని ఆశ పెట్టాడు. నమ్మి వెంట వెళ్లిన ఆమె కూడా తిరిగి రాలేదు. పద్మమ్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసును చేధించగలిగారు పోలీసులు. ఆపై నరబలి ఉదంతం, షఫీ రాక్షసత్వం ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. నిందితులు లైలా, షఫీ, భగవల్ సింగ్(ఎడమ నుంచి కుడి) క్లోజ్ ఫ్రెండ్‌నే ఇరికించే డ్రామా ఈ కేసులో రెండో నిందితురాలు.. భగవల్ సింగ్ భార్య అయిన లైలా సైతం షఫీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో హత్యల గురించిన సమాచారాన్ని లీక్ చేస్తారనే భయంతో సింగ్‌ని తొలగించడానికి షఫీ, లైలా ప్లాన్ చేశారని తెలిసింది. మరోవైపు షఫీ తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ ముహమ్మద్ బిలాల్‌ను ఈ కేసులో ఇరికించే యత్నం చేశాడు. తన స్కార్పియోను బిలాల్ వాడుకున్నాడని, కిడ్నాప్ వెనుక అతని హస్తం కూడా ఉందని షఫీ చెప్పడంతో.. రెండు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. చివరికి అతని ప్రమేయం లేదని నిర్ధారించుకుని పోలీసులు వదిలేశారు. నరబలి జరిగింది ఇదే ఇంట్లో.. వండుకుని తిన్నది నిజమేనా? కేరళ ఎలంతూరు నరబలి కేసును చేధించిన కొచ్చి డీసీపీ శశిధరన్ ఆధ్వర్యంలోనే ప్రత్యేక విచారణ బృందం(సిట్)కే ఈ కేసును అప్పజెప్పింది కేరళ హోం శాఖ. పోర్న్ సినిమాల్లో నటించాలని, పడక సుఖం అందించాలని డబ్బు ఆశజూపి బాధితులిద్దరినీ షఫీనే ట్రాప్ చేసి.. చంపినట్లు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో డబ్బు ఆశతోనే భగవల్ సింగ్, లైలాలను షఫీ లోబర్చుకుని.. ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో షఫీని ప్రధాన నిందితుడిగా, ఆ జంటను సహనిందితులుగా పేర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు వివరాల్ని వెల్లడిస్తున్న కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు బాధితులిద్దరినీ ఒకే రీతిలో బలి ఇచ్చినట్లు లైలా-భగవల్లు అంగీకరించారు. అయితే మంచానికి కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కేసి.. ఆపై ప్రైవేట్ భాగాలపై కత్తితో గాయాలు చేసి.. వక్షోజాలను కోసేసి.. చివరికి గొంతు కోసి షఫీనే చంపాడని ఆ దంపతులు చెప్తున్నారు. తాము నర బలికి సహకరించామని, ఆపై ముక్కలుగా నరికి.. పాతేశామని వెల్లడించారు. అయితే.. శరీర భాగాలను వండుకుని తిన్నారనే అనుమానాలు ఉన్నా.. అందుకు సంబంధించిన నిర్ధారణ ఇంకా కాలేదని పోలీసులు వెల్లడించారు. వీళ్ల రక్త చరిత్ర ఇది మాత్రమే అయ్యి ఉండదని, మరో 12 మంది మహిళల మిస్సింగ్ కేసులతో సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ ముగ్గురిని విచారించేందుకు మరో రెండు వారాల కస్టడీకి కోర్టును అనుమతి కోరారు. రాజకీయ విమర్శలు ఇక ఈ కేసులో భగవల్ సింగ్‌ను తప్పించే యత్నం జరుగుతోందని బీజేపీ విమర్శిస్తోంది. అధికార పార్టీ మద్దతుదారుడు కావడంతోనే షఫీని హైలైట్ చేసి.. భగవల్ను తప్పించాలని చూస్తున్నారంటూ పోలీస్ శాఖపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ ఖండిస్తోంది. ఇదీ చదవండి: విద్యార్థినిపై హత్యాచారం.. ఆపై యాక్టింగ్! -
అనుక్షణం ఉత్కంఠ
ప్రముఖ నిర్మాత శోభారాణి తనయుడు రమణ హీరోగా షఫీ, సిమ్రాన్, సారిక, అర్చన, శివణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘పాయిజన్’ (వర్కింగ్ టైటిల్). సీఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె.శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి చక్కని కథతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. తప్పకుండా ఫీల్‌గుడ్ మూవీని అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతోమంది నటీనటుల్ని ఆడిషన్ చేసి, ఎంచుకోవటం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కు హీరో రమణ పర్ఫెక్ట్ చాయిస్’’ అన్నారు. రమణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కర్నీ ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే కథ ఇది. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నేహల్ డి.జె. -
ఇది కల కాదు
నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇది కల కాదు’. అదీబ్ నజీర్, దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య, పూజిత జొన్నలగడ్డ ప్రధాన పాత్రల్లో నటించారు. అదీబ్ నజీర్ దర్శకత్వంలో పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా అదీబ్ నజీర్ మాట్లాడుతూ– ‘‘స్త్రీలను దేవతలుగా కొలిచే మన దేశంలోనూ నేటి ఆధునిక కాలంలో వారిపై లైంగిక వేధింపులు జరగడం బాధాకరం. మన చుట్టుపక్కల జరుగుతున్న వాస్తవ సంఘటనలు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. దాదాపు రెండున్నర కోట్లు బడ్జెట్‌తో నిర్మించాం’’ అన్నారు సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రుబియా కౌ కాబ్. ఈ చిత్రానికి కెమెరా: వి. సత్యానంద్. -
రంగు పడనివ్వం
తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘రంగు’ సినిమా తెరకెక్కించారు. లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితులు సందీప్, ధనుంజయ్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ (లారా బావ మరిది) మాట్లాడుతూ– ‘‘లారా గురించి సమాచారం సేకరించడానికి దర్శకుడు కార్తికేయ ఏడాది క్రితం విజయవాడ వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్‌మీట్ చూశాం. లారా అనే రౌడీషీటర్.. అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. లారా మీద రౌడీషీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించాలి. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ‘రంగు’ దర్శక, నిర్మాతలను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. సినిమాని ముందుగా మాకు చూపించి, మా అంగీకారంతోనే విడుదల చేయాలి. లేదంటే సినిమా విడుదలని లీగల్‌గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ పడనీయం’’ అన్నారు. లారా స్నేహితులు సందీప్, ధనుంజయ్ పాల్గొన్నారు. -
కథ చెప్పినప్పుడు భయపడ్డాం
ఆయుష్ రామ్, శ్రవణి, ‘ఛత్రపతి’ షఫీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విషపురం’. సందిరి శ్రీనివాస్ దర్శకత్వంలో పాతురి బుచ్చిరెడ్డి, పాతురి మాధవరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. శ్రీ వెంకట్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చిత్ర దర్శకుడు, నిర్మాతలు విడుదల చేశారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘సందిరి శ్రీనివాస్ చెప్పిన కథతో సినిమా చేయడానికి ముందు భయపడ్డాం. కానీ, ఆయన పట్టుదలతో మమ్మల్ని ఒప్పించి ఈ సినిమా పూర్తి చేశారు. ఇదే దర్శకుడితో మా బ్యానర్లో మరో చిత్రం నిర్మిస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి, మమ్మల్ని ముందుకు నడిపించాలి’’ అన్నారు. ‘‘జాంబీల మీద ఇంతవరకూ ఎవరూ సినిమా చేయలేదు. మేము కష్టపడి ఈ సినిమా చేయలేదు.. ఇష్టపడి చేసాం. ఒక కొత్త సినిమా చేశామన్న తృప్తితో ఉన్నాం. మా నిర్మాతలు ఫైనల్ ఔట్పుట్తో సంతోషంగా ఉన్నారు’’ అన్నారు సందిరి శ్రీనివాస్. కెమెరామెన్ కిషన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: రోహిత్ జిల్లా. -
ఆ నలుగురు
షఫీ, ఆయుష్ రామ్, శ్రావణి ముఖ్య తారలుగా శ్రీనివాస్ సందిరి దర్శకత్వంలో పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధవరెడ్డి నిర్మించిన సినిమా ‘విషపురం’. ఈ సినిమాను వచ్చే నెల 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ స్నేహితుని ప్రేమ కోసం జాంబీలు ఉండే గ్రామంలోకి ఓ నలుగురు కుర్రాళ్లు అడుగుపెడతారు. ఆ తర్వాత కుర్రాళ్లు తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. షఫీ పాత్ర కీలకంగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘తెలుగులో ఇలాంటి కథను ఇంత వరకు ఎవరూ చేయలేదు? మనం చేస్తే ఎలా ఉంటుందా? అని భయపడ్డాం. కానీ డైరెక్టర్ని నమ్మి రాజీ పడకుండా నిర్మించాం. టీమ్ అంతా కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. యాదవ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, దేవా, రాము తదితరులు నటించిన ఈ సినిమాకు కిషన్ ఛాయాగ్రాహకుడు. -
మాట రాని మౌన వేదన
ఆళ్లగడ్డ: ఇతడి పేరు షేక్ షఫీ. పాతమసీదు వీధిలో నివాసం ఉంటున్నాడు. అందరిలాగే అతడి జీవితంగా ఆనందంగా గడిచేది. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే రెండేళ్ల కిత్రం గొంతుకు క్యాన్సర్ సోకడంతో అతడి జీవితంలో పెనుమార్పులు వచ్చాయి. మాట్లాడటానికి మాటలు రావు. తినడానికి గొంతు సహకరించడం లేదు. దీంతో తన బాధను పేపర్‌పై రాసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పగవాడికి ఈ కష్టం వద్దు అంటూ అతడు తన బాధను వెళ్లబోసుకుంటున్నాడు. రెండేళ్లుగా నరకయాతన రెండేళ్ల క్రితం షఫీ గొంతుకు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే దాదాపు రూ.2.5 లక్షల దాకా ఖర్చు చేశాడు. వ్యాధి తీవ్రతకు మాటలు పడిపోయాయి. అలాగే తినేందుకు గొంతు సహకరించకపోవడంతో డాక్టర్లు ప్రత్యేక పైపు ద్వారా ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్నూలులోని ఓమెగా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇంటికి వచ్చాడు. మందులకు నెలకు రూ.25వేలు, కీమోథెరఫీకి నెలకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతోంది. రెక్కాడితే డొక్కాడని ఈ కుటుంబానికి వైద్య ఖర్చులు భారమయ్యాయి. ప్రస్తుతం షఫీ తల్లి కూలీనాలీ చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. సాయం చేయండయ్యా.. నేను కూలీపని చేసుకుని జీవనం సాగిస్తుండేవాడిని. రెండేళ్లక్రితం నాకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఎన్ని వైద్యశాలలు తిరిగినా ఫలితం లేదు. ప్రస్తుతం మందులు వాడుతున్నా. దాతలు సాయం చేస్తే తప్ప నాప్రాణాలు నిలబడవు. ఇంటి వద్ద వసతి సరిగ్గా లేకపోవడంతో శిరివెళ్ల మండలం యర్రగుంట్లలోని అత్తమామల ఇంట్లో ఉంటున్నా. – షఫీ అంధురాలితో ప్రేమపెళ్లి.. షఫీ జీవితంలో అందరిలాగే సరదాగా గడిచేది. కూలి పనులు చేసుకునే అతడికి ఫోన్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అమెకున్న వినికిడి లోపం, అంధత్వం ప్రేమ ముందు నిలవలేకపోయాయి. అతడి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. అలా ఎనిమిదేళ్ల క్రితం వారికి పెళ్లయింది. వారికి తీపి గుర్తులుగా సమీర్, అష్రఫ్, ఆయూస్ అనే ముగ్గురు పిల్లలు కలిగారు. ఇలా వారి సంసారం హాయిగా సాగిపోయేది. ఈ తరుణంలో క్యాన్సర్ మహమ్మారి వారి జీవితాలను కష్టాల్లోకి నెట్టింది. పేరు : షేక్ కపిజా (షఫీ తల్లి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆళ్లగడ్డ : IFSC Code : SBIN0014171 A/ C : 86736956084 PH : 7259957001 -
కల కాదు
శ్రీజ, మాధురీ దీక్షిత్, షఫీ, బిందు, గౌతమి ముఖ్యతారలుగా అదీబ్ నజీర్ దర్శకత్వంలో పరింద ఆర్ట్స్ పతాకంపై వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ఇది కల కాదు’. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అదీబ్ నజీర్ మాట్లాడుతూ– ‘‘మంచి కథ కుదిరింది. పదిమంది హీరోయిన్లతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. హైదరాబాద్ అండ్ తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణను పూర్తి చేశాం. వచ్చే నెల రెండో వారంలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ æపూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
అర్జున్‌రెడ్డికి మించి...
షఫీ, లక్కీ ఏకరీ, సాయికిరణ్, పూజశ్రీ, మేఘన, జ్యోతికయాదవ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని, నవనీత్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సాయి వెంకట్, షిరాజ్ మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో బాగా ఆడుతుందని నమ్ముతున్నాం. మార్చి 2న సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ, థియేటర్ల బంద్ కారణంగా రిలీజ్ చేయడం లేదు. మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమానా? అనుకోకండి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యనారాయణ. ‘‘మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సాయివెంకట్, ఆర్.కె. గౌడ్గార్లకు ధన్యవాదాలు’’ అని నిర్మాత రఘు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్.కె. గౌడ్ పాల్గొన్నారు. -
నందికొండ వాగుల్లోన...
‘గీతాంజలి’ చిత్రంలోని ‘నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లోన’ పాట ఎంత సూపర్‌హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడా పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘నందికొండ వాగుల్లోన’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. లక్కీ ఏకరీ, పూజశ్రీ జంటగా షఫీ, సాయికిరణ్ ముఖ్య తారలుగా సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయి వెంకట్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నా వద్ద పనిచేసిన యువకులు చేసిన తొలి సినిమా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా ‘చిత్రం’ నాకెంత పేరు తెచ్చి పెట్టిందో...‘ నంది కొండ వాగుల్లోన’ సినిమా ద్వారా వీరు అంతకన్నా ఎక్కువ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మా గురువు తేజగారు మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, మమల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు సత్యనారాయణ ఏకరీ. ‘‘ఈ నెల 25న పాటలు విడుదల చేసి, మార్చిలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత రఘు.హెచ్. లక్కీ ఏకరీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి. -
నందికొండ వాగుల్లోన...
సాయికిరణ్, షఫి, పూజశ్రీ, జ్యోతిక యాదవ్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు నిర్మించారు. భరత్‌సింహా రెడ్డి సమర్పకుడు. నందికొండ వాగుల్లోన ఏం జరిగింది? ఎవర్నైనా మర్డర్ చేశారా? లేదా ప్రేమికులు హాలీడే ట్రిప్‌కు వెళ్లారా? లేక అక్కడేమైనా మిస్టరీ దాగుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ‘‘సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. లవ్, సెంటిమెంట్, కామెడీలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీతాచారి. -
వరకట్న దాహానికి అబల బలి
= హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం = తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో నేరం అంగీకారం = భర్త, అత్తపై కేసు నమోదు పులివెందుల(వైఎస్సార్ జిల్లా): అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్ కథనం ప్రకారం... వైఎస్సార్ జిల్లా ఇస్లాంపురానికి చెందిన ఆరిఫుల్లా బాషా, రమీజ దంపతుల మొదటి కుమారుడు షఫీ వివాహం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలాపురానికి చెందిన మహబూబ్ బాషా, షబీమున్నీసా దంపతుల కుమార్తె షబానా(25)తో ఆరేళ్ల కిందట అయింది. పెళ్లి సమయంలో ఆరు తులాల బంగారం, రూ.50 వేల నగదు కట్నంగా ఇచ్చారు. షఫీ, షబానా దంపతులకు ఆదిల్(5), అఫ్జల్(5) సహా అనిష్, అఫ్రానా అనే కవల పిల్లలు ఉన్నారు. షఫీ బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల నుంచి షబానాను షఫీ సహా అత్త రమీజా అదనపు కట్నం కోసం వేధించేవారు. వారి వేధింపులు తాళలేక గతంలో ఒకసారి షబాన పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు సర్దిచెప్పి మళ్లీ అత్తగారింటికి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మళ్లీ భర్త, అత్త కలసి షబానాను అదనపు కట్నం ఎందుకు తీసుకురాలేదంటూ వేధించారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వారి వేధింపులు తాళలేక రమీజా ఫోన్లో బంధువులకు విషయం తెలిపింది. వారొచ్చి మాట్లాడతామని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, అత్త కలసి షబానాను తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. షబానా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు షఫీ ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు షబాన బంధువులకు ఫోన్‌చేసి ‘మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని’ తెలిపాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి షబానా మృతదేహాన్ని తీసుకెళ్లి ఉరేసుకుని వైద్యులకు చెప్పగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఆదివారం ఉదయమే పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లొచ్చారు. ఆ తరువాత ఆస్పత్రిలోని షబానా మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించాడు. -
విలేకరిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దాడి
► ఫోన్ ధ్వంసం..జైల్లో పెట్టిస్తానని బెదిరింపు ► ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ తన రౌడీయిజాన్ని మరోసారి ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి నగరానికి చెందిన ఓ విలేకరిపై భౌతికదాడికి దిగారు. వివరాల్లోకి వెళ్లితే.. తారాపేటలోని జలీల్‌ఖాన్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదు, గోరీలదొడ్డి (ముస్లిం శ్మశానవాటిక) చాలా భాగం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో గోరీలదొడ్డి కమిటీ, స్థానిక ముస్లిం ప్రముఖులు గోరీలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. తనకు చెప్పకుండా సమావేశం పెట్టుకోవడమేమిటని జలీల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడకు చేరుకున్నారు. అందరినీ బూతులు తిట్టడం ప్రారంభించారు. అటుగా వెళ్తున్న ప్రెస్‌క్లబ్ కోశాధికారి, కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ.. గమనించి లోపలకు వెళ్లారు. సెల్ఫోన్లో ఫొటోలు తీయసాగారు. దాంతో జలీల్‌ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి ‘ఎవడ్రా ఫోటోలు తీస్తోంది.. వాడిని కుమ్మండ్రా’ అంటూ తన అనుచరులను ఆదేశించారు. జలీల్‌ఖాన్ అనుచరులు షఫీపై దాడికి పాల్పడ్డారు. ఫోన్‌ను ధ్వంసం చేశారు. జలీల్‌ఖాన్‌తో షఫీ మాట్లాడబోగా.. ‘ఎక్కువ మాట్లాడకు.. జైలులో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’ అంటూ చిందులుతొక్కారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ షఫీపై జరిగిన దాడిని జిల్లా మైనార్టీ జర్నలిస్ట్ అసోషియేషన్ తీవ్రంగా ఖండించింది. -
కొద్ది గంటల్లోనే పెళ్లి...వరుడు అదృశ్యం
కొద్ది గంటల్లోనే వివాహ వేడుక జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....అడ్డగుట్టలోని వడ్డెర బస్తీలో నివసించే సఫీ(25) తుకారాంగేట్‌లోని రియోపాయింట్ హోటల్ సమీపంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అయితే, కొద్ది రోజుల క్రితం సఫీకి మౌలాలీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేందుకు సఫీ ముందుకు వచ్చాడు. మార్చి నెల 31వ తేదీ రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఏం జరిగిందో తెలియదు కాని గురువారం ఉదయం నుంచి పెళ్లి కొడుకు సఫీ కనిపించకుండా పోయాడు. మధ్యాహ్నం వరకు చూసినా అతడి జాడ తెలియలేదు. తెలిసిన వాళ్లందరినీ వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు శుక్రవారం తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించారు. -
కై పెక్కి..టవర్ పెకైక్కి.. !
మండల కేంద్రంలోని పలమనేరు రోడ్డులో మద్యం మత్తులో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. సుమారు 2 గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న నబీ కుమారుడు షఫీ(25) ఆటో డ్రైవర్. బుధవారం అతిగా మద్యం సేవించి సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. దూకేస్తానంటూ గట్టిగా కేకలు వేశాడు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ శ్రీనివాసులు, ఇన్చార్జి తహశీల్దార్ మునిరాజ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమకు తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని చెప్పినా అతను వినిపించుకోలేదు. చివర కు పోలీసులు టవర్ ఎక్కి అతన్ని సురక్షితంగా కిందకు తీసుకొచ్చి స్టేషను తీసుకెళ్లి విచారించారు. మద్యం మత్తులో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు వారు తెలిపారు. - చౌడేపల్లె -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరీంనగర్ (రామగుండం): బూడిద ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఆటోనగర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షఫీ(38) రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆరాతీశారు. ఇంకా వివారలు తెలియ రావాల్సి ఉంది. -
నా పాత్రను హిందీలో ఆయన చేస్తానన్నారు!
‘‘ఇలానే ఉండాలి.. ఇలాంటి పాత్రలే చేయాలి అని గిరి గీసుకుంటే ఆ క్షణం నుంచి బాధ మొదలవుతుంది. అందుకే, నేను ఏ పాత్ర అయినా చేయాలనుకుంటున్నాను. ఈ చిత్రంలో హీరోగా చేశాను కాబట్టి, తదుపరి కూడా అలానే చేయాలనుకోవడం లేదు’’ అని షఫీ అన్నారు. ఇటీవల విడుదలైన ‘శ్యామ్‌గోపాల్ వర్మ’లో ఆయన టైటిల్ రోల్ చేశారు. ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే, ఇందులో చేసిన పాత్ర మరో ఎత్తు అని అందరూ అంటున్నారని షఫీ అన్నారు. ఆయన మాట్లాడుతూ - ‘‘రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సాగే సినిమా ఇది. మౌత్ టాక్‌తో రోజు రోజుకీ వసూళ్ళు పెరుగుతున్నాయి. పూర్తి భిన్నమైన చిత్రం చేయాలనే నా ఆకాంక్షను నెరవేర్చిన చిత్రం ఇది. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ ‘ఇది రామ్‌గోపాల్‌వర్మ సినిమా కాదు.. శ్యామ్‌గోపాల్‌వర్మ’ అని స్పష్టంగా చెప్పారు. ఆయన్ను నమ్మి ఈ చిత్రం చేశాను. నా కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఇది. అందుకు నిదర్శనం సినిమా విడుదలైనప్పట్నుంచీ నాకొస్తున్న ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు. తెలుగులో నేను చేసిన పాత్రను ఈ చిత్రం హిందీ రీమేక్‌లో చేయడానికి మనోజ్ బాజ్‌పాయ్ అంగీకరించారని మా దర్శకుడు చెప్పారు. అది ఆనందించదగ్గ విషయం’’ అన్నారు. -
సెటైర్ ఎవరిపై అనేది సీక్రెట్
‘‘వివాదాల వల్ల సినిమాలు ఆడతాయనుకోవడం నిజంగా మూర్ఖత్వం. కాంట్రవర్సీ ప్రభావం సినిమా విడుదల రోజు తొలి ఆట వరకే. సినిమాలో విషయం లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు’’ అని దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ అన్నారు. షఫీ హీరోగా రాకేశ్ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో విజయకుమార్ రాజుతో కలిసి నిర్మించిన చిత్రం ‘ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాకేశ్ శ్రీనివాస్ విలేకరులతో ముచ్చటిస్తూ -‘‘సెటైరికల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. అయితే... అది ఎలాంటి సెటైర్, ఎవరిపై సంధించిన సెటైర్ అనేది విడుదల దాకా సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ సినిమా ఎవర్నీ దృష్టిలో పెట్టుకొని చేసింది కాదనీ ఆయన చెప్పారు. -
వర్మగా షఫీ ఒదిగిపోయాడు!
షఫీ కీలక పాత్రలో వి. విజయకుమార్ రాజు నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రవిశేషాలను దర్శకుడు తెలియజేస్తూ -‘‘రక్తపాతం, హింస ప్రధానాంశాలుగా చేసుకుని సినిమాలు రూపొందించే ఓ దర్శకుడు ఎలాంటి ఫలితం అనుభవించాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. శ్యామ్‌గోపాల్ వర్మ పాత్రలో షఫీ అద్భుతంగా ఒదిగిపోయాడు’’ అన్నారు. తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ చెప్పారు. ఈ చిత్రకథ సహజత్వానికి దగ్గరగా ఉంటుందని షఫీ అన్నారు. -
ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిం మూవీ స్టిల్స్
-
ఫలితం అనుభవించాల్సిందే!
రక్తపాత చిత్రాలు తీసే ఓ దర్శకుడు దానికి ఎలాంటి ఫలితాన్ని అనుభవించాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. షఫీ, జోయాఖాన్ ఇందులో ముఖ్యతారలు. రాకేష్ శ్రీనివాస్ దర్శకుడు. సమిష్టి క్రియేషన్స్ పతాకంపై విజయకుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సెటైరికల్ క్రైమ్ కామెడీ సినిమా ఇది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, జూలైలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. శికృష్ణ, జయప్రకాశ్‌రెడ్డి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, నిర్వహణ: సుబ్బారెడ్డి.