సెటైర్ ఎవరిపై అనేది సీక్రెట్
‘‘వివాదాల వల్ల సినిమాలు ఆడతాయనుకోవడం నిజంగా మూర్ఖత్వం. కాంట్రవర్సీ ప్రభావం సినిమా విడుదల రోజు తొలి ఆట వరకే. సినిమాలో విషయం లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు’’ అని దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ అన్నారు. షఫీ హీరోగా రాకేశ్ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో విజయకుమార్ రాజుతో కలిసి నిర్మించిన చిత్రం ‘ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాకేశ్ శ్రీనివాస్ విలేకరులతో ముచ్చటిస్తూ -‘‘సెటైరికల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. అయితే... అది ఎలాంటి సెటైర్, ఎవరిపై సంధించిన సెటైర్ అనేది విడుదల దాకా సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ సినిమా ఎవర్నీ దృష్టిలో పెట్టుకొని చేసింది కాదనీ ఆయన చెప్పారు.