‘విజయం కోసం ఎంతకైనా, ఎందాకైనా...’
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్‌కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్‌లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు.
ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు.
కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఇ.శ్రీధరన్‌పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment