అనుక్షణం ఉత్కంఠ | Poison Movie launch At Hyderabad | Sakshi
Sakshi News home page

అనుక్షణం ఉత్కంఠ

Oct 13 2020 12:26 AM | Updated on Oct 13 2020 12:31 AM

Poison Movie launch At Hyderabad - Sakshi

రమణ

ప్రముఖ నిర్మాత శోభారాణి తనయుడు రమణ హీరోగా షఫీ, సిమ్రాన్, సారిక, అర్చన, శివణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘పాయిజన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). సీఎల్‌ఎన్‌ మీడియా పతాకంపై రవిచంద్రన్‌ దర్శకత్వంలో కె.శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి చక్కని కథతో పాటు మంచి టెక్నికల్‌ టీమ్‌ కుదిరింది.

తప్పకుండా ఫీల్‌గుడ్‌ మూవీని అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. రవిచంద్రన్‌ మాట్లాడుతూ– ‘‘ఫ్యాషన్‌ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతోమంది నటీనటుల్ని ఆడిషన్‌ చేసి, ఎంచుకోవటం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కు హీరో రమణ పర్‌ఫెక్ట్‌ చాయిస్‌’’ అన్నారు. రమణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే కథ ఇది. నా బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నేహల్‌ డి.జె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement