
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో అతిధి పాత్రతో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ మెప్పించారు. ఆమె నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో, తాజాగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సిమ్రాన్ చెప్పిన ఒక విషయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో సిమ్రాన్ మరో నటి గురించి ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం నాతో పాటు పనిచేసిన ఒక నటికి నేను మెసేజ్ పంపాను. ఆమె నటించిన సినిమా గురించి చెబుతూ ఆ పాత్రలో మిమ్మల్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానన్నాను. ఆపై మీ పాత్ర చాలా బాగుందని కూడా చెప్పాను.
దానికి ఆమె నుంచి వెంటనే నాకు తిరిగి సమాధానం వచ్చింది. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇదే బెటర్ కదా అంటూ ఆమె నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది. నేను మంచి ఉద్దేశంతోనే మెసేజ్ చేశాను. కానీ, ఆమె నుంచి నేను అలాంటి సమాధానం ఎప్పుడూ ఊహించలేదు. నేను పంచుకున్నది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు నాకు అనిపించింది. అందుకే ఆమెకు ఇప్పుడు వేదిక మీదుగా సమాధానం చెబుతున్నాను. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ , అమ్మ పాత్రలలో నటించడం చాలా ఉత్తమం. దేనిని చులకనగా చూడకూడదు' అని సిమ్రాన్ చెప్పుకొచ్చారు. కానీ, ఆమె పెరు వెళ్లడించలేదు.
ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించా: సిమ్రాన్
2002లోనే తాను 'కన్నతిల్ ముత్తమిట్టల్' (అమృత) సినిమాలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించానని సిమ్రాన్ గుర్తుచేశారు. అప్పుడు తన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే అని ఆమె చెప్పారు. R. మాధవన్‌కు భార్యగా సిమ్రాన్ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.

లైలా గురించేనా..?
ఈ ఏడాదిలో విడుదలైన శబ్ధం సినిమాలో సిమ్రన్, లైలా ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో ఆది పినిశెట్టి హీరో. హారర్ ఎలిమెంట్‌గా వచ్చిన సినిమాలో డాక్టర్ డయానా పాత్రలో సిమ్రన్ నటించగా.. నాన్సీ డేనియల్‌గా కీలకమైన పాత్రలో లైలా నటించింది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. సిమ్రాన్ చేసిన కామెంట్లు లైలా గురించే అని కొందరు చెబుతున్నారు.
సిమ్రాన్‌కు సౌత్ ఇండియాలో భారీగానే అభిమానులు ఉన్నారు. 1990, 2000 దశకంలో ఆమె తిరుగులేని హీరోయిన్‌గా తమిళ, తెలుగు పరిశ్రమలో దుమ్మురేపింది. హీరోల కంటే సిమ్రానే ఫుల్ బిజీగా ఉండేది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ హీరోల సరసన నటించిన సిమ్రాన్.. కోలీవుడ్‌లో విజయ్, అజిత్, సూర్య, రజనీకాంత్, కమల్ వంటి స్టార్స్‌తో మెప్పించారు.
Laila ? #Sabdham
pic.twitter.com/P8QnoWOEgv— Christopher Kanagaraj (@Chrissuccess) April 20, 2025