బుల్లితెరవైపు అడుగులేస్తున్న సిమ్రాన్‌ | Actress Simran To Enter In Small Screen Serials | Sakshi

బుల్లితెరవైపు అడుగులేస్తున్న సిమ్రాన్‌

May 27 2024 9:54 AM | Updated on May 27 2024 1:36 PM

Actress Simran To Enter In Small Screen Serials

సీనియర్ స్టార్ హీరోయిన్  సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్‌లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో చిరంజీవి,రజనీకాంత్‌,కమల్‌ హాసస్‌, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా మెప్పించింది.

సుమారుగా 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పిన సిమ్రాన్‌ పలు తమిళ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అయితే, సుందరకాండ అనే తెలుగు సీరియల్‌లో 2009-2011 మధ్యకాలంలో ఆమె కనిపించింది. తాజాగా ఆమె మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నారట.  ఏదైనా రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా సిమ్రాన్‌ రాబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరికొందరైతే సిమ్రాన్‌ సీరియల్స్‌ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఇప్పటికే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయని తెలుపుతున్నారు.  సినిమాల విషయానికి వస్తే ధ్రువ నక్షత్రం,  అంధాగన్‌ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంధాగన్‌ హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, తమిళంలో సిమ్రన్‌, మలయాళంలో మమతామోహన్‌దాస్‌ పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement