simran
-
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
Mr. Idiot: మూవీ ట్రైలర్ లాంచ్
-
ఇకనైనా ఆపండి.. వెంటనే నాకు సారీ చెప్పండి: నటి సిమ్రాన్
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ హీరోల సరసన నటించిన హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం తమిళ సినిమాలకే మాత్రమే పరిమితమైపోయింది. కీలక పాత్రల్లో అడపాదడపా నటిస్తోంది. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఈమె షాకింగ్ పోస్ట్ పెట్టింది. తనపై రూమర్స్ పుట్టిస్తున్న వాళ్లపై మండిపడింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.సిమ్రాన్ ఏమంది?'వేరే వాళ్లు చెప్పిన విషయాలు నా ఫ్రెండ్స్ నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నా. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో చేశా. ఇప్పుడు నా లక్ష్యాలు వేరు. నా పరిమితులు నాకు తెలుసు. ఒకరు లేదా మరొకరితో ముడిపెడుతూ ఇన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నాను'(ఇదీ చదవండి: పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్)'నాకంటూ ఆత్మగౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత. కాబట్టి ఇకపైనా ఆపండి అని చెబుతున్నాను. ఈ ప్రచారాలని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అలానే క్లారిటీ తీసుకునే విషయమై నన్ను సంప్రదించలేదు. సరిగ్గా చెప్పాలంటే నన్ను అసలు పట్టించుకోలేదు. నా పేరు ఎప్పుడు పోగొట్టుకోలేదు. సరైన విషయం కోసమే నిలబడ్డాను. ఇండస్ట్రీ నుంచి అదే కోరుకుంటున్నా. నాపై తప్పుడు వార్తలు రాస్తున్న వాళ్లు వెంటనే క్షమాపణలు చెప్పాలి' అని నటి సిమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయ్ మూవీ రూమర్స్సిమ్రాన్ ఇలా కోప్పడటానికి విజయ్‌తో సినిమా చేయనుందనే రూమర్సే కారణం. విజయ్‌ని హీరోగా పెట్టి ఈమె నిర్మాత కొత్త సినిమా తీయాలనుకుంటోందని, కానీ ఇతడు మాత్రం నిర్మాణం వద్దని ఈమెకు చెప్పాడని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్పందిస్తూనే పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
Paris Paralympics 2024: గతంకంటే ఘనంగా...
పారిస్: కనీసం 25 పతకాలతో తిరిగి రావాలనే లక్ష్యంతో ‘పారిస్’ బయలుదేరిన భారత దివ్యాంగ క్రీడాకారులు లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు. పారాలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించింది. భారత్ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మెరిసిన నవ్‌దీప్... శనివారం భారత్‌కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితుల్లో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో భారత అథ్లెట్ నవ్‌దీప్ సింగ్ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్ అథ్లెట్ సాదెగ్ బీట్ సాయె జావెలిన్‌ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెగ్ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతాకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెగ్ సంకేతం ఇచ్చాడు. దాంతో అతనికి హెచ్చరికగా ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పతాకాన్ని ప్రదర్శించడంతో సాదెగ్‌కు రెండో ఎల్లో కార్డు చూపెట్టారు. దాంతో అతను డిస్క్వాలిఫై అయ్యాడు.సాదెగ్ ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్‌కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు. మరోవైపు మహిళల 200 మీటర్ల టి12 (దృష్టిలోపం) కేటగిరీలో సిమ్రన్ కాంస్యం సాధించింది. ఫైనల్లో సిమ్రన్ తన గైడ్ అభయ్ సింగ్‌తో కలిసి 24.75 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. -
నేనూ ఆ బాధితురాలినే.. జస్టిస్ హేమ కమిటీపై సిమ్రాన్
మలయాళ చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదక తర్వాత ఒక్కోక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారు. దీంతో అదే తరహా కమిటీని తమ పరిశ్రమలోనూ ఏర్పాటు చేయాలని ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలకు చెందిన సినీ నటీనటులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ రియాక్ట్ అయ్యారు.పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు ఏకరువు పెడుతున్నారు. దీనికి అంతం ఎప్పుడో అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా నటి సిమ్రాన్ కూడా తానూ వేధింపుల బాధితురాలినేనని పేర్కొన్నారు. ఈ ఉత్తరాది భామ కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించారు. యువత కలల రాణిగా వెలుగొందిన సిమ్రాన్ వివాహానంతరం నటనకు దూరం అయినా, తాజాగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలా ఈమె ఆ మధ్య పేట చిత్రంలో రజనీకాంత్ సరసన నటించి రీ ఎంట్రీకి మార్గం వేసుకున్నారు.తాజాగా ఒక భేటీలో సిమ్రాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు నటీమణుల వేధింపుల వ్యవహారం పెద్ద చర్చకే దారి తీస్తోందన్నారు. కాగా తానూ అలాంటి బాధితురాలినేనని చెప్పారు. ఒక యువతిపై లైంగిక వేధింపుల దాడి జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణమన్నారు. ఆ సంఘటన గురించి వెంటనే ఎలా చెప్పగలరు ? మన చుట్టూ ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందన్నారు. సహనం పాటించి ఆలోచించి ఆ తరువాతనే రియాక్ట్ అవ్వగలం అని, అందుకు సమయం తప్పనిసరిగా అవసరం అన్నారు. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నానని, అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు. -
శశికుమార్‌కు జంటగా సిమ్రాన్
నటుడు శశికుమార్కిప్పుడు మంచి టైమ్ నడుస్తోందనే చెప్పాలి. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో సతమతం అయిన ఈయన్ని విజయాల బాట పట్టించిన చిత్రం అయోధి. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడంతో పాటు, కమర్షియల్గానూ మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇటీవల గరుడన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించిన శశికుమార్‌కు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా మిలియన్ డాలర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రంలో శశికుమార్ హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇంతకు ముందు గుడ్‌నైట్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయం కానున్నారని తెలిసింది. అలాగే ఇందులో శశికుమార్‌కు జంటగా నటి సిమ్రాన్ నటించనున్నారని సమాచారం. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దీనితోపాటు శశికుమార్ మరో చిత్రంలోనూ నటించనున్నారని సమాచారం. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. కూక్కూ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అని రాజు మురుగన్ తొలి చిత్రంతోనే ప్రాంతీయ చిత్ర కేటగిరీలో జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత జోకర్, జిప్సీ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల నటుడు కార్తి హీరోగా జపాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం పూర్తిగా నిరాశపరచింది. దీంతో తాజాగా శశికుమార్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
మిస్ ఇండియా ‘యోగాసన్’
సాక్షి, హైదరాబాద్: మాజీ మిస్ ఇండియా, ప్రముఖ అంతర్జాతీయ యోగా ట్రైనర్ సిమ్రాన్ అహుజా సిటీలో సందడి చేశారు. రానున్న ప్రపంచ యోగా దినోత్సవ నేపథ్యంలో కొన్ని ప్రధాన యోగాసనాలు వేసి ఔత్సాహికులను అలరించారు. నగరంలోని కంట్రీ క్లబ్ వేదికగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను సిమ్రాన్ అహుజా, క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మంగళవారం నిర్వహించిన ప్రారం¿ోత్సవంలో ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే థీమ్‌తో పాటు కంట్రీ క్లబ్ వీఐపీ ప్లాటినం గ్లోబల్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిమ్రాన్ అహుజా మాట్లాడుతూ.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించిందని, ఇతర దేశాల వారు సైతం యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం గర్వకారణమని అన్నారు. దేశ ప్రాధాన్యతగా యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో ప్రధాని మోదీ కృషి ఎనలేనిదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ మంచి ఆరోగ్య ఫలితాలను పొందానని వై.రాజీవ్ రెడ్డి తెలిపారు. పటిష్ట ఆరి్థక వ్వవస్థతో పాటు యోగా వంటి విలువైన సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగిన అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని అన్నారు. కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి వినూత్న ఫిట్నెస్ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిస్తుందన్నారు. -
పుట్టుకతోనే దృష్టి లోపం.. అయినా గానీ వరల్డ్ ఛాంపియన్!
జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహిళల 200 మీటర్ల రన్నింగ్ విభాగంలో సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కేవలం 24.95 సెకన్లలోనే పరుగు పూర్తి చేసిన సిమ్రాన్.. భారత్‌కు ఆరో గోల్డ్‌మెడల్‌ను అందించింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు బంగారు పతకం సాధించడం సిమ్రాన్‌లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.ఇక ఛాంపియన్‌గా నిలిచిన సిమ్రాన్ వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. సిమ్రాన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఢిల్లీకి చెందిన సిమ్రాన్ కథ ఎంతో మందికి ఆదర్శం. ఈ నేపథ్యంలో అథ్లెట్‌గా సిమ్రాన్ జర్నీపై ఓ లుక్కేద్దాం.ఎన్నో కష్టాలు..సిమ్రాన్ పూర్తిగా నెలల నిండకుండానే(ప్రీ మ్యాచూర్ బేబీ) జన్మించింది. కేవలం ఆరున్నర నెలలకే ఈ ప్రపంచంలోకి సిమ్రాన్ అడుగుపెట్టింది. ఆమె పుట్టినప్పటి నుంచే దృష్టి లోపంతో బాధపడుతోంది.పుట్టిన తర్వాత ఆమె దాదాపు నెలలకు పైగా ఇంక్యుబేటర్‌లో గడిపింది. దృష్టి లోపం వల్ల ఆమెను ఇరుగుపొరుగు వారు హేళన చేసేవారు. కానీ వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించి హేళన చేసిన వారితోనే శెభాష్ అనుపించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు తన కలలు కన్నట్లు గానే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి అందరితోనూ శెభాష్ అనిపించుకుంది.సూపర్ లవ్ స్టోరీ.. భర్తే కోచ్ఇక సిమ్రాన్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడంలో తన భర్త గజేంద్ర సింగ్‌ది కీలక పాత్ర. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీ సినిమా స్టోరీని తలపిస్తోంది. గజేంద్ర సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే లక్నోలో సమీపంలోని ఖంజర్పూర్ గ్రామానికి చెందిన సింగ్.. తన కూడా అంతర్జాతీయ స్ధాయిలో అథ్లెట్‌గా రాణించాలని కలలు కన్నాడు. కానీ గజేంద్ర సింగ్ తన కలను నేరవేర్చుకోలేకపోయాడు.ఆర్ధికంగా స్థోమత లేని వారికి శిక్షణ ఇచ్చి వారి విజయాల్లో భాగం కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2015లో ఢిల్లీలోని ఎమ్ఎమ్ కాలేజీ గ్రౌండ్లో సిమ్రాన్‌తో సింగ్‌కు తొలిపరిచయం ఏర్పడింది. సిమ్రాన్‌కు గజేంద్ర సింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇద్దరూకాగా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమను గజేంద్ర సింగ్ కుటంబం అంగీకరించలేదు. కానీ గజేంద్ర సింగ్ తన ఫ్యామిలీని ఎదురించి 2017లో సిమ్రాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కుటంబాలకు దూరంగా ఉంటున్నారు.అతడితో సూచనతోనే..ఇక తన భార్యను ప్రపంచ స్ధాయి అథ్లెట్‌గా చూడాలని కలలు గన్న గజేంద్ర సింగ్.. వివాహం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పారా అథ్లెట్ నారాయణ్ ఠాకూర్‌తో గజేంద్ర సింగ్, సిమ్రాన్ సమావేశమయ్యారు. మహిళల పారా విభాగంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే 2019లో మహిళల T13 కేటగిరీకి సంబంధించిన లైసెన్స్‌ని పొందేందుకు శర్మ వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో పోటీ పడింది. అయితే లైసెన్స్ పొందేందుకు వారికి పెద్ద మొత్తాన డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిమ్రాన్ భర్త సింగ్ లోన్ తీసుకోవడంతో పాటు తన పేరిట ఉన్న స్ధలాన్ని విక్రయించాడు. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగే ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడానికి ముందు చైనాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో ఆమె స్వర్ణం గెలుచుకుంది. కానీ దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ 100 మీటర్ల T13 ఫైనల్లో ఆమె ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత షిమ్రాన్ తన కెరీర్లో ఉన్నో ఎత్తు పల్లాలను చవిచూస్తూ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. -
బుల్లితెరవైపు అడుగులేస్తున్న సిమ్రాన్
సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో చిరంజీవి,రజనీకాంత్,కమల్ హాసస్, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా మెప్పించింది.సుమారుగా 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పిన సిమ్రాన్ పలు తమిళ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అయితే, సుందరకాండ అనే తెలుగు సీరియల్లో 2009-2011 మధ్యకాలంలో ఆమె కనిపించింది. తాజాగా ఆమె మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నారట. ఏదైనా రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా సిమ్రాన్ రాబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.మరికొందరైతే సిమ్రాన్ సీరియల్స్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఇప్పటికే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయని తెలుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ధ్రువ నక్షత్రం, అంధాగన్ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంధాగన్ హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, తమిళంలో సిమ్రన్, మలయాళంలో మమతామోహన్‌దాస్ పోషించారు. -
Lok Sabha Election 2024: లోక్‌సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల మద్దతుదారులు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వారందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అకాలీదళ్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ మాన్, జైలులో ఉన్న ’వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా ఎనిమిది మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికలో సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రేరణగా మారింది. సిమ్రన్‌జీత్ ఈసారి కూడా సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి కుశాల్‌పాల్ సింగ్ మాన్, ఫరీద్కోట్ నుంచి బల్దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్‌పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనీందర్పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నాల్ నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి ఖాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. -
అజిత్‌కి జోడీగా...
కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్‌బాబు సినిమాలో...మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి ప్రధానపాత్రను పోషించిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో అజిత్ క్యామియో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయన 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఈ చిత్రం చాలా కీలకమైనది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. కాగా విడాముయర్చి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి 'మార్క్ ఆంటోని' చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లి అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీల నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో నటుడు అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. ఇందులో ఆయనకు జంటగా మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నటి 'సిమ్రాన్' కాగా మరొకరు 'మీనా' అని తెలిసింది. కాగా నటి సిమ్రాన్ ఇప్పటికే అజిత్‌తో కలిసి వాలి, అవళ్ వరువాళా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించగా, నటి మీనా సిటిజెన్, విలన్ చిత్రాల్లో అజిత్‌తో జత కట్టారు. దీంతో తాజాగా ఇద్దరూ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఆయన సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ నెలలో సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారికంగా త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
'శబ్దం' టీజర్ విడుదల.. మరో హిట్ ఖాయం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'శబ్దం'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే 'వైశాలి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి చాలా ఏళ్ల తర్వాత అరివళగన్ డైరెక్షన్లో 'శబ్దం' సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆది పినిశెట్టితో పాటు ఈ చిత్రంలో లక్ష్మీ మేనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా క్రేజీగా ఉన్న ఈ ట్రైలర్‌ను తాజాగా విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ చిత్రం ఆత్మల వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని టీజర్‌తో దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఆత్మల గురించి పరిశోధించే పాత్రలో ఆది కనిపించాడు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాంటెడ్ హౌస్‌లో అతీంద్రియ సంఘటనలు చుట్టూ టీజర్ నడిచింది. ముఖ్యంగా టీజర్లో థమన్ అందించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయాని చెప్పవచ్చు. ఇందులోని బీజీఎమ్ చాలా కొత్తగా థమన్ అందించాడు. ముంబై, మున్నార్, చెన్నై తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రూ.2కోట్ల బడ్జెట్‌తో 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించామని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పుడు అది టీజర్లో ప్రధాన హైలెట్‌గా నిలిచింది. టీజర్లో కెమెరామెన్ అరుణ్ బత్మనాభన్ ప్రతిభ మెరుగ్గానే ఉంది. ఈ సమ్మర్లోనే శబ్దం విడుదల కానుంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్‌కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న బృందా శివకుమార్‌కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్‌ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఆయన లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. సిమ్రాన్ భావోద్వేగం
హీరోయిన్ సిమ్రాన్ మేనేజర్ ఎమ్.కామరాజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. దాదాపు 25 ఏళ్లుగా హీరోయిన్ దగ్గర పని చేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిమ్రాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను, షాకింగ్‌గా ఉంది. నా ప్రియ మిత్రుడు ఎమ్. కామరాజన్ ఇక లేరు. ఆయన 25 ఏళ్లుగా నా కుడి భుజంగా ఉన్నారు. ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. చాలా చురుకైన వ్యక్తి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు, నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేకుండా నా సినీప్రయాణాన్ని ఊహించుకోలేను. ఎంతో మిస్ అవుతాం.. ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు మేనేజర్ కామరాజన్ ఫోటోను జత చేసింది. కాగా సిమ్రాన్ సనమ్ హర్జై అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో 15కు పైగా సినిమాలు చేసినప్పటికీ తమిళ, తెలుగు భాషల్లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్.. మా నాన్నకి పెళ్లి, కలిసుందాం రా, నరసింహ నాయుడు, నువ్వు వస్తావని, మృగరాజు, సమరసింహా రెడ్డి, సీతయ్య, డాడీ, ప్రేమతో రా.. ఇలా అనేక సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరైంది. ఆమె కొన్నేళ్ల క్రితం నటించిన ధ్రువ నక్షత్రం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే శబ్ధం, అంధగన్, వనంగముడి అనే తమిళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) చదవండి: తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం -
మంచి సినిమా తీశామంటున్నారు
‘‘అథర్వ’ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. మంచి సినిమా తీశామని ప్రేక్షకులు అంటున్నారు.. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్’’ అని హీరో కార్తీక్ రాజు అన్నారు. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మహేష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే క్లూస్ టీమ్ నేపథ్యంలో ‘అథర్వ’ తీశాను. ఇంత మంచి విజయాన్నిఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మా సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందనుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సుభాష్ నూతలపాటి. సిమ్రాన్ చౌదరి, నటీనటులు కల్పికా గణేష్, గగన్ విహారి, విజయ రామరాజు మాట్లాడారు. -
భయపెట్టే అన్వేషి
విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘అన్వేషి’. వీజే ఖన్నా దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నటులు అశ్విన్‌బాబు, సోహైల్, చైతన్యారావు, సంపూర్ణేశ్ బాబు అతిథులుగా హాజరై, ఈ చిత్రం విజయం సాధించాలన్నారు. ఈ వేడుకలో హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ– ‘‘హీరో కావాలని ఓ చిన్న పల్లెటూరు నుంచి మొదలైన నా ప్రయాణంలో అవమానాలు, బాధలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మూవీ నిర్మాణంలోనూ కష్టాలు పడ్డాం. కొంతమంది సపోర్ట్ చేయడంతో బయటపడ్డాం. ఈ సినిమా బాగాలేకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. వీజే ఖన్నా భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతారు’’ అన్నారు. ‘‘అనన్యా నాగళ్ల పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది’’ అన్నారు వీజే ఖన్నా. ‘‘ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు గణపతి రెడ్డి. ‘అన్వేషి’ చిత్రం మెప్పిస్తుంది’’ అన్నారు సిమ్రాన్ గుప్తా. -
సౌందర్యతో ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రిన్స్.. ఏ సినిమానో తెలుసా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో అలరించనుంది. అయితే రాజ కుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మహేశ్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. (ఇది చదవండి: హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు!) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగువారికి పరిచయం అక్తర్లేని పేరు. అప్పటి స్టార్ హీరోలందరితో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే సౌందర్యతో నటించే ఛాన్స్ మహేశ్ బాబు మిస్ అయినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మూవీలో మరో హీరోయిన్ నటించింది. రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత యువరాజు చిత్రంలో నటించారు. ఇందులో ప్రిన్స్ సరసన సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా కనిపించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా సిమ్రాన్ స్థానంలో డైరెక్టర్ సౌందర్యనే ఎంపిక చేశారు. అయితే సౌందర్య- మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాలేదట. ఎలా చూసిన మహేశ్‌కు అక్కలా కనిపిస్తున్నానని.. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి చెప్పిందట. (ఇది చదవండి: రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ అశ్వధామ’.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఈ పాత్రకు తనకంటే సిమ్రాన్ ఫర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సౌందర్య సూచించిదట. దీంతో డైరెక్టర్ సౌందర్యకు బదులుగా సిమ్రాన్‌ను ఎంపిక చేశారు. అలా సౌందర్య- మహేశ్ బాబు జోడిని వెండితెరపై చూసే ఛాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ కోల్పోయారు. లేదంటే మహేష్ బాబు - సౌందర్య జోడీని తెలుగువారు చూసే అవకాశం దక్కేది. కాగా.. సౌందర్య 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. యువరాజు సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని గుంతలక్కడి గుమ్మ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. -
ప్రేమ.. భావోద్వేగం
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, క్రైమ్ జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల భావోద్వేగాలతో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. క్లూస్ టీమ్ విశిష్టతను,ప్రాముఖ్యతను చూపించే కథనం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ఔట్పుట్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది.. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్స్: విజయ, ఝాన్సీ. -
అన్వేషి విజువల్స్ బాగున్నాయి
‘‘అన్వేషి’ ట్రైలర్, విజువల్స్ చాలా బాగున్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్వేషి’. టి.గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు రెండో వారంలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. గణపతి రెడ్డి పుట్టినరోజు(సోమవారం) సందర్భంగా ‘అన్వేషి’ మూవీ ట్రైలర్‌ను వరలక్ష్మి విడుదల చేశారు. టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘అన్వేషి’ నా తొలి చిత్రం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వీజే ఖన్నా, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సహ నిర్మాతలు హరీష్ రాజు, శివన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ మాట్లాడారు. -
ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్ సినిమా
నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన చిత్రం 'ధ్రువనక్షత్రం'. నటి రీతూవర్మ నాయకిగా నటించిన ఇందులో ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్థిబన్, రాధికా శరత్‌కుమార్, వంశీకృష్ణ, ప్రియదర్శిని ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభమై ఏడేళ్లు అయ్యింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నా విడుదల విషయంలో పలు ఆటంకాలలను ఎదుర్కొంటూ వచ్చింది. పలుమార్లు విడుదల తేదీని ప్రకటించినా ఎదురవుతున్న సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (ఇదీ చదవండి: రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!) 'ధ్రువనక్షత్రం' విడుదలలో జాప్యం కారణంగా ఇటీవల చిత్రం కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్ నటించిన సన్నివేశాలను తొలగించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఐశ్వర్య రాజేష్ గానీ, చిత్ర యూనిట్ గానీ స్పందించలేదు. అయితే హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా నవంబర్ 24న 'ధ్రువనక్షత్రం' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా దీపావళి రేస్‌లో నటుడు కార్తీ నటించిన జపాన్‌తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. విజయ్ నటించిన లియో చిత్రం అక్టోబర్ 19న తెరపైకి రానుంది. -
వేస్ట్ పేపర్‌తో వావ్ అనిపించే బొమ్మలు!!..చిత్తుకాగితానికి కొత్తరంగు
న్యూస్‌పేపర్ జీవితకాలం ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు పేపర్‌కున్న విలువ మరుసటి రోజుకు ఉండదు. ఏరోజుకు ఆరోజు కొత్తపేపర్ కావాల్సిందే. అందుకే నిన్నటి పేపర్ చిత్తుకాగితంగా మారిపోతుంది. ఇలా టన్నులకొద్దీ పేపర్ భూమిలో కలిసిపోవడం నచ్చని సిమ్రాన్.. కాగితాలతో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తోంది. వేస్ట్ పేపర్‌ను వావ్ అనేలా తీర్చిదిద్దుతోంది. ప్రయాగ్ రాజ్‌కు చెందిన ఇరవైఎనిమిదేళ్ల సిమ్రాన్ కేసర్వాణికి చిన్నప్పటి నుంచి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడమంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సాంప్రదాయ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తుండేది. ఫ్యాషన్ డిగ్రీ పూర్తయ్యాక, ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. తనతోటివారిలా కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టాలనుకోలేదు. తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్ తయారీనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా సృజనాత్మకంగా చేయాలని ఆలోచిస్తోన్న సిమ్రాన్‌కు.. చిన్నతనంలో చేసిన ‘టోఫీ బాక్స్’ గుర్తుకువచ్చింది. సిమ్రాన్ పుట్టినరోజుకి టోపీ బాక్స్‌లు తయారు చేసి పంచింది. ఆ బాక్స్‌లు చూసిన వారంతా సిమ్రాన్ ప్రతిభను చూసి తెగ మెచ్చుకున్నారు. దీంతో ‘పేపర్మఛే క్రాఫ్ట్స్’ తయారు చేయడం ప్రారంభించింది. పేపర్‌ను పేస్టుచేసి.. పురాతన కాలం నుంచి మఛే క్రాఫ్ట్స్‌కు మంచి గుర్తింపు ఉంది. పేపర్‌ను నానబెట్టి, తరువాత పేస్టులా నూరి వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. దీనినే పేపర్ మఛే క్రాఫ్ట్స్ అంటారు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవన్న భరోసాతో సిమ్రాన్ వీటిని ఎంచుకుంది. కస్టమర్ల దృష్టిని ఆకర్షించే విధంగా వివిధ ఆకారాల్లో ఈ క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టింది సిమ్రాన్. పేపర్ వెయిట్స్, ఫోల్డర్స్, చెరియాళ్ మాస్క్‌లు, ఆకర్షణీయమైన వివిధరకాల ఇంటి అలంకరణ వస్తువులను తయారు చేస్తోంది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా అందంగా తయారు చేసేందుకు స్థానిక కళాకారుల వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. అడ్డంకులు అధిగమించి... ‘‘పేపర్ మఛే క్రాఫ్ట్స్ తయారీ సర్టిఫైడ్ జాబ్ కాదు. దీనికి పెద్ద గుర్తింపు ఉండదు. నువ్వు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదువు’’ అని తల్లిదండ్రులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తనని తాను నిరూపించుకోవాలన్న కసితో క్రాఫ్ట్స్ తయారీని ప్రారంభించింది సిమ్రాన్. అయితే సాంప్రదాయ కళాకృతుల గురించి అవగాహన తక్కువ ఉండడం, మార్కెట్ కొత్త కావడంతో సిమ్రాన్‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి. తనకెదురయ్యే ప్రతి వాళ్ల నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ.. సోషల్ మీడియా స్కిల్స్‌తో తన ఉత్పత్తులకు మార్కెట్ చేస్తోంది. వివిధరకాల ఎగ్జిబిషన్లలో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను ప్రదర్శిస్తూ కస్టమర్లకు సరికొత్త అలంకరణ వస్తువులను పరిచయం చేస్తోంది. మద్దారీ మీటర్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మఛే క్రాఫ్ట్స్‌ను విక్రయిస్తోంది సిమ్రాన్. -
ఒక్క యాడ్‌తో ఫేమస్.. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ
ఎంతటి భారీ హీరో సినిమా అయినా సరే ముందుగా స్క్రీన్ మీద ఈ పాప కనిపించాల్సిందే. థియేటర్లో లైట్స్ ఆఫ్ కాగానే.. ‘ఈ నగరానికి ఏమైంది... ఓ వైపు పొగ... మరోవైపు నుసి... ఎవ్వరూ నోరుమెదపరేంటి...’ అంటూ ఒక యాడ్ వస్తుంది. ఇది సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత ఇంటర్వెల్ సమయంలో మరోసారి వచ్చే ఈ యాడ్ అందరికీ గుర్తే. (ఇదీ చదవండి: చిరంజీవి కుమారుడిగా 'రామ్ చరణ్' క్లోజ్ ఫ్రెండ్) అందులో నటించిన ఓ చిన్నపాపను ఎవరూ మర్చిపోలేరు. తండ్రి సిగరెట్ తాగుతుంటే... ఆ చిన్నారి అమాయికంగా చూసే చూపుల వల్ల సిగరెట్ పడేసి వస్తాడు అతను. ఈ యాడ్ చూసి ఎంత మంది సిగరెట్ తాగడం మానేశారో తెలీదు కానీ.. ఆ పాపకి మాత్రం చాలా పాపులారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయి పేరు సిమ్రాన్ నటేకర్. 1997లో ముంబైలో జన్మించింది. ఇండస్ట్రీలో టీనేజ్‌లోని అడుగుపెట్టిన ఈ చిన్నది. ఆ యాడ్ తర్వాత సుమారు 150కి పైగా పలు ప్రకటనలలో మెప్పించింది. తర్వాత చిన్నారి పెళ్లికూతురు సీరియల్లలో పూజ పాత్రతో అందరినీ మెప్పించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) ఆపై క్రిష్ 3 మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది. 2010లో రితీష్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన జానే కహాన్ సే ఆయీ హై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో సిమ్రాన్ నటేకర్ చిన్న చిన్న పాత్రలలో నటిస్తోంది ఈ ముంబై చిన్నది. దీంతో మంచి అవకాశాల కోసం తెలుగు సినిమాపై కన్నేసిందట. అందుకోసం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో పలు ఆడిషన్స్ కూడా ప్లాన్ చేసిందట. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు చాలా క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా జనాల మతులు పొగొట్టడం మొదలుపెట్టేసింది. View this post on Instagram A post shared by Simran Natekar (@simran.natekar) -
సినీ కెరీర్లో అరుదైన మైల్స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం... రెండు దశాబ్దాల్లో రెండోది రెండు దశాబ్దాల కెరీర్లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్‌పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. మహారాజా హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. లా స్టూడెంట్ దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్స్టోన్కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్‌గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సిమ్రాన్ శబ్దం సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్‌కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రేమకోసం... దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్‌బాబు ‘స్పైడర్’, సుధీర్‌బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. -
ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: నటి సిమ్రాన్
ఒకప్పుడు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా వెలిగిపోయిన నటి సిమ్రాన్. తమిళంలో కమలహాసన్ నుంచి అజిత్, విజయ్ అంటూ స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగులోనూ అగ్ర కథానాయకిగా రాణించింది. కాగా ఆమె కథానాయకిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించి అలరించింది. తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటించిన అన్నయ్య చిత్రంలో సౌందర్య కథానాయకిగా నటించగా సిమ్రాన్ ఓ సాంగ్‌లో నటించింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా తమిళంలో విజయ్ హీరోగా నటించిన యూత్ చిత్రంలోనూ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. అప్పట్లో ఆమె ఆ పాటలో నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇటీవల తన అభిమానంతో ఇన్ స్ట్రాగామ్ లో ముచ్చటించినప్పుడు యూత్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించడంపై స్పందించింది. ఆమె పేర్కొంటూ ఇది తన జీవితమని, నిర్ణయం కూడా తానే తీసుకోవాలన్నారు. అప్పట్లో విజయ్ హీరోగా నటించిన యూత్ చిత్రంలో సింగిల్ సాంగ్ నటించవద్దని చాలామంది చెప్పారు అంది. అయితే అలాంటి వారి మాటలను లెక్కచేయకుండా తాను ఆ పాటలో నటించానని వెల్లడించింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యిందని పేర్కొంది. కొందరు చెప్పినట్లుగా చిత్రంలో నటించకపోతే ఓ మంచి హిట్ చిత్రాన్ని కోల్పోయేదాన్ని అభిప్రాయపడింది. -
సిస్టర్ సూసైడ్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్
హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తాచాటింది. దక్షిణాది ఇండస్ట్రీలో సిమ్రాన్‌కు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే సిమ్రాన్‌కు ఒక చెల్లెలు ఉండేది. ఆమె కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ ఊహించని పరిణామాలతో హీరోయిన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తన చెల్లిని తలుచుకుంటూ సిమ్రాన్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. సిమ్రాన్ ట్వీట్లో రాస్తూ.. 'నా అందమైన సోదరి మోనాల్‌కు జ్ఞాపకార్థం. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు మిస్ యూ మోనాల్ సిస్టర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే గతంలో కోలీవుడ్‌కు చెందిన సుజిత్ అనే కొరియోగ్రాఫర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన మోనాల్ ఆ తర్వాత అతడు మోసం చేయడంతో సూసైడ్ చేసుకుందని కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా.. ఇంద్రధనుస్సు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావెల్. తెలుగులో 'ఇష్టం' చిత్రంతో అరంగేట్రం చేసింది. స్టార్ హీరోయిన్ చెల్లెలిగా ఎంట్రీ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ అందుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే కొన్ని సినిమాల తర్వాత ఊహించని విధంగా ఆమె సూసైడ్ చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 2002, ఏప్రిల్ 14న తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని మోనాల్ నావెల్ చనిపోయింది. తాజాగా చెల్లిని గుర్తు చేసుకుంటూ సిమ్రాన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten 😘 pic.twitter.com/4E78Ol6PZz — Simran (@SimranbaggaOffc) April 14, 2023 -
శపథంలో సిమ్రాన్
శపథం చిత్రంలో ప్రముఖ తారల పట్టిక పెరుగుతోంది. ఈరం చిత్ర కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం శపథం. 2009లో విడుదలైన చిత్రం ఈరం. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించారు. దర్శకుడు శంకర్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా 14 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం శపథం. అయితే ఈ చిత్రం ద్వారా దర్శకుడు అరివళగన్ నిర్మాతగా అవతారమెత్తారు. ఆయన తన ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థ 7జీ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో ఆది పినిశెట్టికి జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె నటిస్తున్న తమిళ చిత్రం శపథం. కాగా ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ తరహాలో రూపొందిస్తున్న విభిన్న కథా చిత్రం శపథం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇందులో లైలా ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో ప్రముఖ నటి సిమ్రాన్ శపథం చిత్రం నటించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించారు. ఇంతకుముందు సిమ్రాన్, లైలా పార్తేన్ రసిత్తేన్, పితామగన్ చిత్రాల్లో కలిసి నటించారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత శపథం చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించడంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు అరివళగన్ తెలిపారు. సిమ్రాన్ నటిస్తున్న 50వ తమిళ చిత్రం ఇది కావడం గమనార్హం. -
సిమ్రాన్ రికార్డును 22 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసిన శృతి హాసన్
-
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్‌లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్‌కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్‌గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్‌గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
3 వారాలకే ఓటీటీకి కెప్టెన్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ హీరో ఆర్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్’. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైంది. చదవంండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ విడుదలైన మూడు వారాలకే కెప్టెన్ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’లో కెప్టెన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్పించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించగా... సీనియర్ నటి సిమ్రాన్ మహిళా ఆర్మీ అధికారినిగా స్పెషల్ రోల్ పోషించింది. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. #Captain OTT RELEASE September 30 @ZEE5India pic.twitter.com/lnHBo9cSQZ — OTTGURU (@OTTGURU1) September 21, 2022 -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్‌లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్‌ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్‌కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్‌తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్‌కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్‌లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్‌తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్‌ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్‌లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఏలియన్‌తో హీరో ఆర్య పోరాటం.. ఆసక్తిగా ‘కెప్టెన్’ ట్రైలర్
తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం తాజాగా మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఏలియన్లతో చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తిగా మలిచారు. చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్ సీన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్, ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్ ఇచ్చే సూచనలు, గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. -
హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలి సూసైడ్‌కి కారణం అతడేనా?
హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్గా సత్తాచాటిన సిమ్రాన్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. అయితే సిమ్రాన్‌కు ఒక చెల్లెలు ఉందని, ఆమె కూడా హీరోయిన్గా నటించింది అన్న విషయం మీకు తెలుసా? ఇంద్రధనస్సు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావెల్ తెలుగులో ఇష్టం చిత్రంతో అరంగేట్రం అయ్యింది. చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? స్టార్ హీరోయిన్ చెల్లెలిగా ఎంట్రీ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ అందుకుంది.పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లోనూ మెరిసింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఫ్లాపులతో అపజయాలను చవిచూసింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సూసైడ్ చేసుకుంది. 2002, ఏప్రిల్ 14న తన ఫ్లాట్‌లోనే ఉరివేసుకుని చనిపోయింది.దీనికి కారణం ఓ డ్యాన్స్ మాస్టర్ అని అప్పట్లో ఇండస్ట్రీ అంతా కోడై కూసింది. కోలీవుడ్‌కు చెందిన సుజిత్ అనే కొరియోగ్రాఫర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన మోనాల్ ఆ తర్వాత అతడు మోసం చేయడంతో సూసైడ్ చేసుకుందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలిపోయింది. -
టోక్యో ఒలింపిక్స్.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది
తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేలా సిమ్రాన్ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం. ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్‌కి వెళుతోందని సిమ్రాన్ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల ట్రాక్ ఈవెంట్‌కు సిమ్రాన్ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్ శర్మ! ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్.ఎస్.) జూన్ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్’. ∙∙ సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్‌కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్.ఎస్.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్ చేశాడు! అదే గ్రౌండ్లో ఆమెను ఒలింపిక్స్‌కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు. అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్‌ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు. ∙∙ భర్త ఆమె వ్యక్తి గత కోచ్ అయితే, ఆంటోనియో బ్లోమ్ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్. కోచ్! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్ దుబాయ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. సిమ్రాన్ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్ చైనా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్‌లోనే జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్. టోక్యో ఒలింపిక్స్‌తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు. సిమ్రాన్ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు. -
హీరో కార్తి కోసం ఆ పాత్ర చేయడానికి సిద్ధమైన సిమ్రాన్
హీరోయిన్లు రూటు మార్చారు. ఒకప్పుడు గ్లామర్‌కే ప్రాధాన్యమిచ్చే హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో నటనకే తమ ఫస్ట్ ప్రియారిటీ అంటున్నారు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా పాత్ర నచ్చితేనే చేస్తాం అని తెగేసి చెబుతున్నారు. డీ గ్లామరస్ లుక్‌లోనూ కనిపించి నటనకే పెద్ద పీట వేస్తాం అంటున్నారు. మరోవైపు మొన్నటి వరకు స్టార్ హీరోయిన్లుగా నటించిన భామలు కాస్య వయసు పెరిగాక అక్క, వదిన, తల్లి, ప్రతినాయిక పాత్రలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఈ జాబితాలోకి నటి సిమ్రాన్ కూడా వచ్చి చేరారు. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో జత కట్టిన సిమ్రాన్ ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న వైవిధ్యమున్న పాత్రలనే ఎంచుకుంటుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటిస్తున్న “సర్దార్” అనే చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనుందనే ప్రచారం జరగుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సిమ్రాన్ పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. పిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. చదవండి : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం -
స్టార్ బాక్సర్‌కు కరోనా.. టోర్నీ నుంచి ఔట్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత మహిళా స్టార్ బాక్సర్ సిమ్రన్‌జిత్ (60 కేజీలు) ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సిమ్రన్ ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు పంపించడంలేదని భారత బాక్సింగ్ సమాఖ్య తెలిపింది. పురుషుల విభాగంలో కరోనా నుంచి కోలుకుంటున్న ఆశిష్ (75 కేజీలు) కూడా ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేది అనుమానంగా ఉంది. చదవండి: ZIM Vs PAK: రెచ్చిపోయిన హసన్ అలీ, పాక్ ఘనవిజయం -
కొత్త అవతారం
సిమ్రాన్ ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నారు. కథానాయికగా తన కెరీర్లో ఎన్నో సూపర్హిట్లు అందుకున్న సిమ్రాన్ ఇప్పుడు ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘అంధా ధున్’ తమిళ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్ క్యారెక్టర్ని సిమ్రాన్ చేయనున్నారు. ఈ సందర్భంగా సిమ్రాన్ మాట్లాడుతూ – ‘‘తబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నాను. ఈ బోల్డ్ క్యారెక్టర్‌ను ఎంత ఛాలెంజింగ్‌గా చేస్తానో చూడాలి. ఓ కొత్త అవతారంలో కనిపించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘అంధా ధున్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో నితిన్ చేస్తున్న విషయం తెలిసిందే. -
అనుక్షణం ఉత్కంఠ
ప్రముఖ నిర్మాత శోభారాణి తనయుడు రమణ హీరోగా షఫీ, సిమ్రాన్, సారిక, అర్చన, శివణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘పాయిజన్’ (వర్కింగ్ టైటిల్). సీఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె.శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి చక్కని కథతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. తప్పకుండా ఫీల్‌గుడ్ మూవీని అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతోమంది నటీనటుల్ని ఆడిషన్ చేసి, ఎంచుకోవటం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కు హీరో రమణ పర్ఫెక్ట్ చాయిస్’’ అన్నారు. రమణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కర్నీ ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే కథ ఇది. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నేహల్ డి.జె. -
ఆ చిన్నారే ఈ పెళ్లికూతురు
ముంబై పేలుళ్లు.. ఢిల్లీ పేలుళ్లు దిల్సుఖ్నగర్ పేలుళ్లు.. లుంబినీ పేలుళ్లు! ప్రతి పేలుడూ.. రక్తంతో ఒక డేట్ రాసి పోతుంది.రేపు జూన్ 25 న సిమ్రాన్ పెళ్లి.పసుపు రాసిన ఈ డేట్‌ను కూడామనం గుర్తుంచుకోవాలి.పన్నెండేళ్ల క్రితం ఢిల్లీ పేలుళ్లలో.. తండ్రిని కోల్పోయిన చిన్నారే సిమ్రాన్! జీవితంలోని మంచి విషయాలు మంచి మనుషుల్ని చూసీ చూడనట్లు తప్పుకుని పోవు. సిమ్రాన్ జీవితంలో ఇప్పుడొక మంచి విషయం జరుగుతోంది. రేపు 25న ఆమె వివాహం. వరుడిది పంజాబ్. కండిషన్ పెట్టి మరీ సిమ్రాన్ పెళ్లి చేసుకుంటోంది. పెళ్లయ్యాక కూడా తను చదవాలి. అదీ కండిషన్. పద్దెనిమిదేళ్లు సిమ్రాన్‌కి. అంతా తనకు ఇష్టమైనట్లే జరిపించుకుంటోంది. మారుతండ్రి చెయ్యి పట్టుకుని వెళ్లి, పెళ్లి బట్టల షాపింగ్ చేసుకొచ్చింది. నచ్చిన దుస్తులు, నచ్చిన ఆభరణాలు కొనిపించుకుంది. పెళ్లితేదీని కూడా తనే ఫిక్స్ చేయించుకుంది. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి సిమ్రాన్‌కి. వాటికి అడ్డుపడకుండా ముహూర్తం తనే పెట్టించుకుంది. ఇక పెళ్లికి సంప్రదాయంగా ధరించవలసిన ఎరుపు రంగు ‘వెడ్డింగ్ డ్రెస్’ని పక్కన పెట్టి, లేత గులాబీ రంగును ఎంపిక చేసుకుంది. ఎరుపు సిమ్రాన్‌కు ఇష్టం లేదు! ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో తండ్రి అశోక్ మరణించిన రోజు తొలిసారి ఆమె ఎరుపు రంగును దగ్గరగా చూసింది. ఆయన ఒంటి మీదంతా ఎరుపే. భయపడి దూరంగా జరిగింది. హరిశ్చంద్ తాతయ్య ఒంటి మీద ఎరుపు. సరోజ ఆంటీ ఒంటి మీద ఎరుపు. యశోద ఆంటీ ఒంటి మీద ఎరుపు. వాళ్లతోపాటు ఆ రోజు మరో ఏడుగురు కుటుంబ సభ్యులు పేలుళ్లకు తునకలైపోయారు. తల్లి కమలేశ్వతిని రెండు రోజుల వరకు సిమ్రాన్‌ని చూడనివ్వలేదు ఆమె బంధువులు. కోలుకున్నాక, కట్లు కట్టాక, ఇంటికి తెచ్చాక మాత్రమే సిమ్రాన్‌ని అమ్మ మీదకు వదిలి పెట్టారు. తండ్రి చితిమంటల్ని చూసినరోజు.. ఆ రోజంతా సిమ్రాన్ తన తల్లిని గట్టిగా పట్టుకుని వదిలిపెట్టలేదు. అప్పటికి సిమ్రాన్ తల్లి వయసు 27. ఆమెను ఆమె తల్లి (సిమ్రాన్ అమ్మమ్మ) చాలారోజుల వరకు ఒడిసి పట్టుకునే ఉంది. చిన్న చప్పుడైతే సిమ్రాన్, కమలేశ్వతి ఎవరి తల్లుల ఒళ్లోకి వారు వచ్చేస్తున్నారు! కనికరం లేని ఆనాటి రోజు ఏళ్లపాటు వారిని కలవర పెడుతూనే ఉంది. 2008 సెప్టెంబర్ 13 శనివారం సాయంత్రం ఢిల్లీలో 6 గం. 7 ని.లకు మొదలైన వరుస పేలుళ్లు అరగంట వ్యవధిలో నాలుగు చోట్ల రక్తపాతం సృష్టించాయి. మొదట సిమ్రాన్ వాళ్లున్న జాఫర్ మార్కెట్ ప్రాంతంలోనే పేలుడు సంభవించింది. ఆటో రిక్షాలోని సిలిండర్ బాంబు పేలి సిమ్రాన్ తండ్రితోపాటు పదకొండు మంది చనిపోయారు. తండ్రి చితివైపు చూస్తూ తల్లిలో ఒదిగిపోతున్న సిమ్రాన్ (2008) సిమ్రాన్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సోమవారం ‘హల్దీ సెర్మనీ’లో పసుపు బట్టల్లో, పసుపు రాసిన ముఖంతో సంతోషంగా ఉంది. తండ్రి చనిపోయిన నాటి నుంచీ.. టెన్త్ పాస్ అయినప్పుడు తప్ప.. ఈ పన్నెండేళ్లలో ఏరోజూ ఇంత ఆనందంగా లేరు సిమ్రాన్, ఆమె తల్లి. కూతుర్ని మెడిసిన్ చదివించాలని అశోక్ కోరిక. ఆయన కోసం ప్రతి క్లాసునూ మెడిసిన్ చదివినట్లే చదివింది సిమ్రాన్. కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మాత్రం కమలేశ్వతి తట్టుకోలేక వేరే గదిలోకి వచ్చి ఏడ్చేసింది. కూతురే వెళ్లి ఆమె కన్నీళ్లు తుడిచింది. ఎంత లేదన్నా రేపు పెళ్లిరోజు ఆ తల్లిని ఇంకాస్త జాగ్రత్తగా పట్టుకోవలసిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం పెళ్లికొచ్చిన అతిథులు ఇంట్లో ఉన్నారు. వాళ్లెవరూ ఆనాటి క్రూరమైన రోజును మాటల్లోకి రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ‘‘సిమ్రాన్.. అన్నీ కొనుక్కున్నావా?’’ అని పెళ్లి కూతుర్ని అడుగుతున్నారు. ‘‘నాన్న నా పెళ్లికి అన్నీ అమర్చారు’’ అని చెబుతోంది సిమ్రాన్. నాన్నంటే మారు తండ్రి. హీరాలాల్ ఆయన పేరు. సిమ్రాన్‌కు పదకొండేళ్ల వయసులో బంధువులంతా ఒత్తిడి తెచ్చి కమలేశ్వతికి మళ్లీ పెళ్లి చేశారు. సిమ్రాన్ ఏడేళ్ల తమ్ముడు ఆయన కొడుకే. వివాహ వేడుకలో పెళ్లి కూతురుగా సిమ్రాన్ (మొన్న సోమవారం) సిమ్రాన్ మాటలు భలే ఉంటాయి. జీవిత సత్యాలను నోటి మాటగా చెప్పేస్తుంటుంది. ‘‘జీవితంలోని మంచి విషయాలు మంచి మనుషులను చూసీ చూడనట్లు తప్పుకుని పోవు’’ అనే మాట సిమ్రాన్దే. ఇంకొక మాట కూడా అంటుంది తను.. ‘‘జీవితం మన నుంచి ఒకటి తీసుకున్నప్పుడు, ఇంకొటి ఇస్తుంది’’ అని. జీవితం ఆమె నుంచి తీసుకున్న ఆ ఒకటి ఆమె తండ్రి అశోక్. జీవితం ఆమెకు ఇచ్చిన ఆ ఇంకొకటి ఆమె మారుతండ్రి హీరాలాల్. -
ఓ మై గాడు.. బొంభాట్ పోరడు..
'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్సుగా నటించిన చిత్రం "బొంభాట్". సైన్స్ ఫిక్షనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది నవంబర్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి స్వామి నాథ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. "బుద్ధిగా కలగన్నా.. బుజ్జిగా ఎదపైనా.. సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిగా.." అంటూ ప్రియురాలి కోసం హీరో పాట పాడుతుంటే "ఓ మై గాడు.. బొంభాట్ పోరడు.. అంటూ ప్రేయసి కూడా రాగమెత్తుకుంది. (సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క) క్లాసికల్, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిని ఆలపించారు. జోష్.బి సంగీతం సమకూర్చాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బొంభాట్' సినిమాను గతేడాది చివర్లో విడుదల చేయాలనుకున్నప్పటికీ పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఇంతలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దీని విడుదల మరింత ఆలస్యం కానుంది. (నా బర్త్‌డే కేక్ నేనే తయారు చేసుకున్నా) -
నాలుగేళ్లకు మళ్లీ!
నాలుగేళ్లు కావొస్తోంది నటి గౌతమి తమిళ స్క్రీన్‌పై కనిపించి. 2015లో వచ్చిన ‘పాపనాశం’ సినిమాలో చివరిసారి కనిపించారు గౌతమి. ఈ మధ్యకాలంలో తెలుగులో ‘మనమంతా’, మలయాళంలో ‘ఈ’ అనే సినిమాల్లో కనిపించారామె. నాలుగేళ్ల బ్రేక్ తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీరించారట గౌతమి. హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పరివాలన్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ‘తుప్పరివాలన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆశ్య కథానాయిక. ఈ సినిమాలో గౌతమి కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అవుతారు గౌతమి. ‘తు ప్పరివాలన్’ ఫస్ట్ పార్ట్‌లో సిమ్రాన్ అతిథి పాత్రలో కనిపించారు. బహుశా ఇప్పుడు గౌతమి అతిథి అయ్యుండొచ్చు. -
సైంటిఫిక్ బొంబాట్
‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్, సిమ్రాన్, చాందినిలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘బొంబాట్’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్ హన్నూర్కర్ నిర్మించారు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాఘవేంద్రవర్మ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘యంగ్ బ్లడ్ కలిసి చేసిన ‘బొంబాట్’ ఫస్ట్ లుక్ బావుంది. ఈ చిత్ర సంగీత సారథి జోష్. బి నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా విజయం సాధించి కలెక్షన్స్‌లో బొంబాట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
షుగర్ కోసం సాహసాలు!
హీరోయిన్లు త్రిష, సిమ్రాన్ అద్భుతమైన సాహసాలు చేస్తున్నారు. వెండితెరపై వారి సాహసాన్ని ఆడియన్స్ ఆస్వాదించడానికి చాలా సమయం ఉంది. సిమ్రాన్, త్రిష ప్రధాన పాత్రధారులుగా సుమంత్ రాధాకృష్ణన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సిమ్రాన్, త్రిషలపై కొన్ని సాహసోపేతమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ అడ్వంచరస్ మూవీకి ‘షుగర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఇందులో సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్ల పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది విడుదలైన రజనీకాంత్ ‘పేట’ చిత్రం తర్వాత సిమ్రాన్, త్రిష కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే. -
ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!
మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ను మ్యాడీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా..‘ ఎడిటింగ్ చాలా సరదాగా సాగపోతుంది. ఎంజాయ్ చేస్తున్నా. అదే సమయంలో ఎంతో భయపడుతున్నా. నేటితో ఈ ప్రయాణం ముగిసింది. నిజంగా వృద్ధుడిని అయిపోతున్నా అంటూ తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న మాధవన్ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని.. ‘నాకిప్పుడు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పేం లేదు కదా’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇందుకు స్పందించిన మ్యాడీ.. ‘ఆ దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. నాకంటే ఎంతో విలువైన వ్యక్తిని భాగస్వామిగా పొందుతావు’ అంటూ ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. కాగా మాధవన్ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు అందగాడు మాత్రమే కాదు. మనసున్న వారు. మీ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్ ఈ సినిమాలో మరోసారి జంటగా కనిపించనున్నారు. వీరితో పాటు హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ రాకెట్రీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram Editing is so much fun and exhausting:. Enjoying and fearing it..End of long travel day. Definitely getting older .. 🤣🤣🚀🚀🙏🙏#rocketrythefilm #actormaddy #Rocketryfilm A post shared by R. Madhavan (@actormaddy) on Jul 23, 2019 at 11:08am PDT -
షుగర్‌లో త్రిష, సిమ్రాన్..!
సినిమా: అందమైన భామలు నటించే చిత్రానికి తీయనైన పేరు పెడితే మరింత బలం చేకూరుతుంది. అలాంటి టైటిల్ త్రిష, సిమ్రాన్ నటించే తాజా చిత్రానికి నిర్ణయించినట్లు సమాచారం. 20 ఏళ్ల క్రితం అంటే 1999లో నటి సిమ్రాన్ నటించిన చిత్రం జోడీ. అందులో మరో అందగత్తె త్రిష ఎంట్రీ ఇచ్చింది. సిమ్రాన్‌కు స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించి మాయం అయింది. ఆ తరువాత త్రిష హీరోయిన్గా పేరుతెచ్చుకుంది. నటి సిమ్రాన్ పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయి నటనకు దూరం అయింది. కొంత కాలం తరువాత రీఎట్రీ ఇచ్చింది. త్రిష టాప్ హీరోయిన్గా రాణిస్తూనే ఉంది. అలాంటిది గత ఏడాది నటుడు రజనీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రంలో త్రిష, సిమ్రాన్ ఇద్దరూ నటించారు. అయితే అందులో ఇద్దరూ కలిసి నటించే సన్నివేశాలు చోటు చేసుకోలేదు. కాగా తాజాగా త్రిష, సిమ్రాన్ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించడం విశేషం. దీనికి సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం విహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు చదురం 2 అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఇతర ప్రాత్రల్లో అభినయ్ వడ్డి , తెలుగు నటుడు జగపతిబాబు, సతీశ్ తదితరులు నటిస్తున్నారు. దీన్ని ఆల్ఇన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇటీవల నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన గూర్కా చిత్రాన్ని విడుదల చేసింది. కాగా షూటింగ్ దశలో ఉన్న త్రిష, సిమ్రాన్ చిత్రానికి షుగర్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా చిత్ర టైటిల్ షుగర్ అయినా చిత్రం కథ మాత్రం మంచి కమర్శియల్ ఫార్యులాలో ఉంటుందట. ఇది యాక్షన్ ఎడ్వెంచర్ సన్నివేశాలతో కూడిన చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపాయి. త్రిష, సిమ్రాన్ సాహసాలతో కూడిన యాక్షన్ సన్నివేశాలను చూడడానికి రెడీగా ఉండవచ్చన్నమాట. -
స్పేస్ జర్నీ ముగిసింది
‘రాకెట్రీ’లో మాధవన్ అంతరిక్ష ప్రయాణం సెర్బియాలో ముగిసింది. మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో మాధవన్, సిమ్రాన్ నటించారు. ‘‘రాకెట్రీ సినిమా ముగిసింది. నా జీవితంలోనే అత్యద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నా హృదయం ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయింది’’ అన్నారు మాధవన్. ఇందులో హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ కీలక పాత్రలు చేశారు. -
‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’
నటి సిమ్రాన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న విషయాన్ని హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ రాకెట్రీకి సంబంధించిన విశేషాల్లో భాగంగా సిమ్రాన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ పదిహేనేళ్ల తర్వాత తిరు, ఇందిర శ్రీమతి, శ్రీ నంబి నారాయణన్‌గా’ అంటూ రాకెట్రీ మూవీలో సిమ్రన్ క్యారెక్టర్‌ను రివీల్ చేశాడు. ఈ క్రమంలో.. ‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా బుల్లితెర ద్వారా గుర్తింపు పొందిన ఉత్తరాది భామ సిమ్రాన్.. తర్వాతికాలంలో బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అయితే కొంతకాలంగా టీవీ షోలతో బిజీగా ఉన్న సిమ్రన్.. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్ పేట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో బాలచందర్ పార్థలే పరవశం, మణిరత్నం కన్నాతిల్ ముథమిట్టల్ సినిమాల్లో మాధవన్‌కు జంటగా నటించిన ఆమె.. తాజాగా సైంటిస్ట్ బయోపిక్‌లో మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో సిమ్రన్ కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్ కూడా దర్శకుడిగా పని చేయాలనుకున్నారు. అయితే మహదేవన్ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. View this post on Instagram 15 years later . Thiru and Indira turn into Mr. & Mrs. Nambi Narayanan. 🙏🙏🚀🚀#rocketryfilm @actormaddy #actormaddy #rocketrythenambieffect #15yearslater @SimranbaggaOffc @vijaymoolantalkies @simranrishibagga A post shared by R. Madhavan (@actormaddy) on Jun 14, 2019 at 10:34pm PDT -
మొబైలే నా ప్రపంచం అంటున్న హీరోయిన్ సిమ్రన్
-
అక్కాచెల్లెళ్ల సాహసం
సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్లు. అవునా? అని ఆశ్చర్యపడుతున్నారా! నిజంగా కాదు.. ఓ సినిమాలో ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారు. సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను ముందు సిమ్రాన్‌కు చెప్పాను. నచ్చడంతో ఆమె అంగీకరించారు. ఆ తర్వాత త్రిషకు చెబితే, ఆమె కూడా ఎగై్జట్ అయ్యారు. ఇది అడ్వంచరస్ మూవీ. ముఖ్యంగా నీటిలోపల చేసే స్పెషల్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఇందుకోసం విదేశీ నిపుణులతో సిమ్రాన్, త్రిష ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. ఈ సాహసం చేయడానికి ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారు. మార్చి మొదటివారంలో చిత్రీకరణను మొదలు పెట్టనున్నాం. కొడైకెనాల్, కేరళ, పిచ్చావరమ్ దేశీ లొకేషన్లతో పాటు థాయ్‌ల్యాండ్‌లో కూడా షూటింగ్ చేయాలనుకుంటున్నాం’’ అని సుమంత్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష కలిసి నటించారు. కానీ వీరి కాంబినేషన్లో ఒక్క సీన్ కూడా లేదు. అలాగే 1999లో ప్రశాంత్ హీరోగా వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో త్రిష చాలా చిన్న గెస్ట్ రోల్ చేశారు. తాజా సినిమాలో ఇద్దరూ ముఖ్య తారలు కాబట్టి కాంబినేషన్ సీన్స్ చాలా ఉంటాయి. ఇద్దరూ మంచి ఆర్టిస్టులే. పోటీపోటీగా నటిస్తారని ఊహించవచ్చు. -
ఇరవై ఏళ్ల తరువాత ఇలా..
తమిళసినిమా: ఎవరైనా కాలం చూపిన దారిలో నడవాల్సిందే. ఆ దారులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో? ఎప్పుడు విడిపోతారో? తెలియదని ఒక కవి అన్నట్టు మనిషి జీవితంలో ఎన్నో మజిలీలు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకుంటే రెండు దశాబ్దాల క్రితం నటి సిమ్రాన్, త్రిష కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ చిత్రం జోడి. అందులో నటి సిమ్రాన్ కథానాయకి. త్రిష ఆమె స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపిస్తుంది. అలా సిమ్రాన్ ఒక శకం వెలిగింది. నటి త్రిష అలా నాలుగేళ్లు పోరాడి హీరోయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 16 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తూనే ఉంది. నటి సిమ్రాన్ కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అలా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న సిమ్రాన్ రీ ఎంట్రీ అయ్యి అక్క, వదిన వంటి పాత్రలు కొన్ని చేసినా అవి అంతగా క్లిక్ అవ్వలేదు. ఇటీవల రజనీకాంత్‌తో పేట చిత్రంలో నటించింది. ఇదే చిత్రంలో నటి త్రిష కూడా నటించడం విశేషం. అలా 20 ఏళ్ల తరువాత సిమ్రాన్, త్రిష ఒకే చిత్రంలో నటించారు. ఇందులో ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు ఉండవు. అంతే కాదు. ఇద్దరి పాత్రలు రెండు మూడు సన్నివేశాలకే పరిమితం. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రౌఢ అందగత్తెలిద్దరూ కలిసి మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఇది మంచి సాహసాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. నవ దర్శకుడు సనత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
సోలో డైరెక్టర్‌గా..
నంబీ నారాయణ్ బయోపిక్కు అనంత్ మహాదేవన్‌తో పాటు ఓ దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మాధవన్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా వ్యవహరించి సినిమాను పూర్తి చేస్తారట. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’. ‘‘అనంత్ అద్భుతమైన ఫిల్మ్ మేకర్. కొన్ని అనివార్య కారణలతో దర్శకుడు అనంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయనున్నాను’’ అని పేర్కొన్నారు మాధవన్. ఈ సినిమాలో మాధవన్ సరసన సిమ్రాన్ హీరోయిన్గా కనిపించనున్నారు. సమ్మర్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
సైంటిస్ట్‌తో జోడీ
సినిమాల ఎంపికలో కథానాయిక సిమ్రాన్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది ‘సీమరాజా’ అనే తమిళ సినిమాలో విలన్‌గా నటించారామె. ఈ ఏడాది రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో ఒక కథానాయికగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమె మాధవన్ సరసన నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. అనంత్ మహాదేవన్, ఆర్. మాధవన్ దర్శకులు. ఈ సినిమాలో సిమ్రాన్ కథానాయికగా నటించబోతున్నారని తాజా కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. -
మీకంటే మేమే గ్రేట్!
సినిమా: పురుషులు ఆ విషయాన్ని గ్రహించాలి అంటోంది నటి సిమ్రాన్. ఈ పేరు విని చాలా కాలమైంది కదూ. అవును మరి ఈమె తమిళ సినిమాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. 1990 ప్రాంతంలో కోలీవుడ్, టాలీవుడ్ అంటూ తారతమ్యం చూపకుండా కథానాయకిగా దున్నేసిన నటి సిమ్రాన్. ఆ తరువాత తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి పరిమితమైంది. అయితే కోడిట్ట ఇడంగళ్ నిరంబుగా వంటి ఒకటి రెండు చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో కనిపించినా, ఆ తరువాత మళ్లీ సినిమాకు దూరమైంది. అలాంటిది పేట చిత్రంలో రజనీకాంత్‌తో నటించింది. ఇందులోనూ పాత్ర పరిధి చాలా తక్కువే అయినా, అందంగా కనిపించింది. పేట చిత్రం తనకు మంచి రీఎంట్రీ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నటి సిమ్రాన్ ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చింది. అందులో కాస్త మగవారిపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది కూడా. ఇంతకీ ఈ భామ ఏం అందో చూద్దాం. 90 ప్రాంతంలో నటిగా నేను చాలా బిజీ. ఎంత బిజీ అంటే పూర్తిగా సినిమాల్లోనే మునిగితేలాను. ఆ సమయంలో బయట ప్రప్రంచం గురించి గానీ, కుటుంబ గురించి గానీ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. ఆ సమయంలో నేను చాలా విషయాలను కోల్పోయాను. అయితే ఇప్పుడలా కాదు. పండగలు వస్తే అందుకు సమయాన్ని కేటాయిస్తున్నాను. అదే విధంగా పిల్లలు, కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడంపై శ్రద్ధ చూపుతున్నాను. నేనిప్పుడు సంతోషంగా ఉండటానికి కారణం ఇదే. కాగా మగవారు జయిస్తున్నారంటే అందుకు వారి వెనుక స్త్రీలు ఉంటున్నారు. ఈ విషయాన్ని వారు గ్రహించాలి. స్త్రీలు అన్ని విషయాల్లోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కదిద్దడంతోనే మగవారు జయించగలుగుతున్నారు. అందుకే నేనంటా మగవారి కంటే ఆడవారే ఉన్నతమైనవారు అని పేర్కొంది. అయినా సిమ్రాన్ సడన్‌గా పురుష పుంగవులపై దాడి చేయడానికి నేపథ్యం ఏముంటుందనే ఆరాలు తీసే పనిలో సినీ వర్గాలు బిజీ అయిపోతున్నాయి. -
ఖుషీ ఖుషీగా..
సినిమా: అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం ఇదే జీవితం. అదృష్టం చెప్పిరాదు. దురదృష్టం చెప్పిపోదు. అలా ఎన్నో ఏళ్లుగా సూపర్‌స్టార్‌తో ఒక్క సన్నివేశంలోనైనా నటించే అవకాశం కోసం నటి త్రిష జపం చేసిందనే చెప్పవచ్చు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటించగానే కాలానే చివరి చిత్రం అనే ప్రచారం జరగడంతో పాపం త్రిష ఇక తన కల కల్లే అనుకున్నారంతా. అదేవిధంగా ఆమె కంటే సీనియర్ నటి సిమ్రాన్. ఆమె ఒక్క రజనీకాంత్ మినహా కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించింది. సూపర్‌స్టార్‌తో నటించలేదన్న కొరత ఈ అమ్మడికీ ఉండేది. అలా సిమ్రాన్, త్రిషలిద్దరి ఆకాంక్షలను రజనీకాంత్ పేట చిత్రంతో తీర్చారు. రెండు మూడు సన్నివేశాల్లో వచ్చి పోయే పాత్రలే అయినా త్రిష, సిమ్రాన్ ఇద్దరూ హ్యాపీ. ఇక వీరిద్దరికంటే యమ ఖుషీ అయిపోతున్న మరో నటి ఉంది. ఆమె మేఘాఆకాశ్. పేట చిత్రం ఈ జాణ జీవితంలో మరపురాని చిత్రంగా నిలిచిపోతోంది. తెలుగులో రెండు మూడు చిత్రాలు చేసిన మేఘాఆకాశ్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. ఒరు పక్క కథై చిత్రంతో పరిచయమై, ధనుష్‌తో ఎన్నై నోక్కి పాయుంతోట్టా చిత్రంలో రొమాన్స్ చేసింది. ఇక శింబుతో వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలోనూ డ్యూయెట్లు పాడింది. అయితే ఈ మూడు చిత్రాలు ఇంకా వెండితెరపైకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేట చిత్రంలో కళాశాల విద్యార్థినిగా నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. పేట చిత్రం గురువారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన ఈ పేట చిత్రం ఆమె జీవితంతో విడుదలైన తొలి తమిళ చిత్రంగా నమోదైంది. ఇది మేఘాఆకాశ్ ఊహించనిదే. అయినా జరిగి మధురమైన అనుభూతిని మిగల్చడంతో మేఘ యమ ఖుషీగా పొంగళ్ పండగ చేసుకుంటోంది. అంతేకాదు ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని తెగ ఆనందపడిపోతోంది. ఈమె సంతోష పడుతున్న మరో విషయం అమ్మడు పనిలో పనిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ శాట్‌లైట్ శంకర్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలా 2018 రెండు మరచిపోలేని అవకాశాలను అందించి పోగా, 2019 పేట తొలిచిత్రంగా విడుదలై విజయానందానిచ్చింది. ఇక శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మొత్తం మీద మేఘాఆకాశ్ ఫుల్‌జోష్‌లో ఉంది. -
‘పేట’ మూవీ రివ్యూ
టైటిల్ : పేట జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రజనీకాంత్, త్రిష, సిమ్రన్, విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీ సంగీతం : అనిరుధ్ దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : అశోక్ వల్లభనేని, కళానిథి మారన్ 2.ఓ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పేట. కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎన్నో వివాదాల మధ్య అతి కష్టం మీద రిలీజ్ అయ్యింది. తెలుగులో భారీ చిత్రాలు బరిలో ఉండటంతో పేటకు సరైన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అయితే రజనీ మేనియా కారణంగా అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఇన్ని కష్టాల మధ్య పేట తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.? రజనీ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..? కథ : కాళీ (రజనీకాంత్) ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్ హీలర్గా పనిచేసే డాక్టర్(సిమ్రన్)తో కాళీకి పరిచయం అవుతుంది. అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? పేట తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్లాడా.. లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రజనీకాంత్ మరోసారి తనదైన స్టైలిష్, మాస్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దగా పర్ఫామెన్స్‌కు అవకాశం లేకపోయినా.. అభిమానులను అలరించే స్టైల్స్‌కు మాత్రం కొదవేలేదు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా ఎవరికీ పెద్దగా ప్రాదాన్యం లేదు. ప్రతినాయక పాత్రలను కూడా అంత బలంగా తీర్చి దిద్దకపోవటంతో విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ లాంటి నటులు ఉన్నా ఆ పాత్రలు గుర్తుండిపోయేలా లేవు. సినిమా అంతా రజనీ వన్‌మేన్ షోలా సాగటంతో ఇతర పాత్రలు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. శశికుమార్, బాబీ సింహా, మేఘా ఆకాష్, నాగ్ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : పేట పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం. ఓ భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తొలి భాగానికి ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్, ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. రజనీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. అనిరుధ్ అందించిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరించినా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోవటం కష్టమే. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్ అనిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ నేపథ్య సంగీతం కొన్ని ట్విస్ట్‌లు మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ సెకండ్ హాఫ్ తమిళ నేటివిటి -
థియేటర్ల మాఫియా ఉంది
‘‘సినిమా కళకి కులం, మతం, జాతి, ప్రాంతం.. ఉండవని నిరూపించారు రజనీగారు. స్వయంకృషితో వరల్డ్ సూపర్‌స్టార్‌గా ఎదిగారంటే అది రజనీగారొక్కరే. మన ఎన్టీ రామారావుగారు కూడా చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్కూడా స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు’’ అని నిర్మాత టి.ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సినిమా బావుంటే ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు థియేటర్స్ మాఫియా ఎలా ఉందంటే మాఫియా డాన్స్ కంటే దారుణాతి దారుణంగా ఉంది. కేవలం ముగ్గురు నలుగురు చేస్తున్న సినిమాలకి మొత్తం థియేటర్స్ పెట్టుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను బతకనిచ్చే పరిస్థితిగానీ, కొత్తవాళ్లు వచ్చే పరిస్థితిగానీ లేకుండా చాలా నీచాతి నీచంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఆరేడు సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగే ప్రేక్షకులున్నారు. కానీ, చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్న మాఫియా ఉంది. ఈ మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుగార్లకు చెబుతాం. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగతా వాళ్లందర్నీ తొక్కి పారేస్తున్నారు. మా సినిమాలే ఉండాలి అనే ధోరణిలో వెళుతున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇది మీకు విజ్ఞప్తి అనుకోండి.. కాదంటే వార్నింగ్ అనుకోండి.. అయిపోతారు... చాలా మందిని చూశాం. విర్రవీగినోళ్లంతా ఆకాశంలోకి వెళ్లిపోయారు.. మీరు కూడా పోతారు. కొంచెం తెలుసుకుని కరెక్టుగా ఉండండి’’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య.. ‘పేట’ కూడా పెద్ద సినిమానే. వాటి మధ్య ఈ సినిమా విడుదల చేస్తున్నాడు అశోక్. ఆ సినిమాలతో పాటు ‘పేట’ కూడా ఆడాలని కోరుకుంటున్నా. రజనీకాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. చిరంజీవిగారు, రజనీగారు నటీనటులకు స్ఫూర్తి’’ అన్నారు. చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ–‘‘ఎందరో మహానుభావులు.. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. పిలిచినా వస్తానని రాకుండా మమ్మల్ని ఆనందపెట్టిన ఇంకొందరు మహానుభావులకు నా రెండేసి వందనాలు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్య మన సినిమా ‘పేట’ కి థియేటర్స్ తక్కువైనా, బిజినెస్ జరిగినా, జరక్కపోయినా సొంతంగా రిలీజ్ చేద్దామని రిస్క్ తీసుకుని విడుదల చేస్తున్నా’’ అన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘రజనీగారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. అలాంటివాళ్లు అక్కడక్కడా వస్తుంటారు. మనకి మన ఎన్టీ రామారావుగారు. ఆయన ఓ చరిత్ర. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జపాన్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి రజనీ. సౌత్ ఇండియాలోనూ హీరోలు ఉన్నారని ప్రపం చానికి చాటిన మొదటి హీరో రజనీ ’’అన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘పేట’ చిత్రం మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. రజనీసార్ అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మంచి కథ. ఈ పండక్కి చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా విడుదలవుతోంది. ఆ సినిమాలతో పాటు మా ‘పేట’ కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటీనటులు బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహన్, పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు
‘‘రజనీకాంత్‌గారికి నేను పెద్ద అభిమానిని. బస్ కండక్టర్ నుంచి ఆల్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారాయన. పైగా మంచి సేవాగుణం ఉంది. అందుకే రజనీకాంత్‌గారే నాకు స్ఫూర్తి. ఈ రోజు స్టేజ్‌పైన ఆయన పక్కన నిలబడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు నేనెంతో కష్టపడ్డాను కూడా’’ అని నిర్మాత వల్లభనేని అశోక్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ– ‘‘ఇందులో 20 ఏళ్ల కిందటి రజనీని చూస్తారు. ‘బాషా, ముత్తు, నరసింహ’ సినిమాల కంటే మరో లెవల్లో ‘పేట’ సినిమా ఉంటుంది. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల మధ్యలో మా సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్లు చాలా తక్కువగా దొరికాయి. కానీ, సినిమా బాగుంది కాబట్టి విడుదల తర్వాత థియేటర్లు పెరుగుతాయనే నమ్మకం ఉంది. ‘పేట’ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది పోటీ పడ్డారు. మా బ్యానర్లో ఈ మధ్య ‘నవాబ్, సర్కార్’ చిత్రాలను మంచి పబ్లిసిటీతో రిలీజ్ చేశాం. ఆ నమ్మకంతోనే సన్ పిక్చర్స్ వారు.. వేరే వారు ఆఫర్ చేసిన ఫ్యాన్సీ రేటుకంటే కోటిన్నర రెండు కోట్లు తగ్గించి నాకు ఇచ్చారు. ఇందుకు వారికి ధన్యవాదాలు. ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. రజనీగారితో పాటు యూనిట్ అంతా వస్తారు. మా నాన్నగారు బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయారు. అప్పటి నుంచి నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇందులో భాగంగా ఇదే వేదికపై కొన్ని అనాథాశ్రమాలకు, ఇతర సేవలు అందిస్తున్న కొందరికి రజనీగారి చేతుల మీదుగా చెక్‌లను అందిస్తాం. ఈ ఏడాది తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేయనున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నా’’ అన్నారు. అశోక్ వల్లభనేని -
తీపి కబురు
అభిమానులకు తీపి కబురు చెప్పారు రజనీకాంత్. తన తాజా చిత్రం ‘పేట్టా’ ట్రైలర్ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ‘పేట’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ఆడియోను ఆల్రెడీ రిలీజ్ చేసిన చిత్రబృందం ఈ నెల 28న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ‘పేట్టా’ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 51 నిమిషాలని కోలీవుడ్ టాక్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత వల్లభనేని అశోక్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. -
సంక్రాంతికి ఫిక్స్
ఇందుమూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియజేయడం ఏమనగా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘పేట’ సంక్రాంతికి విడుదల అవుతోందహో.. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్కార్, నవాబ్’ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మా బ్యానర్లో ‘పేట’ సినిమా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. రజనీ అభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అనిరు«ద్ చక్కటి సంగీతం ఇచ్చారు. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అన్నారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు. -
చూడరా కాళీ ఆట
‘పాక్కదాన పోర ఇంద కాళీయోడ ఆట్టత్త...’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు రజనీకాంత్. అంటే ‘చూడబోతున్నావు కదా ఈ కాళీ ఆట..’ అని అర్థం. రజనీ లేటెస్ట్ చిత్రం ‘పేట్టా’లో టైటిల్ సాంగ్ ఇలానే స్టార్ట్ అవుతుంది. ‘మరణ మాస్...’ అనే పదాలతో సాగే ఈ మాస్ సాంగ్ విని రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సంగీత దర్శకుడు అనిరు«ద్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రజనీకాంత్‌కు ఎస్పీబీ పాడిన పాట ఇది. ఈ పాటలో సూపర్‌స్టార్ సూపర్ ఎనర్జీతో స్టెప్పులేశారని చిత్రబృందం పేర్కొంది. కాగా, ఈ పాటలో కొన్ని లైన్స్‌ని మాత్రమే ఎస్పీబీ పాడారని కొందరు బాధపడుతున్నారు. రజనీ వీరాభిమానులైతే సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఎస్పీబీ స్పందిస్తూ– ‘‘చాలాకాలం తర్వాత రజనీకాంత్‌కి పాట పాడినందుకు ఆనందంగా ఉంది. ఈ పాటలో నా భాగం కొంత మాత్రమే. అయినా నాకేం ఇబ్బంది లేదు. ‘పేట్టా’ టీమ్ నా వాయిస్ కావాలనుకున్నారు. పాట పాడించటానికి నన్ను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. త్రిషా, సిమ్రాన్ కథానాయికలు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో రజనీ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. -
ఈ నెలాఖరు నుంచి రజనీ వారోత్సవాలు
తమిళసినిమా: ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు ఇక సినిమాల పండగే. ఒకవైపు రజనీ రాజకీయ ఆరంగేట్రం గురించి చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఆయన సినిమాలు వరుసబెట్టి వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సూపర్‌స్టార్ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరిపించేందుకు వరుసగా రెండు భారీ చిత్రాలు వస్తున్నాయి. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో భారీ చిత్రం 2.వో.. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక, రజనీ మరో చిత్రం ‘పేట’ కూడా వెనువెంటనే వచ్చేందుదకు సిద్ధమవుతోంది. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకి జంటగా నటి త్రిష, సిమ్రాన్ నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్‌గా జరుపుకుంటోంది. ఈ చిత్ర సింగిల్ ట్రాక్‌ను డిసెంబర్ 3న, రెండో సింగిల్ ట్రాక్‌ను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న ఆడియో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ ట్విటర్లో వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి రానుందని గతంలో చిత్రవర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పేట పొంగల్‌కు రావడం ఖాయమని తాజాగా కార్తీక్‌సుబ్బరాజు స్పష్టం చేశారు. 2.వో శంకర్ స్టైల్ విజువల్ ట్రీట్ అయితే పేట రజనీ స్టైల్ ట్రీట్‌గా ప్రేక్షకులను అలరించనుంది. మొత్తానికి రజనీ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్ వరకు పండగే పండగన్న మాట. -
రజనీ ‘పేట్టా’ ఆడియో వస్తోంది!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘2.ఓ’తో ఇంకొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందకు రానున్నాడు. శంకర్ డైరెక్షన్లో రాబోతోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దీని తరువాత రజనీ తదుపరి సినిమాను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రాబోతోన్న ‘పేట్టా’ చిత్రం ఆడియో రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబ ర్ 9న పాటలను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. #PettaAudiofromDec9th The first single will be released on 3rd and second single on 7th!@rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @SimranbaggaOffc @Nawazuddin_S @SasikumarDir @trishtrashers pic.twitter.com/DzI1V2K58Z — Sun Pictures (@sunpictures) November 23, 2018 -
బాషా తర్వాత పేట్టా!
సంక్రాంతి పండక్కి వెండితెరపై రజనీకాంత్ సందడి చేయడం కన్ఫార్మ్ అయిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘పేట్టా’. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాష్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సిని మాను సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అవును... తలైవర్ (నాయకుడు) రజనీకాంత్ సంక్రాంతికి వస్తున్నారు’’ అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ‘‘రజనీకాంత్‌సార్ సరసన నటిస్తానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సిమ్రాన్. డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్, నటులు బాబీ సింహా, సనత్‌రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా జనవరి 10న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, ట్రెండ్ సెట్ చేసిన ‘బాషా’ తర్వాత సంక్రాంతికి విడుదలవుతున్న ఆయన సినిమా ‘పేట్టా’ కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘రజనీతో నేను.. నమ్మలేకపోతున్నా’
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెట్ట. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. రజనీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా సీనియర్ హీరోయిన్ సిమ్రన్ రజనీకాంత్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. రజనీతో తాను ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేసిన సిమ్రన్ ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నన్ను నేను గిచ్చుకొని చూసుకున్నా’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. I'm super happy OMG I can't believe its happening just pinched myself 😊😊💃💃💃💃#PettaPongalParaak @rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @Nawazuddin_S @SasikumarDir @trishtrashers @sunpictures pic.twitter.com/0XzUDZEfZs — Simran (@SimranbaggaOffc) 14 November 2018 -
ఆయన జెంటిల్‌మేన్
‘నిన్నా కుట్టేసినాది... మొన్నా కుట్టేసినాది గండు చీమ...’ పాటలో ఎలా కనిపించారో సిమ్రాన్ ఇప్పటికీ అలానే ఉన్నారు. కధానాయికగా భేష్ అనిపించుకున్న ఆమె ఇటీవల ‘సీమరాజా’ సినిమాలో తన విలనిజమ్ని కూడా చూపించి, ప్రశంసలు పొందారు. అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ట్వీటర్లో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా తన ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సిమ్రాన్ సమాధానం చెప్పారు. అందులో కొన్ని... ► మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు కనిపిస్తారు? మంచి రోల్ వస్తే తప్పకుండా.. త్వరలోనే. ► మీ డ్యాన్స్‌కు పెద్ద అభిమానులం. మీరు డ్యాన్స్ చేసిన వాటిలో మీకు నచ్చిన పాట? ‘జోడీ’ సినిమాలో పాటలు నాకు పర్సనల్‌గా ఇష్టం. ► నటిగా మీకు సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏది? ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో పాత్ర చాలా సంతృప్తినిచ్చింది. ► ‘పేట్టా’లో రజనీకాంత్‌తో నటించడం ఎలా ఉంది? ఈ సినిమా ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. రజనీ సార్ జెంటిల్‌మేన్. ► అప్పటి, ఇప్పటి దర్శకులతో పని చేశారు. వాళ్లలో మీరు గమనించిన తేడా ఏంటి? ఎటువంటి తేడా లేదు. ► తమిళంలో ‘సీమరాజా’ సినిమాలో నెగటీవ్ పాత్ర చేశారు. వాటిని కొనసాగిస్తారా? పవర్ఫుల్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ► మీ ఫిట్నెస్ సీక్రెట్ చెబుతారా? క్రమశిక్షణతో ఉండటం. అన్ని పనులు టైమ్‌కి చేయడమే నా ఫిట్నెస్ సీక్రెట్. ► దర్శకురాలిగా ఎప్పుడు మారుతున్నారు? నాకు ఇంకా నటించాలని, ఇంకా నేర్చుకోవాలని ఉంది. సినిమాలు సముద్రంలాంటివి. ఎన్ని నేర్చుకున్నా ఇంకా మిగిలున్నట్లే ఉంటుంది. -
భారత హాకీ జట్టుకు రజతం
బ్యూనస్ ఎయిర్స్: నాలుగేళ్ల క్రితం కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకున్న భారత బృందం ఈసారి యూత్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. ఫైవ్–ఎ–సైడ్ హాకీ పురుషుల విభాగంలో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్ 2–4తో ఓడింది. స్వర్ణం–రజతం కోసం అర్జెంటీనాతో భారత మహిళల జట్టు కూడా తలపడనుంది. మహిళల రెజ్లింగ్ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సిమ్రన్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో సిమ్రన్ 6–11తో ఎమిలీ (అమెరికా) చేతిలో ఓడింది. నాలుగు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో ఇప్పటికే భారత్ 10 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇప్పటివరకు మను భాకర్, సౌరభ్ (షూటింగ్), లాల్రినుంగా (వెయిట్‌లిఫ్టింగ్) స్వర్ణాలు సాధించగా... తబాబి దేవి (జూడో), తుషార్ (షూటింగ్), మెహులీ (షూటింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), సిమ్రన్ (రెజ్లింగ్) రజతాలు గెలిచారు. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. -
మార్కెట్లో మస్తీ
రజనీకాంత్ తన స్టైల్లో పాటలకు స్టెప్పులు వేస్తే థియేటర్స్‌లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవాల్సిందే. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా కోసం కూడా ఇలాంటి స్టెప్స్ వారణాసిలో వేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రీసెంట్గా ఫైట్ సీన్స్‌ను కంప్లీట్ చేసిన చిత్రబృందం తాజాగా రజనీకాంత్‌పై మార్కెట్ సెట్లో ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది రజనీకాంత్ పరిచయ గీతం అని టాక్. ఈ పాటలో రజనీతో పాటు విజయ్ సేతుపతి కూడా ఉన్నారట. ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్స్‌లో రజనీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు అని ఆయన ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు షూటింగ్ స్పాట్లో ఫొటోలు లీక్ అవ్వడంతో చిత్రబృందం టెన్షన్ అవుతోంది. ‘ఈ ఫొటోలను షేర్ చేయొద్దు అని కోరుకుంటున్నాను. కొన్ని చానల్స్ ఈ షూటింగ్ వీడియోలు చూపించడం బాధాకర ం. కొన్ని రోజుల తర్వాత సినిమాని పైరసీ చేసేసి చానల్స్‌లో వేసేస్తారేమో’’ అని చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడు. -
అదిరింది తలైవా
రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెకండ్ లుక్‌ను గురువారం రిలీజ్ చేసి రజనీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు టీమ్. ఫస్ట్ లుక్‌లో రజనీకాంత్ ఫుల్ మాస్‌గా కనిపిస్తే, సెకండ్ లుక్‌లో క్లాస్‌గా కనిపించారు. ఈ లుక్స్‌ని బట్టి సినిమాలోని రజనీకాంత్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయని అర్థం అవుతుంది. అలాగే సెకండ్ లుక్ 1980 కాలంనాటిదిగా ఉంది. అంటే ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ వారణాసిలో జరుగుతోందని సమాచారం. రజనీ, విజయ్‌సేతుపతి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. నవాజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, డైరెక్టర్ శశి, మేఘా ఆకాశ్, సనత్ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇక ఆ బాధ అక్కర్లేదు
‘‘రజనీకాంత్‌గారితో కలిసి నేనెప్పుడు పని చేస్తాననే ప్రశ్న నన్ను ఎంతకాలం నుంచో బాధపెడుతోంది. ఇక బాధపడక్కర్లేదు. ‘పేట్టా’ సినిమాలో ఆయనతో కలిసి సిల్వర్ స్క్రీన్ పంచుకునే అవకాశం నాకు దక్కింది. సోమవారం నుంచి వారణాసిలో జరిగే తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటాను’’ అన్నారు త్రిష. ఎందుకు ఇంతలా ఆమె భావోద్వేగానికి గురయ్యారంటే... త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు రజనీకాంత్‌తో త్రిష కలిసి నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు ఆనందపడుతున్నారామె. అన్నట్లు.. ఈ చిత్రంలో సిమ్రాన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అసలు సిమ్రాన్, త్రిష కాంబినేషన్ సన్నివేశాలు లేవట. దీన్నిబట్టి ఈ చిత్రం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఓ కథానాయిక ఉంటారని ఊహించవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నవ్వు చెబుతోంది
అభిమాన తారలతో ఫొటోలో బందీ అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. అయితే కథానాయిక మేఘా ఆకాశ్ కల నిజమైంది. ఆమెకు ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఫొటో దిగారు. ‘‘నా కల నిజమైంది. కొన్ని సార్లు నక్షత్రాలను అందుకునే అవకాశం వస్తుంది. నా ఆనందాన్ని నా నవ్వు చెబుతోంది’’ అంటూ ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేశారు మేఘా ఆకాశ్. ఈ సంగతి ఇలా ఉంచితే... కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో మేఘా ఆకాశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోతో ఆ విషయం కన్ఫార్మ్ అయ్యిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట. -
ఫుల్ ప్రొటక్షన్
పాతికమంది పోలీసులు, దాదాపు నలభై మంది బౌన్సర్స్ రజనీకాంత్‌కు ప్రొటక్షన్‌గా ఉన్నారు. ఇది సినిమాలోని సీన్ కాదండీ బాబు. రియల్ సీన్. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిన్నది కాదు. దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. ఈ షెడ్యూల్లోనే ప్రధాన తారాగణంతో పాటు సుమారు 500 మంది బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. లక్నోలోనే కాకుండా వారణాసి, సోన్‌బాద్రా ఏరియాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ అవుతున్నాయని సెట్లోకి సెల్ ఫోన్స్‌ను నిషేధించారట టీమ్. సూపర్ స్టార్‌కి ఫుల్ ప్రొటక్షన్ ఏర్పాటు చేశారట.. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుందని కోలీవుడ్ టాక్. -
పేట్టలో వేట
గంటల వ్యవధిలో ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. అటు ‘2.0’ టీజర్, ఇటు తాజా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాకు ‘పేట్ట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా మోషన్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మాళవికా మోహనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. ‘పేట్ట’లో రజనీకాంత్ విలన్స్‌ని ఎలా వేటాడతారు? అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచి... ‘2.0’ విషయానికి వస్తే... శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలుగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
క్యూట్ లవ్‌స్టోరీ
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, సిమ్రాన్ జంటగా పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వక్కడ నేనిక్కడ’. తాని గంగిరెడ్డి, కీర్తన వెంకటేష్ నిర్మాతలు. తొలి సన్నివేశానికి నిర్మాత కేకే రాధామోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత, పంపిణీదారుడు పారస్ జైన్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఆర్బీ చౌదరి పూజలో పాల్గొన్నారు. పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యూత్‌ఫుల్ కథాంశంతో క్యూట్ లవ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. కామెడీ హీరోగా మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు పార్వతీశం. ‘‘డైరెక్టర్ని, కథను నమ్మి నిర్మిస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆచంట రాంబాబు. ∙సిమ్రాన్, పార్వతీశం -
చదివేస్తున్నారు
కైసా హై? క్యా కర్తా హై? అని హిందీ లాంగ్వేజ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని ప్రశ్నలు అడిగితే తమిళంలో ఆన్సర్స్ చెబుతున్నారు. ఎందుకంటే రజనీకాంత్‌కు దీటుగా డైలాగ్స్ చెప్పాలని తమిళ డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నారాయన. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించన్నారు. 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలీవుడ్లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసిన ఆయన ఈ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ‘‘నా తొలి తమిళ సినిమాకు డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ఓ ఫొటోను షేర్ చేశారు సిద్ధిఖీ. ఫొటో చూస్తుంటే నవాజుద్దీన్ శ్రద్ధగా చదివేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
హరికృష్ణ హఠాన్మరణంపై చలించిపోయిన సిమ్రాన్
సాక్షి, చెన్నై : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీనియర్ నటి భానుప్రియ అన్నారు. హరికృష్ణ మృతి చెందారంటే ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయనతో రెండు చిత్రాలు చేశానని, సెట్లో ఆయన అందరితో కలివిడిగా అభిమానంగా ఉంటారని తెలిపారు. తన కుటుంబం అంటే హరికృష్ణకు చాలా అభిమానమన్నారు. ఆయన మృతి చిత్రసీమకే కాదు ఆయనను అభిమానించే వారందరికీ తీరనిలోటేనన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆ కుటుంబానికి బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. షాక్ గురయ్యా : రాధికా శరత్ కుమార్ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే షాక్‌కు గురయ్యానని సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చాలా బాధ కలిగింది : సిమ్రాన్ కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు నటి సిమ్రాన్ సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం చాలా బాధకలిగించిందని ఆమె అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టిన సీతయ్య సినిమాలో ఆయనకు జోడిగా సిమ్రాన్ నటించిన సంగతి తెలిసిందే. -
ప్రొఫెసర్‌కి కోపం వస్తే...
కామ్‌గా క్లాస్‌లు చెప్పేవాడు అనుకొని తక్కువ అంచనా వేశారు ప్రొఫెసర్ రజనీకాంత్‌ని. కానీ అతని ఫ్లాష్‌బ్యాక్ తెలియక తన్నులు తిన్నారు రౌడీ గ్యాంగ్. ఇదంతా రజనీకాంత్ లేటెస్ట్ సినిమా షూటింగ్ విశేషాలే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ ఫైట్ సీన్‌ను కొరియోగ్రఫీ చేశారు. ఇందులో రజనీకాంత్ ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని, ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్లో డాన్‌లా కనిపిస్తారని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, మేఘా ఆకాశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
కలలా ఉంది!
కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. సూపర్ స్టార్‌తో యాక్ట్ చేసే హీరోయిన్ ఎవరో కన్ఫార్మ్ అయింది. రజనీకాంత్ నెక్ట్స్ సినిమాలో ఆయన సరసన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటూ? కొన్ని రోజులుగా గందరగోళం ఏర్పడింది. తలైవర్‌తో డ్యాన్స్ చేసేది త్రిష అని కొంతమంది అంటే.. కాదు మాళవికా మోహనన్ అని కొందరు వాదించారు. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశారు సన్ నెటవర్క్ సంస్థ ప్రతినిధులు. రజనీకాంత్ సరసన నటించనున్న హీరోయిన్ త్రిష అని అఫీషియల్‌గా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సిమ్రాన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి జోడీగా నటించబోతున్నది త్రిష అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు సన్ నెటవర్క్ ప్రతినిధులు. ‘‘కొన్ని సార్లు నిద్రలేచినా కూడా ఇంకా కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ వార్త నాకు అలాంటిదే’’ అని త్రిష ఆనందాన్ని పంచుకున్నారు. అన్నట్లు.. కొన్ని రోజుల క్రితం రజనీతో త్రిష జోడీ కుదిరింది అని ‘సాక్షి’ ప్రచురించిన సంగతి గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. -
సింహం సింగిల్‌గా...
ఐదు వందల మంది స్టూడెంట్స్‌తో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. అక్కడికొచ్చిన రజనీ కాంత్ మైక్ అందుకుని స్టూడెంట్స్‌ని ఉద్దేశిస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు. విద్యార్థులంతా రజనీ స్పీచ్‌కి ఇంప్రెస్ అయిపోయి ఈలల కొట్టసాగారు. ఏంటీ రజనీకాంత్ రాజకీయ సభ గురించి ప్రస్తావిస్తున్నాం అనుకుంటున్నారా? కాదు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసం షూట్ చేసిన ఓ సన్నివేశాన్ని వివరిస్తున్నాం. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ నెట్వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా త్రిష, మాళవికా మోహనన్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. అందులో భాగంగానే సుమారు 500 మంది స్టూడెంట్స్‌కి ఉపన్యాసం ఇస్తున్నటువంటి ఓ సన్నివేశాన్ని షూట్ చేశారట దర్శకుడు కార్తీక్. స్టేజ్ మీద సింహంలా సింగిల్‌గా డైలాగ్స్ పలికే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. మరి సినిమా మొత్తం ప్రొఫెసర్‌గానే రజనీకాంత్ కనిపిస్తారా అంటే? కాదు.. ఫ్లాష్‌బ్యాక్‌లో డాన్‌గా కనిపిస్తారట. విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
జోడీ కుదిరేనా?
అనుకున్నామని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని. ఇప్పుడీ సామెత రజనీకాంత్ తాజా చిత్రానికి సూట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకంటే... రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయాయి. 164 సినిమాలు చేశారాయన. అలాగే కెరీర్లో చెన్నై సుందరి త్రిష కూడా హాఫ్ సెంచరీ మైలురాయిని దాటారు. సినిమా ఫీల్డ్‌లో లీడ్ యాక్ట్రస్‌గా పదిహేను సంవత్సరాలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు రజనీకాంత్‌కు జోడీగా త్రిష నటించలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందంటున్నారు కోలీవుడ్ వాసులు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా నటించబోతున్నారని తాజా సమాచారం. దాదాపు 19ఏళ్ల క్రితం వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తే, అందులో త్రిష ఓ స్మాల్ రోల్ చేశారు. ఆ తర్వాత మళ్లీ త్రిష, సిమ్రాన్ స్క్రీన్ షేర్ చేసుకోలేదట. ఇప్పుడు ఈ సినిమాకి కుదురుతుందేమో. రీసెంట్గా డెహ్రాడూన్‌లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ చెన్నై, మధురైలో స్టార్ట్ కానుందని టాక్. విజయ్ సేతు పతి, బాబీ సింహా, సనత్ రెడ్డి, మేఘా ఆకాశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.