స్టార్ హీరోయిన్పై ఫైర్ అయిన రైటర్ | Writer Apurva Asrani Upset with Kangana Ranaut | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోయిన్పై ఫైర్ అయిన రైటర్

Published Thu, May 18 2017 12:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

స్టార్ హీరోయిన్పై ఫైర్ అయిన రైటర్

స్టార్ హీరోయిన్పై ఫైర్ అయిన రైటర్

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, తన సినిమాలు నటనతో ఎంత పాపులర్ అయ్యిందో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తన తాజా చిత్రం సిమ్రాన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా మరో కాంట్రవర్సీకి తెరసింది. ఇటీవల రిలీజ్ అయిన సిమ్రాన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న కంగనా ఈ సినిమా మరో క్వీన్ అవుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ టీజర్ లో టైటిల్ క్రెడిట్స్ లో కంగన పేరు కూడా కనిపించటం వివాదానికి కారణమైంది. ఈ సినిమాకు అపూర్వ అస్రాని డైలాగ్స్ అందించాడు. అయితే టైటిల్స్ లో అడిషినల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంటూ కంగన పేరు వేయటం పై అపూర్వ అభ్యంతరం తెలిపాడు. ఈ సినిమాకోసం తాను 9 వర్షన్ లు రాశానని, ఫైనల్ వర్షన్ చూసిన కంగన ఎగిరి గంతేసి మరి స్క్రిప్ట్ కు ఓకె చెప్పిందని తెలిపాడు.

షూటింగ్ సమయంలో చేసిన కొద్ది పాటి ఇంప్రూవైజేషన్ లకే కంగనకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ ఇవ్వటం కరెక్ట్ కాదన్నాడు. అది కూడా తన పేరు కన్నా ముందు కంగన పేరు వేయటం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా దర్శకుడు హన్సల్ మెహతాతో కలిసి తాను స్క్రీప్ట్ రాశానని కంగన ప్రచారం చేసుకుంటుందన్న అపూర్వ.. ఇది తన శ్రమను దోచుకోవటమే అని ఆరోపించాడు. మరి వివాదం పై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement