మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్స్‌ ఓకే! | Simran box-office collection: film fares well on Saturday | Sakshi
Sakshi News home page

మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్స్‌ ఓకే!

Published Sun, Sep 17 2017 3:23 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్స్‌ ఓకే!

మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్స్‌ ఓకే!

నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్‌ తార కంగన రనౌత్‌ తాజా సినిమా 'సిమ్రన్‌'.. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు కంగనను చుట్టుముట్టాయి. ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగన.. బాలీవుడ్‌ అగ్ర హీరోలపై ధైర్యంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విడుదలైన 'సిమ్రన్‌' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వచ్చినా.. సినిమా అంత గొప్పగా లేదని విమర్శలు వినిపించాయి. విమర్శకులు ఈ సినిమాపై పెదవివిరిచారు.

మిక్స్‌డ్‌ టాక్‌ నేపథ్యంలో తొలి రోజు శుక్రవారం రూ. 2.77 కోట్లు వసూలు చేసిన 'సిమ్రన్‌' రెండోరోజు వసూళ్లలో గణనీయంగా పుంజుకుంది. రెండోరోజూ వసూళ్లలో 35.74శాతం వృద్ధి నమోదు చేసి.. రూ. 3.76 కోట్లు దక్కించుకుంది. మొత్తంగా దేశంలో తొలి రెండు రోజుల్లో రూ. 6.53 కోట్లు వసూలు చేసింది. ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. కలెక్షన్లు క్రమంగా పెరిగితే.. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించే అవకాశముందని భావిస్తున్నారు. ఇక ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్‌' సినిమా రెండురోజుల్లో రూ. 4.86 కోట్లు వసూలు చేసి నిరాశపరిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement