Apurva Asrani
-
అనుష్క కెరీర్ అంతం చేయాలనుకున్నా, తెర వెనుక కుట్ర చేశా: నిర్మాత
ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ అంశంపై బాలీవుడ్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ సినీపరిశ్రమలో ఉన్న తారల వారసులకు ఇచ్చిన విలువ, హోదా.. బయట నుంచి వచ్చిన నటీనటులకు ఉండదనేది బలమైన వాదన. అంతేకాదు, దర్శకనిర్మాతలు కూడా సెలబ్రిటీల వారసులకే సినిమా అవకాశాలిస్తారు, కానీ ఎంత టాలెంట్ ఉన్నా సరే బయటవాళ్లను పట్టించుకున్న పాపాన పోరనే అపవాదు చిత్రపరిశ్రమలో ఉండనే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారుతోంది. అయితే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గతంలో అనుష్క శర్మ కెరీర్‌ను అంతం చేయాలనుకున్నాడట. ఆమెకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. కేవలం తన టాలెంట్‌తోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చింది. అలాంటి ఆమెను తక్కువ అంచనా వేసిన కరణ్ తనకు సినిమా అవకాశమే ఇవ్వకూడదని భావించాడట. ఈ విషయం స్వయంగా అతడే చెప్పాడు. 'రబ్నే బనాదీ జోడీ సినిమా కోసం అనుష్కను తీసుకుందామని ఆదిత్య చోప్రా ఆమె ఫోటో చూపించాడు. అది చూసిన నేను.. నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆమె వద్దే వద్దు. తనకు ఈ సినిమా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వేరే హీరోయిన్‌కు ఈ సినిమా ఇద్దామని ఉండేది. తెర వెనుక ఆమెను తప్పించే ప్రయత్నాలు చేశాను. సినిమా రిలీజయ్యాక అయిష్టంగానే చూశాను. కానీ బ్యాండ్ బాజా బారత్ మూవీ చూశాక తన నటనకు ఇంప్రెస్ అయ్యా. ఇంత మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకున్నానన్న గిల్టీతో క్షమాపణలు చెప్పాను. సినిమా చాలా బాగా చేశావని అనుష్కను మెచ్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2016లో 18వ ఎమ్‌ఏఎమ్‌ఐ ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో కరణ్ పై వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను దర్శకరచయిత అపూర్వ అస్రానీ ట్విటర్లో షేర్ చేశాడు. 'కరణ్ జోహార్ అనుష్క శర్మ కెరీర్‌ను అంతమొందించాలని అనుకున్నట్లు కరణ్ జోహార్ గతంలో అంగీకరించాడు. నాకు తెలిసి ఇన్సైడర్, అవుట్‌సైడర్ అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన అంశమే' అని ట్వీట్ చేశాడు. దీనిపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'మంచి కెరీర్ ఇవ్వడం లేదా అంతం చేయడమే కొందరి హాబీ. ప్రతిభావంతులైన బయటివారిపై కొందరు డర్టీ పాలిటిక్స్ చేయడం వల్లే బాలీవుడ్ ఇలా తయారైంది' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా అనుష్క శర్మ 'రబ్నే బనా దీ జోడీ' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. Someone’s only hobby is to make or break careers. If Bollywood is in gutter, it’s because of some people’s dirty ‘backroom’ politics against talented outsiders. https://t.co/GNPRjiW5ry — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 6, 2023 -
‘సుశాంత్ సింగ్‌కు పట్టిన గతే తనకు పట్టిస్తారు’
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ని దోస్తానా 2 సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యింది. అయినప్పటికి కార్తీక్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కావాలనే కార్తీక్‌ను సినిమా నుంచి తొలగించారని.. అతడికి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రకటించడమే కాక కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనుభవ్ సిన్హా, రైటర్ అపూర్వ అస్రానీ కార్తీక్ ఆర్యన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘నిర్మాతలు నటులను తప్పించినప్పుడు వారు దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని నాకు తెలిసింది. ఇది చాలా అన్యాయం. నేను తన మౌనాన్ని గౌరవిస్తున్నాను’’ అంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు. And by the way... when Producers drop Actors or vice versa they don't talk about it. It happens all the time. This campaign against Kartik Aryarn seems concerted to me and very bloody unfair. I respect his quiet. — Anubhav Sinha (@anubhavsinha) June 3, 2021 అపూర్వ అస్రానీ దీన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘అనుభవ్ సిన్హాను నేను గౌరవిస్తున్నాను. కార్తీక్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు ఎదుర్కొంటున్న బెదిరింపులు గురించి నేను బ్లాగ్ చేశాను. దాంతో చాలా మంది జర్నలిస్ట్‌లు నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మంచి కోసం ఏదైనా మారుతుందని నేను భావిస్తున్నాను’’ అంటూ అపూర్వ అస్రానీ. I respect Anubhav Sinha for calling out the very obvious campaign against #KartikAaryan. A year ago I had blogged about the bullying Sushant Singh Rajput went through. And though I remain blacklisted for it by many journalists, I feel like something IS changing for the better.✊ https://t.co/8DbWRtLGa7 — Apurva (@Apurvasrani) June 4, 2021 కార్తీక్ ఆర్యన్ తొలగింపుపై ధర్మ ప్రొడక్షన్ స్పందించింది. కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతోనే తనను తొలగించామని తెలిపింది. కొల్లిన్ డీ కున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోస్తానా 2ని తిరిగి డైరెక్ట్ చేయనున్నాం. త్వరలోనే దీని గురించి అధికారకి ప్రకటన చేస్తాం అని తెలిపింది. చదవండి: సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు -
సిమ్రాన్‌కి జరిగిందే మణికర్ణికకూ జరిగింది
‘‘దర్శకుడు క్రిష్ ‘మణికర్ణిక’ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది’’ అని ఆ చిత్రం రిలీజ్ ముందు కంగనా రనౌత్ పేర్కొన్నారు. అయితే ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మణికర్ణిక’ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పేర్కొన్నారు క్రిష్. ‘‘మణికర్ణిక’ సినిమాను జూన్‌లోనే పూర్తి చేశాను. అన్ని పాత్రలు డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నారు. అప్పుడు ‘మెంటల్ హై క్యా’ షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉన్నారు కంగనా. ఇండియా వచ్చిన తర్వాత నేను చిత్రీకరించిన విధానం నచ్చలేదని నిర్మాణ సంస్థను నమ్మించారు. భోజ్‌పూరి సినిమాలా ఉందని వాళ్లతో పేర్కొన్నారు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరగాలన్నట్టు కంగనా ప్రవర్తన ఉండేది. సోనూసూద్ పాత్ర సుమారు 100 నిమిషాలు ఉండేది. దాన్ని 60 నిమిషాలకు కుదించేయడంతో ఆయన తప్పుకున్నారు తప్పితే లేడీ డైరెక్టర్‌తో యాక్ట్ చేయను అనే కారణం కాదు. ఫస్ట్ హాఫ్‌లో ఓ 25 శాతం సెకండ్ హాఫ్‌లో 15 శాతం మాత్రమే కంగనా రనౌత్ డైరెక్ట్ చేశారు’’ అంటూ తెర వెనుక జరిగిన అసలు విషయాన్ని పంచుకున్నారు. క్రిష్ పేర్కొన్న విషయాలకు బాలీవుడ్ దర్శకుడు, స్క్రీన్ రైటర్ అపూర్వ అశ్రాని మద్దతు తెలిపారు. ‘‘నేను ‘సిమ్రాన్’ అనే సినిమాను ఎంతో ప్రేమతో రాశాను. అయితే కంగనా రనౌత్ మాత్రం మిగతా పాత్రల డైలాగ్స్, సీన్స్‌ను తగ్గించేశారు. ‘మణికర్ణిక’కు ఏం జరిగిందని క్రిష్ చెబుతున్నారో ‘సిమ్రాన్’ విషయంలోనూ అలానే జరిగింది. స్క్రిప్ట్ చాలా బావుందని చెప్పి, తర్వాత తన ఇష్టమొచ్చినట్టు మార్చేసిందామె. క్రిష్ ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు అపూర్వ. కంగనా రనౌత్ పై క్రిష్ చేస్తున్న ఆరోపణలకు కంగనా చెల్లెలు రంగోలి స్పందించారు. ‘‘క్రిష్‌గారు.. సినిమా మొత్తం మీరే డైరెక్ట్ చేశారు. కొంచెం కామ్‌గా ఉండండి. సినిమాకు హీరోయిన్ కంగనే కదా. ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్ చేయనివ్వండి’’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ గురించి కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి -
‘నన్నొక క్రిమినల్లాగా చూశారు’
స్వలింగ సంపర్కం నేరం కాదని, అందుకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు సెప్టెంబరు 6న చారిత్రాత్మకతీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలకడంతో ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) వర్గానికి ఊరట లభించింది. ఇక ఆనాటి నుంచి ఇంద్రధనుస్సు జెండాలు రెపరెపలాడుతూనే ఉన్నాయి. తమకు దక్కిన గుర్తింపును సెలబ్రేట్ చేసుకుంటూ పలువురు స్వలింగ సంపర్కులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిలో జాతీయ అవార్డు గ్రహీత, థియేటర్ ఆర్ట్, టీవీ ప్రముఖుడు, రచయిత అపూర్వ ఆస్రాని కూడా ఉన్నారు. పదకొండేళ్ల బంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తన సహచరుడు, మ్యుజీషియన్ సిద్ధాంత్ పిళ్లైతో కలిసి ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అపూర్వ ఆస్రాని... ‘ పదకొండేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. మా బంధాన్ని కొనసాగించకుండా చట్టం ఆపలేకపోయింది. అయితే ఈ ఏడాది మా సెలబ్రేషన్లో తేడా ఏంటంటే మా బంధానికి చట్ట బద్ధత రావడం.. అంతే తప్ప పెద్దగా ఏ మార్పు లేదు’ అంటూ రాసుకొచ్చా రు. నా సోదరుడికి ఉండే హక్కు నాకూ ఉండాలి కదా.. సెక్షన్ 377పై సుప్రీం తీర్పు వెలువరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అపూర్వ... ‘ ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం అనుకుంటున్నాం. అయితే ఈ దేశంలో నేను కోరుకున్న స్వేచ్ఛ ఏనాడు లభించలేదు. నన్నో క్రిమినల్లాగా చూశారు. నా సొంత సోదరుడికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అదే విధంగా పిల్లల్ని దత్తత తీసుకునే హక్కు కూడా ఉంది. కానీ నాకు మాత్రం అటువంటి హక్కులేమీ లేవు. పైగా నేనంటే చులకన భావం. ఇప్పటికైనా మాలాంటి వాళ్లని మనుషులుగా గుర్తిస్తే చాలంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు. -
స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన రైటర్
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, తన సినిమాలు నటనతో ఎంత పాపులర్ అయ్యిందో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తన తాజా చిత్రం సిమ్రాన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా మరో కాంట్రవర్సీకి తెరసింది. ఇటీవల రిలీజ్ అయిన సిమ్రాన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న కంగనా ఈ సినిమా మరో క్వీన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో టైటిల్ క్రెడిట్స్ లో కంగన పేరు కూడా కనిపించటం వివాదానికి కారణమైంది. ఈ సినిమాకు అపూర్వ అస్రాని డైలాగ్స్ అందించాడు. అయితే టైటిల్స్ లో అడిషినల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంటూ కంగన పేరు వేయటం పై అపూర్వ అభ్యంతరం తెలిపాడు. ఈ సినిమాకోసం తాను 9 వర్షన్ లు రాశానని, ఫైనల్ వర్షన్ చూసిన కంగన ఎగిరి గంతేసి మరి స్క్రిప్ట్ కు ఓకె చెప్పిందని తెలిపాడు. షూటింగ్ సమయంలో చేసిన కొద్ది పాటి ఇంప్రూవైజేషన్ లకే కంగనకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ ఇవ్వటం కరెక్ట్ కాదన్నాడు. అది కూడా తన పేరు కన్నా ముందు కంగన పేరు వేయటం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా దర్శకుడు హన్సల్ మెహతాతో కలిసి తాను స్క్రీప్ట్ రాశానని కంగన ప్రచారం చేసుకుంటుందన్న అపూర్వ.. ఇది తన శ్రమను దోచుకోవటమే అని ఆరోపించాడు. మరి వివాదం పై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.