సిద్ధాంత్ పిళ్లై- అపూర్వ అస్రానీ
స్వలింగ సంపర్కం నేరం కాదని, అందుకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు సెప్టెంబరు 6న చారిత్రాత్మకతీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలకడంతో ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) వర్గానికి ఊరట లభించింది. ఇక ఆనాటి నుంచి ఇంద్రధనుస్సు జెండాలు రెపరెపలాడుతూనే ఉన్నాయి. తమకు దక్కిన గుర్తింపును సెలబ్రేట్ చేసుకుంటూ పలువురు స్వలింగ సంపర్కులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిలో జాతీయ అవార్డు గ్రహీత, థియేటర్ ఆర్ట్, టీవీ ప్రముఖుడు, రచయిత అపూర్వ ఆస్రాని కూడా ఉన్నారు.
పదకొండేళ్ల బంధాన్ని గుర్తుచేసుకుంటూ..
తన సహచరుడు, మ్యుజీషియన్ సిద్ధాంత్ పిళ్లైతో కలిసి ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అపూర్వ ఆస్రాని... ‘ పదకొండేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. మా బంధాన్ని కొనసాగించకుండా చట్టం ఆపలేకపోయింది. అయితే ఈ ఏడాది మా సెలబ్రేషన్‌లో తేడా ఏంటంటే మా బంధానికి చట్ట బద్ధత రావడం.. అంతే తప్ప పెద్దగా ఏ మార్పు లేదు’ అంటూ రాసుకొచ్చా రు.
నా సోదరుడికి ఉండే హక్కు నాకూ ఉండాలి కదా..
సెక్షన్ 377పై సుప్రీం తీర్పు వెలువరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అపూర్వ... ‘ ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం అనుకుంటున్నాం. అయితే ఈ దేశంలో నేను కోరుకున్న స్వేచ్ఛ ఏనాడు లభించలేదు. నన్నో క్రిమినల్‌లాగా చూశారు. నా సొంత సోదరుడికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అదే విధంగా పిల్లల్ని దత్తత తీసుకునే హక్కు కూడా ఉంది. కానీ నాకు మాత్రం అటువంటి హక్కులేమీ లేవు. పైగా నేనంటే చులకన భావం. ఇప్పటికైనా మాలాంటి వాళ్లని మనుషులుగా గుర్తిస్తే చాలంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment