మూడోరోజు కలెక్షన్స్‌.. ఇంకాస్తా పెరిగాయ్‌! | Simran weekend box office | Sakshi
Sakshi News home page

మూడోరోజు కలెక్షన్స్‌.. ఇంకాస్తా పెరిగాయ్‌!

Published Mon, Sep 18 2017 1:35 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

మూడోరోజు కలెక్షన్స్‌.. ఇంకాస్తా పెరిగాయ్‌!

మూడోరోజు కలెక్షన్స్‌.. ఇంకాస్తా పెరిగాయ్‌!

నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్‌ తార కంగన రనౌత్‌ తాజా సినిమా 'సిమ్రన్‌'.. ఈ సినిమా వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం క్రమంగా పెరిగాయి. తొలి రోజు శుక్రవారం రూ. 2.77 కోట్లు వసూలు చేసిన 'సిమ్రన్‌' రెండోరోజు రూ. 3.76 కోట్లు దక్కించుకుంది. ఇక మూడో రోజు ఆదివారం ఈ సినిమా వసూళ్లు ఇంకాస్తా మెరుగుపడ్డాయి. నాలుగోరోజు రూ. 4.12 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తొలి వీకెండ్‌లో ఈ సినిమా రూ. 10.65 కోట్లను కలెక్ట్‌ చేసింది. వీక్‌ డేస్‌లోనూ ఇదే నిలకడను కొనసాగిస్తే ఈ సినిమా గౌరవప్రదమైన వసూళ్లు రాబట్టవచ్చునని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.

ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు కంగనను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగన.. బాలీవుడ్‌ అగ్ర హీరోలపై ధైర్యంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విడుదలైన 'సిమ్రన్‌' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వచ్చినా.. సినిమా కథ అంత గొప్పగా లేదని విమర్శలు వినిపించాయి. విమర్శకులు ఈ సినిమాపై పెదవివిరిచారు.

ఇక ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్‌' సినిమా బాక్సాపీస్‌ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 8.42 కోట్లు వసూలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement