జైలు నుంచే అమృత్‌పాల్ సింగ్ పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల మద్దతుదారులు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వారందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
అకాలీదళ్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ మాన్, జైలులో ఉన్న ’వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా ఎనిమిది మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికలో సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రేరణగా మారింది.
సిమ్రన్‌జీత్ ఈసారి కూడా సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి కుశాల్‌పాల్ సింగ్ మాన్, ఫరీద్‌కోట్ నుంచి బల్‌దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్‌పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనీందర్‌పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నాల్ నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి ఖాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment