akali dal
-
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్‌లో అవసానదశలో పడిన అకాలీదళ్‌కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్‌లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్‌నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్‌ను బలహీనపరచటానికి భింద్రన్‌వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్‌కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్‌వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్‌గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్‌ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్‌కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్‌పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
Lok Sabha Election 2024: లోక్‌సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల మద్దతుదారులు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వారందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అకాలీదళ్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ మాన్, జైలులో ఉన్న ’వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా ఎనిమిది మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికలో సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రేరణగా మారింది. సిమ్రన్‌జీత్ ఈసారి కూడా సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి కుశాల్‌పాల్ సింగ్ మాన్, ఫరీద్కోట్ నుంచి బల్దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్‌పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనీందర్పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నాల్ నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి ఖాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. -
రైతుల ఆందోళనలకు ఉద్ధవ్ మద్దతు
సాక్షి, ముంబై: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ప్రకటించినట్లు ఆకాళీదల్ వెల్లడించింది. శిరోమణి ఆకాళీదల్ వర్కింగ్ కమిటీ బృందం ఆదివారం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయింది. ఈ సందర్భంగా రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాళీదల్ నేతలు, ఎంపీ చందు మాజరా తదితరులు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలుకాలని ఉద్దవ్‌ను కోరారు. తొందర్లోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో కూడా భేటీ కానున్నట్లు చందు మాజరా తెలిపారు. చదవండి: (హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!) ఎన్సీపీ మద్దతు: జయంత్ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు మంగళవారం భారత్ బంద్‌లో పాల్గొనాలని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో చర్చలు చేపట్టకపోవడాన్ని ఆయన ఖండించారు. రైతులు, కేంద్రం మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవడంతో సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఎన్సీపీ మద్దతు తెలుపుతోందన్నారు. రైతుల నిరసనలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డిసెంబర్ 9 న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఎన్సీపీ వాకౌట్ చేసిందని జయంత్ గుర్తుచేశారు. 26నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిస్తున్నామని అన్నారు. చదవండి: (రైతుల కోసం ఉరికి కూడా సిద్ధం: తేజస్వీ యాదవ్) -
లిక్కర్ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ
చండీగఢ్ : దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నేటి నుండి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లోని ముక్త్సర్ స్థానిక పరిపాలనా విభాగం అధికారులు లిక్కర్ హోం డెలివరీ విషయాన్ని ప్రజలకు త్వరగా చేరేలా వివిధ మార్గాల ద్వారా తెలపానుకున్నారు. దీనిలో భాగంగా గుడుల్లో వినియోగించే లౌడ్స్పీకర్లలో కూడా లిక్కర్ హోం డెలివరీ చేయనున్నట్టు ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రతిపక్ష అకాళీదళ్ నిప్పులు చెరిగింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన తప్పిదం అంటూ స్థానిక పరిపాలనా విభాగం అధికారులు క్షమాపణలు కోరారు. (మద్యం ఇక హోం డెలివరీ..!) ముక్త్సర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకుని, ఈ ఘటనతో సంబంధం ఉన్న అధికారులపై విచారణకు ఆదేశించాలని అకాళీదళ్ అధికారప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా డిమాండ్ చేశారు. ముక్త్సర్ సాహీబ్ అనేది సిక్కు చరిత్రలోనే అత్యంత గౌరనీయమైన ప్రదేశం అని తెలిపారు. పరిపాలనా విభాగం ఉత్తర్వులు చూస్తుంటే మద్యంతో ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తుందో అర్థం అవుతోందన్నారు. ముక్త్సర్ డిప్యూటీ కమిషనర్ అర్వింద్ కుమార్ ఈ ఘటనపై క్షమాపణలు తెలిపారు. గురుద్వారాల్లోని లౌడ్ స్పీకర్లలో లిక్కర్ హోం డెలివరీ విషయాన్ని ప్రకటించాలని ఉత్తర్వుల్లో తెలపడం బాధాకరమని, ఇది అనుకోకుండా జరిగిన తప్పు అని తెలిపారు. సవరించిన ఉత్తర్వులను తిరిగి విడుదల చేశామన్నారు. మద్యాన్ని నేటి నుంచి హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లిక్కర్ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యమే అందుబాటులో ఉంటుంది. 21 వయసు దాటిన వారికి మద్యం డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. మద్యం షాపుల వద్ద తాకిడిని తగ్గించేందుకే సైట్ ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులు కూడా తెరవనున్నారని, అయితే షాపింగ్ సముదాయాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరవనున్నట్లు పేర్కొన్నారు.(కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు) -
దారుణం : కాల్చి చంపి.. కాళ్లు నరికి..!
చంఢీగడ్ : గురుదాస్‌పూర్ శిరోమణి అకాలీదళ్ యూనిట్ ఉపాధ్యక్షుడు దల్బీర్ సింగ్ (55)ను దారుణ హత్యకు గురయ్యారు. ఓ కూలీ మనిషి విషయంలో ఘర్షణ తలెత్తడంతో పౌల్ట్రీ నిర్వాహకుడు బల్విందర్ సింగ్ (55) మరికొంతమందితో కలిసి దల్బీర్‌సింగ్‌ను కాల్చి చంపారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నిందితులు బల్విందర్ సింగ్ (55), అతని కుమారులు మేజర్ సింగ్ (25), మన్దీప్ సింగ్ (24) తో పాటు మరో ఆరుగురు దల్బీర్ ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. తొలుత దల్బీర్ కుంటుంభ సుభ్యులపైకి డజనుకుపైగాబుల్లెట్లను పేల్లి వాళ్లందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఈక్రమంలోనే దల్బీర్‌ను కాల్చి చంపి.. అతని కాళ్లను ముక్కలుగా నరికివేశారు. కూలీ మనిషి విషయంలో తలెత్తిన గొడవలో మాజీ సర్పంచ్ అయిన దల్బీర్ కలుగజేసుకుని పరిష్కరించాడని.. అయితే, బల్విందర్ మాత్రం.. దల్బీర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశామని బటాలా ఎస్ఎస్పి ఒపింద్రజీత్ సింగ్ ఘుమ్మన్ తెలిపారు. -
అది ఆమె లైఫ్.. అభ్యంతరాలు ఎందుకు?
పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్‌గా మారిన కరణ్‌జీత్ కౌర్ అలియాస్ సన్నీ లియోన్ బయోపిక్ వివాదాస్పదంగా మారింది. కరణ్‌జీత్ కౌర్:ది అన్‌టోల్డ్ స్టోరీ వెబ్‌సిరీస్‌పై మత వర్గాలు మండిపడుతున్నాయి. సన్నీ ఇంటిపేరులోని కౌర్‌ను తొలగించాల్సిందేనంటూ అకాలీ దళ్ పార్టీ పట్టుబడుతుండటం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సన్నీకి భారీ ఎత్తున్న మద్ధతు వచ్చిపడుతోంది. ‘సుఖ్వీందర్ కౌర్.. రాధే మా అయినప్పుడు, గుర్మీత్ సింగ్.. రామ్ రహీమ్ బాబా అయినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదేం?. సన్నీ ఇప్పుడు ఆమె అసలు పేరు వాడుకుంటుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?. అది ఆమె లైఫ్.. నేరం కాదు’ అని ఒకరు, ‘సన్నీని నిందించే ముందు.. హనీ సింగ్(యోయో హనీ సింగ్) సెక్సీ సాంగ్‌ల సంగతి గురించి మాట్లాడండి’ అంటూ ఒకరు... హనీప్రీత్ ఇన్సాన్ లైఫ్, గుర్మీత్‌తో ఆమె లింకులపై అకాళీ దల్ మౌనంగా ఎందుకుంది? అని మరోకరు... రాధేమా-హనీప్రీత్ సింగ్ కంటే సన్నీ ఎంతో బెటర్... ఇలా పలువురు అకాలీ దళ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ, రచ్చ.. రచ్చగా సాగుతోంది. అభ్యంతరం అదొక్కటే... ‘ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె ఇష్టం. ఆమె పోర్న్‌స్టారే కానీ, ఇంకేదైనా కానీ. కానీ, ఒక్కసారి పేరు చివర కౌర్ ను వదిలేసుకున్నాక.. తిరిగి మళ్లీ చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? డబ్బుల కోసమే ఇదంతా. అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పేరు చివర కౌర్ తొలగించాల్సిందే. ఈ వ్యవహారంపై ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు లేఖ కూడా రాశాం. స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అకాలీ దళ్ నేత మాంజీదర్ సిస్రా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా.. మంచి స్పందనే లభించింది. -
టీడీపీ పోతే పోయేదేముంది..
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ భాగస్వామ్య పక్షం అకాలీదళ్ మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంలో కొనసాగలేమని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో అకాలీదళ్ స్పందించింది. టీడీపీ ఎన్డీఏను వీడినా తాము ప్రభుత్వం వెన్నంటి ఉంటామని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించి మళ్లీ తామే తీర్మానం పెడతామని యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్నాం. ఇలాంటి రాజకీయ సంక్షోభాల్ని, ఇబ్బందులను ఎన్నింటినో కలిసి ఎదుర్కొన్నామ’ని అకాలీదళ్ నాయకురాలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ అన్నారు. -
మాజీ గవర్నర్ కన్నుమూత
-
మాజీ గవర్నర్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా (91) చండీగఢ్‌లోని పీజీఐ వైద్యకళాశాల ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పంజాబ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. కొన్నాళ్లు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన ఆయన, 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1977 సంవత్సరంలో లోక్‌సభకు ఎన్నికై, మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు బర్నాలా ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రయత్నించినా, నాటి ఉప ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ కూడా ఆ పదవి ఆశిస్తున్నారని తెలిసి చివరి నిమిషంలో ఆగిపోయారు. తర్వాతి కాలంలో బర్నాలా 2003 జనవరి 3వ తేదీ నుంచి 2004 నవంబర్ 4వ తేదీ వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గాను, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గాను ఆయన సేవలు అందించారు. సీఎం సంతాపం ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బర్నాలా ఏపీకి అందించిన సేవలు మరిచిపోలేనివని ఆయన అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పని చేయడం రాష్ట్రం చేసుకున్న అదృష్టమని చెప్పారు. Saddened by the passing of Surjit Singh Barnala Ji. My condolences to his family, friends and well wishers #RIP — Mamata Banerjee (@MamataOfficial) 14 January 2017 -
'అద్భుతమైన రాష్ట్రాన్ని ఆగం చేశారు'
అమృత్ సర్: డ్రగ్స్ బానిసలు కావచ్చు.. అక్రమ రవాణాదారులు కావచ్చు.. ఏదో ఒకవిధంగా పంజాబ్ లో మాదకద్రవ్యాల ప్రభావం పడని కుటుంబం లేదని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అన్ని రకాలుగా అద్భుతమైన రాష్ట్రాన్ని అధికార అకాలీదల్- బీజేపీలు ఆగం చేశాయని, పంజాబ్ ను డ్రగ్స్ హబ్ గా మార్చేశాయని విమర్శించారు. తనపై దాఖలైన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అమృత్ సర్ వచ్చిన కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అకాలీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. 'పంజాబ్ లోని ప్రతి ఇల్లు డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటోంది. ఎవరైనా దీనిని ఎదిరిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి నోరుమూయిస్తున్నది' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ అక్రమ సరఫరా ముఠాతో పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ కు సంబంధాలున్నాయంటూ కేజ్రీవాల్, పంజాబ్ ఆప్ నేత సంజయ్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలపై పరువునష్టం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం తన ముందు హాజరైన కేజ్రీవాల్, సంజయ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసి, విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఆరు నెలల్లోగా అరెస్టు చేయండి, లేదా.. రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ ముమ్మాటికీ డ్రగ్స్ సరఫరాదారుడేనన్న వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని, అక్రమ కేసులకు బెదరనని కేజ్రీవాల్ అన్నారు. 'బిక్రమ్ సింగ్.. మీరు మరో ఆరు నెలలు అధికారంలో ఉంటారు. ఈలోగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయడండి. లేదంటారా.. ఎన్నికలు అయిపోయిన ఆరు నెలల్లోగా అరెస్టుకు సిద్ధంగా ఉండండి'అని పంజాబ్ రెవెన్యూ మంత్రిని ఉద్దేశించి హెచ్చరించారు. 2017లో జరగనున్న ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీ కూటమికి ఓటమి తప్పదని, ఆప్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి కొత్త పంజాబ్(నయా పంజాబ్)ను సృష్టిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ సందర్భంగా కోర్టు వద్దకు ఆప్, అకాలీదళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. -
పార్టీకి గుడ్ బై.. మంత్రిగా ప్రమాణం
లక్నో: అకాలీదళ్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బల్వంత్ సింగ్ రామ్వాలియా పార్టీకి గుడ్ బై చెప్పి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రిగా చేరారు. అఖిలేష్ యాదవ్ శనివారం తన మంత్రి వర్గాన్ని విస్తరించి కొత్తగా 12 మందిని మంత్రులుగా తీసుకున్నారు. కొత్త మంత్రులు, కేబినెట్ ర్యాంక్ పొందిన వారితో సహా మొత్తం 21 మంది ప్రమాణం చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ కేబినెట్లో భారీ మార్పులు చేశారు. ఇందులో భాగంగా బల్వంత్‌ను కేబినెట్లోకి తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు సుదీర్ఘకాలం బల్వంత్ సింగ్ అనుచరుడిగా కొనసాగారు. -
పోలీసుల చేతిలో అకలీదళ్ నేత హతం
అమృతసర్: పోలీసుల చేతిలో అకాలిదళ్ పార్టీకి చెందిన నేత ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పార్టీ సభ్యులు ఇది ముమ్మాటికి హత్యేనని వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ఒకరు నెంబర్ ప్లేట్ లేని కారులో ప్రయాణీస్తున్నాడని వారికి సమాచారం అందడంతో ఆ మార్గంలో పోలీసులను అప్రమత్తం చేశారు. అమృత్‌సర్‌కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఓ చెక్ పోస్ట్ వద్ద ఆ కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా కారులోపల ఉన్న ఒకరు (ముఖ్జిత్ సింగ్ అలియాస్ మోఖా) కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కారులోని ముఖ్ జిత్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పోలీసులు చెప్పేదంతా కట్టుకథేనని, వారు కావాలనే హత్య చేశారని అకాలిదళ్ నేతలు ఆరోపించారు. అయితే, తాము ఎవరిపై కావాలని దాడి చేయలేదని, తమ అధికారుల్లో ఒకరికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. -
అకాలీలకు దూరంగా బీజేపీ?
పొత్తులకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకున్న సంకేతాలే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో శివసేనతో తెగతెంపులు చేసుకున్న బీజేపీ... ఢిల్లీలోనూ అదే బాటలో పయనించే అవకాశం అధికంగా ఉంది. గత విధానసభ ఎన్నికలలో అకాలీదళ్‌కు నాలుగు సీట్లు కేటాయించిన బీజేపీ ఈసారి అన్ని స్థానాల నుంచి పోటీ చేయొచ్చని అంటున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీ, అకాలీదళ్ మధ్య దూరం నానాటికీ పెరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య సంబంధాలు బెడిసిన సంగతి విదితమే. నరేంద్రమోదీ ప్రభజనం ఊపు మీదున్న కమలదళం ఢిల్లీలో శిరోమణి అకాలీదళ్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత విధానసభ ఎన్నికలలో అకాలీదళ్‌కు నాలుగు సీట్లు కేటాయించిన బీజేపీ ఈసారి అన్ని స్థానాల నుంచి తన అభ్యర్థులను నిలబెట్టవచ్చని అంటున్నారు. సీనియర్ సిక్కు నేత, మాజీ మంత్రి హరిశరణ్సింగ్ బల్లీ కాంగ్రెస్ గూటిని వీడి మళ్లీ బిజెపిలో చేరడం, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గత ఎన్నికలలో గెలిచి విధానసభ స్పీకరైన ఎం.ఎస్. ధీర్‌ను పార్టీలో చేర్చుకోవడం... బీజేపీ సిక్కు ఓటర్లను ఆక ట్టుకునే ప్రయత్నం చేస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. బల్లీ...బీజేపీపీలో చేరడంతో బీజేపీ, అకాలీదళ్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బల్లీ... హరిగనర్ నియోజకవర్గానికి నాలుగుసారు ప్రాతినిధ్యం వహించారు.1993 నుంచి 2013 వరకు హరినగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విధానసభ ఎన్నికల్లో బీజేపీ హరినగర్ సీటును అకాలీదళ్‌కు కేటాయించడంతో ఆగ్రహించిన బల్లీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. హరినగర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జగ్దీప్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన బీజేపీలోకి తిరిగి రావడంతో ఈసారి హరినగర్ సీటును అకాలీదళ్‌కు కేటాయించకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. బల్లీ తన కుమారుడి కోసం హరినగనర్టికెట్ ఆశిసున్నారని అంటున్నారు. అయితే అకాలీదళ్ ఈ సీటును వదులుకోవడానికి సుమఖంగా లేదు. గత విధానసభ ఎన్నికల సమయంలో తనకు కేటాయించిన నాలుగు సీట్లను తనకు ఇవ్వాలని ఆకాలీదళల్ అశిస్తోంది, ధీర్, బల్లీల చేరికతో సిక్కు ఓటర్లను ఆకట్టుకోగలదని బీజేపీ వర్గాలు అంటన్నాయి. బీజేపీ నేతగా బల్లీకి హరినగర్తో పాటు తిలక్‌నగర్, రాజోరీగార్డెన్, వాటి పరిసరప్రాంతాలలో బల్లీ ప్రభావం సిక్కు, పంజాబీ ఓటర్లపై ఉంటుందని అకాలీదళ్ వర్గాలు అంటున్నాయి. -
రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిరసన