పోలీసుల చేతిలో అకలీదళ్ నేత హతం | Akali Dal Leader Shot Dead by Police | Sakshi
Sakshi News home page

పోలీసుల చేతిలో అకలీదళ్ నేత హతం

Published Wed, Jun 17 2015 12:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

పోలీసుల చేతిలో అకలీదళ్ నేత హతం

పోలీసుల చేతిలో అకలీదళ్ నేత హతం

అమృతసర్: పోలీసుల చేతిలో అకాలిదళ్ పార్టీకి చెందిన నేత ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పార్టీ సభ్యులు ఇది ముమ్మాటికి హత్యేనని వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ఒకరు నెంబర్ ప్లేట్ లేని కారులో ప్రయాణీస్తున్నాడని వారికి సమాచారం అందడంతో ఆ మార్గంలో పోలీసులను అప్రమత్తం చేశారు.

అమృత్సర్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఓ చెక్ పోస్ట్ వద్ద ఆ కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా కారులోపల ఉన్న ఒకరు (ముఖ్జిత్ సింగ్ అలియాస్ మోఖా) కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కారులోని ముఖ్ జిత్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పోలీసులు చెప్పేదంతా కట్టుకథేనని, వారు కావాలనే హత్య చేశారని అకాలిదళ్ నేతలు ఆరోపించారు. అయితే, తాము ఎవరిపై కావాలని దాడి చేయలేదని, తమ అధికారుల్లో ఒకరికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement