Amritsar
-
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
అవును.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్‌కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.చెత్త కుప్పలో పడేశారు!‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్‌నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్‌కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం. నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్‌లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. -
వలసదారులతో అమృత్ సర్ కు చేరుకున్న మూడో విమానం
-
వలసదారులపై ట్రంప్ కొరడా
-
భారత్‌కు 116 మంది అక్రమ వలసదారుల రాక.. ఏ రాష్ట్రం వారు ఎక్కువగా ఉన్నారంటే?
అమృత్సర్: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండయింది. రాత్రి 10 గంటలకు రావాల్సిన ఈ విమానం ఆలస్యమైంది. ఈ విమానంలో 119 మంది వలసదారులను పంపుతామని అమెరికా అధికారులు ప్రకటించినా, 116 మంది మాత్రం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా పంజాబ్‌కు చెందిన 65 మంది ఉన్నారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా 18–30 ఏళ్ల మధ్య వారేనని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి మొదటి విడతలో ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రావడం తెలిసిందే. #WATCH | Punjab | The second batch of illegal Indian immigrants who were deported from the US and brought to Amritsar today are now being sent to their respective states. Visuals from outside of the Amritsar airport pic.twitter.com/T3MLtrmAVO— ANI (@ANI) February 15, 2025 -
డిపోర్టేషన్‌కు అమృతసర్నే ఎందుకు?: పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: భారతీయ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం కూడా అమృత్‌సర్‌లోనే ల్యాండవడంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్‌గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. శనివారం రాత్రి అమెరికా నుంచి 119 మంది వలసదారులను తీసుకుని ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైమానిక కేంద్రాలు చాలానే ఉన్నాయని, వలసదారుల విమానాలను అక్కడికి కూడా పంపించ వచ్చని పేర్కొన్నారు. ఇక్కడి వారిని వాటికన్ సిటీకి పంపిస్తామంటే అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. మన వాళ్ల కోసం విమానాలను పంపుతామని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలని సూచించారు. ఇతన దేశాలు ఇలాగే చేస్తున్నాయన్నారు. -
ఆ విమానాలు అమృత్సర్కే ఎందుకు..?
అమృత్సర్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్సర్కే ఎందుకు వస్తున్నాయి. గుజరాత్,హర్యానా, దేశ రాజధాని ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆ విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్మాన్సింగ్ విమర్శించారు.పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్సర్ పంపిస్తోందని మాన్ ఆరోపించారు. శనివారం(ఫిబ్రవరి15) రానున్న మరో విమానంలోని వారికి భగవంత్‌మాన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకుగాను ఆయన ఇప్పటికే అమృత్సర్ చేరుకున్నారు. కాంగ్రెస్ కూడా కేంద్రంపై మాన్ తరహాలోనే ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిదికాదని హితవు పలుకుతోంది. ఆదివారం(ఫిబ్రవరి16) కూడా భారతీయులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి రానుంది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన తొలి విమానంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులు తిరిగి వచ్చారు. తొలి విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది. -
భారత్ చేరుకున్న 104 మంది అక్రమ వలసదారులు
-
అక్రమ వలసదారులతో భారత్‌లో దిగిన తొలి విమానం
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు విమానంలో 205 మంది లేరు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీళ్లతో పాటు అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం. భారత్ ఇప్పుడు వీళ్లనేం నేరస్థులుగా చూడదు. అయితే.. వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని చెబుతున్నారు.గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి వాళ్ల వాళ్ల దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్(Trump) ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి బ్యాచ్ కింద.. వీళ్లను అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. వీళ్లలో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో భారత అక్రమ వలసదారులు(Indian Illegal Immigrants).. ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే!. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ట్రంప్ ఈ చర్యను భారత్ గతంలోనే స్వాగతించింది. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో ఏమూల ఉన్నా అక్రమ వలసదారులను తాము వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Sankar) స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వకుండా.. ఇలా వెనక్కి పంపించేయడం సరికాదని అంటున్నారాయన. ఈ విషయంపై జై శంకర్‌తో ఆయన చర్చించనున్నట్లు తెలిపారు. -
పంజాబ్‌లో పేలుడు కలకలం
అమృత్సర్: పంజాబ్‌లో పేలుడు కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని ఇస్తామాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఈ నెల 4న అమృత్‌సర్‌లోని మజితా పోలీస్స్టేషన్లోనూ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. పోలీస్ స్టేషన్ గేటు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు.. భద్రతను పెంచారు.Reportedly, a blast was heard in the early hours of Tuesday near the Islamabad police station in Amritsar. However, the police have yet to provide an official statement on the incident. pic.twitter.com/1tzYeyjidG— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) December 17, 2024 -
మూడో రోజుకు చేరిన సుఖ్బీర్ ప్రాయశ్చిత్త దీక్ష
చండీగఢ్: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో బయటపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రాయశ్చిత్త దీక్షను వరుసగా మూడో రోజు యథాతథంగా కొనసాగించారు. ఆయన గురువారం రూప్‌నగర్ జిల్లాలోని తఖ్త్ శ్రీకేస్‌గఢ్ సాహిబ్ గురుద్వారా బయట కాపలాదారుడిగా(సేవాదార్) విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన సుఖ్బీర్సింగ్ ఉదయం 9 గంటలకు చక్రాల కురీ్చలో గురుద్వారాకు చేరుకున్నారు. కాపలాదారుడి దుస్తులు ధరించి, చేతిలో ఈటెతో విధుల్లో చేరారు. తర్వాత కొంతసేపు సిక్కు కీర్తనలు విన్నారు. ఇక్కడి వంటశాలలో పాత్రలు శుభ్రంచేశారు. సుఖ్బీర్ సింగ్‌తో ఆయన భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుమారుడు అనంత్బీర్ సింగ్ బాదల్, కుమార్తెలు హర్కీరత్కౌర్ బాదల్, గుర్లీన్ కౌర్ బాదల్ సైతం వంటశాలలో సేవలందించారు. 2007 నుంచి 2017 దాకా పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా సిక్కు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ సుఖ్బీర్ సింగ్‌కు మతపరమైన శిక్ష విధించిన సంగతి తెలిసిందే. స్వర్ణ దేవాలయంలోపాటు మొత్తం ఐదు గురుద్వారాల్లో రెండు రోజుల చొప్పున పది రోజులపాటు సేవాదారుడిగా పనిచేయాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. స్వర్ణ దేవాలయంలో రెండో రోజు బుధవారం ప్రాయశ్చిత్త దీక్షల ఉండగా సుఖ్బీర్ సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది నారాయన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. -
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో.. దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
పంజాబ్ స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం
-
మరోమారు తెరపైకి అమృత్సర్..
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగిన దాడిలో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి తర్వాత గోల్డెన్ టెంపుల్ భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే పలువురు స్వర్ణదేవాలయ ఘన చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.తాజ్‌మహల్ తరువాత..భారతదేశంలోని పంజాబ్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకునివున్న నగరం అమృత్సర్. దీనిని సిక్కులు అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. టూరిజం డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం.. యూపీలోని తాజ్‌మహల్ తర్వాత పర్యాటకులు అమితంగా ఇష్టపడే నగరం అమృత్సర్. ఇక్కడి గోల్డెన్ టెంపుల్ కారణంగా అమృత్సర్ పేరు అగ్రస్థానంలో నిలిచింది. గోల్డెన్ టెంపుల్‌ను స్వర్ణదేవాలయం అని కూడా అంటారు.రామాయణ కాలంలో..ఇప్పడు అమృతసర్ ఉంటున్న ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదట. శ్రీరాముని కుమారులు లువుడు, కుశుడు ఇక్కడే బస చేశారట. వాల్మీకి ఆశ్రమం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని రామతీర్థంగా కూడా పిలుస్తారు.గురు నానక్ దేవ్ ముచ్చటపడి..సిక్కుల గురువు గురు నానక్ దేవ్ ఈ ప్రదేశంలోని అందానికి ముచ్చటపడి, ఇక్కడి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారట. దీని ఆనవాలు ఇప్పుటికీ కనిపిస్తుంది. అమృత్‌సర్‌కు సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. సిక్కుల నాల్గవ గురువు గురు రాందాస్ 1564ఏడీలో ఈ నగరానికి పునాది వేశారని చెబుతారు. నాడు అతని పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని రాందాస్పూర్ అని పిలిచేవారట. ఆ తర్వాత క్రీ.శ.1577లో ఇక్కడ గురుద్వారా నిర్మాణానికి హరిమందర్ సాహిబ్‌కు పునాది వేశారు. ఈ గురుద్వారాలో ఒక సరస్సు కూడా నిర్మితమయ్యింది. ఈ గురుద్వారా నిర్మాణంతో అమృత్సర్ నగరం సిక్కు మతస్తులకు కేంద్రంగా మారింది.బ్రిటిష్ పాలకుల అరాచకం1849లో అమృత్సర్ను బ్రిటిష్ పాలకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమృత్సర్ చరిత్రలో జలియన్‌వాలాబాగ్ మారణకాండను అత్యంత బాధాకరమైన సంఘటనగా చెబుతారు. 1919, ఏప్రిల్ 13న ఈ ప్రాంతంలో సమావేశమైన వందలాది మంది నిరాయుధులపై బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వెయ్యమంది మృతి చెందారు. ఇక్కడి పార్కు గోడలపై నేటికీ అప్పటి ఆనవాళ్లు కనిపిస్తాయి. అమృత్సర్ నగరంలో జరిగిన ఈ ఘటన చరిత్రలోనే అత్యంత బాధాకరమైన ఉదంతంగా చెబుతారు. ఇదిలావుండగా అమృత్‌సర్‌లో హోలా మొహల్లా, లోహ్రీ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అమృత్‌సర్‌లో ని గోల్డెన్ టెంపుల్, దుర్గా టెంపుల్, వాఘా సరిహద్దు, జలియన్‌వాలా బాగ్, గోవింద్ఘర్ కోట, విభజన మ్యూజియంలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
ఒంటరిగా ముగ్గురు దొంగలను ఎదుర్కొన్న మహిళ.. చివరికి ఏమైందంటే!
ఓ మహిళా తన ఇంట్లోకి దొంగలు రాకుండా నిలువరించింది. ముగ్గురు వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొని.. వారితో పోరాడింది. దొంగల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకుంది. చివరికి దొంగలు చేసేందేంలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో వెలుగుచూసింది. మన్దీప్ కౌర్ అనే మహిళ తన భర్త జగ్గీత్సింగ్, పిల్లలతో నివసిస్తుంది. సోమవారం సాయంత్రం మన్దీప్ కౌర్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దొంగతనం చేసేందుకు వచ్చారు.మెల్లమెల్లగా దొంగలు ఆమె ఇంటి వైపు రావడం గమనించింది. వెంటనే లోపలికి వెళ్లి తలుపుకు తాళం వేయడానికి పరుగెత్తింది. అయితే దొంగలు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్‌ను గట్టిగా నెట్టడం ప్రారంభించారు. కానీ కౌర్ తన శక్తితో వారు లోపలికి రాకుండా అడ్డుకుంది. చివరికి డోర్‌కు తాళం వేసి.. పక్కన ఉన్న సోఫాను తలుపుకు అడ్డంగా పెట్టింది.ఈ దృశ్యాలు అన్నీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మహిళ దొంగలను ధైర్యవంతంగా ఎదుర్కోవడం, డోర్ పెట్టి, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగట్టిగా అరుస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. దొంగలు వెళ్లిపోయారో లేదో కిటికీ ద్వారా చూస్తూ ఎవరికో ఫోన్ కూడా చేసింది. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక.. ఆమె కొడుకు, కూతురు అటు ఇటు కంగారుగా చూడటం కనిపిస్తుంది. చివరికి దొంగలు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सीसीटीवी में कैद हुई मनप्रीत की बहादुरी, तीन चोरों को अकेले ही घर में घुसने से रोका पंजाब के अमृतसर जिले के वेरका इलाके की महिला मनप्रीत की बहादुरी की चर्चा सोशल मीडिया पर सभी कर रहे हैं। मनप्रीत ने अकेले अपने साहस के दम पर तीन चोरों को अपने घर में घुसने से रोक दिया। pic.twitter.com/YKXFgOVDZ0— Sharad Kumar Tripathi (@officesharad) October 2, 2024 మహిళా ధైర్య సాహాసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ఏకే సోహి తెలిపారు. జగ్గీత్ సింగ్ నగల వ్యాపారి కాగా..దొంగలు వారి ఇంటిని టార్గెట్ చేయడానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
పఠాన్‌కోట్: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్సర్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్‌కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దుల్లోని మమూన్ కాంట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్‌సర్‌కు వెళుతోంది. -
Amritsar: భార్య, పిల్లల ఎదుటే ఎన్నారైపై కాల్పులు..
అమృత్సర్: అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారైపై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. డబుర్జి ప్రాంతంలోని అతని నివాసంలో శనివారం .. భార్య పిల్లల ఎదుటే కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల రోజుల క్రితం సొంతూరైన అమృత్‌సర్‌లోని డబుర్జి గ్రామానికి వచ్చాడు. హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. లోనికి చొరబడి తుపాకీతో బెదిరించి అతడితో వాగ్వాదానికి దిగారు.ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి తల్లి ఏమీ చేయవద్దని వారిని ప్రాథేయపడ్డారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.రెంబు బెల్లెట్లు తగిలి తీవ్రంగా గాయమవ్వడంతో సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలసీఉలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగులు కాల్పులు జరపడం ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్రస్తుతం సుఖ్‌చైన్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
అమృత్సర్: రైల్లో మంటలు.. ప్రయాణికుల హహాకారాలు
పంజాబ్‌లోని అమృత్సర్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో అమృత్సర్-హౌరా మెయిల్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలు చెలరేగాయని తెలియగానే కొందరు ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగిపోయారు.ఈ నేపధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలికి కాలికి గాయమైంది. దీంతో అధికారులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగిన కంపార్ట్మెంట్ను రైలు నుంచి వేరు చేశాక, మిగిలిన రైలును అధికారులు గమ్యస్థానానికి తరలించారు. కాగా ఇటీవల మధ్యప్రదేశ్‌లోని విదిశాలో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. వెంటనే భద్రతా సిబ్బంది రైలును ఆపి, మంటలను అదుపులోకి తెచ్చారు. -
మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్ చేసిన బీజేపీ నేత
దేశంలోని కొందరు యువతీయువకులు మత్తుకు బానిసలుగా మారి తమ కెరియర్ను నాశనం చేసుకోవడమే కాకుండా, తల్లిదండ్రులను కష్టాలపాలు చేస్తున్నారు. మత్తుపదార్థాల తీసుకోవడం వలన జరిగే హాని గురించి అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితం కనిపించడంలేదు. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మద్యం మత్తులో రాత్రివేళ రోడ్డుపై జోగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో అమృత్‌సర్‌లోని మోహక్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో మత్తుమందులను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను నివారించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మంజీందర్ సింగ్ షేర్ చేసిన వీడియోలో రాత్రివేళ రోడ్డుపై ఒక యువతి మద్యం మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేక పోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రాష్ట్రాన్ని మత్తుమందుల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మాటనే విస్మరించిందని సుజీందర్ సింగ్ ఆరోపించారు. This late night video of Amritsar of a young girl high under Drugs shows the failure of @AAPPunjab Govt! What have you done to Punjab, CM @bhagwantmann Ji?You came to power promising elimination of drugs in 3 months but now your own party people are involved in this!Drug… pic.twitter.com/QdIADuRsZS— Manjinder Singh Sirsa (@mssirsa) June 24, 2024 -
IIM విద్యార్థుల పడుకొని నిరసన
-
Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
అమృత్సర్: మోదీ సర్కార్ హయాంలో దేశపరిస్థితులు రష్యాను తలపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘‘ భారత్‌లో కొనసాగుతున్న ఈ నియంతృత్వ పాలనకు ఇంక ఎంతమాత్రం ఆమోదించేదిలేదు. గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇలా పనిగట్టుకుని విపక్షనేతలను జైల్లో పడేయడం ఎన్నడూ చూడలేదు. రష్యాలో అయితే కీలక విపక్షనేతలందర్నీ జైలుకు పంపేసి, కొందర్ని చంపేసి పుతిన్ దేశాధ్యక్ష ఎన్నికలు జరిపి 87 శాతం ఓట్లు గుప్పిట బిగించారు. ఎన్నికల్లో విపక్షాలు లేకపోవడంతో ఓట్లు పొందడానికి నువ్వు ఒక్కడివే మిగులుతావు’’ అని మోదీనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘ వాళ్లు(బీజేపీ) నన్ను, ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైల్లో పడేశారు. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మంత్రులను జైలుకు పంపారు. విపక్ష నేతలను చెరసాలలో వేశాక ఒకే పార్టీ, ఒక్కడే అగ్రనేత సాధ్యం. అప్పుడు ప్రజాస్వామ్యం అసాధ్యం. ఇది జరక్కుండా మనం ఆపాలి’’ అని అన్నారు. ‘ నేను జైలు గదిలో ఉన్నపుడు గదిలో రెండు సీసీటీవీ కెమెరాలతో 13 మంది అధికారులు అనుక్షణం గమనించేవారు. ఒక ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్లేది. అక్కడ రెండు టీవీల్లో గమనించేవారు. నన్ను ఎలాగైనా అణచేస్తామని విశ్వప్రయత్నం చేశారు. అరెస్ట్‌తో అంతా అయిపో తుందని, పార్టీ ముక్కలు చెక్కలై ప్రభుత్వం కూలు తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆప్ ఒక కుటుంబం. కుటుంబానికి ఏదైనా కష్టమొస్తే కుటుంబసభ్యులంతా ఏకమై పోరాడతారు. నా అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కేజ్రీవాల్‌గా మారి పోరాడారు’’ అని అన్నారు.నన్ను నిరుత్సాహపరచకండి‘‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జైలులో ఎవరినైనా కలవడానికి వస్తే గదిలో మాట్లాడే ఏర్పాటుచేయాలని జైలు నియమావళిలో ఉంది. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వచ్చినపుడు ఒక గదిలో జైలు సూపరింటెండెంట్ భేటీ ఏర్పాట్లుచేయలేదు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్తానాలను గెల్చుకునేలా ఆప్ నేతలు కష్టపడాలి. జూన్ రెండో తేదీన జైలుకెళ్తా. జూన్ 4 నాటి ఫలితాలను అక్కడి టీవీలో చూస్తా. టీవీలో ‘పంజాబ్‌లో అన్ని సీట్లు ఆప్ గెలిచింది’ అనే వార్త కోసం ఎదురుచూస్తుంటా. నన్ను నిరుత్సాహ పరచకండి’’ అని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. -
బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నిరసన సెగ.. ఆయన ఏమన్నారంటే?
ఛంఢీగడ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ పంజాబ్‌లోని అమృత్సర్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమృత్సర్ జిల్లాలో చేపట్టిన రోడ్డు షోను రైతులు అడ్డుకున్నారు. గంగోమహాల్, కొల్లామహల్ గ్రామాల మధ్య చేపట్టిన రోడ్డు షోలో ఆయన రైతుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు. దారికి ఇరువైపుల పెద్దసంఖ్యలో చేరి.. ఆయన కాన్వాయ్ అడ్డుకొని నల్లజెండాలు ప్రదర్శిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పంజాబ్‌లోని పలు గ్రామాల రైతులు కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘మళ్లీ అధికారంలో రావాలని బీజేపీ చేస్తోంది. అందుకే ప్రచారం మొదలుపెట్టింది. కానీ మేము ఎట్టిపరిస్థితుల్లో మా గ్రామాల్లో వారు (బీజేపీ నేతలు) ప్రచారం చేసకోవటానికి అనుమతించబోం. వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని నిరసన తెలిపిన రైతులు తెలిపారు. తరంజిత్ సింగ్ మార్చి 20న బీజేపీలోచేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీలో చేరిన పదిరోజులకు బీజేపీ అమృత్సర్ టికెట్ కేటాయించింది. రైతులు చేసిన నిరసనపై బీజేపీ ఎంపీ అభ్యర్తి తరంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యం ప్రతిఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తపరచడాన్ని అనుమతిస్తుంది. అదేవిధంగా నిరసన వ్యక్తం చేయటాన్ని కూడా అనుతిస్తుంది. నన్ను ఎన్నికల కోసం ప్రచారం చేయటానికి కూడా అనుమతిస్తుంది. అయితే మేము రైతు ఆదాయం పెంచేలా ప్రణాళికలు రచిస్తాం’ అని తరంజిత్ అన్నారు. ఇటీవల నార్త్‌వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ గాయకుడు హన్స్ రాజ్ హాన్స్ కూడా రైతుల నిరసనను ఎదుర్కొన్నారు. ఆయనకు మరోసారి బీజేపీ టికేట్ ఇచ్చింది. అయితే ఈసారి ఆయన్ను ఫరిద్కోట్ నుంచి బరిలోకి దించింది. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
Amritsar Holi Photos: రంగుల్లో మునిగి తేలిన అమృత్సర్.. విశేషం ఏంటంటే? (ఫోటోలు)
-
నిర్మాతను పెళ్లాడిన ప్రముఖ నటి.. ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ!
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఏడాదిని వివాహాల సంవత్సరంగా పేరు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు చాలామంది పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడగా.. త్వరలోనే కృతి కర్బందా, మీరా చోప్రా కూడా వెడ్డింగ్‌కు సిద్ధమయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. నిర్మాతను పెళ్లాడిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ నటి సుఖ్మణి సదానా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సన్నీ గిల్‌ను మార్చి 3, 2024 పెళ్లాడారు. అమృత్‌సర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు మూడూ రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లయిన విషయాన్ని కాస్తా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ. తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితంలో అత్యంత అందమైన రోజు ఇది.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ నటి పోస్ట్ చేసింది. కాగా.. సుఖ్మణి సదానా సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో నటించింది. అంతే కాకుండా జోగి, రాకెట్రీ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. వీటితో పాటు తాండవ్, ఉడాన్ పటోలాస్, తనవ్, మన్మర్జియాన్ లాంటి షోలలో కూడా కనిపించారు. View this post on Instagram A post shared by Sukhmani Sadana (@sukhmanisadana) -
హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్‌కు చేరుకుంటుంది. గ్వాలియర్‌కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
గురపత్వంత్ సింగ్‌కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్‌లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్‌నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్‌పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్ -
టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్
అమృత్సర్ పేరు వినబడగానే ‘స్వర్ణ దేవాలయం’ గుర్తుకు వస్తుంది. ఈ పవిత్ర నగరంలో ఒక విశేషమైన టీ స్టాల్ ఉంది. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అనే ఈ టీ స్టాల్లో టీ ఉచితంగా ఇస్తారు. ఎనభై సంవత్సరాల అజిత్‌సింగ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద చెట్టు ఊడల మధ్య ఈ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. అజిత్‌సింగ్‌ను అందరూ ‘బాబాజీ’ అని పిలుస్తారు. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎప్పుడైనా ఉచితంగా టీ తాగవచ్చు. గతంలో ఈ టీస్టాల్‌లోని వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. అయినప్పటికీ బాబాజీ ఉచిత టీ ఇవ్వడం ఆపలేదు. -
'టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్' వృద్ధుని దుకాణంపై ఆనంద్ మహీంద్ర పోస్ట్..
'టీ ' అంటే మనందరికీ ఇష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగకుండా ఇంకే పని మొదలుపెట్టము. పనిలో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఓ కప్ టీ తాగి మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభిస్తాము. అందుకే ఏ సందులో చూసినా టీ షాప్ ఉంటుంది. ఇది ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. అయితే.. తాజాగా అమృత్‌సర్‌లో ఓ వృద్ధుడు కొనసాగిస్తున్న టీ షాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 45 ఏళ్లుగా వృద్దుడు ఓ మర్రి చెట్టు మొదలులో టీ షాప్‌ని నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. 'అమృత్‌సర్‌లో చాలా ప్రదేశాలు చూశాను. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ టీ షాప్‌ని ఎప్పుడూ చూడలేదు. ఈ సారి అమృత్సర్ వెళ్లినప్పుడు ఈ దుకాణాన్ని తప్పుకుండా చూస్తాను. గత 40 ఏళ్లుగా ఓ వృద్ధుడు నడిపిస్తున్న టీ షాప్‌ని 'టెంపుల్ ఆప్ టీ సర్వీస్' గా పేర్కొంటూ' ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆలోచిస్తే మన హృదయమే దేవాలయం అని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. There are many sights to see in Amritsar. But the next time I visit the city, apart from visiting the Golden Temple, I will make it a point to visit this ‘Temple of Tea Service’ that Baba has apparently run for over 40 years. Our hearts are potentially the largest temples.… pic.twitter.com/Td3QvpAqyl — anand mahindra (@anandmahindra) July 23, 2023 ఈ వీడియోలో 80 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడు ఓ భారీ వృక్షం సందులో టీ షాప్‌ని నిర్వహిస్తున్నాడు. గత 45 ఏళ్ల నుంచి తను ఒకటే పనిని కొనసాగిస్తున్నారు. అందరూ అతన్ని బాబాగా పిలుస్తారు. స్థానికంగా అతనంటే తెలియని వారుండరు. ఈ టీ విక్రయదారునికి పని పట్ల ఉన్న నిబద్ధత, విధేయత, ఆసక్తి నెటిజన్లను ఆకర్షించింది. Amidst the timeless charm of Amritsar, under the embracing canopy of a majestic tree, a venerable man gracefully serves the elixir of Indian Tea. With every cup poured, he weaves a tapestry of tradition, warmth, and hospitality, earning the title of the "Temple of Tea Service 😊 — Rahul Verulkar (@verulkar_rahul) July 23, 2023 The city has a lot of magnetic qualities. Truly Golden city.....City with the legendary Golden temple and seems to have lovable human beings like Babaji too 😍👏🥳🙏..... — Sunil Balachandran (@Sunil_bchandran) July 23, 2023 ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ -
మనసున్న పోలీసాయన.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక కుక్క తల కారు బంపర్‌లో ఇరుక్కుపోవడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. దానిని రెస్క్యూ చేసేందుకు అమృత్సర్ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. అతను ఆ కుక్క తలను కారు బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 8 వేలకుపైగా నెటిజన్లు చూశారు. చాలామంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ, పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను అమృత్సర్ పోలీస్ కమిషనర్ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘ఇది హదయానికి హత్తుకునే పని. ఒక కుక్క తల.. కారు బంపర్‌లో ఇరుక్కుపోయింది. అమృత్సర్ పోలీసు అధికారి ఒకరు దానిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అతను ఎంతో నేర్పుగా, సురక్షితంగా దాని తలను బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ నేపధ్యంలో ఆ కుక్కకు ఎటువంటి గాయం కాలేదని’ రాశారు. A heartwarming act of compassion! 🙌🚓 In a touching incident, a dog got trapped in a car bumper, Amritsar police official came to the rescue. With great care and skill, safely freed the dog, ensuring its well-being.🐾#LetsBringTheChange #LoveForAnimals pic.twitter.com/HylTFNHu8e — Commissioner of Police Amritsar (@cpamritsar) June 28, 2023 పోలీసు అధికారి మెచ్చుకుంటున్న జనం.. ఈ వీడియోను చూసి కామెంట్ చేస్తున్న నెటిజన్లు కుక్కను కాపాడేందుకు ఆ అధికారి వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్ ‘ఈ పని వారి యూనిఫారంనకు మరింత గౌరవాన్నిస్తుంది. భగవంతుడు ఆ అధికారిని.. ఇటువంటి గొప్ప పనిచేసినందుకు ఆశీర్వదిస్తాడు’ అని రాశారు. కొందరు యూజర్స్ జంతుప్రేమ గురించి ప్రస్తావించారు. మరో యూజర్ ‘అన్ని ప్రాణుల విషయంలోనూ సానుభూతితో మెలగాలని అన్ని ధర్మాలు చెబుతున్నాయి. అదే మానవత్వమని పేర్కొంటున్నాయి’ అని రాశారు. ఇది కూడా చూడండి: పర్ఫెక్ట్ టైమింగ్:కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా! -
జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీనగర్: జమ్ములో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని, వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన మరో డజను మందికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే.. బస్సు అమృత్సర్ నుంచి కాత్రాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. #WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries. Visuals from the spot. pic.twitter.com/iSse58ovos — ANI (@ANI) May 30, 2023 CRPF, Police and other teams are also here. Ambulances were called & the injured were immediately rushed to hospital. Bodies have also been taken to the hospital. A crane is being brought here to see if someone is trapped under the bus. A rescue operation is underway. We are… pic.twitter.com/0H5FiJ2eQe — ANI (@ANI) May 30, 2023 ఇదీ చదవండి: కరెంట్ పోల్ నిలబెడుతుండగా.. షాక్ తగిలి ఎనిమిది మంది..! -
విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు
అమృత్సర్: అంతర్జాతీయ విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన ఘటన మరోటి వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం.. శనివారం షార్జా నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరిన ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమానంలో పంజాబ్‌లోని కోట్లీ గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ ప్రయాణిస్తున్నారు. విమానంలో తప్పతాగాక అతను విమాన మహిళా సిబ్బంది(ఎయిర్ హోస్ట్) ఒకరితో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఆమెను లైంగికంగా వేధించాడు. గొడవను గమనించిన తోటి విమాన సిబ్బంది వెంటనే అమృత్‌సర్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే రాజీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. భారత శిక్షాస్మృతిలోని 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చదవండి: కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన -
స్వర్ణ దేవాలయం సమీపంలో మరో పేలుడు.. స్థానికుల భయభ్రాంతులు..
చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు ఘటన జరిగింది. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెరిటేజ్ స్ట్రీట్‌లో భారీ శబ్దంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు. శనివారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే ప్రాంతంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించారు. Punjab | Bomb Squad and FSL team at the spot after a suspected bomb explosion was reported near Golden Temple in Amritsar https://t.co/EBubbzqAFU pic.twitter.com/yx0dROANqw — ANI (@ANI) May 8, 2023 ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇది ఐఈడీ పేలుడు కాదని స్పష్టతనిచ్చారు. తక్కువ తీవ్రతగల పేలడు అని పేర్కొన్నారు. అయితే పేలుళ్లకు గల కారణాలు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని మాత్రం తెలిపారు. శనివారం జరిగిన ఘటనలో పేలుడు పదార్థాలతో పాటు మెటల్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు. రెస్టారెంట్‌లోని చిమ్నీలో ఈ పేలుడు జరిగింది. ఈ ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలు గాయపడ్డారు. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు
చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అమ్మాయులు గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు. Video: Several injured in blast near #Amritsar's Golden Temple https://t.co/GWEtgJ37sH pic.twitter.com/XwLJxvg1T0 — TOIChandigarh (@TOIChandigarh) May 7, 2023 ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు స్వల్పగాయాలయ్యాయని ఓ స్థానికుడు తెలిపాడు. చదవండి: బైక్‌లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్ -
రణరంగంగా అమృత్సర్! బారికేడ్లు తోసుకుని
ఛండీగఢ్: చారిత్రక నగరం అమృత్సర్.. ఇవాళ(గురువారం) రణరంగాన్ని తలపించింది. వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఓ మతబోధకుడి వ్యక్తిగత అనుచరుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. మద్దతుదారులు బారికేడ్లు తొలగించి మరీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. భారీగా బల ప్రదర్శనతో అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్. ఆయన ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్‌ను ఖండిస్తూ గ్రూప్‌కు చెందిన వందలాది మంది మద్దతుదారులు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్‌ను దాటి వెళ్లారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను బలవంతంగా తొలగించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆరోపించాడు. ఒక్క గంటలో కేసును వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించాడు. తామేమీ చేయలేమని అధికారులు, పోలీసులు భావిస్తున్నారిన, కానీ, తామేంటో చూపించేందుకే ఈ బలప్రదర్శన చేపట్టినట్లు చెప్పాడు. మరోవైపు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. వారిస్ పంజాబ్ దే గ్రూప్‌నకు చెందిన నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. #WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO — ANI (@ANI) February 23, 2023 -
సరిహద్దులో డ్రగ్స్ డ్రోన్ కూల్చివేత
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మాదకద్రవ్యాల డ్రోన్‌ను కూల్చివేశారు. బీఎస్ఎఫ్ సిబ్బంది, పంజాబ్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. కక్కార్ గ్రామంలో 6 రెక్కలున్న డ్రోన్ ఎగురుతున్నట్లుగా గుర్తించామని, వెంటనే ఏకే–47 నుంచి 12 రౌండ్లు కాల్పులు జరిపి కూల్చివేశామని, ఇందులో 5 కిలోల హెరాయిన్ లభ్యమైందని అధికారులు ఆదివారం వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందన్నారు. డ్రోన్‌కు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ ధర వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొమ్మిది మంది ప్రయాణానికి టిక్కెట్ ధర వింటే షాక్ అవుతారు. నెటిజన్లు కూడా ఈ టిక్కెట్‌ని చూసి ఫిదా అవుతూ.. తెగ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..పాకిస్తాన్ నుంచి భారత్‌కు వెళ్లే ఓ పాత టిక్కెట్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఇది 1947 ఏళ్ల నాటి టిక్కెట్. అంటే దాదాపు 76 ఏళ్ల క్రితం నాటిది. ఈ టిక్కెట్ చూస్తే ఒక కుటుంబం పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి అమృత్సర్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ టిక్కెట్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17, 1947లో సుమారు తొమ్మిది మంది రావల్పండి నుంచి అమృత్సర్ వెళ్లేందుకు కొనుగోలు చేసిన టిక్కెట్ అది. ఆ టిక్కెట్ ధర సరిగ్గా 36 రూపాయాల తొమ్మిది అణాలు. బహుశా ఆ కుటుంబం భారత్‌కి వలస వచ్చింది కాబోలు. ఐతే నెటిజన్లను మాత్రం ఈ టిక్కెట్ బాగా ఆకర్షించింది. గతం తాలుకా జ్ఞాపకం అని "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ మెచ్చుకుంటున్నారు. అదీగాక 76 ఏళ్ల క్రితం నాటి టిక్కెట్ చెక్కు చెదరకుండా ఉండటం చాలా గ్రేట్ అంటు పొగడ్తల జల్లు కురిపించారు. మరోక నెటిజన్ తన వద్ద 1949లో కొన్న ఉషా కుట్టు మిషన్ రసీదు నా వద్ద ఇంకా చెక్కు చెదరకుండా ఉందని చెబుతున్నాడు. అంతేగాదు ఈ టిక్కెట్ ధర ఆ సమయంలో ఖరీదైనదేనదేనని, ఎందుకంటే ఆరోజుల్లో సగటే లేబర్ చార్జీలు 15 పైసలు మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఈ టిక్కెట్ ఖరీదు ప్రకారం పాక్‌లోని రావల్పిండి నుంచి అమృత్‌సర్‌కి ఒక్కో వ్యక్తికి రూ. 4 అంటే అత్యంత ఖరీదేనని తేల్చేశారు నెటిజన్లు. (చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!) -
ఎరక్కపోయి ఇరుక్కున్నారుగా!.. సినిమాను తలపించే సీన్
చండీగఢ్: ఆయుధాలతో హల్చల్ చేస్తున్న క్రిమినల్స్‌కు పోలీసులు ఎదురుపడ్డారు. ఇరువురి ఎస్యూవీ వాహనాలు ఎదురుపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. పోలీసులను గమనించిన క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు.ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సంఘటనలో క్రిమినల్ రికార్డ్ ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. క్రిమినల్స్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు బయలుదేరారు. అమృత్‌సర్‌లోని ఓ మార్కెట్లోని ఇరుకు రోడ్డులో ఇరువురి వాహనాలు ఎదురుపడ్డాయి. పోలీసులను గమనించిన వెనుక సీటులోని వ్యక్తి ముందుగా దిగి పరారయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ సైతం పరుగులు పెట్టాడు. వారిని పట్టుకునేందుకు సుమారు ఆరుగురు పోలీసులు ఛేజ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఓ అధికారి తిరిగి వచ్చి వాహనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని తనిఖీ చేశారు. ఛేజింగ్ తర్వాత వివరాలు వెల్లడించారు పోలీసులు. ఇద్దరు క్రిమినల్స్ రవి, రాబిన్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ‘ఇరువురిపై 5-6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారి నుంచి 5 ఆయుధాలు, లైవ్ క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాం. తదుపరి విచారణ చేపట్టాం.’ అని అమృత్సర్ పోలీసు కమిషనర్ జస్కరన్ సింగ్ తెలిపారు. #WATCH | Punjab Police arrested two criminals in Amritsar and recovered 5 weapons and live cartridges from them. (CCTV footage confirmed by police) pic.twitter.com/vqo1czNWHR — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. కమల్‌నాథ్ వీడియో వైరల్ -
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
Earthquake: పంజాబ్‌లో భూకంపం
న్యూఢిల్లీ: ఉత్తర భారతం మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. పంజాబ్‌లో సోమవారం వేకువ ఝామున భూమి కంపించింది. కొన్నిసెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అమృత్సర్ సమీపంలో రాత్రి 3గం.42నిమిషాల ప్రాంతంలో 120 కిలోమీటర్ల భూకేంద్రంగా భూమి కంపించిందని తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. రాత్రంతా రోడ్ల మీద జాగం చేశారు. ఇదిలా ఉంటే.. గత వారంలో ఇలా ఉత్తర భారతాన్ని భూమి వణికించడం ఇది మూడోసారి. Earthquake of Magnitude:4.1, Occurred on 14-11-2022, 03:42:27 IST, Lat: 31.95 & Long: 73.38, Depth: 120 Km ,Location: 145km WNW of Amritsar, Punjab, India for more information Download the BhooKamp App https://t.co/xlln0b95oC@Indiametdept @ndmaindia pic.twitter.com/WvOa72HgIo — National Center for Seismology (@NCS_Earthquake) November 13, 2022 తాజాగా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బుధ, శనివారాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్ భూకంప ప్రభావంతో(6.3 తీవ్రత) నవంబర్ 9న ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఇంకా పలు చోట్ల భూమి కంపించగా.. నవంబర్ 12వ తేదీన నేపాల్ భూకంప ప్రభావం(5.4 తీవ్రత) మరోసారి ఉత్తర భారతంలో చూపించింది. అయితే తక్కువ తీవ్రతతో నమోదు అవుతున్న వరుస ప్రకంపనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. -
శివసేన నేత దారుణ హత్య.. నిందితుడి కారులో కమెడియన్ ఫోటో!
పంజాబ్‌కు చెందిన శివనేత నేత సుధీర్ సూరి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సుధీర్‌ను కాల్చి చంపిన నిందితుడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సందీప్ సింగ్ అలియాస్ సన్నీగా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బట్టల దుకాణం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సందీప్ తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక అతని కారులో బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణిందర్జీత్ సింగ్ బిట్టా ఫోటోలు లభించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. కాగా అమృత్సర్ నగరంలోని గోపాల్ దేవాలయం ఎదుట నిరసన చేస్తున్న శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే శివసేన నేత సుధీర్ చుట్టూ భారీ పోలీసుల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆలయం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విగ్రహ శకలాలు కనిపించగా.. దేవాలయ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి సూరి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. సూరి అయిదుసార్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Punjab #Live : Shiv Sena leader Sudhir Suri shot dead in Amritsar in presence of Police. They were sitting on a dharna outside the temple against the desecration of hindu idols. Security personnel are also stationed with Suri at all times !! + pic.twitter.com/1reGHy5ypT — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 4, 2022 ఇదిలా ఉండగా ఆలయ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తన్నట్లు వెల్లడించారు. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సూరి ఇప్పటికే గ్యాంగ్స్టర్లు కొన్ని రాడికల్ సంస్థల హిట్-లిస్ట్‌లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు వై కేటిగిరీ భద్రత కల్పించామని, ఆయన సెక్యూరిటీలో 12 మందికి పైగా పోలీసులు ఉన్నారని తెలిపారు. -
శివసేన నేత దారుణ హత్య.. పట్టపగలే తుపాకులతో రెచ్చిపోయారు..
Sudhir Suri.. శివసేన నేత సుధీర్ సూరి దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన శివసేన నేత సుధీర్ సూరి.. శుక్రవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇటీవల ఓ ఆలయ ప్రాంగణం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించడంతో శివసేన నాయకులు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివసేన నాయకులకు మద్దతిస్తూ సుధీర్ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన కొందరు వ్యక్తులు సుధీర్‌పై కాల్పులు జరిపారు. దీంతో, సుధీర్ అక్కడికక్కడే మృతి చెందగా.. కాల్పులు జరిపిన వ్యక్తిని శివసేన నాయకులు పట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు.. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం సుధీర్ సూరి ఓ వర్గానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పదజాలంతో దూషిస్తూ.. మతపరంగా మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సుధీర్ సూరి.. హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించి భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా, తాజాగా ఆయనపై కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇక, సుధీర్ హత్యపై బీజేపీ నేత తజీందర్ సింగ్ బగ్గా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తజీందర్ బగ్గా.. ‘పంజాబ్‌లో శాంతి భ్రదతలు పూర్తిగా విఫలమయ్యాయి. అమృత్‌సర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో శివసేన నాయకుడు సుధీర్ సూరి తీవ్రంగా గాయపడ్డారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. Right under the nose of several police officers in Amritsar, Hindu activist Sudhir Suri shot dead at point blank range. He was reportedly on the hitlist of pro-Khalistani elements. Meanwhile Punjab CM Bhagwant Mann is busy with AAP's election campaign in Gujarat. What a shame!! pic.twitter.com/rcx2HaScXb — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) November 4, 2022 -
డ్రగ్స్ మత్తులో యువకుడు.. రోడ్డుపై తూలుతూ..15 రోజుల్లో రెండో ఘటన
చండీగఢ్: పంజాబ్‌లో ఈ మధ్య ఓ మహిళ డ్రగ్స్ మత్తులో తూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అమృతసర్ నియోజకవర్గంలోని పంజాబ్‌లోని డ్రగ్స్ మత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది జరిగి 15 రోజులు అవ్వకముందే అదే అమృత్‌సర్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలోని చమ్రాంగ్ రోడ్లో ఓ యువకుడు రోడ్డుపై తూలుతూ కదలలేని స్థితిలో నిలబడి ఉన్నాడు. కనీసం ముందుగా అడుగు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నడిరోడ్డుపై వెళ్తున్న వారందరూ అతన్నే చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి స్మాక్ ప్రభావంలో(డ్రగ్స్ మత్తులో) ఉన్నట్లు చుట్టూ ఉన్న వారు చెబుతుండటం వీడియోలో వినిపిస్తోంది. స్మాక్ అనేది ఓపియాయిడ్ డ్రగ్, దీనినే కొన్నిసార్లు బ్లాక్ టార్ హెరాయిన్ అని కూడా పిలుస్తారు. ఇక సిక్కుల పవిత్ర నగరమైన మక్బూల్‌పురా.. మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి తరచుగా వార్తల్లో నిలుస్తుంది. మద్యం మానేసేందుకు పోలీసులు అనే డి- అడిక్షన్ డ్రైవ్‌లు చేపట్టినటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. Alcohol is a old way ....save our generation.... either it's Punjab or anywhere in india pic.twitter.com/fepQtcfuEf — चौधरी विनय छौक्कर (गुर्जर) (@vinayc050) September 24, 2022 ఈనెలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో దాదాపు కనీసం 350 మంది డ్రగ్స్ స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు. 6.90కేజీల హెరాయన్, 14.41 కేజీల నల్ల మందు, 5 కేజీల గంజాయి, 6.44 క్వింటాళ్ల గసగసాల పొట్టు, 2.10 లక్షల మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు, ఫార్మా ఓపియాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. #Video of man under influence of #DRUGS in #Amritsar, #Punjab goes #Viral Drug menace a major problem in Punjab#PunjabPolice #news #UnMuteIndia pic.twitter.com/RBOPHlVh5i — UnMuteINDIA (@LetsUnMuteIndia) September 24, 2022 మరోవైపు రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం ఎక్కువవడంతో పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఇంకా కొనసాగుతుందని, దీనికి ఇలాంటి ఘటనలే నిదర్శమని విమర్మిస్తున్నాయి. -
డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్..
చండీగఢ్: డ్రగ్స్ కోరల్లో చిక్కితే జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. మత్తుపదార్థాలకు బానిసలై ఎంతోమంది యువత తమ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో అక్రమంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం. తూర్పు అమృత్సర్ నియోజకవర్గం మక్బూల్‌పూర్ ప్రాంతంలో ఓ యువతి డ్రగ్స్ మత్తులో విలవిల్లాడింది. రోడ్డుపై నిలబడిన ఆమె కనీసం అడుగు తీసి అడుగు వేయడానికే ఆపసోపాలు పడింది. కాలు కూడా కదల్చలేని స్థితిలో వణుకుతూ కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. A viral video from Amritsar, Punjab shows a woman on the streets allegedly under the influence of heavy, illegal drugs. She is seen struggling to take a step forward. Officials have started a probe into this issue. Watch the video to know more#Punjab #DrugAbuse #PunjabWoman pic.twitter.com/A6GPrRR6xE — Mirror Now (@MirrorNow) September 12, 2022 వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆదివారం స్థానికంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గురు నిందితుల నుంచి నార్కోటిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదు వాహనాలను కూడా సీజ్ చేశారు. వీటిని దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులతో మక్బూల్‌పురా ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ అధికారులు ఎన్నో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇక్కడ ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బాధితులయ్యారు. చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్‌లోని తారన్‌తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్‌లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్‌లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్‌హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది: దీప్తి నావల్
‘నీ ఇవాళ్టి స్థానానికి నిన్నటి నీ బాల్యమే కారణం’. ‘అప్పుడు ఏవి నీ మీద ప్రభావాలు చూపుతాయో అవే నిన్ను తీర్చిదిద్దుతాయి’. ‘బాల్యాన్ని తరచి చూసుకుంటే ఎక్కడ బయలుదేరామో తెలుస్తుంది. ఎక్కడకు వెళుతున్నామో కూడా’... అంటుంది దీప్తి నావల్. అమృత్‌సర్‌లో గడిచిన తన బాల్యం, యవ్వనపు తొలి రోజుల జ్ఞాపకాలను ఆమె ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. ‘నావల్’ అని ఇంటి పేరు రావడంతో మొదలు ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం వరకు ఆమె అనేక సంగతులను వెల్లడి చేసింది. దీప్తి నావల్‌కు దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆమె పోస్టర్‌ను గోడలకు అంటించుకున్న ఆరాధకులు 1980లలో 90లలో చాలామంది ఉన్నారు. ‘జునూన్’, ‘కథ’, ‘చష్మేబద్దూర్’, ‘సాథ్సాథ్’, ‘ఏక్ బార్ ఫిర్’ వంటి సినిమాలతో ఆమె ఒక కాలపు సినిమాలో గొప్ప ప్రభావం చూపగలిగింది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్‌తో పాటు దీప్తి నావల్ కూడా పార్లల్ సినిమాకు ఊతం ఇచ్చింది. అయితే మిగిలిన ఇద్దరితో పోల్చితే ఆమె చేయవలసినన్ని సినిమాలు చేయలేదు. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలలో నటిస్తూ రచన, చిత్రకళలో కృషి చేస్తోంది. తాజాగా తన బాల్య జ్ఞాపకాల సంచయం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. 70 ఏళ్ల వయసులో... దీప్తి నావల్ 1952లో పుట్టింది. అంటే నేటికి 70 ఏళ్లు. కాని ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఆమె నిమగ్నమై ఉంటుంది. ఆమె పెయింటింగ్స్ వేస్తుంది. ఫొటోగ్రఫీ చేస్తుంది. కథలు, కవిత్వం రాస్తుంది. గతంలో ‘లమ్హా లమ్హా’, ‘బ్లాక్ విండ్’ అనే కవితల పుస్తకాలు వెలువడ్డాయి. ఆమె రాసిన కథల సంపుటి పేరు ‘ది మ్యాడ్ డిబెటిన్’. ఇప్పుడు వచ్చింది ఆమె నాలుగో పుస్తకం. ఈ పుస్తకం అమృత్‌సర్‌లో గడిచిన నా బాల్యం గురించి మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి ముఖ్యంగా అమృత్‌సర్‌తో ముడిపడ్డ నా జ్ఞాపకాల గురించి చెబుతుంది అంటుంది దీప్తి. ఇంటి పేరు మార్పు దీప్తి నావల్ కుటుంబం రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి అస్సాంకు వలస వచ్చింది. ఆ తర్వాత అమృత్సర్ చేరింది. ఆ కాలంలో పేరు చివర ‘శర్మ’ చాలామందికి ఉండేది. అందుకని ఆమె తండ్రి ఉదయ్ శర్మ తన పేరు చివర ‘నావల్’ను ఎంచుకున్నాడు. ‘నావల్’ అంటే ‘నవీనమైనది’ అని అర్థం. అలా దీప్తి పేరు దీప్తి నావల్ అయ్యింది. ‘మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. మా అమ్మ కళాభిరుచి ఉన్న మహిళ. ఆమె బొమ్మలు వేసేది. కథలు చెప్పేది. ఆ కళ నాకు వచ్చింది. అమృత్‌సర్‌లోని హాల్ బజార్లో ఖైరుద్దీన్ మసీదు పక్కన ఉండే మా ఇంట్లో మేడ మీద ఎక్కి వీధుల్లో చూసేవాళ్లం. దేశ విభజన గురించి, వలస కాలంలో జరిగిన విషాదాల గురించి నేను పెద్దల మాటల్లో వినేదాన్ని. జలియన్ వాలా బాగ్ మా అందరికీ ఒక తాజా గాయంగా అనిపించేది. నాకు 13 ఏళ్లు వచ్చినప్పుడు (1965) ఇండో పాక్ యుద్ధం వచ్చింది. విమానాలు గాల్లోకి ఎగురుతూ భయపెట్టేవి. చిన్నదాన్ని కావడంతో అదంతా ఉత్సాహంగా అనిపించేది. కాని మా నాన్న ఒకరోజు బార్డర్‌కు తీసుకెళ్లి చూపించాడు. ‘యుద్ధం అసలు రూపం పిల్లలకు తెలియాలి’ అని నాకూ అక్కకూ చూపించాడు. అక్కడకు వెళితే గాలి అంతా మందుగుండు వాసన. శవాలు పడి ఉన్నాయి. కాకులు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండటం చూశాను. ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది’ అని రాసింది దీప్తి నావల్. 20 ఏళ్ల కృషి దీప్తి నావల్ పర్ఫెక్షనిస్ట్. తన బాల్యం, యవ్వనపు రోజులను అథెంటిక్‌గా చెప్పేందుకు ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ కోసం దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. కొన్ని తనకు తెలుసు. కొన్ని బంధువుల నుంచి, తెలిసిన వారి నుంచి రాబట్టాల్సి వచ్చింది. ‘అమృత్సర్ స్వర్ణదేవాలయ ఘటన, జలియన్ వాలా బాగ్ స్థలం నాపై ఏర్పరిచిన ప్రభావం గురించి రాయడానికి సమయం పట్టింది. స్వర్ణదేవాలయం ఆధునీకరించడం నాకు అభ్యంతరం లేదు. కాని జలియన్ వాలా బాగ్‌ను బాగా తీర్చిదిద్ది అదొక సెల్ఫీ పాయింట్లా చేశారు. అది సెలబ్రేట్ చేసుకునే స్థలం కాదు. జాతి త్యాగాలను తలచుకుని బాధ పడాల్సిన సమయం. దానిని అప్పటికాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంచేస్తే బాగుండేది. జపాన్‌లో హిరోషిమాను అలాగే ఉంచేశారు’ అందామె. తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లాక తాను అమెరికాలో చదవడం, అక్కడ రేడియో అనౌన్సర్‌గా పని చేస్తూ రాజ్ కపూర్‌ను ఇంటర్వ్యూ చేయడం... ఇలాంటి జ్ఞాపకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘నేను కథక్ డాన్సర్‌ని. కాని నాకు డాన్సులు చేసే కమర్షియల్ వేషాలే రాలేదు’ అని నవ్వుతుంది ఆమె. సుదీర్ఘ కాలం కలిసి జీవించిన తల్లిదండ్రులు డెబ్బయిల వయసులో విడిపోవడం ఆమెకు ఒక షాక్. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీప్తి నావల్ దర్శకుడు ప్రకాష్ ఝాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఒక కుమార్తెను దత్తత చేసుకుంది. ఆమెకు ముంబైలో కాకుండా ‘కులూ’లో ఒక ఇల్లు ఉంది. రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా తేవాలనుకుంటోంది. ఆమె అభిమానులకు అదీ ఒక మంచి కబురే. -
Amritsar: కమ్మేసిన పొగ.. పేషెంట్ల ఆర్తనాదాలు!
ఛండీగఢ్: ఢిల్లీ ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవంతిలో చెలరేగిన మంటలు 27 మందిని బలిగొన్న ఘటన మరువక ముందే.. మరో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అమృత్సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గురునానక్ దేవ్ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. సమయానికి స్పందించిన సిబ్బంది.. పేషెంట్లను బయటకు తరలించడంతో భారీ విషాదం తప్పింది. భారీగా అలుముకున్న పొగ, పేషెంట్ల ఆర్తనాదాల మధ్య అక్కడి పరిస్థితి తాలుకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం సాయంత్ర సమయంలో.. ఎక్స్‌రే డిపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడం, దాని మంటల నుంచే ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు ఎనిమిది ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. సహాయక చర్యలను సంబంధిత అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. Praying for the well being of patients, their attendants and the entire staff of Guru Nanak Dev Hospital, Amritsar, which is engulfed in a major fire . pic.twitter.com/BayrXYL9Eb — Sukhbir Singh Badal (@officeofssbadal) May 14, 2022 -
అమృత్సర్ షెడ్యూల్ ఓవర్.. బ్యాక్ టూ ఆచార్య ప్రమోషన్: చరణ్
Ram Charan Wraps Up RC15 Amritsar Shooting Schedule: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో అతడి యాక్టింగ్‌కు బి-టౌన్ ఫిదా అయ్యింది. దీంతో చరణ్ నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు అతడు నటించిన ఆచార్య రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఆర్సీ15 సినిమాషూటింగ్ కొద్ది రోజులుగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చదవండి: హీరోయిన్ శ్రియ బేబీబంప్ డాన్స్ వీడియో చూశారా? స్పెషల్ ప్లైట్‌లో అమృత్సర్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న చరణ్ తన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ ‘శంకర్‌గారి(RC15 సినిమా షూటింగ్) అమృత్సర్ షెడ్యుల్ పూర్తి. బ్యాక్ టూ ఆచార్య ప్రమోషన్స్’ అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే ఆచార్య టీం ప్రమోషన్స్‌తో బిజీ కానుందని తెలుస్తోంది. చరణ్ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా RC15లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, అంజలి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అయితే అమృత్సర్ షెడ్యూల్ నేపథ్యంలో చరణ్ మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో కొంత సమయాన్ని అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో గడిపిన సంగతి తెలిసిందే. వారితో కలిసి కాసేపు ముచ్చటించి, జావాన్లతో భోజనం చేసిన ఫోటోలను చరణ్ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు -
జవాన్లతో కలిసి భోజనం చేసిన రామ్‌చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అతడి యాక్టింగ్ స్కిల్‌ను జనాలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం అతడు కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్ఎఫ్ జవాన్లతో గడిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో వారితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: అంటే సుందరానికీ టీజర్ చూశారా? ఫుల్ ఫన్ గ్యారంటీ! ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో! -
అమృత్‌సర్‌కి రామ్ చరణ్, ఎందుకంటే..?
అమృత్‌సర్‌కి ప్రయాణం కానున్నారు రామ్‌చరణ్. ఎందుకంటే ఓ సినిమా షూటింగ్ కోసం. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమృత్‌సర్‌లో ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఆల్రెడీ మార్చిలోనే ఈ షెడ్యూల్ కోసం అమృత్సర్ లొకేషన్స్‌ను శంకర్‌ను పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ప్లాన్ చేసిన షెడ్యూల్లో రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫైట్ షూట్ చేస్తారని సమాచారం. అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి తమన్ స్వరకర్త. -
గోల్డెన్ టెంపుల్లో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. ప్రత్యేక పూజలు
Rajamouli Ram Charan Jr Ntr Visit Amritsar Golden Temple For RRR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. మార్చి 20న గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా సోమవారం (మార్చి 21) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది ఈ చిత్రబృందం. అమృత్‌సర్‌లో పర్యటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడి గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కోరుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం ప్రకటించింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. The tRRRio visited the divine Golden Temple in Amritsar to seek blessings for our #RRRMovie#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/LfZcbHnOLM — RRR Movie (@RRRMovie) March 21, 2022 -
అమృత్ సర్ లో ఆప్ భారీ విజయోత్సవ ర్యాలీ
-
తండ్రిని కోల్పోయిన టీనేజర్లు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో మారనున్న సీన్
హృదయాన్ని స్పృశించే కథనాలు, గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న ప్రతిభ ఎక్కడున్న స్పందించే అలవాటు ఆనంద్ మహీంద్రా సొంతం. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అనేక సార్లు ఈ విషయం రుజువైంది. ఆయన చేసే ఒక్క ట్వీట్ ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపింది. తాజాగా కుటుంబ పోషణ కోసం ఆ ఇద్దరు టీనేజర్లు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు ఆనంద్ మహీంద్రా. అమృత్‌సర్‌లో సుల్తాన్గేట్ ఎదురుగా ఓ చిన్న రెస్టారెంట్ ఉంది. కానీ ఈ రెస్టారెంట్ వెనుక ఓ పెద్ద కథ ఉంది. అదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. మూడు నెలల క్రితం అప్పు చేసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. 2021 డిసెంబరు 21న రెస్టారెంట్ యజమాని హఠాత్తుగా చనిపోయాడు. దీంతో అతని కుటుంబం అండను కోల్పోగా.. రెస్టారెంట్ మూతపడే స్థితికి చేరుకుంది. దీంతో ఆ రెస్టారెంట్ యజమాని ఇద్దరు కొడుకులు హర్దీప్ సింగ్ (17), హంజ్దీప్ సింగ్ (11)లు రెస్టారెంట్‌తో పాటు తమ కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ రెస్టారెంట్‌ను నడిపిస్తున్నారు. అనుభవం లేకపోయినా వయసు చాలకపోయినా గుండె ధైర్యంతో సమస్యలకు ఎదురీతున్నారు. అమృత్‌సర్‌కి చెందిన ఓ యువకుడు ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. These kids are amongst the pluckiest I’ve seen anywhere. May they soon have lines of people waiting to get in to the restaurant. I love Amritsar & usually look forward to the world’s best Jalebis in the city, but I’m going to add this place to my food binge when I’m next in town. pic.twitter.com/J4i3IPW3IO — anand mahindra (@anandmahindra) February 5, 2022 టీనేజర్ల నడిపిస్తున్న రెస్టారెంట్ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమృతసర్ జిలేబీలకు ఫేమస్. కానీ ఈసారి అమృత్సర్ వెళితే జిలేబీల బదులు ఈ రెస్టారెంట్‌కి వెళ్తాను. త్వరలోనే ఈ రెస్టారెంట్ రద్దీగా మారుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఒక్కసారిగా ఈ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. లైకులు, రీట్వీట్లతో హెరెత్తించింది. చాలా మంది నెటిజన్లు ఈ పిల్లలు నడిపిస్తున్న రెస్టారెంట్‌కి వెళ్తామంటూ బదులిచ్చారు. మరికొందరు సాయం చేయడంతో పాటు చిన్న పిల్లలకు గైడ్ చేయాలంటూ సూచించారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఈ చిన్న రెస్టారెంట్ మరో బాబా కా ధాబా తరహాలో ఈ రెస్టారెంట్ బిజీ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. చదవండి: థ్యాంక్యూ ఆనంద్ మహీంద్రా సార్.. మాట నిలబెట్టుకున్న బిజినెస్‌మ్యాన్.. -
అమృత్సర్ నుంచి అందుకే పోటీ చేస్తున్నా
అమృత్సర్: ఎన్నికల్లో తాను కేవలం అభ్యర్థి మాత్రమేనని, తన కోసం ఎన్నికల్లో పోరాడుతున్నది అమృత్సర్ ప్రజలేనని చెప్పారు మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్సర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 52 ఏళ్ల కున్వర్.. గతేడాది ముందస్తు పదవీ విరమణ చేసి జూన్ 2021లో అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ‘ఆప్’లో చేరారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన ప్రకటించుకున్నారు. ఫిబ్రవరి 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ దత్తి, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ జోషి, ఇతరులతో కున్వర్ పోరుకు సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని మజా ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన కీలక నేతగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన దీమాగా చెబుతున్నారు. తమ పార్టీని గెలిపిస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని హామీయిచ్చారు. అవినీతి, మాదకద్రవ్యాల మహమ్మారి నిర్మూలన, మహిళల భద్రత, ఆరోగ్యం, విద్య, శాంతిభద్రతలను మెరుగుపరుస్తామన్నారు. ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం అమృత్‌సర్‌లో పనిచేయడంతో కున్వర్‌కు కలిసొచ్చే అంశం. 2000 సంవత్సరం ప్రారంభంలో అమృత్సర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. 2007, 2009 మధ్య కాలంలో ఇక్కడ సీనియర్ ఎస్పీగా పనిచేశారు. (క్లిక్: వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?) అమృత్సర్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని అడగ్గా... ‘రాజకీయాల్లోకి రావాలనే నా నిర్ణయాన్ని అమృత్సర్ ప్రజలు మార్గనిర్దేశం చేసారు. నేను ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారు. వారు నన్ను ఈ మిషన్‌కు సిద్ధం చేశారు. మొత్తం అమృత్సర్ నా కోసం ఎన్నికల్లో పోరాడుతోంది. నిజాయితీపరులు, నిజాయితీ గల వ్యక్తులు ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కున్వర్ జవాబిచ్చారు. పంజాబ్ నుంచి 'మాఫియా రాజ్'ను ఆప్ నిర్మూలిస్తుందని.. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడానికి తమ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యత కల్పించామన్నారు. (చదవండి: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్) -
విమానంలో భారత్‌కు వచ్చిన 125 మందికి కరోనా
-
కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా..
అమృత్సర్: కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తూ, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారానే దేశంలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమన్న సంగతి తెలిసింది. అందుకే ఈ సారి బయట దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలోకి వచ్చిన చార్టర్డ్ విమానంలో కరోనా కలకలం రేగింది. గురువారం ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు చార్టర్డ్ ప్లైట్‌లో వచ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ! -
అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!
అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సరిగా చదవకుండా ఏవో సాకులు చెబుతూ కాలక్షేపం చేయడం. సరైన ఉద్యోగం లేక నిరుద్యోగిగా కాలం వెళ్లదీసేవారు కొందరు. కానీ అమృతసర్ అవిభక్త కలలు తమ శారరీక లోపాన్ని అధిగమించి మరీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే...అమృత్‌సర్‌కి చెందిన అవిభక్త కవలలు సోహ్నా, మోహనా న్యూ ఢిల్లీలో జూన్ 14, 2003న జన్మించారు. అయితే వీరికి రెండు హృదయాలు, చేతులు, మూత్రపిండాలు, వెన్నుపాములతో జన్మించారు. కానీ వీరికి ఒకటే కాలేయం, పిత్తాశయం, కాళ్లు ఉన్నాయి. అయితే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారిని పరీక్షించి శస్త్రచికిత్స వల్ల ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వేరు చేయకూడదని నిర్ణయించారు. దీనికి తోడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నిరాధరణకు గురయ్యారు. ఈ మేరకు పిగల్వార్ సంస్థ చదువు చెప్పించడమే కాక వీరి బాగోగులను చూసుకుంది. అంతేకాదు వారు తమ శారీరక లోపాన్ని అధిగమించి కష్టపడి చదువుకోవడమే కాక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్)లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. పైగా వారికి ఆ రంగంలో అనుభవం ఉన్నందున వారిని నియమించకున్నట్లు పీఎస్‌పీసీఎల్ సబ్‌స్టేషన్ జూనియర్ ఇంజనీర్ రవీందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆ అవిభక్త కవలలు మాట్లాడుతూ...తమకు ఈ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. పైగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వానికి తమ విద్యనందించిన పింగల్వార్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అని అన్నారు. (చదవండి: హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..) -
సిక్కుల జెండా అపవిత్రానికి యత్నం
కపుర్తలా/అమృత్సర్/న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్‌లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది. కపుర్తలా జిల్లా నిజాంపూర్‌లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్ స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు. అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్‌ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అశాంతిని సృష్టించేందుకు కుట్ర.. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. -
స్వర్ణ దేవాలయంలో కలకలం
అమృత్సర్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టిచంపారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 30 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలున్న బంగారు గ్రిల్స్‌పై నుంచి దూకి నిషిద్ధ పూజా మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని, గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) టాస్క్‌ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకుని ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న కొందరు ఆ అగంతకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. మృతుని వివరాలు, ఇంకెవరైనా అతడితోపాటు ఉన్నారా? తదితర విషయాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ భందాల్ చెప్పారు. -
అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
అమృత్ సర్: శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 822 గ్రాముల కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బందిని మోసగించే ప్రయత్నంలో ప్రయాణికుడు తన వద్ద ఉన్న మూడు ప్లాస్టిక్ కవర్లలో క్యాప్సూల్స్ ఆకారంలో బంగారాన్ని దాచిపెట్టాడని అధికారులు తెలిపారు. "ఎయిర్ ఇండియా విమాన నంబర్ 930లో దుబాయ్ నుంచి అమృత్ సర్ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించినప్పుడు, మూడు క్యాప్సూల్స్ లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచిపెట్టినట్లు అంగీకరించాడు" అని అమృత్ సర్ లోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమీషనేట్ ప్రతినిధి తెలిపారు.స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ₹.38లక్షలు అని అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రయాణికుడి పేరును బయటికి వెల్లడించలేదు. ఆగస్టు 24న ఇలాగే, షార్జా నుంచి ఇండిగో విమానంలో విమానాశ్రయంలో దిగిన పురుష ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు ₹.78 లక్షల విలువైన 1.600 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.(చదవండి: మీరు పెట్టిన పెట్టుబడి ఎన్ని ఏళ్లలో రెట్టింపవుతుంది?) -
భారతీయులకు దన్నుగా భారత్..!
అమృత్సర్: ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఆపదలో ఉన్నా, సాయం చేసేందుకు యావద్భారతం ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. అఫ్గాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కుతగ్గమన్నారు. అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ మెమోరియల్‌ను సుందరీకరించి దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన వీడీయోలైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ దేవీ శక్తి గురించి మాట్లాడారు. ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా పలువురు స్వదేశీయులను అఫ్గాన్ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ తరలింపులో భాగంగా ప్రజలతో పాటు పవిత్రమైన సిక్కు మత గ్రంధాలను కూడా వెనక్కు తెచ్చామని మోదీ తెలిపారు. గురు కృప(సిక్కు గురువుల ఆశీస్సులు)తో ఈ కష్టమైన కార్యాన్ని సమర్ధవంతంగా భారత్ నిర్వహిస్తోందన్నారు. కోవిడ్ కావచ్చు, అఫ్గాన్ సంక్షోభం కావచ్చు... భారతీయులకు కష్టం వస్తే భారత్ వెంటనే ఆదుకుంటుందనే సందేశమిచ్చారు. ఇటీవల కాలంలో మానవాళి ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లను ఎదుర్కోవడంలో గురువుల బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు. గురువులు చూపిన మార్గాన్ని అనుసరించి నూతన చట్టాలను తీసుకువచ్చామని పరోక్షంగా సీఏఏ గురించి ప్రస్తావించారు. ఆత్మనిర్భరత్వం, ఆత్మ విశ్వాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. పునరుద్ధరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆనాటి ‘జలియన్‌వాలా మారణకాండ’లో వీరమరణం పొందిన వారి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సముదాయం అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. స్మారక సముదాయంలో ఉన్న ఉపయోగంలో లేని భవనాల్లో 4 మ్యూజియం గ్యాలరీలను కొత్తగా ఏర్పాటు చేసింది. నవీకరించిన సముదాయంలో జలియన్‌వాలా మారణకాండ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను అందుబాటులోకి తెచ్చింది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన జలియన్‌వాలాలో సమావేశమైన వేలాది మందిపై బ్రిటిష్ సైనికులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వేయి మంది పౌరులు నేలకొరగ్గా, వందలాదిగా గాయాలపాలైన విషయం తెలిసిందే. -
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని అమృత్సర్ ప్రాంతంలో టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం డ్రోన్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు అప్రమత్తం చేశారని పోలీసులు పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా వీటిని డ్రోన్ ద్వారా జారవిడచినట్టు అధికారులు అనుమానిస్తున్నామన్నారు. అమృత్సర్ జిల్లాలోని దలేకే గ్రామ సమీపంలో పోలీసులు ఐఈడీ, హ్యాండ్ గ్రెనేడ్ బాంబులను గుర్తించారు. ఏడు సంచుల్లో, రెండు నుండి మూడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రోన్స్ ద్వారా పిల్లల టిఫిన్ బాక్సుల్లో బాంబులను అమర్చి భారీ దాడికి పథకం వేసినట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, 20 ఐఈడీ బాంబులు, తొమ్మిది పిస్టల్స్, మూడు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. దేశంలో, పంజాబ్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదశక్తులు స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15కి ముందు భారీ దాడులకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. కాగా ఇటీవలికాలంలో సరిహద్దుల్లో డ్రోన్ల కదలికలు కలకలం రేపాయి. ముఖ్యంగా కశ్మీర్లో వరుసల కదలికలను నిఘా వర్గాలు పసిట్టాయి. ఈ క్రమంలో కశ్మీర్ పోలీసులు ఒక డ్రోన్‌ను పేల్చివేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో హై అలెర్ట్‌ను ప్రకటించారు. -
80 ఏళ్ల బామ్మః జ్యూస్ స్టాల్
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ నగరంలో పండ్ల రసం దుకాణం నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సదరు బామ్మను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇటీవల అమృత్సర్ బామ్మ ఉదంతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా నెటిజన్లు తిలకించారు. అమృత్‌సర్‌లోని ఉప్పల్ న్యూరో ఆసుపత్రి సమీపంలో రాణి దా బాగ్ వద్ద ఆమె స్వయంగా జ్యూస్ స్టాల్ నడిపిస్తున్నారు. 80 ఏళ్ల బామ్మ బత్తాయి రసం తయారు చేసి, విక్రయిస్తున్న దృశ్యం జనం మనసులను కదలిస్తోంది. ఆమెపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆవేదన పంచుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని చాలామంది బామ్మ బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆరా తీస్తున్నారు. బామ్మ దుకాణంలో పండ్ల రసం తాగి, ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటూ అమృత్సర్ ప్రజలకు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. జీవనోపాధి కోసం జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న బామ్మకు హ్యాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటితరం యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. వృద్ధుల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఓ నెటిజన్ అభ్యర్థించాడు. -
ఎంత అదృష్టమో..! విమానంలో ఒక్కడే పాసింజర్
చండీగఢ్: మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పడు ఎంటువంటి ఇబ్బంది లేకుండా.. కూర్చోవడానికి ఓ సీటు దొరికి సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ అది వీలు పడదు. ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్లాలి అనుకుంటే బోలెడు ఖర్చు చేస్తే కానీ కుదరు. అయితే, ఖర్చేమీ లేకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కరమే వెళితే! ఆ కిక్కే వేరు. అలాంటి అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అటువంటింది ఓ వ్యక్తికి ఏకంగా విమానంలో ఒంటరిగా ప్రయాణించే అవకాశం దక్కింది. అవును మీరు విన్నది నిజమే. దుబాయ్ కి చెందిన ఓ భారతీయ వ్యాపార వేత్త ఎయిర్ ఇండియా విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు. సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త అయిన ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ బుధవారం అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత.. అందులో తాను ఒక్కరే ప్యాసింజర్ అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. మూడు గంటల పాటు నడిచే ఈ విమానంలో ఒంటరిగా ప్రయాణించడం మహారాజులా అనిపించిందని ఒబెరాయ్ తెలిపాడు. అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి జరిగిన ఈ ప్రయాణంలో చాలా అనుభూతిని పొందానని,. ఫ్లైట్ లోని ఉద్యోగులంతా తనను ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేశారని.. ఖాళీ ఫ్లైట్ లో తన ఫొటోలు కూడా తీశారని చెప్పాడు. విమానంలో ఒక్కరే ప్యాసింజర్ ఉండడం వల్ల మొదట ఈ ఫ్లైట్ ఎక్కేందుకు ఒబెరాయ్ కి అనుమతి లభించలేదట. తరువాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఆఫీసర్లతో మాట్లాడించిన తర్వాత ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిచ్చారట. ‘నా దగ్గర గోల్డెన్ వీసా కూడా ఉంది, నా దగ్గర అన్ని రకాల ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఏవియేషన్ మినిస్ట్రీ సివిల్ అనుమతి’ విమానంలోకి అనుమతించారు. చదవండి:కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్ట్ వివరాలను సమర్పించడం ఎలా? -
పంజాబ్‌లో మరోసారి రాజుకున్న పోస్టర్ వివాదం..
చత్తీస్‌గఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య తరచుగా ఏదో ఒక వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఒక పోస్టర్ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్దూ గత కొన్ని రోజులుగా అమృత్ సర్ నుంచి పాటియాలకు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయసాగారు. కాగా, కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు పాటియాలా కంచుకోటలాగా భావిస్తారు. ఇప్పుడిదే వీరిద్దరి మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్‌సర్‌లో పలుచోట్ల పోస్టర్లు.. దానిపై సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని కూడా ప్రకటించారు. అదే విధంగా, షాహిద్ బాబా దీప్ సింగ్ సేవా సోసైటీ అనే ఒక ఎన్జీవో సంస్థ (గుమ్షుడా డి తలాష్) తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండి అని పోస్టర్లను విడుదల చేసింది. అదే విధంగా, పాటియాలలో కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. దీంతో వీరిద్దరి రచ్చ కాస్త కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పలు నివేదికలు కాంగ్రెస్‌కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్‌ను నియమించింది. ఈ కమిటీకి మల్లి ఖార్జున్ ఖర్గేను నాయకత్వం వహించనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హరిష్ రావత్, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. చదవండి: ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా.. -
'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి'
అమృత్సర్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. తాజగా తాను కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను సిద్దూ ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే అది నిరూపించాలని సీఎం అమరీందర్‌కు సవాల్ విసిరారు. దీంతో పంజాబ్ రాజకీయాల్లో వీరిద్దరి మధ్య రగులుతున్న వివాదం మరోసారి ఆసక్తికరంగా మారింది. సిద్దూ కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన ఆప్‌లో చేరుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై సిద్దూ ట్విటర్ వేదికగా ధీటుగా బదులిచ్చారు. ''నేను ఇతర పార్టీ నేతలతో భేటీ అయినట్లు నిరూపిస్తారా? ఈరోజు వరకూ నేనెవర్నీ నాకు ఒక పోస్ట్ కావాలని అడగలేదు. ఇప్పటికే నన్ను చాలా మంది ఆహ్వానించి.. కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా నేను పార్టీకి ద్రోహం తలపెట్టకూడదని వాటిని తిరస్కరించా. నేను కోరుకునేది కేవలం పంజాబ్ ప్రజల శ్రేయస్సు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకూ వేచి చూడండి'' అంటూ ట్వీట్ చేశారు. కాగా సిద్దూ తనకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ ట్విటర్లో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్ధూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. చదవండి: చర్చలకు సిద్ధం: ప్రధానికి రైతు సంఘాల లేఖ Prove one meeting that I have had with another Party’s leader ?! I have never asked anyone for any post till date. All I seek is Punjab’s prosperity !! Was invited & offered Cabinet berths many times but I did not accept Now, Our Esteemed High Command has intervened, Will wait... pic.twitter.com/bUksnEKMxk — Navjot Singh Sidhu (@sherryontopp) May 22, 2021 -
గోల్డెన్ టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా?
పంజాబ్ రాష్ట్రం, అమృత్సర్ నగరం. ప్రఖ్యాత స్వర్ణదేవాలయం, బయట రాష్ట్రాల వాళ్లకు ‘అమృత్సర్ బంగారు దేవాలయం’గానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్మందిర్ సాహిబ్. నిజానికి హరిమందిర్. వాడుకలో హర్మందిర్ అయింది. దర్బార్ సాహిబ్ అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. ‘హరి’ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు ‘అమృత సర’. అమృతంతో నిండిన సరస్సు అని అర్థం. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఇది ఆలయం కోసం తవ్విన సరస్సు. బంగారంటి పేరు మనకు అమృతసర్ గోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తు వచ్చే సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్. ఆ తర్వాత ఇందిరా గాంధీ దారుణ హత్య. ఆ తర్వాత అల్లర్లు, ఖలిస్థాన్ ఉద్యమం. ఈ ప్రభావం మన దగ్గర ఒక తరాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే... ఈ ఆలయ నిర్మాణం, దాడులకు గురవడం అనేది చర్విత చరణంగా సాగింది. ఎన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో పునర్నిర్మించుకోవడంలో సిక్కుల సంకల్పబలం అర్థమవుతోంది. మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరవాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయం స్వర్ణదేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో నామినేట్ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గుడి ముందు... ఊరు తర్వాత సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకవసరమైన పని వాళ్లు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ల కోసం ఇళ్లు కట్టారు. మనుషుల జీవికకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసం వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరయింది. సిక్కుల ఆరాధ్యమందిరం. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వమానవాళికీ అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు లక్షమంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు. వందేళ్ల వంటశాల ధాబా పేరు కేసర్ దా ధాబా. గోల్డెన్ టెంపుల్‌కి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇది వందేళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లాచ్చా పరాఠా, దాల్ మఖానీ కోసం లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా వందేళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్ మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్‌లోని షేక్‌పురాలో మొదలుపెట్టారు. దేశవిభజన సమయంలో ఆ దంపతులు ధాబాను అమృతసర్‌కు మార్చారు. అప్పట్లో లాచ్చా రోటీ– దాల్ మఖానీ మాత్రమే వండేవాళ్లు. ఇప్పుడు వేడిగా కరకరలాడే హాట్ క్రిస్ప్ పరాఠా, మీగడ లస్సీ, పంజాబీ థాలీ, ఫిర్నీ కూడా వండుతున్నారు. ఇప్పుడు కాని మీరు కాని స్వర్ణదేవాలయాన్ని కాని చూడడానికి వెళ్లినట్లయితే... అప్పుడు ఈ ధాబాలో పంజాబీ వంటకాలను రుచి చూడడం మర్చిపోవద్దు. రోజంతా వండుతూనే ఉంటారు పంజాబీ వంటకాలను రాగి పాత్రలో ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు ఉడికిస్తారు. రాజ్మా గింజలు, తాజా మీగడ, పెరుగుతో దాల్ మఖానీ ఉడుకుతున్న పెద్ద గుండిగ ఒక పక్క. మరో పక్క ఒక పాత్రలో ఫిర్నీ, పెద్ద పెద్ద రాగి, ఇత్తడి పాత్రలు కళ్ల ఎదురుగానే ఉంటాయి. రోజంతా తక్కువ మంట మీద వంటలు తాజాదనం కోల్పోకుండా వేడి మీద ఉంటాయి. -
అదృష్టమంటే ఆమెదే: వంద పెట్టింది.. కోటి గెలిచింది
అమృత్సర్: అదృష్టమంటే ఆమెదే. రూ.వంద ఖర్చు చేసింది.. ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకుంది. వస్త్ర వ్యాపారం చేసుకునే ఆమె ఒక్కసారిగా కోటీశ్వరాలుగా మారింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆ అదృష్టం వరించింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్ గర్భిణి. భార్యాభర్తలు ఇద్దరూ వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రేణు ఇటీవల రూ.100 పెట్టి లాటరీలో డీ-12228 టికెట్ కొనింది. ఈ లాటరీకి సంబంధించిన డ్రా ఫిబ్రవరి 11వ తేదీన తీశారు. ఆ డ్రాలో రేణు కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ తగిలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు ఆమెకు సమాచారం అందించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అవసరమైన పత్రాలు సమర్పించాలని లాటరీస్ శాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె గురువారం కార్యాలయానికి చేరుకుని అవసరమైన పత్రాలు అందించింది. త్వరలోనే ఆమె బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నగదుతో తమ కష్టాలు తీరుతాయని రేణు చౌహాన్ తెలిపింది. లాటరీ నగదుతో తాము హాయిగా జీవిస్తామని హర్షం వ్యక్తం చేస్తూ రేణు చెప్పింది. -
అతను పిజ్జా ఎందుకు తినకూడదు?
దేశంలో కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో పిట్ట కథలాగా పిజ్జా కథ కూడా చోటు చేసుకుంది. దీని మీద మాటల బాణాలు, వ్యంగ్యపు విసుర్లు జోరుగా సాగుతున్నాయి.ఇంతకూ ఏం జరిగిందీ?అంటే పంజాబ్ నుంచి ఈ ఉద్యమంలో ఎక్కువ మంది రైతులు పాల్గొంటున్నారు కనుక ఆ రాష్ట్రం నుంచి మద్దతుదారులు రెగ్యులర్‌గా కార్లేసుకొని వచ్చి రైతులకు సహాయం చేసి వెళుతున్నారు. కొందరు తిండి, కొందరు దుప్పట్లు, కొందరు మందులు ఇలా ఇచ్చి పోతున్నారు. మొన్నటి శనివారం తెల్లవారుజామున అమృత్సర్ నుంచి ఇలాగే ఐదు మంది మిత్రులు ఢిల్లీలో ఉన్న రైతులకు ఏదైనా ఆహారం అందిద్దామని బయలు దేరారు. కాని ఆలస్యమయ్యేసరికి హర్యాణాలోని ఒక మాల్ దగ్గర ఆగి రెగ్యులర్ సైజ్ పిజ్జాలు భారీగా కొని ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే వాటిని అవెన్‌లో తయారు చేసి రైతులకు ఉచితంగా పంచారు. దాదాపు 400 పిజ్జాలను వారు పంచారు. సిక్కుల ఉచిత భోజన పంపక కేంద్రాలను ‘లంగర్’లని అంటారు. దానివల్ల వీరిది ‘పిజ్జా లంగర్’ అయ్యింది. వెంటనే ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. చాలా మంది ప్రశంసించారు. కొందరు ప్రభుత్వ విధానాల మద్దతుదారులు విమర్శించారు. ‘చూశారా... రైతులట... పిజ్జాలు తింటున్నారట’ అని విమర్శించారు. వెంటనే అలాంటి విమర్శలకు గట్టి బదులు లభించింది. ‘రైతు పిజ్జా తయారీకి పిండి ఇస్తాడు. ఏం.. అతను పిజ్జా ఎందుకు తినకూడదు?’ అని ఆ పిజ్జా లంగర్‌ను నిర్వహించిన ఒక సభ్యుడు అన్నాడు. రైతులు పైజామాలను వదిలి జీన్స్ ప్యాంట్లలోకి మారారని తెలుసుకోండి అని కూడా అన్నారు. ‘రైతులు విషం తింటుంటే పట్టించుకోని వారు పిజ్జా తింటే విమర్శిస్తున్నారు’ అని పంజాబ్ నటుడు దిల్జిత్ అన్నాడు. పంజాబ్ అమ్మాయిలు కూడా తక్కువ తినలేదు. ‘నేను రైతు కూతురిని. నాకు ఇంగ్లిష్ కూడా వచ్చు’ అని వ్యంగ్య బాణాలు విసిరారు. ‘రైతులు ఎంతసేపు నూనె లేని రొట్టె, ఎర్ర కారం తింటూ ఉండాలా? మాకు పిజ్జా చేసుకు తినడం కూడా వచ్చు’ అని మరికొంతమంది స్త్రీలు ఫేస్బుక్లో రియాక్ట్ అయ్యారు. మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో అదే. -
అమెరికా అధ్యక్షులంతా ఒకేచోట..
అమృత్సర్ : గత 230 సంవత్సరాలుగా అమెరికా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారి చిత్రాలను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన చిత్రకారుడు జగ్జోత్ సింగ్ రుబల్ రూపొందించారు. తాజాగా అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ చిత్రాన్ని అందులో జోడించారు. జార్జ్ వాషింగ్టన్ నుంచి బైడెన్ వరకు అందరి చిత్రాలను ఎంతో అందంగా తన పెయింటింగ్‌లో పొందుపరిచారు. ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్‌కు తాను శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నట్లు జగ్జోత్ సింగ్ వెల్లడించారు. బైడెన్ అధ్యక్షతన భారత్- అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండేలా ఈ పెయింటింగ్ వేశానని, ఇది మొత్తం పూర్తికావడానికి దాదాపు 4 నెలల సమయం పట్టిందని సింగ్ అన్నారు. (బంధాలు బలోపేతం) తన పేరు మీద ఇప్పటికే పది ప్రపంచ రికార్డులు ఉండగా, తాజాగా తాను గీసిన పెయింటింగ్ అమెరికాలోని ఆర్ట్ గ్యాలరీలో లేదా వైట్ హౌస్‌లో ప్రదర్శించాల్సిందిగా కోరుకుంటున్నట్లు మనసులో మాటను బయటపెట్టారు. ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు శనివారంతో తెర పడిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 284 ఎలక్టోరల్ ఓట్లను సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించిన బైడెన్ త్వరలోనే వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) -
వేధింపులతో క్యాబ్ నుంచి దూకేశారు..
చండీగఢ్: రెస్టారెంట్‌కు వెళ్లి సరదాగా విందు భోజనం ఆరగిద్దామనుకున్న ముగ్గురు మహిళల ఆనందాన్ని ఓ క్యాబ్ డ్రైవర్ ఆవిరి చేశాడు. క్యాబ్‌లో వారంతా వెళ్తుండగా.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ డ్రైవర్ వేధింపులకు దిగాడు. ఈ ఘటన అమృత్‌సర్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఎస్హెచ్ఓ రాబిన్ హాన్స్ వివరాల ప్రకారం.. రంజిత్ అవెన్యూ ప్రాంతంలోని రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు క్యాబ్ మాట్లాడుకుని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లాక.. వారిలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ డ్రైవర్ లైగింకంగా వేధించసాగాడు. వారంతా అతనికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడంతో వాహనాన్ని మరింత వేగంగా పోనిచ్చాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆ మహిళల్లో ఇద్దరు ఒక్కసారిగా వాహనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఆ వెంటనే రోడ్డు వెంట వెళ్తున్నవారికి విషయం చెప్పి అలర్ట్ చేయడంతో.. కొంతమంది బైకులపై కారును వెంబడించారు. అందులో చిక్కుకున్న మరో మహిళను రక్షించారు. క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గంట వ్యవధిలోనే అతన్ని పట్టుకుని జైల్లో వేశారు. -
దారుణం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం అమరీందర్ సింగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మృతులంతా అమృత్సర్, గురుదాస్‌పూర్, టార్న్ తరన్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రం కల్తీ మద్యం తాగి అమృత్‌సర్‌లోని తార్సిక్కా మండలం ముచ్చల్, టాంగ్రా గ్రామాలకు చెందిన ఐదుగురు మొదట మరణించినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు. అదే రోజు రాత్రి ముచ్చల్ గ్రామంలో మరో ఇద్దరు మరణించారని డీజీపీ చెప్పారు. టార్న్ తరన్‌లో నాలుగు, బటాలాలో ఐదు మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 24కు చేరిందని వెల్లడించారు. సీఎం ఆదేశం మేరకు ఈ కేసును డివిజనల్ కమిషన్ జలంధర్‌తో పాటు పంజాబ్ జాయింట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషన్ సంబంధిత జిల్లాల ఎస్పీలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రత్యేక విమానంలో బ్రిటీష్ పౌరుల తరలింపు
అమృత్సర్ : లాక్డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన 250 మంది బ్రిటీష్ పౌరులను గురువారం ప్రత్యేక విమానంలో లండన్‌కు తరలించారు. అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో బ్రిటీష్ పౌరులను తరలించారు. కోవిడ్-19 మహమ్మారిని నిరోధించడంలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయినవారిని తిరిగి బ్రిటన్‌కు రప్పించేందుకు మరొక 17 ప్రత్యేక విమానాలను నడుపుతామని గత వారం బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 25, 27 తేదీల్లో కూడా విమానాలను నడుపుతామని హై కమిషన్ పేర్కొంది. భారత దేశంలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్ జే థాంప్సన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కువ మంది చిక్కుకున్న ప్రాంతాల నుంచి విమానాలను నడిపేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. -
ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డ జవాన్..
న్యూఢిల్లీ : ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో ఓ జవాన్ జారిపడ్డాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ దగ్గర పెట్రోలింగ్ పార్టీ ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అతని కోసం ఆర్మీ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన జవాన్ ట్రిపీక్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్రకాశ్ రాళ్లగా గుర్తించారు. జవాను జారిపడిన విషయం తెలిసిన వెంటనే సైనికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తొలుత పెట్రోలింగ్ పార్టీ ఆపరేషన్ ప్రారంభించగా.. అనంతరం మరో 200 మంది గాలింపు చర్యల్లో దిగారు. నీటిమట్టం ఎక్కువగా ఉండడంతోపాటు ప్రవాహ ఉధృతి కూడా అధికంగా ఉన్నప్పటికీ ప్రకాశ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్లు, నిఘా హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక బలగాలు, ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఈతగాళ్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. -
విద్యుత్ కాంతులతో అమృత సర్,అయోధ్య
-
చదువుకు వయస్సుతో పని లేదు
పంజాబ్: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఒక వృద్థుడు. వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన 83 ఏళ్ల సోహన్ సింగ్ గిల్ జలందర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ ఇంగ్లీష్ మాస్టర్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ హోషియార్‌పూర్‌లో, 1937,ఆగస్టు15న జన్మించిన గిల్ 1957లో అమృత్సర్ జిల్లాలో గల కల్సా కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, టీచింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ కాలేజీలో చదివే రోజుల్లో వైస్ ప్రిన్సిపల్ వర్యమ్ సింగ్ నాకు మాస్టర్స్ చదవాలనే ప్రేరణ కలిగించారు. డిగ్రీ తరువాత పీజీ చేయాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కెన్యా నుంచి టీచర్ ఉద్యోగం రావడంతో పీజీ చేయాలనే నా కోరిక తీరలేదు’ అన్నాడు గిల్. 1991లో భారత్‌కు తిరిగి వచ్చాక వివిధ పాఠశాలల్లో అధ్యాపకునిగా సేవలందించానని, అయితే పీజీ చేయాలనే బలమైన కోరిక తీరలేదనే బాధ ఉండేదని గిల్ అన్నాడు. కానీ నేడు తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఆంగ్లాన్ని విపరీతంగా ఇష్టపడేవాడినని తెలిపాడు. ప్రస్తుతం తాను విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఈఎల్‌టీఎస్‌కు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాడు. గిల్ చదువులోనే కాక హాకీ, ఫుట్‌బాల్‌లో రాణించేవాడు. జర్నైల్ సింగ్ వంటి హాకీ లెజెండ్‌తో ఆడటం తనకు గుర్తిండిపోయే మదుర జ్ఞాపకం అని గిల్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కెన్యాలో అధ్యాపక వృత్తితో పాటు హాకీని నిరంతరం ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. ఆటతో పాటు అంపైరింగ్ అనుభవం కూడా తనకుందని చెప్పడం విశేషం. తన విజయానికి ఆరోగ్యకరమైన జీవనశైలీ, సానుకూల దృక్పథాలే ప్రధాన పాత్ర పోషించాయని, భవిష్యత్తులో చిన్న పిల్లల కోసం పుస్తకాలు రాయాలని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. -
రక్త చరిత్రకు వందేళ్లు పూర్తి..
చంఢీగడ్: బ్రిటీష్ పాలిత భారతదేశంలో మాయనిమచ్చగా చరిత్రలో నిలిచిపోయిన ఘటన జలియన్ వాలాబాగ్ దురాగతం. ఆంగ్లేయుల సైన్యం ఊచకోత దాటికి వేలాదిమంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పచ్చని నేలవంటి అమృత్సర్పై రక్తపుటేరులు పారించారు. బ్రిటీష్ దురాగతానికి వందేళ్లు గడిచినా.. భారతీయుల గుండెల్లో దిగిన ఆ తుపాకీగుండ్ల శబ్ధం ఇంకా మారుమోగుతూనే ఉంది. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ సమీపంలో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలను బ్రిటీష్ సైన్యం ఊచకోత కోసిన విషయం తెలిసిందే. భారతీయుల హక్కులను కాలరాస్తూ.. బ్రిటీష్ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన వేలమందిపై తూటల వర్షం కురించారు. ఈ ఘటనకు నేటితో వందేళ్లు పూర్తియిన సందర్భంగా అమృత్‌సర్‌లోని అమరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. జనరల్ డయ్యర్ మారణహోమం వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం నాడు అందరూ గుమ్మికూడి రౌలత్‌చట్టంపై చర్చిస్తున్నారు. అలాగే ఈ చట్టం కింద ప్రముఖ్య స్వాతంత్య్ర సమరయోధులు.. సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చే ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడంకోసం వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే తమ పాలననకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభ గురించి తెలుసుకున్న బ్రిటీష్ జనరల్ డయ్యర్ దారుణమైన మారణహోమానికి పాల్పడ్డాడు. మైదానానికున్న అన్ని దారుల్లో సాయుధులను మొహరించి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా దిగ్బంధించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో దాదాపు 400 మంది మృత్యువాతపడ్డట్లు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అంతకంటే ఎక్కువమందే దాదాపు 1000 మందికి పైగా చనిపోయివుంటారని చరిత్ర చెబుతోంది. ఈ దాడిలో అధికంగా చిన్నారులు. మహిళలే ప్రాణాలు కోల్పోయారు. భారతీయు ఒత్తిడిమేరకు ఈ ఉదంతంపై విచారణ జరపడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1919లో "హంటర్ కమిషన్" ఏర్పాటు చేశారు. అక్కడ సమావేశమైన గుంపుపై కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ డయ్యర్ ఒప్పుకున్నాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మాత్రం అతన్ని ప్రశంసించారు. పగతీర్చుకున్న ఉద్దమ్ సింగ్ పౌరులను చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణమైన జనరల్ డైయర్ను విప్లవకారుడు ఉద్దమ్ సింగ్ హత్యచేశాడు. ఘటన జరిగిన 21 ఏళ్ల అనంతరం..1940 మార్చి 13న లండన్ కాక్స్ టన్ హాల్లో అతన్ని హతమార్చడం విశేషం. ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ఉద్దమ్ సింగ్‌ని ఉరితీసింది. భారత దేశపు తొలి మార్స్కిస్ట్గా బ్రిటీష్ అధికారులు ఉద్దమ్‌ను వర్ణించడం విశేషం. భారతదేశంలో ఈ ఘటనపై ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి జలయన్వాలాబాగ్ ఘటనే నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చరిత్రకారులు చెప్తుంటారు. జలియన్ వాలాబాగ్ స్మారక స్తూపం 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) తీర్మానించింది. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్లల నుంచి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం. -
పారిపోయిన కుర్రాడు.. పంజాబీ యువకుడిగా..
నేరేడ్మెట్: క్రికెట్ ఆడేందుకు వెళ్లి..ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆగ్రహించి అన్న తమ్ముడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన సదరు బాలుడు నేరుగా వెళ్లి సికింద్రాబాద్‌లో రైలెక్కి ఢిల్లీకి చేరుకున్నాడు. రైలులో పరిచయమైన వారితో కలిసి పంజాబ్ రాష్ట్రం, అమృత్సర్ సమీపంలోని రణకళ గ్రామానికి చేరుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటుండటంతో అతడి వేషం, భాష పూర్తిగా మారిపోయాయి. పంజాబీ యువకుడిగా మారాడు. చివరికి ఫేస్బుక్ ద్వారా అతడిని గుర్తించిన అన్న పోలీసులకు సమాచారం అందించడంతో ఎనిమిదేళ్ల తర్వాత అతను తల్లి చెంతకు చేరాడు. సినిమా కథను తలపించిన ఈ ఉదంతంపై బుధవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. మౌలాలి పరిధిలోని నవోదయ నగర్‌కు చెందిన సుసన్న, అబ్సలాం దంపతులకు అనుపమ్ దీపక్, దినేష్ జినాలి అనే ఇద్దరు కుమారులు. 2011లో 13 ఏళ్ల వయసు ఉన్న దినేష్ క్రికెట్ ఆడేందుకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా రావడంతో అతడి సోదరుడు అనుపమ్ దీపక్ తమ్ముడిని కొట్టాడు. మనస్తాపంతో దినేష్ ఇంట్లో డబ్బులు తీసుకొని..సికింద్రాబాద్‌లో రైలెక్కి..ఢిల్లీ చేరుకున్నాడు. దీంతో అతని కుటుంబసభ్యులు 2011 జనవరి 26న కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న దినేష్ స్థానికుల సహాయంతో రణకళ గ్రామానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన భూస్వామి సుఖ్రాజ్ సింగ్ అతడిని చేరదీశాడు. అప్పటి నుంచి వారి వద్దనే ఉంటున్న దినేస్ అక్కడే పొలం పనులు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంజాబీ, హిందీ నేర్చుకున్న అతను పూర్తిగా పంజాబీ యువకుడిలా మారిపోయాడు. 2015లో తన కుటుంబ సభ్యులు గుర్తుకువచ్చి వారిని చూసేందుకు సికింద్రాబాద్‌కు వచ్చిన అతను తనను మళ్లీ తిరిగి వెళ్లనివ్వరేమోననే భయంతో వారిని చూడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఆచూకీ దొరికిందిలా... గత ఏడాది ఆగస్టులో ఫేస్బుక్లో ఓ యువకుడి ఫొటోను చూసిన అనుపమ్ దీపక్ తన తమ్ముడిగా అనుమానించి సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టి సైబర్ క్రైం పోలీసులు ఫేస్‌బుక్‌లోని దినేష్ జినాలి పేరుతో ఉన్న ప్రొఫైల్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఐపీ అడ్రస్ ద్వారా అతడిని దినేష్‌గా, అమృత్సర్ జిల్లా రణకళలో ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసు అధికారుల బృందం సుఖ్రాజ్సింగ్ను కలిసి విషయం చెప్పారు. వారిని ఒప్పించి దినేష్‌ను రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కు తీసుకువచ్చిన పోలీసులు సీపీ సమక్షంలో బుధవారం తల్లి సుసన్న, అన్న అనుపమ్ దీపక్‌లకు అప్పగించారు. ఆనందంగా ఉంది: సుసన్న సీపీ సమక్షంలో తల్లీకొడుకులు కలుసుకొని కంటతడి పెట్టుకున్నారు. కొడుకు ఉన్నాడో లేడో తెలియదు. ఉంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పటికైనా నా కొడుకు తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించాను. ఇన్నేళ్ల తరువాత ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని తల్లి సుసన్న పేర్కొంది. కొడుకులా ఆదరించారు... తనను చేరదీసి ఎనిమిదేళ్ల పాటు సొంత కొడుకులా చూసుకున్న సుఖ్రాజ్సింగ్ కుటుంబాన్ని వదిలి రావడం బాధగా ఉందని దినేష్ అన్నాడు. రణకళలో పని చేస్తూ పంజాబీ, హిందీ నేర్చుకున్నానని, దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్ నేర్చుకున్నట్లు తెలిపాడు. అంతలోనే ఫేస్బుక్ ద్వారా కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. -
పోటీపై సందిగ్ధంలో మాజీ ప్రధాని..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (86) సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయవల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సునీల్ జెక్కర్ ఆయనను కోరారు. ఈ మేరకు న్యూఢిల్లోని మన్మోహన్ నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. వారి అభ్యర్థనపై మాజీ ప్రధాని స్పందిస్తూ.. వయసు, ఆరోగ్యం అనుకూలించకపోవడంతో పోటీ చేయలేనని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో ప్రచారం చేసే ఒపిక కూడా తనకు లేదని, ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపినట్లు సమాచారం. ప్రచారానికి సంబంధించిన విషాయాలన్నీ తాను దగ్గరుండి చూసుకుంటానని, అమృత్‌సర్‌లో పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తారని మన్మోహన్‌కు అమరిందర్ వివరించారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన అనంతరం పోటీపై తుది నిర్ణయం తీసుకుంటానని మన్మోహన్ తెలిపారు. కాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, పీవీ నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలందించిన మన్మోహన్ అనంతరం అనూహ్యంగా ప్రధాని పదవిని చేపట్టి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. జూన్‌తో మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం కూడా భావిస్తోంది. మన్మోహన్‌తో భేటీ అనంతరం కెప్టెన్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్‌తో పొత్తు అవసరం లేదని ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. -
ఇక గోల్డెన్ డేస్ చార్మినార్‌కు కొత్తందాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చార్మినార్‌కు వెళ్లినవారికి అక్కడున్న రకరకాల దుకాణాలు..ఇరుకు గల్లీలు..హడావుడి షాపింగ్ దృశ్యాలు కన్పిస్తాయి. చిన్న చిన్న మార్గాల్లో పెద్ద బోర్డులతో గజిబిజి వాతావరణం ఉంటుంది. ఒక్కో దుకాణం ఒక్కో రూపు. ఒక్కో ఆకారం. ఇకపై ఈ పరిస్థితిలో మార్పు రానుంది. ఒక వీధిలో ఒక వరుసలో ఉండే దుకాణాల ముందు భాగాలు(ఫసాడ్) అన్నీ ఒకే తరహా నిర్మాణశైలితో కనపడనున్నాయి. వరుస క్రమంలో తీర్చిదిద్దినట్లుండే దుకాణాలన్నీ బయటినుంచి చూసే వారికి ఒకే నమూనాలో కనిపిస్తాయి. దుకాణాల బోర్డులు కూడా అన్నింటికీ ఒకే సైజులో క్రమపద్ధతిలో అమర్చుతారు. చారిత్రక ప్రాధాన్యతతతో పాటు పలు విశేషాలతో ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అలరారుతున్న చార్మినార్‌ను సందర్శించే టూరిస్టులను మరింతగా ఆకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. చార్మినార్ పాదచారుల పథకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ చార్మినార్‌ను స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతంగా గుర్తించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్మినార్ పరిసరాలకు మరిన్ని వన్నెలద్దేందుకు దాదాపు ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ అధికారులు అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి వచ్చారు. అక్కడి దుకాణాలన్నీ ఒకే నమూనాలో ఉండటం, వాహన కాలుష్యం లేకపోవడం, స్వచ్ఛ కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతుండటం తదితరమైనవి ఇక్కడా అమలు చేయవచ్చునని భావించారు. అందులో భాగంగా దుకాణాల ముందు భాగాలన్నీ ఒకే నమూనాలో ఏర్పాటు చేసేందుకు అప్పట్నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ.. స్థానిక వ్యాపారులను ఒప్పించడం, తదితరమైన వాటిలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు దుకాణాల ఫసాడ్‌ల నిర్మాణానికి సిద్ధమయ్యారు. అందుకు స్థానిక వ్యాపారులను ఒప్పించారు. ఫసాడ్‌ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.15 లక్షల అంచనా వ్యయంతో వీటి ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి పూర్తయితే మిగతావారూ ముందుకొస్తారని భావిస్తున్నారు. స్వచ్ఛ ఐకాన్‌లో భాగంగా.. దీంతోపాటు స్వచ్ఛ ఐకాన్‌లో భాగంగా చార్మినార్ పరిసరాలను ప్రత్యేంగా తీర్చిదిద్దనున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ 24 గంటల పాటు çపరిశుభ్రంగా ఉంచుతారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతారు. రోడ్డు మార్కింగ్‌లు తదితరమైన వాటితో రహదారులకు మెరుగులద్దుతారు. పర్యాటకుల సదుపాయార్థం స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న పరిసరాల్లోని చారిత్రక భవనాల్ని పునరుద్ధరించి ప్రత్యేక వెలుగుల్లో మెరిసేలా విద్యుత్ కాంతులద్దుతారు. ఇలా వివిధ కార్యక్రమాలతో పర్యాటకులు మెచ్చేలా చార్మినార్ పరిసరాల్ని మార్చనున్నారు. పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, సైనేజీలు, తగినన్ని టాయ్లెట్లు.. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయ్లెట్లు ఏర్పాటు చేస్తారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు పాదచారులు, దివ్యాంగులకు తగిన రవాణా సదుపాయం కల్పిస్తారు. కాలుష్యం లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాల్ని ప్రవేశపెడతారు. చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసి అందులోకి వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఇవీ ప్రత్యేకతలు.. ♦ అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పాదచారులు సాఫీగా నడిచేందుకు తగిన ఏర్పాట్లతోపాటు గజిబిజి..వాహన, ధ్వని కాలుష్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ♦ పరిసరాల్లో పోస్టర్లు, హోర్డింగులు, చెల్లాచెదురుగా వేలాడే విద్యుత్, టెలిఫోన్ వైర్లు లేకుండా తొలగిస్తారు. ♦ అమృత్‌సర్‌లో ఫసాడ్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగం అధికారులు అక్కడి దుకాణదారులు, వీధి వ్యాపారులతో సహ సంబంధీకులందరితో పలు పర్యాయాలు సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించారు. పాత నిర్మాణాలు దెబ్బతినకుండా, వాటినే అందంగా తీర్చిదిద్దారు. ఫుట్‌పాత్‌లకు రంగుల టైల్స్ వేశారు. పరిశుభ్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమృత్సర్ దేవాలయానికీ, చార్మినార్‌కు పలు అంశాల్లో సామీప్యతలుండటంతో ఇక్కడా అమలుకు ప్రయత్నిస్తున్నారు. -
నిరాపరాధిగా బయటపడ్డ సిద్ధూ భార్య
నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్.. అమృత్సర్ రైలు దుర్ఘటన కేసు నుంచి నిరపరాధిగా బయపడ్డారు. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 19న అమృత్సర్ సమీపంలోని రైల్వేట్రాక్ మీద గుంపుగా నిలబడి రావణకాష్టాన్ని తిలకిస్తున్న వారి మీదుగా లోకల్ ట్రైన్ దూసుకెళ్లడంతో 60 మంది మరణించారు. ఆ ఘటనలో.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు అమృత్సర్ అసెంబ్లీ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్‌తో పాటు, ఇతర నాయకుల పైన కేసులు నమోదయ్యాయి. నిర్వాహకుల అలక్ష్యం తప్ప, ఇందులో కౌర్ బాధ్యతారాహిత్యం ఏమీ లేదని తాజా నివేదిక తేల్చింది. కౌర్ భర్త సిద్ధూ కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం.పి. సావిత్రీబాయి ఫూలె పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక ధోరణికి, విభజన రాజకీయాలకు విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీగా మాత్రం పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఫూలే బి.ఎస్.బి. సెక్టార్ కోఆర్డినేటర్‌గా 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో బి.జె.పి.లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బల్హా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బారైచ్ ఎంపీగా విజయం సాధించారు. రెండు రోజుల క్రితం డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహాలకు, ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితున్న సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సావిత్రీబాయి ఫూలే విమర్శించారు. అంటార్కిటిక్ సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల దారి తప్పిన ఒంటరి బ్రిటిష్ నావికురాలు ఒకరిని చిలీ అధికారులు రక్షించారు. సూసీ గుడ్‌ఆల్ అనే ఆ సాహస యాత్రికురాలిని కేప్ హార్న్‌కు 2000 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా, భద్రంగా దక్షిణమెరికా ఒడ్డుకు చేర్చారు. అప్పటికి రెండు రోజులుగా ఆ కల్లోల సముద్రంలో ధైర్యంగా నిలదొక్కుకుని ప్రపంచంతో ఆమె కమ్యూనికేషన్ ఏర్పచుకోగలిగారు. -
ఆ ప్రమాదంతో సిద్ధు దంపతులకు సంబంధం లేదు!
చండీగఢ్ : ఈ ఏడాది విజయదశమి వేడుకల సందర్భంగా అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో సుమారు 61 మంది మరణించగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిర్వహించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. కాగా ఇందుకు సంబంధించిన 300 పేజీల నివేదికను అధికారులు రూపొందించారు. సిద్ధు దంపతులకు సంబంధం లేదు.. అమృత్‌సర్‌లో జరిగిన ప్రమాదానికి రైల్వే అధికారులు- పోలీసులు, అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. అదే విధంగా సౌరభ్ మిథు మదన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి పొందాడు గానీ, అందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయాడని తెలిపింది. అయితే సౌరభ్ మిథు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు సన్నిహితుడు కావడం, రావణ దహన కార్యక్రమానికి సిద్ధు భార్య, మాజీ ఎమ్మెల్యే నవజోత్ కౌర్ హాజరుకావడంతో వీరిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధు దంపతుల పేరు చెప్పి ఈ కార్యక్రమానికి మిథు అధిక సంఖ్యలో జనాలను పోగు చేసి వారి మరణానికి కారణమయ్యాడనే వాదనలూ వినిపించాయి. (‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’) ఈ నేపథ్యంలో ఈ ఘటనతో సిద్ధు దంపతులకు ఏమాత్రం సంబంధం లేదని, ముఖ్య అతిథిగా హాజరైనంత మాత్రాన నవజ్యోత్ కౌర్ ఈ ఘటనకు బాధ్యురాలు కాదంటూ నివేదిక క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక.. ఈ ఘటనపై గతంలో విచారణ జరిపిన రైల్వే సెక్యూరిటీ చీఫ్ కమిషనర్.... కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించునందు వల్లే ప్రాణాలు కోల్పోయారని, తమకు ఎటువంటి సంబంధం లేదని నివేదిక ఇచ్చారు. -
అమృత్సర్ దాడి ఉగ్రచర్యే
అమృత్సర్: అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్లో భక్తులపై దాడి ఉగ్రచర్యేనని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఆదివారం దాడికి గురయిన ఆద్లివాల్లోని నిరంకారీ భవన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ ఘటనలో లభ్యమైన ఆధారాల సాయంతో బాధ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. దాడికి కారకులైన వారిపై సమాచారం అందించిన వారికి రూ.50లక్షల పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. ‘నిరంకారీ భవన్‌పై దాడి వెనుక పాకిస్తాన్ ప్రోద్బలం ఉంది. ఈ దాడిలో వాడిన గ్రెనేడ్ పాక్ ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన గ్రెనేడ్ మాదిరిగానే ఉంది’ అని అమరీందర్ అన్నారు. ‘ఇలాంటి హెచ్‌జీ–84 రకం గ్రెనేడ్ ఒక దానిని గత నెలలో ఉగ్ర స్థావరాలపై దాడిలో రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్నిబట్టి ఈ ఘటన ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తాన్ లేదా వేర్పాటువాదుల పనేనని భావిస్తున్నాం.’ అని చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
పంజాబ్‌లో ఉగ్రదాడి
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ నగర శివార్లలో ఉన్న సంత్ నిరంకారి భవన్‌పై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ప్రార్థనలు జరుగుతుండగా ఇద్దరు ఉగ్రవాదులు భక్తులపైకి గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ముగ్గురు మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిని తాము ఉగ్రవాదుల దుశ్చర్యగానే భావిస్తున్నామని పోలీసులు చెప్పగా, దాడి వెనుక ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థలు ఉండొచ్చనీ, పంజాబ్‌లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయతిస్తోందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. అమృత్సర్ శివార్లలో, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న రాజాసన్సీ ప్రాంతంలోని అద్లివాల్ అనే గ్రామంలో ఉన్న సంత్ నిరంకారి భవన్‌పై ఈ దాడి జరిగింది. దాదాపు 200 మంది నిరంకారీలు లోపల ప్రార్థనలు చేస్తుండగా, మొహాలకు ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. ద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి లోపలకు చొరబడిన అనంతరం ప్రార్థనలు చేస్తున్న వారిపైకి గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. దీనిని ఉగ్ర చర్యగానే తాము పరిగణిస్తున్నామని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. గ్రెనేడ్ పడిన ప్రాంతంలో చిన్న గుంత ఏర్పడిందన్నారు. అక్కడ పడి ఉన్న గ్రెనేడ్ ముక్కలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. నిరంకారి భవన్ ప్రాంతంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలను అమర్చలేదని ఐజీ ఎస్ఎస్ పర్మార్ చెప్పారు. దాడి జరిగిన నిరంకారి భవన్‌కు సీల్ వేసిన పోలీసులు, పంజాబ్‌లోని ఇతర నిరంకారి భవన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హెచ్చరికలు ఉన్నా దాడి.. 1980, 90ల్లోని తీవ్ర హింసాత్మక పరిస్థితుల నుంచి బయటపడి, ఇటీవలే శాంతి నెలకొన్న పంజాబ్‌లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవలే హెచ్చరించారు. మరోవైపు ఆరు నుంచి ఏడు మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్నారనీ, వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా నిఘా సమాచారం ఉంది. కొన్ని రోజుల క్రితమే పఠాన్‌కోట్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి కారును నలుగురు కలిసి లాక్కొని పరారయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉన్నా ఆదివారం నిరంకారి భవన్‌పై దాడి జరగడం గమనార్హం. తీవ్రంగా భయపడ్డాం:ప్రత్యక్ష సాక్షులు గ్రెనేడ్ దాడి కారణంగా తాము తీవ్ర భయానికి లోనయ్యామని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గ్రెనేడ్ పేలిన అనంతరం భవన్లో దట్టమైన పొగ అలముకుందనీ, భక్తులంతా పరుగులు తీశారని చెప్పారు. ప్రతి ఆదివారం తాము ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడం మామూలేనన్నారు. సిమ్రన్‌జిత్ కౌర్ అనే మహిళ మాట్లాడుతూ ‘ప్రతి ఆదివారం నేను ఇక్కడ సేవకు వస్తాను. నేను గేటు వద్ద విధుల్లో ఉండగా యుక్తవయసులో ఉన్న ఓ వ్యక్తి మొహానికి ముసుగు కప్పుకుని వచ్చాడు. ఏదో విసిరి పరారయ్యాడు. అది బాంబు అని తర్వాత అర్థమైంది. అంతటా దట్టమైన పొగ అలముకుంది. అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు’ అని ఆమె తెలిపారు. ప్రశాంతతకు భంగం కలగనివ్వం: సీఎం పంజాబ్ చాలా కష్టపడి సంపాదించుకున్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు దుష్టశక్తులకు అవకాశం ఇవ్వబోమని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ భయపడాల్సిన పని లేదని ఆయన అభయమిచ్చారు. ఈ దాడి వెనుక ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో కల్లోలం సృష్టించేందుకు పాక్ దుర్మార్గ ప్రయత్నాలు చేస్తోందన్న భావన ఈ దాడితో బలపడిందన్నారు. మృతుల బంధువులకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సీఎం, క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దాడి వెనుక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. గత 18 నెలల్లో 15 ఉగ్ర కుట్రలను భగ్నం చేసినట్లు సీఎం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు.. రోదిస్తున్న బాధితుల కుటుంబీకులు -
అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
అమృత్సర్(పంజాబ్): అమృత్సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్ అధికారి సురీందర్ సింగ్ తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన సీఎం.. గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు. -
అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
-
అమృత్సర్ రైలు ప్రమాదం.. సిద్ధూ పెద్దమనసు
చంఢీగర్ : దసరా ఉత్సవాల్లో భాగంగా అమృత్సర్ నగర శివార్లలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వందలాది మంది ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని రావణ దహనాన్ని వీక్షించే క్రమంలో రైలు వారిని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 61 మంది దుర్మరణం చెందగా మరో 57 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ మాజీమంత్రి నవజోత్‌కౌర్ సిద్దూ హాజరయ్యారు. (‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’) నవజోత్‌కౌర్ కళ్లెదుటే ఈ ఘోర ప్రమాదం జరగడం దురదృష్టకరమని పంజాబ్ మంత్రి, ఆమె భర్త నవజోత్‌సింగ్ సిద్దూ విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తానని తెలిపారు. అలాగే, ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తొలి విడతగా పంజాబ్ ప్రభుత్వం సోమవారం నష్టపరిహారాన్ని పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 21 కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్టు కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ మంత్రి బ్రామ్ మోహింద్రా తెలిపారు. మిగతా కుటుంబాలకు మరో రెండు రోజుల్లో నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. (చదవండి : అమృత్సర్ ప్రమాదం : సెల్ఫీల గోలలో పడి) -
పట్టాలపై నరమేథం!
పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో రావణదహనం కార్యక్రమం సందర్భంగా హఠాత్తుగా పెను వేగంతో వచ్చిన రైలు కింద పడి 59మంది మరణించిన దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉత్సవ నిర్వాహకులు మొదలుకొని రైల్వే శాఖ వరకూ ఎవరికి వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ విషాదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ అందరి నిర్లక్ష్యమూ జతకలిసి అమా యకుల ప్రాణాలను బలితీసుకుంది. పండగపూట అయినవారిని పోగొట్టుకుని రోదిస్తున్నవారిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఈ ప్రమాదం మరో 57మందిని తీవ్ర గాయాలపాలు చేసింది. గాయపడినవారిని వెనువెంటనే ఆసుపత్రులకు తరలించడానికి అందుబాటులో ఏ వాహ నమూ లేకపోవడం, నిర్వాహకుల్లో ఒకరైన మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే అక్కడినుంచి జారుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. మృతుల్లో అత్యధికులు కూలి పనుల కోసం బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వలస వచ్చినవారు. ప్రమాదం జరిగాక ఎవరికి వారు ఇస్తున్న సంజాయిషీలు, స్వీయ సమర్థనలు, ఆరోపణలు గమనిస్తే మన నాయకుల నైజం వెల్లడవుతుంది. ఇప్పుడింతగా మాట్లాడుతున్నవారు ప్రమాదం గురించి కాస్తయినా ఊహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఎంచుకున్న స్థలం రైలు పట్టాలకు కేవలం 70 మీటర్ల దూరంలో ఉంది. దాన్ని వీక్షించడానికి ఉన్న స్థలం కేవలం 200మందికి మాత్రమే సరిపోతుంది. ఆ ఒక్క కారణం చాలు కీడు శంకించడానికి. ఇలాంటి కార్య క్రమాలకు జనం భారీయెత్తున హాజరవుతారు. రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కమిటీకి ఇది తెలి యందేమీ కాదు. కనుక ఇంత ఇరుకైన చోటు భద్రమైనది కాదని వారు ఎప్పుడో గ్రహించి ఉండాలి. వారికా అనుమానం రాకపోయినా అనుమతి మంజూరు చేసిన పోలీసు శాఖ అంచనా వేయగలిగి ఉండాలి. ఆ ప్రాంతంలో రావణ దహనం చూడాలంటే సహజంగానే జనం పట్టాలపై చేరకతప్పదు. అంతకన్నా ముందుకెళ్తే టపాసులు వారిపై పడే ప్రమాదం ఉంటుంది. బాగా వెనక్కొస్తే సరిగా కన బడదు. ఏటా కార్యక్రమం నిర్వహించేరోజున ఇలాగే పట్టాలపై నిలబడి చూస్తామని, ఎప్పుడూ ఇంత స్పీడుగా రైళ్లు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈసారి రెండు ట్రాక్‌లపైనా ఎదురెదురుగా ఒకేసారి రైళ్లు రావడం వల్ల, ఆ సమయంలోనే రావణ దహనం కార్యక్రమం మొదలుకావడం వల్ల పేలుళ్ల చప్పుళ్లలో రైళ్ల రాకను జనం పసిగట్టలేకపోయారు. ఫలితంగా వారికి తప్పించుకునే అవ కాశం లేకుండా పోయింది. భారీయెత్తున జనం హాజరయ్యే వేడుకల్లో తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో మన ప్రభుత్వాలు ప్రతిసారీ విఫలమవుతున్నాయి. పన్నెండేళ్లకొకసారి జరిగే కుంభమేళాల్లో కనీసం నాలుగైదు సందర్భాల్లో జనం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నాయి. 1954 ఫిబ్రవరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుని 800మంది చనిపోయారు. ఆ తర్వాత సైతం నాలు గైదుసార్లు తొక్కిసలాటలు జరిగాయి. పదులకొద్దీ ఆ ఘటనల్లో చనిపోయారు. బిహార్‌లో 2014లో దసరానాడు జరిగిన రామ్‌లీలా ఉత్సవాల్లో ఇదేమాదిరి తొక్కిసలాటలో 32 మంది మరణించారు. ఇప్పుడు పంజాబ్ ప్రమాదాన్నే తీసుకుంటే ఈ వేడుకల కోసం అవసరమైన అనుమతులన్నీ తీసు కున్నామని నిర్వాహకులు చెబుతారు. వాటి సంగతి తమకు తెలియనే తెలియదని రైల్వేశాఖ అంటుంది. కార్పొరేషన్‌దీ అదేమాట. తమకు కూడా వేడుకలపై సమాచారం లేదని వివరిస్తుంది. మనకు జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ ఉంది. ప్రకృతి వైపరీత్యాలతోపాటే ఇలా భారీయెత్తున జనం గుమిగూడేచోట ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో అది మార్గ దర్శ కాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలు పోలీసు శాఖ దగ్గరుంటాయి. వాటిని సరిగా అధ్య యనం చేసి ఉంటే అక్కడ ఆ కార్యక్రమాన్ని అనుమతించేవారే కాదు. లేదా తొలుత రైల్వేశాఖ అను మతి తీసుకుని రావాలని సూచించేవారు. కనీసం ఆ సమయంలో రైళ్ల రాకపోకలను నియంత్రిం చాలని రైల్వేశాఖనైనా కోరి ఉండేవారు. అసలు నిర్వాహకులు ఎలాంటి అనుమతులూ తీసుకోలే దని అనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించనీయకూడదు. కార్యక్రమం గురించి తమకెవరూ చెప్పలేదని, ప్రజలు అక్రమంగా పట్టాలపైకి వచ్చారని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఆ ప్రాంతంలోని కాలనీ వాసులందరూ తమ రోజువారీ పనుల కోసం అక్కడ నిత్యం పట్టాలు దాటుతున్నారని ఆయనకు తెలుసో లేదో! దగ్గరున్న అండర్‌పాస్ వినియోగానికి తగినట్టుగా ఉండదని స్థానికులు చెబుతున్న మాట. పైగా కాస్త వర్షం వచ్చినా అది నీళ్లతో నిండిపోతుందని వారంటున్నారు. పట్టాలు దాటి అవతలివైపున్న మార్కెట్‌కు వెళ్లడానికి మూడు నిమిషాలు పడితే, దూరంగా ఉన్న రైల్వే గేటు గుండా వెళ్లడానికి అరగంట పడుతుందని, పైగా రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అది తరచు మూసి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని గ్రహించి ఇప్పటికే ఉన్న అండర్‌పాస్‌ను బాగుచేయించి అదనంగా ఒకటిరెండు నిర్మిస్తే మంచిదని రైల్వేశాఖకు ఎప్పుడూ అనిపించలేదు! వాటిని నిర్మించి పట్టాలకు అటూ ఇటూ కంచె నిర్మిస్తే ఇలాంటి ప్రమాదాలకు అవకాశమే ఉండదు. ఇంతటి విషాదం జరిగాకైనా తమ లోటుపాట్ల గురించి సమీక్షించుకుని సరిదిద్దుకుంటామని చెప్ప కపోగా, తప్పంతా అవతలివారిదేనని ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణం. రైల్వే శాఖ తమవైపునుంచి ఎటువంటి దర్యాప్తూ అవసరం లేదని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తు జరిపిస్తామంటోంది. కానీ ఈ దర్యాప్తులు మన దేశంలో చివరి కేమవు తాయో ఎవరికీ తెలియంది కాదు. సమస్యంతా వ్యవస్థల్లోని బాధ్యతారాహిత్యమే. ఆ సంగతిని చిత్తశుద్ధితో అంగీకరించి, చక్కదిద్దడానికి ముందుకొచ్చినప్పుడే ఈమాదిరి విషాదాలకు తెర పడుతుంది. -
పదిసార్లు చెప్పినా వినలేదు
అమృత్సర్: పండుగ వేళ అందరినీ ఒకచోట చేర్చి వేడుక నిర్వహించాలన్న ఉద్దేశంతోనే దసరా ఉత్సవం ఏర్పాటు చేశానని పంజాబ్ కాంగ్రెస్ యువజన నాయకుడు సౌరభ్ మిథు మదన్ తెలిపారు. వేడుకలు పెనువిషాదంగా మారతాయని ఊహించలేదని వాపోయారు. అమృత్సర్ నగర శివార్లలోని జోడా ఫాటక్ సమీపంలో శుక్రవారం దసరా వేడుకల సందర్భంగా జరిగిన రైలు ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యక్రమ నిర్వాహకుడైన సౌరభ్ ఈ ఘటన తర్వాత అదృశ్యమయ్యారు. సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. వేడుకల నిర్వాహణకు అన్ని అనుమతులు తీసుకున్నామని, తన తప్పేంలేదని చెప్పారు. తనపై కొంతమంది కావాలనే బురద చల్లుతున్నారని వాపోయారు. రైలు ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన చెందారు. (పెను ప్రమాదం.. అంతులేని శోకం) ‘సెక్యురిటీ కోసం 50 నుంచి 100 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. ముందస్తు జాగ్రత్త కోసం మున్సిపల్ అధికారులు అగ్నిమాపక వాహనం కూడా పంపించారు. రైలు పట్టాలపై నుంచోవద్దని ప్రజలకు కనీసం పదిసార్లు విజ్ఞప్తి చేశాన’నని వెల్లడించారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత తన తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ విజయ్ మదన్, కుటుంబ సభ్యులతో కలిసి సౌరవ్ ఉడాయించారు. శుక్రవారం రాత్రి 6.59 గంటల సమయంలో అమృత్‌సర్‌లోని పింగ్ల్వాడా ప్రాంతంలో ఉన్న తమ నివాసం నుంచి వీరంతా వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా విజయ్, సౌరభ్‌లను ఎక్కువ మంది తప్పుబడుతున్నారు. అయితే ఈ దుర్ఘటనకు మీరు కారణమంటే మీరు కారణమని రైల్వే, రాజకీయ నేతలు, స్థానిక అధికార యంత్రాంగం పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. (పచ్చి అబద్ధం.. అలా జరగలేదు!) ఎన్హెచ్ఆర్సీ నోటీసులు రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. పంజాబ్ ప్రభుత్వానికి, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పరిహారం దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరిహారం పంపిణీ చేశారు. రూ. 5 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పంజాబ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే ప్రమాదంలో మృతి చెందిన నలుగురు బిహారీల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బిహార్ సీఎం నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. -
అమృత్సర్ ప్రమాదం : డబ్బులు అడుగుతున్న వైద్యులు
అమృతసర్ : దసరా పండుగ నాడు రావణ దహనం సందర్భంగా పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఆదేశించినప్పటికి లాభం లేకుండా పోయింది. రైలు ప్రమాద బాధితుల పట్ల ప్రైవేట్ ఆస్పత్రుల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటూ ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన జనాలు ప్రమాదం చోటు చేసుకున్న జోడా ఫాటక్ రైల్వే ట్రాక్ మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల వచ్చి నిరసనకారులను శాంతింపచేసి అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అంతేకాక ఎవరైనా బాధితుని వద్ద నుంచి ప్రైవేట్ ఆస్పత్రి వారు డబ్బు వసూలు చేస్తే, దాన్ని తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. శుక్రవారం నుంచి వైద్యం పొందుతున్న రైలు ప్రమాద బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
పచ్చి అబద్ధం.. అలా జరగలేదు!
అమృత్సర్: దసరా పండుగ రోజున పెను విషాదం మిగిల్చిన రైలు ప్రమాదంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాలపై గుమిగూడిన ప్రజలను చూసి అత్యవసర బ్రేకు వేశానని డీఈఎంయూ రైలు డ్రైవర్ అరవింద కుమార్ తెలిపారు. అయితే అక్కడున్నవారు రాళ్లు రువ్వడంతో రైలును ఆపకుండా అమృత్సర్ స్టేషన్‌కు చేర్చినట్టు వెల్లడించారు. అయితే ఈ వాదనను ప్రత్యక్ష సాక్షులు తోసిపుచ్చారు. (పెను ప్రమాదం.. అంతులేని శోకం) ‘డ్రైవర్ అరవింద కుమార్ అబద్దాలు చెబుతున్నారు. అసలు రైలును ఆపలేదు. కనీసం స్పీడు కూడా తగ్గించలేదు. క్షణాల వ్యవధిలోనే రైలు మమ్మల్ని దాటుకుని వెళ్లిపోయింది. రైలు కింద పడి ఎంతో మంది చనిపోయారు. క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా రాళ్లు విసురుతారా? అత్యంత వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు రువ్వడం సాధ్యమా?’ అని ప్రత్యక్ష సాక్షి మున్సిపల్ కౌన్సిలర్ శైలెందర్ సింగ్ షాలె ప్రశ్నించారు. ఆస్కారమే లేదు పెద్ద సంఖ్యలో గూమిగూడిన ప్రజలను చూసిన తర్వాత కూడా రైలు వేగం తగ్గించలేదని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘వేగంగా రైలు నడపడం వల్లే క్షణాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలును నెమ్మదిగా నడిపివుంటే ప్రమాద తీవ్రత తగ్గేది. రైలు ఎంత వేగంగా వెళుతుంతో తెలిపే వందలాది వీడియోలున్నాయి. మేమంతా స్పందించి, రాళ్లు విసరడానికి ఆస్కారమే లేదు. బాధితుల హాహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లింద’ని పరమ్‌జీత్ సింగ్ అనే వ్యక్తి తెలిపారు. విసిరేలోపు వెళ్లిపోయింది ఎవరూ రాళ్లు విసరలేదని, రైలు డ్రైవర్ ఎందుకు అబద్ధం చెబుతున్నాడో అర్థం కావడం లేదని అజయ్ గోయంకా పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఒకవేళ రాళ్లు రువ్వాలనుకున్నా ఆలోపు రైలు వెళ్లిపోతుందన్నారు. అంత వేగంగా రైలు వెళ్లిపోయిందన్నారు. స్థానిక పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షుల వాదనతో ఏకీభవిస్తున్నారు. రైలు వెళుతుండగా అక్కడున్న వారెవరూ రాళ్లు విసరలేదని పోలీసు అధికారి సుఖ్మిందర్ సింగ్ తెలిపారు. దీనిపై స్పందించేందుకు రైల్వే అధికారులు అందుబాటులోకి రాలేదు. రైలు స్పీడు ఎంత? ప్రమాదానికి కారణమైన డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్(డీఈఎయూ) రైలు గరిష్ట వేగం గంటకు 96 కిలోమీటర్లు. రైలు ఖాళీగా ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే 300 మీటర్లలోపు ఆగుతుంది. ప్రయాణికులతో ఉంటే బ్రేకు వేసినప్పుడు 600 మీటర్లలోపు ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. చివరిసారిగా నమోదైన ఈ రైలు వేగం 68 కేఎంపీహెచ్ అని ఫిరోజ్‌పూర్ డివిజినల్ రైల్వే మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. సంబంధిత వార్తలు ‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’ ‘మరో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఇది’ అమృత్సర్ ప్రమాదం : పాపం దల్బీర్ సింగ్ ప్రమాదంలో మా తప్పు లేదు : రైల్వే శాఖ -
‘మరో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఇది’
ముంబై : అమృత్సర్ రైలు ప్రమాదాన్ని జలియన్‌వాలా బాగ్ ఉదంతంతో పోలుస్తూ శివసేన తన పత్రిక సామ్నాలో కథనం వెలువరించింది. బ్రిటిషర్ల చేతిలో జలియన్ వాలా బాగ్‌లో అమాయక ప్రజల మీద ఊచకోత జరిగితే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారతీయులు చీమల్లా చచ్చిపోతున్నారంటూ ఘాటుగా విమర్శించింది. విజయదశమి వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వందలాది మంది రైల్వే ట్రాక్‌పైకి రావడంతో రైలు ఢీకొని 61 మంది మరణించగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఈ పెను ప్రమాదం సంభవించిందని శివసేన విమర్శించింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రమాదం జరిగిన పదహారు గంటల తర్వాత ఘటనాస్థలికి చేరుకోవడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతీసారి ఓ నూతన రైల్వేశాఖా మంత్రి మనకు దర్శనమిస్తారంటూ ఎద్దేవా చేసింది. నాడు డయ్యర్ సృష్టించిన నరమేధం.. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన ఘటనగా జలియన్ వాలాబాగ్ నరమేధం నిలిచింది. పంజాబ్‌లోని అమృత్సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్‌లో ఏప్రిల్ 13, 1919న భారీ సంఖ్యలో ప్రజలు సమావేశమయ్యారు. ఆంగ్లేయుల అరాచకాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలు వినేందుకు, రౌలట్ చట్టం కింద సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిక్కులు జలియాన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. అదే రోజు సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం కూడా కావడంతో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు అక్కడికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన జనరల్ డయ్యర్...నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపించాడు. పది నిమిషాలపాటు, 1650 రౌండ్లు కొనసాగిన ఈ కాల్పుల్లో... అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 1000 కి పైగానే ఉండగా.. మరో 2000 మందికి పైగా గాయపడ్డారు. పారిపోయేందుకు కూడా వీలు లేకపోవడంతో బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది అక్కడ ఉన్న బావిలో దూకగా వారిని కూడా పైకి తీసుకొచ్చి అత్యంత దారుణంగా హతమార్చారు. అదే సమయంలో నగరంలో కర్ఫ్యూ కూడా కొనసాగుతుండటంతో, ఆస్పత్రికి తీసుకువెళ్లే వీలులేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. -
‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’
-
‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’
అమృత్సర్ : విజయదశమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వందలాది మంది రైల్వే ట్రాక్‌పైకి రావడంతో రైలు ఢీకొని 61 మంది మరణించగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ కౌర్ సిద్దూ పాల్గొన్నారు. అయితే, రైలు ప్రమాదానికి కొన్ని నిముషాల ముందు కార్యక్రమ నిర్వాహకులు ఆమెతో చెప్పిన కొన్ని మాటలు సంచలనం రేపుతున్నాయి. ‘మేడమ్..! చూడండి కార్యక్రమంలో భాగం కావడానికి ఎంతమంది వచ్చారో. అయిదువేల మంది రైల్వే ట్రాక్‌లను లెక్కచేయకుండా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. 500 ట్రైన్లు వచ్చినా వాళ్లు భయపడరు’అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ‘ఘనంగా’ పండుగ చేశారని కార్యక్రమ నిర్వాహకులపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కారకులు.. కారులో పరార్..! ఇదిలా ఉండగా.. నిర్వాహకుల అజాగ్రత్తతోనే ప్రజలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేకుండా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారనీ, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రైలు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కార్యక్రమ నిర్వాహకుడు సౌరభ్మదన్ మిట్టు తన తండ్రితో కలిసి పరారయ్యాడు. ఈ దృశ్యాలు అతని ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రమాదం జరిగి రెండు రోజులైనా నిందితుడు సౌరభ్మదన్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుని ఇంటిపై దాడి చేసి కిటీకీలు ధ్వంసం చేశారు. -
రైలు ప్రమాదం: రాజకీయ దుమారం..!
అమృత్సర్ : అమృత్సర్ రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన నాయకులు ప్రమాదానికి కారణం మీరంటే మీరేనని ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీలు అధికార పక్షమైన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీనే పరోక్షంగా ప్రమాదానికి కారణమైందని కేంద్రమంత్రి, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకుండా, రైల్వే శాఖకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా రావణ దహనం చేశారని నిర్వహకులుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవ్వన్నీ ఇలా ఉండగా ప్రమాదంపై తమ తప్పేమీ లేదని, సిగ్నల్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నందుకే రైలు వేగంగా దూసుకుని వెళ్లిందని రైల్వే శాఖ ప్రకటించి చేతులు దులుపుకుంది. నాయకులు ప్రకటనలపై సామన్య ప్రజలు దుమ్మెతిపోస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందిపోయి మీరంటే మీరే కారణమని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏంటిని కొందరు ప్రశ్నిస్తుండగా.. ప్రమాదాన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తుండడం బాధకరమని ప్రముఖలు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ భార్య నవజ్యోత్కౌర్ సిద్దు తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆమె కనీసం ఘటన స్థలికి వెళ్లకుండా ప్రమాదం జరిగిన వెంటనే ఆమె వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రైల్వే ట్రాక్‌పై మేం నిలుచోమని చెప్పామా.. వాళ్లపై నుంచి వెళ్లమని ట్రైన్‌కు మేం చెప్పామా అంటూ దురుసుగా వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ప్రకటించారు. కాగా ప్రమాదంపై ఇప్పటివరకూ ఏఒక్కరిపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం. -
గుండెలు పిండేసే విషాదం..
‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఆకాశ్. నల్ల చొక్కా ధరించివున్నాడు. ఇతడిని ఎవరైనా చూశారా?’ అంటూ ఓ వ్యక్తి అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆస్పత్రి కారిడార్‌లో అందరినీ అడుగుతున్నాడు. శవాలను ఉంచే గదిలోకి వెళ్లి చూడాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. ‘ఇప్పటికే నేను మూడు ఆస్పత్రులకు వెళ్లాను. ముందుగా వార్డుల్లో వెతికాను. నేనెందుకు మృతదేహాలను చూడాలి? అతడు చనిపోలేదు’ అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. పంజాబ్‌లోని అమృత్సర్ నగర శివార్లలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన వారి గురించి వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు బతికున్నారో, ఆస్పత్రుల్లో ఉన్నారో తెలియక బాధిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తమ వారి ఆచూకీ కోసం రాత్రంతా ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ప్రమాదానికి కారణమైన రైలుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘రైల్వే ట్రాక్‌పైకి వెళ్లొద్దని అతడికి చెప్పాను. రైలు పట్టాలపైకి వెళ్లడం ప్రమాదమని చెప్పి వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింద’ని కన్నీళ్ల పర్యంతమయ్యారు 54 ఏళ్ల ముకేశ్ కుమార్. డ్రెస్సింగ్ రూమ్ బయట తన కుమారుడు నీరజ్ (19) మృతదేహం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారాయన. మృతులు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రిలోని డ్రెస్సింగ్ రూమ్‌ను మార్చురీగా వినియోగిస్తున్నారంటే పరిస్ధితి ఎంత హృదయ విదాకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘అమృతసర్ రైలు ప్రమాదంతో మరో జలియన్‌వాలా బాగ్ లాంటి మారణోమం జరిగింది. ఈ ఘోర ప్రమాదాన్ని ఎన్నటికీ మర్చిపోలేమ’ని ముకేశ్ కుమార్ ఆవేదన చెందారు. గురునానక్ దేవ్ ఆస్పత్రిలో సరైన వసతులు లేవన్న విమర్శలు వినవస్తున్నాయి. ‘మృతదేహాలను ఉంచడానికి ఐస్ లేదు. గ్లౌజులు, మాస్కులు లేవు. ఇవన్నీ ఏర్పాటు చేయాలని అధికారులను కోరాం. చెడు వాసన వస్తోందని మృతదేహాలను ముట్టుకునేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. మృతుల సంబంధించిన గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు వెతకాలని మమ్మల్ని డాక్టర్లు అడుగుతున్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నార’ని వలంటీర్లు వాపోయారు. గురునానక్ దేవ్ ఆస్పత్రిలో 19 మృతదేహాలను కింద పడేశారు. మృతుల్లో 8 మందిని మాత్రమే గుర్తించారు. ‘శరీర భాగాలు తెగిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. ఒక మృతదేహానికి తల కూడా లేదు. ఏడాది పాప, ఆమె తల్లి కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. మా నగరానికి ఈ రైలు రావణుడిలా వచ్చింద’ని రూపక్ అనే వలంటీర్ వెల్లడించారు. ‘గొర్రెలు, మేకలను నరికినట్టుగా మనుషుల శరీరాలను ఈ రైలు ఖండించింది. నా సోదరుడిని ఈ రైలు మింగేసింద’ని అశోక్ కుమార్ అనే యువకుడు భోరున విలపించాడు. అతడి సోదరుడు దీపక్(18) మృతదేహం రెండు భాగాలు విడిపోవడంతో జతచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. గురునానక్ దేవ్ ఆస్పత్రిలో బాధితుల తరపువారి ఎదురుచూపులు తన మరిది థాకూర్ ప్రసాద్(40) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారని జానకి అనే మహిళ వెల్లడించారు. ‘రావణ దహనం చూడటానికి ప్రసాద్ ఎప్పుడూ వెళ్లలేదు. మొట్టమొదటిసారి వెళ్లారు. రైలు ప్రమాదం జరిగిందని టీవీలో చూశాక అతడికి ఫోన్ చేశాను. ఓ డాక్టర్ ఫోన్లో మాట్లాడారు. ప్రసాద్‌కు సీరియస్‌గా ఉందని చెప్పారు. అతడు చనిపోయాడని తెలుసుకుని ప్రసాద్ భార్య కుప్పకూలిపోయింది. అతడితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయార’ని జానకి తెలిపారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలతో గురునానక్ దేవ్ ఆస్పత్రి ప్రాంగణం మార్మోగుతోంది. మరోవైపు క్షతగాత్రులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు భారీ సంఖ్యలో దాతలు తరలి వస్తున్నారు. సరిపడా రక్తం అందుబాటులో ఉందని, అవసరమైతే ఫోన్ చేస్తామని చెప్పి వారికి ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితుల కుటుంబీకులు ఆహార పానీయాలు అందిస్తున్నారు. మరోవైపు తమ శక్తికి మించి పనిచేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. సంబంధిత వార్తలు... అమృత్సర్ ప్రమాదం: పాపం దల్బీర్ సింగ్ అమృత్సర్ ప్రమాదం: సెల్ఫీల గోలలో పడి ప్రమాదంలో మా తప్పు లేదు: రైల్వే శాఖ -
అమృత్సర్ ప్రమాదం : సెల్ఫీల గోలలో పడి
అమృత్సర్ : సెల్ఫీల పిచ్చి ఎలాంటి ప్రమాదాలు తీసుకోస్తుందో చూస్తునే ఉన్నాం. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలతో చెలగాటమడుతున్నారు జనాలు. తాజాగా రెండు రోజుల క్రితం పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదం దాదాపు 60 మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరగాడానికి ముఖ్య కారణం ఒకటి.. రైల్వే ట్రాక్ పక్కన వేడుకలు నిర్వహించడమయితే.. రెండు.. వేడుక చూడ్డానికి వచ్చిన జనాలు వీడియోలు తీస్తూ.. సెల్ఫీలు దిగుతూ పరిసరాలను పట్టించుకోలేదు అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఒక వైపు బాణాసంచా హడావుడి.. మరో వైపు ఫోన్లో బిజీగా ఉన్న జనాలు తాము ఉన్న పరిసారలను మర్చిపోయారు. ఇంతలో రైల్వే ట్రాక్‌పై నిల్చుని రావణ దహన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. అదే సమయంలో మరో ట్రాక్‌పైకి ఇంకో రైలు రావడంతో అక్కడివారికి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లభించలేదు. దాంతో పండుగ నాడే వారంతా మృత్యు కౌగిలోలికి చేరారు. ఈ ఘటనలో దాదాపు 61 మంది మృత్యువాత పడగా, మరో 72 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. -
ప్రమాదంలో మా తప్పు లేదు : రైల్వే శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తమ తప్పేమిలేదని రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే ట్రాక్ పక్కన వందలాది మంది గుమ్మికూడి ఉంటారని తమకు ముందస్తుగా సమాచారం లేదని రైల్వే అధికారుల తెలిపారు. తమను సమాచారం లేకపోవడంతోనే రైల్ వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని రైల్వే డివిజన్ మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని.. దీనిలో తమ తప్పేమి లేదని తెలిపారు. ప్రమాదంపై రైలు డ్రైవర్ మాట్లాడుతూ.. ట్రాక్ సమీపంలో వందల మంది గుమ్మిగూడి ఉన్నారని తనకు తెలిదని.. గ్రీన్ సిగ్నల్ ఉన్నందునే టైన్ వేగంగా వెళ్లిందని అన్నారు. దసరా వేడుకలు సందర్భంగా అమతృసర్ సమీపంలో శుక్రవారం జరిగిన దుర్ఘటనలో 61 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిలుచుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిపై హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. కాగా ట్రాక్ పక్కన రావణ దహన కార్యక్రమాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంతో ఇప్పటి వరకు ఎవ్వరిపై కూడా కేసు నమోదు కాలేదు. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతులకు సంతాపం తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని సీఎంతో పాటు, కేంద్ర రైల్వే సహాయక మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. కాగా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో దసర ఉత్సవాలు జరగుతున్నాయని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక అధికారులపై రైల్వే శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పండగ రోజునే ప్రమాదం జరగడంతో దేశ వ్యాప్తంగా విషాదం నిండుకుంది. -
అమృత్సర్ ప్రమాదం : పాపం దల్బీర్ సింగ్
అమృత్సర్ : పంజాబ్లోదసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అమృత్‌సర్‌లోని జోడా పాఠక్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్‌ను ఆనుకొని ఉన్న స్థలంలో దసరా సందర్భంగా శుక్రవారం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నుంచుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.ఈ దుర్ఘటనలో కనీసం 61 మంది చనిపోగా.. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోనే రావణాసురిడి వేషం కట్టిన దల్బీర్ సింగ్ప్రాణాలు కోల్పోయాడు. దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ రామ్‌లీలా నాటకం వేస్తారు. ఈ క్రమంలో అమృత్‌సర్‌కు చెందిన దల్బీర్ సింగ్ కూడా కొన్నేళ్లుగా రామ్‌లీలా నాటకంలో రావణుడి వేషం వేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా అతను అమృత్‌సర్‌లో జరిగిన రామ్‌లీలా నాటకంలో రావణుడి వేషం వేశాడు. అయితే జోడా పాటక్ వద్ద జరుగుతున్న రావణ దహన వేడుకను వీక్షిస్తున్న సమయంలో దల్బీర్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. రైల్వే ట్రాక్‌పై నిలబడి.. దల్బీర్ ఆ వేడుకను వీక్షించాడు. బాణాసంచ పేల్చుతున్న సమయంలోనే లోకల్ రైలు దూసుకురావడంతో.. ట్రాక్‌పై ఉన్న దల్బీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పట్ల దల్బీర్ ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. దల్బీర్‌కు 8 నెలల చిన్న బాబు ఉన్నాడు. కుటుంబానికి ఆధారం అయిన కుమారుడు మరణించడంతో.. తన కోడలికి ఉద్యోగం ఇప్పించాలని దల్బీర్ తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దూసుకొచ్చిన మృత్యువు -
రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
అమృత్సర్ దసరా వేడుకలలో తీవ్ర విషాదం
-
ఘోర ప్రమాదం; 50 మందిపైగా మృతి
అమృత్సర్: పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమృత్సర్ దసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 50 పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. చౌరా బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నుంచుని వీక్షిస్తున్న వారిపై హవ్డా ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు ‘ఏఎన్ఐ’తో చెప్పారు. నకోదర్ నుంచి జలంధర్ వెళుతున్న డీఎంయూ రైలు (నంబర్ 74943) వేగంగా దూసుకురావడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది గాయపడ్డారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 50 మందిపైగా మృతి చెందారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించామని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సమాచారం అందుకున్నవెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మండిపడుతున్నారు. రైలు వస్తున్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు రైలును నిలివేయడమో లేదా వేగం తగ్గించమని చెప్పడమో చేయాల్సిందని అంటున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యా: సీఎం అమృత్‌సర్‌లో రైలు ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను తెరిచే ఉంచాలని ఆదేశించినట్టు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ఏడీజీపీ వెంటనే ప్రమాదస్థలికి వెళ్లాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రెవెన్యూ మంత్రి సుఖ్బిందర్ సర్కారియాను ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా సూచించారు. రేపు (శనివారం) సంఘటనా స్థలాన్ని అమరీందర్ సింగ్ పరిశీలించనున్నారు. హృదయ విదారకం: ప్రధాని మోదీ అమృత్సర్ రైలు ప్రమాదం తనను ఎంతో కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరం, హృదయ విదారకమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దసరా వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకోవడం పట్ల మాటలు రావడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. (ప్రమాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోలు) -
దారుణం.. మహిళను పోలీస్ జీప్‌పై కట్టేసి..
అమృత్సర్ : పంజాబ్ పోలీసులు ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఓ మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఆమెను జీపు పై భాగంలో కట్టేసి ఊరంతా తిప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామానికి చెందిన బాధితురాలి మామ ఓ ఆస్తివివాదంలో నిందితుడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయడానికి వాళ్ల ఇంటికి వెళ్లగా అతను లేడు. దీంతో వారు ఆమె భర్తను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకుంది. ఆగ్రహానికిలోనైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతగా జీపు పైభాగాన్ని కట్టేసి ఊరంతా తిప్పారు. వాహనాన్ని వేగంగా పోనివ్వడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు ముస్లిం యువకుడిని ప్రేమించిందని ఓ యువతిని జీపులో ఎక్కించి కొడుతూ అమానుషంగా ప్రవర్తించిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి: ప్రేమ వ్యవహారం: యువతిని హింసించిన పోలీసులు) -
బ్యాండ్, బాజాలతో వచ్చిన వరుడికి షాక్
అమృత్సర్ : మరికొన్ని క్షణాల్లో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందంలో... బ్యాండ్, బాజా, భజంత్రీలతో ఊరేగుకుంటూ పెళ్లి మండపానికి వచ్చిన వరుడికి ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లి మండపం వద్ద కనీసం పెళ్లి ఏర్పాట్లే కాకుండా.. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. దీంతో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందమంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఈ సంఘటన అమృత్‌సర్‌లో జరిగింది. స్థానిక ఆసుపత్రిలో పారామెడిక్ అయిన పర్గత్ సింగ్, తను పెళ్లి చేసుకోవాలనుకున్న సిమ్రాన్‌జిత్ కౌర్‌ను గత కొన్నినెలల క్రితమే కలిశాడు. ఉద్యోగం కోసం పర్గత్ సింగ్ ఆసుపత్రికి వచ్చిన సిమ్రాన్‌జిత్ కౌర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లికి వరుడు తరుఫు కుటుంబం ఎలాంటి షరతులు పెట్టకుండానే అంగీకరించింది. హమ్మయ్యా.. ఇక ఎలాంటి తలనొప్పులు లేవు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి కోసం పర్గత్‌ను సిమ్రాన్‌జిత్, బల్జీత్ కౌర్ అనే మహిళకు పరిచయం చేసింది. ఆమెనే తమ పెళ్లి తేదీలను నిర్ణయిస్తుందని చెప్పింది. అంతేకాక తమ కుటుంబం కోసం పెళ్లి పనులన్నీ తానే చూసుకుంటుందని తెలిపింది. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాననే సంబురంలో అన్నింటికీ ఓకే చెప్పేశాడు పర్గత్. ఈ వేడుక కోసం పెళ్లి కూతురు వైపు వారు తాజ్ ప్యాలెస్ బాంకెట్ హాల్‌ను బుక్ చేసినట్టు చెప్పారు. పర్గత్ తన కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తంగా కలిపి 150 మందితో బ్యాండ్, బాజా, భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కానీ బాంకెట్ హాల్ వారు మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు. అసలేమైంది అని కనుక్కుంటే, పెళ్లి కోసం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగలేదని తెలిసింది. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోయారు. పెళ్లి కూతురి తరుఫు బంధువులకు ఎంతమందికి ఫోన్లు చేసినప్పటికీ, ఒక్కరూ లిఫ్ట్ చేయకపోవడంతో, ఇక ఏం చేయలేని స్థితిలో పెళ్లి కొడుకు బ్యాచిలర్‌గానే తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉద్యోగం కోసం సిమ్రాన్‌జిత్ కౌర్ కొన్ని నెలల కిత్రం తనను కలిసిందని, తన కోసం ఉద్యోగం ప్రయత్నిస్తున్న సమయంలో తామిద్దరం ప్రేమలో పడ్డామని పర్గత్ చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్టు తెలిపాడు. ఈ పెళ్లి కోసం బల్జీత్ కౌర్‌కు 70వేల రూపాయలు ఇచ్చినట్టు చెప్పాడు. బల్జీత్, సిమ్రాన్‌జిత్‌లు కలిసి తనను మోసం చేసినట్టు లబోదిబోమంటున్నాడు. పోలీసు స్టేషన్లో తన ఫిర్యాదును నమోదు చేశాడు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం తాను లక్షన్నర ఖర్చు చేశానని, కానీ ఆఖరికి సిమ్రాన్‌జిత్ ఇలా చేస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పర్గత్ అసలు, సిమ్రాన్జిత్ను, బల్జీత్కౌర్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలువలేదని ఛేహార్తా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చెప్పారు. కేవలం మొబైల్ ఫోన్లోనే వారితో సంభాషించినట్టు వెల్లడించారు. విచారణలో నిజనిజాలన్నీ బయటికి వస్తాయన్నారు. -
ఖైదీల కూలర్లో భారీగా ‘కట్టలు’.. వైరల్!
అమృత్సర్ : విడుదలైన ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్లో బయటపడ్డ వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు జైలు అధికారులు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్సర్ సెంట్రల్ జైలు అధికారులు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి జైల్లోని కొన్నిచోట్ల వాటర్ కూలర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇటీవలే కొందరు ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి ఈ విషయం తెలిసింది. దీంతో తాము కూడా జైలు కోసం కూలర్ బహూకరిస్తామని అభ్యర్థించారు. అందుకు అధికారులు అంగీకరించడంతో ఓ వాటర్ కూలర్ని తెచ్చి వారికి అందజేశారు. అయితే, కూలర్ విషయంలో జైలు సిబ్బందికి ఎక్కడో అనుమానం వచ్చింది. దాంతో తెరచిచూసిన అధికారులు కంగుతిన్నారు. అందులో నుంచి ఏకంగా 1780 బీడీ కట్టలు, రెండు ప్యాకెట్ల పొగాకు బయటపడ్డాయి. జైలు లోపల ఉన్న తమ సహచర ఖైదీల కోసం విడుదలైన ఖైదీలు ఈ ప్లాన్ వేశారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. మహిందర్ సింగ్ అనే వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. -
వైరల్ : ఖైదీలు బహుకరించిన వాటర్ కూలర్లో
-
240 ప్రాణాలు..15 వేల అడుగులు
న్యూఢిల్లీ: ఓ విమానం.. 240 మంది ప్రయాణికులు.. 15 వేల అడుగుల ఎత్తు.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఊడిపడిన విమానం కిటికీ ప్యానెల్.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర గందరగోళం.. ఆందోళన.. 12 నిమిషాలపాటు నరకం. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన విమానం. ఈనెల 19న అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఎయిరిండియా విమానంలో నెలకొన్న పరిస్థితి ఇది. విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉండగా తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అదే సమయంలో కిటికీ ప్యానెల్ ఊడిపడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో, తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారు వేరే విమానాల్లో వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎయిరిండియాతోపాటు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టొరేట్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాల దర్యాప్తు బోర్డు (ఏఏఐబీ) విచారణ జరుపుతున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 50 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఊడిపడిన కిటికీ ప్యానెల్‌ను తిరిగి బిగించేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయత్నిస్తుండటం అందులో కనిపించింది. -
వైరల్ : గాల్లోనే తెరుచుకున్న విమానం కిటికీ
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం(ఏప్రిల్ 19) అమృత్సర్ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయింది. ఒక్కసారిగా విమాన కిటికీ తెరుచుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం 15వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన కిటికీ ఒక్కసారిగా తెరుచుకుందని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అందించామన్నారు. విమానంలో పది నిమిషాల పాటు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఎయిర్‌హోస్టెస్ కిటికీని యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికి
-
జమ్మూ కశ్మీర్లో భూకంపం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. రిక్టర్ స్కేలు భూకంప తీవ్రత 4.0 గా నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ అధికారంగా వెల్లడించింది. సోమవారం ఉదయం 6.06 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అలాగే భూకంప కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లా కేంద్రంగా గుర్తించారు. ఈ ఘటనకు సంభవించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘నీవు మరణించినా...నీ గాత్రం అమరం’
అమృత్సర్ : ప్రముఖ సూఫీ సంగీత విద్వాంసుడు, వడాలి బ్రదర్స్‌లో చిన్నవాడైన ఉస్తాద్ పురాన్ చాంద్ వడాలి(75) శుక్రవారం ఉదయం అమృత్‌సర్‌లో కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న వడాలిని గురువారం అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. అంత్యక్రియలు వీరి పూర్వికుల గ్రామం వడాలిలో జరుగనున్నాయి. ఉస్తాద్ పురాన్ చాంద్ వడాలి, ప్యారేలాల్ వడాలిగా ప్రఖ్యాతి. వడాలి బ్రదర్స్ పంజాబీ సూఫీ సంగీతంలో విద్వాంసులు. 1975లో జలంధర్‌లో హర్భల్లా ఆలయంలో ఇచ్చిన తొలి ప్రదర్శనతో వడాలి బ్రదర్స్ ఎక్కువగా ఖ్యాతి పొందారు. వీరు భజనలు, గజల్స్, కాఫియాన్లు ఎక్కువగా పాడుతుంటారు. హిందీ మూవీ 'పిన్జార్' లో, ఇటీవల విడుదలైన 'తను వెడ్స్ మను' లో కూడా వడాలి బ్రదర్స్ పాటలు పాడారు. ట్విట్టర్ నివాళి.... ‘‘పంజాబ్ సాహిత్యాన్ని, సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఓ షెహన్షా నీ ఆత్మకు శాంతి చేకురాలని వేడుకుంటున్నాము’’ అంటూ ట్విట్టర్ ప్యారేలాల్ వడాలి మృతికి నివాళి అర్పించింది. -
అమృత్‌సర్‌లో దారుణం.. గన్‌గురిపెట్టి దొంగతనం
-
అక్కడికి డైరెక్ట్ విమానం
న్యూఢిల్లీ: అమృత్సర్–బర్మింగ్‌హామ్ మధ్య ఎయిరిండియా నాన్‌స్టాప్ విమాన సర్వీసులు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సేవలు 8 ఏళ్ల క్రితం నిలిచిపోయాయి. తాజాగా సేవల పునరుద్ధరణతో ఇకపై బోయింగ్ 787 విమానం వారానికి రెండుసార్లు(మంగళవారం, గురువారం) ఈ మార్గంలో నడుస్తుంది. పంజాబ్, యూకే మధ్య నేరుగా విమాన సర్వీసులు నిర్వహిస్తోంది తామేనని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. అమృత్సర్ నుంచి తొలి విమానాన్ని విమానయాన మంత్రి విజయ్ సాంప్లా, ఎంపీలు గుర్జీత్ సింగ్, శ్వాయిత్ మాలిక్‌లు ప్రారంభించారు. -
అమృత్సర్-లాహోర్ మధ్య వ్యాపారం ఉండకూడదా?!
సాక్షి, అమృత్సర్ : పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమృత్సర్-లాహోర్ మధ్య వ్యాపార సంబంధాలపై సిద్ధూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పో సందర్భంగా.. సిద్ధూ కేంద్రప్రభుత్వం విమర్శలకు దిగారు. సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై-కరాచీ మధ్య ట్రేడ్ పార్టనర్ షిప్ ఉన్నపుడు లాహోర్-అమృత్సర్ మధ్య ఉంటే తప్పేంటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోకు పాకిస్తాన్ వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకే పంజాబ్ ఎక్స్పో 12 సార్లు జరగ్గా.. పాకిస్తాన్ వ్యాపరవేత్తలు ఇందులో పాల్గొనకపోవడం వరుసగా రెండో ఏడాది అని ఆయన గుర్తు చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోకు పాకిస్తాన్ వ్యాపారులను అనుమతివ్వడానికి ఎటవంటి ప్రత్యేక కారణాలు లేకపోయినా.. కేంద్రం మాత్రం మొండి వైఖరిని అనుసరించిందని అన్నారు. అమృత్‌సర్‌లో రాయి విసిరితే.. లాహోర్ పడుతుంది...అంత దగ్గరగా ఉండే ఈ నగరాల మధ్య వ్యాపారాన్ని కేంద్రం అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. -
జైలు నుంచి పాక్ అక్కాచెల్లెళ్ల విడుదల
అమృత్సర్: మాదక ద్రవ్యాల కేసులో కటకటాలపాలైన పాకిస్థాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ఫాతిమా, ముంతాజ్‌లు గురువారం విడుదలయ్యారు. వారితోపాటు 11 ఏళ్ల హీనాకు కూడా మోక్షం లభించింది. శిక్షాకాలంలో ఫాతిమాకు హీనా జన్మిచింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుపై భారత ప్రధాని నరేంద్రమోదీప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తమకు తెలిసిందని, అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతమాతకు వందనం చేస్తున్నాం’ అని విడుదల అనంతరం ఫాతిమా ఉద్వేగంగా తెలియజేసింది. తమ దేశానికి వెళ్లే ముందు స్వర్ణదేవాలయాన్ని సందర్శించాలని అభిలషిస్తున్నట్టు చెప్పారు. కాగా పాకిస్థాన్‌లో మాదకద్రవ్యాలు తీసుకుని భారత్‌లో చొరబడేందుకు యత్నిస్తుండగా 2006, మే ఎనిమిదో తేదీన అట్టారి అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు అరెస్టు చేయడం తెలిసిందే. -
కళ్ల ముందే కాల్చి చంపారు
అమృత్సర్ : ఈ మధ్య రాజకీయ హత్యలు దేశంలో ఏదో ఒక మూల నిత్యం జరుగుతున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ నేతలే లక్ష్యంగా వరుసగా జరుగుతున్న ఉదంతాలు మాత్రం ఆ వర్గ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆర్ఎస్ఎస్ నేత హత్య కలకలం రేపింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం హిందు సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. భరత్‌నగర్‌లోని ఓ మార్కెట్ సముదాయంలో ఆయన్ని నిన్న మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. తన స్నేహితుడితో ఆయన మాట్లాడుతన్న సమయంలో ఓ వ్యక్తి గన్ గురిపెట్టి కాల్చాడు. మొదటి బుల్లెట్‌కు ఆయన నేల మీద పడిపోగా.. మరో ఆగంతకుడు అతనికి జత చేరి ఇద్దరూ కలిసి విపిన్పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో విపిన్ పక్కనే వ్యక్తి వ్యక్తి భయంతో పారిపోయాడు. తన కళ్ల ముందే స్నేహితుడిని(విపిన్) కాల్చిచంపారని ఆ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ఘటనాస్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న దుకాణం సీసీ టీవీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు నమోదు అయ్యాయి. మొన్నీమధ్యే లూథియానాలో ఒకరిని, ఘాజీపూర్‌లో మరొకరిని ఇదే రీతిలో హత్య చేసిన విషయం తెలిసిందే. -
కళ్ల ముందే కాల్చి చంపారు
-
నా చిన్ననాటి కోరిక: హీరోయిన్
చెన్నై: సంచలన హీరోయిన్ శ్రుతిహాసన్ అనూహ్యంగా అమృతసర్‌లోని గోల్డెన్‌టెంపుల్‌లో ప్రత్యక్షమయ్యారు. శ్రుతి సంఘమిత్ర చిత్రాన్ని అనవసరంగా వదులుకుంది. ఆమె తండ్రి కమలహాసన్‌తో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలే లేవు అనే ప్రచారాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. నిజానికి శ్రుతి ఖాళీగా కూర్చోలేదు. చేతిలో టిగ్మంషూదులియాస్ యాత్ర అనే చిత్రంతో పాటు ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది. తను నటిస్తున్న హిందీ చిత్రం అక్టోబరు నెలలో తెరపైకి రానుంది. ఒక బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఇటీవల చంఢీగఢ్ వెళ్లిన భామ ఆ పని పూర్తి చేసుకుని సమీపంలోని అమృతసర్‌కు వెళ్లి అక్కడి గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్ లో రాత్రి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రుతి ప్రచారంలో తన అనుభవాలను పంచుకుంటూ.. గోట్డెన్టెంపుల్ను దర్శంచుకోవాలన్నది తన చిన్న నాటి నుంచి ఉన్న కోరిక అంది. ఆ మధ్య ఒక చిత్ర ప్రచారం కోసం అమృతసర్ వచ్చినప్పుడు ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్న, అయితే చివరి క్షణంలో ప్రణాళిక మారిపోవడంతో అది నెరవేర లేదని ఈ భామ తెలిపింది. అయితే ఈ సారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదులు కోదలచుకోలేదని పేర్కొంది. స్వర్ణదేవాలయాన్ని సందర్శించడం చాలా గొప్ప అనుభూతి అని తెలిపింది. అక్కడి వాతావరణం, ఎంతో ఎనర్జీని, ప్రశాంతతను అందించిందని శ్రుతిహాసన్ పేర్కొన్నట్లు ఆమె ప్రతినిధి ఒకరు తెలిపారు. -
పాక్ సరిహద్దుల్లో.. అత్యంత ఎత్తయిన పతాకం
దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఎక్కడుంది అంటే.. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో అని చెప్పబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీ సమీపంలో మన దేశంలోనే ఇంతవరకు అత్యంత ఎత్తయిన జాతీయపతాకాన్ని సోమవారం ఉదయం ఆవిష్కరించారు. దీని ఎత్తు 360 అడుగులు. జెండా పొడవేప 12 అడుగులు ఉంటుందని చెబుతున్నారు. ఇంతకుముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్‌రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగులు ఎక్కువ ఎత్తులో అమృతసర్ వద్ద ఈ కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. -
ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మసాజ్!
అమృత్సర్: పంజాబ్‌లో ఓ పోలీస్ అధికారి అమానుష ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేషన్‌కు ఓ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో పోలీస్ అధికారి మసాజ్ చేయించుకున్నాడు. ఫిర్యాదుదారుడితో.. అతడి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసు అధికారి మసాజ్ సరదా తీర్చుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రబ్జోత్ సింగ్.. సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
అమృత్‌సర్‌లో షారుఖ్ సందడి
-
అభిషేక్‌కు గన్ పెట్టి.. కారుతో పరార్
అమృత్సర్: రోడ్డుపై కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని దోపిడీదారులు సినీఫక్కీలో బెదిరించి కారుతో ఉడాయించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఈ ఘటన అక్కడ పెరిగిపోతున్న దోపిడీ సంస్కృతికి నిదర్శనంగా ఉంది. వివరాలు.. అభిషేక్ రల్లి అనే వ్యక్తి బిజెనెస్ పనిమీద ఆగ్రాకు వెళ్లి.. ఆదివారం ఉదయం తన సియజ్ కారులో డ్రైవర్‌తో పాటు స్వస్థలం అమృత్‌సర్‌కు చేరుకుంటున్నాడు. బటాలా రోడ్‌కు చేరుకోగానే.. హోండా సిటీ కారులో వేగంగా వచ్చిన దుండగులు.. అభిషేక్ కారును అడ్డుకున్నారు. తుపాకులతో వచ్చిన నలుగురు దుండగులు.. డ్రైవర్, అభిషేక్‌లను బెదిరించారు. కారు తాళాలు ఇవ్వకపోతే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. దీంతో కారు తాళాలను డ్రైవర్ వారికి అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ దుండగులు అభిషేక్ ఫోన్‌ను సైతం తీసుకెళ్లారు. ఈ ఘటనపై డీసీపీ ఎలాంచెజియన్ మాట్లాడుతూ.. మొబైల్ సిగ్నల్ ఆధారంగా దుండగులు అజ్నాలా వైపు పారిపోయినట్లు గుర్తించాము. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. -
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
అమృత్సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మంగళవారం ఓ స్కూల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. విద్యార్థులను తీసుకు వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూలు బస్సు అదుపు తప్పి ముహవా గ్రామంలోని ఓ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు ఘటనా స్థలంలో మరణించగా, మరో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వీరంతా నర్సరీ విద్యార్థులు కావటంతో బస్సులో నుంచి బయటకు రాలేక...అందులోనే చిక్కుకుపోయారు. కాగా గల్లంతు అయినవారి కోసం గాలిస్తున్నట్లు అమృత్సర్ రూరల్ ఎస్పీ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆయన మెదడులో ఏమీ లేదు!
న్యూఢిల్లీ: తమ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి వస్తే అమృత్సర్ను 'పవిత్ర నగరం'గా ప్రకటిస్తామంటూ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం తాను ఎంతకైనా దిగుజారుతానని కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని కట్జూ తాజా ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. కేజ్రీవాల్ వట్టి వాక్శూరుడని, ఆయన మెదడులో ఏమీ లేదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేందుకు ఆయన సిద్ధంగా ఉంటారని ఈ వ్యాఖ్యలతో రుజువైందని జస్టిస్ కట్జూ విమర్శించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే అమృత్సర్, ఆనందపూర్ సాహిబ్ నగరాలను 'పవిత్ర నగరాలు'గా ప్రకటిస్తామని, అంతేకాకుండా అమృత్సర్ నగర పరిధిలో మద్యం, మాంసం, ధూమపానం సేవనాన్ని నిషేధిస్తామని కేజ్రీవాల్ తాజాగా హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇచ్చిన ఇలాంటి హామీల వల్ల అలహాబాద్ (ప్రయాగ), వారణాసి, అయోధ్య, మధుర, పూరి, అజ్మీర్, హరిద్వార్ వంటి నగరాల నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశముందని, ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీయవచ్చునని ఆయన పేర్కొన్నారు. మతం పేరిట ఇలాంటి హామీలు ఇవ్వడం చక్కగా ఓట్లు రాబట్టుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ, ఇవి దేశ లౌకిక స్వభావాన్నిదెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉత్తర భారతం, పాకిస్థాన్లలో భూప్రకంపనలు!
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు ఆగ్నేయ పాకిస్థాన్ లో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం గుజరాత్ లో భూమి కంపిన కొద్దిగంటలకే మళ్లీ పంజాబ్, పాక్ లలో ప్రకంపనలు రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతగా నమోదయిన భూకంపం.. పంజాబ్ లోని అమృత్ సర్, జలంధర్ పట్టనాలతోపాటు పాకిస్థాన్ లోని లాహోర్, షేక్ పురాల్లో ప్రభావం చూపింది. ఆయా నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు కొన్ని క్షణాలు కంపించాయి. ఈ మేరకు భూకంప అధయయన శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంతకంటే ముందే ప్రజలు తమ నగరాల్లో భూకంపం వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడం గమనార్హం. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం తెలియాల్సిఉంది. Earthquake of Magnitude:4.6, Occurred on:17-07-2016,17:24 IST, Lat:31.1 N Long: 74.3 E, Depth:15Km,Region:India (Punjab)- Pak Border Region — IMD-Earthquake (@IMD_Earthquake) 17 July 2016 -
అబ్బే అసభ్యత లేదు.. కేవలం జోకులే!!
ముంబై: పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'లో నర్సును చూపించిన తీరుపై దుమారం రేగుతుండటంతో దీనిపై ఈ షో వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్ శర్మ స్పందించాడు. తమ షోను ఆందోళనకారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. షోలో భాగంగా నర్సు గురించి జోకులు వేసినంతమాత్రాన.. అది నర్సులందరికీ వర్తిస్తుందని భావించడం సరికాదన్నాడు. నర్సులను అసభ్యంగా షో చూపిస్తున్నారన్న వివాదం నేపథ్యంలో నర్సు పాత్రను షో కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా కొనసాగిస్తామని బదులిచ్చాడు. ఆ క్యారెక్టర్‌తో షోలో తాము కామెడీ మాత్రమే చేస్తున్నామని, అందులో అసభ్యత లేదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చాడు. 'ద కపిల్ శర్మ షో'లో 'హాట్' నర్సుగా రోచెల్లా రావును, స్థూలకాయమున్న నర్సుగా కికు శార్దాను చూపిస్తూ వెకిలీ హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారని అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు ఇటీవల రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా నర్సులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు. -
టీవీషోలో నర్సులను అవమానించిన యాంకర్!!
దేశంలోనే నంబర్ వన్ స్టాండప్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ. ఆయన యాంకర్ కమ్ స్టాండప్ కమెడీయన్‌గా వచ్చే పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'. హిందీ టీవీ రేటింగ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ఈ షోలో తాజాగా నర్సును చూపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నర్సులను దారుణంగా అవమానించేలా ఈ షోలో చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన నర్సులు మంగళవారం కపిల్ శర్మ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు. నర్సులంటే అంత చులకనా? నర్సులకు వ్యక్తిత్వం ఉండదని, వారిని సులువుగా లోబర్చుకోవచ్చుననే తప్పుడు పద్ధతిలో కపిల్ తన షోలో మమల్ని చూపించారని, అతనిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదుచేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. గతంలోనూ నర్సులను కించపరిచేలా కపిల్ శర్మ చూపించారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పంజాబ్ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన కపిల్ శర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. 'ద కపిల్ శర్మ షో'లో నర్సు పాత్రలో కనిపిస్తున్న రొచెల్లె రావు వేసుకున్న నర్సు యూనిఫామ్‌ను కూడా అసభ్యంగా చూపిస్తున్నారని, ఈ షోలో తమను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్‌కు మరో సింగపూర్ ఎయిర్‌లైన్స్
హైదరాబాద్ : చవక విమానయాన సేవల రంగంలో మరో సంస్థ భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ మే నెలలో భారత్‌లో అడుగు పెట్టనుంది. మే 24న సింగపూర్ కేంద్రంగా చెన్నైతోపాటు అమృత్సర్ నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తోంది. సింగపూర్-చెన్నై-సింగపూర్‌కు ప్రతిరోజు, సింగపూర్-అమృత్సర్-సింగపూర్‌కు వారంలో మూడు రోజులు విమానాలు నడుస్తాయి. అక్టోబరు 2 నుంచి జైపూర్‌కు విస్తరించనున్నట్టు స్కూట్ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. సింగపూర్-జైపూర్-సింగపూర్‌కు వారంలో నాలుగు సర్వీసులు నడుపుతారు. కంపెనీ ద్వితీయ శ్రేణి నగరాలకూ సేవలను పరిచయం చేయనుంది. ముఖ్యంగా పర్యాటకంగా వ్యాపార అవకాశాలు ఉన్న కొత్త నగరాల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. స్కూట్ భారత్‌లో 375 సీట్ల వరకు సామర్థ్యం ఉన్న వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నడుపనుంది. మరో లో కాస్ట్ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఆసియా మాత్రమే ప్రస్తుతం ఈ విమానాలను భారత్‌కు నడుపుతోంది. 2012లో ప్రారంభమైన స్కూట్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన నాల్గవ బ్రాండ్‌గా నిలవనుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు సంస్థకు చెందిన సిల్క్ ఎయిర్, టైగర్ ఎయిర్ ఇప్పటికే మన దేశంలో సేవలను అందిస్తున్నాయి. ఇక విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం, టాటా సన్స్‌కు 51 శాతం వాటా ఉంది. సింగపూర్‌కు 64 డాలర్లు.. భారత్‌లో సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28 వరకు పరిమిత కాల ఆఫర్‌ను స్కూట్ ప్రకటించింది. భారత్ నుంచి స్కూట్ నెట్‌వర్క్‌లోని అన్ని నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, అమృత్సర్, జైపూర్ నుంచి సింగపూర్‌కు ఎకానమీ టికెట్ ఒకవైపు ప్రయాణానికి 64 డాలర్ల నుంచి ప్రారంభం. సిడ్నీకి 189 డాలర్ల నుంచి లభిస్తాయి. టికెట్ల ప్రారంభ ధర బిజినెస్ క్లాస్‌లో సింగపూర్‌కు 179 డాలర్లు, సిడ్నీకి 459 డాలర్లుగా నిర్ణయించింది. కాగా స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానంలో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది. -
అమృత్‌సర్‌లో గ్యాంగ్ వార్
-
పోలీసుల కాల్పులు అమానుషం- కేజ్రీవాల్
అమృత్సర్: అమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో సిక్కుల పవిత్ర గ్రంధం 'గురు గ్రంధ్ సాహెబ్' ను అవమానించడంతో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. పవిత్ర గ్రంధాన్ని అవమానించినందుకు గాను నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కేజ్రీవాల్ పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు మద్దతుగా స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్వర్ణదేవాలయంలోకి వీఐపీలు వెళ్లే మార్గంలో కాకుండా సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో కేజ్రీవాల్ వెళ్లారు. స్వర్ణదేవాలయంలో ప్రార్థనల అనంతరం రోడ్డు మార్గం ద్వారా బాదిత కుటుంబాలను పరామర్శించడానికి కొట్కపురకు బయలుదేరి వెళ్లారు. గత లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో నాలుగు ఎంపీ స్థానాలను ఆప్ గెలుచుకుంది. కాగా 2017లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ దృష్టి పెట్టింది. -
ఆకట్టుకున్న సిక్కుల విన్యాసాలు
-
నేడు భారత్-పాక్ సరిహద్దు దళాల చర్చలు
-
నేటి నుంచి భారత్-పాక్ సరిహద్దు దళాల చర్చలు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య డెరైక్టర్ జనరళ్ల స్థాయి 3 రోజుల చర్చలు గురువారం మొదలు కానున్నాయి. చర్చలకు భారత్ ఆతిథ్యమిస్తుండగా.. పాక్ నుంచి 16 మంది సభ్యుల ప్రతినిధి బృందం బుధవారం అమృత్సర్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట బుధవారం మరో రెండు కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకోవటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు, సిమాంతర చొరబాట్ల అంశాలను భారత్ లేవనెత్తనుంది. ఏడాదిన్నర కాలం తర్వాత.. భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), పాకిస్తాన్ రేంజర్స్ అధిపతుల మధ్య ఈ చర్చలు జరగబోతున్నాయి. అత్తారి-వాఘా సరిహద్దు వద్ద పంజాబ్ సరిహద్దు బీఎస్ఎఫ్ కమాండర్లు పాక్ బృందానికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. పాకిస్తాన్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్(పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్ఫరూక్బుర్కీ సారథ్యం వచ్చిన పాక్ బృందానికి ఢిల్లీ విమానాశ్రయంలో బీఎస్ఎఫ్ డీజీ డి.కె.పాఠక్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కాగా, తమ అణ్వాయుధాలు ఎవరినీ ఉద్దేశించినవి కావని.. దక్షిణాసియాలో వ్యూహాత్మక సుస్థిరత కోసం తమ దేశం కనీస విశ్వసనీయ హెచ్చరికను పాటిస్తుందని పాక్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ పేర్కొన్నారు. -
పోలీసుల చేతిలో అకలీదళ్ నేత హతం
అమృతసర్: పోలీసుల చేతిలో అకాలిదళ్ పార్టీకి చెందిన నేత ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పార్టీ సభ్యులు ఇది ముమ్మాటికి హత్యేనని వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ఒకరు నెంబర్ ప్లేట్ లేని కారులో ప్రయాణీస్తున్నాడని వారికి సమాచారం అందడంతో ఆ మార్గంలో పోలీసులను అప్రమత్తం చేశారు. అమృత్‌సర్‌కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఓ చెక్ పోస్ట్ వద్ద ఆ కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా కారులోపల ఉన్న ఒకరు (ముఖ్జిత్ సింగ్ అలియాస్ మోఖా) కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కారులోని ముఖ్ జిత్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పోలీసులు చెప్పేదంతా కట్టుకథేనని, వారు కావాలనే హత్య చేశారని అకాలిదళ్ నేతలు ఆరోపించారు. అయితే, తాము ఎవరిపై కావాలని దాడి చేయలేదని, తమ అధికారుల్లో ఒకరికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. -
ఖలిస్తాన్ నినాదాలతో మార్మోగిన ఆలయం
ఆపరేషన్ బ్లూస్టార్ 31వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శనివారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నివాళి అర్పిస్తున్న సమయంలోనే స్వర్ణదేవాలయంలో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి. దీంతో ప్రత్యేక ఖలిస్తాన్ని సమర్థించే, వ్యతిరేకించే రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ)కి చెందిన సిబ్బంది , రాడికల్ గ్రూపులకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని ఎన్నో ఏళ్లుగా రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గత ఏడాది కూడా ఘర్షణ జరిగింది. నాటి ఘర్షణల్లో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. -
25 కిలోల హెరాయిన్ స్వాధీనం
అమృత్సర్: పంజాబ్‌లో పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పంజాబ్ స్పెషల్ నార్కోటిక్ సెల్ పోలీసులు అమృత్సర్ సమీపంలో ని కొహాలీ గ్రామంలో డ్రగ్స్ ముఠా స్థావరంపై దాడి చేశారు. 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా అతని సహాయకుడు పోలీసుల నుంచి తప్పించుకుని బైక్‌పై పారిపోయాడు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ 25 కోట్ల రూపాయిలు ఉంటుందని పోలీసులు చెప్పారు. దీన్ని పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా చేసినట్టు తెలిపారు. నిందితులకు పాకిస్థాన్ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని చెప్పారు. -
స్వర్ణదేవాలయంలో కత్తులతో ఘర్షణ
-
స్వర్ణదేవాలయంలో కత్తులతో ఘర్షణ
అమృత్సర్ : ఆపరేషన్ బ్లూస్టార్ 30వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శుక్రవారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయంలోనే ఏకంగా కత్తులతో దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. సిక్ రాడికల్ గ్రూపు, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ మధ్య జరిగిన గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. నివాళి అర్పిస్తున్న సమయంలోనే రాడికల్ గ్రూపు సభ్యులు ఐక్యరాజ్య సమితి విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. అయితే, ఇలాంటి అంతర్జాతీయ పెత్తనాన్ని అంగీకరించకూడదని విశ్లేషకులు అంటున్నారు. ఆపరేషన్ బ్లూస్లార్ అనేది ఎప్పుడో గడిచిపోయిన విషయమని, పంజాబ్‌లో ఎన్నాళ్లుగానో పాతుకుపోయిన అకాలీదళ్ ఇప్పుడు బలహీనపడుతుంటే.. కొత్త శక్తులు బయటకు వస్తున్నాయని అంటున్నారు. ఉగ్రవాదానికి స్థావరాలుగా మారుతున్న కొత్తగ్రూపులను మాత్రం ఎప్పటికప్పుడు అణచివేయకపోతే భింద్రన్‌వాలే వారసులు మళ్లీ పుట్టుకొచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ఆధీనంలో ఉండగా, పోలీసులు అక్కడి శాంతి భద్రతల అంశాన్ని పట్టించుకోడానికి మీనమేషాలు లెక్కపెట్టడం కూడా ఈ తరహా ఘర్షణలకు కారణం కావచ్చని అంటున్నారు. -
స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన అరుణ్ జైట్లీ
-
అరుణ్... అమరీందర్ ... ఓ అమృతసర్
అది నిరంతరం తుపాకీ మోతలతో దద్దరిల్లే భారతపాక్ సరిహద్దు నియోజకవర్గం. తమాషా ఏమిటంటే ఇప్పుడు సరిహద్దుల్లో కాదు... నియోజకవర్గంలోనే రాజకీయ యుద్ధవాతావరణం నెలకొంది. ఆ నియోజకవర్గమే సిక్కులకు అతి పవిత్రమైన అమృతసర్ లోకసభ నియోజకవర్గం. సిక్కు రాజకీయాలకు, ముఖ్యంగా అకాలీ రాజకీయాలకు సింబాలిక్ కేంద్రమైన అమృతసర్ లో గత రెండు సార్లు గా సిక్కు ఎంపీగా గెలుస్తూ ఉన్నారు. కానీ ఆయన అకాలీ దళ్ ఎంపీ కాదు. ఆయన అకాలీల మద్దతుతో గెలిచిన బిజెపి ఎంపీ నవజోత్ సింగ్ సిద్దు. ఈ సారి మాత్రం సిద్ధు క్రికెట్ లో బిజీగా ఉన్నారు తప్ప రాజకీయాల్లో కాదు. అమృతసర్ నియోజవర్గం ఈ సారి వార్తల్లోకెక్కడానికి ప్రధాన కారణం బిజెపి రాజ్యసభ పక్ష నేత అరుణ్ జైట్లీ ఇక్కడనుంచి పోటీ చేయడమే. అరుణ్ జైట్లీ ఇప్పటి వరకూ రాజ్య సభ రూట్లోనుంచే ఎన్నికవుతూ వచ్చారు. లోకసభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, పటియాలా మహారాజు అమరీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరే కాక ఆప్ తరఫున డా. దల్జీత్ సింగ్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ప్రధానపోటీ జైట్లీ, అమరీందర్ ల మధ్యే ఉంటుందన్నది సుస్పష్టం. అమరీందర్ సూటి విమర్శల స్పెషలిస్ట్. కానీ జైట్లీ రాజకీయాల్లోనూ, లాయర్ గానూ ఉద్దండ పిండం. అందుకే ఇద్దరి మధ్యా మాటల తూటాలు తెగపేలి, రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపుచెక్కతో నేనొకటిస్తా అన్నట్టు వాగ్వాదాలు జరుగుతున్నాయి. అసలు అరుణ్ జైట్లీ లోకల్ కాదని, స్థానికేతరుడని అమరీందర్ అస్త్రం సంధిస్తే, నేను కనీసం ఇండియన్ ని, మీ అధినేత్రి ఏ దేశం నుంచి వచ్చిందని జైట్లీ మరో బాణం విసిరారు. 'నేను లోకల్ కాను సరే. మరి నువ్వూ పటియాలా వాడివే కదా.' అంటూ అమరీందర్ ను ఎత్తిపొడిచారు. 'అసలు మీరిద్దరూ నాన్ లోకల్. నేనొక్కడినే లోకల్' అంటున్నారు ఆప్ అభ్యర్థి. వాగా అటారీలు మూగబోయేలా కొనసాగుతున్న ఈ రాజకయ రచ్చతో అమృత్ సర్ ఇప్పుడు అదిరిపోతోంది. -
సిక్కుల ఆలయానికి ముస్లిం శంకుస్థాపన
సర్వమతం అమృత్‌సర్‌లోని సిక్కు మతస్థుల ప్రార్థనాలయం హర్మందిర్ సాహిబ్ (స్వర్ణాలయం) నిర్మాణానికి పునాది రాయి వేసింది ఒక ఇస్లాం మతస్థుడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది నిజం. సిక్కుల మత గురువులే స్వయంగా దగ్గరుండి మరీ సూఫీ సాధువు మియామీర్ (బాబా సెయిన్ మీర్ మహ్మద్ సాహెబ్) చేత ఆలయానికి శంకుస్థాపన చేయించారు! మీర్ అమృత్సర్ వెళ్లినప్పుడు తప్పనిసరిగా గురు అర్జున్దేవ్ దర్శనం చేసుకుని వచ్చేవారు. అర్జున్దేవ్ లక్నో వచ్చినప్పుడు విధిగా మీర్‌ను కలుసుకునేవారు. నాటి ముస్లింలు, హిందువులు, సిక్కులు సమైక్యంగా దైవాన్వేషణ చేసేవారు. అందుకే అన్ని మతస్థుల మధ్య గౌరవ మర్యాదలు, ఆదరాభిమానాలు ఉండేవి. మియామీర్ పూర్వీకులు సింధ్ ప్రాంతానికి చెందినవారు. పన్నెండేళ్ల వయసులోనే మీర్ ఐహికబంధనాల విముక్తికోసం అడవులకు వెళ్లారు. ఆ క్రమంలోనే మతగ్రంథాలను అధ్యయనం చేశారు. హేతువాదాన్నీ తర్కించి చూశారు. అంతిమంగా సూఫీ తత్వాన్ని అవలంబించారు. ఆయన మాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసేవి. అనతి కాలంలోనే మీర్ సూఫీ సాధువుగా అవతరించారు. కానీ ఆ పేరు ప్రఖ్యాతుల భారాన్ని మోయలేక మీర్ ఏకాంత జీవితాన్ని ఎంచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్ల తర్వాత లాహోర్ తిరిగి వచ్చి నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు. మీర్‌కు ఐహిక సౌకర్యాలపై వ్యామోహం ఉండేది కాదు. ఆర్థిక సహాయం చేయవచ్చినవారి ప్రయత్నాలను చిరుకోపంతో తిరస్కరించేవారు. కానుకలు ఇవ్వడానికైతే నా దగ్గరికి ఎవరూ రానక్కర్లేదని కరాఖండిగా చెప్పేవారు. ‘‘నన్నొక యాచకునిగా చూడకండి. దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక దేనికీ నాకు లోటు ఉండదు. రేపటి కోసం నేనేదీ దాచుకోను’’ అని విడమరచి చెప్పేవారు. ఓరోజు చక్రవర్తి జహంగీర్‌కు ఈ సూఫీ సాధువు గురించి తెలిసింది. వెంటనే ఆయన్ని తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్కడ మీర్ చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు జహంగీర్‌ని ఆకట్టుకున్నాయి. అతడికి అత్యంత విలువైన కానుక ఏదైనా ఇవ్వాలన్న ఆకాంక్ష చక్రవర్తిలో కలిగింది. కానీ మీర్ దేనినీ ఆశించరు. మరెలా? చివరికి ప్రార్థన వస్త్రాన్ని (జానమాజ్) భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నాడు చక్రవర్తి. మరో చక్రవర్తి షాజహాన్ అయితే లాహోర్‌లోని మీర్ నివాసాన్ని రెండుసార్లు దర్శించారు. ఇంకా ఎందరో పాలకులు, ప్రముఖులు, ప్రసిద్ధులు మీర్ దర్శనానికి నిరీక్షించేవారు! మీర్ అంతశ్శక్తి ఆయనలోని నిరాడంబరతే. ఆయన ధరించే దుస్తులు కూడా అతి సాధారణంగా ఉండేవి. శిష్యులు వారిస్తున్నా వినకుండా తన బట్టలు తనే శుభ్రపరచుకునేవారు మీర్. 1653 లో చనిపోయే ముందు కూడా ఆయన కడుపునొప్పితో బాధపడ్డారే కానీ, రాజవైద్యుల ఖరీదైన సేవలను అంగీకరించలేదు. ఆయన స్మృతికి చిహ్నంగా చక్రవర్తి షాజహాన్ లాహోర్ సమీపంలో మీర్ దర్గాను కట్టించారు. ముస్లింలతో పాటు సిక్కులు, హిందువులు కూడా నేటికీ ఆ దర్గాను దర్శించి మీర్ ఆశీర్వచనాల కోసం ప్రార్థనలు జరుపుతుంటారు. -
అరుణ్ జైట్లీ పర్యటనలో బెలూన్ పేలుళ్లు
బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ పంజాబ్ పర్యటన నిజంగానే 'ధమాకా' అనిపించింది. ఆయన రాక సందర్భంగా ఏర్పాటుచేసిన గ్యాస్ బెలూన్లకు మంటలు అంటుకుని అవికాస్తా పేలిపోయాయి. జైట్లీ వస్తున్నారని టపాసులు కాల్చడంతో వాటినుంచి నిప్పురవ్వలు రేగి ఈ హాట్ ఎయిర్ బెలూన్లకు అంటుకుంది. దీంతో జైట్లీ సహా కొందరు పార్టీ నాయకులకు కొద్దిగా కాలిన గాయాలయ్యాయి. అమృతసర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అరుణ్ జైట్లీకి బీజేపీ, అకాలీదళ్ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలకాలనుకున్నారు. ఇంతకు ముందు ఈ స్థానానికి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఈసారి పోటీ నుంచి తప్పుకోవడంతో జైట్లీ రావాల్సి వచ్చింది. ఇంతకుముందు జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. -
అమృత్సర్ బిజెపి ర్యాలీలో అపశృతి
-
ఆకట్టుకున్న సిక్కుల 'ఫతే దివస్' విన్యాసాలు
సిక్కు మతస్థులు 'ఫతే దివస్' ను నవంబర్ 4 తేదిన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు మత వీరులు నిహాంగ్ ఆర్మీ ప్రదర్శించిన గుర్రపు పోటీల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గ్వాలియర్ కోట నుంచి ఆరవ గురు హరి గోవింద్ విముక్తి అయిన సందర్భాన్ని 'బందీ చోర్ దివస్' గా కూడా పాటిస్తారు. -
ముంబై వెళ్లింది డబ్బు సంపాదనకే: సిద్ధూ
న్యూఢిల్లీ : బిజెపి ఎంపీ, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు తన సిన్సియారిటీ చాటుకున్నారు. ఏడాది కాలంగా తాను ముంబై వెళ్ళింది డబ్బు సంపాదనకేనని ఆయన చెప్పారు. టివి వ్యాఖ్యాతగా తాను సంపాదించుకున్న డబ్బు తన ఇల్లు గడవడానికేనని సిద్ధూ తెలిపారు. అరుణ్ జైట్లీ న్యాయవాదని, పంజాబ్ డిప్యూటీ సిఎం వ్యాపారవేత్త అని అలాంటప్పుడు తాను టివి వ్యాఖ్యాతగా ఉంటే తప్పేంటని సిద్ధు ప్రశ్నించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అమృతసర్ వచ్చారు. సిద్దూకు అబిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అమృత్సర్ ఎంపీ అయిన సిద్ధూ ముక్కుసూటితనం, వ్యవహారశైలిపై ఎన్డిఏ భాగస్వామ్య పక్షం శిరోమణి అకాళీదళ్ గుర్రుగా ఉంది. అందుకే సిద్ధూను సైలంట్ అయిపోవాలని చెప్పడమేకాక ముంబై వెళ్ళేందుకు బిజెపి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పది నెలలుగా సిద్ధూ ముంబైకే పరిమితం కావడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సిద్ధూ ఆచూకి తెలిపిన వారికి రెండు లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ పోస్టర్లు ప్రచురించాయి. -
రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
నగరంలోని రంజీత్ అవెన్యు ప్రాంతంలో అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. వారి వద్ద నుంచి 14 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ మత్తుపదార్థం విలువ రూ. 70 కోట్లు ఉంటుందని పోలీసుల వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా బారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడిందని పోలీసులు వివరించారు.