అమృత్‌సర్‌కి ప్రయాణం కానున్నారు రామ్‌చరణ్. ఎందుకంటే ఓ సినిమా షూటింగ్ కోసం. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమృత్‌సర్‌లో ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఆల్రెడీ మార్చిలోనే ఈ షెడ్యూల్ కోసం అమృత్‌సర్ లొకేషన్స్‌ను శంకర్‌ను పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే.
అక్కడ ప్లాన్ చేసిన షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫైట్ షూట్ చేస్తారని సమాచారం. అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి తమన్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment