Rajamouli Ram Charan Jr Ntr Visit Amritsar Golden Temple For RRR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. మార్చి 20న గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా సోమవారం (మార్చి 21) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది ఈ చిత్రబృందం.
అమృత్‌సర్‌లో పర్యటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడి గోల్డెన్ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కోరుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం ప్రకటించింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.
The tRRRio visited the divine Golden Temple in Amritsar to seek blessings for our #RRRMovie#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/LfZcbHnOLM
— RRR Movie (@RRRMovie) March 21, 2022
Comments
Please login to add a commentAdd a comment