నగరంలోని రంజీత్ అవెన్యూ ప్రాంతంలో అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు.
నగరంలోని రంజీత్ అవెన్యు ప్రాంతంలో అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. వారి వద్ద నుంచి 14 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించినట్లు చెప్పారు.
వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ మత్తుపదార్థం విలువ రూ. 70 కోట్లు ఉంటుందని పోలీసుల వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా బారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడిందని పోలీసులు వివరించారు.