Rs.70 crore
-
రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
చండీగఢ్: పంజాబ్‌లో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. ఫిరోజ్‌పూర్ సెక్టార్లో 14 కిలోల హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 70 కోట్లు రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. స్మగ్లర్లు పాకిస్థాన్ నుంచి హెరాయిన్‌ను భారత్‌కు తరలించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. కాగా స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు. ఈ ఏడాదిలో బీఎస్ఎఫ్ జవాన్లు పంజాబ్‌లో 164 కిలోలకుపైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
నగరంలోని రంజీత్ అవెన్యు ప్రాంతంలో అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. వారి వద్ద నుంచి 14 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ మత్తుపదార్థం విలువ రూ. 70 కోట్లు ఉంటుందని పోలీసుల వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా బారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడిందని పోలీసులు వివరించారు.