
రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
పంజాబ్లో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు.
చండీగఢ్: పంజాబ్లో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. ఫిరోజ్పూర్ సెక్టార్లో 14 కిలోల హెరాయిన్ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 70 కోట్లు రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు.
స్మగ్లర్లు పాకిస్థాన్ నుంచి హెరాయిన్ను భారత్కు తరలించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. కాగా స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు. ఈ ఏడాదిలో బీఎస్ఎఫ్ జవాన్లు పంజాబ్లో 164 కిలోలకుపైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.