రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అతనిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.
ప్రస్తుతం సరిహద్దుల్లో హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తరన్‌తారన్ జిల్లాలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచె సమీపంలోకి వస్తున్న వ్యక్తి కనిపించాడని ఆయన తెలిపారు. అప్పుడు విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ సిబ్బంది చొరబాటుదారునితో తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతను అధికారుల సూచనలు వినకుండా సరిహద్దు భద్రతా కంచె వైపు వస్తూనే ఉన్నాడు.
ప్రమాదాన్ని పసిగట్టిన డ్యూటీలోని సైనికులు ఆ చొరబాటుదారునిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారత ఆర్మీ మరోమారు చొరబాటుదారుడియత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్‌లోని 553 కి.మీ. పొడవైన భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment