
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్‌ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది.
పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్‌హఫీజ్ సయీద్‌ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే.
చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు