Security Council
-
UNSC: బైడెన్ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్
న్యూయార్క్: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది. -
భద్రతా మండలికి పాక్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి. అవి..పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్. ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమా లియా, పాకిస్తాన్‌లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి నుంచి రెండేళ్ల పాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి. -
సమితిపై సంస్కరణల ఒత్తిడి
భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రపంచ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఇంకో పక్క భారత్ సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతామండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతర సభ్యులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతోంది..అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రాతినిధ్యం లేకపోవడం సమితి లక్ష్యసిద్ధిలో పెద్ద అడ్డంకి అని చెప్పక తప్పదు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా అవి ఫలవంతం కావటం లేదు. సమితిలో సంస్కరణలు జరగాలని అధికశాతం దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వీటో పవర్ ఉన్న దేశాలు సమితి కృషికి పీటముడులు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఎవరికీ పెద్దగా తెలియని, అస్పష్టమైన దౌత్య ప్రక్రియ ఆ చర్చలన్నవి. అయినప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఓ చరిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం కుదిరే దిశగా ఈ సమావేశం ముందడుగైతే వేసింది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు కూడా అద్దం పడుతోంది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు... ఐరాస వ్యవస్థ ప్రభావం తగ్గిపోతూండటం, అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐరాసకు లేకపోవడం వంటివి మళ్లీ మళ్లీ చర్చకు వచ్చేలా చేస్తున్నాయి. భద్రతా మండలిలోని ఐదు దేశాలకూ వీటో అధికారాలు ఉండటం అన్నది రెండో ప్రపంచ యుద్ధ విజేతలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు భాగస్వామ్యం లేదు. ఆ ప్రాంత దేశాల ప్రతినిధులు ఐరాసలో నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు అంతే. 1950లో ప్రపంచ జనాభాలో సగం ఆసియాలోనే ఉండగా... ఇరవై శాతం ఆర్థిక లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నా భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం ఒక్క దేశానికి మాత్రమే దక్కింది. ఇది అన్యాయమే. అలాగని ఆశ్చర్యపోవడానికీ ఏమీ లేదు. కాగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం నిస్సందేహంగా చాలా మారి పోయింది. ప్రాతినిధ్యం విషయంలోనూ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆసియా జనాభా ప్రపంచ జనాభాలో 60 శాతం. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం భాగస్వామ్యం కూడా ఈ ఖండానిదే. ఐరాస సభ్యదేశాల్లో 25 శాతం ఇక్కడివే. కానీ... భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం 20 శాతమే. ఈ నేపథ్యంలోనే భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి ఉన్న డిమాండ్‌ను మనం గుర్తు చేసుకోవాలి. దాదాపుగా ఈ సమయంలోనే ఆర్థిక, సామాజిక కౌన్సిల్ సభ్యత్వాన్ని 18 నుంచి 27కు, ఆ తరువాత 54కు పెంచారు. 2015లో కొన్ని నిర్దిష్ట సూచనలతో భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరిపేందుకు ఒక అంగీకారం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అవి ముందుకు కదల్లేదు. చర్చల తీరుతెన్నులపై స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశం మాత్రమే ఈ ప్రక్రియ కాస్త ముందుకు కదిలేందుకు మార్గం చూపింది. కారణాలు అనేకం!భద్రతా మండలి సంస్కరణలు స్తంభించిపోయేందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఇండియా, జర్మనీ, జపాన్ , బ్రెజిల్‌లతో కూడిన జి–4 కూటమి తమను (మరో ఇద్దరు ఆఫ్రికన్ ప్రతినిధులతో కలిపి) భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్, జి–4 దేశాలు వీటో అధికారం లేకుండానే భద్రతామండలిలో చేరేందుకు ఓకే అనవచ్చు. ఈ అంశంపై 15 ఏళ్ల తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేలా చూస్తారు. ఇంకో పక్క భారత్ కూడా సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతరులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. ఐరాస సభ్యదేశాల్లో అత్యధికులు భద్రతా మండలి శాశ్వత, ఇతర సభ్యుల సంఖ్యను పెంచేందుకు అంగీకారం తెలుపుతూండగా కాఫీ క్లబ్‌గా పేరుగాంచిన ‘యునైటెడ్ ఫర్ కన్సెన్సస్’ గ్రూపు ఆ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇటలీ, పాకిస్థాన్ , అర్జెంటీనా వంటి దేశాల నేతృత్వంలో పని చేస్తున్న ఈ గ్రూపు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. భారత్, జర్మనీ, బ్రెజిల్ వంటి స్థానిక శత్రువులది పైచేయి కాకుండా అన్నమాట. ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు అమెరికా, యూకే, ఫ్రాన్ ్స, రష్యాలు మాత్రం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకో అడుగు ముందుకేసి భద్రతా మండలి సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటనైతే చేశారు కానీ ఆచరణలో మాత్రం ఆయన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంకో విషయం... ఆఫ్రికా గ్రూపులో ఏకాభిప్రాయం లేకపోవడంతో భద్రతామండలి సభ్యదేశంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సమితి నిర్ణయించుకోలేక పోతోంది. వివరంగా చర్చిస్తే భేదాభిప్రాయాలు వస్తాయని ఆఫ్రికా దేశాలు భయపడుతున్నాయి. అడ్డంకి ఉండనే ఉంది!భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పెరిగేందుకు, ఇతర సభ్యుల చేరికకు ఉన్న అతిపెద్ద అడ్డంకి చైనా. భద్రతామండలి విస్తరణపై వ్యాఖ్య చేయని శాశ్వత సభ్య దేశం ఇదొక్కటే. ఆసియాకు మెరుగైన ప్రాతినిధ్యం లభించేందుకు ఆసియా దేశమే ఒకటి అడ్డుగా నిలవడం విచిత్రం. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే... అసలు రాజీ మార్గమన్నది ఏమాత్రం కనిపించకుండా పోతుంది. శాశ్వత సభ్యుల సంఖ్యను 11కు పెంచడం ఇందుకు ఒక మార్గం. ప్రస్తుత శాశ్వత సభ్యులు ఐదుగురితోపాటు జి–4 సభ్యులు, ఇద్దరు ఆఫ్రికా ప్రతినిధులు అన్నమాట. దీంతోపాటే ఇతర సభ్యుల సంఖ్యను కూడా తగుమాత్రంలో పెంచాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వీటో అధికారం స్థానంలో కొంతమంది శాశ్వత సభ్యులకు అభ్యంతరం ద్వారా తీర్మానాన్ని అడ్డుకునే అధికారం కల్పించడం ఒక ఏర్పాటు అవుతుంది. ఇలాంటి ఏర్పాటు ప్రస్తుత శాశ్వత సభ్యులకూ అంగీకారయోగ్యం కావచ్చు. ఈ ఏర్పాటు ఒకటి రూపుదిద్దుకునేలోగా ఐరాస నిష్క్రియాపరత్వం పాటించడం కూడా ఐరాస ఏర్పాటు అసలు ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేదే. యుద్ధనష్టాలు భవిష్యత్ తరాలకు సోకకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఐరాసాదే! అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికల అమలు, సామాజిక పురోగతి, మానవీయతలను కాపాడటం కూడా ఐరాస ఏర్పాటు ఉద్దేశాలలో కొన్ని అన్నది మరచిపోరాదు. ఈ లక్ష్యాలన్నీ ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా మారే ఆఫ్రికన్ గ్రూపు లేదా జి–20 వంటి వ్యవస్థలకూ వర్తిస్తాయి. గత ఏడాది భారత్ నేతృత్వంలో జరిగిన జి–20 సమావేశాల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఐరాస తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందాలంటే ప్రపంచం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకానీ... ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రపంచానికి ప్రతినిధిగా కాదు.ధ్రువ జైశంకర్ వ్యాసకర్త ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా(‘హిందూస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వ తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వీటో పవర్‌ను వినియోగించింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా 12 కౌన్సిల్ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక.. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. ‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దుతు ఇస్తుంది. ఈ ఓటు పాలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని యూఎన్‌లో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ భద్రతామండలికి తెలిపారు. తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. ‘పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం చాలా అనైతికం, అన్యాయం’ అని అన్నారు. ‘ఈ తీర్మానంపై ఆమోదం పొందలేదనే విషయం పాలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించదు. అదే విధంగా పాలస్తీనా సంకల్పాన్ని ఓడించదు. మా ప్రయత్నం ఆగదు’ అని యూఎన్‌లో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ ఒకింత భావోద్వేగంతో అన్నారు. -
ఐరాసలో సంస్కరణలకు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. ఐరాస, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడాని అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఇటీవల ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానం ఇచ్చారు. ‘ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఐరాస కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనం ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నాం. దానిని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం. ఐరాస సంస్కరణలకు తాము(అమెరికా) కచ్చితంగా మద్దతు ఇస్తాం. అయితే ఎలాంటి సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనల తమ వద్ద లేవు. కానీ, ఐరాసలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం’ అని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. ఇక... జనవరిలో ఐక్యరాజ్యసమితి పనితీరుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. అదీకాక.. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక.. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించారు. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోకపోవటం గమనార్హం. అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కటం లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ పొరుగుదేశం చైనా అడ్దుకుంటోంది. -
గాజా ఓటింగ్: అమెరికాపై ఇజ్రాయెల్ గుర్రు!
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్‌ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్‌ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్‌తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు. ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్‌కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
భద్రతా మండలిలో చోటుకు బదులు...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా కోసం భారత్ పావు శతాబ్ద కాలంగా విఫలయత్నం చేసింది. మండలి విస్తరణ జరిగినా చోటు దొరక్కపోతే మళ్లీ మరో పాతికేళ్ళు వృథా అవుతుంది. అందుకే ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే, ప్రత్యామ్నాయంగా భిన్న దేశాల కూటములతో కలిసి పనిచేయాలన్న కచ్చితమైన నిర్ణయం భారత్ తీసుకుంది. ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ‘ఐఎస్ఏ’, ‘సీడీఆర్ఐ’ లాంటి సమూహాల స్థాపనకు చొరవ తీసుకోవడమే కాకుండా, వాటి కార్యాలయాలను ఢిల్లీలో ఏర్పాటు చేయించడంలో విజయం సాధించింది. క్వాడ్, ఐ2యూ2 లాంటి సమూహాలతో కూడా సాగుతూ భారత్ ప్రాభవాన్ని పెరిగేలా చూడటం మన దౌత్య పురోగతికి సంకేతం. దౌత్యపరంగా ప్రపంచంలోనే అత్యున్నత వేదిక అయిన భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ ఇక ఎదురుచూడటం లేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన అత్యంత ముఖ్యమైన ఈ విభాగంలో సమాన ప్రాతినిధ్య లక్ష్యం దిశగా పావు శతాబ్ద కాలంగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పెద్ద పురోగతిని సాధించలేదు. భద్రతా మండలి విస్తరణలో కూడా మరో పాతికేళ్ళ కాలం భారత్ వంటి ఆశావహులను పక్కదారి పట్టించవచ్చనేది ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే, అంతుచిక్కని ఐక్యరాజ్యసమితి సంస్కరణల లక్ష్యం కోసం ఎదురుచూడకుండా ప్రపంచ వేదికపై తన పాద ముద్ర వేయ డానికి, చిన్న చిన్న దేశాల సమూహాలతో కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. భారత్ 37 బహు పాక్షిక సమూహాలలో చేరింది. అంతేకాకుండా, భద్రతా మండలికి బదులుగా ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ఫిబ్రవరి 8న రాజ్యసభలో మాట్లాడుతూ, ఈ బహుపాక్షిక సమూహాలు ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం సహా అనేక రంగాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్‌కు వీలు కల్పిస్తాయి. ఇలాంటి ఫలితాలు భారత్ జాతీయ అభివృద్ధి ఎజెండాకు దోహదం చేస్తాయి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి, మన ప్రజల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తెస్తాయి’’ అని చెప్పారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) అనేది భారత్ ఆలోచన. 2015లో ప్యారిస్‌లో జరిగిన 21వ వాతావరణ మార్పు సదస్సులో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే అందించిన మద్దతు ఈ భావనను ఫ్రాంకో–ఇండియన్ ఉమ్మడి ప్రయత్నంగా మార్చింది. ఇది మోదీ ప్రభుత్వ మొట్టమొదటి బహుపాక్షిక చొరవ. కాబట్టి, ఇది ప్రారంభం కావడానికి కాస్త సమయం పట్టింది. అయితే ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీటీ)లో ఉన్నందున ఇది భారత ప్రతిష్ఠను మరింతగా పెంచింది. అనేక దశాబ్దాలుగా మన దేశమే సమస్యగా ఉండటం కాకుండా, వాతావరణ మార్పుపై సమస్య–పరిష్కర్తగా మారేట్టు చేసి, భారత ఖ్యాతిని పెంచింది. సీడీఆర్ఐ విషయానికి వస్తే, దానికి ఐఎస్ఏ లాగా అంత పేరు లేదు. ఇది 2019లో ఏర్పడిన కొత్త, ముఖ్యమైన భాగస్వామ్యం. ఇది వాతావరణానికి తట్టుకోగల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి... బహుపాక్షిక ఏజెన్సీలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికికీ ప్రభుత్వాలను ఒక చోటికి తీసుకువస్తుంది. 2016లో జరిగిన విపత్తు నష్టభయం తగ్గింపుపై జరిగిన ఆసియా మంత్రుల సదస్సులో మోదీ అటువంటి కూటమి ఆలోచనను ప్రతిపాదించారు. అయితే ఈ ఆలోచనను దాని భాగస్వాములు ఆమోదించడానికీ, సీడీఆర్ఐని రూపొందించడానికీ మరో మూడేళ్లు పట్టింది. సీడీఆర్ఐ ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంది. అనేక దశాబ్దాలుగా, జెనీవా, నైరోబీ, వియన్నా వంటి మెట్రోలకు లాగే తన నగరాల్లో ఒకదానిని ఐక్యరాజ్యసమితి నగరంగా ప్రకటించాలని భారత్ ఆకాంక్ష. పైన పేర్కొన్న నగరాలు న్యూయార్క్‌కు అనుబంధ, ద్వితీయ ప్రధాన కార్యాలయంగా పని చేస్తాయి. ఇక్కడ ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ వంటి అతి ముఖ్యమైన కార్యకలాపాలు సాగుతాయి. అయితే, భారత్ కోరుకున్నట్లు జరగలేదు. తన ప్రధాన నగరాల్లో ఒకదానిలో ప్రాంతీయ ఆర్థిక సంఘాన్ని నెలకొల్పేలా ఐరాసను భారత్ ఒప్పించలేకపోయింది. అడిస్ అబాబా, బ్యాంకాక్, బీరూట్, జెనీవా, శాంటియాగోలకు ఈ ఘనత లభించింది. అందువల్ల, భారత్‌లో సీడీఆర్ఐ, ఐఎస్ఏ కార్యాలయాలను నెలకొల్ప టానికి వ్యవస్థాపక సభ్యదేశాలను ఒప్పించటం గొప్ప విషయం. నేడు ఈ రెండు సంస్థలు పెద్ద సంఖ్యలో భారతీయులకు ఉపాధి కల్పిస్తు న్నాయి. న్యూఢిల్లీకి మకాం మార్చి, ఈ సంస్థలలో పని చేయడానికి విదేశాల నుంచి కూడా నిపుణులను రప్పించారు. జాతీయ రాజధాని ప్రాంతం ఈ సంస్థల నుండి అనుబంధ ప్రయోజనాలను పొందుతుంది. వారి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా సమావేశాలు, ప్రదర్శనలకు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన వేదికగా ఎదుగుతుంది. భారత్ సభ్యురాలిగా ఉన్న అతి ముఖ్యమైన బహుళజాతి సమూహం ఏదంటే నిస్సందేహంగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీనిని సరళంగా క్వాడ్ అని పిలుస్తున్నారు. ఇది భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలను ఒకచోట చేర్చింది. క్వాడ్‌కు భారత్‌లో సంశ యవాదులు మాత్రమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకులు కూడా లేకపోలేదు. కానీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘వై భారత్ మ్యాటర్స్’ పుస్తకంలో, క్వాడ్ గురించి చాలా ముఖ్యమైన కానీ తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అంశాన్ని పేర్కొన్నారు. భారత్‌కు ‘ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా అభివృద్ధి చెందిన సంబంధం ఆస్ట్రేలియాతోనే’ అని రాశారు. జైశంకర్ ప్రకారం, ఈ క్వాడ్ సభ్యదేశంతో పెరుగుతున్న సంబంధాలు ఇతర క్వాడ్ సభ్యదేశాలైన జపాన్, అమెరికాలతో సంబంధాలలో అంతరాన్ని తగ్గించాయి. అధికారిక అంచనా, ప్రజల అవగాహన రెండింటిలోనూ జపాన్, అమెరికాతో భారత్ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. జైశంకర్ వాదనను అంగీకరించినట్లయితే, బహుపాక్షిక క్వాడ్ నిజానికి సాధారణంగా అంగీకరించిన దానికంటే పెద్ద ద్వైపాక్షిక ప్రయోజనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం, క్వాడ్ మొదటిసారిగా ఐరాస భద్రతా మండలి సంస్కరణపై అంతర్–ప్రభుత్వ చర్చలకు మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిని వాస్తవానికి ఏర్పాటు చేయడా నికి కారణమైన ప్రశంసనీయమైన లక్ష్యాలను అణచివేసే ప్రయత్నా లను అడ్డుకోవడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించింది. జైశంకర్ ప్రకారం, క్వాడ్ ‘రెండు దశాబ్దాలుగా కీలక సంబంధాలలో భారత దేశం సాధించిన పురోగతి సమాహారం’. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలతో కూడిన ‘ఐ2యూ2’ కూటమి కూడా పూర్తిగా భారత్‌కు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. యూఏఈ పెట్టుబ డులు, ఇజ్రాయెల్ నీటిపారుదల సాంకేతికతతో మధ్యప్రదేశ్‌లో ఫుడ్ పార్కుల నెట్వర్క్ స్థాపన జరిగింది. రెండో ఐ2యూ2 ప్రాజెక్ట్ అమె రికా నిధులతో గుజరాత్లో విద్యుదుత్పత్తి కోసం సౌరశక్తిని ఉపయో గించాలని భావిస్తోంది. అయితే, పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణ దృష్ట్యా కొత్త ఐ2యూ2 ప్రాజెక్ట్‌లు ముందుకు సాగడానికి చాలా సమయం పట్టనుండటం విచారకరం. ఇలాంటి మరెన్నో సమూహాలకు కేంద్రంగా ఉంటున్న భారత్‌తో బహుళజాతి కార్యక్రమాలు, త్రైపాక్షికత పెరుగుతుండటం అనేవి భారతీయ దౌత్య పురోగతికి సంకేతం. భారత్, ఫ్రాన్స్, యూఏఈ తమ ‘ఫోకల్ పాయింట్స్ గ్రూప్’ను 2022లో ఏర్పాటు చేశాయి. ఇది రక్షణ, విపత్తు నిర్వహణ నుండి ప్రాంతీయ అనుసంధానం, ఆహార భద్రత వరకు అనేక రంగాలలో పురోగమిస్తోంది. ఈ మోడల్ మాదిరి గానే భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కాలానుగుణంగా ‘ఫోకల్ పాయింట్ల సమావేశాలను’ నిర్వహిస్తున్నాయి. అంత మాత్రాన ఇదంతా భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి వీడ్కోలు చెప్పడం కానే కాదు. కానీ ఫ్రెంచ్వారన్నట్లు ‘మనం మళ్లీ కలిసేవరకు’ కొనసాగుతాయని అర్థం. కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్హఫీజ్ సయీద్‌ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు -
G20 Summit: ఐరాస భద్రతా మండలిని విస్తరించాలి: మోదీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని చెప్పారు. ప్రపంచాన్ని భవ్యమైన భవిష్యత్తు దిశగా నడిపించడానికి ఆయా సంస్థలు ‘నూతన వాస్తవ పరిస్థితులను’ ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. కాలానుగుణంగా మార్పునకు లోనుకానివి సమకాలినతను కోల్పోతాయని అన్నారు. ఆదివారం ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘వన్ ఫ్యూచర్’ సెషన్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా సరే ఇప్పటి అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి ఏర్పాటైనప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని పేర్కొన్నారు. అప్పట్లో ఐరాసలో 51 సభ్యదేశాలు ఉండవని, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 200కు చేరిందని గుర్తుచేశారు. అందుకు తగ్గట్లుగా భద్రతా మండలిని కూడా విస్తరించాలని అన్నారు. ప్రపంచంలో ఎన్నో రంగాల్లో మార్పులు జరిగాయని, ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల సంఖ్యల ఎలాంటి మార్పులు జరగలేదని ఆక్షేపించారు. ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను వివరించారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరున జీ20 సదస్సును వర్చువల్‌గా నిర్వహించుకుందామని ప్రతిపాదించారు. ఇప్పటి సదస్సులో తీసుకున్న నిర్ణయాలతోపాటు ఇతర అంశాలపై మరోసారి సమీక్షిద్దామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీల గురించి మోదీ ప్రస్తావించారు. వర్తమానాన్ని, భవిష్యత్తును ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. క్రిప్టో కరెన్సీలను రెగ్యులేట్ చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవానికి సైబర్‌స్పేస్ అనేది ఒక కొత్త వనరుగా ఆవిర్భవించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని, ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. మానవ కేంద్రిత అభివృద్ధి జీడీపీ కేంద్రిత ప్రయాణానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ కేంద్రిత అభివృద్ధి ప్రయాణం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈ దిశగా తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సామాజిక–ఆర్థిక ప్రగతికి ఉపయోగించాలని అన్నారు. -
ఐరాస భద్రతా మండలిలో భారత్.. సభ్యదేశాలదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్ ది వరల్డ్)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు. సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి. మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహం
ఐక్యరాజ్యసమితి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి భారత్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని బహూకరించింది. డిసెంబర్ 14వ తేదీన భద్రతా మండలి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ ఈ శిల్పాన్ని మలిచారు. ఈయనే గుజరాత్లో నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని డిజైన్ చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మక నార్త్‌లాన్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఆవరణలో భారత్ 1982లో ఇచ్చిన ఏకైక కానుక 11వ శతాబ్దం నాటి నల్లరాతి సూర్య విగ్రహం, జర్మనీ అందజేసిన బెర్లిన్ గోడలో ఒక భాగం, దక్షిణాఫ్రికా బహూకరించిన నెల్సన్ మండేలా కాంస్య విగ్రహం, పాబ్లో పికాసో వేసిన గుయెర్నికా చిత్రం తదితరాలున్నాయి. -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
కాబూల్ ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి
ఐక్యరాజ్యసమితి: కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది. -
క్లిష్టసమయంలో కీలక బాధ్యత
పదవి గౌరవమే కానీ, దానితో వచ్చే బాధ్యతలే బరువు. అదీ... క్లిష్టమైన సందర్భంలో పీఠమెక్కితే, కిరీటం మరింత బరువనిపించడం సహజం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి అధ్యక్ష స్థానంలో నెల రోజుల పాటు కూర్చొనే గౌరవం ఈ ఆగస్టు మొదట్లో భారత్‌కు దక్కినప్పుడు ఇలా ఎవరూ అనుకోలేదు. కానీ, అఫ్గాన్ పరిణామాలతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. భద్రతామండలికీ, ఈ నెల రోజులు అధ్యక్ష స్థానంలో ఉండే మన దేశానికీ బాధ్యతలు పెరిగాయి. ఒకవైపు ప్రపంచ దేశాల పక్షాన ఐరాస ద్వారా అఫ్గాన్ విషయంలో చేపట్టాల్సిన చర్యలున్నాయి. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత బాధ్యత ఉంది. ఇవి కాక, పొరుగు దేశమైన అఫ్గాన్ దెబ్బతో ఆర్థిక, రక్షణ రంగాల్లో మనపై పడే ప్రభావంపైనా దృష్టి సారించాల్సి ఉంది. వెరసి, కొద్దికాలం పాటు భారత సర్కారుకు చేతి నిండా పని, బుర్ర నిండా ఆలోచనలు తప్పవు. 2012 తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు భద్రతామండలి అధ్యక్ష పీఠం దక్కించుకోవడం మన దేశ దౌత్య విజయమే. అలా అంతర్జాతీయ భద్రత అంశాలపై మన గొంతు వినిపించే అవకాశమూ లభించింది. గమనిస్తే– అంతర్జాతీయ వేదికపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) కీలకం. దానిలో అతి కీలకవిభాగం భద్రతామండలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు అయిదింటికే అందులో శాశ్వత సభ్యత్వం ఉంది. ఎప్పటికప్పుడు మరో 10 దేశాలకు రెండేళ్ళ తాత్కాలిక సభ్యత్వం ఇస్తుంటారు. మానవాళిలో ఆరోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తూ, దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ, థర్మో న్యూక్లియర్ ఆయుధాలున్న భారత్‌కు భద్రతామండలిలో నేటికీ శాశ్వత సభ్యత్వం దక్కకపోవడం విచిత్రం. అది భద్రతా సమితి ప్రాసంగికతపైనా అనుమానాలూ రేపుతోంది. తాత్కాలిక సభ్యత్వం పొందడం మాత్రం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. వంతుల వారీగా దక్కే అధ్యక్ష పీఠాన్ని ఈ ఎనిమిదిసార్లుగా భారత్ అధిష్ఠిస్తూనే ఉంది. తాజాగా ఈ ఆగస్టు 2 నుంచి నెలరోజుల భారత భద్రతామండలి సారథ్యం మొదలైంది. ఆ వెంటనే భద్రతామండలి నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధాని అనే ఘనత మోదీ దక్కించుకున్నారు. సాగరజలాల భద్రత, తీవ్రవాద నిరోధం, శాంతిపరిరక్షణ ప్రధానాంశాలంటూ భారత్ మొదటే చెప్పేసింది. తొలి చర్చలోనే సాగర జలాల భద్రత అంశాన్ని చేపట్టి, మనం చైనాను ఇరుకునపెట్టాం. కాబూల్ తాలిబన్ల వశం కాక ముందే, అఫ్గాన్ అంశంపై ఆఖరు నిమిషంలో చర్చకు తెర తీసి, మార్కులు సంపాదించాం. అయితే, తాలిబన్ల పూర్తిస్థాయి విజృంభణతో అసలు సవాలు ఇప్పుడు మొదలైంది. అఫ్గాన్‌లోని మొత్తం 34 ప్రావిన్స్‌లలో ఒక్క పాంజ్‌షిర్ (అయిదు సింహాల) లోయలో మాత్రమే తాలిబన్లకు ప్రతిఘటన స్వరాలు వినిపిస్తున్నాయి. ఛాందస, తీవ్రవాద, సాయుధ తాలిబన్ల మూక పొరుగుగడ్డపై పట్టు సాధించడంతో మన జాతీయ భద్రతా సవాళ్ళు మరింత సంక్లిష్టమయ్యాయి. మరోపక్క తాలిబన్లు సైతం భారత్‌తో అన్ని రకాల ఎగుమతులూ, దిగుమతులూ ఆపేశారు. అది ఓ పెద్ద దెబ్బ. అఫ్గాన్‌తో అనాదిగా సంబంధ బాంధవ్యాలున్న భారత్ ఇప్పటికే 300 కోట్ల డాలర్ల మేర అక్కడ పెట్టుబడులు పెట్టింది. వాటి అతీ గతీ చెప్పలేం. వీటన్నిటికీ తోడు అఫ్గాన్ భూభాగం మన దేశంపై దాడులకు బేస్ క్యాంప్ అయ్యే ప్రమాదం సరే సరి. పేలుతున్న తుపాకీలు.. పెరుగుతున్న నిర్బంధాలు.. మానవహక్కుల ఉల్లంఘనలతో ఇప్పుడు కాబూల్ అల్లకల్లోలంగా మారింది. ఎలాగైనా సరే దేశం విడిచిపోవాలని కాబూల్ విమానాశ్రయం వెలుపల గుంపుల కొద్దీ జనం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి విమానాశ్రయం అమెరికా సైనిక బలాల పహారాలో ఉన్నా, తగిన పత్రాలున్న వారిని సైతం తాలిబన్లు లోపలకు పోనివ్వడం లేదని వార్త. సైనిక ఉపసంహరణకు అమెరికా పెట్టుకున్న గడువు ఆగస్టు 31. అది దాటిపోయినా సరే, ఆఖరు అమెరికన్‌ను కాబూల్ నుంచి భద్రంగా వెనక్కి తెచ్చేవరకు తమ బలగాలు అక్కడే ఉంటాయని వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ గొంతు సవరించుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం కాబూల్‌లోని పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తుదన్నారు. ఇప్పటికైతే భారత్ దృష్టి మొత్తం అఫ్గాన్‌లోని మన పౌరుల్ని సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడం మీదే ఉంది. అందుకు ఐరాస ప్రధాన కార్యదర్శితో, అమెరికా, బ్రిటన్లతోనూ చర్చిస్తోంది. మరోపక్క శాంతిపరిరక్షణ లాంటి అంశాలపై పత్రాలకు భద్రతామండలిలో ఏకగ్రీవ ఆమోదం సంపాదించింది. భారత దౌత్యనైపుణ్యానికి ఇది పరీక్షా సమయం. తీవ్రవాద నిరోధంపై గురువారం నాటి భద్రతా మండలి సమావేశంలో కోవిడ్ లానే తీవ్రవాదం నుంచీ ఎవరూ సురక్షితం కాదన్న జైశంకర్ వ్యాఖ్యలు అందరినీ తాకేవే. తీవ్రవాద నిరోధానికి సప్తసూత్రాలన్న భారత ప్రతిపాదన గమనార్హం. మంచి తీవ్రవాదం, చెడు తీవ్రవాదం అని వేర్వేరుగా ఉండవంటూ– జైష్, లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థల పేరెత్తడం ద్వారా పాక్ ప్రస్తావన తేకనే తెచ్చారు. అఫ్గాన్‌పైనా దృష్టి పడేలా చేశారు. నిజానికి తాలిబన్లకు తాళం వేస్తున్న చైనా, పాక్ లాంటి వాటికి పగ్గం వేయాలంటే భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమూ కీలకమే. 1950లలో తప్పిపోయిన శాశ్వత సభ్యత్వాన్ని, ఇప్పుడు వీటో హక్కుతో సహా దక్కించుకోవడం అవసరం. దానివల్ల అఫ్గాన్ సహా అనేక అంశాలపై భారత్ పట్టుపట్టగలుగుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్లో మనకు మళ్ళీ భద్రతామండలి సారథ్యం దక్కనుంది. అప్పటికైనా అఫ్గాన్ సంక్షోభానికి తెర పడుతుందా? అది మరీ అంత సులభం కాదేమో! -
భద్రతామండలి అధ్యక్ష హోదాలో భారత్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతామండలి అధ్యక్ష హోదా భారత్ దక్కింది. నేటి నుంచి నెల రోజులపాటు పాటు ఈ హోదాలో కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రప్రాంత రక్షణ, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి ప్రధాన అంశాలపై జరిగే కీలక చర్చలకు నేతృత్వం వహించనుందని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టుతోపాటు వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ అవకాశం భారత్‌కు దక్కుతుంది. ఈ ఆగస్టులో భారత్.. సముద్ర ప్రాంత భద్రత, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అంశాలపై మండలిలో జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్ష వహించనుంది. ‘సముద్ర ప్రాంత రక్షణ భారత్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. దీనిపై మండలి సమగ్రమైన విధానాన్ని తీసుకురావడం చాలా ముఖ్యం’ అని తిరుమూర్తి పేర్కొన్నారు. ‘అదేవిధంగా, శాంతిపరిరక్షణ దళాలను పంపడంలో ఆదినుంచి భారత్ ముందుంంది. వివిధ దేశాలకు పంపే శాంతిపరిరక్షక దళాల భద్రతకు మెరుగైన సాంకేతికతను వినియోగించడం, దళాలపై దాడులకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టే విషయమై భారత్ దృష్టి సారిస్తుంది’ అని వివరించారు. -
భద్రతామండలికి ఐదు దేశాలు ఏకగ్రీవ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమై న భద్రతామండలికి శుక్రవారం బ్రెజిల్, యూఏఈ, అల్బేనియా, ఘనా, గబాన్ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 15 మంది సభ్యులుండే మండలిలో చోటు సంపాదించడం చాలా దేశాలు ఒక మహదవకాశంగా భావిస్తాయి. సిరియా, యెమెన్, మాలి, మయన్మార్ దేశాల్లో సంక్షోభాలు మొదలుకొని.. ఉత్తరకొరియా, ఇరాన్‌ల అణ్వాయుధ ముప్పు, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థల దాడులు దాకా అనేక అంశాలపై తమ వాణిని బలంగా వినిపించేందుకు మండలి ముఖ్య వేదిక కావడమే ఇందుకు కారణం. ఆల్బేనియాకు మండలిలో చోటు లభించడం ఇదే మొదటిసారి కాగా, బ్రెజిల్‌కు ఇది 11వ సారి. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల ఫలితాలను జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వొల్కన్ బొజ్కిర్ ప్రకటించారు. మండలిలోని 15 సభ్య దేశాల్లో వీటో అధికారం ఉన్న అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్సులతోపాటు 10 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి. -
భద్రతా మండలిలో భారత్ నిర్మాణాత్మక పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి నుంచి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్ తాత్కాలిక శాశ్వత సభ్య దేశం కానుండటంతో ఐక్యరాజ్యసమితిలో తన వాణిని బలంగా వినిపించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. యూఎన్ఎస్సీ వ్యవహారలను సమన్వయం చేసేందుకు ఓ కౌన్సెలర్‌ను నియమించడంతో పాటు యూఎన్‌ఎస్‌సిలో భారత్ పనితీరును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రతి నెలా స్వయంగా సమీక్షిస్తారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి ఆర్ రవీంద్రన్‌ను సంయుక్త కార్యదర్శిగా భారత్ నియమించింది. ఇక 2007 ఐఎఫ్ఎస్ అధికారి ప్రతీక్ మాధుర్ యూఎన్ఎస్సీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కౌన్సెలర్‌గా నియమితులయ్యారు. రవీంద్రన్‌కు గతంలో యూఎన్‌పీఆర్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2011-12లో భారత్ ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న సమయంలో భారత మిషన్‌కు నేతృత్వం వహించిన ప్రస్తుత పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి నాయకత్వంలో యూఎన్‌పీఆర్‌లో రవీంద్రన్ సేవలందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఇటీవల ఎనిమిదోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఓటింగ్‌లో సర్వ ప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు భారత్‌కు మద్దతు పలికాయి. భారత్ విజయం సాధించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ ప్రపంచ శాంతి, భద్రత, సమానత్వ భావనలను ప్రోత్సహించేందుకు సభ్యదేశాలతో కలిసి భారత్ పనిచేస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. యూఎన్‌పీసీలో భారత్ 2021 జనవరి నుంచి రెండేళ్లపాటు తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమవుతున్న క్రమంలో అత్యున్నత సంస్థ ఏర్పడి 75 ఏళ్లు అయిన తర్వాత శాశ్వత సభ్యత్వం కోసం ఎందుకు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయం భారత్ విస్మరించరాదని దౌత్యవేత్తలు పేర్కొంటున్నారు. చదవండి : భద్రతా మండలికి భారత్ -
భారత ‘తాత్కాలిక’ అభ్యర్థిత్వానికి మద్దతు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా–పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. చైనా, పాకిస్తాన్‌లు కూడా ఈ ఆసియా–పసిఫిక్ దేశాల బృందంలో ఉండటం గమనార్హం. భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021– 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా, భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా–పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన దేశాల్లో చైనా, పాకిస్తాన్, నేపాల్, జపాన్, ఇరాన్, టర్కీ, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక, సిరియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈ, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, వియత్నాం, మాల్దీవులు, మయన్మార్, కిర్గిజ్స్తాన్ తదితర దేశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే భారత్ ఏడుసార్లు ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. చివరిసారిగా 2011–12 సంవత్సరాల్లో భద్రతామండలిలో ఇండియా తాత్కాలిక సభ్యదేశ హోదాను పొందింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హోదా దక్కనుంది. భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు శాశ్వత సభ్యత్వం ఉండటం తెలిసిందే. 21వ శతాబ్దపు రాజకీయ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇండియాకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. -
భారత్‌కు ఆ హోదా ఇవాల్సిందే
పారిస్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న భారత్‌కు ఆహోదా కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. భారత్‌తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్‌కు భద్రతా మండలిలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రపంచీకరణ, సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలకు శాశ్వత హోదా ఇవ్వాలని ఫ్రాన్స్ కోరింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో యూఎన్ఓ ఫ్రాన్స్ ప్రతినిధి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ అంశం ఆ దేశ వ్యూహాత్మక విధానాల్లో అత్యంత ప్రాధాన్య అంశంగా మారుతందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఐరాస భద్రతా మండలి పరిధిని విస్తృతం చేయడం, అందుకు దారితీసే చర్చల్లో విజయం సాధించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌కు పటిష్ఠ విధానం ఉంది. ప్రపంచ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే యూఎన్ఎస్సీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రితినిధి ఫ్రానోయిస్ డెలాట్రే స్పష్టం చేశారు. అందులో భాగంగా భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌తో పాటు ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలను మధ్య సమన్వయం చేయడంలో యూఎన్ఓ పాత్రను మరింత పటిష్ఠం చేయడానికి జర్మనీ, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయని డెలాట్రే తెలిపారు. అందుకు మండలిలో తగిన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. మండలి సంస్కరణ ఆవశ్యకతను భారత్ కూడా తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సర ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో.. మండలిలో సమాన ప్రాతినిధ్యం అంశాన్ని ఐరాస భారత ప్రతినిధి అక్బరుద్దీన్ కూడా లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి విస్తరణకు 122 దేశాల్లో 113 సభ్య దేశాలు సముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రపంచ దేశాల్లో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తున్న నేపథ్యంలో భద్రతా మండలిలో సభ్యుత్వం ఖచ్చింతంగా సాధించాలని భారత్ ప్రయత్నిస్తోంది. దీని కొరకు ఇప్పటికే అనేక దేశాల మద్దతును కోరుతోంది. -
చైనా అడ్డుకోవడం వల్లే ఆలస్యం
న్యూఢిల్లీ/బీజింగ్: పుల్వామా ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) ఖండిస్తూ ప్రకటన చేయడంలో వారం ఆలస్యం కావడానికి చైనాయే కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా చొరవతోనే వారం తర్వాతైనా ఆ ప్రకటన వచ్చిందన్నాయి. ఈ నెల 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేయడంతో 40 మంది జవాన్లు అమరులవ్వడం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 21న యూఎన్ఎస్పీ ప్రకటన చేసింది. ‘ఫిబ్రవరి 14న పిరికిపందలు చేసిన హీనమైన పుల్వామా ఉగ్రవాద దాడిని యూఎన్ఎస్సీ సభ్యదేశాలు ఖండిస్తున్నాయి. ఈ దాడికి జైషే మహ్మద్ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. దాడి కుట్రదారులు, నిర్వాహకులు, ఆర్థిక చేయూతనిచ్చిన వారందరినీ చట్టం ముందుకు తెచ్చి శిక్షించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలు, యూఎన్ఎస్సీ తీర్మానాలను అనుసరించి ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించేందుకు అన్ని దేశాలూ భారత ప్రభుత్వం, ఇతర విభాగాలకు సహకరించాలి’ అని ఆ ప్రకటనలో యూఎన్ఎస్సీ పేర్కొంది. మండలిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాలు శాశ్వత సభ్యదేశాలు కాగా, మరో 10 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి. వాస్తవానికి ఈ ప్రకటన 15వ తేదీ సాయంత్రమే రావాల్సిందనీ, అయితే సవరణలు చేయాలంటూ చైనా అడ్డు చెప్పడంతోనే ఆలస్యమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటనను నీరుగార్చేందుకు చైనా ప్రయత్నించగా, అసలు ప్రకటనే రాకుండా ఉండేందుకు పాక్ పావులు కదిపినా సఫలం కాలేకపోయిందని అధికారులు తెలిపారు. 15న ప్రకటన చేయడానికి 14 దేశాలు ఒప్పుకోగా, చైనా మాత్రం 18వ తేదీకి వాయిదా వేయాలని కోరిందనీ, ఆ తర్వాతా సవరణలు సూచించిందని చెప్పారు. కాగా, ఒక దాడిని ఖండిస్తూ యూఎన్ఎస్సీ ప్రకటన విడుదల చేయడం ఇదే ప్రథమం. మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి బహవాల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం పాకిస్తాన్ ప్రభుత్వం తమ నియంత్రణలోకి తీసుకుంది. -
భారత్ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల
వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత అజార్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమయింది. ఈ మేరకు భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతు ప్రకటించినప్పటికీ చైనా వీటో చేసింది. శుక్రవారం వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడారు. ‘ఈ తీర్మానంపై మండలిలోని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న భారత్, పాక్లూ భిన్నాభిప్రాయంతో ఉన్నాయి’ అని అన్నారు. -
‘సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’
న్యూయార్క్: సిరియా కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితి, రష్యా విఫలమయ్యాయని అమెరికా విమర్శించింది. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ వ్యాఖ్యానించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, రష్యా కలిసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ... సిరియాలో ఉన్నా రష్యా, ఇరాన్ సంకీర్ణ సేనలను వెనక్కు పిలిపించడంలో సమితి విఫలమైందన్నారు. డమాస్కస్ సమీపంలో తూర్పు ఘౌటా ప్రాంతంలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి 30 రోజులు గడిచినా పరిస్ధితిలో ఎటువంటి మార్పులేదన్నారు. అసద్, రష్యా సంకీర్ణ బలగాలు ఈ ఒప్పందాన్ని అతిక్రమించాయని మండిపడ్డారు. ‘ఇది చాలా తప్పు. భద్రతామండలిలోని ప్రతి సభ్యుడికి ఇది అవమానకరమైన రోజు’ అని నిక్కీ హేలీ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాల్పులు విరమణ ఒప్పందానికి ఓటు వేసిన రష్యా కట్టుబాటు చాటలేదని, ఈ విషయంలో మాస్కో కంటే తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో
వాషింగ్టన్: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి. 50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవద్దని కోరింది. ఈ అంశంపై సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా వీటో హక్కు ప్రయోగించడాన్ని ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ సమర్థించారు. తమ దౌత్య కార్యాలయం టెల్‌అవీవ్‌లోనే కొనసాగుతుందని బ్రిటన్ స్పష్టం చేసింది.