‘ఐరాస భద్రతామండలిని సంస్కరించాలి’ | Reform of the security council of the united nations | Sakshi
Sakshi News home page

‘ఐరాస భద్రతామండలిని సంస్కరించాలి’

Published Sun, Mar 1 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

Reform of the security council of the united nations

యూఎన్: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని బలోపేతం చేయాల్సిన అవసరముందని భారత్‌తో సహా జీ4 దేశాలు పేర్కొన్నాయి. 21వ  శతాబ్దానికి తగినట్లుగా, మరింత ప్రాతినిధ్యం పెరిగేటట్లుగా భద్రతామండలిని సంస్కరించాలని భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు శనివారం ఆ దేశాలు బెర్లిన్‌లో సమావేశమై భద్రతామండలి బలోపేతానికి సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడించాయి.

ఐక్యరాజ్యసమితి ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అయినా  ఇంకా సంస్కరణలు రూపుదాల్చలేదన్నాయి. భద్రతామండలి సంస్కరణలను సాధారణ సభ అధ్యక్షుడు సామ్ కుతెసా ఆహ్వానించారు. ఈ విషయమై పరస్పరం సహకరించుకోవాలని జీ4 దేశాలు తీర్మానించాయి. భద్రతామండలి సభ్యత్వాన్ని విస్తరించాలని చైనా ప్రతినిధి లీ జీయీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement