
స్లొవాకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రినీ వెల్లడి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ
బ్రటిస్లావా: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించా లని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్లొవాకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రినీ చెప్పారు. భద్రతా మండలిలో శాశ్వ త సభ్యదేశంగా మారే అర్హత భారత్‌కు ఉందన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, స్లొవాకియా పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం స్లొవాకియా చేరుకున్నారు.
ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం పలికింది. ప్రెసిడెన్షియల్ ప్యా లెస్‌లో ముర్ము, పీటర్ పెల్లిగ్రినీ సమావేశమ య్యారు. భారత్–స్లొవాకియా మధ్య ద్వైపాక్షి క సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం ప్రతినిధుల స్థా యిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రెండు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ లు)పై భారత్, స్లొవాకియా సంతకాలు చేశా యి.
భారత్‌కు చెందిన సుష్మాస్వరాజ్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీసు(ఎస్‌ఎస్‌ఐఎఫ్ ఎస్), స్లొవాకియాకు చెందిన స్లొవాక్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అండ్ యూరోపియన్ అఫైర్స్ పరస్పరం సహకరించుకోనున్నాయి. అలాగే ఇరుదేశాల పరిశ్రమల మధ్య సహకారం కోసం ఒప్పందం కుదిరింది. పీటర్ పెల్లిగ్రీతో భేటీ అనంతరం ద్రౌపది ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పుడు అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి స్లొవాకియా ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని తెలిపారు. స్లొవాకియా సహకారం, దాతృత్వాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోదని ఉద్ఘాటించారు.