permanent membership to india
-
ఐరాస భద్రతా మండలిలో భారత్.. సభ్యదేశాలదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్ ది వరల్డ్)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు. సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి. మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్ఎస్సీ) భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ అంశంలో భారత్‌కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. అత్యద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తున్న భారత్‌ను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో (ఎన్ఎస్జీ)లో చేర్చాలని అన్నారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మండలిలో సంస్కరణలు అమలు చేసినప్పుడు భారత్ శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతునిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించకూడదు అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల్ని గౌరవిస్తూ ఇచి్చన మాటలకి తాలిబన్లు కట్టుబడి ఉండాలని అమెరికా, భారత్ హితవు చెప్పాయి. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులకు నిలయంగా మారకూడదని, మరే దేశంలోనూ ఉగ్ర సంస్థలు విలయం సృష్టించకూడదని బైడెన్, మోదీ సంయుక్త ప్రకటన హెచ్చరించింది. అఫ్గాన్‌పై యూఎన్ భద్రతా మండలి తీర్మానం 2593 ప్రకారం తాలిబన్లు అఫ్గాన్ గడ్డను ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆరి్థక సహకారం అందజేయడానికి వాడకూడదని వారు చెప్పారు. అఫ్గాన్ వీడి వెళ్లాలనుకునే విదేశీయులను, అఫ్గాన్లను సురక్షితంగా పంపడానికి చర్యలు తీసుకోవాలని బైడెన్, మోదీ కోరారు. 26/11 కుట్రదారుల్ని శిక్షించాలి ఉగ్రవాదంపై సంయుక్త పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనీ, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని చెప్పిన నేతలు ముంబై 26/11 దాడుల సూత్రధారుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. దాడుల వెనుక పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా హస్తం ఉందన్న విషయం తెలిసిందే. ఐరాస గుర్తించిన జాబితాలో జైషే మహమ్మద్, అల్ ఖాయిదా, హక్కానీ నెట్వర్క్ కూడా ఉన్నాయి. -
మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతు!
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు ఇవ్వాలని అమెరికాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులు తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా చట్ట సభ్యులు అమీ బెరా, ఫ్రాంక్ పౌలోనేలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టా రు. ప్రపంచ శ్రేయస్సులో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. -
భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. ఈ మేరకు అధికారిక భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై మా అధ్యక్షుడు పూర్తి సమ్మతంగా ఉన్నారు.. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు' అని అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు.