
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు ఇవ్వాలని అమెరికాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులు తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా చట్ట సభ్యులు అమీ బెరా, ఫ్రాంక్ పౌలోనేలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టా రు. ప్రపంచ శ్రేయస్సులో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు.