UN
-
ఒడిదుడుకుల్లో జనాభా పెరుగుదల!
జనాభా పెరగడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఏం సమాధానమిస్తారు.. ప్రజలు పెరిగితే మంచితే కదా..శ్రామిక అవసరాలు తీరుతాయి.. అని కొందరు అంటారు. జనాభా ఎక్కువైతే మౌలిక అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయాలి..ఉపాధి కరవవుతుంది..నిరుద్యోగం పెరుగుతుంది..ఆకలి అధికమవుతుంది.. అని ఇంకొందరు అభిప్రాయపడుతారు. ప్రాంతాలవారీగా స్థానిక అవసరాలు, అక్కడి ప్రజల అవగాహన, సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం..వంటి చాలా కారణాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. ఈ జనాభా పెరుగుదలలోని తారతమ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అసమానతలను పెంచుతున్నాయి. 1950 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉందో తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలను వృద్ధి పథంలోకి తీసుకెళితే..మరికొన్ని ప్రాంతాలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. అక్కడ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం యువత వివాహాలకు సుముఖంగా లేకపోవడం, వివాహమైనా పిల్లలను కనడానికి ఆసక్తిచూపకపోవడమేనని తెలుస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070నాటికి 30శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఆసియాలో..ఆసియాలో 1950లో ఏటా జనాభా పెరుగుదల దాదాపు 58 కోట్లుగా ఉండేదని నివేదిక చెబుతుంది. 73 ఏళ్ల తర్వాత 2023లో అది 65 కోట్లుగా ఉంది. 1990ల్లో గరిష్ఠంగా జనాభా పెరుగుదల సుమారు 90 కోట్లకు చేరింది. క్రమంగా తర్వాతికాలం నుంచి పడిపోయింది. 2012లో ఘణనీయంగా దిగజారింది. చారిత్రాత్మకంగా భారత్, చైనా, ఇండోనేషియా..వంటి దేశాల్లో 20వ శతాబ్దంలో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పురోగతి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో జనాభా పెరిగింది.ఆఫ్రికా.. ఆకలిరాజ్యంఓ వైపు జనాభాలేక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే ఆఫ్రికాలో మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం..1950లో ఏటా సరాసరి 98 లక్షల జనాభా పెరుగుదల ఉండే ఆఫ్రికాలో 2023 నాటికి అది 4.6 కోట్లకు చేరింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరైన ఉపాధి అవకాశాలులేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పోషకాహారలోపంతో ఉన్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆకలి తాండవిస్తోంది.యూరప్‌లో..పారిస్, లండన్, బ్రిటన్..వంటి ప్రాంతాల్లోని ప్రజల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. దాంతో ఏళ్లకాలం నుంచే ఎక్కువగా పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడ్డారు. సరాసరి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే కనేవారు. అది ప్రస్తుతం మరింత తగ్గిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1950లో ఏటా జనాభా పెరుగుదల 95 లక్షలుండే యూరప్‌లో 2023 నాటికి అది 63 లక్షలకు చేరింది.అగ్రరాజ్యం అమెరికాలో..క్రిస్టఫర్ కొలంబస్ 1490లో అమెరికాను కనుగొనే దానికంటే ముందు అక్కడ కేవలం రెండు తెగలకు చెందిన ప్రజలే ఉండేవారు. దాంతో జనాభా తక్కువగా ఉండేది. క్రమంగా విద్యా వ్యవస్థ విస్తరించింది. అమెరికాలో స్త్రీ, పురుష భేదాలు తక్కువగా ఉంటాయి. దాంతో దాదాపు అందరూ ఉద్యోగాలు చేసేవారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమెరికాలో నివసించడం ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి పిల్లల్ని తక్కువగానే కనేవారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారు. సంస్థలు స్థాపించేవారు. అక్కడి జనాభాకు ఉపాధి దొరకండంతోపాటు మరింత మంది అవసరం ఏర్పడేది. దాంతో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరిగాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం జనాభా పెరుగుదలపై అప్రమత్తంగానే ఉన్నారు. 1950లో జనాభా ఏటా పెరుగుదల 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థజనాభా ఎక్కువగా ప్రాంతాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాని పెరుగుదలకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. జనాభా తారతమ్యాలు ఏర్పడకుండా ప్రపంచదేశాలు కొన్ని నియమాలు రూపొందించుకుని వాటిని పాటించాలని కోరుతున్నారు. -
ఐరాసలో పెరగనున్న పాక్ ప్రభావం
లోక్‌సభ ఎన్నికల హడావిడిలో ఈ వార్త అంతగా దృష్టిలో పడలేదుగానీ, భద్రతా మండలిలో రెండేళ్ల కాలానికి పాకిస్తాన్ ఎన్నిక కావడం భారత్ పట్టించుకోవాల్సిన అంశమే. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదు సభ్యదేశాలు భద్రతా మండలిలో ఉండటమూ పాక్‌కు కలిసొచ్చేదే. కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి అది ప్రయత్నించవచ్చు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత ఐరాస ఎజెండాలో కీలకమైంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాక్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని చర్చలోకి తేగలదు. ఒక భారతీయుడిని ఐరాస నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కూడా పాక్ ప్రయత్నించవచ్చు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి పాకిస్తాన్ ఇటీవల ఎన్నికైన విషయాన్ని, భారత్‌లో విస్తృతంగా నివేదించి ఉంటే, అది భారతీయులను కలవరపరిచి ఉండేది. భారత్ లోక్‌సభ ఎన్నికల్లో కూరుకుపోవడంతో, ఐక్యరాజ్య సమితి అత్యున్నత కమిటీలో పాకిస్తాన్ స్థానం గురించిన వార్తలకు దేశంలో పెద్దగా స్పందన లభించలేదు. ఐరాసలోని 193 సభ్య దేశాలలో 182 పాకిస్తా¯Œ కు అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎన్నిక, మూడవ దఫా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారనుంది.2025 జనవరి 1న భద్రతామండలిలో రెండేళ్ల కాలానికి చేరనున్న పాకిస్తాన్, సోమాలియాల ఎంపికతో ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్’కు చెందిన ఐదు సభ్యదేశాలు ఉంటాయి. మొత్తం ప్రపంచం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిర్ణయాలు చేసే ఏకైక ఐరాస సంస్థ అయిన భద్రతామండలి ఎన్నుకున్న సభ్యుల సంఖ్యలో ఇది సగం. అటువంటి నిర్ణయాలను మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీటో ద్వారా తిరస్కరించవచ్చన్నది మరొక విషయం. ఈ సభ్యదేశాలనే పి–5 లేదా బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌కు ఐరాస భద్రతామండలి తలుపులు తెరిచినంత మాత్రాన, భారత్ ఏదైనా దౌత్యపరమైన ముప్పును ఎదుర్కొంటుందని అర్థం కాదు. ప్రమాదం ఉండదు, కానీ సవాలు మాత్రం ఉంటుంది. అందువల్ల, భారత్ నిశ్చింతగా ఉండకూడదు. న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి పదవి ఖాళీగా ఉంది. పాకిస్తాన్ తరఫున గత ఐదేళ్లుగా ఈ పదవిని నిర్వహిస్తున్న మునీర్ అక్రమ్ ఒక ఘోరమైన రాయబారి. ఆయన అంతకుముందు కూడా 2002 నుండి ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉన్నారు. 1994లో ఐరాస మానవ హక్కుల సంఘం ఎజెండాలో కశ్మీర్‌ను చేర్చడంలో అక్రమ్ రహస్య దౌత్యం దాదాపుగా విజయం సాధించింది. మరుసటి సంవత్సరం, ఆయన అధికారికంగా జెనీవాలో ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులవడమే కాకుండా ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. కాబట్టి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం మధ్యలో పదవీ విరమణ చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్థానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలి.వచ్చే ఏడాది ద్వైవార్షిక సమీక్ష కోసం కౌంటర్ టెర్రరిజం డాక్యుమెంట్ ఐక్యరాజ్యసమితి వద్దకు తిరిగి వస్తుంది. ఈ సమీక్షలోని పాఠం సరిహద్దు ఉగ్రవాద బాధితురాలిగా భారత్‌కు ముఖ్యమైనది. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించిన పాకిస్తాన్ వంటి మొండి రాజ్యాల కారణంగా, ఉగ్రవాదానికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రూపొందించలేకపోయారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ సమావేశంలో సోమాలియాది కూడా సందేహాస్పద వైఖరి కావడంతో, జనరల్ అసెంబ్లీపై ఈ రెండు దేశాల ప్రభావమూ పడుతుంది. అదే సమయంలో భారత్ మరో ప్రమాదం నుంచి తనను కాపాడుకోవలసి ఉంది. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదుగురు భద్రతా మండలి సభ్యులు ఒక భారతీయుడిని ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కలిసి పని చేసే అవకాశం ఉంది. వాళ్లు కచ్చితంగా భద్రతా మండలి ప్రసిద్ధ తీర్మానం 1267 ప్రకారం, ఒక హిందువును ఉగ్రవాది జాబితాలో చేరడాన్ని చూడాలనుకుంటారు. 1999లో ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం, ఉగ్రవాది జాబితాలో చేరిన అపఖ్యాతి ఒసామా బిన్ లాడెన్‌ది. న్యూఢిల్లీలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం ఈ విషయంలో ఓఐసీకి మేత అవగలదనే చెప్పాలి. అయితే 2024లోనూ, వచ్చే ఏడాదిలోనూ మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం భారత్‌లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇది చాలావరకు ఆధారపడి ఉంటుంది.1267 తీర్మానంతో ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ ద్వారా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చడంలో అమెరికాతో కలిసి పనిచేసిన భారత్ సఫలీకృతమైంది. ఆ ఘటన పాక్ రాయబారి అక్రమ్‌ను ఇప్పటికీ గాయపరుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు మక్కీయే కారణమని ఆ తీర్మానం ఇచ్చిన వివరణ పాక్ బాధను మరింత పెంచింది. ఈ మక్కీ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు స్వయానా బావ.రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, భద్రతా మండలిలో పాకిస్తాన్ ‘సంప్రదింపులు’ మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ప్రక్రియ మండలి సభ్యుల మధ్య అంతర్గత చర్చలను సూచిస్తుంది. ఈ చర్చల గురించి బహిరంగంగా ఎటువంటి రికార్డూ ఉండదు. ఇప్పుడు పాక్ భద్రతా మండలిలోకి ప్రవేశించిన తర్వాత, మిగతా ఓఐసీ సభ్యదేశాల మద్దతుతో కశ్మీర్‌పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. అవి ‘బహిరంగ సంప్రదింపుల’ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంటే వాటి గురించి మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారని అర్థం. సందర్భానుసారంగా ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కూడా ఆ చర్చల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు. భారత్ దృక్కోణం నుండి ప్రమాదం ఏమిటంటే, ఇటువంటి జిత్తులు కొనసాగుతున్నప్పుడు కశ్మీర్ సమస్యపై ఐరాస పూర్తి దృష్టి పడుతుంది. అయినప్పటికీ భద్రతా మండలిలో వీటో కలిగివున్న పి–5 దేశాలపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలి పనికి ఆటంకం కలగకుండా గతంలో భారత్, పాక్ సహజీవనం చేశాయి. రెండు దేశాలూ చివరిసారిగా 2012లో కలిసి పనిచేశాయి. కానీ తర్వాతరెండు విషయాలు మారిపోయాయి. ఐరాసలో అప్పటి పాకిస్తాన్ మిషన్ కు ‘డాన్’ మీడియా గ్రూప్‌ను కలిగి ఉన్న హరూన్ కుటుంబానికి చెందిన హుస్సేన్ హరూన్ నాయకత్వం వహించారు. ఆయన చాలామంది పాకిస్తాన్ కెరీర్ దౌత్యవేత్తల మాదిరిగా కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ నోరు జారలేదు. రెండవ మార్పు ఏమిటంటే, అప్పట్లో 2012లో ప్రపంచం చాలా భిన్నమైనదిగానూ, తక్కువ సంక్లిష్టమైనదిగానూ ఉండేది.ఇటీవలి సంవత్సరాలలో ఐరాసలో దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు, శత్రువుల మధ్య రహస్య, బహిరంగ ఘర్షణకు అవకాశాలు పెరిగాయి. అందువల్ల, భారత్‌తో తన ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ కు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత అనేది ఐరాస ఎజెండాలో కీలకంగా ఉంది. వివాదాలను పరిష్కరించడానికి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని గట్టిగా చర్చలోకి తీసుకురాగలదు. వారు తమ కుతంత్రాలలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇస్లామాబాద్ ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండిపోదు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికలలో యూరప్ మితవాదం వైపు దూసుకెళ్లిన తర్వాత, ఐరాస చర్చల్లో ఇస్లామోఫోబియా కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రతా మండలిలో ఓఐసీ దౌత్యవేత్తల సంఖ్య పెరగడం వారికి దేవుడిచ్చిన వరం. ఐక్యరాజ్యసమితిలో తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి పాకిస్తాన్ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.- వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- కేపీ నాయర్ -
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు. -
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్‌కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్‌ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని UN మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!) -
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్‌ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్‌లో 131 మంది, టఖార్లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్‌లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది. -
గడ్డకట్టే చలిలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సాహసం..! ఐతే..
చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్‌లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు. మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్‌కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం. కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్‌గా, బాక్సర్‌గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్‌లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎన్ మిషన్కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్‌లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్‌గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ. VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC — Press Trust of India (@PTI_News) April 16, 2024 (చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?) -
తప్పొకరిది! శిక్ష అందరికా?
అంతకంతకూ తీవ్రమవుతున్న పాలస్తీనా సంక్షోభం వారం రోజుల్లో అనేక మలుపులు తిరిగింది. దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) చేసిన ప్రాథమిక నిర్దేశం ఒకవైపు, పాలస్తీనా శరణార్థులకై ఏర్పాటైన ఐరాస సహాయ సంస్థ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ (అన్రా)కు నిధులు ఆపేస్తున్నట్టు అమెరికా, మరో 8 దేశాలు ప్రకటించడం మరోవైపు, అమెరికా శిబిరాలపై డ్రోన్ దాడులు ఇంకోవైపు... ఇలా అనేక పరిణామాలు సంభవించాయి. గాజా యుద్ధానికి దారి తీసిన అక్టోబర్ 7 నాటి ‘హమాస్’ ఆకస్మిక దాడి, అపహరణలు, హత్యల్లో ‘అన్రా’ సిబ్బంది కొందరు పాలుపంచుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపణ. 190 మంది దాకా ‘అన్రా’ ఉద్యోగులు ఇస్లా మిక్ జిహాదీ తీవ్రవాదులైన ‘హమాస్’ వర్గీయులుగానూ వ్యవహరించారని అది అంటోంది. అయితే కొందరు తప్పు చేశారని గాజాలోని లక్షల మందికి ప్రాణాధారాన్ని ఆపేయరాదని ఐరాస అభ్యర్థన. ఎప్పుడో 1948లో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం సందర్భంగా దాదాపు 7 లక్షల మంది పాలస్తీనీయులు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతంలోని తమ ఇల్లూ వాకిలీ వదిలేసి పోవాల్సొచ్చింది. ఆ శరణార్థుల సాయానికై 1949లో ‘అన్రా’ ఏర్పాటైంది. గాజా, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, జోర్డాన్లలో విద్య, ఆరోగ్యం, సహాయ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే ఈ సంస్థ ద్వారా సుమారు 59 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు సాయం పొందుతున్నారు. ఇప్పటికే మానవీయ సంక్షోభంలో చిక్కుకున్న గాజాలోని ప్రజానీకానికి తిండి, నీళ్ళు అందిస్తున్నది ప్రధానంగా ఈ సంస్థే. అమెరికా లాంటి పలు దేశాల స్వచ్ఛంద విరాళాలతో నడిచే ఆ సంస్థపై ఆరోపణలు చేసి, నిరూపించకుండానే నిధులు ఆపేస్తే లక్షలాది అమాయకుల పరిస్థితి ఏమిటి? ఐరాస శరణార్థి సహాయ సంస్థకు నిధులిచ్చే దేశాల మాట అటుంచితే, అసలు సామాన్య పౌరులకు కష్టం వాటిల్లకుండా చేయగలిగినదంతా చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నిర్దేశించింది. అయినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజా ప్రాంతంపై దాడులు కొనసాగిస్తూ, అమాయకుల ఆయువు తీస్తోంది. ఆ మధ్య కొద్దివారాల పాటు గాజాలోని ప్రధాన నగరం నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన ఇజ్రాయెల్ సోమవారం మళ్ళీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అమానవీయ యుద్ధంలో ఇప్పటికే 26.5 వేల మంది పాలస్తీనీయులు మరణించారు. తీరం వెంట ధ్వంసమైన భవనాల శిధిలాల కింద ఇంకెన్ని వేల మృతదేహాలున్నాయో తెలీదు. అంతకంతకూ క్షుద్రమవుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇక, గాజా ప్రకంపనలు ఇతర చోట్లకూ విస్తరించాయి. ఆదివారం సిరియా సరిహద్దు సమీపంలోని జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగాయి. అమెరికా సైనికులు ముగ్గురు మరణించారు. ఈ దాడులు ఇరాన్ అండతో సిరియా, ఇరాక్లలో నడుస్తున్న తీవ్రవాద వర్గాల పని అన్నది అమెరికా మాట. ఆ పాపంలో తమకేమీ భాగం లేదన్నది ఇరాన్ ఖండన. నిజానికి, ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమాసియాలో పలు ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక శిబిరాలపై పదులకొద్దీ దాడులు జరిగాయి. అమెరికాకు ప్రాణనష్టం మాత్రం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ భీకర ప్రతీకార యుద్ధాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తున్న అగ్రరాజ్య విస్తృత రక్షణ వ్యవస్థల్ని దాటుకొని మరీ ఈ దెబ్బ తగలడం గమనార్హం. దాంతో, అమెరికా అధినేత సైతం ఇరాన్ మద్దతున్న తీవ్రవాదవర్గాలపై ప్రతీకార దాడులు చేయాలని హూంకరించారు. అలాగని నేరుగా ఇరాన్‌పై దాడికి దిగలేదు. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నేతలు కోరినా, అది తేనెతుట్టెపై రాయి వేయడమే. ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా నిలబడి కలబడుతున్న తీవ్రవాద బృందాలే అందుకు సాక్ష్యం. ప్రాంతీయ పోరాటాల్లో తలదూర్చినప్పుడల్లా తలబొప్పి కడుతూనే ఉందని అగ్రరాజ్యం మర్చి పోకూడదు. పశ్చిమాసియాలో ఇప్పటికే దానికి అనేక శత్రువులున్నారు. ఇరాన్‌పై దుందుడుకుగా ప్రవర్తిస్తే పరిస్థితి చేయి దాటుతుంది. చివరకు ఈ యుద్ధం ప్రపంచ స్థాయిలో పెద్దదవుతుంది. ఇటీవల ఎర్రసముద్రంలోని దాడులతో అస్తుబిస్తు అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి అది మరో అశని పాతం అవుతుంది. అది గ్రహించే అమెరికా అనివార్యంగా సంయమనం చూపాల్సి వచ్చింది. ఇంకోపక్క మరో విడత కాల్పుల విరమణకై అరకొర ప్రయత్నాలు సాగుతున్నా, అవేవీ ఫలించడం లేదు. తాజాగా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ అధినేత ఆదివారం ప్యారిస్‌లో ఇజ్రాయెల్, ఈజిప్టు, ఖతార్‌కు చెందిన ఉన్నతాధికారులను కలిశారు. మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తే, మరొక సారి కాల్పుల విరమణ పాటించేలా చర్చించి, ఒప్పించాలని ప్రయత్నం. కానీ, ఫలితం శూన్యం. ఇజ్రాయెల్ సైనికచర్యను తప్పుబడుతూ దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసు తేలేసరికి ఏళ్ళు పడుతుంది. ఈలోగా ఐసీజే గురువారం ఇచ్చిన ప్రాథమిక నిర్దేశం ఏ పక్షం వైపూ మొగ్గకుండా ఆచరణాత్మక ధోరణిలో సాగింది. గాజాలో అత్యవసర ప్రాథమిక సేవలు, మానవతా సాయం అందించాలని టెల్ అవీవ్‌ను కోరింది. అదే సమయంలో హమాస్ చేతిలోని బందీల పట్ల ఆందోళన వెలి బుచ్చుతూ, వారి విడుదలకు పిలుపునిచ్చింది. ఇలాంటి సమతూక ధోరణినే ఆశ్రయిస్తూ అమెరికా, ఐరోపా సమాజం సహా పాశ్చాత్యదేశాలన్నీ చర్చలతో పరిష్కారానికి మనసు పెట్టాలి. అంతు లేని యుద్ధానికి ఇజ్రాయెల్‌ను అనుమతిస్తున్న తమ విధానాలపై పునరాలోచన చేయాలి. ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఇరుపక్షాలనూ అంగీకరింపజేయాలి. కొందరు తప్పు చేశారని, ‘అన్రా’ నిధులను ఆపి అందరినీ శిక్షించడం శాంతిస్థాపనకు దోహదం చేయదని గ్రహించాలి. -
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్‌లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు. అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశంకానున్నారు. At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza. Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D — Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023 I am in Israel, a nation in grief. I grieve with you and stand with you against the evil that is terrorism. Today, and always. סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT — Rishi Sunak (@RishiSunak) October 19, 2023 -
అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్
న్యూయార్క్ అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలి ఫైరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు.. పాలస్తీనియన్లను ఎందుకు ఆహ్వానించట్లేదని మండిపడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ బామా, జో బైడెన్‌ను విమర్శించారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్‌ను దూషించారు. 'పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి? ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు తెరవలేరా..?' అని నిక్కి హేలి అన్నారు. 'పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్ ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఉంచుకుంటుంది? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు రక్షించాలనుకోరు. వారిని తమ దేశాల్లో ఉంచుకోవాలనుకోరు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ను నిందిస్తుంటారు. పశ్చిమాసియా సమస్యలను పరిష్కరించగల సత్తా వారికి ఉంది. కానీ చేయరు. హమాస్‌తో నిత్యం కలిసి పనిచేస్తుంటారు. వారికి నిధులను సమకూరుస్తారు. ఇజ్రాయెల్ దాడులపైనే మాట్లాడుతున్నారు. హమాస్ ఏం చేసిందో మాట్లాడరు. హమాస్ అరాచకాలపై పెదవి విప్పరు.' అని నిక్కి హేలి మండిపడ్డారు. ఇదీ చదవండి ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
మట్టిలో మాణిక్యాలు ఆంధ్రా-అమెరికా ప్రతి విద్యార్థి చూడాల్సిన వీడియో
-
అమెరికా ప్రభుత్వంతో ఏపీ విద్యార్ధుల సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత, పేద విద్యార్ధులను పెద్ద చదవులు చదివించాలనే ఆయన సంకల్పం ఎంతో ప్రతిష్టాత్మమైన అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యేలా చేసింది. పదిరోజుల అమెరికా పర్యటనలో ఉన్న మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు మంగళవారం ముఖ్యమైన US డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు మన విద్యార్ధులు. ఐక్యరాజ్య సమితి సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్, SPD శ్రీనివాస్, KGBV సెక్రటరీ మధుసూధనరావు నేతృత్వంలోని బృందం ఈ సమావేశంలో పాల్గొంది. అమెరికాలో అమలవుతున్న విద్యావిధానం పై అమెరికా ప్రతినిధి రోసీ ఎడ్మండ్ మన విద్యార్ధులకు అర్ధమయ్యేలా వివరించారు. AP ప్రభుత్వం అందించే విద్యా ప్రయోజనాల ప్రాముఖ్యత వారి జీవితాలపై దాని ప్రభావం గురించి ఒక ప్రదర్శనను అందించారు. విద్యార్థులు గోరుముద్ద పథకం గురించి వారి ఖాతాల్లోకి రూ. 15000 అందుకోవడం వల్ల వారి తల్లులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన నూతన విద్యావిధానం అది ప్రతి ఒక్క విద్యార్ధికి ఎలా ఉపయోగపడుతుందో విద్యా ర్ధులు చెప్పారు. నాడు నేడు కింద క్లాస్ రూమ్ స్ట్రక్చర్ పూర్తిగా మార్చిన విధానం ఫోటోలను మన విద్యార్ధులు వారికి చూపించారు. క్లాస్ రూమ్స్ ప్రైవేటుకు ధీటుగా డిజిటల్ బోర్స్డ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఫర్నీచర్, ప్లేగ్రౌండ్స్, డిజిటల్ లైబ్రరీ, ఆడపిల్లలకు సానీటరీ నాప్కిన్స్, బాలికల కోసం ఏర్పాటు చేసిన నూతన టాయిలెట్స్ గురించి చక్కగా వివరించారు మన విద్యార్ధులు. స్కాలర్‌షిప్‌తో USA, కెనడా, ఆస్ట్రేలియా, UK లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు జగనన్న విదేశీ విద్యా కానుక పెట్టారని చెప్పారు. ఇది USAలోని 200 విశ్వవిద్యాలయాలతో ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు USAలో చదువుకోవాలనే వారి కలను సాధించేలా చేస్తోందని వారు చెప్పారు. ఇండియా డెస్క్ ఆఫీసర్, క్వాడ్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రజనీ ఘోష్ మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను సాధించాలని ప్రోత్సహించారు. తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి డిప్లొమాట్ కావడానికి చాలా కష్టపడ్డానని విద్యార్థులకు చెప్పింది. విద్యార్థులకు ఇంగ్లీష్ చాలా మంచిదని, వారు కష్టపడి పని చేసి మంచి విద్యా ఫలితాలను సాధిస్తే భవిష్యత్తులో భవిష్యత్ దౌత్యవేత్తలు కూడా అవుతారని ఆమె చెప్పారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌లో ఇండియా డెస్క్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె, యుఎస్ఎలో ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి తమ విభాగం సిద్ధంగా ఉందని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థు్లు చెప్పినవన్ని విన్న తరువాత, ఆమె విద్యార్థుల విశ్వాసాన్ని మెచ్చుకుంది. విద్యార్ధినులను USA కు డెలిగేషన్కు పంపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, ఇది AP రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు విద్యను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. సీనియర్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ USA, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రోజీ ఎడ్మండ్ మాట్లాడూతూ USAలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాల గురించి విద్యార్థులకు వివరించారు. కొలంబియా, ప్రిన్స్టన్, హార్వర్డ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ మొదలైన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కార్యక్రమం పేద మెరిట్ విద్యార్థులకు సహాయపడుతుందని ఆమె ప్రశంసించారు. USAలో ఇంటర్న్‌షిప్‌లు, ఇతర ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం బ్యూరోస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌ల గురించి ఆమె విద్యార్థులకు వివరించారు. వివిధ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల క్రింద USAలో చదువుకోవడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఆర్థిక సహాయం గురించి ఆమె వివరించారు. USAలోని 400 యూనివర్శిటీలు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గుర్తింపు పొందాయని, విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, EDUCATION USA మెరిట్ విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్, విమాన ఛార్జీలు పొందడంలో సహాయపడుతుందని ఆమె విద్యార్థులకు వివరించారు.అమెరికా ప్రభుత్వ అధికారులతో మీటింగ్ అనంతరం అమరికాలో ఉన్నత విద్యా అవకాశాలపై విద్యార్ధులు తమకున్న ప్రశ్నలకు సమాధానాలడిగి నివృత్తి చేసుకున్నారు. బ్యూరోలు, భారత ప్రభుత్వం మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి విద్యార్థులకు ఎలాంటి అవకశాలుంటాయని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులను అడిగి తమ ప్రశ్నలకు సమాధాలు రాబట్టుకున్నారు మన విద్యార్ధులు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సీనియర్ ఎక్స్టర్నల్ ఆఫీసర్ మోలీ స్టీఫెన్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లీష్‌లో చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు ప్రశంసించారు. ఈ వయస్సులో విద్యార్థులు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడాన్ని తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ విద్యార్ధుల ప్రతినిధి బృందంలో 8 మంది బాలికలకు అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్తానికి అభినందనలు తెలిపింది. భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. పాఠశాలల నిర్వహణ వ్యవస్థ, AP ప్రభుత్వం యొక్క విద్యా కార్యక్రమాల అమలును కూడా ఆమె ప్రశంసించారు. :యునైటెడ్ నేషన్స్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్ మాట్లాడుతూ యూఎస్ డిపార్ట్ మెంట్ స్టేట్ అధికారులు ఏపీ విద్యార్ధుల బృందానికి ఇంత సమయం కేటాయించి విద్యార్ధులకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యార్ధులను అమెరికా పంపినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , విద్యాశాఖామంత్రి బొత్ససత్యనారాయణ, కమిషనర్ సురేష్ కుమార్, విద్యార్థులలో USA డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఎరిక్ క్రిస్టెన్సన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
‘వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెప్తున్నాయ్’
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ (Gita Gopinath)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ నుంచి వెళ్లిన విద్యార్థులు ఐఎంఎఫ్ కార్యాలయంలో సందడి చేశారు. వాళ్లను ఆహ్వానించి ముచ్చటించినందుకుగానూ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మా పిల్లలను కలుసుకున్నందుకు, సాదరంగా వాళ్లను ఆహ్వానించినందుకు గీతాగోపినాథ్ గారికి థ్యాంక్స్. వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెబుతున్నాయ్’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘చదువు అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మా పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్రాన్ని ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో నిండిపోయాను!’’ అని పోస్ట్ చేశారాయన. అంతకు ముందు గీతా గోపినాథ్ సైతం పిల్లలతో ఉన్న ఫొటోను తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అమెరికా, ఐరాస పర్యటనలో భాగంగా.. వాళ్లను ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద కలుసుకున్నట్లు ఆమె పోస్ట్ చేశారు. వాళ్లను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమె ట్వీట్లో తెలియజేశారు. Thank you for meeting our children and receiving them with such warmth @GitaGopinath garu, their bright smiles say it all! I truly believe that education is the biggest catalyst in not just transforming individual lives but in transforming entire communities. Our children are… https://t.co/WKek9sMdh9 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2023 -
ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితికి వెళ్లడం మనకే గర్వకారణం’
సాక్షి, విజయవాడ. పదో తరగతి ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన ప్రభుత్వ విద్యార్థులే ఐక్యరాజ్యసమితికి వెళ్లడం జరిగిందని.. ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు. దీనిపై కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తద్వారా మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచంతో పోటీ పడేలా చేస్తోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశ పుస్తకాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల ఖాళీల భర్తీపై కూడా త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. చిత్తశుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడా, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీమెన్స్ కంపెనీ గుజరాత్లో ఒప్పందం చేసుకుని, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందని, అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారన్నారు. అక్కడ సాఫ్ట్ వేర్ ఇచ్చి పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో కేంద్రం కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి జీపీఎస్ తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగులందరూ దీనిపై సహృదయంతో ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. -
ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం
న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm — Press Trust of India (@PTI_News) September 21, 2023 ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు.. -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్‌ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
టెక్ ఉద్యోగులకు ఊరట! సానుకూల విషయాన్ని చెప్పిన ఐఎల్వో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) రాక సంచలనాన్ని సృష్టించింది. తర్వాత క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ సొంత ఏఐ సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదని, వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ సహా అనేక టెక్ కంపెనీ అధినేతలు, సీఈవోలు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ భయాందోళనల నేపథ్యంలో టెక్ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది ఐక్యరాజ్యసమితి (UN)కి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను రీప్లేస్ చేయలేదని ఐఎల్వో తాజా అధ్యయనం వెల్లడించింది. ఐఎల్ఓ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ మనుషులు చేసే పనులను మార్చేస్తుంది తప్ప ఉద్యోగాలకు ముప్పు కాబోదు. అయితే ఏఐ రాకతో చాలా ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా యాంత్రీకరణకు గురవుతాయని ఐఎల్ఓ స్టడీ పేర్కొంది. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ప్రయోజనమే తప్ప విధ్వంసం ఉండదని వివరిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలేం ఊడిపోవని, కాకపోతే పనిలో నాణ్యత, ఉద్యోగుల పనితీరు మెరుగు వంటి అంశాలకు దోహదం చేస్తుందని ఐఎల్ఓ అధ్యయనం పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం వివిధ ఉద్యోగాలు, ప్రాంతాలకు వేర్వేరుగా ఉంటాయని, పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉందని ఐఎల్ఓ స్టడీ అంచనా వేసింది. ఇదీ చదవండి: ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే.. -
ఐరాస సదస్సుకు ఎటపాక కేజీబీవీ విద్యార్థిని
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్‌కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్లైన్లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం. -
‘హ్యూమన్ రైట్స్ హీరో-2023’గా హెరాల్డ్ డిసౌజా
ఇండియన్-అమెరికన్ లేబర్ ట్రాఫికింగ్ సర్వైవర్, యాక్టివిస్ట్ హెరాల్డ్ డిసౌజాను హ్యూమన్ రైట్స్ హీరో అవార్డు- 2023తో సత్కరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 17వ వార్షిక అంతర్జాతీయ మానవ హక్కుల యూత్ సమ్మిట్ సందర్భంగా హెరాల్డ్ డిసౌజా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సమ్మిట్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. డిసౌజాతో సహా అంతర్జాతీయ వక్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు దీనిలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం సమానత్వం, గౌరవం, ఐక్యత థీమ్‌తో కార్యక్రమం జరిగింది. ‘ప్రతి బిడ్డకు మానవ హక్కులు తెలియజేయాలి’ డిసౌజా తన ప్రసంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు మానవ హక్కులకు సంబంధించిన 30 ఆర్టికల్స్ నేర్పించాలని అన్నారు. అవి 1948లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే పత్రంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తన ముందు ప్రేక్షకుల్లో కూర్చున్న ప్రతీ ప్రతినిధి నిజమైన హీరోనే అని డిసౌజా అభివర్ణించారు. మనుషుల అక్రమ రవాణా, తరలింపు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, గౌరవించి, అవార్డు ఇచ్చినందుకు యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ షటిల్వర్త్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మానవ అక్రమ రవాణాదారుని చేతిలో.. డిసౌజా హ్యూమన్ ట్రాఫికర్‌గా యుఎస్‌కి వచ్చారు. 18 నెలలకు పైగా ఆయన మానవ అక్రమ రవాణాదారుని చేతిలో దోపిడీకి గురయ్యారు. తన స్వేచ్ఛను కోల్పోయారు. నేడు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెరాల్డ్ డిసౌజా న్యాయవాది, పబ్లిక్ స్పీకర్. అతని చేదు అనుభవం అతనికి జీవితంలో కొత్త లక్ష్యాన్ని, అర్థాన్ని అందించింది. డిసౌజా ఐస్ ఓపెన్ ఇంటర్నేషనల్‌కు సహ-వ్యవస్థాపకుడు. ఈ సంస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచార పరిశోధనకు సహకరిస్తుంది. బాధితులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2015లో యునైటెడ్ స్టేట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో సభ్యునిగా డిసౌజాను నియమించారు. ట్రాఫికింగ్‌ను పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్‌కు నిపుణుల సలహాదారుగా కూడా డిసౌజా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అట్లాంటాకు చెందిన స్వచ్ఛంద సంస్థ శారీస్ టు సూట్స్ వ్యవస్థాపకుడు పట్టి త్రిపాఠి మాట్లాడుతూ డిసౌజా తన కుటుంబంతో కలిసి కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి, దీనిపై మరింత అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భయం నుంచి స్వేచ్ఛకు.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 46 దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశంలోని మంగళూరుకు చెందిన డిసౌజా ప్రస్తుతం ఒహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. అతని జీవిత అనుభవాలు అతనిని.. బానిసత్వం నుండి క్రియాశీలతకు, బాధ నుంచి ఆనందానికి, భయం నుంచి స్వేచ్ఛకు.. ఇప్పుడు ‘హ్యూమన్ రైట్స్ హీరో అవార్డ్ 2023’అందుకునేందుకు సహకరించాయి. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..
న్యూయార్క్: ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చని.. భారత పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పనిచేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశంలో భారతదేశం తరపున పాల్గొనడం గర్వంగా ఉందన్న కిషన్ రెడ్డి.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో గత దశాబ్ద కాలంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ స్థిరత్వమే ప్రధాన ఎజెండాగా చేపట్టిన పాలసీలు, ప్రాధాన్యతలతో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోదీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతోపాటు ముందుండి విజయవంతంగా నడిపామని కేంద్ర పర్యాటక మంత్రి వివరించారు. జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతోపాటుగా గోవాలో గత నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ గోవా రోడ్ మ్యాప్‌లో.. గ్రీన్ టూరిజం (సుస్థిర, బాధ్యతాయుతమైన, హరిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా సరైన ఫలితాలను సాధించడం), డిజిటలైజేషన్ (పర్యాటక రంగంలో సుస్థిరత, సమగ్రతను సాధించేందుకు డిజిటలైజేషన్ ద్వారా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం), స్కిల్స్ (యువత నైపుణ్యాలకు పదునుపెడుతూ పర్యాటక రంగంలో ఉపాధి, వ్యాపారసామర్థ్యాన్ని పెంచేలా చర్యలు), టూరిజం MSMEs (పర్యాటక రంగంలోని MSME లకు, స్టార్టప్‌లకు, ప్రైవేటు రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేయడం), డెస్టినేషన్ మేనేజ్మెంట్ (గమ్యస్థానాల్లో అవసరమైన నిర్వహణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై పునరాలోచన తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్లడం) అనే ఐదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. గోవా రోడ్ మ్యాప్ ద్వారా.. ప్రత్యక్షంగా, సానుకూలంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా అడుగులు పడ్డాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆలోచనల మేరకు.. ఘనమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పనతో ముందుకెళ్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. వివిధ దేశాలతో కలిపి థీమ్ బేస్డ్.. బుద్దిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ పర్యాటక విధానం ముసాయిదాలో ఇలాంటి వాటికి సరైన ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌తోపాటు ప్రపంచ పర్యాటకానికి కూడా ఎంతో సానుకూల ఫలితాలను అందిస్తుందన్నారు. ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారతదేశంలో పర్యాటకాభివృద్దికి సానుకూలమైన అంశాలన్నారు. భారతదేశ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద, యోగ, నేచురోపతి వంటివన్నీ.. ప్రకృతితో మమేకమైన జీవించాలన్న ఆలోచనను ప్రతిబింబిస్తాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే భారతీయ జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని.. రానున్న రోజుల్లో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా జీవనవిధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే ఉద్దేశంతో.. మిషన్ లైఫ్ (LiFE లైఫ్‌స్టయిల్ ఫర్ ఎన్విరాన్మెంట్) ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసిన భారత పర్యాటక మంత్రి.. ప్రజలతోపాటు పర్యాటకులు కూడా చిన్న ఆలోచనలు, చిన్న మార్పుల ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావొచ్చన్నారు. పర్యావరణ స్పృహతోపాటు పర్యాటకానికి సరైన గుర్తింపును తీసుకొచ్చే లక్ష్యంతో పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో.. ‘యువ టూరిజం క్లబ్’లను ఏర్పాటుచేశామన్నారు. తర్వాతి తర్వాతమైన భారతపౌరుల్లో పర్యాటక, పర్యావరణ స్పృహను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ క్లబ్స్ ద్వారా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయన్నారు. 2030 నాటికి పూర్తిచేసేలా నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగ సుస్థిరత, సమగ్రత లక్ష్యాల ప్రాధాన్యతతో భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసేందుకు ‘మీరంతా భారత్ కు రండి’ అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీ సాబా కొరోశీ, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (UNECOSOC) అధ్యక్షురాలు శ్రీమతి లాషెజరా స్టోయేవాతోపాటుగా.. వివిధ దేశాల పర్యాటక మంత్రులు, UNWTO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ప్రపంచ పర్యాటక రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యరాజ్యసమితిలో కిషన్ రెడ్డి ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో జూలై 13, 14 తేదీల్లో న్యూయార్క్‌లో జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్’లో ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో ఆయన వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశం జీ–20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ‘జీ–20 దేశాల టూరిజం చైర్’హోదాలో కిషన్ రెడ్డి ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇటీవలే గోవాలో జీ–20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహా్వనిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలు, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ఇతివృత్తం (థీమ్)తో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి వేదికగా ఈ సమావేశాలు జరగనున్నాయి. పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో సాధించిన ప్రగతిని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ వేదికగా సమీక్షించనున్నారు. ఈ ఏడాది ‘కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక రంగాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఉద్దేశించిన 2030 ఎజెండా అన్ని స్థాయిల్లో అమలు’పై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు. -
ఒడిశా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సానుభూతి
ఒడిశా రైలు ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారాన్ని వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆదివారం జరిగిన ప్రార్థనల్లో చనిపోయిన 275 మంది మృతికి సంతాపాన్ని తెలిపారు. "ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం అత్యంత విషాదకరం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. గాయాల బారిన పడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అండగా మా ప్రార్ధనలు ఉంటాయి." -ఆంటోనియో గుటెర్రెస్ వాటికన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం జరిగిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా ఒడిశా ప్రమాదం గురించి ప్రస్తావించి మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. " ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మలను పరలోకంలో ప్రభువు అంగీకరించును గాక. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలోని బాధితులకు నా ప్రార్ధనలు తోడుగా ఉంటాయి. గాయపడినవారికి, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను." - పోప్ ఫ్రాన్సిస్ బాలాసోర్ ఘటనలో 275 మంది మరణించగా వెయ్యికి పైగా గాయపడ్డారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ మిగిలిపోతుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపి, మరెందరినో దిక్కులేని వారిగా మిగిల్చిన ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
హిరోషిమాలో నిష్ఠుర నిజాలు
జపాన్‌లోని హిరోషిమా వేదికగా మూడు రోజులు సాగిన జీ7 దేశాల సదస్సు రష్యాపై మరిన్ని ఆంక్షలు, చైనాపై ఘాటు విమర్శలు, ఉక్రెయిన్ అధినేత ఆశ్చర్యకర సందర్శనతో ఆదివారం ముగిసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో కూడిన ‘జీ7’లో భాగం కానప్పటికీ, ఈ 49వ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్న భారతదేశం ప్రాధాన్యం ఈ వేదిక సాక్షిగా మరోసారి వెల్లడైంది. భారత ప్రధానికి అమెరికా, ఆస్ట్రేలియా అధినేతల ప్రశంసల నుంచి పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన పాదాభివందనం దాకా అనేకం అందుకు నిదర్శనాలు. రష్యా దాడి నేపథ్యంలో యుద్ధబాధిత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ఆయన సంక్షోభ పరిష్కారానికి వ్యక్తిగతంగానూ చొరవ చూపుతానడం పెద్ద వార్త. అంతటితో ఆగక ఆ మర్నాడే ఐరాసపై విమర్శల బాణం ఎక్కుపెట్టి, పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరణలు చేయకుంటే ఐరాస, భద్రతా మండలి కేవలం కబుర్లకే పరిమితమైన వేదికలుగా మిగిలిపోతాయనడం సంచలనమైంది. నిష్ఠురమైనా భారత ప్రధాని వ్యాఖ్యలు నిజమే. మూడేళ్ళక్రితం తూర్పు లద్దాఖ్ వెంట భారత్‌తో చైనా ఘర్షణ మొదలు తాజా ఉక్రెయిన్ సంక్షోభం దాకా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సమస్యల్ని చర్చించి, ఘర్షణల్ని నివారించాల్సిన ఐరాస ఆ పని చేయలేక ఇటీవల నామమాత్రంగా మారిన సంగతి చూస్తు న్నదే. సమస్యల్ని ఐరాసలో కాక, ఇతర వేదికలపై చర్చించాల్సి రావడం వర్తమాన విషాదం. అదే సమయంలో అంతర్జాతీయ చట్టం, ఐరాస నియమావళి, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవించి తీరాలంటూ జీ7 వేదికగా భారత ప్రధాని కుండ బద్దలు కొట్టారు. కాదని ఏకపక్షంగా వాస్తవస్థితిని మార్చే ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అన్న మోదీ వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవే. భద్రతా మండలిలో భారత సభ్యత్వానికి జరుగుతున్న సుదీర్ఘ కాలయాపన కూడా మోదీ మాటలకు ఉత్ప్రేరకమైంది. గమ్మత్తేమిటంటే, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం 1945 నాటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న భద్రతామండలిని వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని మీడియా ఎదుట అంగీకరించడం. ఇక, సాధారణ అలవాటుకు భిన్నంగా ఒక రోజు ముందు శనివారమే వెలువడ్డ జీ7 విధాన ప్రకటన డజన్ల కొద్దీ పేజీలున్నా – అందులో ప్రధానంగా చైనాపై విసిరిన బాణాలే ఎక్కువ. కనీసం 20 సార్లు చైనా నామ స్మరణ సాగింది. తైవాన్, అణ్వస్త్రాలు, ఆర్థిక నిర్బంధం, మానవహక్కులకు విఘాతం, అమెరికా సహా పలు దేశాలతో బీజింగ్‌కు ఉన్న ఉద్రిక్తతలు ప్రకటనలో కనిపించాయి. సహజంగానే డ్రాగన్ ఈ ప్రకటనను ఖండించింది. ఇదంతా ‘పాశ్చాత్య ప్రపంచం అల్లుతున్న చైనా వ్యతిరేక వల’ అని తేల్చే సింది. రష్యా సైతం ఈ సదస్సు తమపైనా, చైనాపైనా విద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నమంది. యాభై ఏళ్ళ క్రితం ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఏడు పారిశ్రామిక శక్తుల బృందమైన ‘జీ7’ దేశాలు ప్రపంచ సంపదలో దాదాపు 70 శాతానికి ప్రాతినిధ్యం వహించాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా 44 శాతమే. నిజానికి, 2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ‘జీ20’ కూటమి ఏర్పాటయ్యాక అంతర్జాతీయ ఆర్థిక మేనేజర్‌గా ‘జీ7’ వెలుగు తగ్గింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అగ్రశ్రేణిలో నిలిచిన ఈ దేశాలు ఇప్పటికీ తామే ప్రపంచ విధాన నిర్ణేతలమని చూపాలనుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆ ఆలోచన, ఆకాంక్ష అత్యవసర మయ్యాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని సమర్థించే శక్తులన్నీ ఒక్కచోట చేరి ఈ సదస్సును వినియోగించుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి అంతర్జాతీయ సమాజ విధివిధానాలకే సవాలని జపాన్ ప్రధాని పదే పదే పేర్కొన్నది అందుకే! స్వదేశంలోని రాజకీయ అంశాలతో తన పర్యటనలో రెండో భాగాన్ని రద్దు చేసుకున్నా ‘జీ7’కు మాత్రం అమెరికా అధ్యక్షుడు హాజరైందీ అందుకే! అదే సమయంలో 2.66 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, తమ సభ్యదేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, కెనడాల కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను అనేకానేక కారణాల వల్ల జీ7 విస్మరించే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, సరఫరా వ్యవస్థల్లో చిక్కులతో అనేక పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో పడ్డాయి. అటు రష్యాతో, ఇటు పాశ్చాత్య ప్రపంచంతో సంబంధాల్లో సమతూకం పాటిస్తుండడం భారత్‌కు కలిసొస్తోంది. భవిష్యత్తులో చర్చలు, దౌత్యంతో యుద్ధం ఆగాలంటే – ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్ మధ్యవర్తిత్వం కీలకం. కిందపడ్డా తనదే పైచేయిగా ఉండేలా ‘జీ7’కు భారత్ ఆ రకంగా అవసరమే. భారత్ సైతం ఒకపక్కన చైనా దూకుడును పరోక్షంగా నిరసిస్తూనే, రష్యా సాగిస్తున్న యుద్ధంపై తటస్థంగా ఉంటూ శాంతి ప్రవచనాలు చేయక తప్పని పరిస్థితి. భారత ప్రధాని అన్నట్టు చర్చలే అన్ని సమస్యలకూ పరిష్కారం. సమస్యను రాజకీయ, ఆర్థిక కోణంలో కాక మానవీయ కోణంలో చూడా లన్న హితవు చెవికెక్కించుకోదగ్గదే. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో వెనకబడ్డ దక్షిణార్ధగోళ దేశాలకు భారత్ గొంతుక కావడమూ బాగుంది. ప్రపంచ అధికార క్రమంలో గణనీయ మార్పుల నేపథ్యంలో ఇలాంటి శిఖరాగ్ర సదస్సులు, సమాలోచనలు జరగడం ఒకరకంగా మంచిదే. సమస్యల్ని ఏకరవు పెట్టడం సరే కానీ, సత్వర పరిష్కారాలపై జీ7 దృష్టి నిలిపిందా అంటే సందేహమే! -
అత్యధిక జనాభా భారత్‌దే: ఐరాస
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, దానిని అధిగమించి భారత్ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఐరాస వెల్లడించింది. అంటే చైనా కంటే 29 లక్షల జనాభా భారత్‌లో ఎక్కువగా ఉందన్నమాట. 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఈ లిస్ట్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అయితే ఈ గణాంకాలపై భారత్ నుంచి అధికారిక నిర్ధారణ లేదు. ఎందుకంటే ప్రతీ పదేళ్లకొకసారి భారత్‌లో జనాభా లెక్కల ప్రక్రియను కేంద్రం చేపడుతుంది. అయితే.. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. మరోవైపు చైనాలో 2022లో జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 1960 తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే. అక్కడి పరిస్థితులు, చట్టాలు అందుకు కారణం కాగా, జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సైతం విఫలమవుతున్నాయి. 2022లో ఏకంగా 8,50,000 జనాభా తగ్గిపోయింది అక్కడ. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ బుధవారం ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిసెస్' పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. భారత్, చైనా తర్వాత జనాభాలో అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్‌లు ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇదీ చదవండి: రాక్షస క్రీడకు శిక్ష తప్పదు.. -
మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది! యూఎన్‌లో భారత్
మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస ప్రబలంగా ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈమేరకు రుచిరా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవి. పైగా ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా మహిళలు, బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో మహిళల శాంతి భద్రతలపై ఐరాస భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందన, తదితరాల్లో మహిళల పాత్రను తెలియజేస్తోంది. అంతేగాదు ఇది సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతలకు సంబంధించి అన్ని రకాలుగా వారి పూర్తి ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మహిళలకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి చట్టబద్ధమైన నియమాలు తప్పనిసరి. అలాగే అఫ్ఘనిస్తాన్ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 2021లో భారత్ కౌన్సిల్ ఆఫ్‌ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యూఎన్ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం.. అప్ఘనిస్తాన్‌లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిథ్య పాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షార్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయసంస్థలకు సాయం చేయాలి. సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలి. శాంతిస్థాపన ప్రయత్నాలలో మహిళలపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే భారత్‌లో లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నాం. జనవరి 2023లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా సైన్యాన్ని అందించిన దేశాలలో భారత్ ఒకటి. 2007 లైబీరియాలో మొత్తం మహిళా పోలీసుల విభాగాలను ఏర్పాటు చేసిన మొదటి దేశం భారతదేశం. అంతేగాదు మహిళ రక్షణ సలహాదారుల విస్తరణకు భారత్ మద్దతు ఇస్తోంది. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు ఇప్పటికీ తక్కువగానే ప్రాతినిధ్యం వహించడం బాధకరం. కానీ భారత సాంస్కృతిక సంప్రదాయల్లో భూమిని తల్లిగా పరిగణించటం ప్రజలకు నేర్పింది. దేశ సాధికారతకు మహిళ పురోగతి చాలా ముఖ్యమని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని రుచిరా అన్నారు. (చదవండి: వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్)