పాల ఉత్పత్తిలో భారత్ నెం1
హైదరాబాద్: వచ్చే పదేళ్లలో భారత్ పాల ఉత్పత్తిలో నెం1గా నిలవనుంది. దీనికి కారణం జనభా పెరుగదలేనని ఐక్యరాజ్య సమితి, ఎకనామిక్ కోఆపరేషన్ సంస్థ(ఓఈసీడీ) రూపోందించిన (2017-2026) వ్యవసాయ అవుట్‌లుక్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తి మూడు రెట్లు అవుతుందని, భారత్ తర్వాత యూరోపియన్ యూనియన్ స్థానంలో నిలుస్తుందని రిపోర్టులో సూచించారు. అంతేకాకుండా జనాభాలో చైనాను మించి అత్యధిక జనాభ గల దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. భారత్ ప్రస్తుత జనాభ 130 కోట్లు ఉండగా ఈ సంఖ్య 150 కోట్లకు చేరుతుందని ఓఈసీడీ అంచనా వేసింది.