OECD
-
పన్ను ఎగవేతలను అరికట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రుణ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పన్ను ఎగవేతలను, అక్రమ నిధుల ప్రవాహానికి (ఐఎఫ్ఎఫ్) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఓఈసీడీ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి వాటివల్ల 2016లో 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం ఆసియా ఆర్థిక సంపదలో దాదాపు నాలుగు శాతం (సుమారు 1.2 ట్రిలియన్ యూరోలు) విదేశాల్లో చిక్కుబడి ఉందని ’ఆసియాలో పన్నులపరమైన పారదర్శకత 2023’ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. దీనివల్ల 2016లో ఆసియా ప్రాంత దేశాలకు వార్షికంగా 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంది. పన్నుల విషయంలో పారదర్శకత పాటించేందుకు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటైన గ్లోబల్ ఫోరం సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ ఫోరంలో 167 దేశాలకు సభ్యత్వం ఉంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ♦ కోవిడ్–19 మహమ్మారి, తదనంతర భౌగోళిక రాజకీయ సంక్షోభాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రజారోగ్యం, సామాజిక.. ఆర్థికపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింతగా వెచ్చించాల్సి వస్తోంది. ♦ ప్రస్తుతం పన్నులపరమైన ఆదాయాలు తగ్గి, దేశాల ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇక రుణ భారం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటం, వర్ధమాన దేశాల్లో వడ్డీలు చెల్లించే సామర్థ్యాలు తగ్గుతున్నాయి. ♦ 2004–2013 మధ్య కాలంలో ఐఎఫ్ఎఫ్ కారణంగా వర్ధమాన దేశాలు 7.8 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు నష్టపోగా, ఇందులో ఆసియా దేశాల వాటా 38.8 శాతంగా ఉంది. ♦ పన్ను ఎగవేతలు, ఐఎఫ్ఎఫ్లు దేశీయంగా ఆ దాయ సమీకరణకు అవరోధాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఇది సమస్యగా ఉంది. ♦ ఐఎఫ్ఎఫ్ల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. పన్నులపరమైన పారదర్శకతను పెంచేందుకు ప్రాంతీయంగా తీసుకునే చర్యలు మాత్రమే వీటిని కట్టడి చేయగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత
పారిస్: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార– అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత తగ్గించినట్టయింది. ‘‘విధానపరమైన అధిక అనిశ్చితి, కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వ్యాపార, వినియోగ విశ్వాసం మరింత క్షీణించడం అనేవి వృద్ధి తగ్గుదలకు దారితీస్తాయి’’ అని ఓఈసీడీ తన మధ్యంతర ఆర్థిక నివేదికలో వివరించింది. జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా సవరించింది. 19 దేశాల యూరో జోన్ వృద్ధి అంచనాలు ఏకంగా 1.8% నుంచి 1%కి తగ్గిపోయాయి. జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7%కి తగ్గగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్ 0.2 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య మందగమనంతో ఈ రెండు దేశాలకు ఎక్కువ అవినాభావ సంబంధం కలిగి ఉండడమే వీటి వృద్ధి అంచనాల్లో భారీ కోతకు కారణమని ఓఈసీడీ వివరించింది. బ్రిటన్ అంచనాలూ తగ్గింపు అలాగే, బ్రెగ్జిట్ సహా యూరోప్‌లో విధానపరమైన అనిశ్చితి ఎక్కువగా ఉందని తెలిపింది. అసంబద్ధంగా యూరోప్ నుంచి బ్రిటన్ వైదొలిగితే యూరోపియన్ ఆర్థిక వ్యవస్థల వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.4%నుంచి 0.8%కి సవరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 2009 తర్వాత ఇటలీ వృద్ధి అంచనాలు ఒక శాతం లోపునకు రావడం ఇదే ప్రథమం. అయితే, బ్రెగ్జిట్ (బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం) ప్రక్రియ సాఫీగా సాగిపోవడం ఆధారంగానే ఈ మాత్రం వృద్ధి అంచనా వేసినట్టు ఓఈసీడీ తెలిపింది. అమెరికా, చైనా గతేడాది విధించుకున్న వాణిజ్య నియంత్రణలు... వృద్ధి, పెట్టుబడులు, జీవన ప్రమాణాలను పడదోస్తాయని వ్యాఖ్యానించింది. -
నిద్రలేమితో కోట్ల రూపాయల నష్టం!
సరిపడా నిద్రలేకపోతే ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు వస్తాయంటారా! అయితే నిద్రలేమి కేవలం వ్యక్తుల ఆరోగ్యాలకే కాదు.. ఆర్థిక నష్టాలకూ కారణమవుతోందట! నిద్రలేమికి, ఆర్థిక నష్టానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా... అయితే ఈ స్టోరీ చదవండి... సరైన నిద్రలేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. ఆరోగ్యంగా లేకపోతే సరిగా పనిచేయలేడు. ఇప్పుడిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీలకు నష్టంగా మారుతోంది. నిద్రలేమి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్లు తాజా సర్వేలో తేలింది. రాండ్ అనే ఓ సంస్థ 34 ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) దేశాల్లో సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉద్యోగులు తమ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నారు. అక్కడా పని చేస్తున్నారు. దీనివల్ల రాత్రి సరిగా నిద్రపోవడం లేదు. సరిపడా విశ్రాంతి లేకుండానే మళ్లీ ఆఫీసులకు వస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఇలా భారీ నష్టాలు కంపెనీల కొంప ముంచుతున్నాయి. మొదటి స్థానంలో అమెరికా... అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ముందుండే అమెరికా నిద్రలేమి కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల్లోనూ ముందువరుసలో ఉండడం గమనార్హం. నిద్రలేమి కారణంగా ఈ దేశం ఏటా 41,100 కోట్ల డాలర్లు నష్టపోతున్నట్లు తేలింది. ఇక 13,800 కోట్ల డాలర్ల నష్టంతో జపాన్ రెండో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే, కెనడా ఉన్నాయి. ఇక ఎక్కువ ఉద్యోగులుండే భారత్, చైనాలో నిద్రలేమితో జరుగుతోన్న నష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ లెక్కించలేదు. నిద్రలేమితో కలుగుతోన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి జపాన్‌లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు కాసేపు కునుకు తీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. -
పాల ఉత్పత్తిలో భారత్ నెం1
హైదరాబాద్: వచ్చే పదేళ్లలో భారత్ పాల ఉత్పత్తిలో నెం1గా నిలవనుంది. దీనికి కారణం జనభా పెరుగదలేనని ఐక్యరాజ్య సమితి, ఎకనామిక్ కోఆపరేషన్ సంస్థ(ఓఈసీడీ) రూపోందించిన (2017-2026) వ్యవసాయ అవుట్‌లుక్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తి మూడు రెట్లు అవుతుందని, భారత్ తర్వాత యూరోపియన్ యూనియన్ స్థానంలో నిలుస్తుందని రిపోర్టులో సూచించారు. అంతేకాకుండా జనాభాలో చైనాను మించి అత్యధిక జనాభ గల దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. భారత్ ప్రస్తుత జనాభ 130 కోట్లు ఉండగా ఈ సంఖ్య 150 కోట్లకు చేరుతుందని ఓఈసీడీ అంచనా వేసింది. ఇక గోధుమల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం పెరగగా.. కేవలం ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 49 శాతం పెరుగుతోందని పేర్కొంది. భారత్, పాక్, చైనాలో గోధుమల ఉత్పత్తి ఎక్కువగా ఉండబోతుందని ఓఈసీడీ నివేదిక స్పష్టం చేసింది. ఇక రైస్ ప్రపంచ వ్యాప్తంగా 12 శాతం పెరగుతోందని, భారత్, ఇండోనేషియా, మయన్నార్, తైలాండ్, వియత్నంలో ఎక్కువ ఉత్పత్తి ఉంటుందని పేర్కొంది. -
పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
పారిస్‌లో సంతకాలు చేసిన ఆర్థిక మంత్రి జైట్లీ పారిస్/న్యూఢిల్లీ: చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకం చేశారు. దీంతో వివిధ దేశాలు కుదుర్చుకున్న 1,100 పైగా పన్ను ఒప్పంద నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ద్వంద్వ పన్నుల నివారణ కోసం భారత్‌కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్ తదితర దేశాలతో ఒప్పందాలు(డీటీఏఏ) ఉన్నాయి. వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్నుప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్లించి, ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్ ఇటీవలే కొన్ని దేశాలతో డీటీఏఏ ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయమున్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లోనే పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది. -
పారిస్‌కు జైట్లీ
♦ 4 రోజుల పర్యటన ♦ ఓఈసీడీ పన్ను ఒప్పందంపై సంతకాలు న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పారిస్ బయలుదేరారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఆయన ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ) పన్ను ఒప్పందంపై సంతకాలు చేస్తారు. బహుళజాతి సంస్థల(ఎంఎన్సీ) పన్ను ఎగవేతల నివారణ ఈ ఒప్పంద లక్ష్యం. అలాగే భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బుధవారం జరగనున్న ఓసీడీసీ సమావేశంలో జైట్లీ ప్రసంగిస్తారనీ, గ్లోబలేజేషన్పై ఒక చర్చా గోష్టిలో పాల్గొం టారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏజిల్ గురియా, డెన్మార్క్ విదేశీ వ్యవహారాల మంత్రి ఆండ్రూస్ శ్యాముల్ సన్ ఈ చర్చలో పాల్గొంటారు. రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న జైట్లీ, జూన్ 8న ఫ్రాన్స్ రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి సిల్వీ గౌలార్డ్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. -
ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి నకిలీనే
దుబాయ్ : మార్కెట్లో శరవేగంగా విక్రయాలు దూసుకెళ్లే ఉత్పత్తులు ఏమన్న ఉన్నాయా? అంటే అవి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే. వాటిలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు. వినియోగదారులు చూపుతున్న ఆసక్తికి కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లను దుమ్మురేపుతున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఇతర ఎలక్ట్రిక్ డివైజ్ లు కొనేటప్పుడు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. ప్రతి ఐదు స్మార్ట్ ఫోన్లలో కనీసం ఒకటి నకిలీదేనని తాజా రిపోర్టుల్లో వెల్లడవుతోంది. నాలుగు వీడియో గేమ్ ల కన్సోల్స్ కూడా ఒకటి ఫేకేనని తేలింది. దీనిపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) మంగళవారం ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్లోకి వస్తున్న నకిలీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఎలక్ట్రిక్ డివైజ్ లతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇవి కేవలం తక్కువ నాణ్యతను కలిగి ఉండటమే కాక ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయని ఓఈసీడీ రిపోర్టు హెచ్చరించింది. అమెరికా నుంచి వచ్చే పాపులర్ ఉత్పత్తులను చాలామంది కాపీ చేస్తున్నారని పేర్కొంది. మంచి ఫోన్లతో పోలిస్తే నకిలీ ఫోన్లలోనే ఆరోగ్యానికి హానికలుగజేసే సీసం, కాడ్మియంలను ఎక్కువ ఉన్నాయని ఓఈసీడీ రిపోర్టు పేర్కొంది. నకిలీ ఫోన్ల ఛార్జర్లు పేలుళ్లకు, ఎలక్ట్రిక్ షాక్‌లకు గురవుతాయని రిపోర్టు నివేదించింది. అమెరికా కంపెనీల మేథో సంపత్తి హక్కులు ఉల్లంఘించి నకిలీ ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నట్టు తెలిపింది. దీంతో కంపెనీల బ్రాండు వాల్యు దెబ్బతిని, రెవెన్యూలు కోల్పోతున్నాయని పేర్కొంది. ఈ కారణంతో 2011, 2013కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కనీసం సగం శాతం(43శాతం) ఉత్పత్తులను సీజ్ చేసినట్టు రిపోర్టు తెలిపింది. అసలివి ఏవో నకిలీవి ఏవో తెలుసుకోలేకపోతుండటంతో ఫేక్ ఉత్పత్తులకు మార్కెట్లో వస్తున్న సంపద కూడా ఎక్కువగానే ఉంది. 143 బిలియన్ డాలర్ల(రూ.9,27,648కోట్ల) విలువైన నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో ఇప్పటికే అమ్ముడు పోయినట్టు తెలిసింది. ఫేక్ ఉత్పత్తులను తయారుచేయడంలో చైనానే ప్రధాన సోర్స్ గా ఉందని రిపోర్టు వెల్లడించింది. -
భారత్‌కు మంచి రేటింగ్ ఇవ్వవచ్చు: ఓఈసీడీ
న్యూఢిల్లీ: రేటింగ్‌ను పెంచడానికి అనువైన పరిస్థితులు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉన్నట్లు ఆర్థిక విశ్లేషణా సంస్థ– ఓఈసీడీ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌పై ఓఈసీడీ ఆర్థిక సర్వే నివేదిక ఒకటి విడుదలైంది. భారత్ ఆర్థిక సలహాదారు శక్తికాంత్ దాస్, ఓఈసీడీ సెక్రటరీ జనరల్ యాజిల్ గురియా తదితర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల వరకూ భారీ తనఖాలతో మునిగిఉన్న బ్యాంకులకు ‘ఏఏఏ’ గ్రేడింగ్‌లు ఇచ్చేసిన రేటింగ్ సంస్థలు... అత్యంత జాగరూకతతో ఇప్పుడు వ్యవహరిస్తున్నాయని అన్నారు. భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.3 శాతం నమోదవుతుందని, 2018–19లో ఈ రేటు 7.7 శాతానికి పెరుగుతుందని ఓఈసీడీ అంచనావేస్తోంది. -
పన్ను సమాచార మార్పిడికి భారత్ ఓకే
బీజింగ్: ఇతర దేశాలతో పన్ను సంబంధిత అంశాల సమాచార మార్పిడి కోసం భారత్.. ‘మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్’పై సంతకం చేసింది. చైనా, ఇజ్రాయెల్, కెనడా, ఐలాండ్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఒప్పందంపై సంతకాలు చేసినవాటిలో ఉన్నాయి. ఇక్కడ జరుగుతోన్న పదవ ఫోరమ్ ఆన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) సదస్సులో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాలు వాటి వాటి పన్ను నివేదికలను పరస్పరం ఒకదానితో మరొకటి మార్చుకోవచ్చని ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఓఈసీడీ) తెలిపింది. ఆయా దేశాలు పన్ను వ్యవస్థ మెరుగుదలకు పర స్పరం సహకరించుకోవచ్చని పేర్కొంది. -
స్థిర వృద్ధి బాటన భారత్: ఓఈసీడీ
లండన్: భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో పలు అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ధోరణి మిశ్రమంగా కనిపిస్తోందని తెలిపింది. భారత్ వృద్ధి క్రియాశీలతకు సంబంధించి అక్టోబర్‌లో కాంపోసిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్ఐ) 100.2 పాయింట్ల వద్ద ఉంది. అయితే నవంబర్‌లో ఈ పాయింట్లు 100.4 పాయింట్లకు పెరిగింది. చైనా, బ్రెజిల్‌కు సంబంధించి తాత్కాలిక వృద్ధి ధోరణి కనిపిస్తుండగా.. రష్యా మాత్రం మందగమనంలోకి జారుతోంది. యూరో ప్రాంతంలో స్థిర వృద్ధి ధోరణి కనబడుతున్నట్లు తెలిపింది. ప్రత్యేకించి జర్మనీ, ఇటలీ విషయంలో సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెనడా, జపాన్, ఫ్రాన్స్‌ల విషయంలోనూ స్థిర వృద్ధి సానుకూలతలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్లు గరిష్ట స్థాయి సీఎల్ఐ నుంచి స్వల్పంగా జారాయి. -
భారత్‌కు మొండిబకాయిల సమస్య: ఓఈసీడీ
కౌలాలంపూర్: వర్థమాన ఆసియా దేశాల్లో భారత్ వృద్ధి స్థాయిలు బాగున్నాయని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని, 2016-17లో ఈ రేటు 7.3 శాతానికి మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. 2016-20 మధ్య భారత్‌లో సగటు వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేస్తోంది. కాగా భారత్ వృద్ధి బాటలో బ్యాంకింగ్ మొండిబకాయిల అంశం ఒక సవాలని తన తాజా విశ్లేషణా పత్రం ప్రకారం. 2015లో వర్థమాన ఆసియా దేశాల వృద్ధి రేటు 6.5 శాతం. 2016 నుంచి 20 వరకూ ఈ రేటు సగటున 6.2%గా ఉంటుంది. భారత్ వృద్ధి ధోరణి కొనసాగుతుంటే... చైనా నెమ్మదిస్తుంది. ఆసియాన్ ప్రాంతం 2015లో 4.6% వృద్ధి రేటు సాధిస్తుంది. -
ఆదాయ అసమానతలు భారత్‌లోనే తక్కువ
ఓఈసీడీ నివేదిక వెల్లడి ప్యారిస్/లండన్: మిగతా వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఆదాయపరమైన అసమానతలు తక్కువ స్థాయిలో ఉన్నాయని ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. అయితే, సంపన్న దేశాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని వివరించింది. ఇటు వర్ధమాన, అటు సంపన్న దేశాలన్నింటితో పోలిస్తే రష్యా, చైనా, బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికాలో సంపన్నులు, సామాన్యుల ఆదాయాల మధ్య వ్యత్యాసాలు అత్యధికంగా ఉన్నాయి. డెన్మార్క్, స్లొవేనియా, నార్వేల్లో అత్యంత తక్కువగా ఉన్నాయి. సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాసం అత్యంత సంపన్న దేశాల్లో మూడు దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉందని ఓఈసీడీ పేర్కొంది. చాలా మటుకు వర్ధమాన దేశాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. పేదరికం తగ్గింపు, ఏడాది పొడవునా గ్రామీణులకు ఉపాధి, ఆదాయం కల్పించడంలోనూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొంది. -
2018లో బ్లాక్‌మనీ వివరాలు
లండన్: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన భారతీయుల అకౌంట్ల వివరాలను తెలుసుకునేందుకు భారత్ 2018 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. పన్ను ఎగవేత, మోసాలను అరికట్టేలా ప్రపంచ దేశాలు సహకరించుకునేందుకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన సమాచార మార్పిడి విధానం ‘ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్’కు భారత్, స్విట్జర్లాండ్ సహా వంద దేశాలు ఆమోదించాయి. అయితే, ఈ సమాచార మార్పిడి విధానం భారత్ సహా 58 దేశాల్లో 2017లో అమల్లోకి వస్తుండగా, స్విట్జర్లాండ్‌తో పాటు మరో 34 దేశాల్లో 2018లో అమల్లోకి రానుంది. అందువల్ల భారతీయుల స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఈ విధానం ద్వారా భారత్‌కు 2018లోనే అందుతాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తరువాత స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారి అకౌంట్ నెంబర్, పేరు, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు, షేర్లు, బాండ్ల వివరాలు.. మొదలైన సమాచారం అంతా భారత్ అందుకోగలదు. నల్లధనం కేసుల దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో కీలక చర్య తీసుకుంది. ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ‘సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(సీఈఐబీ)’ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. -
భారత్‌లో ఆర్థిక వృద్ధి పటిష్టం: ఓఈసీడీ
లండన్: భారత్‌లో ఆర్థిక వ్యవస్థ పటిష్ట రీతిలో వృద్ధి చెందుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) సోమవారం పేర్కొంది. అయితే అమెరికా, చైనాసహా పలు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంలో ఉందని పేర్కొంది. ఈ మేరకు సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇది ఉద్దీపన ప్రభావంగా కనిపిస్తోందని వివరించింది. కాంపోజిట్ లెండింగ్ ఇండికేటర్స్ (సీఎల్ఐ) ప్రాతిపదికన ఈ విశ్లేషణ విడుదలైంది. భారత్‌కు సంబంధించి ఈ సూచీ నవంబర్‌లో 99.3 వద్ద ఉండగా, డిసెంబర్లో 99.4 వద్ద కు చేరింది. 2014 ఆగస్టు నుంచీ ఈ సూచీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కాగా ఆర్థిక వృద్ధికి కంపెనీలపై పాలనా, నియంత్రణల పరమైన అవరోధాలను తగ్గించాలని భారత్‌ను ఓఈసీడీ కోరింది. ముఖ్యంగా దేశంలో మౌలిక రంగం వృద్ధికి ఈ చర్యలు అవసరమని సూచించింది. టెలికం, పౌర విమానయానం, రైల్వేలు, రక్షణ, నిర్మాణ, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ఉన్న అడ్డంకులను మరింత తగ్గించాలని పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!
దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంలాంటి రెండు కీలక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఒకపక్క పారిశ్రామిక రంగం పుంజుకోగా.. మరోపక్క రిటైల్ ధరలు మరింత శాంతించాయి. కార్పొరేట్ రంగానికి రానున్న రోజుల్లో ఇది సానుకూల పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రానున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వృద్ధి రేటు భారీగా పుంజుకొని 2.5 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 0.48 శాతం మాత్రమే. అయితే, క్రితం ఏడాది సెప్టెంబర్‌లో పరిశ్రమల వృద్ధి 2.7 శాతంగా ఉంది. ప్రధానంగా మైనింగ్, తయారీ, యంత్రపరికరాల రంగాల మెరుగైన పనితీరు మొత్తం పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడింది. ఏప్రిల్-సెప్టెంబర్‌కు ఇలా... ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి కూడా పరిశ్రమల ఉత్పాదకత జోరందుకుంది. ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 0.5 శాతమే కావడం గమనార్హం. రంగాల వారీగా... తయారీ: పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వెయిటేజీ ఉన్న ఈ రంగం ఉత్పాదకత సెప్టెంబర్‌లో 2.5 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 1.4 శాతం. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి చూస్తే వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 2 శాతానికి పెరిగింది. మొత్తంమీద తయారీ రంగంలోని 22 పారిశ్రామిక విభాగాల్లో 15 విభాగాలు సెప్టెంబర్‌లో వృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. మైనింగ్: సెప్టెబర్‌లో ఉత్పాదకత 0.7 శాతంగా వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 3.6 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఉత్పాదకత 2.5%గా నుంచి 2.1 శాతానికి తగ్గింది. యంత్రపరికరాలు: డిమాండ్‌కు కొలమానంగా పరిగణించే ఈ రంగం ఉత్పాదకత వృద్ధి రేటు సెప్టెంబర్‌లో ఏకంగా 11.6 శాతానికి ఎగబాకింది. గతేడాది ఇదే నెలలో ఉత్పాదకత మైనస్ 6.6 శాతంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కూడా మైనస్ 0.6 శాతం క్షీణత నుంచి 5.8 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. విద్యుత్: ఉత్పాదకత 12.9 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో మాత్రం 5.9 శాతం నుంచి 10.4 శాతానికి ఎగసింది. కన్జూమర్ గూడ్స్: ఉత్పాదకత 1 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మైనస్ 1.2 శాతం క్షీణత నుంచి 4.6 శాతం వృద్ధిరేటును సాధించింది. కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత మైనస్ 10.6 క్షీణత నుంచి మరింత తగ్గి మైనస్ 11.3 శాతానికి క్షీణించింది. ఆరు నెలల వ్యవధిలో కూడా ఉత్పాదకత మైనస్ 12.6 శాతానికి(అంతక్రితం ఇదే కాలంలో మైనస్ 11.1 శాతం) దిగజారింది. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు.. న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో రిటైల్ ధరల పెరుగుదల రేటు కూడా భారీగా తగ్గింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 5.52 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ రేటు 6.46 శాతంగా ఉంది. వరుసగా నాలుగో నెలలోనూ ఇది తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2012 జనవరిలో ఈ కొత్త సిరీస్ గణాంకాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా, బేస్ రేటు తక్కువగా ఉండటం కూడా తాజా గణాంకాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కూరగాయల ఎఫెక్ట్... సీపీఐలో ఆహార ధరల ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్‌లో 7.69 శాతంగా ఉండగా.. అక్టోబర్‌లో 5.59 శాతానికి తగ్గింది. ముఖ్యంగా కూరగాయల ధర పెరుగుదల సెప్టెంబర్‌లో 8.59 శాతంగా ఉంది(గతేడాది ఇదే నెలతో పోలిస్తే). అక్టోబర్‌లో ఈ రేటు మైనస్ 1.45 శాతంగా నమోదైంది. పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు కూడా అక్టోబర్‌లో 17.49 శాతానికి తగ్గింది(సెప్టెంబర్‌లో 22.4 శాతం). ఇక గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారోత్పుత్తలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 6.35 శాతం నుంచి స్వల్పంగా 6.34 శాతానికి తగ్గింది. ఆర్బీఐ సమీక్షపైనే అందరికళ్లూ.. రిటైల్ ధరలు నేలకు దిగిరావడం... టోకు ధరలు కూడా కనిష్టస్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గింస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న వృద్ధి రేటును గాడిలోపెట్టాలంటే వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని పారిశ్రామిక రంగం పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2న ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) సెప్టెంబర్‌లో ఐదేళ్ల కనిష్టమైన 2.38 శాతానికి తగ్గడం తెలిసిందే. అక్టోబర్ గణాంకాలు రేపు(శుక్రవారం) రానున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 8 శాతానికి, 2016 మార్చినాటికి 6 శాతానికి తగ్గాలనేది ఆర్బీఐ లక్ష్యం. గత నాలుగు సమీక్షల్లో పాలసీ వడ్డీరేట్లను ఆర్బీఐ గవర్నర రఘురామ్ రాజన్ యథాతథంగా కొనసాగించడం విదితమే. -
వృద్ధి బాటన భారత్ ఆర్థిక వ్యవస్థ
లండన్: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటన కొనసాగుతున్నట్లు పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ పేర్కొంది. ప్రధానంగా 34 ప్రధాన ఆర్థిక వ్యవస్థల ఆర్థిక పనితీరును విశ్లేషించే ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ) తన కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్ (సీఎల్ఐ) సంకేతాల ప్రాతిపదికన తాజా జూలై అధ్యయనాన్ని వెలువరించింది. భారత్‌కు సంబంధించి సీఎల్ఐ జూన్‌లో 98.9 పాయింట్ల వద్ద ఉండగా, ఇది జూలైలో 99 వద్దకు పెరిగింది. మార్చిలో ఈ పరిమాణం 98.5 వద్ద ఉంది. భారత్ ఆర్థికాభివృద్ధి రేటు జూన్ క్వార్టర్లో రెండున్నర సంవత్సరాల గరిష్ట స్థాయిలో 5.7 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల విషయంలో... చైనా, రష్యాల ఆర్థికాభివృద్ధి స్థిరత్వంలో ఉన్నట్లు ఓఈసీడీ తెలిపింది. బ్రెజిల్ కూడా వృద్ధి బాటలో వేగం పుంజుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా, కెనడా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలు స్థిరత్వం సాధిస్తున్నట్లు ఓఈసీడీ పేర్కొంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతున్నట్లు పేర్కొంది. ఇటలీ మాత్రం వృద్ధిలో వెనుకడుగులో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మొత్తంగా యూరో ప్రాంతం అలాగే ఫ్రాన్స్‌లో సీఎల్ఐ స్థిరత్వంగా కొనసాగుతోంది. జపాన్ విషయానికి వస్తే- వృద్ధి విషయంలో కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. క్రెడిట్ పాజిటివ్‌లో బ్యాంకులు: మూడీస్ ఇదిలావుండగా బాసెల్-3 ప్రమాణాల సాధన దిశలో బాండ్ల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల సడలింపు బ్యాంకులకు సానుకూల అంశమని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ఒక విశ్లేషణా పత్రంలో పేర్కొంది. నిధుల సమీకరణకుగాను ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది ‘క్రెడిట్ పాజిటివ్’అని వివరించింది. ఈ నిబంధనల సడలింపు వల్ల టైర్-1 మూలధన నిష్పత్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత మెరుగుపరుచుకోగలుగుతాయని వివరించింది. బాండ్లలో పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్ భాగస్వామ్యానికి ఆమోదించడం వల్ల బ్యాంకుల ఇన్వెస్టర్ బేస్ విస్తృతమవుతుందని అభిప్రాయపడింది. -
ఈ ఏడాది వృద్ధి 3.4 శాతమే
లండన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14)లో దేశ ఆర్థిక వ్యవస్థ 3.4% వృద్ధిని సాధించవచ్చునని ఓఈసీడీ అంచనా వేసింది. అయితే దేశ ఆర్థిక మంత్రి చిదంబరం 5-5.5% స్థాయిలో జీడీపీ వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. దీంతో పోలిస్తే తాజా అంచనాలు బాగా తక్కువకాగా, గతేడాది(2012-13) 5% వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. ఇది దశాబ్ద కాలంలోనే అత్యంత కనిష్టంకాగా, ఇకపై ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటాయని ఓఈసీడీ అభిప్రాయపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ తగ్గడంతో ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు క్యాబినెట్ కమిటీ అనుమతుల నేపథ్యంలో పెట్టుబడులు వేగమందుకుంటాయని తెలిపింది. 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని తెలిపింది. పారిస్‌కు చెందిన ఆర్థిక సహకారం, అభివృద్ధి సమితి(ఓఈసీడీ) బుధవారం ఈ అంచనాలను వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది(2014-15)కి జీడీపీ 5.7%వృద్ధిని సాధిస్తుందని అభిప్రాయపడింది. ఆపై ఏడాది(2015-16) 5.7% వృద్ధిని అందుకుంటుందని పేర్కొంది. రూపాయి ఎఫెక్ట్: దేశీ కరెన్సీ విలువ క్షీణించడంవల్ల ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణాలు, కార్పొరేట్ విదేశీ రుణాలు భార మవుతాయని తెలిపింది. సరఫరా సంబంధ సమస్యలు కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో కరెంట్ ఖాతా లోటు పెరిగి వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణానికే అధిక ప్రాధాన్యమిస్తూ ఇండియా అనుసరిస్తున్న పరపతి విధానాలు ఆహ్వానించతగ్గవని ప్రశంసించింది. భూ సేకరణ కొత్త చట్టం పెట్టుబడులకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని, అయితే కొత్త ఆహార చట్టం వ్యయభరితంగా పరిణమిస్తుందని వివరించింది. -
నల్లధనం గుట్టు విప్పనున్న లీక్టెన్‌స్టీన్
న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసి కూడబెట్టిన అక్రమ సంపదను ఇతర దేశాల్లో దాచుకుంటున్న వారి గుట్టుమట్లు తెలుసుకునే కృషిలో భారత్ మరో ముందడుగు వేయనుంది. తమ దేశంలోని బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల సమాచారాన్ని వెల్లడించేందుకు లీక్టెన్‌స్టీన్ దేశం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో, లీక్టెన్‌స్టీన్ నుంచి ఈ సమాచారం పొందడానికి భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే కొలిక్కిరానున్నాయి. పన్ను ఎగవేతను అరికట్టడం, నల్లధనం వివరాలను వెల్లడించడంపై అంతర్జాతీయ ఒడంబడికపై సంతకం చేయడానికి లీక్టెన్‌స్టీన్ అంగీకరించిందని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) వెల్లడించింది. ఈ నెల 21, 22 తేదీల్లో జకార్తా(ఇండోనేసియా)లో జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో లీక్టెన్‌స్టీన్ ఈ ఒడంబడికపై సంతకం చేయనుంది. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓఈసీడీ పర్యవేక్షణలో ఈ ఒడంబడిక అమలవుతోంది.