పారిస్‌కు జైట్లీ
♦ 4 రోజుల పర్యటన
♦ ఓఈసీడీ పన్ను ఒప్పందంపై సంతకాలు
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పారిస్ బయలుదేరారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఆయన ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ) పన్ను ఒప్పందంపై సంతకాలు చేస్తారు. బహుళజాతి సంస్థల(ఎంఎన్‌సీ) పన్ను ఎగవేతల నివారణ ఈ ఒప్పంద లక్ష్యం. అలాగే భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
బుధవారం జరగనున్న ఓసీడీసీ సమావేశంలో జైట్లీ ప్రసంగిస్తారనీ, గ్లోబలేజేషన్‌పై ఒక చర్చా గోష్టిలో పాల్గొం టారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏజిల్ గురియా, డెన్మార్క్ విదేశీ వ్యవహారాల మంత్రి ఆండ్రూస్ శ్యాముల్ సన్ ఈ చర్చలో పాల్గొంటారు. రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న జైట్లీ, జూన్ 8న ఫ్రాన్స్ రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి సిల్వీ గౌలార్డ్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు.