బీజింగ్: ఇతర దేశాలతో పన్ను సంబంధిత అంశాల సమాచార మార్పిడి కోసం భారత్.. ‘మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్’పై సంతకం చేసింది. చైనా, ఇజ్రాయెల్, కెనడా, ఐలాండ్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఒప్పందంపై సంతకాలు చేసినవాటిలో ఉన్నాయి. ఇక్కడ జరుగుతోన్న పదవ ఫోరమ్ ఆన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) సదస్సులో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాలు వాటి వాటి పన్ను నివేదికలను పరస్పరం ఒకదానితో మరొకటి మార్చుకోవచ్చని ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఓఈసీడీ) తెలిపింది. ఆయా దేశాలు పన్ను వ్యవస్థ మెరుగుదలకు పర స్పరం సహకరించుకోవచ్చని పేర్కొంది.