ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్‌కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్‌లైన్‌లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు ఎంపికైంది.
ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్‌ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment