'ప్రత్యక్ష చర్చలకు రండి' | Ban calls for direct dialogue between Pakistan and India | Sakshi
Sakshi News home page

'ప్రత్యక్ష చర్చలకు రండి'

Published Tue, Sep 1 2015 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

'ప్రత్యక్ష చర్చలకు రండి'

'ప్రత్యక్ష చర్చలకు రండి'

న్యూయార్క్: భారతదేశం, పాకిస్థాన్ నేరుగా ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీ మూన్ కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రత్యక్ష చర్చల ద్వారా నిలువరించుకోవచ్చని చెప్పారు. 'మేం ప్రపంచంలోని అన్ని దేశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మార్పులను గమనిస్తున్నాం. పరిస్థితులు చేయిదాటే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అణ్వాయుధ సామర్ధ్యం కలిగి ఉన్న భారత్, పాక్లు నేరుగా చర్చలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను' అని బాన్ కీమూన్ చెప్పినట్లు ఆయన అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్రిక్ విలేకరులకు తెలిపారు.

గత నెలలో 23-24 మధ్య జరగాల్సిన చర్చలు అనూహ్యంగా రద్దవడంపట్ల బాన్ కీమూన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని, దీనిపట్ల కొన్ని సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement