bharath
-
మంత్రి టీజీ భరత్ ను నిలదీసిన మహిళ
-
వాళ్ళ టార్గెట్ ఒక్కటే.. చంద్రబాబు నీచ రాజకీయం : MLC Bharath
-
నారా లోకేష్, శ్రీ భారత్ పై కేఏ పాల్ వ్యాఖ్యలు
-
మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు
-
కుప్పంలో విజయం నాదే
-
టీడీపీ తప్పుడు ప్రచారానికి ఎమ్మెల్సీ భారత్ అదిరిపోయే కౌంటర్
-
ఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
-
‘లవ్’లో పోటీపడి నటించాం
లవ్ చిత్రంలో తాను, నటి వాణిభోజన్ పోటీ పడి నటించినట్లు హీరో భరత్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 50వ చిత్రం లవ్. నటి వాణి భోజన్ నాయకిగా నటిస్తున్న ఇందులో వివేక్ ప్రసన్న, రాధాదేవి, బిగ్‌బాస్ డేనియల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైలో చిత్ర టీజర్‌ను ఆవిష్కరించింది. వాణి భోజన్ మాట్లాడుతూ ఇంతకు ముందు భరత్ సరసన మిరల్ చిత్రంలో నటించానని, మళ్లీ ఇప్పుడు లవ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో నటించడానికి అవకాశం ఉన్న పాత్ర లభించిందని చెప్పారు. నటుడు భరత్ మాట్లాడుతూ ఇది తన సొంత సంస్థ లాంటిదన్నారు. హీరోయిన్‌ది కూడా ప్రధాన్యత కలిగిన పాత్ర అని తెలిపారు. ఇంతకుముందే మిరల్ చిత్రంలో వాణి భోజన్తో కలిసి నటించానన్నారు. మళ్లీ అదే కాంబినేషన్ అంటే ప్రేక్షకులు ఎలా భావిస్తారో అన్న సందేహం కలిగిందన్నారు. ఆమెకు తన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో ఇద్దరూ పోటీపడి నటించినట్లు చెప్పారు. ఇది యుక్త వయసులో పెళ్లి చేసుకున్న యువతీ యువకులందరూ రిలేట్ చేసుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. లవ్ తన 50వ చిత్రం కావడం సంతోషంగా ఉందన్నారు. -
భారత్ జోడో యాత్రలో మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ
-
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదు : రాహుల్ గాంధీ
-
భారత్ జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్
-
తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
-
అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్'. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. 'అతను అర్జున్ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అర్జున్ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే. -
చంద్రబాబు కు కౌంటర్ ఇచ్చిన కుప్పం ఎమ్మెల్సీ భరత్
-
తండ్రి స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు
-
కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సిఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించాం. ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించట్లేదు. విద్య, వైద్యంకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలరు అని సీఎం గుర్తించారు. ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం) కుప్పంలో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్ జగన్‌కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) -
ఇండియా దటీజ్ భారత్...!
భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణం ఇది. ‘ఇండియా దటీజ్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’. రాజ్యాంగ ముసాయిదాలో మొదట ఇండియా అని మాత్రమే ప్రతిపాదించారు. రాజ్యాంగ సభలోని కొందరు సభ్యులకు ఇది రుచించలేదు. భారత్‌గా ప్రకటిద్దామని సూచించారు. మరి కొందరు ఇండియాగానే కొనసాగిద్దామని వాదించారు. ఇండియా దటీజ్ భారత్ అనే పదబంధాన్ని ప్రయోగించి డాక్టర్ అంబేడ్కర్ ఈ వివాదానికి తెరదించారు. ప్రాచీన చరిత్రలో భరతఖండ, భరతవర్ష అనే పేర్లతోనే మన దేశం వాసికెక్కింది. ఆధునిక చరిత్ర మాత్రం ఇండియా అనే పేరుతోనే పిలవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా వలసపాలనతో ఇండియా పేరు విశ్వవ్యాపితమైంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ఇండియా నామస్మరణే కొనసాగుతున్నది. దేశీయంగా మాత్రం క్రమంగా భారత్ పలుకుబడి పుంజుకుంటున్నది. ఇండియా ఆధునికతకు సంకేతమని భావిస్తే, భారత్ ప్రాచీన యశస్సుకు గుర్తుగా భావించవచ్చు. ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాంతం వరకూ ఆర్థిక రంగంలో భారత్ ఒక సూపర్ పవర్‌గా కొనసాగింది. ఒకటో శతాబ్దం నుంచి 17వ శతాబ్ది వరకు ప్రపంచ దేశాల జీడీపీ లెక్కల్లో ఎక్కువ భాగం భారత్ అగ్రభాగాన కొనసాగిందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ వలసపాలన ఆ ప్రాధాన్యాన్ని పీల్చి పిప్పిచేసి మన మయూర సింహాసనం, కోహినూర్ వజ్రాలతో పాటు ఆర్థిక సూపర్ పవర్ టైటిల్‌ను కూడా కొల్లగొట్టింది. ఇండియా అనే మాట వలసపాలన అవశేషంగా మాత్రమే మిగిలిపోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాణానికి స్ఫూర్తిమంత్రంగా కూడా నిలబడింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలకూ, ఆదర్శాలకూ, ఆశయాలకూ మోడరన్ ఇండియా ఒక ప్రయోగశాల. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికీ, లౌకిక విలువలకూ, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకూ నెహ్రూ పునాదులు వేశారు. కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృ తులు, భాషలు ఎన్ని వేల వర్ణాలుగా కనిపిస్తున్నా ఆ భిన్నత్వాన్ని ఆయన గౌరవించారు. ఆ ఇంద్ర ధనుసులోనే ఇండియా అనే ఏకత్వాన్ని ఆయన దర్శించారు. స్థూలంగా దీన్నే నెహ్రూ ఇండియా అంటారు. ఇండియా, భారత్ అనే మాటలను పర్యాయ పదాలుగానే నెహ్రూ ఉపయోగించారు. విరుద్ధ భావాలుగా ఎప్పుడూ పరిగణించలేదు. కానీ నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించిన కొందరు గాంధేయవాదులూ, సోషలిస్టులూ తదితరులు ఈ విభజన తీసుకొచ్చారు. పట్టణ ప్రాంతాల వాళ్లు, ఇంగ్లిష్ చదువుల వాళ్లనే నెహ్రూ విధానాలు బాగుచేస్తున్నాయనీ, గ్రామీణ ప్రజలకూ, రైతు కూలీలకూ ఉపయోగపడటం లేదనీ వారి అభియోగం. ఫలితంగా ఇండియా – భారత్‌గా దేశం విభజితమవుతున్నదని వారు ఆరోపించేవారు. పట్టణాలు, పరిశ్రమలు, ఇంగ్లిష్ చదువులు, ఉద్యోగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రణాళికలు వగైరా ఇండియా ఆస్తులైతే, వ్యవసాయం, చేతివృత్తులు, పల్లెటూళ్లు, వీధిబళ్లూ భారత్‌కు చిరునామాలుగా అప్పట్లో విమర్శకులు వర్గీకరించారు. ఈ రెంటిలో నెహ్రూ ఇండియా పక్షమని వారు వాదించేవారు. అప్పుడది తరుణ స్వరాజ్యదేశం కనుక చదువుకున్నవాళ్లు, మేధావుల సంఖ్య తక్కువగా ఉండేది. ఉన్న కొద్దిమందీ సహజంగానే చాతుర్వర్ణాల్లోని టాప్ త్రీ కేటగిరీ వాళ్లే ఉండేవారు. ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు, తరువాత స్థానాల్లో వైశ్య, క్షత్రియ కులాలవాళ్లుండేవారు. శూద్ర వ్యవసాయ కులాల వాళ్లు అతి స్వల్పసంఖ్యలో ఈ అంతస్తును చేరుకోగలిగారు. రాజకీయ నాయకత్వం, బ్యూరోక్రసీ ప్రధానంగా ఈ వర్గాల నుంచే తయారైంది. క్రమంగా వీరి వారసత్వం ఢిల్లీ అధికార పీఠాన్ని ప్రభావితం చేయగల అధికార కులీన సమూహంగా (పవర్ ఎలీట్) రూపొందింది. సుమారు ఏడు దశాబ్దాల పాటు ఢిల్లీ దర్బార్‌లో ఇదే ఎలీట్ క్లాస్ చక్రం తిప్పింది. అధికారంలో ఎవరు ఉన్నా ఈ కోటరీ మాత్రం తప్పనిసరి. శూద్ర వ్యవసాయ కులాలు, చేతివృత్తి దారులు, దళితులు, గిరిజనులకు ఉండే స్థానిక, ప్రాంతీయ అస్తిత్వ భావనలు ఈ ఎలీట్ క్లాస్‌కు తక్కువ. ప్రాంతీయ సెంటిమెంట్లను అధిగమించిన ఇండియన్ నేషనలిస్టులు వీరు. ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడతారు. స్టీఫెన్స్, జెఎన్యూ, ఐఐటీ లేదంటే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్‌లో చదువుకున్నవాళ్లు. రాజకీయాల్లోనూ, వ్యాపారరంగంలోనూ, బ్యూరోక్రాట్లలోనూ వీరు కనిపిస్తుంటారు. నెహ్రూ కాలంలో మొగ్గతొడిగి ఇందిరమ్మ జమానాలో వికసించిన తోట ఇది. బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్యలో ఆరేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ పూదోట పదిలంగానే ఉన్నది. 2014లో ఎంటర్ ది మోదీ సినిమా విడుదలతో పాతకాలపు పవర్ ఎలీట్‌కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఈ పరిణామాన్ని మావోజెడాంగ్ నాయకత్వంలో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవంతో ప్రొఫెసర్ సంజయ్ బారు పోల్చారు. ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్‌గా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారుకు ఢిల్లీ పవర్ ఎలీట్ మీద సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో ఆయన ఇటీవల ‘ఇండియాస్ పవర్ ఎలీట్’ అనే పుస్తకాన్ని రాశారు. ప్రొఫెసర్ సంజయ్ లెక్క ప్రకారం ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన ఇంగ్లిష్ బాబులెవరూ ప్రస్తుత ప్రధానమంత్రి కార్యాల యంలో లేరు. అందరూ ‘దేశీ’ బాబులే! వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వారి సొంత భాషల్లో మాట్లాడేవారు (ముఖ్యంగా హిందీ, గుజరాతీ), సరికొత్త సామాజిక వర్గాల నుంచి వచ్చినవాళ్లు ఇప్పుడు ఢిల్లీ పవర్ సర్కిల్స్‌లో చక్రం తిప్పుతున్నారట! కులీన అధికారిక సమూహం నుంచి తొలితరపు అగ్రవర్ణ మేధావులను తప్పించి శూద్ర వ్యవసాయ కుటుంబాల వారు ఆక్రమించడానికి డెబ్బయ్యేళ్లు పట్టిందన్నమాట! తాము కూలదోసిన పాత తరాన్ని ‘లుటియెన్స్ ఎలీట్’గా, ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’గా కొత్త ఎలీట్ వేళాకోళం చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం లక్ష్యం కేవలం ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే కాదు. ఆ పార్టీ చుట్టూ అల్లుకున్న సంస్కృతిని ధ్వంసించడం. అధికార పీఠాల్లో అది ఏర్పాటు చేసుకున్న ఎకోసిస్టమ్‌ను దగ్ధం చేయడం కూడా! నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని చాలావరకు సాధించింది కూడా. మారుమూల ప్రాంతాల వారికీ, మధ్యశ్రేణి సామాజిక వర్గాల వారికీ ఢిల్లీ అధికార సర్కిల్స్‌లో చోటు దొరకడం స్వాగతించదగ్గదే. రాజ్యాంగంలో చెప్పినట్టు ఇండియాతోబాటు భారత్‌కు కూడా అధికారంలో చోటు దొరుకుతున్నది. ఇదీ ఆహ్వానించదగినదే. నెహ్రూ కాలంలో మొదలైన ‘మూడు వర్ణాల’ ముచ్చటకు ప్రాధాన్యం తగ్గుతున్నది. దానితోపాటు నెహ్రూ పోషించిన లౌకిక విలువలకూ, భిన్నవర్గాల సౌభ్రాతృత్వానికి కూడా ఆదరణ తగ్గుతున్నది. కొత్త ఎలీట్ వాచాలత కోటలు దాటుతున్నది. దేశదేశాల విమర్శలకు తావిస్తున్నది. దేశంలో అభద్రతాభావం జనిస్తున్నది. విద్వేషం జ్వలిస్తున్నది. రాజధానిలో ఠికానా వేసిన ఇండియన్ నేషనలిజాన్ని మారుమూల ప్రాంతాల్లోని భారత జాతీయతతో అనుసంధానం చేయడం వరకు మంచి పరిణామమే. ఈ సాంస్కృతిక విప్లవాన్ని ఇక్కడితో ఆపితే మేలు. ఇండియా, భారత్‌లను దాటి ‘హిందూస్థాన్’ దాకా ప్రస్థానాన్ని కొసాగించదలిస్తే మాత్రం చేటుకాలం దాపురించినట్టే. హిందీ, హిందూ సామ్రాజ్యవాదం తలకెక్కితే ఈ దేశం అంగీకరించదు. హిందీయేతర దేశీ భాషలు మాట్లాడేవారి సంఖ్య ఈ దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ. మైనారిటీ మతావలంబులు ఇరవై శాతానికంటే ఎక్కువే ఉన్నారు. మనం హిందువులుగా పిలుచుకునే దళితులు, గిరిజనులు, దిగువశ్రేణి శూద్రకులాల సంస్కృతి భిన్నమైనది. సవర్ణ హిందువులు దేవుడికి శాకాహార నైవేద్యం పెడితే, దిగువ కులాల ప్రజలు అమ్మవారికి మాంసాహార బోనం పెడతారు. నెహ్రూవియన్ పాలకులకు ఈ భిన్నత్వాన్ని గౌరవించడం తెలుసు. మోదిత్వవాదులు ఎంతమేరకు గౌరవించగలరు? సాంస్కృతిక విప్లవ ప్రస్థానాన్ని ఆపివేసి, ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టవలసిన సమయం ఆసన్నమైనదని ఆర్థికవేత్తలు ఉద్ఘోషిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా కష్టాల బాటలు నష్టాల పేటలు దాటి వచ్చినప్పటికీ చరిత్ర మనకొక అమూల్య అవకాశాన్ని ఎదురుగా నిలబెట్టిందని వారు చెబుతున్నారు. వివిధ అంతర్గత నిర్ణయాల కారణంగా ఇరవయ్యేళ్ల తర్వాత తొలిసారిగా చైనా మందగమనం ప్రారంభమైంది. ఈ పరిణామం మనకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన దారులను ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం విజయవంతంగా పరిచింది. ఆయన అధికారం చేపట్టకముందు పదో స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఐదో స్థానానికి ఎగబాకింది. మోదీ ప్రకటించిన ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సవరించుకోవాలని రఘురామ్‌రాజన్ వంటి ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. 2035 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. ఏటా ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకుంటే ఇదీ సాధ్యమేనని ఆయన అభిప్రాయం. ఇప్పటికే డిజిటల్ డ్రైవ్‌తో దేశంలోని చిల్లర శ్రీమహాలక్ష్మిని ఆర్థిక వ్యవస్థతో మోదీ అనుసంధానం చేశారు. ఎకానమీలో పారదర్శకత పెరిగింది. వైషమ్యాలు, విద్వేషాల ఎజెండాను పక్కనపెట్టి, సాంస్కృతిక విప్లవానికి బదులు ఆర్థిక విప్లవంవైపు దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపితే రఘురామ్‌రాజన్ చెప్పిన లక్ష్యం అసాధ్యం కాబోదు. - వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని..
సాక్షి, కామారెడ్డి: ప్రేమికుడు తనకు దక్కడేమోనని భయంతో ఓ మైనర్ బాలికి ఇంట్లో ఉరేసుకున్ని ఆత్మహత్య చేసుకుంది. అశోక్ నగర్ కాలనీకి చెందని భరత్‌కు, ముశ్రీఫ్ బాగ్ కాలనీకి చెందిన మైనర్ అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇరు కుటుంబాలకు విషయం తెలిసి.. వారికి వయసు లేదని, మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని అప్పటివరకు దూరంగా ఉండాలని పెద్దలు నచ్చజెప్పారు. ఇదిలా ఉండగా శాంతిప్రియ అనే అమ్మాయి సోమవారం రోజున భరత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని, అతని దూరంగా ఉండాలని మైనర్ అమ్మాయికి వాట్సప్ ద్వారా బెదిరించింది. ఈ నేపథ్యంలోనే శాంతిప్రియ, భరత్ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా మైనర్‌కు పంపింది. దీంతో భరత్ తనకు దక్కడేమోనని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ ఆత్మహత్య చేసుకుంది. తమ అమ్మాయి చావుకు భరత్, శాంతి ప్రియలే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చదవండి: (ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే) -
ప్రతి గ్రామానికీ రక్షిత తాగునీరు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగు నీరు అందించాలన్నదే తమ మిషన్ ప్రధాన ఉద్దేశమని నేషనల్ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ భరత్‌లాల్ స్పష్టం చేశారు. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాలులో ‘గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పారిశుధ్యం’ అంశంపై సిబ్బందికి శనివారం వర్క్‌షాప్ జరిగింది. భరత్‌లాల్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 9 శాతం మంది ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా లేదని, 5 శాతం మంది నీటి కుళాయి కనెక్షన్లు పనిచేయడం లేదని, మరో 9 శాతం మంది తమకు నీరు సమృద్ధిగా అందడం లేదని తాము నిర్వహించిన సర్వేలో ప్రజలు చెప్పారన్నారు. ప్రారంభ సభకు అతిథిగా హాజరైన కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ..జల్‌జీవన్ మిషన్ ద్వారా అందరికీ నీరు అందేందుకు అంచనాలను సక్రమంగా రూపొందించాలన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలకు, గ్రామంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు. నేషనల్ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్ ప్రదీప్‌సింగ్, డెప్యూటీ డైరెక్టర్ ఏ మురళీధరన్, రాష్ట్ర నీటి పారుదల, పారిశుధ్య శాఖ చీఫ్ ఇంజనీరు ఆర్.బి.కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
భారత్‌కు లేఖ రాసిన తాలిబన్లు
-
కుప్పంలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, చిత్తూరు : కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కుప్పంలో టీడీపీ నేతలు పాదయాత్ర తలపెట్టడం సిగ్గుచేటని కుప్పం వైఎస్సార్ సీపీ ఇన్ఛార్జ్ భరత్ మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు అధికారంలో ఉన్న కాలంలో ఎందుకు హంద్రీనీవా కాల్వ పనులు పూర్తి చేయించలేక పోయారని ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీనీవా పనుల పూర్తికి కృషి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారు. కుప్పం ప్రజల పట్ల చంద్రబాబుది కపట ప్రేమగా పేర్కొన్నారు. ( 'ఆ గేదె బాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది' ) కుప్పంలో ఉద్రిక్త వాతావరణం హంద్రీనీవా జలాల సాధన పేరిట టీడీపీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం కుప్పంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాదయాత్రకు టీడీపీ నేతలు యత్నించగా రామకుప్పం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీ చేయటానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించటంతో కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మలక్‌పేట: ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సైదాబాద్ పూసలబస్తీకి చెందిన టి.లక్ష్మీనారాయణ కుమారుడు టీ. భరత్(19)డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజ్‌లో ఎంపీసీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉండటంతో మనస్థాపానికి గురైన అతడు వారం రోజులుగా డిప్రెషన్లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 8.15 గంటలకు భరత్ తల్లి కవిత బయటికి వెళ్లింది. భరత్ రాత్రి భోజనంచేసి గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకున్నాడు. బయటి వెళ్లిన కవిత ఇంటికి వచ్చేసరికి భరత్ వేలాడుతూ కన్పించాడు. స్థానికులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్ విజయం సాధించిన రోజు
-
సల్మాన్ సినిమాలో ‘స్పైడర్ విలన్’
సాక్షి, ముంబై : సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న రాధే సినిమాలో తమిళ నటుడు భరత్ విలన్‌గా నటించనున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నటుడు భరత్ సల్మాన్, ప్రభుదేవాతో విడివిడిగా దిగిన ఫోటోలను శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భరత్ తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే దర్శకుడు ప్రభుదేవాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. భరత్‌కు బాలీవుడ్లో ఇది రెండో సినిమా. 2013లో ఆయన జాక్‌పాట్ అనే హిందీ సినిమాలో నటించారు. భరత్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమాలో మెయిన్ విలన్ సూర్యకు తమ్ముడిగా కీలక పాత్ర పోషించాడు. సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్లో ప్రస్తుతం దబాంగ్ 3 తెరకెక్కుతోంది. డిసెంబరు 20న విడుదల అవుతున్న ఈ సినిమాలో ఈగ విలన్ కిచ్చ సుదీప్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం సల్మాన్ ‘రాధే’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా 2020 రంజాన్‌కు విడుదల కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ రంజాన్‌కు సినిమా విడుదల చేసే ఆనవాయితీ ఉన్న సల్మాన్ 2019 రంజాన్‌కి ప్రేక్షకులకి నిరాశపరిచాడు. మొదట్లో ఇన్షా అల్లా పేరుతో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ హీరోయిన్గా సినిమా అనౌన్స్ చేశారు కానీ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. దాంతో దబాంగ్ 3 సినిమాను ఆఘమేఘాల మీద పట్టాలెక్కించి, శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఆ చిత్రానికీ ప్రభుదేవానే దర్శకుడు. ఈద్‌కి రాబోయే రాధే సినిమాలో దిశాపటాని, జాకీష్రాఫ్, రణదీప్ హుడా కీలక పాత్రధారులు. కాగా, సల్మాన్ ఖాన్ తన వరుస సినిమాలలో దక్షిణాది నటులకు అవకాశాలివ్వడం వెనుక మార్కెట్ స్ట్రాటజీ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖాన్ త్రయంలోని మిగతా ఇద్దరితో పోల్చి చూస్తే సల్మాన్‌కు హైదరాబాద్ మినహా సౌత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా కలెక్షన్లు తక్కువ. వీటిని అధిగమించడానికే సౌత్‌లో పేరున్న నటులను తీసుకుంటున్నారని బి టౌన్ టాక్. -
పవన్ కల్యాణ్ కాదు.. ప్యాకేజ్ కల్యాణ్
-
రూ 200 కోట్ల క్లబ్లో భారత్
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారత్ మూవీ ఈనెల 5న విడుదలై బాక్సాఫీస్ వసూళ్లలో దుమ్మురేపుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన భారత్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణనూ చూరగొని సంతృప్తికరమైన వసూళ్లను సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డబుల్ సెంచరీ సాధించిందని, రూ 200 కోట్ల వసూళ్లను అధిగమించిందని సినీ విమర్శకులు, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీ్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూవీ వసూళ్లు కొంచెం నెమ్మదించినా ఉత్తరాదిలో భారీ కలెక్షన్స్ నమోదవుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. కాగా, మంగళవారం నాటికి భారత్ మూవీ దేశీయంగా రూ 201.86 కోట్లు రాబట్టిందని చెప్పారు. ఈ సినిమాలో సల్మాన్, కత్రినా జోడీతో పాటు టబూ, దిశాపటానీ, జాకీ ష్రాఫ్, నోరా ఫతేహి తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
భారత్ వసూళ్ల వర్షం
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారత్ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈద్ రోజు విడుదలైన ఈ మూవీ కేవలం నాలుగురోజుల్లోనే రూ 122.22 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. భారత్ తొలిరోజు రూ 42.30 కోట్లు రాబట్టి ఈద్ రోజు విడుదలైన సల్మాన్ మూవీల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన మూవీగా నమోదైంది. భారత్ శనివారం రూ 26.70 కోట్లు రాబట్టింది. భారత్ బాక్సాఫీస్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తోందని, సింగిల్ స్క్రీన్స్‌లో దుమ్మురేపుతున్న మూవీ మల్టీప్లెక్స్‌లోనూ సత్తాచాటుతోందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. భారత్ బాక్సాఫీస్ బిజినెస్ వివరాలు చూస్తే..బుధవారం రూ 42.30 కోట్లు వసూలు చేసిన మూవీ గురువారం రూ 31 కోట్లు, శుక్రవారం రూ 22.20 కోట్లు, శనివారం రూ 26.70 కోట్లు వసూలు చేసి మొత్తం భారత్‌లో రూ 122.20 కోట్లు రాబట్టినట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక భారత్ రూ 100 కోట్ల క్లబ్లో చేరిన సల్మాన్ ఖాన్ మూవీల్లో 14వ చిత్రంగా నిలవడం గమనార్హం. -
సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలిగానే కాకుండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో గ్రూప్‌కు చెందిన బిపాజిటివ్ మేగజైన్ వ్యవహరాలను ఉపాసన పర్యవేక్షిస్తున్నారు. పాఠకులను ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి హెల్త్ సీక్రెట్స్, డైట్ ప్లాన్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విశేషాలను అభిమానులకు తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు ఉపాసన. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం భారత్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న సల్మాన్ మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఉపాసనకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు. ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోతో పాటు ‘భాయ్ అంటే ఇది. మీ సీక్రెట్స్ మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. సల్మాన్ భాయ్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు ఉపాసన. It’s Bhai all the way. Thank you @BeingSalmanKhan for sharing ur secrets. Explore a new side of #SalmanBhai coming soon. @Apollo_LStudio #bpositive #salmankhan #Bharat 🙏🏼 pic.twitter.com/CDpY8oyeV7 — Upasana Konidela (@upasanakonidela) 7 June 2019 -
మేకప్‌కే రెండున్నర గంటలు
సాధారణంగా సినిమా నిడివి రెండు నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుంది. కానీ సినిమాలో ఒక్కో సీన్లో కనిపించే గెటప్ కోసం సుమారు రెండు గంటలు మేకప్ రూమ్‌లో గడిపారట సల్మాన్. తన తాజా చిత్రం ‘భారత్’లో 18 ఏళ్ల వయసు నుంచి 71 ఏళ్ల వృద్ధుడిగా విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారాయన. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్, కత్రీనా కైఫ్, దిశా పాట్నీ నటించిన చిత్రం ‘భారత్’. ఈ సినిమాలో సల్మాన్ గెటప్స్ గురించి అలీ అబ్బాస్ జాఫర్ మాట్లాడుతూ– ‘‘ 70 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం యూకే కంపెనీ వాళ్లు వర్క్ చేశారు. ఈ పాత్రకు ఏ లుక్ సూట్ అవుతుందా? అని చాలా ట్రై చేశాం. 20 రకాలు గడ్డాలు, మీసాలు చూశాం. ఫైనల్‌గా ఇప్పుడు పోస్టర్స్‌లో చూస్తున్న లుక్ ఓకే అయింది. ప్రోస్థటిక్ మేకప్ కోసం రెండున్నర గంటలు సమయం తీసుకునేవారు. స్క్రిప్ట్‌లో ఈ లుక్స్ అవసరాన్ని సల్మాన్ అర్థం చేసుకొని చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘భారత్’ జూన్ 5న విడుదలవుతోంది. -
ఆకట్టుకుంటోన్న ‘భారత్’ ట్రైలర్
దేశంతో పాటే ఎదిగిన మనిషి కథను తెరపై ఆవిష్కరిస్తూ.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం ‘భారత్’. పోస్టర్స్‌తోనే ఓ రేంజ్లో హైప్ క్రియేట్చేసిన భారత్.. బాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తోన్న చిత్రంగా బజ్ క్రియేట్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, భిన్న వయస్కుడిగా సల్మాన్ నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. దేశానికి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో.. అప్పుడే నా కథ మొదలైంది అంటూ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సర్కస్‌లో ఫీట్లు చేసే పాత్రలో, కత్రినా కైఫ్‌తో ప్రేమ సన్నివేశాల్లో, కార్మికుడిగా, నావీ ఆఫీసర్‌గా ఇలా ప్రతీ పాత్రలో సల్మాన్ యాక్టింగ్ అదిరిపోయేలా ఉంది. ప్రతి నవ్వు వెనకాల తెలియని బాధ ఉంటుందని సల్మాన్ చెప్పడంతో.. ట్రైలర్లో కనిపించనిది ఇంకా ఏదో ఉందని అర్థమవుతోంది. మొత్తానికి భారత్ చిత్రం సల్మాన్ అభిమానులకు ఈ రంజాన్(జూన్ 5)కు నిజమైన పండుగను తెచ్చేట్టు కనిపిస్తోంది. ‘Journey of a man and a nation together’#BharatTrailer OUT NOW - https://t.co/Sp7o8g4cjg @Bharat_TheFilm @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif #Tabu @bindasbhidu @DishPatani @WhoSunilGrover @nikhilnamit @reellifeprodn @SKFilmsOfficial @TSeries — Salman Khan (@BeingSalmanKhan) 22 April 2019 -
అప్పుడే ఎక్కువ సినిమాలు వస్తాయి
‘‘కాన్సెప్ట్ చిత్రాలు తీసే ‘మధుర’ శ్రీధర్‌గారికి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల చిత్రాలు బాగా ఆడితే మరిన్ని వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే శ్రీధర్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా భరత్ ముఖ్య పాత్రలో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అన్నది ఉపశీర్షిక. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్. రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 17న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను త్రివికమ్ర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జల్సా’ టైమ్‌లో శిరీష్‌ను చిన్నకుర్రాడిగా చూశాను. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మా చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా మాట్లాడతాను. శ్రీధర్, సురేశ్‌బాబు, యష్గార్లకు థ్యాంక్స్. నన్ను బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు సంజీవ్‌గారికి, మంచి మ్యూజిక్ అందించిన జుడో సాండీకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు నిర్మించే నేను ఓ ఫన్ మూవీ తీయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్, భరత్ ఫెంటాస్టిక్‌గా నటించారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్‌గారే. ఆయన ఎప్పటికీ నా హీరోగానే ఉంటారు. ఈ జర్నీలో ముందు నుంచి నాతో భాగమైన ‘మధుర’ శ్రీధర్‌గారికి థాంక్స్’’ అన్నారు సంజీవ్ రెడ్డి. -
కొవ్వురులో మార్వాని భరత్, తానేటి వనిత ప్రచారం
-
వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా భరత్‌రామ్ నానినేషన్
-
బాలయ్య చిన్నల్లుడికి బాబు ఝలక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాలయ్య చిన్నల్లుడికి చంద్రబాబు ఝలక్ ఇచ్చాడు. బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు మంగళగిరి టికెట్ కేటాయించినా చిన్నల్లుడు శ్రీ భరత్ మాత్రం తన టికెట్ తెచ్చుకోలేకపోయాడు. ఆయన ఆశిస్తున్న విశాఖ లోక్‌సభ టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు శనివారం తేల్చి చెప్పడంతో భరత్ అమరావతి నుంచి విశాఖకు తిరుగుముఖం పట్టారు. దీంతో ఆయన అభిమానులు విశాఖలో ఆందోళన చేపట్టారు. చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయత్నిస్తామని, రాని పక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తామమని అంటున్నారు. విశాఖ లోక్‌సభ సీటుకు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీను పేరును తెరపైకి తెచ్చి భరత్‌కు మొండిచేయి చూపించారు. మామ బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులతో ఒత్తిడి చేయించినా... చివరాఖరుకు లోకేష్ మంత్రాంగమే ఫలించి తనను పక్కనపెట్టేశారని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్ మాత్రం టికెట్‌పై ఇంకా ఆశలతోనే ఉన్నట్లున్నారు. ‘ఏమో, ఇంకా నాకే రావొచ్చని అనుకుంటున్నా’నని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నాలుగు పార్టీలు.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్ నేత. 2009 –2014 మధ్యకాలంలో ఆయన నాలుగు పార్టీలు మారారు. 2009 వరకూ తెదేపాలో ఉన్న కొత్తపల్లి మంత్రిగాను, ఎంపీగాను, కొన్నాళ్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటుతో 2009లో ఆ పార్టీ తరఫున నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో పీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ పార్టీల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయనదే. ఎంపీ, ఎమ్మెల్యేగా భార్యాభర్తలు టి. అంజయ్య టి. మణెమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన టి.అంజయ్య, ఆయన సతీమణి మణెమ్మలు ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. టి.అంజయ్య 1962, 67, 72లో ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందగా, 1978లో అదే స్థానం నుంచి జనతా పార్టీ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఎంపీగా పనిచేస్తుండగా ఆయన చనిపోవడంతో 1987లో సికింద్రాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు మణెమ్మ పోటీచేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై ఆమె విజయం సాధించారు. 2008లో జరిగిన ముషిరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డిపై గెలిచారు. తన భర్తను ఓడించిన నాయినిని ఆమె ఓడించడం విశేషం. చిరంజీవికి 754 ఓట్లు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి స్థానంలో చిరంజీవికి 754 ఓట్లు వచ్చాయి. అదేంటి అక్కడి నుంచి ఆయన గెలుపొందితే అంత తక్కువ ఓట్లు రావడమేంటని అంటారా.. అయితే ఆయన పీఆర్పీ అధినేత చిరంజీవి కాదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పేరును పోలిన టి.చిరంజీవి అనే వ్యక్తిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అతనికి 754 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి పి.కరుణాకర రెడ్డికి పేరున్న వ్యక్తిని పోటీలో నిలబెట్టగా ఆయనకు 197 ఓట్లు పోలయ్యాయి. ఓటర్లను తికమకపెట్టేందుకు ఇరు పార్టీలు అదే పేరున్న వ్యక్తుల్ని బరిలో దింపడంతో వారికి కూడా ఓట్లు పడ్డాయి. -
బాబుకు బాలయ్య వార్నింగ్.. మారిన సమీకరణాలు!
సాక్షి, అమరావతి: టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏకంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన చిన్నల్లుడు భరత్‌పాటు కదిరి బాబూరావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని బాలకృష్ణ పట్టబుడుతున్నారు. వారికి టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తాజాగా ఆయన బావ చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాలకృష్ణ వార్నింగ్‌తో చంద్రబాబు టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసినట్టు సమాచారం. విశాఖపట్నం ఎంపీగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు విశాఖ, రాజమండ్రిలో ఎదో ఒక సీటు ఇచ్చే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళకు ఒకేచోట సీట్లు ఇవ్వడం బాగోదని భావించిన చంద్రబాబు ఈ మేరకు మార్పులు చేసినట్టు సమాచారం. భరత్ కోసమే లోకేశ్‌ను మంగళగిరి నియోజకవర్గానికి మార్చినట్టు తెలుస్తోంది. మొదట లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక, బాలకృష్ణ అల్టిమేటంతో కనిగిరి నుండి కదిరి బాబురావుకు మరోసారి సీటు కేటాయించినట్టు సమాచారం. బాలకృష్ణ కోసమే మంత్రి శిద్ధా రాఘవరావు సీటుకు చంద్రబాబు ఎసరు పెట్టారు. అంతేకాకుండా కదిరి సీటు ఇస్తానని ఉగ్ర నరసింహరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ.. మారిన సమీకరణాలతో ఆయనను దర్శికి మార్చాలని నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో జరిగిన ఈ మార్పులకు బాలకృష్ణ కోపమే కారణమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
100 డేస్... 5 లుక్స్
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఓ జంట. అంతలోనే భర్తకు ఆర్మీ నుంచి పిలుపొచ్చింది. దేశ సేవ కోసం వెంటనే సరిహద్దు దిశకు ప్రయాణం మొదలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఎలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు? అనే దృశ్యాలను వెండితెరపై చూడాలంటే ‘భారత్’ సినిమా చూడాల్సిందే. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, టబు కీలక పాత్రలు చేస్తున్నారు. శనివారంతో ఈ సినిమా షూటింగ్ వంద రోజులకు చేరుకుంది. ఇంతటితో ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. చివరిగా ముంబైలో సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మాల్తా, అబుదాబి, లూధియానా, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. 1947 నుంచి 2000 కాలపరిణామ నేపథ్యంలో ఈ సినిమా స్రీన్‌ప్లే ఉంటుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. -
గిరిజన యువతి కథ
‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, నమిత, ఇనియా, ఊర్వశి, షకీలా ప్రధాన తారాగణంగా వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొట్టు’. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఎస్.ఎస్ సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి. కుమార్ బాబు ‘బొట్టు’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘బొట్టు అనే పేరు గల ఓ గిరిజన యువతి కథే ఈ సినిమా. ‘కాంచన, గంగ’ చిత్రాల తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వస్తోన్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. కథాకథనాలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ ఇబ్బందుల వల్ల చాలా రోజులుగా సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు రివైజింగ్ కమిటీ ద్వారా విడుదలకు సర్టిఫికెట్ పొందాం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్. -
పది కోట్లు నేలపాలు!
సినిమాల్లో భారీ సెట్లను రూపొందించడం మామూలే. ఎక్కువ సందర్భాల్లో ఆ సెట్లను అలా ఉంచేసి కొద్దిమార్పులతో మరో సినిమాకు వినియోగిస్తుంటారు. కానీ సల్మాన్ ఖాన్ ‘భారత్’ టీమ్ మాత్రం 10 కోట్ల వ్యయంతో రూపొందించిన సెట్‌ను ధ్వంసం చేయాలనుకుంటోందట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ నటిస్తున్న చిత్రం ‘భారత్’. ఈ సినిమా కోసం పది కోట్ల వ్యయంతో ఓ సెట్‌ను నిర్మించారు. కథానుసారంగా క్లైమాక్స్‌లో ఈ సెట్‌ను ధ్వంసం చేయాల్సి రావడంతో సెట్‌ను కూల్చేయడానికి సిద్ధమయ్యారు. ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమాకూ ఇలానే జరిగింది. ఆ సినిమా కోసం తయారు చేసిన భారీ ఓడను సినిమాలో భాగంగా నిజంగానే ధ్వంసం చేశారు. ఇప్పుడు ‘భారత్’ టీమ్ 10 కోట్లను నేలపాలు చేయబోతోంది. ఇంకో వారం రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి కానుందట. ఈద్ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి ఈ చిత్రం రానుంది. -
అనుష్కా.. నా గురించి మీ ఆయనకు చెప్పు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరో బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మను రికమెండ్ చేయమని అడిగారు. సినిమా చాన్స్ కోసం అయితే కాదండోయ్. క్రికెట్ నేర్చుకోవడం గురించి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారత్’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు కత్రినా కైఫ్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక ఓ రోజు రాత్రి టీమ్‌తో కలిసి కత్రినా క్రికెట్ ఆడారు. ‘‘క్రికెట్ ప్రపంచ కప్ దగ్గరపడుతోంది. నా గురించి టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాస్త చెప్పు. (అనుష్కా శర్మ భర్త విరాట్ కోహ్లీ అన్న విషయం తెలిసిందే). నేను ఆల్ రౌండర్ అవ్వాలనుకుంటున్నాను. మన టైమ్ వస్తుంది’’ అని సరదాగా తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు కత్రినా. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 26న ‘భారత్’ చిత్రం టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు. -
బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచిన కత్రినా కైఫ్
-
కత్రినాకు ఐపీఎల్ ఆఫర్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భారత్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న ఈ చిత్రంలో కత్రినా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్లో కాస్త విరామం దొరికిన సమయంలో చిత్రబృందం క్రికెట్ ఆడారు. అందులో కత్రినా తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. షూటింగ్ పూర్తైన తరువాత సరదాగా క్రికెట్ ఆడినట్లు.. వరల్డ్ కప్ దగ్గరపడుతుండటంతో భారత సారథికి తన గురించి కొంచెం చెప్పమని అనుష్క శర్మను కోరారు. మొత్తానికి తానొక బ్యాడ్ ఆల్‌రౌండర్‌ను కాదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసిన ప్రీతిజింటా.. ఐపీఎల్‌కు కత్రినాను తన టీమ్‌లోకి తీసుకుంటామని సరదాగా కామెంట్ చేశారు. దీనికి బదులుగా.. దయచేసి నన్ను తీసుకోండి.. నన్ను ఆడనివ్వండి అంటూ కత్రినా ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఈ వీడియో బ్యాగ్రౌండ్లో గల్లీ భాయ్ సాంగ్ ప్లే అవుతుండగా.. కత్రినా రెచ్చిపోయి బౌండరీల మీద బౌండరీలు కొట్టేశారు. మొత్తానికి కత్రినా భారత్, గల్లీ భాయ్, వరల్డ్ కప్‌కు తన స్టైల్లో ప్రమోషన్ కల్పిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీతోనే భావితరాలకు బంగారు బాట
తూర్పుగోదావరి, దానవాయిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలోని భావితరాలకు బంగారు బాట సాధ్యమని పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రివర్ బే హోటల్లో ‘వుయ్ సపోర్టు జగన్– వుయ్ సపోర్ట్ భరత్’ అనే నినాదంతో అంగ్లో ఇండియన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా సంక్షేమం కుంటుపడిందని విమర్శించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో గోదావరి జలాల కాలుష్యం, పర్యాటక రంగ అభివృద్ధి, స్టేడియం నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు ఆంగ్లో ఇండియన్స్ వారి సమస్యలను భరత్‌కు వివరించారు. వైఎస్సార్ సీపీకి తమ మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆంగ్లో ఇండియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఫోర్.. సిక్స్!
ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అన్న తేడా లేకుండా ఫీల్డర్స్‌ను పరిగెత్తించారు సల్మాన్‌ఖాన్. అవును.. సల్మాన్ క్రికెట్ ఆడారు. కానీ స్టేడియంలో కాదు. ‘భారత్’ సినిమా షూటింగ్ లొకేషన్ ప్లేస్‌లో. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘భారత్’. ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ఇందులో కత్రినా కైఫ్ కథానాయిక. దిశాపాట్నీ, టబు, జాకీ ష్రాఫ్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. షూట్ కంప్లీట్ అయిన తర్వాత సల్మాన్ అండ్ టీమ్ సరదాగా క్రికెట్ ఆడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ‘భారత్’ విషయానికొస్తే.. ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది రంజాన్‌కు ‘భారత్’ సినిమా విడుదల కానుంది. -
సల్మాన్ 5.. కత్రినా 4!
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ చీర కట్టుకుని ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈ లుక్ ఆమె నటిస్తున్న ‘భారత్’ సినిమాలోనిది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో దిశా పాట్నీ, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు కత్రినా. అందులో ఇక్కడున్న లుక్ ఒకటి. అలాగే సల్మాన్ కూడా ఐదు డిఫరెంట్ లుక్స్‌లో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నారు. ఇక కత్రినా ఒక కథానాయికగా నటించిన ‘జీరో’ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. షారుక్‌ఖాన్ ఇందులో కథానాయకుడు. -
గాయపడ్డారు
అభిమానులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం కోసం హీరోలే ఎక్కువశాతం యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేస్తున్నారు. డూప్‌లకు స్కోప్ ఇవ్వనంటున్నారు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు గాయాలపాలు అవుతూనే ఉంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా సెట్లో గాయపడ్డారట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘భారత్’. ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతోంది. ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంటే సల్మాన్ గాయపడ్డారట. దాంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం ముంబై చేరుకున్నారు సల్మాన్. ఈ గాయం వివరాలేవీ చిత్రబృందం బయటకు చెప్పలేదు. షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి. -
మ్యూజిక్ టీచర్!
పైనున్న ఫొటో చూశారుగా! కథానాయిక కత్రినా కైఫ్ ఎంత ఏకాగ్రతతో సంగీత సాధన చేస్తున్నారో! ఇది చూసి ఆమె ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారా? అంటే అదేం కాదు. ఇదంతా తాజా ‘భారత్’ చిత్రం కోసం. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు, దిశా పాట్నీ కీలక పాత్రలు చేస్తున్న చిత్రమిది. కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికిది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతోందట. ‘‘భారత్’ ప్రిపరేషన్లో భాగంగా ఇలా సంగీత సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కత్రినా. దీంతో ఈ సినిమాలో కత్రినా సింగర్‌గా కనిపిస్తారని కొందరు అంటుంటే.. లేదు లేదు.. మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తారని ఇంకొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ? అనేది వచ్చే ఏడాది రంజాన్‌కు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే ‘భారత్’ సినిమా రిలీజ్ అవుతుంది. -
సల్మాన్‌కు అతిథిగా..
‘నా సినిమాకి నువ్వు.. నీ సినిమాకి నేను’ అతిథులం అన్నట్లు ఉంది సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్‌ల వైఖరి. గతేడాది వరుణ్ ధావన్ నటించిన ‘జుద్వా 2’ సినిమాలో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 1997లో సల్మాన్‌ఖాన్ హీరోగా చేసిన ‘జుద్వా’ సినిమాకు ‘జుద్వా 2’ సీక్వెల్ అని తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి వరుణ్ ధావన్ అబుదాబీ వెళ్లారని బాలీవుడ్ టాక్. అంటే వరుణ్, సల్మాన్‌కు బదులు తీర్చుతున్నారన్నమాట. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్, టబు, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ రీమేక్. ఈ సినిమా మూడో షెడ్యూల్ అబుదాబీలో జరుగుతోంది. మరి.. వరుణ్ ధావన్ అతిథి పాత్రలో కనిపించేది పాటలోనా? లేక సీన్‌లోనా? అన్న విషయాన్ని మాత్రం టీమ్ బయట పెట్టడం లేదు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్స్ ఢిల్లీ, పంజాబ్‌లో జరగనున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
వెయ్యి సార్లు ఫోన్ చేసింది!
పార్టీకి వెళ్లినా, ఈవెంట్‌కి వెళ్లినా, సినిమా ప్రమోషన్‌కి పోయినా సల్మాన్ ఖాన్‌ను మాత్రం ఓ ప్రశ్న వెంటాడుతూనే ఉంది. మీ ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంకా చోప్రా ఎందుకు తప్పుకున్నారు? అని. నిన్న మొన్నటి వరకు పెళ్లి కోసం ప్రియాంకా చోప్రా తప్పుకున్నారని సల్మాన్ కూడా మాట దాట వేశారు. రీసెంట్గా గోవాలో జరిగిన ‘బిగ్ బాస్ 12’ ఈవెంట్ లాంచ్‌లో మాత్రం అసలు విషయం చెప్పేశారు. ‘‘నిజానికి ‘భారత్’ సినిమాకు హీరోయిన్గా నిర్మాత అతుల్ అగ్నిహోత్రి ముందుగా కత్రినా కైఫ్‌ను తీసుకుందాం అన్నారు. కానీ ఆ టైమ్‌లోనే ప్రియాంకా చోప్రా నా సిస్టర్ ఆర్పితా ఖాన్‌కు సుమారు వెయ్యిసార్లు ఫోన్ చేసింది. ‘భారత్’ ప్రాజెక్ట్‌పై ఇంట్రస్ట్‌గా ఉన్నాను. సల్మాన్ ఖాన్‌తో వర్క్ చేయాలనుకుంటానని చెప్పింది. అంతేకాదు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కి కూడా కాల్ చేసింది. ప్రియాంకను తీసుకోవడానికి అది కూడా ఓ కారణమే. సడన్‌గా ఓ రోజు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పింది. పెళ్లి కోసమే అయితే షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోమని చెప్పాను. కానీ ప్రాజెక్ట్‌లో నేను కొనసాగను అని ప్రియాంకా తేల్చి చెప్పింది. ఎందుకలా చేసిందో అడగలేదు. ‘సరే నీ ఇష్టం.. ఆల్ ది బెస్ట్’ అని చెప్పాం. ఆమెకు బాలీవుడ్లో సినిమాలు చేయడం ఇష్టం లేదునుకుంటాను. ఇప్పుడు కత్రినా కైఫ్ మా ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ‘భారత్’ బాగానే సాగుతోంది’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్. అదండీ సంగతి. ఇందులో కత్రినా కైఫ్‌తో పాటు దిశా పాట్నీ కథానాయికలుగా నటిస్తున్నారు. రీసెంట్గా మాల్తా షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక ‘ద స్కై ఈజ్ పింక్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త విరామం దొరకడంతో ప్రస్తుతం కాబోయే భర్త నిక్ జోనాస్‌తో హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. -
పాకెట్ మనీ కట్
కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు సాదాసీదా జీవితం గడపాల్సి వచ్చింది. లక్షల్లో పాకెట్ మనీ తీసుకున్న ఆ కుర్రాడికి చివరికి 5 వేలే అని ఇంట్లో ఫిక్స్ చేస్తారు. అలా ఎందుకు? అంటే దానికో పెద్ద కారణం ఉంది. అదేంటో థియేటర్లో తెలుసుకుంటేనే కదా థ్రిల్. అల్లు శిరిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ). రుక్సానా కథానాయిక. ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి తెలుగు పరిశ్రమకు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగు తోంది. ఇందులో కోటీశ్వరుడి తండ్రికి కొడుకుగా అవినాష్ పాత్రలో అల్లు శిరీష్ నటిస్తున్నారని సమాచారం. అలాగే కామెడీ యాక్టర్ భరత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
ఓ లుక్ వేయండి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో మాస్ టీజర్ అందిస్తే, వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్ చూపించారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో, రాజుగాడికి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్ పెట్టారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ అంటూ బలమైన డైలాగ్ వినిపిస్తే, ‘మణికర్ణిక’గా కంగనా వీరనారి ప్రతాపం చూపించారు. తమిళంలో జ్యోతిక ‘మహిళలూ వినండి... మీకు కొన్ని సూచనలు ఉన్నాయి’ అన్నారు. ఏది ఏమైనా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్‌కు ఐ–ఫీస్ట్. ఓ లుక్ వేద్దాం. ఎంటబడ్డానా నరికేస్తా... ‘ఆది, సాంబ’ వంటి ఫ్యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్. మళ్లీ ఆ జానర్‌ని చాలా కాలంగా పూర్తి స్థాయిలో టచ్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో మళ్లీ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సీమలో వీర రాఘవ రెడ్డి వీర విహారం ఎలా ఉంటుందో టీజర్ ద్వారా చిన్న శాంపిల్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ మూడు వాక్యాల్లో హీరో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని జగపతిబాబు వాయిస్ ద్వారా మనకు పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పట్టుకున్న కత్తికి తన కలంతో పదును పెట్టారు త్రివిక్రమ్. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా ఓబా..’ అంటూ సీమ యాసలో ఎన్టీఆర్ పలికిన సంభాషణలు టీజర్‌కి హైలైట్ అని చెప్పొచ్చు. జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కంచరపాలెం ప్రేమ ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లాంటివి ఏమీ రిలీజ్ కాకముందే న్యూయార్క్ ఇండియన్æ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అఫీషియల్ ఎంట్రీ అందుకొని అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఇండిపెండెంట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. మొత్తం నూతన నటీనటులతోనే దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కంచరపాలెం అనే ఊరిలోని ప్రజలనే పాత్రలుగా.. వాళ్లందరికీ నటనలో వర్క్‌షాప్ చేసి కంచరపాలెం ఊళ్లోనే మొత్తం చిత్రాన్ని షూటింగ్ చేశారు దర్శకుడు వెంకటేశ్. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఒక ఊరిలోనే నాలుగు భిన్న వయసుల వారి మధ్య ప్రేమకథగా తెరకెక్కిందీ చిత్రం. మా సూచనలు వినండి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొన్ని సూచనలు ఇస్తున్నారు జ్యోతిక. ఇదంతా తన లేటెస్ట్ సినిమా ‘కాట్రిన్ మొళి’ ఫస్ట్ లుక్‌లో భాగమే. రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘కాట్రిన్ మొళి’. హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కు రీమేక్ ఇది. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బుధవారం హీరో సూర్య రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో ‘‘మనసుకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఆకలేస్తే భర్త కంటే ముందే తినొచ్చు. భర్త ఒక చెంప మీద కొట్టాడని మరో చెంప చూపించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినది మనం చేయొచ్చు. కావాలనుకుంటే బొద్దుగా ఉండొచ్చు. ఇంట్లో రోజువారి పనులను షేర్ చేసుకొమ్మని భర్తను అడగొచ్చు. సంపాదించొచ్చు, ఇంట్లో కూడా ఇవ్వాలి, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనసులో కాదు.. అనుకున్నదాన్ని బయటకు అవును అని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. స్త్రీ, పురుషుడు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అంటూ పది రూల్స్ ఉన్న బోర్డ్‌ని పట్టుకున్న జ్యోతిక ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందం. ఇందులో మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని జి. ధనుంజయ్ నిర్మించారు. నాకు రెండూ ఉన్నాయి సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఖాన్ – అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘భారత్’. దేశభక్తి చిత్రంగా వస్తున్న ఈ చిత్రం డైలాగ్ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్ని బంధాలు రక్తం వల్ల ఏర్పడతాయి.. మరికొన్ని మట్టి వల్ల ఏర్పడతాయి. నా దగ్గర అవి రెండూ ఉన్నాయి’’ అంటూ సల్మాన్ ఖాన్ డైలాగ్స్ పలికారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సర్కస్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. పర్సనల్ కారణాలతో ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నుంచి హీరోయిన్గా తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్ ఆ స్థానంలోకి వచ్చారు. మరో బ్యూటీ దిశా పాట్నీ కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్టాలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది. వీరనారి ఝాన్సీ రణభూమిలో మణికర్ణిక ఎంత రౌద్రంగా, ఆవేశంగా ఉంటారో చిన్నప్పుడు ఎన్నో కథలు విన్నాం, చదువుకున్నాం. వెండి తెరపై చూపించదలిచారు దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్. ఝాన్సీ పోరాట పటిమ ఏ విధంగా ఉంటుందో మనకు సరిగ్గా అంచనా లేదు. ఆ ఆవేశాన్ని ఫస్ట్ లుక్ ద్వారా కొంచెంగా చూపించారు ‘మణికర్ణిక’ చిత్రబృందం. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భుజాన బిడ్డ, మొహంలో మొండి ధైర్యంతో యుద్ధ భూమిలో కత్తి పట్టుకున్న కంగనా రనౌత్ ఫొటోను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్లా రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాన్ని రచించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లే అందించారు. వచ్చే ఏడాది జనవరి 25 ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్, తమిళంలో ‘జయం’ రవి ‘అడంగమారు’ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశాయి. మరో ప్రపంచంలోకి... వరుణ్ తేజ్ ఆకాశానికి నిచ్చెన వేశారు. అంతరిక్ష వీధిలో తన విధి నిర్వహించడానికి ఎన్నో సాహసాలు చే శారట. మరి ఆ విశేషాలన్నీ చూడాలంటే డిసెంబర్ 21 వరకూ వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపిహెచ్’. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఏదో మిషన్‌లో నిమగ్నమై ఉన్న వరుణ్ తేజ్ లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ సెట్‌ని డిజైన్ చేశారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. దాని కోసం యూనిట్ అంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కీమీ’ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మీ అందరి కోసం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’’ అని వరుణ్ తేజ్ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. కెమెరా: జ్ఞానశేఖర్. -
అంత ఉత్సాహం ఎందుకో?
‘‘అదేంటో కానీ ఇరుగు పొరుగు విషయాలు తెలుసుకోకపోతే కొంతమందికి నిద్ర పట్టదు. ఏదీ లేకపోతే కనీసం ఒక కట్టుకథ అయినా అల్లేసి సంతృప్తి పడిపోతారు. ఎందుకో ఈ ఉత్సాహం?’’ అంటున్నారు ప్రియాంకా చోప్రా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌తో సింగపూర్‌లో టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్నారు ప్రియాంక. అక్కడ నిక్‌తో మీ రిలేషన్షిప్ ఏంటీ? అన్న ప్రశ్న ప్రియాంకకు ఎదువ్వడంతో.. ‘‘నా జీవితం ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీనా? మొత్తం అన్నీ చెప్పేయడానికి. అందులో ఓ పది శాతం పర్సనల్ లైఫ్ ఉంటుంది. నా కుటుంబం, నా రిలేషన్షిప్, ఫ్రెండ్స్‌కి సంబంధించిన కొన్ని విషయాలను నాలోనే దాచుకునే హక్కు నాకు ఉంది. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా గురించి రూమర్స్ వినిపించినప్పుడు కొన్నిసార్లు నవ్వుకుంటాను. కొన్నిసార్లు బాధను దాచుకుంటాను. అంతే కానీ నా వ్యక్తిగత విషయాల గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ఈ రోజు వచ్చే న్యూస్ రేపటికి పనికి రాకపోవచ్చు. అందుకే పనికి రాని న్యూస్‌ల గురించి పట్టించుకోను’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంక. ఈ సంగతి ఇలా ఉంచి సినిమాల విషయానికొస్తే... దాదాపు రెండేళ్ల తర్వాత హిందీలో ప్రియాంకా నటిస్తున్న ‘ది స్కై ఈజ్ పింక్’ షూటింగ్ బుధవారం మొదలైంది. సోనాలీ బోస్ దర్శకుడు. అప్సెట్ కాలేదు: రీసెంట్గా సల్మాన్ ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంకా తప్పుకున్న సంగతి తెలిసిందే. మీ సినిమా నుంచి ప్రియాంకా ఎందుకు తప్పుకున్నారు? అని సల్మాన్ ఖాన్‌ను అడిగితే.. ‘‘ఆమె ఒక బిగ్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేశారని తెలిసింది. అయితే తన వంతు షూటింగ్ మొదలయ్యే పది రోజుల ముందే ఈ నిర్ణయాన్ని చెప్పడం మంచిది అయింది. ప్రియాంకా నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం’’ అన్నారు సల్మాన్ ఖాన్. ప్రియాంక తప్పుకున్నందున అందరూ అనుకుంటున్నట్లు సల్మాన్ అప్సెట్ కాలేదని ఆమె తల్లి మధు చోప్రా పేర్కొన్నారు. -
మళ్లీ దొరికిపోయింది...
గత కొంతకాలంగా బాలీవుడ్లో హాట్ టాపిక్ అంటే ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్‌ల నిశ్చితార్ధం గురించే. ఇంతకు వీరికి ఎంగేజ్మెంట్ అయ్యిందా... లేదా అనే విషయం గురించి మాత్రం ఇంతవరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చే సంఘటన ఒకటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద చోటు చేసుకుంది. గతంలో ఒకసారి మీడియా వారి దృష్టిని తప్పించుకునే క్రమంలో ప్రియాంక, ఎంగేజ్మెంట్ రింగ్‌గా ప్రచారం పొందుతున్న ఉంగరాన్ని దాచే ప్రయత్నం చేసి, కెమరాకు దొరికిపోయింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరో సారి చోటు చేసుకుంది. ఈ నెల 6న(నేడు) జరగబోయే ‘ఫిక్కి’ కార్యక్రమంలో హాజరవ్వడం కోసం ప్రియాంక ఆదివారం రాజధానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు బయట మీడియా వారిని చూసిన ప్రియాంక, వెంటనే తన రింగ్ కానీ రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్‌ను మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో తిప్పేసుకుంది. కానీ ఏం లాభం.. ఈ సారి కూడా కెమరాకు దొరికిపోయింది. దాంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్‌లు వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకోసం ప్రియాంక సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు సమాచారం. కారణం ఏదైనా ప్రస్తుతం ప్రియాంక ‘భారత్’ చిత్రం నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవం. #priyankachopra arrives to delhi today ❤️😻 Guys did you see her hiding her ring😂 - #بريانكا_تشوبرا وصلت الى دلهي لحضور مؤتمر اليوم❤️😻 - ي جماعه ركزوا لما فسخت الخاتم و حطته بمخباتها بسرعه😂😂 مادري لين متى بتخش!! - - #queenofbollywood#queenofhearts#queenpri#Bollywood#priyanka#بوليوود A post shared by Perfection is ?! PeeCee👑 (@priyanka.news) on Aug 6, 2018 at 12:09am PDT -
ప్రియాంక మనసులో ఏముంది?
ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రియాంక ఇక ఇండియన్ సినిమాలు చేయదేమో అన్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు సల్మాన్ ఖాన్ భరత్ సినిమా కోసమే ప్రియాంక ఇండియాకు వచ్చారని వార్తలు వచ్చాయి. కానీ భరత్ సినిమా నుంచి ప్రియాంక తప్పుకున్నట్లు డైరెక్టర్ అలీ అబ్బాస్ ప్రకటించారు. అయితే ప్రియాంక మనసులో ఏముందో తెలియడం లేదు. తాజాగా మరో హాలీవుడ్ మూవీకి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరత్ సినిమాను రెమ్యునరేషన్ కారణంగానే వదులుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తన ప్రియుడు నిక్ జోనస్‌తో వివాహం కారణంగానే ప్రియాంక సినిమాను వదులుకున్నట్లు ‘భరత్’ మూవీ డైరెక్టర్ పేర్కొన్నారు. కౌబాయ్ నింజా వికింగ్ సినిమాలో ప్రధాన పాత్రను ప్రియాంక పోషించనున్నట్లు తెలుస్తోంది. జురాసిక్ వరల్డ్, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలతో ఫేమస్ అయిన క్రిస్ ప్రాట్‌తో ప్రియాంక జతకట్టనున్నట్లు తెలుస్తోంది. -
ప్రియాంక పోయి కైఫ్ వచ్చె!
‘భారత్’ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్‌తో వివాహం కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీ టౌన్ టాక్. ఈ సినిమా నుంచి ప్రియాంక వెళ్లిపోయినా చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఫీలవ్వలేదు. హ్యాపీగా అంగీకరించారు. కానీ ప్రియాంకా చోప్రా పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌ను కత్రినా కైఫ్ రీప్లేస్ చేయనున్నారట. ఆల్రెడీ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్లది హిట్ కాంబినేషన్ కాబట్టి కత్రినా కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచిస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో దిశా పాట్నీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దిశాది సల్మాన్ సిస్టర్ పాత్ర అని వినికిడి. సల్మాన్ ఫాదర్‌గా జాకీ ష్రాఫ్ నటిస్తున్నారని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
పెళ్లి కోసమేనా?
ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా బాలీవుడ్లో ‘భారత్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆమె అభిమానులు ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని తెలిసి రెట్టింపు ఆనందపడుతున్నారు. ప్రియాంక సినిమా చేయకపోతే హ్యాపీ ఫీలవ్వాల్సిన అవసరం ఏంటీ? అంటే.. ఓ స్పెషల్ రీజన్ ఉంది. ‘భారత్’ సినిమా డేట్స్‌ను క్యాన్సిల్ చేసిన ప్రియాంకా, పెళ్లికి డేట్స్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘భారత్’. ఈ సినిమా నుంచి సడన్‌గా ప్రియాంక తప్పుకున్నారు. ఈ విషయంపై దర్శకుడు జాఫర్ క్లారిటీ ఇస్తూ– ‘‘అవును..‘భారత్’ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించడం లేదు. ఈ నిర్ణయాన్ని ఆమె నిక్ ఆఫ్ టైమ్ (చివరి నిమిషం) లో చెప్పారు. హ్యాపీ లైఫ్‌ని ప్రియాంక గడపాలని ‘భారత్’ టీమ్ కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ పేరు వచ్చేట్లు ‘నిక్ ఆఫ్ టైమ్’ అని దర్శకుడు జాఫర్ ప్రస్తావించడంతో.. నిక్‌తో ప్రియాంక పెళ్లికి రెడీ అయిట్లు ఆయన హింటు ఇచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
జర్నీ స్టార్ట్
‘సుల్తాన్, టైగర్ జిందా హై’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘భారత్’. 2014లో వచ్చిన కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి ఇది రీమేక్. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ దిశా పాట్నీ ట్రాపెజ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. సల్మాన్, ప్రియాంక ఐదు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. సునీల్ గ్రోవర్, టబు కీలక పాత్రల్లో నటించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఆదివారం మొదలైంది. అంటే.. ‘భారత్’ సినిమాలో సల్మాన్ జర్నీ స్టార్ట్ అయ్యిందన్నమాట. ప్రస్తుతం సల్మాన్, దిశా పాట్నీ, సునీల్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఆగస్టులో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటార ని సమాచారం. సౌత్ కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సే యంగ్ ఓహ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది రంజాన్‌కు ‘భారత్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మామా అని పిలవకుమా!
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్‌లోకి ఎప్పుడో ఎంటరయ్యారు. సల్మాన్ ఇంకా పెళ్లి కబురు చెప్పలేదు కానీ ఆయన్ని చిన్నారులు అంకుల్ అని పిలుస్తుంటే తెగ ఫీలైపోతున్నారట. గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్స్‌లో సల్మాన్ ఫ్రెండ్స్ పిల్లలు అంకుల్ అని పిలిచారట. దీంతో సల్మాన్ చిన్నారులను పిలిచి ‘అలా పిలవద్దు’ అని ముద్దుగా చెప్పారట. కానీ పిడుగుల్లాంటి పిల్లలు పిలవద్దు అంటే ఆగుతారా? పైగా ఒక పని చేయవద్దు అంటే దాన్నే పనిగా పెట్టుకుంటారు పిల్లలు. సో.. అంకుల్ అని సరదాగా పిలుస్తూనే ఉన్నారట. ‘‘మీరు నన్ను అలా పిలిస్తే మీతో మీటింగ్స్ తగ్గిస్తా’’ అని సల్మాన్ చెప్పిన తర్వాత అంకుల్ అని పిలవడాన్ని తగ్గించారట పిల్లలు. సల్మాన్ భలే షరతు పెట్టారు కదా. ఇక సినిమాల విషయానికొస్తే... అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘భారత్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
1950.. ఏ ఫుట్‌బాల్ స్టోరీ..
హైదరాబాద్ నగరమంతా నిర్మానుష్యంగా మారింది. ప్రజలందరూ రేడియోల దగ్గర కూర్చున్నారు. మ్యాచ్ ఆరంభమైంది.. కామెంట్రీ ప్రారంభమైంది. సిటీజనుల్లో ఒకటే ఉత్కంఠ.. ఎటు చూసినా ‘భారత్ జీతేగా.. ఆస్ట్రేలియా హరేగా’ నినాదాల హోరు. ఇదంతా ఏదో క్రికెట్ మ్యాచ్ గురించి అనుకుంటే పొరపాటే. భారత ఫుట్‌బాల్ టీమ్ 1956లో మెల్బోర్న్లో జరిగినఒలింపిక్స్లో ఆస్ట్రేలియాతో తలబడినప్పటివిషయమిది. ఈ మ్యాచ్‌లో భారత్ 4–2తోఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఒలింపిక్స్లోనాలుగో స్థానంలో నిలిచింది. సాక్షి, సిటీబ్యూరో : ఇదంతా చదివితే నిజమేనా అనిపిస్తుంది కదూ! అవును అక్షరాల నిజమే... ఒకప్పుడు నగరం సాకర్ ఫీవర్‌లో ఉర్రూతలూగింది. 1950–70 వరకు సిటీలో ఫుట్‌బాల్‌కు మంచి ఆదరణ లభించింది. దీనికి కారణం.. భారత ఫుట్‌బాల్ టీమ్‌లో నగర ఆటగాళ్లు కీలక పాత్ర పోషించడం. స్వాతంత్య్రానంతరం ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఏర్పాటులో హైదరాబాద్ ప్లేయర్లు ముఖ్య భూమిక పోషించారు. ఆ రోజుల్లో భారత ఫుట్‌బాల్ టీమ్ మ్యాచ్ జరుగుతుందంటే... నగరంలో ఓ పండుగలా ఉండేది. మనం గెలిస్తే ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, శుభాకాంక్షలు తెలిపుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా... ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో సిటీ ఫుట్‌బాల్ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. మనమే టాప్... అప్పట్లో నగర ప్రజలు ఫుట్‌బాల్‌పై యమ క్రేజ్ చూపించారు. మన టీమ్ ఏ మ్యాచ్ ఆడినా రేడియోలకు అత్తుకుపోయేవారు. 1948 నుంచి 1960 వరకు ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌లో నగర ఆటగాళ్లు ఎంతోమంది పాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఏఎస్ హకీం, యూసుఫ్‌ఖాన్, నూర్ మహ్మద్, ఎస్కే అజీజుద్దీన్, అహ్మద్ హుస్సేన్, బల్రాం, మహ్మద్ జులుఫెఖారుద్దీన్, ఎస్ఏ లతీఫ్ ఉన్నారు. హైదరాబాదీ కోచ్ అబ్దుల్ రహీం నేతృత్వంలో 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో 11 మంది ఆటగాళ్లకు గాను 8మంది మనోళ్లే. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్ మొదలు 1964లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ వరకు కూడా ఇండియన్ టీమ్‌లో నలుగురు హైదరాబాదీలు ఉన్నారు. దారుషిఫా... ఘన చరిత్ర పాతబస్తీలోని దారుషిఫా మైదానంతో భారత్ ఫుట్‌బాల్ టీమ్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఈ మైదానం కుతుబ్‌షాహీల కాలం నుంచే ఉంది. ఇక్కడ ఆసఫ్‌జాహీల పాలనా కాలంలో వివిధ రకాల ఆటలు జరిగేవని చరిత్రకారులు చెబుతారు. అయితే ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాం నుంచి ఇక్కడ ఫుట్‌బాల్ ప్రారంభమైంది. ఇందులో ఫుట్‌బాల్ ఆడే స్థానిక యువత అబ్బాస్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. అది అప్పటి నుంచి ఏయూఎఫ్సీగా గుర్తింపు పొందింది. ఈ మైదానంలో శిక్షణ పొందిన ఎంతోమంది ఆటగాళ్లు ఇండియన్ టీమ్‌లో ఆడారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న షబ్బీర్ అలీ భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా పదేళ్లు వ్యవహరించారు. రెండు గోల్డ్ మెడల్స్... 1951 భారత్‌లో, 1962 జకార్తాలో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ టీమ్ బంగారు పతకాలు సాధించింది. ఈ రెండు టోర్నమెంట్లలోనూ హైదరాబాద్ ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు. 1960 ఆగస్టులో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత టీమ్ ఫ్రాన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 1–1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేవలం ఒక్క పైంట్ తేడాతో భారత్ సెమీస్‌లో ఆడలేకపోయింది. తిరిగి 1970 బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో మన టీమ్ కాంస్య పతకం గెలుచుకుంది. 1970 తర్వాత ఫుట్‌బాల్ టీమ్ ప్రాభవం కోల్పోయిందని భారత మాజీ ఆటగాడు హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ అలీమ్‌ఖాన్ తెలిపారు. నాకు గర్వకారణం... నేను దాదాపు పదేళ్లు ఇండియన్ కెప్టెన్‌గా సేవలందించాను. దారుషిఫా మైదానంలోనే శిక్షణ తీసుకున్నాను. ఏయూఎఫ్‌సీ ఆటగాడిగా ఇది నాకెంతో గర్వకారణం. ప్రస్తుతం ఏయూఎఫ్‌సీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. 1974లో ఇండియన్ టీమ్‌లో చేరి 1990 వరకు ఆటగాడిగా, కోచ్‌గా, సలహాదారుడిగా వ్యవహరించాను. బెంగాల్, గోవా రాష్ట్రాల టీమ్‌లకు కోచ్‌గా పనిచేశాను. ఫుట్‌బాల్‌కు ఆదరణ తగ్గిందని అందరూ అంటున్నారు. అయితే నాటి రోజులు మళ్లీ వస్తాయి. మనం దీనిపై ఎంత శ్రద్ధ వహిస్తున్నామో గ్రహించాలి. మనం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆనాటి విజయాలు రావడం అసాధ్యమేమీ కాదు. – షబ్బీర్ అలీ, మాజీ కెప్టెన్, భారత ఫుట్‌బాల్ టీమ్ అది ఫుట్‌బాల్ యుగం.. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌లో మన నగరం కీలక పాత్ర పోషించింది. ఆ టీమ్‌లో మనోళ్లే దాదాపు 8మంది ఉన్నారంటే.. అప్పుడు నగరంలో ఫుట్‌బాల్‌పై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1956, 1960 ఒలింపిక్స్ గేమ్స్‌లో మన టీమ్ నాలుగో స్థానం సాధించిందంటే ఆటగాళ్ల ప్రతిభ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అప్పట్లో బలమైన టీమ్‌లైన ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ జట్లకు మన్నోళ్లు ముచ్చెమటలు పట్టించారు. అయితే నేడు మన టీమ్ పరిస్థితి దిగజారిపోయింది. – అలీంఖాన్, మాజీ ఆటగాడు -
తల్లిదండ్రుల స్ఫూర్తి.. భరత్ కీర్తి
అనంతపురం, ఎస్కేయూ :తల్లి జిల్లా ఖజానా అధికారి , తండ్రి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సెరికల్చర్ విభాగంలో ప్రొఫెసర్. ఒకరిది బోధన, పరిశోధన రంగం.. మరొకరిది ఆర్థిక పరిపాలన రంగం. ఉన్నత విద్యావంతులైన వారినే స్ఫూర్తిగా తీసుకున్నాడు వారి కుమారుడు. వారు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. అకుంఠిత దీక్షతో సాగిన ఈ మహాయజ్ఞంలో గ్రూప్–1 విజేతగా నిలిచాడు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కేడర్‌లో ఉద్యోగానికి అర్హత సాధించిన అతనే.. అనంతపురానికి చెందిన ఎస్.భరత్ నాయక్. గ్రూప్–1 ఫలితాలు మార్చిలో వచ్చినప్పటికీ..., ఇటీవల ఫిజికల్ టెస్ట్.. ఫిటెనెస్ పరీక్షల్లో నెగ్గారు. దీంతో పోస్టు ఖాయమైంది. ఎంబీబీఎస్ నుంచి... అనంతపురంలోని శారదనగర్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్ .శంకర్‌నాయక్... శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెరికల్చర్ విభాగాధిపతి. తల్లి శాంతాబాయి.. అనంతపురం కలెక్టరేట్లో జిల్లా ఖజానా అధికారిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు భరత్ నాయక్. పదో తరగతి వరకు స్థానిక ఎల్‌ఆర్‌జీ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఎంసెట్‌లో గణనీయమైన ర్యాంక్ సాధించి, అనంత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్న అతను.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో చేరారు. తొలి విడతలోనే.. డాక్టర్‌గా ప్రొఫెషనల్ కెరీర్ ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ సాధనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్న తరుణంలోనే 2016లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడింది. దానిని చూసిన భరత్‌నాయక్.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దరఖాస్తు చేసుకున్నారు. 2017లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఇంటర్వ్యూల్లో నెగ్గారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కఠోర శ్రమతో... ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు చేరిన భరత్ నాయక్.. శిక్షణ తరగతులతో కలిపి రోజూ దాదాపు పది గంటల పాటు ప్రశ్న పత్రాలపై సాధన చేసేవారు. ఎలాంటి పరిస్థిల్లోనూ ఒత్తిళ్లకు లోను కాకుండా లక్ష్య సాధనలో శ్రమించారు. నిత్యమూ వార్త పత్రికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. సిలబస్ అనుగుణంగా సన్నద్ధమయ్యారు. సివిల్స్‌పైనే దృష్టి ఎంబీబీఎస్ చేస్తున్నపుడే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలపై అవగాహన పొందుతూ వచ్చాను. ఎంబీబీఎస్ తర్వాత శిక్షణ ప్రారంభించాను. తల్లిదండ్రుల అంగీకారంతో పట్టుదలతో చదివి ఈ స్థానానికి చేరుకున్నాను. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా, ప్రయత్నిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సివిల్స్ సాధించితీరుతా. తమ్ముడు భార్గవ్‌నాయక్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేస్తున్నాడు. గ్రూప్–1లో మేథమేటిక్స్ పేపరు క్లిష్టంగా ఉండటంతో రెండు నెలల పాటు తమ్ముడి వద్ద ప్రత్యేక శిక్షణ పొందాను. సాక్షిలో రోజూ వచ్చే భవిత మెటీరియల్ దోహదపడింది. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉన్న స్టడీ మెటీరియల్ సైతం బాగా ఉపయోగపడింది. ఇతరులతో మనం ఎపుడూ పోల్చుకోకూడదు. ఇంటర్వ్యూలో భారత్–చైనా– అమెరికా సంబంధాల గురించి అడిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పురోగతి గురించి వివరించమన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో సివిల్స్ సర్వీసెస్‌కు సంబంధించిన మెటీరియల్ దోహదపడింది.– ఎస్.భరత్ నాయక్, గ్రూప్–1 విజేత -
వన్ మూవీ.. ఫైవ్ గెటప్స్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఏజ్ ప్రజెంట్ మూడు పదులకు మించి ఉంటుంది. ఆమె అరవై ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూడాలంటే మరో పాతికేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది వరకు వేచి చూస్తే చాలు. ఎందుకంటే.. ‘భారత్’ అనే సినిమాలో అరవై ఏళ్లున్న పాత్రలో నటించబోతున్నారు ప్రియాంక. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘భారత్’. కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి ఇది రీమేక్. 1947 నుంచి 2010 మధ్య కాలం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగుతుంది. సల్లూ భాయ్ ఫైవ్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రియాంకా చోప్రా కూడా ఐదు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘‘సల్మాన్‌ఖాన్‌లా ప్రియాంకా చోప్రా కూడా ఈ చిత్రంలో ఫైవ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. 28–60 ఇయర్స్ మధ్యలో సల్మాన్ కనిపిస్తే, 25–65 ఏజ్ గ్రూప్‌లో ప్రియాంకా ఫైవ్ డిఫరెంట్ గెటప్స్‌లో దర్శనమిస్తారు. ఇందుకు ప్రోస్థటిక్ మేకప్ వాడతాం. గ్రాఫిక్స్ కూడా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది రంజాన్‌కు ‘భారత్’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
పాంచ్ పటాకా
స్క్రిప్ట్ నచ్చితే ఎన్ని సినిమాలనైనా పట్టాలెక్కించేస్తుంటా అంటున్నారు బాలీవుడ్ భాయ్ సల్మాన్. లేటెస్ట్ మూవీ ‘రేస్ 3’ రిలీజ్‌కి రెడీగా ఉండగానే ‘భరత్’ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలు కాకుండా ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2’, ‘దబాంగ్ 3’ కొరియోగ్రాఫర్,డైరెక్టర్ రెమో డిసౌజాతో ఓ డ్యాన్స్ ఫిల్మ్ కూడా ఓకే చేశారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడం గురించి సల్మాన్ మాట్లాడుతూ – ‘‘ఏదైనా స్క్రిప్ట్ వినగానే నచ్చిందంటే చేసేస్తాను. ఫస్ట్ నరేషన్లో ఎగై్జట్ చే స్తే ఓకే అనేస్తాను. కథ విన్న తర్వాత రేపు చెబుతాను, ఆ తర్వాత చెబుతాను అన్నానంటే ఆ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కదు. ఈ ఫేజ్‌లో నాకు నచ్చినన్ని, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇవే కాకుండా సంజయ్ లీలా భన్సాలీతో కూడా ఓ సినిమా చేయడానికి అంగీకరించారట భాయ్. సో.. బాక్సాఫీస్ మీద భాయ్ పాంచ్ పటాకా పేల్చే పనిలో ఉన్నారని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. -
ప్రియాంకా ఆయా
రెండేళ్లు గడిచిపోయింది ప్రియాంకా చోప్రా హిందీ సినిమాలో నటించి. ‘జై గంగాజల్’ ( 2016) ప్రియాంకా నటించిన చివరి హిందీ సినిమా. అలాగే పదేళ్లు ముగిసిపోయాయి సల్మాన్ ఖాన్‌తో కలసి ప్రియాంక నటించి. ‘గాడ్ తుస్సీ గ్రేట్ హో’ (2008) బాలీవుడ్లో ప్రియాంకా, సల్మాన్‌ఖాన్ కలిసి నటించిన చివరి సినిమా. ఇక్కడితో ఈ గ్యాప్‌కు ఫుల్స్టాప్ పెట్టారు ఇద్దరు. యస్.. ప్రియాంక బాలీవుడ్లో నటించనున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్వకత్వంలో రూపొందుతున్న ‘భరత్’ సినిమాలోనే. అంటే.. రెండేళ్లుగా ఎవరు పిలిచినా బాలీవుడ్‌కు రాని ప్రియాంకా.. భరత్ పిలవగానే ఆయా. అదేనండీ.. సల్మాన్ ఖాన్ పిలవగానే వచ్చారు. 2014లో వచ్చిన కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ సినిమాకు ‘భరత్’ చిత్రం రీమేక్. 1947 నుంచి 2000 టైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగుతుంది. ‘‘భరత్’ సినిమాతో మీ ఇంటికి (బీటౌన్) తిరిగొస్తున్నందుకు శుభాకాంక్షలు. త్వరలో కలుద్దాం.. అన్నట్లు ఇంకో మాట మనది హిందీ సినిమా’’ అని ప్రియాంకకు సరదాగా సల్మాన్ వెల్కమ్ చెప్పారు. ‘‘ నేనేప్పుడూ ఇక్కడి అమ్మాయినే. ‘భరత్’ సెట్స్‌లో కలుసుకుందాం. ఈ సినిమాలో నటించనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రియాంక. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్రియాంకకు బదులు కత్రినా?
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన సల్మాన్ తన తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. చక చకా తన ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం రేస్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సల్మాన్.. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్లో ‘భరత్’ సినిమాను ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోనున్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా విషయం మాట్లాడేందుకే ప్రియాంక అమెరికా నుంచి ముంబైకి వచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా కత్రినా కైఫ్‌ను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైగర్ జిందా హై సూపర్ హిట్ కావడంతో మళ్లీ అదే జోడిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు అలీ అబ్బాస్ ఉన్నాడని.. కత్రినాను దాదాపుగా ఓకే చేశారని తెలుస్తోంది. సల్మాన్, కత్రినాలది హిట్ పెయిర్ కూడా కావటంతో బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. -
కాళిదాస్ ఫస్ట్‌లుక్ లాంచ్
భరత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాళిదాస్ టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు కార్తీ ఆవిష్కరించారు. కాదల్ వంటి ఘన విజయం తరువాత వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ నటుడు భరత్ ఇటీవల కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. దీంతో మంచి విజయం కోసం పోరుబాట పట్టిన ఈ యువ హీరో తాజాగా ఒక పవర్ఫుల్ పాత్రలో కాళిదాస్ చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తుండడం విశేషం. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీసెంథిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. థ్రిల్లింగ్ కథాంశాన్ని శ్రీసెంథిల్ హ్యాండిల్ చేస్తున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. నాళైఇయక్కునార్ టీమ్‌కు క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన దర్శకుడు శివనేశన్ దినకరన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం కాళిదాస్. విశాల్ చంద్రశేఖరన్ సంగీతాన్ని, సురేశ్బాల ఛాయాగ్రహణం నిర్వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు కార్తీ గురువారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పాండిరాజ్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు వేల్రాజ్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
సత్తా చాటిన తూర్పు నౌకాదళం
-
సత్తా చాటిన తూర్పు నౌకాదళం
విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం తన విన్యాసాలను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏపాటిదో చాటి చెప్పింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ విజయబావుటాను ఎగురవేసిన సందర్భంగా ఏటా డిసెంబర్ 4న నేవీ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం విశాఖలోని రామకృష్ణా బీచ్‌లో పలు యుద్ధ విన్యాసాలు చేశారు. వీటిని ఎంతోమంది తిలకించారు.సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించడం, నావికులను సాగరంలో ఒక చోట నుంచి మరో చోటకు తరలించడం వంటివి ప్రదర్శించారు. గంటకు ఆరు వేల కి.మీ. వేగంతో దూసుకెళ్లే మిగ్ విమానాలు భూమికి అతి సమీపంనుంచే గాల్లో తల్లకిందులుగా చక్కర్లు కొడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. శత్రు దేశం సముద్రంలో రహస్యంగా ఉంచిన ఆయిల్ రిగ్గు పేల్చివేత, మెరైన్ కమెండోల సాహసకృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇంకా డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాక్స్ శ్రేణి హెలికాప్టర్లు తమ ప్రతిభను ప్రదర్శించాయి. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధ నౌకలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనువిందు చేశాయి. – సాక్షి, విశాఖపట్నం -
తెలుగు ‘పొట్టు’కు రూ.కోటి
తమిళసినిమా: సినిమా వ్యాపారం, వసూళ్ల గురించి ఇవాళ భిన్న ప్రచారాలు చూస్తున్నాం. స్టార్స్ చిత్రాల వసూళ్లు వంద, రెండొందల కోట్ల క్లబ్లో అంటూ భారీ ప్రచారాలతో ఒక పక్క ఊదరగొడుతుంటే, మరో పక్క చిన్న చిత్రాలకు వ్యాపారం లేదు, డెఫిసిట్ అనే మాట వింటున్నాం. ఏటేటా చిత్రపరిశ్రమ స్లంప్‌ను ఎదుర్కొంటుందనే మాటే అధికంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిత్రం పూర్తిగా వ్యాపారం జరుపుకోవడం అంటే అది వరమే అవుతుంది. పొట్టు చిత్రం ఈ కోవకే చెందుతుందని ఆ చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. షాలోం స్డూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్, జోన్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం పొట్టు. కాగా చిత్రం వివరాలను నిర్మాతలు తెలుపుతూ మనుషుల సాహసాల కంటే దెయ్యాల సాహసాలకే ప్రేక్షకుల నుంచి ఆదరణ అధికంగా ఉంటుందన్నారు. అలాంటి హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపిందిన చిత్రం పొట్టు అని చెప్పారు. ఈ చిత్ర తెలుగు హక్కులను ఎన్కేఆర్ ఫిలింస్ అధినేతలు రూ.కోటికి కొనుగోలు చేశారని తెలిపారు. అక్కడ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఏక కాలంలో అన్ని భాషలలోనూ విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. భరత్ హీరోగా నటించిన ఇందులో ఆయనకు జంటగా నమిత, ఇనియ, సృష్టిడాంగే హీరోయిన్లుగా నటించారు. తంబి రామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్రాం, శాయాజీషిండే, మన్సూర్‌అలీఖాన్, ఆర్యన్, స్వామినాధన్, పావాలక్ష్మణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అమ్రేష్ సంగీతాన్ని, ఇనియన్ హరీష్ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడివుడైయాన్ నిర్వర్తించారు. -
భరత్ సంస్మరణ సభ
-
తెలుగు సినిమా హీరో, డైరెక్టర్ కిడ్నాప్
గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ ఆధారంగా కట్టా రాంబాబు ప్రధాన పాత్రలో భరత్ పారేపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఖయ్యుoభాయ్ సినిమా ఈశుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా శనివారం మధ్యాహ్నం చిత్ర డైరెక్టర్, హీరో కిడ్నాప్ అయ్యారు. దుండగులు వారు ప్రయణిస్తున్న కారును అడ్డగించి ఆ కారును అనంతపురం తరలించారు. అక్కడ ఒక హోటల్లో నిర్భoదించి, 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కొంత సేపటికే దుండగులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యా రు. ప్రస్తుతం హీరో, దర్శకుడు సురక్షితంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి రాంబాబు, భరత్ హైదరాబాద్ చేరుకొనున్నారు. ఈ విషయాన్ని కట్టా రాంబాబు, భరత్ మీడియా కి తెలి పారు. -
నటుడు భరత్ బాల్యమంతా అక్కడే..
- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో విషాదఛాయలు జగ్గంపేట: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మణం పాలయ్యారన్న వార్త వారి బంధువుల్లో విషాదాన్ని నింపింది. రవితేజ, భరత్, రఘులు బాల్యంలో ఎక్కువగా గడిపింది జగ్గంపేటలోని తమ మేనమామ ఇంట్లోనే కావడంతో అక్కడివారంతా భరత్‌ను తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. భరత్ తండ్రి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు కాగా తల్లి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. భరత్ సోదరులు బాల్యంలో ఎక్కువగా జగ్గంపేటలో గడవడంతో ఇక్కడ వారితో వారికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. జగ్గంపేట పరిసర ప్రాంతాలలో పొలాలు ఉండడంతో తరచూ ఇక్కడకు వస్తుండేవరని భరత్ సోదరుల మేనమామ శ్రీవత్సవాయి రాముడు(మీసాలరాజు), ఇతర కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. -
భరత్ మృతి; షూటింగ్లో రవితేజ బిజీ!
హైదరాబాద్: తన తమ్ముడు భరత్ అంత్యక్రియలకు రాలేనని ప్రకటించిన హీరో రవితేజ.. మరుసటిరోజే సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిసింది. అందరూ ఉండికూడా అనాథలా భరత్ అంత్యక్రియలు జరిగాయని, చనిపోయినవారి విషయంలో మంచిచెడులు ఉండవని, రవితేజ తమ్ముణ్ని కడసారైనా చూస్తే బాగుండేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే హీరో షూటింగ్లో పాల్గొన్నారనే వార్త సంచలనంగా మారింది. శనివారం రాత్రి ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. భరత్ అంత్యక్రియలు ముగిసి 24 గంటలైనా కాకముందే హీరో రవితేజ.. ‘రాజా ది గ్రేట్’ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. భరత్ మరణం నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేయాలని తొలుత భావించినప్పటికీ, తాను వస్తానని హీరో రవితేజ చెప్పడంతో యధావిధిగా పని జరిగినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భరత్ భార్య అమెరికాలో ఉండటుండగా, ఆయన మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే భరత్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని, ఆమేరకు ఆయన తననుతాను సన్నద్ధం చేసుకుంటుండగా అనూహ్యంగా మృత్యువాతపడ్డారని సన్నిహితులు చెప్పారు. వివాహితుడైన భరత్‌కు పిల్లలు లేరు. భరత్ మృతి కేసుకు సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. (షాక్: అమెరికాలో భరత్ భార్య..) -
అంతలోనే.. అనంతలోకాలకు
హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భరత్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటించిన భరత్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యే అరుదైన అవకాశం భరత్‌కు వచ్చింది. బిగ్ బాస్ షోకి భరత్ సెలక్ట్ అయినట్టు సమాచారం. తదుపరి బిగబాస్ సిరీస్‌లో నటించే అవకాశం చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొంటే దేశవ్యాప్తంగా మంచి పేరు లభించే అవకాశం ఉండేది. ఈ షోకు సంబంధించి మరో నెలలోనే షూటింగ్‌కు ప్రణాళికలు కూడా రూపొందించారు. దీనిలో భాగంగా ఫిట్నెస్ కోసం భరత్ కసరత్తు కూడా ప్రారంభించినట్టు సమాచారం. అయితే అంతలోనే ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరం. -
నుజ్జు నుజ్జైన భరత్ కారు
హైదరాబాద్: అతివేగం మరొకరిని బలితీసుకుంది. ప్రముఖ సినీ కథానాయకుడు రవితేజ తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కొత్వాల్‌గూడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని ఢీకొంది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని శంషాబాద్ సీఐ మల్లేష్ తెలిపారు. రవితేజ సోదరుడని ఈ ఉదయం గుర్తించామన్నారు. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు గుర్తించామని చెప్పారు. కారులో అతడొక్కడే ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో భరత్ ముఖం ఛిద్రం కావడంతో అతడిని గుర్తించడంలో ఆలస్యమైందన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కారులో మద్యం సీసాలు లభ్యమవడంతో భరత్ మద్యం సేవించినట్టు అనుమానిస్తున్నారు. టీఎస్ 09 ఈసీ 0799 నంబరుతో ఉన్న ఈ ఎరుపురంగు స్కోడా కారు భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరిట కారు రిజిస్ట్రేషన్ అయింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జయింది. ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ అతి వేగానికి పగిలిపోయింది. స్టీరింగ్ విరిగిపోయింది. స్పీడోమీటర్ 140 కిలోమీటర్ల పైన ఆగిపోయింది. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రవితేజ మరో సోదరుడు రఘు, నటుడు ఉత్తేజ్ మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
హీరో రవితేజ సోదరుడి దుర్మరణం
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది. -
చీకట్లు నింపిన వెలుగు
వెలుగులు పంచాల్సిన కరెం తీగ యమపాశమైంది.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది.. జీవనాధారమూ లేకుండా చేసింది.. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన ఐదేళ్ల చిన్నారి అదృష్టవశాత్తు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. - రొద్దం (పెనుకొండ) రొద్దం మండలం తురకలాపట్నంలో గురువారం సంభవించిన విద్యుదాఘాతానికి మాల సుశీలమ్మ(50) అనే మహిళా రైతు మరణించారు. ఆమెతో పాటు రెండు గొర్రెలూ మృత్యువాతపడ్డాయి. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు... ఎలా జరిగిందంటే... సుశీలమ్మ మేత కోసం గొర్రెలను తోలుకొని వ్యవసాయ తోట వద్దకు వెళ్లారు. విద్యుత్ స్తంభం నుంచి స్టార్టర్కు అనుసంధానించిన సర్వీస్ వైరు అక్కడి బోరు బావి వద్ద గల స్టార్టర్ బాక్సుపై పడకుండా ఓ ఇనుప కడ్డీతో కొబ్బరి చెట్టుకు కట్టి ఉంచారు. ఈ క్రమంలో గొర్రెలు అటు వైపు వెళ్తూ ఇనుప కడ్డీని తాకాయి. దీంతో విద్యుత్ షాక్ గురయ్యాయి. వాటిని కాపాడేందుకు ప్రయత్నించిన సుశీలమ్మ సైతం కరెంట్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందారు. మృత్యుంజయుడు భరత్ సుశీలమ్మకు తోడుగా వెళ్లిన మనవడు భరత్(5) అప్పటి మేరకు గొర్రెలతో ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించి అవ్వ సహా గొర్రెలు నిర్జీవంగా పడిపోవడంతో భయపడిన భరత్ అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాడు. ఒంటరిగానే గ్రామంలోకి వెళ్లి అవ్వతో పాటు గొర్రెలు కదలకుండా పడిపోయారంటూ చెప్పడంతో అతని తల్లిదండ్రులు అనిత, హరీశ్ సహా గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వారొచ్చేలోపే సుశీలమ్మ సహా గొర్రెలు మృతి చెందాయి. భయంతో పరుగులు తీసి భరత్ ప్రాణాలు దక్కించుకోవడంతో మృత్యుంజయుడిగా గ్రామస్తులు అతన్ని అభివర్ణించారు. రెండేళ్లలోనే అమ్మానాన్నను కోల్పోయి.. సుశీలమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్ల కిందట సుశీలమ్మ భర్త అనారోగ్యంతో చనిపోయారు. కుమారులు హరీశ్, దేవరాజ్ కుటుంబాలతో కలసి ఉంటున్న సుశీలమ్మే ఇంటి వ్యవహారాలన్నీ చూస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఇంటికి ఆమె పెద్ద దిక్కు. అటువంటిది ఇప్పుడు విద్యుదాఘాతానికి గురై ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇక తాము ఎవరి కోసం బతకాలంటూ గుండెలు పగిలేలా రోదించారు. కాగా విషయం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్ నరసింహులు, ట్రాన్స్‌కో ఏఈ హరినాథ్ తమ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
-
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో ఈ రంగం ఒకటిగా ఎదిగిన విషయం తెల్సిందే. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న రోబోఠఙక్ సాంకేతిక పరిజ్ఞానం మరో 30 ఏళ్ల నాటికి యాభైశాతం కార్మికులను రోడ్డున పడేయనుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం నాటికి భవన నిర్మాణ రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడవ దిగ్గజ దేశంగా ఎదుగుతున్న అంచనాల నేపథ్యంలో కార్మికుల పట్ల ఇది ప్రతికూల పరిణామమే. న్యూయార్క్‌లోని ఓ కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ మిషన్లు (ఎస్ఏఎం) ఇప్పటికే ఇటుక గోడల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని అమెరికాలో ఉపయోగిస్తుండగా, త్వరలోనే బ్రిటన్‌లో ఉపయోగించనున్నారు. మానవులు రోజుకు 500 ఇటుకలతో కూడిన గోడను నిర్మించగలిగితే ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లు రోజుకు 3000 ఇటుకలతో గోడలను నిర్మించగలుగుతున్నాయి. ఈ విషయంలో పెర్త్‌లోని ఓ రోబోటెక్ కంపెనీ ఇంతకన్నా అధునాతనమైన రోబో యంత్రాలను కనిపెట్టాయి. ప్రయోగాత్మక పరీక్షలు కూడా విజయవంతం అవడంతో ఆ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి వీటిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటోంది. ఇటుక గోడల నిర్మాణానికి రానున్న దశాబ్దం మొత్తం రోబోటిక్ యంత్రాలదేనని ఇదే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న స్విడ్జర్లాండ్ పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంజనీర్ హాడ్రియన్ రెండు రోజుల్లో ఇంటిని నిర్మించే రోబో యంత్రాలను 2015లో డిజైన్చేసి వాటి మీద పని చేస్తున్నారు. అవి కూడా మార్కెట్లోకి వచ్చినట్లయితే ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులకు మరింత ప్రమాదం. ప్రస్తుతానికి రోబోలను పని చేయించడానికి కొంత సిబ్బంది అవసరం అవుతున్నారు. పోనుపోను సిబ్బంది అవసరం లేకుండానే రోబోలే అన్ని పనులు చేసుకుంటూ పోతాయట. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న 30 ఏళ్లలో భారత్‌లో మూడున్నర కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని నిపుణుల అంచనా. -
స్వచ్ఛభారత్ లక్ష్యంగా ‘మల్లిగాడి మరుగుదొడ్డి’
–పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్వశిక్షాభియాన్ -జిల్లాలో 46,516 మంది ఆరో తరగతి విద్యార్థులకు అందజేత భానుగుడి(కాకినాడ) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాని పాఠశాలల్లో ఆరోతరగతి విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్షాభియాన్ ద్వారా కార్టూన్ పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టింది. పరిసరాల పరిశుభ్రతను పాటించాల్సిన ఆవశ్యకతను కార్టూన్లద్వారా తెలియపరుస్తూ 50 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఎంత అవసరమో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. దైనందిన కార్యక్రమాలలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకుంటే వచ్చే అనర్థాలను స్పష్టంగా వివరించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలని ఆరోతరగతి చదువుతున్న మల్లిగాడి పాత్ర ద్వారా తెలియజెప్పారు. ‘స్వచ్ఛభారత్’లో భాగంగా ప్రచురణ అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 46,516 మంది ఆరోతరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో ఈ పుస్తకంపై ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మరో రెండు రోజుల్లో పుస్తకాలన్నీ పాఠశాలలకు చేరతాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. -మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ విద్యార్థుల ద్వారా అవగాహనే లక్ష్యం మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచితే సమాజంలోకి సులువుగా విషయం చేరుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పుస్తకాన్ని చదవడానికి వీలుగా, చిన్నచిన్న కొటేషన్ల ద్వారా రూపొందించారు. ప్రతి పాఠశాలకూ పుస్తకాలు చేరేలా చర్యలు తీసుకున్నాం. -చామంతి నాగేశ్వరరావు, ఏఎంఓ, సర్వశిక్షాభియాన్ -
విభిన్న ప్రతిభలకు వేదిక
-రావులపాలెంలో భరత్ టాలెంట్ టెస్ట్ -దేశం నలుమూలల నుంచి కళాకారులు -ముక్కుతో వాయిద్యాల వాదనలో రికార్డు సృష్టించిన సోహమ్ రావులపాలెం : స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్ శనివారం నిర్వహించిన భరత్ టాలెంట్ ఫెస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న కళాకారులు హాజరయ్యారు. వీరికి భరత్ శిరోమణి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా వారిలో కొందరిని ‘సాక్షి’ పలకరించింది. కోల్‌కతా సమీపంలోని బర్ధమాన్ పట్టణానికి చెందిన సోహమ్ ముఖోపాధ్యాయ పదేళ్ళ వయసు నుంచి ముక్కుతో మౌత్ ఆర్గన్ను వాయించడంపై దృష్టి పెట్టారు. ప్రసుతం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆయన మౌత్ఆర్గన్ను ముక్కుతో ఏకధాటిగా 20 నిమిషాల 20 సెకన్ల వాయిస్తూ ప్రపంచ రికార్డు సాధించారు. సోహమ్ తాజాగా మెలోడికా, ప్లూట్ సంగీత వాయిద్యాలను కూడా ముక్కుతో వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. మెలోడికాను 30 నిమిషాల 22 సెకన్లు, ప్లూట్ను 6 నిమిషాల 9 సెకన్లు వాయించడంలో ప్రపంచ రికార్డులు సాధించారు. ప్రపంచంలో ఈ మూడింటిని ముక్కుతో వాయించే ఏకైక వ్యక్తిని తానేనని సోహమ్ తెలిపారు. ఆయన పత్రికల్నే చిత్రిస్తారు.. హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన డాక్టర్ దార్ల నాగేశ్వరరావు దినపత్రికలను అచ్చుగుద్దినట్టుగా చిత్రీకరిస్తూ అబ్బుర పరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ ప్రెస్‌లో ఆర్టిస్టుగా పని చేస్తున్న ఆయన రిప్లికా ఆర్ట్‌లో ప్రావీణ్యుడు. దేశంలోని 14 భాషలతోపాటు మరో నాలుగు విదేశీ భాషల్లోని 45 దినపత్రికలనుచిత్రీకరించి ఔరా అని పిస్తున్నారు. దినపత్రికలోని మొదటి పేజీలను అసలుకు ఏమాత్రం తగ్గకుండా అచ్చుగుద్దినట్టుగా చేతితో వివిధ రంగుల పెన్నులతో చిత్రాలు వేయడం విశేషం. ఫొటోలనుమాత్రం వేరే పత్రిక నుండి సేకరించి అతికిస్తానని, మిగిలినవన్నీ పెన్నులతో చిత్రీకరిస్తానని ఒక పేజీకి 15 నుండి 30 రోజుల సమయం పడుతుందని తెలిపారు. నయా క్యాలెండర్ పేరుతో 2001 నుంచి 2120 సంవత్సరం వరకూ 120 సంవత్సరాల క్యాలెండర్‌ను తయారు చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించారు. చెట్టు నాణేల సేకరణ ఆయన ప్రత్యేకత భూమిపై చెట్టు, నీరు, జీవరాశుల ఆవశ్యకతను తెలియజేపుతూ వివిధ దేశాలు రూపొందించిన నాణేల సేకరణతో ఆకట్టుకొంటున్నారు కాజులూరు మండలం శీలలంక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతిన వెంకట నారాయణ. ఆయన ప్రత్యేకంగా చెట్టు చిత్రంతో ఉన్న 130 దేశాల 450 నాణేలు సేకరించి ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేకరించిన ప్రతి నాణెంపై చెట్టు లేదా పర్యావరణ నినాదం ఉంటాయి. ఈ నాణేల సేకరణతో ఆయన కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మిత్ర అవార్డును, 2009, 2015 రాష్ట్రస్థాయి నాణేల ప్రదర్శనలో బంగారు పతకాల్ని సాధించారు. 2016లో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనకు హజరయ్యారు. -
ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సత్తా!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆర్ట్స్ కళాశాల విద్యార్థి బి.భరత్ రాష్ట్రస్థాయి ఉపాన్యాసక పోటీల్లో సత్తా చాటి ఉత్తమ ఉపన్యాసక అవార్డు కైవసం చేసుకున్నాడు. తిరుపతిలో 2 ,3 తేదీల్లో కృష్ణతేజం యువ సాంస్కృతిక క్రీడా సమ్మేళనంలో రాష్ట్రస్థాయి ఉపన్యాసక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో భరత్ సత్తా చాటి ప్రథమస్థానంలో నిలిచాడు. భరత్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి, అధ్యాపకులు అభినందించారు. భరత్ ఇప్పటిదాకా రాష్ట్రస్థాయి పోటీల్లో 13సార్లు కళాశాల తరుఫున పాల్గొని అవార్డులు సాధించాడని ప్రిన్సిపల్ తెలిపారు. అలాగే రెండుసార్లు జాతీయస్థాయి అవార్డులు సాధించారని గుర్తు చేశారు. యువత భరత్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ డి. శివకుమార్, డీడీఓ శ్రీనివాసులు, ఇతర అధ్యాపకులు భరత్‌ను అభినందించారు.