
భరత్ (ఫైల్)
మలక్‌పేట: ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సైదాబాద్ పూసలబస్తీకి చెందిన టి.లక్ష్మీనారాయణ కుమారుడు టీ. భరత్(19)డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజ్‌లో ఎంపీసీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉండటంతో మనస్థాపానికి గురైన అతడు వారం రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 8.15 గంటలకు భరత్ తల్లి కవిత బయటికి వెళ్లింది. భరత్ రాత్రి భోజనంచేసి గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకున్నాడు. బయటి వెళ్లిన కవిత ఇంటికి వచ్చేసరికి భరత్ వేలాడుతూ కన్పించాడు. స్థానికులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.