Inter Second Year
-
లెక్చరర్ కుర్చీ కింద బాంబు.. విద్యార్థుల ప్రతీకారం..
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్‌కి వచ్చే లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు. లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్‌కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్‌కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
ఎవరెస్ట్ కీ బేటీ
కుమార్తెను ప్రోత్సహించడానికి తండ్రి ఎవరెస్ట్‌లా నిలబడితే ఏ కుమారై్తనా ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి వెనుకాడదు. ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యతన తండ్రితో కలిసి తొమ్మిదో ఏటనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తాకగలిగింది. ఇప్పుడు తండ్రిని తోడు చేసుకుని ఎవరెస్ట్‌నే అధిరోహించింది. ఎవరెస్ట్‌ను ఎక్కిన బాలికలలో ఈమెది రెండో చిన్న వయసు. కామ్య సాహసయాత్ర విశేషాలు.కొన్ని విజయాలు పుట్టుకతోనే నిర్థారితమవుతాయి. ముంబైలోని నేవీ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ తాజా ఘన విజయం చూస్తే ఆ మాటే అనాలనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో 6 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలన్నీ అధిరోహించిందామె. మే 20న ఎవరెస్ట్ అధిరోహణతో నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన రెండవ చిన్న వయసు మౌంటెనీర్గా, మన దేశం నుంచైతే మొట్ట మొదటి చిన్న వయసు మౌంటనీర్‌గా రికార్డ్ సృష్టించింది. దీని వెనుక కామ్య తండ్రి కార్తికేయన్ ఉన్నాడు. తల్లి లావణ్య ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఊహ తెలిసిన వెంటనే కనిపించిన సహ్యాద్రి పర్వతాలున్నాయి.మూడేళ్ల వయసు నుంచేకావ్య తండ్రి కార్తికేయన్ నేవీలో ఆఫీసర్. అతని ΄ోస్టింగ్ లోనావాలాలో ఉండగా కావ్యాకు మూడేళ్లు. వీకెండ్స్‌లో ఆమె తల్లిదండ్రులిద్దరూ సహ్యాద్రి పర్వతాల్లో విహారానికి కావ్యను తీసుకెళ్లేవారు. ఐదారేళ్లు వచ్చేసరికి సహ్యాద్రిలో ఆమె కాళ్లు పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ప్రకృతి కామ్యను ఆకర్షించింది. పర్వతాలు హద్దుల్లేని ప్రయాణం చేయమని స్ఫూర్తినిచ్చాయి. కామ్యలోని చురుకుదనాన్ని చూసి పర్వతారోహణలో ఆమెను ప్రోత్సహించాలని కార్తికేయన్ నిశ్చయించుకున్నాడు.మొదటి లిట్మస్ టెస్ట్కామ్యకు 9 ఏళ్ల వయసు ఉండగా కార్తికేయన్ ఆమెను పర్వతారోహణలో నిలదొక్కుకోగలదో లేదో పరీక్షించడానికి లదాఖ్ తీసుకెళ్లాడు. అక్కడి మౌంట్ స్టాక్ కంగ్రీని 6000 అడుగుల ఎత్తు మేర ఆమె అధిరోహించింది. ప్రతికూల వాతావరణంలో ఆ వయసులో ఆమె చేసిన అధిరోహణ కార్తికేయన్‌కు నమ్మకమిచ్చింది. దాంతో తన కూతురు చిన్న వయసులోనే అన్ని ఖండాల్లోని పర్వతాలు అధిరోహించాలని అతడుప్రోత్సహించాడు. కామ్య ఆ సవాలును స్వీకరించింది. అలా మొదలైంది వారి ‘సాహస్’ యాత్ర.7 ఖండాల సాహస్కామ్య ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన శిఖరాలన్నీ అధిరోహించాలని నిశ్చయించుకుంది. ఆ యాత్రకు ‘సాహస్’ అని పేరు పెట్టుకుంది. ‘అయితే అది అంత సులువైన పని కాదు. మానసికంగా శారీరకంగా వైద్యానికి స్పందించే విధంగా మన శరీరం మనసు ఉండాలి. అందుకని నేను రోజుకు ఆరు గంటలు సైక్లింగ్, రన్నింగ్ చేసేదాన్ని’ అని తెలిపింది కామ్య. తన సాహస యాత్ర మొదలెట్టే ముందు ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎం.ఎస్. కోలిని కలిస్తే ‘పర్వతాలు ఎన్నో కథలను నీకు ఇస్తాయి. అవి జీవితాంతం గొప్పగా నీతో మిగులుతాయి. గో అహేడ్’ అని ఆశీర్వదించాడు. కామ్య ఆగలేదు. తండ్రితో పాటు 2017లో కిలిమంజారో (ఆఫ్రికా), ఆ తర్వాతి సంవత్సరం మౌంట్ ఎల్బ్రుస్ (యూరప్), ఆ తర్వాత మౌంట్ కోసియుస్కొ (ఆస్ట్రేలియా), మౌంట్ అకొంకగువా (సౌత్ అమెరికా), మౌంట్ డెనాలి (నార్త్ అమెరికా) అధిరోహించింది. మే 20న మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) అధిరోహించడంతో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ ఒక్కటే చేరడం మిగిలింది.ఎవరెస్ట్ అధిరోహణమే 20న ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరడానికి ఏప్రిల్ 6 నుంచి కామ్య, ఆమె తండ్రి కార్తికేయన్ ప్రయాణం మొదలైంది. అధిరోహించేది ఎవరెస్ట్ కనుక ట్రైనింగ్, షాపింగ్, ΄్యాకింగ్, ట్రావెల్ పకడ్బందీగా ΄్లాన్ చేసుకున్నారు. మొదట ఖట్మాండు చేరుకుని అక్కడి నుంచి విమానం ద్వారా లుక్లా ఎయిర్΄ోర్ట్కు చేరుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు ఇది మొదటి మజిలీ. అక్కడి నుంచి ఆరోహణ ్రపారంభించి ఫాక్డింగ్ (2610 మీటర్లు) నుంచి నామ్చే బజార్ (3440 మీటర్లు) చేరుకున్నారు. అక్కడ విరామం తీసుకున్నాక టెంగ్బోచె (3860 మీటర్లు)కు ట్రెక్ సాగింది. ఆ తర్వాత లొబొచె (4940 మీటర్లు) చేరుకుని ఆ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆక్సిజన్ పరికరాలు ఉపయోగిస్తూ పర్వతారోహణ ఎలా చేయాలో, పైకి కొనసాగే సమయంలో సేఫ్టీ పరికరాలు ఎలా ఉపయోగించాలో ట్రయినింగ్ తీసుకున్నారు. శిఖరాగ్రం చేరుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేక΄ోవడంతో మే 15 వరకూ బేస్ క్యాంప్‌లోనే ఉండాల్సి వచ్చింది. మే 15న బయలుదేరి మే 20 మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు కామ్య ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. 8, 849 మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ శిఖరంపైన తన తండ్రితో పాటు నిలబడి కామ్య తన విజయాన్ని ఆస్వాదించింది. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించింది. -
ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 49%
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో 49.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే నెలలో జరిగిన రెగ్యులర్‌తో కలుపుకుంటే ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత 80.80 శాతంగా నమోదైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి జరిగిన అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా జనరల్‌కు 1,02,236 మంది, ఒకేషనల్‌కు 12,053 మంది హాజరయ్యారని, వీరిలో జనరల్ 48,816(47.74 శాతం) మంది, ఒకేషనల్ 7,843 (65.07 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అధికారిక వెబ్సైట్లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచామన్నారు. రెగ్యులర్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కలిపి జనరల్ ఇంటర్లో 3,92,258 మంది పరీక్ష రాస్తే, 3,18,247 మంది (81.13 శాతం), ఒకేషనల్‌లో 44,112 మంది రాస్తే 34,361 (77.89 శాతం) ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌లో 67 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్‌లో అడ్వాన్స్ సప్లిమెంటరీలో జనరల్ 1,49,285 మంది, ఒకేషనల్ 10,858 మంది ఉత్తీర్ణులైనట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. 1,00,513 మంది జనరల్‌లో, 2,146 మంది ఒకేషనల్‌లో ఇంప్రూవ్మెంట్ రాసినట్టు బోర్డ్ పేర్కొంది. పరీక్ష రాసినవారిలో 80028 మందికి ఏ గ్రేడ్ వచ్చినట్టు స్పష్టం చేసింది. అడ్వాన్స్డ్ రాసినవారిలో జనరల్ ఉత్తీర్ణత శాతం 67.72 శాతం, ఒకేషనల్‌లో 57.28 శాతం నమోదైనట్టు తెలిపింది. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షలకు జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు హాజరైతే, వీరిలో 2,68,763 (64.85 శాతం) పాసయినట్టు తెలిపారు. -
16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ సెకండియర్ తరగతులను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను అనుసరించి తరగతుల నిర్వహణకు వీలుగా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గత నెల 12వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను బోర్డు నిర్వహిస్తోంది. ప్రస్తుతం విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో జూనియర్ కాలేజీల్లోనూ తరగతి గది బోధనను చేపట్టేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించనందున గత ఏడాది ఫస్టియర్ విద్యార్థులందరినీ ఇంటర్మీడియెట్ బోర్డు మినిమమ్ పాస్ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 5.12 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు సెకండియర్ తరగతులకు హాజరుకానున్నారు. -
ఏపీలో ఈ నెల 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
-
ఏపీ: 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. -
తెలంగాణ : ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు: సబితారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడవుతాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. జులై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో 46ను అమలు చేస్తామన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈనెల 25 నుంచి టీచర్లు స్కూళ్లకు రావాలని ఆదేశించారు. -
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు: మంత్రి సబితా
►సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో.. అవే మార్కులను సెకండియర్‌లోనూ కేటాయించే అవకాశం ఉంది.విద్యార్థులు రాసిన ►రికార్డ్ బుక్‌ల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులను ఇవ్వాలని అధికారుల ఆలోచన. ►బైపీసీ విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 30 మార్కుల చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులు, ఎంపీసీ విద్యార్థులకు రెండు సబ్జెక్టులకు కలిపి 60 మార్కులను కేటాయించే యోచన. ►ఫస్టియర్‌లో ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఇవ్వాలని.. పైచదువులకు వెళ్లేవారికి కనీస మార్కుల నిబంధన సమస్య రాకుండా చూడాలనే ప్రతిపాదన! ►మార్కులపై ఏం చేయాలన్న దానిపై కమిటీ. ఆ కమిటీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు చదవడమే ఓ పరీక్షగా మారిందని.. దానికితోడు పరీక్షల నిర్వహణ సమస్య తలెత్తిందని ఆమె చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ ఇంతకు ముందే.. విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులు కేటాయించాలని ఆదేశించారు. తర్వాత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కూడా రద్దుచేసి, విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించినా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం వద్దని సీఎం సూచించారు. తల్లిదండుల ఆందోళన, విద్యార్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు చేయాలన్నారు.ఈ మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నాం..’’ అని సబిత ప్రకటించారు. విధి విధానాలపై కమిటీ.. విద్యార్థులను ఎలా పాస్ చేయాలన్న దానిపై విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం కమిటీ వేశామని, రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని, త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చే మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలను ఇటీవల రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల రద్దు వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. కనీస మార్కుల సమస్య రాకుండా.. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో దాదాపు 1.99 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో కొందరు ఒక సబ్జెక్టు ఫెయిల్ కాగా.. మరికొందరు ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ప్రస్తుతం వారంతా సెకండియర్ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో.. ఫస్టియర్ ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీస మార్కులను కేటాయించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. వారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు వేసి పాస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంతేగాకుండా సెకండియర్‌లోనూ 45 శాతం మార్కులు వేయాలని.. పైచదువులకు వెళ్లినపుడు కనీస అర్హత మార్కుల నిబంధనతో ఇబ్బంది రాకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. జూలై మధ్యలో నిర్వహించాలనుకున్నా.. వాస్తవానికి జూలై మధ్యలో ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రం ప్రభుత్వం కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. జూలై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టులో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. పరీక్ష సమయాన్ని 90 నిమిషాలకు కుదిస్తామని, సగం ప్రశ్నలకే జవాబులు రాసేలా చర్యలు చేపడతామని పేర్కొంది. అయితే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడం, కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో పరీక్షల రద్దుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. అధికారుల కమిటీ ఇచ్చే విధివిధానాల మేరకు ఇంటర్ బోర్డు మార్కులను కేటాయించి ఫలితాలను వెల్లడించనుంది. చదవండి: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు లాక్డౌన్: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు -
Telangana: ఇంటర్ ఫైనల్ పరీక్షలు రద్దు?!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పబ్లిక్ పరీక్షల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సైతం రద్దు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ అకడమిక్ కేలండర్ ప్రకారం వార్షిక పరీక్షలు మే నెల మొదటి వారంలో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. తిరిగి జూలైæ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు సమర్పించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జిల్లాల వారీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన కేంద్ర ప్రభుత్వం వాటి రద్దుకు ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూలై రెండో వారం నుంచి నిర్వహించాలని భావించిన ఇంటర్ వార్షిక పరీక్షలపైనా సందిగ్ధత నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలను కేంద్రం రద్దు చేయడంతో.. రాష్ట్రంలో కూడా ఇదేతరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు మాత్రం.. పరీక్షల నిర్వహణకు పక్కాగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంటూనే ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవరిస్తామని చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,73,967 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను బోర్డు ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ మార్కులే ఆధారం! పరీక్షలు నిర్వహించే పక్షంలో విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఒకవేళ పరీక్షలు రద్దు చేస్తే మార్కులు ఎలా అనే అంశంపై కొంత గందరగోళం నెలకొంది. అయితే వీటిపై ఇప్పటికే అధికారులు ఓ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండియర్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు గతేడాది ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో ఆప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసే ఆప్షన్‌ను అధికారులు ఎంపిక చేశారు. ఒకవేళ పరీక్షలు రాయకుండా గైర్హాజరైన వారికి 45 శాతం మార్కులు వేసే అవకాశం ఉంది. ఫస్టియర్ పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో కూడా ఒక అంచనాకు వచ్చారు. పరీక్ష రాసి పాసైన సబ్జెక్టు మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు నిర్ధారిస్తారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుకు 45 శాతం మార్కులు వేస్తారు. ఇక ప్రాక్టికల్స్ విషయంలో రికార్డు ఆధారంగా మార్కులు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. -
పబ్జీ ఆడొద్దు అన్నందుకు ఎంతపని చేశాడు!
వెంకటేశ్వరకాలనీ (హైదరాబాద్): పబ్జీ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ప్రాణాలు తీసుకోబోయాడో విద్యార్థి.. ఏకంగా ఐదంతస్తుల భవనంపై నుంచి దూకగా అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.. పంజగుట్ట ప్రతాప్‌నగర్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం నివాసముంటోంది. ఆన్లైన్ క్లాసులున్న నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలుడు (17) కొన్ని రోజులుగా పబ్జీ ఆటకు బానిసయ్యాడు. అది గమనించిన ఆ బాలుడి తండ్రి శనివారం రాత్రి అతడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు పక్కనే ఉన్న ఐదంతస్తుల ఇంటిపైకి ఎక్కి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారమందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి వైర్ల కనెక్షన్లను పునరుద్ధరించారు. -
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఝలక్..
కరోనా వైరస్ విపత్తు కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలతోపాటు, అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ యాజమాన్యాలు అడ్వాన్స్ దోపిడీకి తెరతీశాయి. పది పరీక్షలే జరగలేదు.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి ముందే అడ్వాన్స్ చెల్లిస్తే.. ఫీజు రాయితీలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క ఆయా కళాశాలల్లో చదివి ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్వాన్స్ మొత్తం చెల్లిస్తేనే.. ద్వితీయ సంవత్సరం క్లాస్‌లకు ఆన్లైన్ లింక్ ఇస్తామని ఝలక్ ఇస్తున్నాయి. నెల్లూరు (టౌన్): కరోనా కష్టకాలంలోనూ జిల్లాలో ప్రైవేట్ కళాళాలలు అడ్వాన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కమిటీని కూడా నియమించింది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇప్పటికే ఆన్లైన్లో తరగతులు ప్రారంభమయ్యాయని, వెంటనే 25 శాతం ఫీజు చెల్లించినట్లయితే సంబంధిత ఆన్లైన్ లింక్ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులతో ఫోన్లు చేయిస్తున్నాయి. ♦ జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో 173 ప్రైవేట్, 35 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు 60 వేల మందికి పైగా ఉంటారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 12 నుంచి 14 వేల మంది చదువుతున్నారు. ♦ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో జూలై వరకు తరగతులు నిర్వహించే పరిస్థితి లేదు. అప్పటికి కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే మరికొన్ని రోజులు తరగతుల నిర్వహణను వాయిదా వేసే అవకాశం ఉంది. ♦ అయితే ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్ కోర్సులకు సంబంధించి తరగతులు ప్రారంభించినట్లు తెలిసింది. ♦ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఫీజులో 25 శాతం చెల్లించాలని చెబుతున్నారు. ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ లింక్ ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. సిలబస్ మిస్ అయితే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ♦ ఫీజులు కూడా గతేడాదికి అదనంగా 10 నుంచి 20 శాతం ఫీజు పెంచేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు అడిగిన ఫీజులు చెల్లించకుంటే తమ పిల్లలు చదువులో ఎక్కడ వెనకబడతారోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే కొంత మంది ఫీజు చెల్లించి ఆన్లైన్ తరగతులకు హాజరువుతున్నట్లు తెలిసింది. ఇంటర్లో చేరబోయే విద్యార్థులదీ అదే పరిస్థితి పదో తరగతి పరీక్షలే ఇంకా జరగలేదు. అయితే వారి ఫోన్ నంబర్లను సేకరించిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కళాశాలలో చేరాలని అడుగుతున్నారు. ♦ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజులో 20 నుంచి 25 శాతం రాయితీ కల్పిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ♦ కార్పొరేట్ యాజమాన్యాల ఫోన్లతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఫీజు కట్టాలా లేకుంటే పది ఫలితాలు వచ్చిన తర్వాత చెల్లించాలన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. ♦ మరో పక్క కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఆన్లైన్ తరగతులు కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని, ముందు అడ్మిషన్ పొందితే ఆన్లైన్ తరగతులకు లింక్ ఇస్తామంటున్నారు. ♦ అయితే ఇప్పటికీ పదో తరగతి పరీక్షలు జరగలేదు. ఇప్పుడే ఇంటర్ తరగతులపై దృష్టి పెడితే పదో తరగతి పరీక్షలకు సంసిద్ధంగా ఉన్న విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందని అంటున్నారు. ♦ ఈ పరిణామాలపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ముందస్తు ఇంటర్‌కు ప్రిపేర్ కావడానికి సిద్ధంగా కనిపించడం లేదు. ఇంకో పక్క క్లాసులు జరిగిపోతే ఎలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజుపై ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయొచ్చు ఇంటర్ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. గతేడాది ఉన్న ఫీజులనే వసూలు చేయాలని, త్రైమాసిక ఫీజును 45 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకోవాలని ఆదేశించింది. ఫీజులపై ఏ యాజమాన్యమైనా ఒత్తిడి తీసుకువస్తే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. విద్యా సంవత్సర ప్రారంభం విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పరిశీలించిన తర్వాత ఆన్లైన్ తరగతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అప్పటి వరకు ఇంటర్లో ఆన్లైన్ తరగతులకు అనుమతి లేదు. ఆన్లైన్ తరగతులకు అనుమతి లేదు ఇంటర్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించకూడదు. ఇంటర్‌కు సంబంధించి విద్యా సంవత్సర ప్రారంభం కంటే ముందుగానే ఫీజు వసూలు చేయరాదు. ఎవరైనా ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తే 99486 63982 నంబరుకు ఫిర్యాదు చేయాలి. కోచింగ్ సెంటర్లకు సైతం అనుమతి లేదు. క్లాసు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మలక్‌పేట: ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సైదాబాద్ పూసలబస్తీకి చెందిన టి.లక్ష్మీనారాయణ కుమారుడు టీ. భరత్(19)డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజ్‌లో ఎంపీసీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉండటంతో మనస్థాపానికి గురైన అతడు వారం రోజులుగా డిప్రెషన్లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 8.15 గంటలకు భరత్ తల్లి కవిత బయటికి వెళ్లింది. భరత్ రాత్రి భోజనంచేసి గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకున్నాడు. బయటి వెళ్లిన కవిత ఇంటికి వచ్చేసరికి భరత్ వేలాడుతూ కన్పించాడు. స్థానికులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టా.. లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసే అవకాశం ఇస్తుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో తప్పుల కారణంగా కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఫెయిలైన 3.82 లక్షల మంది జవాబు పత్రాలను బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు కొంతమంది పాసైనా తక్కువ మార్కులు రావడంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా వారి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే వారిలో కొందరు ఇంప్రూవ్మెంట్ రాయాలని భావిస్తున్నారు. వారికి ఇప్పుడు బోర్డు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది తేల్చడం లేదు. బోర్డు పొరపాట్ల కారణంగా తాము ఫెయిల్ అయ్యామని, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బోర్డు అధికారులు మాత్రం సెకండియర్ విద్యార్థుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేవారు అరుదేనని చెబుతున్నారు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్‌లో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా అవే మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మార్కులు కోల్పోతారు కాబట్టి సెకండియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరుకారని చెబుతున్నారు. 585 మందికి అవకాశం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన 585 మంది విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఎందులో ఎక్కువ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి వారికి మాత్రం ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. -
గురుకుల కళాశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని ప్రతిభా గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బాలచంద్రుడు(17) అనే విద్యార్థి కళాశాల బయట ఉన్న రైతు పొలంలోని సంప్‌లో పడిపోయి మృతి చెందాడు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలచంద్రుడు ఉదయం కళాశాలకు వచ్చాడని.. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో కనిపించకుండా వెళ్లాడని తెలిపారు. సాయంత్రం 5గంటల సమయంలో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కళాశాల కాంపౌండ్ బయట పొలంలో ఉన్న సంప్‌లో పడి ఉండటం గమనించామన్నారు. కొన ఊపిరితో ఉన్న విద్యార్థిని పులివెందుల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన తెలిపారు. కాగా ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల చుట్టూ భారీ ప్రహరీ ఉందని.. ప్రహరీ ఎక్కి వెళ్లి ఉంటే ఎవరూ గమనించలేదా.. విద్యార్థి కనిపించని విషయాన్ని సాయంత్రం వరకు తల్లిదండ్రులకు ఎందుకు తెలియజేయలేదు.. ఇలాంటి పలు అనుమానాలు వెంటాడుతున్నాయి.. మృతుడి స్వగ్రామం చింతకొమ్మదిన్నె మండలం ఆర్.కృష్ణాపురం కాగా.. అతని తండ్రి ఓబులేసు ప్రొద్దుటూరులోని యోగి వేమన యూనివర్సిటీ కాలేజిలో ల్యాబ్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంవల్లే విద్యార్థి మృతి చెందాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. తొలిసారిగా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను రికార్డు స్థాయిలో 28 రోజుల లోపే విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు.ఒకేషనల్ కోర్సు ఫలితాలను కూడా తొలిసారిగా ఆన్ లైన్ ద్వార విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఫస్టియర్ లో అనంతపురం, సెకండియర్ లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు. -
మాస్ కాపీయింగ్‌కు సహకరించలేదని ఆక్రోశం
గీతాంజలి కళాశాలలో ఫ్యాన్లు ధ్వంసం యలమంచిలి : మాస్ కాపియింగ్‌కు సహకరించలేదని ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. చూచిరాతలు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంతో పరీక్షా కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్లు ధ్వంసం చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు స్థానిక గీతాంజలి గీతాంజలి జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాస్ కాపియింగ్ జరగకుండా పరీక్షా కేంద్రం నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు పక్కాగా వ్యవహరించడంతో చూచిరాతలకు అలవాటు పడిన కొందరు విద్యార్థులు చివరి రోజు పరీక్షా కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్లు ధ్వంసం చేసి పరారయ్యారు. బుధవారం ద్వితీయ సంవత్సరం రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు నిర్వహించారు. దాదాపు 250 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగిసిన తర్వాత ఇన్విజిలేటర్లంతా విద్యార్థుల నుంచి జవాబు పత్రాలు సేకరించి కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లను ధ్వంసం చేసినట్టు పరీక్షా కేంద్రం నిర్వాహకులు చెప్పారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆర్.నీలిమ, డిపార్ట్మెంటల్ అధికారి పి.శ్రీనివాస్, ఇన్విజిలేటర్లు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎక్కడివారు అక్కడే..!
విజయనగరం అర్బన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం మళ్లీ వాయిదా పడింది. ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఏడాదీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చివరికి వాయిదా వేయించాయి. దీంతో విద్యార్థులకు తాము చదివే కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితంగా కళాశాలలో ప్రయోగశాలలు ఉన్నా, లేకు న్నా.. పరికరాలు లేకపోయినా, అసలు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు మాత్రం పూర్తిస్థాయిలో పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి 100 కళాశాలల్లో పరీక్షా కేంద్రాల జిల్లాలో 171 కళాశాలలు ఉంన్నాయి. వీటిలో 22 ప్రభుత్వ, 5 ఎయిడెడ్ కళాశాలలు, 16 ఆదర్శ పాఠశాలలు, 10 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మిగిలినవి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాక్టికల్స్ నిర్వహణకు కేవలం 70 కళాశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో వసతులు ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు కొన్ని అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. పాత పద్ధతిలోనే ప్రాక్టిల్ నిర్వహించాలనే నిర్ణయంతో 100 కళాశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాయనున్న 14,176 మంది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్కళాశాలలోద్వితీయసంవత్సరసైన్స్విద్యార్థులు14,176మందిప్రయోగపరీక్షలకహాజరుకానున్నారు.ఎంపీసీవిద్యార్థులు5,452మంది, బైపీసీ విద్యార్థులు 4,666 మంది ఉన్నారు.ప్రైవేట్ విద్యార్థులకు సవాల్ ప్రయోగ పరీక్షలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు సవాలుగా మారనున్నాయి. అపార్టుమెంట్లలోని ఇరుకు గదుల్లో ఎక్కువగా ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ థియరీ నిర్వహించేందుకే గదులు చాలడం లేదు. ఇక ప్రయోగాలు ఎక్కడ చేయిస్తారని స్వయంగా ఓ అధ్యాపకుడే విచారం వ్యక్తంచేశారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పిప్పెట్, బ్యూరెట్, టెస్ట్ ట్యూబ్ (పరీక్ష నాళిక) పరికరాలు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మందికి తెలియవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అరకొరగా అయినా ప్రయోగశాలలు ఉన్నాయి. విజయనగరంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కొన్నేళ్లుగా ల్యాబ్ లేదు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయితే చాలు మార్కులు వచ్చేస్తాయని ఆ విద్యా సంస్థ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు అధికారులను ‘మేనేజ్’ చేస్తూ వస్తున్నారు. ప్రాక్టికల్స్‌లో మార్కుల పేరుతో కొన్ని యాజమన్యాలు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. -
ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు మే 15
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 6తోనే పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినా చివరి రోజు ఇంటర్నెట్ పని చేయకపోవడం, సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో అనేక మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోయారు. ఆందోళనకు గురైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో బోర్డు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 15 వరకు పొడిగించింది. ప్రిన్సిపాళ్లు ఫీజులను తీసుకొని ఈనెల 15 సాయంత్రం 5 గంటలలోగా ఠీఠీఠీ.ఛజ్ఛ్ట్ఛ్చీజ్చ్చ.ఛిజజ.జౌ ఠి.జీ వెబ్సైట్ నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో చెల్లించేలా కన్సాలిడేటెడ్ చలనా డౌన్లోడ్ చేసుకోవాలని వివరించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. -
బాధను దిగమింగి...
విధి ఆటలో వారు పావులుగా మారారు....వారిది ఎవరూ తీర్చలేని బాధ. అయినా ధైర్యంగా ముందడుగు వేశారు. గుండెల్లో గూడుకట్టుకున్న విషాదానికి అక్కడే సమాధి చేశారు. లక్ష్యం చూపిన మార్గంలో పయనించారు. చిన్నచిన్న సమస్యలను ఎదుర్కోలేక వణికిపోతున్న యువతకు వారు మార్గదర్శకులయ్యారు. ఒకరు పుట్టెడు దుఃఖం, మరొకరు చర్మాన్ని దహించివేస్తున్న వ్యాధితో గురువారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. బొబ్బిలి:నాన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన దుఃఖంలో ఒకరు.. శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగాన్ని అదిమిపట్టి మరొకరు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు గురువారం హాజరయ్యారు... విషాదంలో ఉన్నా కొండంత బలాన్ని తెచ్చుకుని పార్వతీపురం పట్టణంలోని కుసుమ గుడ్డి వీధికి చెందిన సంచాన శ్రీవల్లి భాస్కర కళాశాలలో పరీక్షకు హాజరైంది. అలాగే ఎనిమిదో ఏట నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చదువే లక్ష్యంగా బొబ్బిలి అంధుల పాఠశాలలో ఉంటున్న చిన్ని లక్ష్మి బొబ్బిలి వాసు జూనియర్ కళాశాలలో పరీక్షకు హాజరైంది. వీరిద్దరూ యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచారు.. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం పట్టణంలోని కుసుమగుడ్డివీధికి చెందిన సంచాన శ్రీనివాసరావు టైలర్ వృత్తి చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి బయలుదేరి బొబ్బిలి సమీపంలో బుధవారం రాత్రి మృత్యువాత పడ్డాడు... తెల్లారితే కూతురు శ్రీవల్లికి పరీక్ష... మొదటి రోజు పరీక్షకు తానే ద గ్గరుండి దింపి ధైర్యం చెప్తానని ఇంట్లో చె ప్పి వెళ్లిన ఆయన మరణ వార్త గంటలోగానే కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు శ్రీవల్లి గుండలలిసేలా రోదిస్తోంది, తెల్లారగానే బొబ్బిలి వచ్చి తండ్రి మృతదేహాన్ని చూసి భోరుమంది... పరీక్ష రాయడానికి నన్ను ఎవరు తీసుకెళతారంటూ తండ్రి మృతదేహం వద్ద రోదించింది.. చివరకు తండ్రి మాటలు గుర్తుకు వచ్చి తాను చదివి ఉత్తీర్ణురాలై ప్రయోజకురాలుగా నిలబడతానని తనను తాను సముదాయించుకుంది. గుండెనిండా ధైర్యాన్ని నింపుకొని పార్వతీపురం వెళ్లి పరీక్షా కేంద్రంలో కూర్చుంది.. అలాగే శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మి చర్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చిన్నప్పటి నుంచి కళ్లు కనపడకపోవడంతో బొబ్బిలి సమీపంలోని భోజరాజపురం వద్ద ఉన్న అంధుల పాఠశాలలో ఉంటూ చదువుతోంది. ఆమె నాలుగో తరగతిలో ఉండగానే క్యాన్సర్ సోకింది. అప్పటి నుంచి అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యం మందులు ఇప్పిస్తున్నారు.. ఆ వ్యాధి రోజు రోజుకూ ఎక్కువవుతూ వచ్చింది. రోగం ముదురుతున్నా చదువు కోవాలన్న పట్టుదల లక్ష్మిలో మరింత పెరిగింది. ఆ వ్యాధితో బాధపడుతూనే పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రారంభమైన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు స్థానిక వాసు జూనియర్ కళాశాలకు హాజరైంది. పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతో తాను ఇంతవరకూ వచ్చానని, తనకు టీచరు కావాలని ఆశగా ఉందని లక్ష్మి చెబుతోంది. లక్ష్మి పరీక్షలు రాసేందుకు సహాయకారిగా (స్క్రైబ్) అవసరమున్నా ఏ విద్యార్థీ రావడానికి సుముఖత చూపకపోవడంతో అంధుల పాఠశాల టీచర్నే ఇందుకు వినియోగించారు. లక్ష్మి ఎంత వరకూ చదివితే అంతవరకూ అండగా ఉంటామని అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ పాల్సన్ చెప్పారు. -
12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జిల్లాలో 158 పరీక్ష కేంద్రాలు విద్యారణ్యపురి : జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బీపీసీ, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ నెల 17న మహాశివరాత్రి సందర్భంగా పరీక్ష ఉండదని ఇంటర్ విద్య ఆర్ఐఓ మలహల్రావు గురువారం వెల్లడించారు. మిగతా రోజుల్లో యథావిధిగా ఆదివారం, రెండో శనివారం కలిపి పరీక్షలు జరుగుతాయన్నారు. కళాశాలల వారిగా టైం టేబుల్, హాల్‌టికెట్లు, ఓఎం ఆర్ మార్కుల జాబితాలను పంపిస్తున్నామన్నారు. జిల్లాలో సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు 158 పరీక్షా కేంద్రాలు కేటాయించారన్నారు. పరీక్షలకు మొత్తం 16,183 మంది ఎంపీసీ, 8,690 మంది బీపీసీ విద్యార్థులు మొత్తంగా 24,873మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో 4,576 మంది, సెకండియర్‌లో 3,817 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు టైంబేబుల్‌ప్రకారం ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. -
కార్పొరేట్ కాలేజీ విద్యార్థుల జంప్!
పోలీసుల గాలింపు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు విజయవాడ సిటీ : వారిద్దరూ ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబాలకు చెందిన వారు. తల్లిదండ్రులు కోరినంత డబ్బు ఇవ్వడంతో విలాసంగా ఖర్చులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు పరిచయమై ప్రేమగా మారింది. అంతే నాలుగు రోజుల కిందట తాము చదివే కార్పొరేట్ కాలేజీ నుంచి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని చోట్లా గాలిస్తుంటే..ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యువతి ఈస్ట్‌జోన్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా బలమైనవి కావడంతో డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో నాలుగు రోజుల కిందట కాలేజీ నుంచి వారు కనిపించకుండా పోయారు. కాలేజీ నిర్వాహకుల సమాచారంతో ఇక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు.. తమ పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరు, అనంతపురం, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు జరిపారు. ఎక్కడా వీరి ఆచూకీ దొరకలేదు. మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. వీరి అదృశ్యం వెనుక కాలేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన నిర్వాహకులు పట్టించుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులు ఖర్చయితే తప్ప కాలేజీ, ఇల్లు గుర్తుకు రావనే అభిప్రాయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. -
జ్వరంతో విద్యార్థి మృతి
నర్సంపేట టౌన్ : జ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... పట్టణంలోని పోశవ్ము వీధికి చెందిర సెల్వోజు శ్రీనివాస్, పద్మ దంపతుల కువూరుడు అఖిల్(18) హన్మకొండలోని సీవీ రావున్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం అతడికి తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వుృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వుృతుడి కుటుంబానికి టీఆర్ఎస్ నాయుకుడు రారుుడి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్ రూ.4 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట నాయుకులు నారుుని నర్సయ్యు, ఎదరబోరుున రావుస్వామి, దండు రాజు, గోపాల్‌రావు, పసుల ఎల్లస్వామి, వూమిడాల బిక్షపతి, బోడ గోల్యానాయుక్, రాయురాకుల సారంగపాణి, కాట ప్రభాకర్, రాజు, బైరి వుురళీ, అనిల్, శ్రీనివాస్, భద్రు, సత్యం పాల్గొన్నారు. -
నమ్ముకుంటే..నట్టేట ముంచింది
బతుక్కింత భరోసా దొరికిందని సంబరపడిపోయారు. 20 ఏళ్లపాటు కంపెనీ కోసం సర్వశక్తులు ఒడ్డారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించవచ్చని, వారి భవిష్యత్తును బంగారుమయం చేయొచ్చని కలలు కన్నారు. కానీ అవన్నీ కల్లలుగా మిగిలిపోతాయని ఊహించలేకపోయారు. అయినా ఇది తాత్కాలికమే అనుకున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందనుకున్నారు. ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని, నమ్మి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటారని అనుకున్న వారికి చివరికి ఆశాభంగమే అయింది. బిల్ట్ కర్మాగారం మూతపడడంతో ఉపాధి కరువై అల్లాడిపోతున్నారు. పిల్లల చదువులకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు. కొందరు పిల్లల చదువులు మానిపిస్తే మరికొందరు మిత్తికి డబ్బులు తెచ్చి చదివిస్తున్నారు. - కమలాపురం బంగారం తాకట్టుపెట్టి చదివిస్తున్నాం నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఇంటర్ సెకండియర్, రెండో అమ్మాయి ఫస్ట్ ఇయర్, మూడో కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫ్యాక్టరీలో 20ఏళ్లు పనిచేసిన తర్వాత ఇటీవల పీఎఫ్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు జాబ్ పర్మనెంట్ అవుతుందని ఆశపడుతున్న తరుణంలో కంపెనీ మూసేశారు. దీంతో రోడ్డున పడ్డాం. పిల్లల చదువులకు డబ్బుల్లేక ఒంటిమీద ఉన్న బంగారం తాకట్టుపెట్టి మూడు రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చి ఫీజులు కట్టాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కష్టాలు పడుతున్నాం. ఫ్యాక్టరీని నమ్ముకుని సగం వయసు దానికే ధారపోశాం. ఇప్పుడేదారి కనిపించడం లేదు. అధికారులు, నాయకులు, ప్రభుత్వం ఎవరూ పట్టించుకోవడం లేదు. - మందా ఏలియా దత్తన్న దయ చూపాలి బిల్ట్ కర్మాగారం మూతపడి ఎనిమిది నెలలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కరువై అష్టకష్టాలు పడుతున్నా ఏ నాయకుడు తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ వాపోతున్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక బీజేపీ నాయకులు, కార్మికులు కలిసి ఆమెకు వినతిపత్రం సమర్పించారు. కార్మాగారాన్ని కాపాడాలని వేడుకున్నారు. ఇప్పుడు బండారు దత్తాత్రేయ కార్మికమంత్రి కావడంతో కార్మికులు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్టరీ ఒడిదొడుకులపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించి పరిశ్రమను తిరిగి తెరిపిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. పనిలేక సెంట్రింగ్ పనులకు.. నాకు ఇద్దరు కూతుర్లు. ఒకరు ఎనిమిది, ఒకరు తొమ్మిది చదువుతున్నారు. కంపెనీ బంద్ అవడంతో ఉపాధి కోల్పోయాం. పిల్లలను చదివించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల్లో సెంట్రింగ్ పనికి వెళుతున్నాం. రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఇప్పటి వరకు సంపాదించింది ఏమీలేదు. కంపెనీ యాజమాన్యం మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపింది. సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టింది. ఇప్పటికే చాలామంది ఊరు వదిలి వెళ్లి పోయారు. పిల్లలను విడిచి ఉండలేక ఇక్కడే వ్యవసాయం, సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఇక్కడేమో పనిదొరికే పరిస్థితి లేదు. పిల్లాపాపలను తీసుకుని ఎక్కడి కెళ్లాలి. ఎలా బతికేది. నాయకులు అదిచేస్తాం.. ఇది చేస్తాం అంటారు కానీ ఆదుకునేందుకు ఎవరూ ముందుకురారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించాలి. - తవిసి కర్ణ ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నా.. పిల్లలను సాదుకునేందుకు ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నా. రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్నప్పుడు రోజూ పని ఉంటుందని భోరోసా ఉండేది. ఇప్పుడు పని కూడా దొరకడంలేదు. కూలి పనిలోనూ తీవ్ర పోటీ ఉంది. అయినా కావాలని పోటీపడి పనికి వెళ్తున్నాం. అన్నీ వదులుకుని బిల్ట్పైనే ఆశలు పెట్టుకుంటే ఇలా జీవితాలు అల్లకల్లోలం అవుతాయని ఊహించలేకపోయాం. ఫ్యాక్టరీ బంద్ అయినప్పటి నుంచి చాలామంది దిగులుతో మంచంపట్టారు. కంపెనీ తిరిగి తెరుచుకోకుంటే ఆత్మహత్యలు తప్పవు. తెలంగాణ వచ్చినంక మంచి జరుగుతుందనుకుంటే ఇలాగైంది. కార్మిక ప్రభుత్వం ముందుకొచ్చి కంపెనీని తెరిపించాలి. - కలాల రాంబాబు -
10,12 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం
సాక్షి ముంబై: రాష్టవ్య్రాప్తంగా 10, 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ పరీక్షా ఫామ్‌ను ఆన్లైన్లో నింపే సౌకర్యం కల్పించాలని మహారాష్ట్ర స్టేట్ బోర్ట ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎంఎస్బీఎస్హెచ్ఎస్ఈ) నిర్ణయించింది. 12వ తరగతికి ఫిబ్రవరి-మార్చి 2014 లో, టెన్తకు గాను సెప్టెంబర్-అక్టోబర్ 2014లో ఈ ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పుణే, ముంబై, నాసిక్, అమరావతి, నాగ్‌పూర్, సంభాజీనగర్, కొల్హా„పూర్, కొంకణ్, లాతూర్ విభాగాల్లోని 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షా ఫామ్ నింపుతారు. ఆన్లైన్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ప్రతి విభాగంలో బోర్డుకు వేర్వేరు సర్వర్లు అందజేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆన్లైన్లో ఫామ్ నింపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బోర్డు ముంబై విభాగం అధ్యక్షుడు లకీష్మకాంత్ పాండే మాట్లాడుతూ... ఆన్లైన్లో పరీక్షా ఫామ్ నింపడంలో పొరపాటు జరిగితే దరఖాస్తు చేయడం కుదరదని స్పష్టం చేశారు. 12వ తరగతి పరీక్షల కోసం అక్టోబర్ 20 నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తారని తెలిపారు. నగరంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. గడువులోపే ఫామ్ నింపడం ప్రారంభించాలని, దీంతో సర్వర్‌పై భారం పడబోదని ఆయన సూచించారు. ఇంటర్నెట్లో ఝ్చజ్చిజిటటఛిఛౌ్చటఛీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పరీక్షా ఫామ్‌ను నింపవచ్చు. కాగా దరఖాస్తును కేవలం పాఠశాల, జూనియర్ కళాశాలలోనే నింపాలి. పాఠశాల, జూనియర్ కళాశాలలకు వేర్వేరు లాగ్ ఇన్ ఐడీ, పాస్వర్డ ఇచ్చారు. హాల్ టికెట్ కూడా ఆన్లైన్లోనే జారీ చేయాలని బోర్టు యోచిస్తోంది. ప్రైవేట్‌గా పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులకు ఆన్లైన్లో ఫామ్ నింపడానికి ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. పరీక్షా ఫామ్‌పై విద్యార్థి ఫొటో, సంతకం స్కాన్ చేసి ఇస్తారు. ఆఫ్‌లైన్ దరఖాస్తు... ఇంటర్నెట్ సౌకర్యం లేనివారి కోసం ఒక సీడీ అందజేస్తారు. ఈ సీడీలోని సాఫ్టవేర్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత విద్యార్థుల పరీక్షా ఫారాలను ఆఫ్‌లైన్‌లో భర్తీ చేసి, ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నింపవచ్చు.