సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 6తోనే పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినా చివరి రోజు ఇంటర్నెట్ పని చేయకపోవడం, సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో అనేక మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోయారు. ఆందోళనకు గురైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
దీంతో బోర్డు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 15 వరకు పొడిగించింది. ప్రిన్సిపాళ్లు ఫీజులను తీసుకొని ఈనెల 15 సాయంత్రం 5 గంటలలోగా ఠీఠీఠీ.ఛజ్ఛ్ట్ఛ్చీజ్చ్చ.ఛిజజ.జౌ ఠి.జీ వెబ్‌సైట్ నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో చెల్లించేలా కన్సాలిడేటెడ్ చలనా డౌన్‌లోడ్ చేసుకోవాలని వివరించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది.
ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు మే 15
Published Thu, May 14 2015 4:09 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement