
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment