classes
-
ఏప్రిల్ ఒకటి నుంచే ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ బోధన మొదలవుతుంది. ఏప్రిల్ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తు త (2024–25) విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన సైతం ఇదే విధానంలోకి మారింది. వచ్చే నెలలో (మార్చిలో) పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 వి ద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్ఈ విధానాలు అమలుచేస్తారు. ఇంటర్ విద్యలో జాతీయ స్థాయి సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలు, చేపట్టాల్సిన మార్పులపై నియమించిన కమిటీలు 12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక మేరకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం, 2026–27లో రెండో సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును సైతం ప్రవేశపెడుతున్నారు. సీబీఎస్ఈ తరహాలో మార్పులుఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. 223 రోజులు పనిదినాలు ఉండేవి. అయితే, సీబీఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి, ఇంటర్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. జూన్ ఒకటిన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. తొలి 23 రోజుల్లో కనీసం 15 శాతం సిలబస్ పూర్తిచేసి వేసవి సెలవులు ఇస్తారు. పని దినాలు సైతం నెల రోజులు పెరిగాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్ 5 నుంచే మొదటి సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. అందువల్ల పదో తరగతి పరీక్షలు (రెగ్యులర్/ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) రాసిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైనవారిని తొలగిస్తారు.ప్రభుత్వ కాలేజీల్లో జేఈఈ, ఎంసెట్ శిక్షణ రాష్ట్రంలోని సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాస్తున్నందున ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వీటిలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అకడమిక్ తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకురెండు గంటలు జేఈఈ, ఎంసెట్ శిక్షణ ఇస్తారు. -
నో క్లాసులు...నో పాఠాలు..దాని పేరే అగోరా స్కూల్!
స్కూల్ అనగానే క్లాస్‌రూమ్‌లు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, పాఠాలు చెప్పే టీచర్లు గుర్తుకొస్తారు. కానీ యూరప్‌లోని నెదర్ల్యాండ్స్ దేశంలో ఉన్న ‘అగోరా స్కూల్’లో మాత్రం అవేమీ ఉండవు. అక్కడున్న పిల్లలంతా తమకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. అక్కడ గదుల్లో బల్లలు, కుర్చీలుంటాయి. కానీ అవేవీ మనకు మామూలు స్కూళ్లలో కనిపించేలా ఉండవు. అక్కడ పిల్లలు చూసేందుకు టీవీ, వాడేందుకు కంప్యూటర్లు ఉంటాయి. అక్కడ తరగతులకు బదులుగా గ్రూప్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 17 మంది దాకా ఉంటారు. రకరకాల వయసున్నవారు ఒకచోట చేరతారు. స్కూల్‌కి రాగానే ఆ రోజు వారు చేయాల్సిన పనులను, పూర్తి చేయాల్సిన లక్ష్యాలను రాసుకుంటారు. ఇవి కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎవరికి తగ్గట్టు వారికి వేరుగా ఉంటాయి. ఒకరు సంగీతం నేర్చుకోవాలనుకుంటే మరొకరు పుస్తకం చదవాలన్నది పనిగా పెట్టుకుంటారు. మరొకరు ఆ రోజుకు ఒక బొమ్మ గీయడాన్ని లక్ష్యంగా మార్చుకుంటారు. టీచర్లు వారు చేయాలనుకున్న పనిలో సాయం చేస్తారు... కొట్టడం, కోప్పడటం లాంటివి చేయరు. ఆటల మీదే కాకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం అక్కడ రకరకాల విభాగాలున్నాయి. వంట నేర్చుకోవడం, శిల్పాలు చేయడం, చెక్కతో కళాకృతులు తయారు చేయడం, చిత్రలేఖనం, రోబోలు తయారు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కేవలం చదువుకోవాలనుకునేవారి కోసం ‘సైలెంట్ రూమ్స్’ ఉంటాయి. అందులోకి వెళ్లి, కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. రొటీన్ స్కూళ్లకు భిన్నంగా పిల్లలకు సృజనాత్మక విద్య నేర్పించాలనుకునే వారి కోసం 2014లో ఈ స్కూల్‌ని స్థాపించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పిల్లలు ఈ స్కూల్లో ఉంటారు. మొత్తం మూడు దేశాల్లో ఈ స్కూళ్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం 1800 మందికిపైగా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. -
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్ -
తినడానికి తిండిలేక,చెన్నై రోడ్లపై భిక్షాటన..ఇన్‌స్టా వీడియోతో పాపులారిటీ
కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి. బర్మాకు చెందిన మెర్లిన్ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. దుస్తులు కొనివ్వండి బాబూ... ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్కిడ్’అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోన్న మొహమ్మద్ ఆషిక్ కంటపడింది మెర్లిన్. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. యాచించ కూడదనీ... మెర్లిన్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్. తన విద్యార్థులసాయంతో... ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు. కొంతమంది ఆమెతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్‌పూర్‌లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్‌పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు. -
ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు
కథలాపూర్ (వేములవాడ): వందమంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దుస్థితి ఇది. ఇక్కడి ఐదు తరగతుల్లో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. దీంతో వల్లంపెల్లి పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఎనిమిదేళ్లుగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైందని ఎస్ఎంసీ చైర్మన్ కొక్కుల శంకర్, సర్పంచ్ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి -
కొత్త మెడికల్ కాలేజీల్లో బోధన.. ఫస్టియర్ ఎంబీబీఎస్ తరగతులు షురూ
సాక్షి, హైదరాబాద్: ఒక వైద్య విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రారంభం కావడం, ఆయా కాలేజీల్లో ఏకంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రావడం రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలవనుంది. 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల ల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు సహా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. 2014లో 850 ప్రభుత్వ సీట్లుండగా... ఇప్పుడు 2,815 తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 850 సీట్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక కాలేజీల సంఖ్య 17కు పెరగ్గా సీట్ల సంఖ్య 2,815కి పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో 4 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో కొత్తగా 12 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 కాలేజీలను ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొత్త మెడికల్ కాలేజీలన్నింటినీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలోకన్నా 3 రెట్లకుపైగా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. వచ్చే ఏడాది 9 కొత్త మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇప్పటికైనా కేంద్రం కొత్త కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేస్తున్నారు. ► 2014లో రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 20 కాలేజీలున్నాయి. ► 2022 (ప్రస్తుతం)లో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 24 ప్రైవేటు కాలేజీలు అయ్యాయి. ► 2014లో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వంలో 850, ప్రైవేటులో 2,100... మొత్తం 2,950 ► 2022లో ప్రభుత్వంలో 2,815 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులో 3,800 సీట్లు... మొత్తం 6,615 ► 2014లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 529, ప్రైవేటులో 601... మొత్తం 1,130 ► 2022లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 1,850, ప్రైవేటులో 613... మొత్తం 2,463 ► 2014లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో ఐదు, ప్రైవేటులో 74... మొత్తం 79 ► 2022లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో 9, ప్రైవేటులో 83... మొత్తం 92 చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
బాసర ట్రిబుల్ ఐటీలో ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్న తరగతులు
-
ఉదయమో గంట.. సాయంత్రమో గంట
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అదనపు క్లాసులు మొదలుకాబోతున్నాయి. ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజూ రెండు గంటలు ఎక్స్ట్రా క్లాసులు చెప్పబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ కాలేజీల్లో ఈ తరహా ఏర్పాట్లు చేస్తామని బోర్డు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ తొలి, రెండో సంవత్సర పరీక్షలకు టైమ్ టేబుల్ విడుదల చేయడం.. కరోనా వల్ల కొన్ని కాలేజీల్లో ఇంకా 50 శాతం కూడా సిలబస్ పూర్తవకపోవడంతో మార్చిలోగా సిలబస్ పూర్తి చేసేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 70% సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా.. ఇంటర్ విద్యార్థులకు సాధారణంగా జూలై, ఆగస్టులో క్లాసులు మొదలవ్వాలి. కరోనా వల్ల సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభించారు. దాదాపు నెల పాటు ఆన్లైన్లోనే బోధన సాగింది. గత నెల కూడా థర్డ్ వేవ్ వల్ల 25 రోజులు క్లాసులు నిర్వహించలేదు. దీంతో సిలబస్ పూర్తి చేయలేకపోయామని అధ్యాపకులు అంటున్నారు. లాంగ్వేజ్ సబ్జెక్టుల బోధనలో విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా ఆప్షనల్ సబ్జెక్టుల విషయంలో సిలబస్ ఆశించిన మేర పూర్తవ్వలేదని ఇటీవల బోర్డు గుర్తించింది. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో ఇప్పటికే 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా కొన్ని కాలేజీల్లో 50 శాతం కూడా పూర్తవ్వలేదని తెలిసింది. దీంతో ఈసారి కూడా 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. మార్చి ఆఖరు కల్లా 70% సిలబస్ పూర్తి చేసేలా.. సాధారణంగా ఇంటర్ బోధన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇక ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకు రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సంబంధిత అధ్యాపకులు బోధించే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు 70 శాతం సిలబస్ పూర్తి చేసి వారం రోజులు రివిజన్ చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు అధ్యాపక వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ సిలబస్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ నెల 15 తర్వాత రివిజన్ చేపట్టేందుకు ఆ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులూ ఉన్నారు. ప్రత్యక్ష క్లాసుల వల్ల పోటీ పరీక్షల టైం మార్చుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. సరిపడా అధ్యాపకులున్నారా? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న లెక్చరర్ల సంఖ్య 725 మాత్రమే. అతిథి లెక్చర్లు 1,658, కాంట్రాక్టు లెక్చరర్లు 3,700, పార్ట్‌టైం, మినిమమ్ టైం స్కేల్ మరో 100 మంది ఉంటారు. అయితే గెస్ట్ లెక్చరర్ల సేవలను సెప్టెంబర్ నుంచి 5 నెలల పాటు తీసుకుంటూ గతంలో ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇప్పటివరకు వీరిని పొడిగించేందుకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రత్యేక క్లాసుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 317 జీవో అమలులో భాగంగా దాదాపు 78 మందికి స్థానచలనం జరిగి కొన్ని ఖాళీలేర్పడ్డాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ విషయాలను బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
సిలబస్ టెన్షన్.. బుర్రకెక్కింది అంతంతే...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆన్లైన్ బోధన నేపథ్యంలో సిలబస్ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్నత తరగతులకు సిలబస్ 40 శాతం మించలేదు. గురుకుల విద్యాసంస్థల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిలబస్ కనీసం 20 నుంచి 30 శాతం మించలేదు. గత నెల రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ప్రత్యక్ష బోధనపై తీవ్ర ప్రభావం చూపించింది. బుర్రకెక్కింది అంతంతే... ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి మూడు నెలలు ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగగా, ఆ తర్వాత నాలుగు నెలల క్రితం విద్యా సంస్థలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నాటికి పూర్తయిన సిలబస్ ఆధారంగా గత నెలలో ఎస్ఏ– 1 పరీక్షలు నిర్వహించగా పాఠ్యాంశాలపై విద్యార్థుల పట్టు అంతంత మాత్రంగా బయటపడింది. కనీసం పదో తరగతి విద్యార్థులు సైతం పాఠ్యాంశాలపై పెద్దగా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులకే పరిమితం పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలకు బదులు ప్రాజెక్టులకు పరిమితమయ్యారు. పాఠ్యాంశాల బోధన పక్కనపెట్టి ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణమైంది. వాస్తవానికి సిలబస్ 30 శాతం కూడా మించలేదు. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగకపోవడంతో విద్యార్థులు పాఠ్యంశాలపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆన్లైన్ తరగతులే.. ► కరోనా మూడో దశ ఉద్ధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్లీ ఆన్లైన్ సిద్ధమయ్యాయి, సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపించాయి. తరగతుల షెడ్యూలు కూడా ప్రకటించాయి. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు) ► సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియడంతో తాజా కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభంలో మొదట మూడు నెలల పాటు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగినా బోధన వైరస్ ప్రభావం తగ్గుదలతో గత నాలుగు నెలలక్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. గత నెల చివరి అంకం నుంచి వైరస్ విజృంభిస్తుండటంతో ప్రత్యక్ష బోధన ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ముందస్తుగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతో సెలవులు పొడిగిస్తూ ఆన్లైన్ తరగతులకు వెసులుబాటు కల్పించింది. (చదవండి: తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త చట్టం కోసం..) -
Telangana: పునాదులకే నోచని కొత్త మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎనిమిది కొత్త వైద్య కళాశాలలను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించా లని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పటి ష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మెడికల్ కాలేజీల కోసం ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే జనవరిలోపు ఎప్పు డైనా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) బృందం ఆయా కాలేజీలు, హాస్టళ్ల భవనాలు, అధ్యాపకులు, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేస్తుంది. అప్పటిలోగా మొదటి ఏడాదికి తరగతులు ప్రారంభించేలా తాత్కాలిక భవనాలు నిర్మించాలి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పూర్తి చేయాలి. కానీ కీలకమైన తాత్కాలిక భవనాల నిర్మాణమే చాలాచోట్ల మొదలు కాలేదు. కొన్నిచోట్ల టెండర్ ప్రక్రియే ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. రూ.4,080 కోట్ల వ్యయం తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2022–23 వైద్య విద్యా సంవత్సరం నుంచి మరో ఎనిమిది కాలేజీలు ఒకేసారి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కో కాలేజీ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.510 కోట్లు కేటాయించింది. అంటే ఎనిమిది కాలేజీలకు రూ.4,080 కోట్లు ఖర్చు కానుంది. ఇక ఒక్కో కాలేజీకి 20 ఎకరాల భూమి కనీసం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒకే చోటనైనా లేదా 10 కిలోమీటర్ల పరిధిలో రెండు చోట్ల భూమి ఉన్నా నిబంధనల ప్రకారం అనుమతిస్తారు. ఆయా ప్రాంతాల్లో భవనాల నిర్మాణం ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. శాశ్వత భవనం వచ్చే వరకు తాత్కాలికంగా.. కాలేజీ భవనాలను శాశ్వత పద్ధతిలో నిర్మించాలంటే కనీసం 18 నెలలు పడుతుంది. కాబట్టి ప్రీ–ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో మొదటి ఏడాది తరగతుల కోసం కాలేజీ భవనం, పరిపాలనా భవనం, హాస్టల్ తాత్కాలికంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే పరికరాలు, మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సి ఉంటుంది. హాళ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, డెమో గదులు వంటి వాటిని నిర్మించాలి. శాశ్వత కళాశాల భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత, తాత్కాలిక భవనాలను నర్సింగ్ సహా పారా మెడికల్ కోర్సులు మొదలైన వాటి కోసం ఉపయోగిస్తారు. ప్రీ–ఫ్యాబ్రికేటెడ్ నిర్మించాలన్నా 3 నెలలు ఇలా తొలుత తరగతులు ప్రారంభించేందుకు కీలకమైన తాత్కాలిక భవనాలను నవంబర్, డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని గతంలో అనుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ.. కాలేజీ భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మహబూబాబాద్‌లో స్థలాన్ని గుర్తించినా వివాదాల వల్ల అక్కడ కాలేజీ నిర్మాణం మొదలు కాలేదు. జగిత్యాలలోని థరూర్ క్యాంపులో 27 ఎకరాల స్థలం గుర్తించినా, అక్కడా భవన శంకుస్థాపన జరగలేదు. ప్రీ–ఫ్యాబ్రికేటెడ్ భవనాలను నిర్మించాలన్నా మూడు నెలలు పడుతుంది. ఎన్ఎంసీ బృందం ముందస్తుగా చెప్పి తనిఖీలకు రాదు. జనవరి నాటికి అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో కీలకమైన నిర్మాణాలే పూర్తి కాకపోతే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నా కూడా నిర్మాణాలు, టెండర్లు, ఇతర భూముల స్వాధీనం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పడకల సంఖ్యను విస్తరించాలి కాలేజీలను స్థాపించాలంటే అనుబంధంగా బోధనాసుపత్రులు ఉండాలి. స్థానికంగా ఉండే ఆసుపత్రులను కాలేజీలకు అనుబంధంగా కొనసాగించాలంటే నిబంధనల ప్రకారం ఒక్కోదాంట్లో 330 పడకలు ఉండాలి. వాటిల్లో 30 ఐసీయూ పడకలు ఉండాలి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలు ఉన్నాయి. అక్కడ ఇబ్బంది లేదు. మిగిలిన చోట్ల పడకల సంఖ్యను 330కు విస్తరించాల్సి ఉంది. బోధనాసుపత్రుల్లో పరికరాల ఏర్పాటు వంటి వాటిని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ), తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐసీ)కు అప్పగించారు. వాటిల్లో పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయంటున్నారు. ఇక అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. అందుకు సంబంధించి కొందరిని పదోన్నతుల ద్వారా, మరికొందరిని సరెండర్ల ద్వారా, ఇంకొందరిని నేరుగా భర్తీ చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టీఎస్ఎంఎస్ఐడీసీకి కాకుండా ఆర్‌అండ్‌బీకి కాలేజీ భవనాల నిర్మాణం అప్పగించడంతో ఆ సంస్థలో అసంతృప్తి నెలకొంది. సంగారెడ్డి మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన టెండర్ ప్రక్రియకు ఆశించిన మేర స్పందన రాలేదు. తొలి నోటిఫికేషన్‌కు ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీంతో బిడ్ దాఖలు తేదీని ఆర్ అండ్ బీ పొడిగించింది. అయినా కేవలం ఒక్క కంపెనీ మాత్రమే బిడ్ దాఖలు చేయడంతో ఆ ప్రక్రియ కాస్తా ఆగిపోయింది. దీంతో కాలేజీకి కేటాయించిన భూమిలో ఆర్ అండ్ బీయే భవన నిర్మాణానికి తవ్వకాలు ప్రారంభించింది. ప్రస్తుతమున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,640 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కొత్తగా వచ్చే ఎనిమిది కాలేజీల్లో 150 చొప్పున 1,200 సీట్లు అదనంగా రానున్నాయి. మొత్తంగా 2,840 ప్రభుత్వ సీట్లతో తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో ఇదో నూతన అధ్యాయం అవుతుంది. కొత్త వైద్య కళాశాలలిక్కడే సంగారెడ్డి వనపర్తి, జగిత్యాల మహబూబాబాద్ నాగర్‌కర్నూల్ కొత్తగూడెం మంచిర్యాల రామగుండం ఇది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమి. భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించినా ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు. ఇంకా శంకుస్థాపన కూడా కాలేదు. అంతేకాదు అసలు టెండర్ ప్రక్రియే మొదలు కాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. మొదటి ఏడాది కోర్సుకు ఉండాల్సిన అధ్యాపకుల సంఖ్య హోదా పోస్టుల సంఖ్య ప్రొఫెసర్లు 06 అసోసియేట్ ప్రొఫెసర్లు 17 అసిస్టెంట్ ప్రొఫెసర్లు 31 ట్యూటర్లు/డెమోనిస్ట్రేటర్లు 17 సీనియర్ రెసిడెంట్లు 26 –––––––––––––––––––––––––––– మొత్తం 97 –––––––––––––––––––––––––––– -
సమాధుల మధ్య ఆన్ లైన్ క్లాసులు
-
ఆన్‘లైన్’ తప్పుతున్న చదువులు
ఈ ఫోటోలో బర్రెలు కాస్తున్న విద్యార్థి కడారి శివ. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి. ఓ ప్రైవేట్ పాఠశాలలో అతను 7వ తరగతి, అక్క నందీశ్వరి 8వ తరగతి చదువుతున్నారు. ఇంట్లో ఒకే స్మార్ట్‌ఫోన్ ఉంది. ఇద్దరూ పాఠాలు వినలేని పరిస్థితి. దీనితో నందీశ్వరి పాఠాలకు హాజరవుతుండగా.. శివ బర్రెలు కాయడానికి వెళుతున్నాడు. (పాపం పసివాళ్లు.. ఆన్లైన్ పాఠాల్లేవ్.. పనులే) స్మార్ట్ ఫోన్లు లేక.. పశువులు కాస్తూ.. ఈ ఫొటోలో ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తమారేడుబాకకు చెందిన విద్యార్థులు కల్లూరి సాయి, వర్షసాగర్. ఆన్లైన్ క్లాసులు వినడానికి స్మార్ట్ఫోన్లు లేక పశువులు కాసేందుకు వెళ్తున్నారు. సిగ్నల్ సరిగా లేక పొలానికి.. నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లికి చెందిన పుష్పలత –భూషణ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు రుత్విక, కార్తీక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా రాక ఆన్లైన్ క్లాసులు వినే పరిస్థితి లేదు. దానికితోడు ఇద్దరూ చిన్న పిల్లలు కావడంతో తల్లిదండ్రులు పొలానికి తీసుకెళ్తున్నారు. తండ్రితో కలిసి పశువుల వెంట.. ఈ ఫోటోలోని విద్యార్థి మల్లెబోయిన వరుణ్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు లేకపోవడం, ఆన్లైన్ క్లాసులకు హాజరవడంతో ఇబ్బందులతో తండ్రితో కలిసి పశువులు, మేకలు కాయడానికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి బావి వద్ద చిన్నచిన్న వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వీడియోలు చూస్తున్నాడని... మంచిర్యాల జిల్లా ధర్మారం శివార్లలోని పొలాల వద్ద పత్తిచేనులో కలుపుమొక్కలు తీస్తున్న బాలుడి ఇతను. స్మార్ట్‌ఫోన్ ఇస్తే ఆన్లైన్ క్లాసులు వినకుండా వీడియోలు చూస్తున్నాడని, ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నాడని.. అందుకే పత్తి చేనుకు తీసుకొచ్చి పనిచెప్పామని కుటుంబీకులు చెప్తున్నారు. ఇంటిపెద్ద కరోనాకు బలవడంతో.. ఈ ఫొటోలో ఉన్న మహిళ నిర్మల, కుమారుడు నితిన్, కూతురు నిఖిత. వారిది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం. ఆమె భర్త భాస్కర్ మూడు నెలల కింద కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయన చికిత్స కోసమని చేసిన రూ.3 లక్షల అప్పులు తీర్చాల్సిన బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన అత్తను పోషించాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థంకావడం లేదని పిల్లలు చెప్పడంతో.. ఆర్థిక ఇబ్బందులైనా తప్పుతాయన్న ఉద్దేశంతో వారిని వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నట్టు నిర్మల ఆవేదన వ్యక్తం చేసింది. బడులు తెరిస్తే పంపిస్తానని తెలిపింది. తాంసిలో కలుపు మొక్కలు తీస్తున్న సాయితేజ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సాయితేజ 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ లేకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి పంట చేనుకు వెళ్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి కలుపు మొక్కలు తీస్తూ కనిపించాడు. పత్తి చేనులో కలుపుతీస్తూ.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నాగారానికి చెందిన శ్రీను, వంశీ, అఖిల్, జైతు బుధవారం పత్తి చేన్లలో కలుపు తీస్తూ కనిపించారు. ఆన్లైన్ క్లాసులు వినడం లేదా? అని ప్రశ్నించగా.. ‘క్లాసులు సరిగా జరగడం లేదు, వ్యవసాయ పనులకే వెళ్తున్నాం’ అని చెప్పారు. -
ఏపీలో ఈ నెల 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
-
ఏపీ: 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. -
స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య
సాక్షి, కొత్తగూడ(వరంగల్): ఆన్లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... కూస త్రిష(16) గత విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయని తనకు స్మార్ట్ ఫోన్ కావాలని తండ్రి సంపత్‌ను కోరింది. పెట్టుబడి సమయమని, డబ్బులు లేవని కొద్ది రోజులు ఆగాలని తండ్రి అనడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. తరువాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆన్లైన్ క్లాస్‌లోకి హ్యాకర్.. పోర్న్ వీడియోలతో రచ్చ
ముంబై : కాలేజ్ ఆన్లైన్ క్లాసులోకి చొరబడ్డ ఓ హ్యాకర్ రచ్చ రచ్చ చేశాడు. పోర్న్ వీడియోలు ప్లే చేసి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, పిలే పార్లేలోని ఓ కాలేజ్ గత కొద్దిరోజులుగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా ఓ హ్యాకర్ లోపలికి ప్రవేశించాడు. పోర్న్ వీడియోలు ప్లే చేశాడు. దాదాపు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు.. మహిళా లెక్చరర్లు ఉన్న ఆ ఆన్లైన్ క్లాసులో కలకలం మొదలైంది. దీంతో ఆన్క్లాసును రద్దు చేశారు. ఆ వెంటనే కాలేజ్ యజమాన్యం జుహు పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి కాలేజ్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి, సరదా కోసం పోర్న్ వీడియోలు ప్లే చేశాడని తెలిపారు. నిందితుడిని అతడి ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. చదవండి : నగ్నంగా బీచ్‌లో.. ఊహించని ఘటనతో పరుగో పరుగు -
గూగుల్ మీట్: స్టూడెంట్స్-టీచర్లకు పనికొచ్చేలా..
న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్ ఫ్లాట్‌ఫామ్ గూగుల్ మీట్ కొన్ని కొత్త ఫీచర్స్‌ను తీసుకురాబోతోంది. ఆన్లైన్ క్లాస్ నిర్వాహణకు వీలుగా ఆ ఫీచర్లను డెవలప్ చేయించింది. అడ్మిన్లు, టీచర్లు, స్టూడెంట్స్ లక్క్ష్యంగా రూపొందించిన ఈ ఫీచర్లు.. చాలావరకు ఇబ్బందుల్ని తొలగిస్తాయని గూగుల్ మీట్ భావిస్తోంది. ఇక తాజా ఫీచర్ల వల్ల అడ్మిన్స్‌కి మీట్‌పై ఎక్కువ నియంత్రణ దక్కనుంది. కొత్తగా హ్యాండ్ రైజింగ్, లైవ్ క్యాప్షన్స్ ఫీచర్స్ తేనుంది. అంతేకాదు గూగుల్ మీట్ త్వరలో పబ్లిక్ లైవ్ స్ట్రీమ్స్ ఆఫ్షన్‌ను కూడా అనుమతించబోతోంది. అది కూడా నేరుగా యూట్యూబ్ ద్వారా కావడంతో పేరెంట్స్, పిల్లలు.. ఎవరైనా సరే ఆ మీటింగ్‌లకు అటెండ్ కావొచ్చు. అంతేకాదు ‘గూగుల్ మీట్ యూజర్ ఇంటర్ఫేస్’ ద్వారా టీచర్లు తమ ప్రజంటేషన్ సమీక్షతోపాటు స్టూడెంట్స్ ప్రజంటేషన్ను కూడా పరిశీలించేందుకు వెసులుబాటు కలగనుంది. ఇక టీచర్లు గూగుల్ నోట్ సెల్ఫ్ ఫీడ్‌ను మినిమైజ్ చేసి మరింతమంది స్టూడెంట్స్‌ను కాల్లో చేర్చుకోవడానికి వీలుంటుంది, అలాగే స్టూడెంట్స్ పేర్లు కూడా డిస్ప్లేపై కనిపిస్తాయి. డౌట్ వస్తే చెయ్యెత్తి.. స్టూడెంట్స్, టీచర్ల మధ్య కమ్యూనికేషన్ కోసం హ్యాండ్ రెయిజ్ ఐకాన్(చెయ్యి ఎత్తే సింబల్)ను, దానికి తగ్గట్లు సౌండ్‌ను డెవలప్ చేసింది గూగుల్ మీట్. తద్వారా స్టూడెంట్లు టీచర్లను కాంటాక్ట్ అవ్వొచ్చు. అలాగే అడ్మిన్ ఆ లిస్ట్‌ను గమనించి.. ఆర్డర్ ప్రకారం ఆ స్టూడెంట్ లిస్ట్‌ను సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టూడెంట్ అనుమానం నివృత్తి అయ్యిందంటే.. ఆటోమేటిక్‌గా ఆ హ్యాండ్ సిబల్ డల్ అయిపోతుంది. మరో ముఖ్యమైన ఫీచర్.. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఎప్పటికప్పుడు అవతలివాళ్లకు తగ్గ భాషలోకి తర్జుమా చేసి చూపిస్తుంది. ఈ ఫీచర్స్‌తో పాటు హోస్ట్, టీచర్లు వీడియోలకు లాక్ వేసే వీలు, టాబ్లెట్.. మొబైల్ ఫోన్ల కోసం కూడా సేఫ్టీ కంట్రోల్ ఫీచర్లు కూడా రాబోతున్నాయి. ఈ ఏడాది బీటా వెర్షన్‌ను ప్రవేశపెట్టి.. వచ్చేడాది మొదట్లో నుంచి ఈ ఫీచర్లను యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనుంది గూగుల్ మీట్. చదవండి: గూగుల్ ఫొటోస్‌లో ఉన్న ఫీచర్ ఇప్పుడు.. -
రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రత్యక్ష బోధనను రోజు విడిచి రోజు చేపట్టాలని.. నడుమ రోజుల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఇష్టమైతేనే భౌతికంగా తరగతులకు హాజరుకావొచ్చని, హాజరు నిబంధన ఏమీ అమలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు గురువారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులను ప్రారంభించాలని సూచించింది. విద్యార్థులకు ఒక రోజు ప్రత్యక్ష (ఆఫ్‌లైన్) బోధన చేపడితే.. తర్వాతి రోజు జూమ్, వీబాక్స్, గూగుల్ మీట్ వంటివాటి ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థుల నుంచి అంగీకారపత్రం (కన్సెంట్) కచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది. 75 శాతం హాజరు తప్పనిసరి కాదని తెలిపింది. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా 70శాతం సిలబస్ నే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే సిలబస్‌పై జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్రంలో అమలు చేస్తామని వెల్లడించింది. తరగతుల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆన్లైన్ బోధన, ఇతర సమాచారం కోసం లెక్చరర్లు, విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించింది. బడులు, కాలేజీలకు టీచర్లు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఈ నెల 25 నుంచి స్కూళ్లు, కాలేజీలకు హాజరుకానున్నారు. జూలై 1 నుంచి తరగతులను ప్రారంభించనున్న నేపథ్యంలో.. ప్రత్యక్ష/ఆన్లైన్ బోధన కోసం టీచర్లు, లెక్చరర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ, ఇంటర్ బోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశాయి. ఇక స్కూళ్లలో జూలై 1 నుంచి 8, 9, 10 తరగతులకే ప్రత్యక్ష బోధన నిర్వహిస్తారా? మిగతా తరగతులకూ చేపడతారా అన్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. కాగా జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయకుండా విద్యా బోధన ఎలా ప్రారంభిస్తారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1,658 మంది గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. -
గూడెం గ్రాడ్యుయేట్..ఆఫ్‌లైన్‌లో లైఫ్ ఇస్తోంది
సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాస్ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్ క్లాస్ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్లు ఉంటాయా? నెట్ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్ వేవ్ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్లైన్లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్ సౌకర్యమూ, నెట్ కనెక్షన్ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి.. తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి. సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్ ఫ్రమ్ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య. -
జులై మధ్య నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆన్ లైన్ క్లాసులు
-
కవర్ స్టోరీ: ఏడాది@ ఇల్లేనా!
‘నాన్నా... ఈ బిల్డింగ్‌ని ఎక్కడో చూసినట్టుంది.. దీని ముందు నుంచి వెళ్తుంటే ఏవేవో గుర్తొస్తున్నాయి’ అంటాడు ఓ పిల్లాడు. ‘ఒరేయ్.. అది నీ స్కూల్ రా.. ’ అని చెప్తాడు తండ్రి.ఇదొక జోక్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ అదో విషాదం. పిల్లలకు శాపం. కారణం కరోనా అని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం ఈ విద్యా సంవత్సరాన్ని గైర్హాజర్ చేసింది.. థర్డ్ వేవ్ హెచ్చరికలతో వచ్చే విద్యా సంవత్సరానికీ సిక్ లీవ్ మంజూరు చేసే ప్రమాదాన్ని చూపిస్తోంది. మరి బడులు? ఆ ప్రాంగణంలో వికసించే బాల్యం? పాఠశాల అంటే నల్లబల్ల – సుద్దముక్క, బెంచీలు – టేబుళ్లు, టీచర్లు – పాఠాలే కాదుకదా! ఆట.. పాట.. అల్లరి..సరదా.. సంతోషం.. స్నేహం.. వైరం.. పోటీ.. ప్రయత్నం.. గెలుపు.. ఓటమి..ఫిర్యాదు – ప్రశంస.. వాదన – రాజీ.. సమ్మతి – వ్యతిరేకతలను నేర్పిస్తుంది కదా! చూడబోయే ప్రపంచానికి కిటికీ.. సాధించబోయే పరిణతికి పలకా, బలపం అవుతుంది. కొత్త విషయాలను దిద్దిస్తుంది.. చేసిన తప్పులను చెరిపేయిస్తుంది...పుస్తకాల్లో ఉన్నదాంతో పరీక్షలకు సిద్ధం చేయిస్తే.. ఆవరణలో ఉన్న అంశాలతో జీవితానికి సంసిద్ధం చేయిస్తుంది!నేననే స్వార్థం.. నువ్వనే భేదం.. మనమనే ఐకమత్యం బోధపడేదక్కడే! ఆలోచన మొలకెత్తెదీ.. అభిప్రాయం విరిసేదీ ఆ తోటలోనే.. రహస్యాలను పొదగడం.. ఛేదించడం ఆరంభమయ్యేదీ ఆ ప్రహరీలోనే.. నమ్మకాలు పెంచుకునేది.. నమ్మకంగా నడిపించుకునేదీ ఆ వేదిక నుంచే మొదలు.. కలివిడితనం.. కలహించే ధైర్యం.. నిలబడే నాయకత్వం అలవడేది అక్కడే.. కలలను పరిచయం చేసి.. లక్ష్యాలను ఏర్పర్చుకునే సత్తానిచ్చేదీ అదేబతుకుసాగరంలో వేటకు లౌక్యపు నావ.. ఇంత తత్వం.. జీవన శాస్త్రం ఒంటబట్టించే బడిని.. ఆరోగ్యకరంగా పెరిగే అవకాశాన్నీ శాసిస్తోంది కరోనా! లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడి పిల్లల మానసికస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అనేక సర్వేలు చెబుతున్నాయి. మొదటిసారి బడిలో ప్రవేశం పొందాల్సిన పిల్లల దగ్గర నుంచి పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయిన విద్యార్థుల వరకు అందరి పరిస్థితి ఒకటే. మన దేశంతోపాటు 188 పైనే దేశాలు బళ్లు మూసివేసి.. డిజిటల్, రేడియో వంటి పలు మాధ్యమాలతో విద్యను అందిస్తున్నాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమవుతున్న పిల్లలు చాలా ఒత్తిళ్లకు లోనవుతున్నారు. కరోనా కన్నా దాని ప్రభావిత బాధితుల్లో అధిక స్థానం పిల్లలదే అంటున్నారు మానసిక నిపుణులు. లాక్డౌన్లో వేధింపులు, వారి బాగోగులను పట్టించుకోని కారణంగా ఎంతోమంది చిన్నారులను మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని చెప్తున్నారు. మరింత శ్రద్ధ తప్పదు తోటివిద్యార్థుల సాంగత్యం లేకపోవడంతో పిల్లలు తెలియకుండానే చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారు. డిజిటల్ పాఠాల విషయానికి వస్తే.. ఆన్ లైన్ క్లాసులకు, సాధారణ క్లాసులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రత్యక్ష తరగతి బోధనలో టీచర్ చెప్పే విషయాన్ని విద్యార్థి ఫాలో అవుతున్నాడో లేదో మనం గమనించి తర్పీదు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఆన్లైన్లో అలా కుదరదు. అది కూడా 50% విద్యార్థులు మాత్రమే వీటిని వినగలుగుతున్నారు. పైగా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో నెట్ వర్క్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్ప మరో మార్గం లేదు. విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ చదువు గురించే కాకుండా వాళ్లతో కాస్త సరదాగా గడపడం అవసరం. పి. వి. రామరాజు, శ్రీ బాలాజీ కాన్వెంట్ హెడ్ మాస్టర్, ముమ్మిడివరం, తూర్పు గోదావరి అన్ని కోణాల్లో చూడాలి సాధారణంగా పిల్లలు హాలీడేస్ కోరుకుంటారు కాబట్టి లాక్ డౌన్ వాళ్లకు అసలు సమస్యే కాదు అనుకుంటాం. మొదట్లో సెలవు దినాల్లో ఉండే వినోదంతో పాటు.. అనువుగా ఉండే చదువు విధానాన్ని పిల్లలు ఆనందంగానే స్వీకరించారు. నెలలు గడుస్తున్న కొద్దీ క్రమంగా వాళ్లకి తెలియకుండానే అవాస్తవిక ప్రపంచంలోకి వెళ్లిపోయారు. దాంతో లెర్నింగ్ మెకానిజం అంతా వర్చువల్ అయిపోయింది. నేర్చుకోవడం ఎలాగో తప్పుదు.. దానికి తోడు పెరుగుతున్న ఒత్తిడి, బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడం ఇదంతా కలిసి పిల్లల్లో డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ కలిగిస్తున్నాయి. ఇదివరకూ ఈ ఫ్రస్ట్రేషన్, ఈ డిప్రెషన్ కాస్తోకూస్తో ఉన్నా ఫ్రెండ్స్, ఆటపాటలు వంటి వాటితో సేద తీరేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. పిల్లల్లో విపరీతమైన కోపం, చిరాకు, చదువు మీద ఆసక్తి తగ్గడం, మూడీగా ఉండటం, ఎదురు సమాధానాలు చెప్పడం, వద్దన్న పని చెయ్యడం, బిగ్గరగా అరవడం, చిన్నదానికే ఏడవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లల ఈ తీరును ‘ఈ మధ్య అల్లరి ఎక్కువైంది’ అని చాలా సింపుల్‌గా తీసుకుంటున్నాం. కానీ ఇదొక సమస్య. దీన్ని అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ అంటారు. అంటే సానుకూలంగా అనిపించని ఒక పరిస్థితికి అడ్జెస్ట్ అవ్వడం. పిల్లలకు ఇబ్బందికరంగా మారినప్పుడు వారి మాటల్లో కంటే చేతల్లోనే ఎక్కువ మార్పు కనిపిస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ‘ఎంతకాలం మేము ఈ నాలుగు గోడల మధ్యనే ఉండాలి?’ అనే ప్రశ్న పిల్లల్ని డిప్రెషన్ కి గురి చేస్తోంది. ఏవరేజ్, అబౌ ఏవరేజ్ పిల్లలతో పోలిస్తే బిలో ఏవరేజ్ పిల్లలకు.. ఆన్ లైన్ క్లాసుల సారాంశం 10 – 15 శాతం కూడా మైండ్‌కి ఎక్కదు. దాంతో వాళ్లకి, వీళ్లకి మధ్య మానసికమైన చాలెంజ్‌తో పాటు అకడమిక్ ఇయర్ ల్యాగ్ అనేది ఏర్పడిపోతుంది. ఆ గ్యాప్‌ని కవర్ చేయడానికి ప్రత్యేకమైన క్లాసులు, ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. అయితే ఇప్పటి దాకా మనం తెలుసుకున్నది అడ్జెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. భవిష్యత్‌లో రి–అడ్జెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. అంటే ఇంత దీర్ఘకాలికంగా ఇంటిపట్టునే ఉండిపోతున్న ఈ పిల్లలు మళ్లీ రియల్ టైమ్ స్కూల్స్‌కి వెళ్లి, ఆ వాతావరణానికి అడ్జెస్ట్ అయ్యి, ఆ టీచర్స్, తోటివారిని చూస్తూ.. క్లాసులో కంటిన్యూగా కదలకుండా కూర్చోవడం కష్టమవుతుంది. ఇంట్లో ఉండి పాఠం వినేదానికి స్కూల్లో కూర్చునేదానికి తేడా ఉంటుంది. అప్పుడు కూడా పిల్లలు అంత పద్ధతిగా ఉండగలరా? అంటే కష్టమే. మళ్లీ దారిలో పడటానికి దగ్గరదగ్గరగా ఆరు నెలలు టైమ్ పడుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా వాటిని పక్కనపెట్టి.. వాళ్లతో కూర్చుని కబుర్లు చెబుతుండాలి. వాళ్లు చేసిన పనిని వెంటనే తప్పుబట్టకుండా, మిగతా పిల్లలతో పోల్చకుండా రిలాక్స్డ్గా, బ్యాలెన్స్డ్గా నవ్వుతూ పిల్లలతో మెలిగితే వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అల్లరీ తగ్గుతుంది. వినే ఓపిక పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల సైకాలజీ.. పేరెంట్స్ సైకాలజీ, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. -డా. కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ చైల్డ్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్ ఫ్రెండ్స్‌కి దూరమయ్యా.. ఈ ఏడాదే నాది టెన్త్ పూర్తి అయ్యింది. ఢిల్లీలోని హోలీ ఏంజెల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాను. లాక్ డౌన్ వల్ల లాస్ట్ ఇయర్ అంతా ఆన్ లైన్ క్లాసులతోనే ముగిసింది. ఇదే చివరి ఏడాది కావడంతో అన్నేళ్ల పాటు కలిసి చదువుకున్న నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోకుండా, కనీసం సెండాఫ్ కూడా తీసుకోకుండానే మా ఊరికి వచ్చేయాల్సి వచ్చింది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నా. ఫేవరెట్ టీచర్, ఫేవరెట్ క్లాస్ ప్రతీది మిస్ అయ్యా. నేను టెన్త్‌కి రాగానే.. కాలేజ్ లైఫ్ గురించి చాలా ఊహించుకునేవాడ్ని. కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, ఫ్యూచర్ గోల్స్.. ఇలా చాలానే అనుకున్నాను. ఇప్పట్లో తీరేలా లేవు. – బుద్దుల సాయి గణేష్, స్టూడెంట్, ఖాజురు (శ్రీకాకుళం) ఆ ఆనందం సాటి రాదు కదా.. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో ఫస్ట్ రోల్ పాఠశాలదే. టీచర్ చెప్పే పాఠాలతో పాటు తోటి పిల్లలను కలుసుకోవడం, వారితో స్నేహం చెయ్యడం, కలిసి తినడం, ఆడుకోవడం, చదువుకోవడం అదంతా పిల్లల మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేస్తుంది. స్కూల్స్ మూతపడటంతో మా అబ్బాయి ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు తరగతి గది పాఠాల లోటును పూరించినా, తమ ఈడు పిల్లలతో ఆడుతూ, పాడుతూ పొందే ఉత్సాహాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. పెద్ద వాళ్లం పిల్లలుగా మారి వాళ్లతో ఎన్ని కబుర్లు చెప్పినా.. ఎంత ఆడించినా తోటి పిల్లలతో పొందే ఆనందం సాటి రాదు కదా అది! – మాకిరెడ్డి వర ప్రసాద్ (పేరెంట్), నర్సీపట్నం, విశాఖపట్నం పిల్లలకు నచ్చేలా.. వాళ్లు మెచ్చేలా.. ఈ సంక్షోభం వల్ల మనం అవలంబిస్తున్న ఆన్లైన్ క్లాసులు పిల్లల మీద తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నాయి. పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, తాపత్రయం దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. బడిలో చెప్పే పాఠాలే పిల్లలకు మంచిది. క్లాసులో టీచర్ పిల్లలను గమనిస్తూ పాఠం చెప్పటం వల్ల వాళ్ల మానసిక స్థితిని అంచనా వేయగలం. పాఠం అర్థం చేసుకోలేక పోతుంటే మరింత వివరంగా చెప్పే వీలవుతుంది. అయితే లాక్ డౌన్లో వర్చువల్ క్లాసులు తప్పవు కాబట్టి.. పిల్లలకు నచ్చేలా.. వాళ్లు మెచ్చేలా ఆన్లైన్ క్లాసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. క్లాసులు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. మొబైల్, ల్యాప్ టాప్లలో క్లాసులు శ్రద్ధగా వింటున్నారా లేక వేరే స్క్రీన్స్ ఆన్ చేసి కాలక్షేపం చేస్తున్నారా అన్నది తప్పక పరిశీలించుకోవాలి. బాధ్యతగా పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. – వై రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్, M.SC, M.Phil, B.Ed, శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ (స్విస్), హైదరాబాద్ స్టూడెంట్.. టీచర్.. ఫ్రెండ్స్‌గానూ.. పిల్లల టైమ్ టేబుల్‌ను కరోనా కంటే ముందు తర్వాత అని చూడాల్సి వస్తోంది. స్కూల్‌కి వెళ్లి రావడం, ఫ్రెషప్ అయ్యి హోమ్ వర్క్ చేసు కోవడం.. తర్వాత పక్కింటి పిల్లలతో ఆడుకోవడం.. ఇలా వాళ్లకంటూ కొంత సరదా, సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లను ఇల్లు దాటిపోనివ్వట్లేదు. చదువులేమో ఆన్లైన్ అయిపోయే. వాళ్లతో ఆడేవారు, పాడేవారు లేక ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. పైగా ఈ ఆన్ లైన్ క్లాసులతో పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్‌గా, అటు టీచర్స్గానూ మారాల్సి వస్తోంది. మిగిలిన సమయంలో వాళ్లతో ఆడుతూ పాడుతూ వాళ్లకు ఫ్రెండ్స్‌గానూ ఉండాల్సి వస్తోంది. ఇలా పిల్లల మీద కరోనా ప్రభావం లేకుండా వాళ్లను నార్మల్‌గా ఉంచేందుకు పేరెంట్స్ చాలానే కష్టపడాల్సి వస్తోంది. నిజంగానే స్కూల్ విలువ తెలిసి వస్తోంది. – బొద్దుల స్వర్ణలత (పేరెంట్) గోకుల్ నగర్, మల్లాపూర్, హైదరాబాద్ స్కూల్ మిస్సవుతున్నాం స్కూల్ ఉంటే ఫ్రెండ్స్‌ని కలవటం, రెగ్యులర్‌గా క్లాసులకు వెళ్లటం జరిగేది. స్పోర్ట్స్ పీరియడ్లు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి. నాకు ఆన్ లైన్ క్లాసులు మొదట్లో ఇబ్బందిగా అనిపించేవి. కానీ ఇప్పుడు అలవాటు అయ్యాయి. ఆన్ లైన్ పరీక్షలు కూడా రాయగలుగు తున్నా. ఆన్ లైన్లో క్విజ్లు, సర్వేలు బాగుంటున్నాయి. ఇది భవిష్యత్‌లో ఆన్ లైన్ పరీక్షలు రాసేందుకు ఉపయోగపడొచ్చు. కానీ స్కూల్నైతే రీప్లేస్ చేయలేవు. మా స్కూల్‌ని చాలా మిస్ అవుతున్నా. త్వరగా అంతా మామూలుగా అయిపోతే బాగుండు! – కావ్యశ్రీ రత్న, టెన్త్ క్లాస్ స్టూడెంట్ (హైదరాబాద్) ముందు జాగ్రత్తలు అవసరం లాక్ డౌన్ ప్రభావంతో చాలా మంది పిల్లలు సమాచారం మొత్తం మొబైల్లోనే ఉంటుందన్న ఆలోచనలతో ఇమేజినరీ వరల్డ్‌కి వెళ్తున్నారు. ముఖ్యంగా 13–18 సంవత్సరాల పిల్లలపై ఈ చెడు ప్రభావం ఎక్కువగా ఉంది. నాలెడ్జ్‌కి, ఇన్ఫర్మేషన్కి మధ్య తేడాను గుర్తించే శక్తి టీనేజ్‌లో ఉండదు. బాహ్య ప్రపంచం నుంచి పొందే జ్ఞానం తగ్గిపోతుంది. మొబైల్ వాడకం ఎక్కువ కావడం వల్ల మొబైల్ అడిక్షన్ ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంది. దీన్ని నోమో ఫోబియా అంటారు. వీటికి పరిష్కారమార్గాలు.. ఇంట్లో ఒక టైం టేబుల్ వేసుకుని దాన్ని ఫస్ట్ పేరెంట్స్ పాటించాలి. ఉదాహరణకు ఆన్ లైన్ క్లాస్ ఓ 30 నిమిషాలు ఉంటే.. ఆ టైంలో తప్ప మిగిలిన టైంలో మొబైల్ యూజ్ చేయకుండా చూడాలి. మంచి అభిరుచి ఉన్న పుస్తకాలను చదివేటట్టు చేయాలి. థర్డ్ వేవ్ గురించి పిల్లల్లో ఉన్న భయాలను పొగొట్టాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికి ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయించాలి. ఐదు నుంచి పది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయించాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులదే కాబట్టి వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయాలి. – డా. గంగం సిద్ధా రెడ్డి, డిస్ట్రిక్ట్ సైకియాట్రిస్ట్ (DMHP), దావణగెరే (జిల్లా), కర్ణాటక విరక్తి పుడుతోంది.. ‘ఒంటరితనంతో బాధపడుతున్నా. విరక్తి పుడుతోంది’ అంటూ.. పదహారేళ్ల ఓ బాలుడి నుంచి ఒక హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్ కాల్ అది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చెప్పుకున్నాడు. ఇలాంటి కాల్స్ తమకు చాలానే వస్తున్నాయని ‘నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు చిల్డ్రన్’ అనే చైల్డ్ హెల్ప్ లైన్ సంస్థ వెల్లడించింది. ‘మనం స్కూళ్లను మూసేసి, పిల్లల జీవితాలనే మూసేశాం’ అని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ ’ అనే సంస్థ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ రస్సెల్ వినర్ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా పిల్లల మానసిక సమస్యలకూ వైద్యాలయాలు ఈ విద్యాలయాలు అని. కరోనా కారణంగా అవి మూతపడి పిల్లల మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం పడినట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేల్లో వెల్లడవుతోంది కూడా. భయపెడుతున్న గణాంకాలు ఈ కాలానికి ముందే సగం బాల్యాన్ని హైజాక్ చేసేసింది ఆధునిక సాంకేతికత. కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కసరత్తుకు దూరం చేసింది. సామాజిక సంబంధాలను డిక్షనరీలో ఓ అర్థంగా మార్చింది. ఆ దుష్ప్రభావాలను గ్రహించి ఆ జీవన శైలి నుంచి బయటపడే ప్రయత్నం మొదలుపెట్టామో లేదో ఇప్పుడు కరోనా పూర్తిగా నిర్బంధంలోకి నెట్టేసింది. అటు బడి లేక.. ఇటు ఇంటి బయట ఆటలూ లేక పిల్లల మానసిక, శారీరక వికాసానికి కళ్లెం వేసింది. వాళ్లు ఇంట్లోనే ఉంటూండంతో కుటుంబంలోని ఆర్థిక కష్టాలు, హింస వంటి వన్నీ పిల్లలు ప్రత్యక్షంగా చూస్తూన్నారు. దాంతో తెలియకుండానే ఒత్తిడికి లోనవుతున్నారు. ‘ఈ వైరస్ గురించి వింటుంటే చాలా భయమేస్తోంది. కరోనా వల్లే మా నాన్నకు ఉద్యోగం పోయింది. డబ్బు గురించి ఇబ్బంది పడ్తున్నాం. ఇంట్లో గొడవలెక్కువయ్యాయి. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్దామన్నా లేదు. లోన్లీగా ఫీలవుతున్నాం..’ అంటూ మధనపడుతు న్నారట చాలామంది చిన్నారులు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఇచ్చే కౌన్సిలింగ్ ఇటీవలి కాలంలో పది శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ‘కుటుంబాల్లో బంధుమిత్రుల రాకపోకల్లేక చిన్నారులకు బయటి మనుషులతో పరిచయాలు తగ్గిపోతాయి. ఆ పరిణామం వారి శారీరక, మానసిక పరిణతిపై ప్రభావం చూపెడుతుందని’ చెప్తున్నారు మానసిక వైద్యనిపుణులు. యునెస్కో లెక్కలు పాఠశాలల్లేని కారణంగా పిల్లలపై హింస, దోపిడీ పెరిగినట్లు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు ఎక్కువైనట్టు, బాల కార్మికులు, టీనేజ్ గర్భిణీలు అధికమైనట్టు యునెస్కో తన నివేదికలో వెల్లడించింది. బళ్లు లేక ఉచిత భోజనం అందక పేద విద్యార్థులు పోషణకు దూరమవుతున్నారనీ తెలిపింది. దీన్నిబట్టి అర్థమైన సత్యం ఏంటంటే.. చదువుకి ఆన్లైన్ ప్రత్యామ్నాయంగా అందినా.. బడికి ఆల్టర్నేట్ లేదు అని. పెంపకంలో చదువు ఒక భాగం మాత్రమే. కాని బడి.. పెంపకానికి సిలబస్. పిల్లల వికాసానికి ఒక ప్రిస్క్రిప్షన్. ఇప్పుడా బాధ్యతను సమాజం తీసుకోవాలి. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడాలి. చదవండి: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ -
తెలంగాణలో ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా
-
ఆన్లైన్ క్లాసులతో బిజీ కాబోతున్న నాగ్
ఐదు పదుల వయసు పైబడినప్పటికీ రొమాంటిక్ కథలతో హిట్ కొట్టగలడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ క్రమంలోనే ‘సోగ్గాడే చిన్నినాయినా’ తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఇటీవల నాగ్ ఎక్కువగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ వైపు ఆస్తక్తి చూపుతున్నాడనే చెప్పాలి. ఈ మధ్య ఆయన నటించిన ‘ఆఫీసర్’, ‘వైల్ట్ డాగ్’ చిత్రాలు యాక్షన్ డ్రామాగా తెరకెక్కినవే. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నటించాల్సి ఉంది. ఈ చిత్రం కూడా యాక్షన్ నేపథ్యంలోనే తెరకెక్కనుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్, ఎన్ఐఏ ఆఫీసర్ రోల్స్‌లో నటించిన నాగార్జున ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. కాజల్ అగర్వాల్ ఇతడితో జోడీ కడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున ఈ సినిమా కోసం క్రవ్ మగా (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అభివృద్ధి చేసిన ఆత్మరక్షణ సాంకేతికత) పేరుతో పిలవబడే యుద్ధకళను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. కరోనా వల్ల మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఇండియాకు రాలేకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల ద్వారా నాగ్ ఈ యుద్ధ విద్యను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యుద్ధకళతో పాటు కటానా అనే మరో యుద్ధకళను కూడా నాగార్జున నేర్చుకుంటున్నారట. తన పాత్ర కోసం అంతలా కష్టపడుతున్నారంటే ఈ చిత్రాన్ని హాలీవుడ్ యాక్షన్ స్టంట్స్ రేంజ్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ( చదవండి: సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ ) -
ఆన్లైన్ క్లాసెస్.. ఫోన్ సిగ్నల్ కోసం 5 కిలో మీటర్లు!
తిర్యాణి (ఆసిఫాబాద్): ఈ చిత్రంలోని చిన్నారి పేరు సరస్వతి విద్య. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన కుడిమెత భగవంతరావు కూతురు. సరస్వతి మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. సాక్షాత్తూ చదువుల తల్లిని తన పేరులో నిలుపుకొన్న ఈ చిన్నారికి చదువంటే అమితమైన ఇష్టం. కానీ, కరోనా వల్ల తను చదివే పాఠశాలను మూసివేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందవు. దీంతో సరస్వతి విద్యను తండ్రి ఇదిగో ఇలా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్ వచ్చే ప్రాంతానికి బైక్‌పై తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాడు. -
తెలంగాణ: 50శాతం మంది విద్యార్థులకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఉన్నత విద్య శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతీ కళాశాల తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: టీఆర్టీ కంటే ముందే టెట్ ) ప్రతినిత్యం శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ప్రతీ యూనివర్సిటీకి 20 లక్షల రూపాయలను తక్షణ సాయంగా అందించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు. కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావనను కల్పించాలని మంత్రి సూచించారు. కళాశాలల్లో విద్యార్థులు గుమికూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత యాజామాన్యాలదేనని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిర్గల్, విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
12 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
ఆదిలాబాద్‌టౌన్: కోవిడ్ నేపథ్యంలో సర్కారు పాఠశాలలు తెరుచుకోలేదు. పేద విద్యార్థులు చదువు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విద్యాబోధన కొనసాగిస్తోంది. ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించాల్సిన గురువులు బాధ్యతలు విస్మరించి విధులకు ఎగనామం పెడుతున్నారు. పాఠశాలలకు ప్రతీరోజు యాభై శాతం మంది ఉపాధ్యాయులు హాజరుకావాలనే నిబంధన ఉంది. ఒకరోజు పాఠశాలకు, మరో రోజు హోమ్ టు వర్క్ చేపట్టాల్సి ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లు విధులకు ఎగనామం పెట్టి సొంత పనులపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డీఈవో ఎ.రవీందర్‌రెడ్డి పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయగా విధులకు ఎగనామం పెడుతున్న ఉపాధ్యాయుల బాగోతం బట్టబయలైంది. కాగా జిల్లా వ్యాప్తంగా విధులకు సక్రమంగా హాజరుకాని 12 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరికొంత మంది ఉపాధ్యాయుల ఒకరోజు వేతనంలో కోత విధించారు. అయినా ఇంకొంత మంది ఉపాధ్యాయుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు. విధులకు ఎగనామం కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఇప్పుడిప్పుడే లాక్డౌన్ నిబంధనలను సడలించింది. కొన్ని సంస్థలు తెరుచుకోగా పాఠశాలలను మాత్రం ప్రారంభించలేదు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగతుల వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించారు. ఒకరోజు ఒక పాఠశాలలో సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరైతే మరో రోజు మిగతా సగం హాజరుకావాల్సి ఉంటుంది. పిల్లలు ఆ సమయంలో చదువుతున్నారా.. లేదా, పాఠం అర్థమయ్యిందా, పనులకు తీసుకెళితే తల్లిదండ్రులను ఒప్పించి చదివేలా ప్రోత్సహించడం, పాఠం అర్థం కాకపోతే వివరించడం, అలాగే పాఠశాలకు వెళ్లే రోజు పాఠ్యాంశాలకు సంబంధించిన డైరీ తయారు చేయడం, ఇంటివద్ద ఉన్నా రోజు ఫోన్‌చేసి విద్యార్థుల చదువుకు సంబంధించిన సమాచారంపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి. కాని ఇవేమి పట్టనట్లుగా కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం పాఠశాల సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాలి. అయితే వారికి నచ్చినప్పుడే పాఠశాలకు రావడం, హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోవడం, రెండు మూడు రోజులకోసారి పాఠశాలకు వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి ఇంటి బాటపడుతునట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణను డీఈవో రవీందర్‌రెడ్డితోపాటు సెక్టోరియల్ అధికారులు ప్రతీరోజు పాఠశాలలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తాంసి మండలంలోని కప్పర్ల జెడ్పీఎస్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయుడు హాజరయ్యారు. నలుగురు ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, మిగతా వారు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో గైర్హాజరైన ఉపాధ్యాయులకు డీఈఓ మెమోలు జారీ చేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలను తనిఖీ చేయగా ఓ ఉపాధ్యాయుడు హాజరు పట్టికలో సంతకం చేసి పాఠశాలలో లేకపోవడంతో ఆయన ఒకరోజు వేతనంలో కోత విధించారు. ఉట్నూర్ మండలంలోని జెడ్పీఎస్ఎస్ పెర్కగూడలో ఒకరికి, పీఎస్ పెర్కగూడలో ఒకటి, జెడ్పీఎస్ఎస్ శ్యామ్‌పూర్‌లో ఒకరికి, జెడ్పీఎస్ఎస్ సాలెవాడలో ఒకరికి మెమోలు జారీ చేశారు. ఇలా రోజూ డీఈఓ పర్యటిస్తుండడంతో విధులకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఎంఈఓల పర్యవేక్షణ కరువు ఆన్లైన్ తరగతులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నారా.. లేదా అనే విషయాన్ని మండల విద్యాధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని చాలా ఎంఈఓలు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు వీరి అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని విధులకు డుమ్మా కొడుతున్నారు. ఎంఈఓలతో పాటు స్కూల్‌కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పర్యవేక్షించాలి. వీరి పర్యవేక్షణ కూడా సక్రమంగా లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది. విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించాలి. ఆన్లైన్ బోధనలో విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విద్యాబోధన గురించి ఆరా తీయాలి. ఆన్లైన్ విద్యకు విద్యార్థులు దూరం కాకుండా చూడాలి. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ -
ఆన్లైన్ క్లాసులు అర్థంకాక విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆన్లైన్ క్లాసులు అర్థంకాక మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ప్రాంతానికి చెందిన నడకుదిటి సత్యన్నారాయణ ఆదివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తన కుమారుడు ఎన్.దినేష్ (18) గొల్లపూడిలో ఓప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు అర్థం కాకపోవటంతో తోటి విద్యార్థులు చులకన భావంతో చూస్తున్నారని ఈనెల 13న పురుగుల మందు తాగగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. (ఏపీలో సూళ్లకు కొత్త టైం టేబుల్) -
గుణిషా అగర్వాల్ ‘డిజిటల్’ సాయం
నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు గమనించింది ఓ టీనేజ్ అమ్మాయి. ఐటీ కంపెనీలను సంప్రదించింది. వారి సాయంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ కుమార్తె పేరు గుణిషా అగర్వాల్. 12వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల గుణీషా తన తల్లి ఆన్లైన్ క్లాస్‌లో పాల్గొనడానికి ఇంట్లో పనిచేసే అతడి కుమార్తెకు ల్యాప్‌టాప్ ఇవ్వడం చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లోనే చదువులు కొనసాగిస్తున్నారు. కానీ, వీరిలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరు ఆన్లైన్లో చదువుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య ఒకటే కాదు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు వంటి పరికరాలు కావాలి. ఇదంతా గమనించిన గుణిషా అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. కంపెనీల చొరవ చెన్నైలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ల్యాప్‌టాప్‌లను గుణిషాకు విరాళంగా ఇస్తున్నారు. అలాగే, ఓ ఐటి కంపెనీ, థింక్‌ఫినిటీ అండ్ కన్సల్టింగ్ కూడా గుణిషాకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాయి. ఈ సంస్థ 50,000 రూపాయలతో గుణిషా కోసం ఉచితంగా వెబ్‌సైట్‌ను తయారు చేసింది. అదే సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు విద్యార్థులకు ఇచ్చిన పాత పరికరాలను ఆన్లైన్ తరగతుల ప్రకారం ఫార్మాట్ చేస్తారు. సలహాదారు బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘ఐటి విభాగంలో పనిచేసిన తరువాత కూడా, విద్యార్థులకు సహాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. గుణిషా కారణంగా, మేం కూడా ఈ గొప్ప పనిలో పాల్గొనే అవకాశం లభించింది’ అని ఆనందంగా తెలిపారు. వారు ఇప్పటివరకు 25 పరికరాలను విద్యార్థులకోసం కేటాయించారు. ఈ వారం, మరో 15 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను ఇవ్వబోతున్నారు. ‘కరోనా కాలం కారణంగా కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి అనుకున్నాను. వాటిని అవసరమైన వారికి అందించడమే ఇప్పుడు నా బాధ్యత. తద్వారా వారి ఆన్లైన్ చదువులు నిరాఘాటంగా కొనసాగుతాయి’ అంటోంది గుణిషా. -
స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): ఆన్లైన్ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్మార్ట్‌ఫోన్ కొనిచ్చే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఎస్సై మనోహర్‌రావు వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల రాజేశం, శంకరవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేశం గీత వృత్తితో పాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతూ ఆసరాగా ఉంటోంది. చిన్న కుమారుడు సాయిరాం (15) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక స్థోమత లేదని, ఇప్పుడు వద్దని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరాం తమ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
ఆన్లైన్ పాఠం.. ఆర్థిక భారం
కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ కుర్మవాడ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లత అనే విద్యార్థిని ఇంటికి రెండు రోజుల క్రితం కలెక్టర్ శశాంక వెళ్లారు. ఆన్లైన్ తరగతి జరుగుతున్నా లత పాఠం వినకపోవడంతో ఏమైందని ప్రశించారు. సెల్‌ఫోన్ లేదని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని విద్యార్థిని కలెక్టర్‌కు వివరించింది. స్పందించిన కలెక్టర్ తాను స్మార్ట్‌ఫోన్ కొనిస్తానని హామీ ఇచ్చారు. సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ అవస్థలు మొదలయ్యాయి. ఈనెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికే క్లాసులు జరుగుతున్నాయి. అయితే ప్రతీ విద్యార్థికి సెల్‌ఫోన్, ట్యాబ్ తప్పనిసరైంది. వీటితోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. జిల్లాలో 16 మండలాల్లో ప్రభుత్వ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన 672 ప్రభుత్వ పాఠశాలల్లో 34,994 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారు.1,200పైగా ప్రైవేట్ పాఠశాలల్లో మరో 40 వేల మంది విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వింటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు 74,994 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు మొదలు కాగా టీవీల ద్వారా వీక్షిస్తున్నారు. 23 శాతం మందికి టీవీలు అందుబాటులో లేవు. సెల్‌ఫోన్స్ లేవు. దీంతో వీరంతా పక్కిళ్లకు వెళ్లి క్లాసులు చూస్తున్నారు. అయితే టీవీలు లేని తల్లిదండ్రులు పిల్లల కోసం టీవీల కొ నుగోలు గురించి ఆలోచిస్తున్నారు. కేబుల్ కనెక్షన్ లేనివారు కొత్తగా కనెక్షన్ తీసుకుంటున్నారు. వ్యవసాయ పనులు సీజ న్లో తరగతులు ప్రారంభం కావడంతో అదనంగా ఆర్థిక భా రం పడుతోందని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఖర్చు.. తడిసిమోపెడు.. కరోనా కష్టకాలంలో కుటుంబం గడువడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ మధ్య తరగతి ప్రజలకు గుదిబండగా మారింది. రెండు నెలల నుంచి ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నాయి. పూర్తిస్థాయిలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఈనెల నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. వీరంతా సెల్ఫోన్లలోనే పాఠాలు వినాలి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారిద్దరికీ సెల్‌ఫోన్స్ కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేయాలి. నెట్ కోసం రూ.500 చొప్పున బ్యాలెన్స్ వేయించాలి. పుస్తకాలు, ఫీజులు ఇలా రూ.50 వేల రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కార్పొరేట్‌స్కూల్ విద్యార్థుల కోసం ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేసి లాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. సెల్ఫోన్లో క్లాసులు వినే విద్యార్థుల కళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తలనొప్పితోపాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఒక ఎత్తు అయితే ఆర్థిక కష్టాలు తలనొప్పిగా మారాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూళ్లు మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఆన్లైన్ క్లాసులు బోధిస్తున్న కొన్ని స్కూళ్లు ఫీజులు వసూలు చేయగా, మరికొన్ని స్కూళ్లు వసూలు చేయలేదు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అయినా వసూళ్లు జరుగుతున్నాయి. కరోనాతో మాకేంటి.. జిల్లా కేంద్రంలోని కొన్ని కార్పొరేట్ స్కూళ్లు పదో తరగతి వి ద్యార్థి నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నాయి. వివిధరకాల తోక పేర్లతో ఉన్న స్కూళ్లల్లోనూ లక్ష రూపాయల వరకు ఫీజులు ఉన్నాయి. ఎల్కేజీ, యూకేజీ చదివే విద్యార్థుల నుంచే రూ.20 వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నా యి. అయితే కరోనా ప్రభావం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడంతో ఇన్నాళ్లు ప్రైవేట్ పాఠశాలల్లో చది వించిన వారు మళ్లీ ప్రభుత్వ పాఠశాలకు పంపించలేక ఉన్న ఆభరణాలు, ఆస్తులు విక్రయించి ఫీజులు చెల్లిస్తున్నారు. అందుబాటులోకి రాని ఫోన్లు... ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు మొదలు కాగా ఉపాధ్యాయులు క్లాస్ ప్రారంభానికి ముందు, తరువాత ఫో న్ చేయాల్సి వస్తుంది. క్లాస్ టీచర్‌తోపాటు సబ్జెక్ట్ టీచర్ చేస్తున్నారు. దీనితో విద్యార్థులు సైతం విసుక్కోవాల్సిన పరి స్థితి. విద్యార్థుల ఫోన్లు ఎక్కువగా వారి తల్లిదండ్రుల వద్ద ఉంటా యి. వారు ఏదో పనిలో ఉంటున్నారు. విద్యార్థుల ఫోన్స్ అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఒకటికి నాలు గుసార్లు ఫోన్ చేస్తున్న పరిస్థితి. పిల్లలకు ప్ర త్యేకంగా సెల్‌ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల పాఠశాల బాట... జిల్లాలో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కలెక్టర్ కె.శశాంకతోపాటు డీఈవో జనార్దన్‌రావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను పర్యటిస్తూ ఆన్లైన్ తరగతులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీస్తున్నారు. చాలా మంది విద్యార్థులు తమ ఇళ్లల్లో స్మార్ట్‌ఫోన్, నెట్ కనెక్షన్, టీవీలు లేవని సమాధానం చెబుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్) : కాకతీయ యూనివర్సిటీలోని అన్ని విభాగాల పీజీ విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు బోధించాలని రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం సూచించారు. కేయూలోని విభాగాధిపతులతో ఆయన ఆన్లైన్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈనెల 1వ తేదీ నుంచే ఆన్లైన్ పాఠాల బోధన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఇకనైనా త్వరగా విద్యాబోధన చేపట్టేందుకు విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు సిద్ధం చేయాలని తెలిపారు. ఆ వెంటనే జూమ్ యాప్ లేదా గూగుల్ మీట్ ద్వారా తరగతులు నిర్వహించాలని, అవసరం మేరకు ఎంపిక చేసిన పార్ట్ టైం లెక్చరర్ల జాబితా అందిస్తే ఉత్తర్వులు ఇవ్వనున్నామని వెల్లడించారు. మేం సిద్ధమే కానీ... పలువురు విభాగాధిపతులు మాట్లాడుతూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తాము సుముఖంగానే ఉన్నా విభాగా ల్లో కొందరు అధ్యాపకులు సంతకాలు చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ కోవిడ్ దృష్ట్యా ఇళ్లకు వెళ్లి ఉంటే అక్కడి నుంచే పాఠాలు బోధించేలా విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో కూడా తరచుగా మాట్లాడాలని తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ల విద్యార్థులు ప్రమోట్ కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులను మూడో సెమిస్టర్‌కు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులను ఐదో సెమిస్టర్‌కు ప్రమో ట్ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో యూజీసీ నిబంధనల మేరకు కేయూ డీన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆన్లైన్ పాఠం అర్థమయ్యేనా?
కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరిచే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం టీ శాట్ యాప్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించడంతో పాటు టీవీలోనూ తరగతులను కొనసాగించనున్నారు. అలాగే డీడీ యాదగిరి చానల్లోనూ నిర్దేశించిన సమయంలో వివిధ తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధించనున్నారు. డిజిటల్, ఆన్లైన్ తరగతులకు సంబంధించి విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. సాక్షి, నిజామాబాద్: కరోనా మహమ్మారితో తరగతుల నిర్వహణ సాధ్యం కాని వేళ ప్రభుత్వం నేటి నుంచి విద్యార్థులకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులను నిర్వహించబోతుంది. గతంలోనే అనుమతి లేనప్పటికీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలే ఆన్లైన్లో తరగతులను నిర్వహించాయి. ఈ విధానంలో బోధన అర్థం కావడం లేదని ఎక్కువశాతం మంది విద్యార్థులు చెబుతున్న వేళ ప్రభుత్వం ఆన్లైన్ తరగతుల వేపే మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు అర్థం కావడం కష్టంగా మారనుంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. టీ షాట్ చానల్ ద్వారా ఆన్లైన్ బోధనను ఎంత మంది విద్యార్థులు ఆసక్తిగా వింటారని, గత మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యకు దూరమైనవారు ఇప్పుడు టీవీలో ప్రసారమయ్యే ఆన్లైన్ తరగతలు వినే పరిస్థితి ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చినవారే ఉంటారు. ఉదయమే తల్లిదండ్రులు పొలంబాట పట్టడంతో విద్యార్థులు ఆన్లైన్ పాఠాలను వినే పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రతి ఏడాది జూన్‌లో తరగతులు ప్రారంభమై విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బందితో పాఠశాలలు కళకళలాడుతూ ఉండేవి. ఈ ఏడాది కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభానికి నోచుకోలేదు. 10,700 మంది పిల్లల ఇంట్లో టీవీలు, సెల్ఫోన్లు లేవు ప్రభుత్వం టీ శాట్ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణలో ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. ఇంట్లో టీవీ లేకపోవడంతో ఇతర విద్యార్థులపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా తండాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. టీవీలు లేని కుటుంబాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నప్పటికీ టీవీలు లేని ఇళ్ల చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10,700 మంది పిల్లలకు ఇళ్లల్లో టీవీలు, సెల్ఫోన్లు లేవని ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలోనే తేలింది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో 1,459 ప్రాథమిక పాఠశాలలు, 271 ప్రాథమికోన్నత పాఠశాలలు, 432 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. వారం రోజుల పాటు పునశ్చరణ తరగతులు ఆన్లైన్ తరగతులు ఆరంభిస్తున్న తరుణంలో వారం రోజుల పాటు విద్యార్థులకు పాత తరగతులకు సంబంధించి పాఠ్యాంశాలపై పునశ్చరణ తరగతులను నిర్వహించనున్నారు. మార్చిలో పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు ముగిసిపోక ముందే పాఠశాలలు మూసి వేశారు. అందువల్ల పాత తరగతులకు సంబంధించిన కొన్ని పాఠ్యాంశాల పునశ్చరణ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తుంది. టీ శాట్ ద్వారా అందించే బోధనను తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి వినేలా చూడాలి. సందేహాలు వస్తే వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ ద్వారా నివృతి చేసుకోవాలి. –రాజు, డీఈవో, కామారెడ్డి ప్రతి విద్యార్థి డిజిటల్ పాఠాలు వినాలి ప్రతి తరగతి విద్యార్థి డిజిటల్ పాఠాలను కచ్చితంగా వినాల్సి ఉంది. డిజిటల్, ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు హజరై హోం వర్క్‌ను పూర్తి చేయాలి. ఇప్పటికే అందరు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణి చేశాం. బడులకు విద్యార్థులు రాలేకున్నా డిజిటల్, ఆన్లైన్ తరగతులకు హజరు కావాల్సిందే. – ఆంధ్రయ్య, ఎంఈవో, మోర్తాడ్ టీవీ, ఫోన్ లేదు మా ఇంట్లో ఫోన్ లేదు, టీవీ లేదు. అమ్మ, నాన్న కూలీ పనులు చేసి మమ్మల్ని పోషిస్తున్నారు. పక్కింట్లో టీవీ చూసి పాఠాలు వినమంటుండ్రు. కరోనా భయంతో ఎక్కడివి వెళ్లే పరిస్థితి లేదు. - మహేందర్, తొమ్మిదో తరగతి, సింగితం ఉన్నత పాఠశాల -
ప్రణాళికతో బోధన జరగాలి
సాక్షి, ఖమ్మం: ప్రణాళిక ప్రకారం ఆన్లైన్ విద్యా బోధన చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల విద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,329 ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 74,042 మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందేలా చూడాలన్నారు. డీటీహెచ్, టీవీ, సెల్ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్లను సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మండలాల్లో పాఠశాలలతోపాటు వసతి గృహాల విద్యార్థులకు సమగ్ర కార్యాచరణతో బోధన జరగాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా టీచర్ల సెల్ నంబర్లు తప్పనిసరిగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆన్లైన్ తరగతుల షెడ్యూల్‌ను ప్రతి పాఠశాల, గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ప్రసార మాధ్యమాల సదుపాయం లేని వారి కోసం పాఠశాల, గ్రామ పంచాయతీల్లో టీవీలను సమకూర్చి సీనియర్ విద్యార్థులతో సమన్వయపర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల విద్యార్థుల కోసం తీసుకున్న చర్యలపై సూచనలు చేశారు. వీసీలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్‌రావు, డీఈఓ మదన్మోహన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో విద్యా, సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ బోధనాంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ నేటి నుంచి పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్, టీ శాట్, ద్వారా చేపడుతున్న ఆన్లైన్ తరగతులను టైం టేబుల్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఈఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘తెర’గతుల్లో సవాళ్లు!
కోవిడ్–19 వైరస్ విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. క్లాసుల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులు అన్వేషిస్తున్నా.. అందులోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. తరగతి గదిలో క్లాసులు నిర్వహించే వీల్లేక చాలా విద్యా సంస్థలు ఆన్లైన్లోనే క్లాసులు చెప్పడం మొదలుపెట్టాయి. అయితే ఈ విధానంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు హాజరు కాకపోవడం, ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి నెట్ సదుపాయం లేకపోవడం, మరికొందరికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండడంతో దాదాపు 30 శాతం మంది విద్యార్థులు ఈ ‘తెర’గతులకు గైర్హాజరవుతున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్: కరోనా ప్రభావం విద్యా రంగంపై తీవ్రంగానే పడింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు డిజిటల్ విధానానికి ప్రాధాన్యమి స్తున్నాయి. ఉన్నత విద్య నుంచి ప్రాథమిక విద్య వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే చా లా మంది విద్యార్థులకు ఈ విధానం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలు, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు ప్రధాన సమస్యలుగా ప్రస్తావించవచ్చు. ప్రస్తుతం ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆన్లైన్ విద్యా విధానం కొనసాగుతోంది. జవహల్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తప్పనిసరిగా డిజిటల్ పద్ధతిలో పాఠాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అఫి లియేషన్ కళాశాలల్లో, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో, ప్రాథమిక విద్యలో ప్రైవేట్ పాఠశాలు డిజిటల్ వేదికగా ఆన్లైన్ తరగతులు కొనసాగిస్తున్నాయి. ఉన్నత విద్యలో సెమిస్టర్లో 100 నుంచి 120 మధ్య తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో 2020–21 విద్యా సంవత్సరం గాడిలో పెట్టాలంటే డిజిటల్ విద్యా విధానం తప్పనిసరి అని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరో పక్క ఈ విధానంలో అధ్యాపకుల ఇళ్ల నుంచి పాఠాలు చెప్పవచ్చు. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వంటి సంస్థల్లో బోధన సిబ్బంది వర్సిటీలకు రావటం లేదు. కోవిడ్ భయం అన్న కారణంతో వీరు వర్సిటీ ముఖం చూడటం లేదు. దీంతో ఇళ్ల నుంచి పాఠాలు చెబుతున్నారు. అయితే ఆన్లైన్ త రగతులు కొందరికే పరిమితం కావటం ప్రధాన సమస్యగా ఉంది. ఆన్లైన్ విద్యా విధానంపై నేషనల్ కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలు సైతం అధ్యయనం చేశాయి. సుమారు 30 శాతం మంది విద్యార్థులు డిజిటల్ విద్య చేరువ కావటం లేదని వీరు విశ్లేషించారు. అయినా విద్యా సంస్థలు ప్రత్నామ్నాయ మార్గాలు లేక గూగుల్ మీటింట్, జూమ్ మీటింగ్ వంటి యాప్‌లు ఆధారంగా డిజిటల్ విద్యా విధానం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో.. ప్రధానంగా జిల్లాలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 4జీ సేవలు విస్తరించలేదు. మరో పక్క పట్టణ ప్రాంతాలకు ఐదు కిలోమీటర్లు పరిధి దాటి సైతం నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రధానంగా నెట్ విషయంలో విద్యార్థులు ఎక్కువగా జియో, ఎయిర్టెల్ వంటి వాటిపై ఆధారపడుతున్నారు. నెట్వర్క్ సమస్యలు ఉన్న గ్రామాల్లో తరగతులు అటకెక్కుతున్నాయి. మరో పక్క డిజిటల్ విద్యా విధానంలో ఆన్లైన్ తరగతులు వినాలంటే ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్, ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ వంటివి ఉండాలి. చాలా మంది విద్యార్థులు సమకూర్చుకోలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవటం ప్రధాన సమస్య. వీరికోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్పులు తప్పనిసరి ఆన్లైన్ విధానం విస్తరిస్తోంది. భవిష్యత్‌లో ఇది కీలకం కానుంది. పీజీ, డిగ్రీ, పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్‌లు అన్నీ ఆన్లైన్లోనే ఉండొచ్చు. ఢిల్లీలో ఉన్న సబ్జెక్టు నిపుణులు శ్రీకాకుళం విద్యార్థికి శిక్షణ ఇవ్వవచ్చు. అందుకే ఈ విధానానికి అలవాటు పడాలి. దీనికోసం అవసరమయ్యే సామగ్రిని సమకూర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరం గాడిలో పెట్టాలంటే డిజిటల్ విద్యా విధానానికి మించి ప్రత్యామ్నాయం లేదు. – ప్రొఫెసర్ కూన రామ్‌జీ, వైస్ చాన్స్‌లర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు ప్రస్తుతం డిజిటల్ విద్యా విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో ఇంటర్నెట్ సమస్య, విద్యార్థుల వద్ద అవసరమైన పరికరాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. భవిష్యత్‌లో డిజిటల్ విద్యావిధానానికి అలవాటు పడాల్సి ఉంటుంది. ప్రాథమిక విద్య నుంచి కొన్ని తరగతులు డిజిటల్లో కొనసాగిస్తూ విద్యార్థులకు అలవాటు చేయాలి. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. – ప్రొఫెసర్ గుంట తులసీరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. -
ఆన్లైన్ తరగతులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, కరీంనగర్: నాలుగు నెలలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు. కరోనా సృష్టించిన భయోత్పాతానికి విద్యారంగంపూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు. వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాతే ప్రభుత్వాలు, అధికారులు తరగతులు పునఃప్రారంభించాలని అనుకున్నా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడానికి సర్కారు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఆన్లైన్ క్లాసులపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి కాగా ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలని సూచించింది. నాలుగు నెలల విరామం తర్వాత పాఠశాలలు ప్రారంభించి విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది. సెప్టెంబర్ 1 నుంచి నూతన విద్యాసంవత్సరం కరోనా ఎఫెక్ట్‌తో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్చిలో విధించిన లాక్డౌన్ వల్ల వాటికి పడిన తాళాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. రెండు నెలల కిందట సడలింపులు ఇచ్చినా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. సుమారు నాలుగున్నర నెలలుగా విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటున్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండాలని విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించనుంది. 27 నుంచి క్రమంగా ఉపాధ్యాయులు పాఠశాలలకు విధిగా హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేయడం ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని అర్థమవుతోంది. దీంతోపాటు టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు బోధించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ దృష్టి.. జిల్లాలో 649 ప్రభుత్వ పాఠశాలలుండగా ఇందులో ప్రాథమిక పాఠశాలలు 424, ప్రాథమికోన్నత 76, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 149 ఉన్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 34,600 మంది విద్యార్థులున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠ్యపుస్తకాలు పంపిణీ కూడా పూర్తిచేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా యంత్రాంగం ఇది వరకే ఆన్లైన్ పాఠాల సాధ్యాసాధ్యాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయా లేదా అన్న వివరాలను సేకరించి పాఠశాల విద్యాశాఖకు నివేదిక సమర్పించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో సెల్‌ఫోన్ మీద ఆధారపడ్డ వారికి మొబైల్ నెట్వర్క్ సమస్యలున్నాయని తేలింది. వీరికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించి అందరికీ విద్యనందించే ప్రయత్నాలు విద్యాశాఖ యంత్రాగం సిద్ధం చేస్తోంది. మరో వారం రోజుల తర్వాత విద్యార్థిని, విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆన్లైన్ తరగతులకు హాజరు కావాల్సిందే. -
ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ తరగతులు మొదలుకానున్నాయి. ఆలోపు వీటికి సంబంధిం చిన ఆన్లైన్ క్లాస్ మెటీరియల్, వీడియో పాఠాలు వంటివి తయారు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులను ఆదేశించింది. దీని కోసం ఈనెల 27 నుంచి పాఠశాల సిబ్బంది విధు లకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్లోడ్పై లేని స్పష్టత.. కోవిడ్ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యా సంస్థలకు మాత్రం ప్రభుత్వం నో చెబుతూ వచ్చింది. అయితే, విద్యా సంవత్సరం ఇబ్బందుల్లో పడకుండా ఆన్లైన్ పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు కూడా ఆన్లైన్ లేదా టీవీ/టీశాట్ ద్వారా బోధించేందుకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలి చ్చింది. 27వ తేదీ నుంచి పాఠశాలకు హాజరయ్యే టీచర్లు సబ్జెక్టుల వారీగా వీడియో పాఠాలను రూపొందించాలి. వీటిని విధ్యార్థులు వీక్షించేందుకు వీలుగా ఎలా అప్లోడ్ చేయాలనే దానిపై మాత్రం విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. వీక్షించేది ఎందరో? రాష్ట్రంలో 28 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వీటిలో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే ఎంతమందికి వెసులుబాటు ఉంటుందనే దానిపై ఇటీవల విద్యాశాఖ పరిశీలన చేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి నిర్ణీత ఫార్మాట్లో వివరాలు సేకరించింది. దాదాపు సగానికిపైగా విద్యార్థుల ఇళ్లలో టీవీలు, కేబుల్ లేదా డిష్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే టీశాట్ ద్వారా పాఠాలను ఎంతమంది చూస్తారనే దానిపై ఎలాంటి అంచనాల్లేవు. మరోవైపు కనెక్షన్లు ఉన్నప్పటికీ నిర్దేశించిన సమయాల్లో చూసి అవగాహన చేసుకునే దానిపైనా స్పష్టత లేదు. పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు పూర్తిగా కొత్త. వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీచర్లకు తమ తమ పాఠశాలల్లోని పిల్లలకు వారి అవగాహన స్థాయిని బట్టి పాఠ్యాంశ బోధనను ఎలా చేపట్టాలో ఓ అంచనా ఉంటుంది. ఇప్పుడిది అందరికీ కలిపి సెంట్రలైజ్డ్ పద్దతిలో చేసే పాఠ్యాంశ బోధన. దీనివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెజార్టీ వ్యవసాయ కార్మికుల పిల్లలే. ప్రస్తుతం వ్యవసాయ పనులు కొనసాగుతుండడంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో విద్యార్థులు ఇళ్లలో ఉండి వీడియో పాఠాలు చూసే అవకాశాలు తక్కువని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
టి-సాట్ నెట్వర్క్ ఇక ఎయిర్‌టెల్‌లో...
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు వీడియోల ద్వారా పాఠాలను బోధిస్తు టిసాట్ సంస్థ అత్యంత ప్రజాదారణ చూరగొంది. తాజాగా నిపుణులతో తరగతులను బోధిస్తున్న టి-సాట్ నెట్వర్క్ తమ ప్రసారాల్లో మరో ముందడుగు వేసింది. కమ్యూనికేషన్ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ డీటీహచ్లో టి-సాట్ విద్య, నిపుణ ఛానళ్లు ప్రసారం కానున్నాయి. ఛానల్ నెంబర్లు 948, 949లలో ప్రసారాలకు అనుమతిస్తూ టి-సాట్ నెట్వర్క్ తో ఏయిర్ టెల్ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు శాటీలైట్, సోషల్ మీడియా వేదిక ద్వార డిజిటల్ ప్రసారాలు అందిస్తూ యూట్యూబ్ లో నాలుగు లక్షల సబ్ స్ర్కైబ్స్ కలిగి ఉంది. కోవిడ్ మహామ్మారి దృష్ట్యా ఏయిర్ టెల్ నెట్వర్క్ సంస్థ తెలంగాణ విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందించేందుకు టి-సాట్ ఛానళ్లు విద్య, నిపుణ ప్రసారం చేసేందుకు అంగీకారం తెలిపింది. దేశంలోని మొబైల్ రంగంలో మూడవ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా డీటీహెచ్ ద్వార 10 లక్షలు, ఎక్స్ట్రీమ్ ద్వారా 1.5 కోట్ల సబ్ స్ర్రైబ్స్ కలిగి ఉండటమే కాకుండా 18 దేశాల్లో విస్తరించి ఉంది. వైర్ లెస్, మొబైల్, ఫిక్స్డ్ లైన్, హై స్పీడ్, డీటీహెచ్ ద్వార సేవలందిస్తూ దేశ వ్యాపితంగా మార్చి-2020 వరకు 423 మిలియన్ కష్టమర్లను కలిగి ఉంది. ఫలితంగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు దేశ వ్యాప్తంగా విస్తృతమవనున్నాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ఒప్పందం వలన నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఆగస్టు 15వ తేదీన 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టి-సాట్, ఎయిర్ టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టి- సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఎయిర్ టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు భారతీ ఎయిర్‌టెల్‌లో ప్రసారం చేస్తున్నందుకు సీఈవో శైలేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపగా, తెలంగాణ ప్రభుత్వ సంస్థ టి-సాట్ ద్వారా విద్యార్థులకు సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. సీఈవో అవనీత్ పురి. ఏయిర్ టెల్ డీటీహెచ్ తో పాటు ఏయిర్ టెల్ ఎక్స్ట్రీం యాప్ లోనూ విద్యార్థులు టి-సాట్ ప్రసారాలు చూడవచ్చని తెలిపారు. -
‘స్మార్ట్ ఫోన్ కావాలి.. డాక్టర్ అవుతాను’
బెంగళూరు: కార్ వాష్ చేస్తూ.. జీవనం సాగించే షంషుద్దీన్ అధోనికి ముగ్గురు కుమార్తెలు. ఆడపిల్లలని వారిని తక్కువ చేయలేదు. ముగ్గురిని బాగా చదివించాలనేది అధోని కల. తండ్రి ఆశయానికి తగ్గట్టే పిల్లలు కూడా చదువులో ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా వెల్లడించిన ప్రీ యూనివర్సిటీ కాలేజ్(పీయూసీ) పరీక్షల్లో అధోని పెద్ద కుమార్తె జీనత్ బాను 94 శాతం మార్కులు సాధించింది. పీసీఎంబీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయోలజీ) కోర్సు పూర్తి చేసింది. త్వరలో నిర్వహించబోయే నీట్ ఎగ్జాం కోసం కష్టపడుతోంది. డాక్టర్ కావాలనేది జీనత్ కల. అయితే ఇలాంటి సమయంలో కరోనా వారి ఆశలకు అడ్డుగా నిలిచింది. వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నింటిని మూసి వేసిన సంగతి తెలిసిందే. (ఆన్లైన్ చదువు కోసం ఆవు అమ్మకం) ఇలాంటి సమయంలో ప్రస్తుతం అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లకు సంబంధించి కోచింగ్, ప్రాక్టీస్ ఆన్లైన్ వేదికగానే జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావాలంటే స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఏదైనా ఉండాలి. నెట్ కనెక్షన్ కూడా కావాలి. కానీ నెలకు కేవలం ఆరు వేల రూపాయల సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న అధోనికి స్మార్ట్ ఫోన్ కొనడం అనేది తలకు మించిని భారం. ఇప్పటికే పిల్లల చదువుల కోసం భార్య ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మాడు.. అప్పులు చేశాడు. ప్రస్తుతం ఏ దారి కనిపించకపోవడంతో.. ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. -
ఆన్లైన్ పాఠాలతో ఒత్తిడి
సాక్షి, సిటీబ్యూరో: ప్రణీత్ పదో తరగతి స్టూడెంట్. చాలా చురుకైన విద్యార్థి. అతడు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా అతడు మౌనంగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం లేదు. సాధారణంగా ఉదయం ఆరింటికి నిద్రలేచి చక్కగా రెడీ అయి స్కూల్‌కు వెళ్లేవాడు. ఇప్పుడు ఉదయం 8 గంటలు దాటినా లేవలేకపోతున్నాడు. నిద్ర కళ్లతోనే కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్ తరగతులకు హాజరవుతాడు. అతడి ప్రవర్తనలో వచ్చిన మార్పుతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మానసిక నిపుణులను సంప్రదించారు. సహజమైన స్కూల్ వాతావరణానికి భిన్నంగా ఆన్లైన్ పాఠాలకు హాజరుకావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా.. ఒక్క ప్రణీత్ మాత్రమే కాదు. చాలా మంది పిల్లలు ఇలాంటి మానసిక స్థితినే ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే ఈ బోధన కొనసాగుతుండగా మరికొన్ని స్కూళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులతో పిల్లల చదువులే కాకుండా విద్యాసంస్థల మనుగడ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌పై ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ పాఠాలు పిల్లలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనా పద్ధతిలో మార్పు అవసరమని సూచిస్తున్నారు. క్లాస్ రూమ్ తరహాకు భిన్నంగా ఇష్టాగోష్టి పద్ధతిలో ఆన్లైన్ విద్యాబోధన ఉండాలని అభిప్రాయడుతున్నారు. వికాసంపై వేటు.. ♦ ఆన్లైన్ క్లాసులతో పిల్లలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంప్యూటర్‌కు అతుక్కుపోతున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లలో క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో కేవలం ఒక డివైజ్‌పై దృష్టి సారించి గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల సృజనాత్మకత దెబ్బతింటుంది. ♦ చాలా మంది పిల్లలు కళ్లు పొడిబారడం, తలనొప్పి, వెన్నెముక నొప్పి వంటి శారీరక ఇబ్బందులకు గురవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ♦ మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ♦ కొత్త విషయాలను నేర్చుకొనే సామర్థ్యం దెబ్బతింటుంది. ♦చాలా మంది పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పటికీ టీచర్లు చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏకాగ్రత లోపిస్తుందని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల భాగస్వామ్యం తప్పనిసరి.. విశాలమైన తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకొనే వాతావరణానికి భిన్నంగా నట్టింట్లో కంఫ్యూటర్, మొబైల్ ఫోన్, ట్యాప్ లాంటివి ముందేసుకొని టీచర్లు చెప్పే పాఠాలను వినడం, నేర్చుకోవడం పిల్లలకు ‘శిక్ష’గానే ఉంటుంది. కానీ కోవిడ్ కారణంగా అనివార్యంగా మారిన ఈ విద్యాబోధనను ‘చక్కటి శిక్షణ’గా మార్చేందుకు పిల్లల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి. ఇందుకోసం ‘టీచర్ పాఠం చెబుతుంటే పిల్లలు వినడం’ అనే పద్ధతికి భిన్నంగా ఏదైనా ఒక అంశంపై వీడియో పాఠాలను చూపించి ఆ తర్వాత దానిపై పిల్లలతో చర్చ నిర్వహిస్తే ఎక్కువగా నేర్చుకొంటారని, పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంటున్నారు. మార్కులే ప్రామాణికం కాదు మార్కుల కోసమే చదివించడం అనే దృక్పథం నుంచి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మారాలి. పిల్లల్లో సృజనాత్మకతను, జిజ్ఞాసను పెంచేవిధంగా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కలిగించే విధంగా విద్యాబోధన ఉంటే ఆన్లైన్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి విద్యార్థులు, టీచర్లతో కలిసి చదువుకోవడం అనే ఒక సమష్టి కార్యక్రమంగా విద్యాబోధన ఉండాలి. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టడం సరైన విద్యావిధానం కాదు. – డాక్టర్ వీరేందర్, మానసిక వైద్య నిపుణులు -
ఆ కథనంపై చలించిన సోనూసూద్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం నుంచి వలస కార్మికులను గట్టెక్కించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. బిడ్డల స్మార్ట్ (ఆన్లైన్) చదువుల కోసం ఆవును అమ్ముకున్న వ్యక్తికి సాయం చేసేందుకు సూపర్‌హీరో ముందుకు వచ్చారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు కుటుంబ జీవనాధారమైన ఆవును అమ్ముకున్నాడన్న మీడియా కథనాలపై చలించిన సోనూ సూద్ సంబంధిత వ్యక్తికి ఆవును తిరిగి ఇచ్చేద్దాం..వివరాలు కావాలంటూ ట్విటర్ ద్వారా అభ్యర్థించారు. దీంతో సోనూపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (వారి కోసం సోనూసూద్ మరో గొప్ప ప్రయత్నం) కరోనా వైరస్,లాక్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల నెత్తిన మరింత భారాన్ని మోపుతోంది. హిమాచల్ ప్రదేశ్, జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్ తన పిల్లలను చదువు కొనసాగించాలనుకుంటే స్మార్ట్‌ఫోన్ అవసరమని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. దీంతో 500 రూపాయలు కూడా లేని కుమార్ 6 వేల స్మార్ట్‌ఫోన్ కొనలేక ఇబ్బంది పడ్డాడు. చివరికి బ్యాంకులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా పంచాయతీలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించు కోలేదు. ఇక చేసేదేమీలేక అతని ఏకైక ఆదాయ వనరు ఆవును అమ్మి మరీ 6 వేల స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం పలువురిని కదిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా కుల్దీప్ కుమార్‌కు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. (పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!) Ravinder ji. Can you please share his details. https://t.co/dsKG4eCAmw — sonu sood (@SonuSood) July 23, 2020 इस जन्म में भी आपके भाई ही हैं मेरे भाई। https://t.co/w0WSbLxiDm — sonu sood (@SonuSood) July 23, 2020 -
కార్పొరేట్ స్కూళ్ల ఆన్లైన్ దందా
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విసిరిన పంజాతో చిన్నారులు బడి అడుగులు మాని ఆన్లైన్ చదువుల బాట పట్టారు. దీనిని ఆసరాగా చేసుకున్న కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు పుస్తకాలు, స్టేషనరీతోపాటు ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్స్ సైతం తమ వద్దే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. తమ దగ్గర కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో తమ పాఠశాల, సిలబస్‌కు అనుగుణంగా ఉండే యాప్స్, పాఠాలు సులభంగా యాక్సెస్ చేసేందుకు అనువైన సాఫ్ట్వేర్ ఉంటుందని నమ్మిస్తున్నాయి. అయితే ఈ పరిణామం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తోంది. (ఇంటర్లో గ్రేస్ మార్కులు) మీ పిల్లలు మార్కులు కోల్పోతారంటూ... ప్రవీణ్ కుమార్తె ఓ కార్పొరేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఇటీవల పాఠశాల యాజమాన్యం తమ వద్ద ట్యాబ్లెట్ కొనుగోలుచేయాలని, ఆరునెలల ఫీజును చెల్లించాలని అతనికి సందేశం పంపించింది. ఇక సుకుమార్ పిల్లలు సైతం మరో కార్పొరేట్ పాఠశాలలో 7,8 తరగతులు చదువుతున్నారు. వారి పాఠశాల యాజమాన్యం కూడా తమ వద్దే్ద ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని కబురు పంపింది. ఇలా పలు పాఠశాలల యాజమాన్యాలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను విధిగా తమ వద్ద కొనుగోలు చేయాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. లేనిపక్షంలో మీ పిల్లలు గ్రేడ్లు, మార్కులు కోల్పోవాల్సి వస్తుందని..చదువులో వెనకబడతారని హెచ్చరికలు జారీచేస్తుండడం గమనార్హం. ఇదో తరహా వ్యాపారం.. ఇటీవల మనోహర్‌కు తన కుమార్తె 8వ తరగతి చదివే పాఠశాల నుంచి మెసేజ్ వచ్చింది. ట్యాబ్లెట్ ద్వారా విద్యార్థిని పాఠాలు వినేందుకు రూ.25 వేల ఫీజు చెల్లించాలని కోరింది. ఇందులో రూ.7500 ట్యాబ్లెట్ ఖర్చు అని పేర్కొంది. ఫీజు చెల్లించని పక్షంలో ట్యాబ్లెట్ ఇవ్వబోమని చెప్పింది. ఈ ట్యాబ్లెట్లో పాఠ్యాంశాలకు సంబంధించి ప్రీ లోడెడ్ కంటెంట్, అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఉందని నమ్మించింది. ఈ ట్యాబ్లెట్ భవిష్యత్‌లో ఈ–ఎగ్జామ్స్ రాసేందుకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. అంతటా అదే సీన్.. ప్రైవేటు పాఠశాలలే కాదు.. కేంద్రీయ విద్యాలయాలు సైతం ఇదే రీతిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్ల వ్యాపారానికి తెరలేపడం గమనార్హం. ల్యాప్ట్యాప్లయితేనే మేలని..ఫోన్ల ద్వారా అయితే స్పష్టత ఉండదని కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు చెబుతున్నాయి. పాఠశాలల నయా వ్యాపారంతో ఇద్దరు ముగురు పిల్లలున్న వారికి మూడు ల్యాప్‌ట్యాప్ లు కొనుగోలు చేయడం గగనమౌతోంది. తాజా ట్రెండ్ నేపథ్యంలో తెలంగాణా రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఎంఏ) కూడా రంగంలోకి దిగింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయాలనుకున్న తల్లిదండ్రులకు లోన్లు ఇప్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా... జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకు పాఠశాలల యాజమాన్యా లు చేస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వ్యాపారంపై తమకు ఎ లాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొనడం గమనార్హం. -
అవసరం మేరకే ఆన్లైన్ విద్య
ప్రస్తుతం పాఠశాల విద్యలో ఆన్లైన్ క్లాసుల అలజడి జరుగుతోంది. దూరవిద్యా విధానంలో కొన్ని రోజులే క్లాస్ రూములో నేర్చుకొని, ఎక్కువ రోజులు ఇంట్లోనే బుక్స్, స్టడీ మెటీరియల్ చదువుకుని, పరీక్షలు వ్రాసి డిగ్రీ, డిప్లమో సర్టిఫికెట్లు పొందుతున్న విషయం చాలా కాలంగా వున్నదే. ఇప్పుడు కొన్ని రోజులు కూడా క్లాసు రూముకి పోకుండా ఇంట్లోనే కూర్చుని, ఏదో ఒక వృత్తి ఉద్యోగంలో వున్నవారు కూడా ఆన్లైన్ చదువుకుంటూ వివిధ రకాల కోర్సులు పూర్తిచేయడం ఉన్నత విద్యలో జరుగుతోంది. కాగా కరోనా వైరస్ భయంతో విద్యారంగంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిస్థితిలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల అలజడి ముందుకొచ్చింది. సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ చాలా రోజుల నుండి జరుగుతోంది. రాష్ట్ర సిలబసుతో నడుస్తున్న కొన్ని పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు కూడా అదే బాట పడుతున్నవి. ఆన్లైన్ పేరుతొ అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నవి. ఫీజుతో పాటు స్మార్ట్ ఫోనులు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, వైఫై, డేటా వంటి అదనపు ఖర్చుల భారం తల్లిదండ్రులపైన పడుతోంది. పాఠం చెప్పడం, నోట్సు రాయించడం, హోమ్ వర్క్ చేయించడం పేరిట ప్రైమరీ క్లాసుల పిల్లలనే రోజుకి 6–7 గంటలు వేధించడం జరుగుతోంది. సెకండరీ క్లాసుల విద్యార్థులు రోజుకి 10–12 గంటలు ఆన్లైన్ అవస్థ పడుతున్నారు. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండడం వలన విద్యార్థులకు కంటి చూపు మందగించడం, నడుము నొప్పి వంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ అభ్యసన జరుగుతున్నంతసేపు తల్లి/తండ్రి లేదా ఎవరో ఒక పెద్ద వారు వారి పనిమానేసి పిల్లలకు తోడుగా ఉండాలి. ఇలాంటి సమస్యలున్నాయని ఇటీవల ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వమే చూడాలని ధర్మాసనం వదిలేసింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఊసే లేదు. కొంతమందికే ఆన్లైన్ విద్య అందుతూ ఎంతోమందికి అలాంటి అవకాశం లేకపోవడం వలన విద్యారంగంలో సరికొత్త విభజన, అసమానత ఉత్పన్నమవుతోంది. ఎకడమిక్ షెడ్యూల్ ప్రకారం జూన్ రెండో వారంలోనే పాఠశాలలు ప్రారంభించాల్సి వుంది. ఆగస్టు 15 దాకా ఆగాలంటే రెండు నెలల కాలం విద్యార్థులు చదువుకోకుండా ఖాళీగా వుండాలంటే కష్టమే. అందువలన అన్లైన్లో విద్యాభ్యాసాన్ని నడిపించాలనే కొన్ని పాఠశాలల కృషిని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలే ఆన్లైన్లో పాఠాలు చెబుతూ సిలబస్ కవర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంటే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్చే అవకాశం వుంటుందని బడ్జెట్ స్కూళ్ల మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు. అందువలన ఆన్లైన్ విద్యాబోధన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నిం టిలోనూ అమలు జరిగే విధానం కావాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ కొంత ప్రయత్నం చేస్తోంది. ప్రాధమిక (1–8) తరగతులకు ఎన్సీఈఆర్టీ రూపొందిం చిన ‘ఆల్టెర్నేటివ్ ఎకడమిక్ కేలండర్‘ని యిటీవల విడుదల చేసింది. సెకండరీ లెవెల్ క్లాసుల కేలండర్ కూడా రావాలి. ఆ కేలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అనువుగా మలుచుకొని అమలుచేయాల్సి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రణాళికను మించి అతిగా వ్యవహరించే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభించాల్సి వున్నందున ఆ మేరకు 30% సిలబసును తగ్గించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నవి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఆన్లైన్ క్లాసుల నిర్వహణ సులభమవుతోంది. పాఠశాలల్లో ఆన్లైన్ బోధనకు అవసరమైన సాధనాలు, సదుపాయాలు సమకూర్చుకోవాలి. అందుకోసమనే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు రూ 5–10 వేలు ఫీజులు వసూలు చేస్తున్నవి. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్సుతో పాటు ట్యాబ్స్ అమ్ముతున్నవి. ఫీజు చెల్లించకపోయితే ఆన్ లైన్ కనెక్షన్ యిచ్చేది లేదని బెదిరిస్తున్నవి. స్కూల్లో అమ్మే ట్యాబ్ కొనలేకపోయినా ఇంట్లో సిస్టం లేదా ల్యాప్ ట్యాప్ లేదా స్మార్ట్‌ఫోన్ వుండాలి. ఇంట్లో పాఠశాల విద్యార్థులు ఇద్దరుంటే రెండేసి ఉండాలి. ఆన్లైన్లో చెప్పే పాఠాలు స్పష్టంగా చూడాలంటే 50 ఎంబీపిఎస్ నెట్ వర్క్, 500 జీబీ సామర్ధ్యం గల స్మార్ట్‌ఫోన్ వుండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఒక క్లాసుకి ఒక జీబీ చొప్పున రోజుకి ఎన్ని క్లాసులు చూస్తే అన్ని జీబీలు ఖర్చవుతుంటది. అలాంటి ఏర్పాట్లు చేసుకుని అదనపు ఖర్చు భరిం చినా పట్నాల్లో పల్లెల్లో ఆన్లైన్ క్లాసులతో బోధనాభ్యాసన అరకొరగానే ఉండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 41%, గ్రామీణ ప్రాంతాల్లో 12% మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో వుంటుందన్న విషయం తెలిసిందే. ఈ అసాధారణ పరిస్థితిలో అవసరమైన మేరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, అజీమ్ ప్రేమ్‌జీ లాంటి సంస్థలు సూచించినట్లుగా 3–5 తరగతుల విద్యార్థులకు వారానికి 4 గంటలు, 6–8 తరగతుల వారికి 7 గంటలు, 9–12 తరగతులకు 10 గంటలు సమయమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. ఎల్కేజీ, యూకేజీ, 1–2 తరగతుల పిల్లలకు ఆన్లైన్ క్లాసులను నిషేధించాలి. పాఠశాల సమయాల్లోనే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలి. ఆన్లైన్ పాఠాలు అందుబాటులో లేని వారికి రికార్డ్ చేసిన పాఠాలను వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు లేదా ట్యాబులు మరియు అవసమైన డేటా కార్డులు ప్రభుత్వమే అందించాలి. జూలై 15 నుండి నాలుగు వారాలకైనా ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఏదేమైనా పాఠశాలలు ప్రారంభించే వరకు విద్యార్థులు ఎకడమిక్ విషయాలతో మమేకం కావడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషి సమన్వయం పెరగాల్సిన అవసరం ఉన్నది. వ్యాసకర్త: నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త మొబైల్ : 94903 00577 -
ఆన్లైన్ క్లాస్‌ల పై హైకోర్టులో విచారణ
-
ఆన్లైన్ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక ఆన్లైన్ క్లాసుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదీలోగా లిఖితపూర్వకంగా నిర్థిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. (‘కొత్త బిల్లుతో మూడు రకాల నష్టాలున్నాయి’) అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్‌పై ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ ఇంప్లీడ్(ఇస్మా) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్ మాత్రమేనని ఇస్మా పిటిషన్లో పేర్కొంది. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇస్మాకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. (కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?) -
కార్పొరేట్ దోపిడీ అంతింత కాదయా!
నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో ఒకటో తరగతి చదువుతున్న విద్యారి్థ దగ్గర పుస్తకాల పేరుతో యాజమాన్యం రూ.6,200 వసూలు చేసింది. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో బుక్స్ వాడడం లేదు కదా అని ప్రశి్నస్తే ఆన్లైన్లో క్లాసులు వింటూ బుక్స్ ఉపయోగించాలని సమాధానమిచ్చారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. మినీబైపాస్‌లో ఉన్న మరో కార్పొరేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి (ఒలంపియాడ్)కి ప్రమోషన్ పేరుతో రూ.5 వేలతో పాటు బుక్స్‌కు రూ.8,160 వసూలు చేశారు. అసలే కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బులేకపోయినా అప్పు చేసి మరీ బుక్స్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులో టెక్ట్స్‌బుక్స్ లేవు. కేవలం నోట్ బుక్స్ పేరుతో వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌కు అదనం. సాక్షి, నెల్లూరు: కరోనా విపత్తుతో ప్రజలు అల్లల్లాడుతుంటే మరో వైపు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీలకు తెగబడుతున్నాయి. వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతున్నా, జిల్లా విద్యాశాఖ అధికారుల అవినీతిని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ విద్యా మాఫియా చెలరేగిపోతోంది. ►కరోనా కారణంగా తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరకొర వేతనాలతో బతుకు బండి లాగించడం కష్టంగా ఉన్న సమయంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పేరుతో గతం కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా అడ్మిషన్లకు టార్గెట్లు విధించి విద్యార్థులను చేరి్పంచే పని చేయిస్తున్నారు. ►విద్యార్థులను చేర్చుకొనే సమయంలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ అంటూ ఆకర్షణీౖయెన పేర్లు చూపి గతేడాది మాదిరిగానే అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. ►కొత్త, పాత విద్యార్థులు తమ విద్యాసంస్థల్లోనే నోట్ బుక్‌లు, యూనిఫాం, షూస్, ఇతర మెటీరియల్ కొనాలని వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌కు మాత్రం అదనం. అనుమతి లేకున్నా.. జిల్లాలో 1,065 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 385 ప్రాథమిక, 287 ప్రాథమికోన్నత, 385 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు అనుమతి లేని మరో 500 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. విద్యా సంస్థలకు లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పదో తగరతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఈ తరుణంలో జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టారు. ►ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్‌్ట, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీమైన పేర్లతో నిర్వహిస్తున్న అధిక విద్యాలయాల్లో పాఠశాల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు. ►కనీస వసతులు కూడా లేకుండా అపార్ట్మెంట్లలో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ చేస్తున్నారు. అనుమతులు ఒక చోట ఉంటే.. మరో చోట విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ►గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ స్కూళ్ల మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోయింది. వీరు నిర్ణయించిందే స్కూల్ ఫీజు. నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ విక్రయాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. నోట్ బుక్స్ వ్యాపారమే రూ.100 కోట్లు! జిల్లాలో విద్యా సంస్థలు విద్యార్థుల చేత ఏటా కొనిపించే నోట్ బుక్స్ వ్యాపారం రూ.150 కోట్ల పైమాటే. ఒలంపియాడ్ స్థాయి పాఠశాలల్లో 6,7 తరగతులకు రూ.8,160, 8 నుంచి 10వ తరగతులకు రూ.8,800 వంతున వసూలు చేస్తున్నారు. ►ఇక ఈ–టెక్నో, టెక్నో స్థాయి విద్యా సంస్థలు 6, 7 తరగతులకు రూ.6,200, 8 నుంచి 10వ తరగతులకు రూ.6,750 లెక్కన ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ►ఆయా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం వారి వద్ద వసూలు చేస్తున్న మొత్తాన్ని లెక్కిస్తే సుమారు రూ.100 కోట్ల పైమాటే ఉంటుంని అంచనా. యూనిఫాం, షూస్ వ్యాపారం డబుల్ ఆయా పాఠశాలల్లో చదివే పిల్లలు తమ యూనిఫాం మాత్రమే కొనాలని షరతులు పెడుతున్నాయి. ఇందు కోసం ఏటా ఒక్కొ విద్యారి్థకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఫీజుల గుంజుడు జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధికంగా ఫీజులను గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర ఆకర్షణీయ పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఒలంపియాడ్ పేరుతో 6వ తరగతి చదివే విద్యారి్థకి రూ.80 వేలు వంతున వసూలు చేస్తున్నారు. ►ప్లేక్లాస్ చదివే విద్యార్థి నుంచి స్కూల్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు పిండుతున్నారు. ►ఆరో తరగతి విద్యార్థికి అయితే రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ►విద్యార్థి జాయిన్ చేసిన వారం రోజుల నుంచే అడ్మిషన్ నంబర్ కోసం 60 శాతం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నారు. ►సామాన్యులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని నానా రకాలుగా మాటలతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్ కోసం గత్యంతరం లేక కార్పొరేట్ మాఫియా ఒత్తిడితో అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజులకు ప్రభుత్వం కళ్లెం వేస్తున్నా.. వివిధ రకాల పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థల భరతం పట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ►వసతులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలు నిర్వహిస్తూ ఆగడాలకు పాల్పడుతున్న యాజమాన్యాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ►కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసతులు, వనరుల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో అన్లైన్లో అప్లోడ్ చేయాలని ఏపీ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఆదేశించింది. ►అయితే తమ బండారాలు బయట పడతాయన్న సాకుతో కార్పొరేట్ మాఫియా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తోంది. ►ప్రభుత్వం కార్పొరేట్‌పై చర్యలు తీసుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అ«ధికారులు మాత్రం ఆ సెక్టార్‌కు దాసోహమై తనిఖీలు చేయడం మానేశారు. దీంతో ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తమ తీరును మార్చుకోకుండా యథావిధిగా దోపిడీ చేస్తున్నారు. అమలు కానీ నిబంధనలు పదో తరగతి లోపు విద్యార్థుల నుంచి ఏటా రూ.15 వేల వరకు ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో రూ.80 వేలు కూడా వసూలు చేస్తున్నారు ►జీఓ నంబర్ 1 1984 ప్రకారం విద్యార్థులకు వసతులు క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి ►జీఓ నంబర్ 88/2008 ప్రకారం 200 మంది విద్యార్థులు ఉంటే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నుంచి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. ►2009 విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. పుస్తకాలు అమ్మితే చర్యలు నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీఈఓ జనార్దనాచార్యులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది అమ్ముతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏ పాఠశాల యాజమాన్యమైన ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
40శాతం బోధన ఆన్లైన్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో 40% సిలబస్ బోధన ఆన్లైన్లోనే సాగేలా వెసులుబాటు కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఉన్నత విద్య కార్య క్రమాలు, విద్యా సంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహ ణకు సంబంధించి యూజీసీ ఇటీవల మార్గదర్శ కాలు జారీ చేసింది. అందులో 25% సిలబస్‌ను ఆన్లైన్లో బోధించేందుకు అవకాశమిచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇటీవలి మార్గదర్శకాలను మరోసారి పరిశీలించాలని, విద్యార్థుల భద్రతకు చర్యలు చేపడుతూ మార్పులు చేయాలని రెండ్రోజుల కిందట యూజీసీని కేంద్ర ఎంహెచ్ఆర్డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆదేశిం చారు. దీంతో ఆన్లైన్ బోధనకు వెసులుబాటు కల్పించేలా యూజీసీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కిందిస్థాయి సెమిస్టర్ పరీక్షలతో పాటు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలనూ రద్దుచేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్‌చేసే అంశాలపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. -
విదేశీ విద్య.. ఆన్లైన్ బాట!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు విదేశీ వర్సిటీల విద్యార్థులు ఇప్పుడు ఈ–క్లాస్ బాట పట్టారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో నగరానికి చేరుకున్న వేలాదిమంది విద్యార్థులు తిరిగి ఆయా దేశాలకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో విమాన రాకపోకలకు అనుమతించకపోవడంతో ఆన్లైన్లో సెమిస్టర్ పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి విద్యార్థులకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకె దేశాల వర్సిటీలు కూడా ఈ–క్లాస్‌లు బోధించేందుకు అనుమతించడం విశేషం. ఈ వర్చువల్ క్లాసుల్లో విద్యార్థులతో ఆయా దేశాల వర్సిటీల అధ్యాపకులు ఫేస్–టు–ఫేస్ సంభాషించడం వంటి ఏర్పాట్లున్నాయి. డిగ్రీ, పీజీస్థాయి విద్యార్థులు తమ సెమిస్టర్ పాఠ్యాంశాలు మిస్‌కాకుండా ఈ బోధన ఏర్పాట్లు చేసినట్లు ఆయా వర్సిటీలు ప్రకటించాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 50 వేలమంది వరకు ఇదే తరహాలో పాఠాలు వింటున్నట్లు సమాచారం. ఆయా దేశాల్లోని సుమారు 25కు పైగా వర్సిటీలు ఈ విధానంలో విద్యార్థులకు బోధన ఏర్పాట్లు చేయడం విశేషం. భారత కాలమానం ప్రకారమే క్లాసులు.. భారత కాలమానం ప్రకారం పగటి వేళల్లోనే ఈ–క్లాసుల నిర్వహణకు ఆయా వర్సిటీలు శ్రీకారం చుట్టడం విశేషం. విద్యార్థులకు అనుకూలమైన సమయాల్లోనే వారికి పాఠాలు బోధిస్తేనే సౌకర్యవంతంగా ఉండటంతోపాటు విద్యార్థులు పాఠాలను ఆకలింపు చేసుకోవడం.. ఈ–లెర్నింగ్‌లో చురుగ్గా పాల్గొనడం చేస్తున్నట్లు ఆయా దేశాల వర్సిటీలు భావిస్తున్నాయట. ఈ తరగతుల బోధన ద్వారా విద్యార్థుల్లోనూ తాము నగరంలో చిక్కుకొని సెమిస్టర్ మిస్ అవుతున్నామనే భావన తొలగిందని.. ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్య అభ్యసిస్తున్న విక్రమ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక లండన్‌కు చెందిన రాయల్ హోలోవే యూనివర్సిటీ కూడా వర్చువల్ క్లాసుల ద్వారా పీజీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. తద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడటంతోపాటు.. విద్యార్థులు తాము పాఠాలు వినలేకపోతున్నామనే ఒత్తిడి ఉండదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆయా దేశాల్లోని ప్రైవేటు వర్సిటీలకు మన నగరానికి చెందిన విద్యార్థులు విద్యా రుణాలు తీసుకొని మరీ ఏటా కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లిస్తున్న విషయం విధితమే. ఇటు ఫీజులు కోల్పోకుండా.. అటు పాఠాలు మిస్‌కాకుండా చూసేందుకు ఈ ఏర్పాట్లు ఉపకరిస్తున్నాయంటున్నారు. అయితే మార్చి నెలలో నగరానికి చేరుకున్న పలువురు విద్యార్థులు తమ వీసా గడువు తీరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ–క్లాసులతో ఉపయోగాలివే.. ♦ ఈ–క్లాసులతోపాటు ఆన్లైన్లోనే వర్క్‌షాప్‌లు, జూమ్ మీటింగ్‌లతో తమ కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలను విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ♦ ఆగస్టు నెలాఖరు వరకు ఫేస్–టు–ఫేస్ వర్చువల్ క్లాసులు కొనసాగించాలని అమెరికా, ఆస్ట్రేలియా, యూకె దేశాలకు చెందిన వర్సిటీలు నిర్ణయించడం విశేషం. ♦ విద్యార్థులకు సెమిస్టర్ పాఠాలు మిస్ అవుతామనే ఆందోళన దూరమైంది. ♦ ఈ–లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులకు నోట్స్, స్టడీ మెటీరియల్ కూడాఅందజేస్తుండటం విశేషం. ♦ విద్యార్థులు తాము చెల్లిస్తున్న ఫీజులకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతుండటంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన తొలిగింది. -
విద్యాసంవత్సరం ఖరారు చేసిన యూజీసీ
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో చేరనున్న కొత్త విద్యార్థులకు నూతన అకడమిక్ సెషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్‌లోనే ప్రారంభించవచ్చని తెలిపింది. ప్రస్తుత విద్యాసంవత్సర ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు అన్నింటికీ యూజీసీ ఆమోదం తెలిపింది. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభంతోపాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు, ఓపెన్ చాయిస్ అసైన్మెంట్స్, ప్రజెంటేషన్ బేస్డ్ అసెస్మెంట్కు ఆమోదం తెలిపింది. అలాగే పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించడానికి ఓకే చెప్పింది. అవకాశముంటే గతంలో సెమిస్టర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం మార్కులను ఇవ్వడం, 50 శాతం మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇవ్వడానికి అంగీకరించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ముందు సెమిస్టర్ మార్కులుండవు కనుక 100 శాతం ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఇవ్వొచ్చని పేర్కొంది. ప్రతి విద్యార్థిని తదుపరి సెమిస్టర్/సంవత్సరానికి ప్రమోట్ చేయాలని పేర్కొంది. విద్యార్థులు గ్రేడ్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే వచ్చే సెమిస్టర్లో ప్రత్యేకంగా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో రెండో సెమిస్టర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అన్ని కోర్సులకు ఒకే రకమైన విధానాన్ని అవలంభించాలని పేర్కొంది. చదవండి: రికార్డు స్థాయిలో మరణాలు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలా? లేక ఆఫ్‌లైన్‌లోనా అన్న విషయాన్ని తమకున్న వనరులు, విద్యార్థుల వెసులుబాటులను దృష్టిలో పెట్టుకుని వర్సిటీలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు క్లాస్‌లకు హాజరయినట్లే భావించాలంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు అదనంగా ఆరు నెలల సమయం ఇవ్వాలని పేర్కొంది. వైవా పరీక్షను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. తాము పేర్కొన్నవన్నీ సూచనలుగా భావించాలని, పరిస్థితులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 2019–20 విద్యా సంవత్సరం సెమిస్టర్‌కే కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే చేపట్టాల్సిన చర్యలపైనా మార్గదర్శకాలు జారీ చేసింది. ►కొన్ని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఆన్లైన్, ఈ–లెర్నింగ్ విధానంలో మిగిలిపోయిన సిలబస్‌ను మే 31వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొంది. ప్రాజెక్టు వర్క్స్‌ను మే 16 నుంచి 31లోగా పూర్తి చేయాలని తెలిపింది. జూన్ 16 నుంచి 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలంది. జూన్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలి వస్తే మాత్రం జూన్ 15 వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. ఇవి మినహా 2020–21, 2021–22లో విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలకు, పరీక్షల విధానాలకు ఓకే చెప్పింది. ►ప్రస్తుత కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రతి విద్యా సంస్థ విద్యార్థులు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. వాటిని త్వరగా పరిష్కరించాలి. ►యూజీసీ కూడా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పరీక్షలు, అకడమిక్ కార్యక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ►విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనివర్సిటీలు సోషల్ డిస్టెన్స్ అమలు చేసేలా పక్కా ఏర్పాట్లు చేయాలి. ►విద్యా సంస్థల్లో 25 శాతం బోధన ఆన్లైన్లో చేపట్టేలా, 75 శాతం బోధన ప్రత్యక్ష పద్ధతిలో చేసేలా చర్యలు చేపట్టాలన్న సిఫారసుకు యూజీసీ ఓకే చెప్పింది. ►రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చినా సాధారణ పరిస్థితి వచ్చాక, వీలైతే జూలైలో వారికి పరీక్షల నిర్వహించాలని పేర్కొంది. ►ప్రతి యూనివర్సిటీ కరోనా (కోవిడ్–19) సెల్‌ను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల విద్యా సంబంధ అంశాలు, అకడమిక్ కేలండర్, పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలి. ►ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించేలా ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలి. 6 రోజుల పని విధానం అమలు చేయాలి. ►ఇప్పటికే ఉన్న విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి, ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తరగతులూ ప్రారంభిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం మాత్రం 2021 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. -
రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కళాశాల విద్యాశాఖ పేర్కొంది. ఇంట్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు వీడియో పాఠాలను రూపొందించి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్లైన్ డిగ్రీ పాఠాలపై అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాల భాస్కర్, జాయింట్ డైరెక్టర్ యాదగిరి, అకడమిక్ ఆఫీసర్ జె. నీరజ తదితరులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ బోధన పక్కాగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,270 మంది రెగ్యులర్, 845 మంది కాంట్రాక్ట్, 530 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఒక్కొక్కరు ప్రతిరోజూ 3 చొప్పున ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఆన్లైన్లో ‘కేవీ’ పాఠాలు
న్యూఢిల్లీ: దేశంలోని కేంద్రీయ విద్యాలయా (కేవీ)ల్లో ఆన్లైన్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటన్ ప్రత్యేక ప్రోటోకాల్ రూపొందించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఫర్ సెకండరీ(ఎన్ఐఓఎస్) ద్వారా రికార్డు చేసిన పాఠాలు, లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వయం ప్రభ పోర్టల్‌లో ఏప్రిల్ 7 నుంచి సీనియర్ సెంకండరీ క్లాసెస్ ప్రారంభవుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఏదైనా సందేహం వస్తే స్కైప్, లైవ్ వెబ్ చాట్ సహాయంతో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. (పింక్ సూపర్ మూన్ చూస్తారా?) -
ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభానికి సిద్ధం
సాక్షి, ఒంగోలు: జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు శుభవార్త. నాలుగో బ్యాచ్‌కు చెందిన జిల్లా విద్యార్థులు ఒంగోలులోనే ఉండి చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ తరగతులు ఒంగోలులో ప్రారంభం కానుండటంతో వాటికి సంబంధించి ప్రాంగణాన్ని, భవనాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ కాలేజీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ దాని ప్రత్యేకత తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 2016–2017 విద్యా సంవత్సరంలో ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీగా దానికి పేరు పెట్టారు. ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైనప్పటికీ అందుకు సంబంధించిన కాలేజీ భవనాలు, ఇతర సౌకర్యాలు ఇక్కడ లేకపోవడంతో దానిని ఇడుపులపాడుకు తరలించారు. జిల్లాకు చెందిన మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఇడుపులపాడులోనే ట్రిపుల్ ఐటీ చదువుకుంటూ ఉన్నారు. 2019–2020 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా నుంచి నాలుగో బ్యాచ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ ప్రతిపాదిత ప్రాంతమైన రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను సిద్ధం చేశారు. కొంతకాలంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెంకట్రావు ఒంగోలులోనే మకాం వేసి కాలేజీకి సరిపడే సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ముహూర్తం ఖరారు.. ఒంగోలు శివారులోని రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీ కాలేజీ ప్రస్తుత విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్ తరగతులను ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల్లోపు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్‌గాందీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్ కేసీ రెడ్డి తరగతుల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలు తమకు అందుబాటులోనే ఉన్నత విద్యను అభ్యసించనున్నారన్న ఆనం దం ఆ తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతోంది. -
ఆన్లైన్లో ‘డిగ్రీ’ పాఠాలు
సాక్షి, కరీంనగర్: ఇక నుంచి డిగ్రీ పాఠాలు ఆన్లైన్లో వినవచ్చు. టీ–సాట్ ద్వారా పాఠాలు, టీఎస్కేసీ, మూక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులకు నూతన టెక్నాలజీతో డిజి టల్ పాఠాలను ప్రస్తుతం బోధిస్తున్నారు. మరో అధునాతన సాంతకేక విప్లవం ప్రభుత్వ డిగ్రీ విద్యలో అందుబాటులోకి వచ్చింది. సరికొత్తగా వర్చువల్ క్లాస్ రూం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు ఒకేసారి పాఠ్యాంశాలు వినే విధంగా రూపొందించి మరింత సులభతరంగా పాఠాలు బోధించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 31న ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ చేతుల మీదుగా వర్చువల్ క్లాస్‌లు ప్రారంభించారు. వివిధ కోర్సులకు సంబం ధించిన విద్యార్థులకు కావాల్సిన పాఠ్యాంశాలు అధ్యాపకులు ఉన్న చోట నుంచి విద్యార్థులు ఉండి అధ్యాపకులు లేని చోట వర్చువల్ క్లాస్‌లను ఉపయోగించుకునేందుకు దీనిని మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37 కళాశాలల్లో వినియోగంలోకి రానుండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 కళాశాలల్లో అమలు కానుంది. రుసా(రాష్ట్రీయ ఉచ్చాతార్ శిక్షా అభియాన్) కేంద్ర నిధులతో వర్చువల్‌క్లాస్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు ఒక్కో కళాశాలకు దాదాపు రూ.6 లక్షల రూల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. వివిధ సబ్జెక్టుల పాఠశాలు... వర్చువల్ క్లాస్ ద్వారా ముఖ్యంగా పలు సబ్జెక్టుల కోసం రూపొందించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జియాలజీ, సైకాలజీ, కంప్యూటర్‌సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోసియాలజీ, జర్నలిజంతోపాటు వివిధ సబ్జెక్టుల పాఠాలు ఆన్లైన్లో బోధించడానికి వర్చువల్ క్లాస్ రూంలు ఉపయోగించనున్నారు. ఇదే కాకుండా అందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన చిత్రాలు. ముఖ్యమైన గ్రాఫ్‌లు కూడా అందులో నిక్షిప్తం చేశారని తెలిసింది. కొన్ని సబ్జెక్టుల్లో బొమ్మలు వేయడానికే సమయం అంతా వృథా అయిపోతుంది. కాబట్టి అందులో నుంచి డౌన్లోడ్ చేసుకుని పాఠ్యాంశాలు బోధిస్తే సమయం ఆదాతోపాటు సులభతరంగా అర్థమవుతుంది. ఒక వేళ రెండు పిరియడ్లు ఒకే సబ్జెక్టు బోధించాలంటే ఒక పిరియడ్ బోధన రికార్డు చేసుకొని మరో పిరియడ్ అదే ప్లే చేసుకునేలా వెసులుబాటు ఉంది. కావాల్సిన పాఠాన్ని రికార్డు చేసుకొని ఎన్నిసార్లయిన వినవచ్చు. కేవలం బోధనే కాకుండా విద్యార్థులు సందేహాలను సైతం నివృత్తి చేసుకునే విధంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో వాడే టెక్నాలజీ గ్రామీణ ప్రాంత విద్యార్థులుండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వాడడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా గల కళాశాలల విద్యార్థులు విజ్ఞానాన్ని అందుకోవచ్చు. 7 కళాశాలల్లో అమలు... రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ తరగతులు 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జరుగనుండగా ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 కళాశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, జగిత్యాలలోని ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్ క్లాస్ సదుపాయం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్చువల్ తరగతుల వల్ల ఉపయోగాలు ఒకే వద్ద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గల కళాశాలల్లో తరగతులు వినవచ్చు. అధ్యాపకులు లేని కళాశాల విద్యార్థులకు ఉపయోగం. బోధనతోపాటు విద్యార్థులు సందేహాలు కూడా అడగవచ్చు. పాఠ్యాంశాల బోధన రికార్డు చేసుకోవచ్చు. నోట్స్‌ను స్కాన్ చేసి రాష్ట్రమంతటా షేర్ చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల చిత్రాలు నిక్షిప్తం అయిఉంటాయి. విద్యార్థులు తరగతికి రాకున్నా యాప్ ద్వారా మొబైల్‌కు కనెక్టు చేసుకొని తరగతులు వినవచ్చు.–మెసైజ్ క్లౌడ్ యాప్ ద్వారా విద్యార్థి మొబైల్లో చూడవచ్చు. లెక్చరర్లు లేని కోర్సుల్లో కూడా ప్రవేశాలు పెరుగుతాయి. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు అందుబాటులో ఉండడంతోపాటు మరెన్నో సదుపాయాలున్నాయి. విద్యార్థులు సాంకేతికతను వినియోగించుకోవాలి విద్యార్థులకు వర్చువల్ క్లాస్‌రూం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న వర్చువల్ తరగతులు వినియోగించుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఎదుగుతున్న సందర్భంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విజ్ఞాన సముపార్జన, విస్తృత అధ్యయనం జరుగుతుంది. – డాక్టర్ కలవకుంట రామకృష్ణ, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
తరగతులకు వేళాయె!
క్రమశిక్షణగా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఈ క్లాసులు ఎందుకంటే సినిమా కోసమే. ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్ పెట్టారు) చిత్రం కోసం కంగనా రనౌత్ భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ క్లాసులతోనే ఆమె బిజీగా ఉన్నారని తెలిసింది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం ప్రారంభం కానుంది. అందుకే భరతనాట్యం క్లాసులతో బిజీ అయ్యారు కంగనా. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
తర'గతి' ఇలా!
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వర్సిటీ పునఃప్రారంభమైంది. అయితే తరగతులు నిర్వహించాల్సిన పనిదినాల్లో బోధన సిబ్బందికి వర్సిటీ అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఇంజినీరింగ్ మినహాయించి 22 విభాగాల పీజీ బోధన సిబ్బందికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాం కింద శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహాత్మా గాంధీ గ్రామీణ విద్యా మండలి ఈ శిక్షణ నిర్వహిస్తుంది. శిక్షణలో 90 మంది పైబడి బోధన సిబ్బంది పాల్గొంటున్నారు. ఇంజినీరింగ్‌కు మాత్రం వర్సిటీలో ఉన్న ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ మూడు బ్రాంచ్‌ల్లో ఒక్క విద్యార్థి వచ్చినా తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 40 శాతం పైబడి విద్యార్థులు ప్రస్తుతం హాజరవుతున్నారు. పీజీ కోర్సుకు సంబంధించి విద్యార్థులు వచ్చి వెనుదిరుగుతున్నారు. ఎంసీఏ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితం, బయోటెక్నాలజీ వంటి కోర్సులకు సంబంధించి 40 శాతం పైబడి విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. అధ్యాపకులు రాకపోవడంతో ఒక పూట ఉండి వెనుదిరుగుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా సెలవు తీసుకుంటున్నారు. మరో పక్క శిక్షణకు సైతం పూర్తిస్థాయి బోధన సిబ్బంది హాజరు కావటం లేదు. చాలా మంది వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. శిక్షణకు హాజరై వెళ్లి పోతున్న బోధన సిబ్బంది సైతం ఉన్నారు. కనీసం తరగతులుకు ఇబ్బంది లేకుండా షిప్టులు వారీగా శిక్షణ ఇచ్చినా సరిపోయేది. సెలవులు ఇవ్వాల్సింది క్లాస్ వర్క్‌కు సెలవు ప్రకటించాల్సింది. లేదంటే తరగతులు అయినా నిర్వహించాలి. తరగతులు జరిగే సమయంలో బోధన సిబ్బందికి శిక్షణ ఇస్తుండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. – వి.అనిల్, జర్నలిజం మొదటి ఏడాది విద్యార్థి విద్యార్థులు పూర్తిస్థాయిలో రావటం లేదు విద్యార్థులు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల అనంతరం పూర్తిస్థాయిలో రావటం లేదు. క్లాస్ వర్కు గాడిన పడేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో బోధన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బోధకులకు శిక్షణ, బోధనా నైపుణ్యాలు అవసరం.– రిజస్ట్రార్, ప్రొఫెసర్ కె.రఘుబాబు. -
గిరిజన సైనిక్ స్కూలు సిద్ధం
సాక్షి, వరంగల్ రూరల్: గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి అధికారికంగా తరగతులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో ఈ స్కూలును ఏర్పాటు చేశారు. రూ.1.24 కోట్లతో భవనాలను ఆధునీకరిస్తున్నారు. ఇటీవల నూతన భవనాల నిర్మాణం కోసం మరోసారి ప్రభుత్వం రూ.2.5 కోట్లను మంజూరు చేయగా ఆ పనులు సైతం చురుకుగా సాగుతున్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్నాయి. కాగా, సైనిక్ స్కూల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను పూర్తి చేశారు. రాష్ట్రంలోని టీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలు, కళాశాలల నుంచి వీరిని ఎంపిక చేశారు. 5వ తరగతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 250 మంది హాజరుకాగా 80 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 280 మంది వరకు హాజరుకాగా ఇందులో నుంచి 80 మందిని ఎంపిక చేసి వారి జాబితాను గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పంపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఆర్మీ రిటైర్డ్ అధికారుల కోసం కూడా బుధవారం హైదరాబాద్‌లో ఎంపిక నిర్వహించినట్లు తెలిసింది. త్వరలో స్కూల్లో బోధించేందుకు అధ్యాపకుల ఎంపిక సైతం పూర్తి కానుంది. అధ్యాపకులు, ఇతర సిబ్బందిని ఈ నెల 10వ తేదీ వరకు ఎంపిక చేయనున్నారు. -
అక్కడ ఈ ఏడాదీ డిగ్రీ క్లాసులు లేనట్టే..
బి.కొత్తకోట: ఈ ఏడాది బి.కొత్తకోట డిగ్రీ కళాశాలలో తరగతులు లేనట్టే. ఇద్దరే విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ టీసీలు ఇస్తే మరో‡ కళాశాలల్లో చేరుతామంటూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వెంకట్రామకు విన్నవించారు. బుధవారం వీరికి టీసీలు ఇచ్చేయనున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరం డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం కావన్న విషయం స్పష్టమైంది. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు డిగ్రీ కళాశాల మంజూరుకు హామీ ఇచ్చారు. హడావుడిగా ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తూ ఉన్నత విద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. తొలుత బీఏ, బీకాం, కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టగా ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఇంటర్ టీసీలు ఇచ్చి, రూ.వెయ్యి ఫీజు చెల్లించారు. మంగళవారం నాటికీ మూడో విద్యార్థి చేరకపోవడంతో తరగతుల ప్రారంభం లేదని తేలిపోయింది. ఈ పరిస్థితిని ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వెంకట్రామ ఉన్నత విద్యశాఖ కమిషనరు సుజాతాశర్మ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ప్రయత్నించారు. 20న సాక్షిలో ప్రచురించిన ఇద్దరే ఇద్దరు కథనం కమిషనరు దృష్టికి తీసుకెళ్లారు. డిగ్రీ కళాశాలలో చేరేందుకు వచ్చే విద్యార్థుల వివరాలు, దరఖాస్తులను నమోదు చేసేందుకు కోసం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్ శేఖర్‌ను డెప్యూటేషన్‌పై ఇక్కడికి పంపారు. ఆయన రోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కూర్చోవడం.. విద్యార్థులు రాకపోవడంతో ఉసూరుమంటూ వెళ్లిపోవడం జరుగుతూ వస్తోంది. తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేనందున శేఖర్‌ను తిరిగి కుప్పంకు పంపించేయనున్నారు. -
రెండేళ్లుగా చెట్టుకిందే క్లాసులు
-
లక్ష్యసాధనకు ఏకాగ్రతే ముఖ్యం
శ్రీకాకుళం, రేగిడి: లక్ష్య సాధనలో ఏకాగ్రతే ముఖ్యమని, దీనివల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కొన్ని అంశాలను విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని సూచించారు. జ్ఞాపకశక్తి పెంచుకునేలా చదవాలి తప్ప బట్టీ విధానం మానుకోవాలని హితబోధ చేశారు. మండల పరిధిలోని వావిలవలసలో ఏఎంఆర్ గ్రూపు చైర్మన్ ముయిద ఆనందరావు పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రతి విషయం నేర్చుకోవడం, దానిని పదే పదే మననం చేసుకొని తద్వారా మేధాశక్తికి మరింత పదునుపెట్టడం వంటి అంశాలను విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా ఒక అంశాన్ని అనర్గళంగా నేర్చుకున్నప్పుడే ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టకుండా పాఠశాలలో పూర్తిసమయాన్ని చదువుపై కేంద్రీకరించాలని, అప్పుడే లక్ష్యం సాధించగలుగుతారని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ఫోన్లపైనే ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో చదువులో వెనుకబడుతున్నారని, విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్షణాలను అలవర్చుకుంటే భవిష్యత్ బంగారుమయమవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. రేగిడి, రాజాం, సంతకవిటి మండలాల్లో ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నవారంతా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. పుట్టినరోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేసిన ఆనందరావును యండమూరితో పాటు ఉపాధ్యాయులు, హెచ్ఎంలు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజాంకు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణులు వారాడ వంశీకృష్ణ, మజ్జి మదన్మోహన్, ఎస్.సత్యనారాయణ, కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, ముయిద శ్రీనివాసరావు, ముళ్లపూడి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
తరగతులు 14.. గదులు 9
శెట్టూరు: ఈ చిత్రంలో ఒకే గదిలో ఇరుకుగా కూర్చున్నది శెట్టూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే ఆరో తరగతి విద్యార్థులు. హైస్కూల్ అంటున్నారు గదులు లేవా... అనే సందేహం కలగవచ్చు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. పాఠశాలలో తరగతులు 14 ఉన్నాయి. అయితే గదులు మాత్రం తొమ్మిదే ఉన్నాయి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 483 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతో పాటు పాఠశాల కార్యాలయం, ఉపాధ్యాయుల విశ్రాంతి గది కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నించినా అదనపు గదులు మంజూరు కాలేదు. మండలంలో అవసరం లేని చోట్ల అదనపు గదులు అనవసరంగా నిర్మిస్తున్నా, అవసరం ఉన్న చోట మాత్రం నిర్మించడానికి అధికారులు, పాలకులు ఎందుకు ఆసక్తి చూపించడం లేదో మరి. -
జులై 17 నుంచి తరగతుల నిర్వహణ
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ క్యాంపస్ కళాశాలల్లో జులై 17 నుంచి పీజీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ సీఎన్ కృష్ణా నాయక్, ప్రొఫెసర్ రంగస్వామి తెలిపారు. జులై 3 నుంచి తరగతులు పునప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, వర్సిటీలో ఏర్పడిన తాగునీటి ఎద్దడి నేపథ్యంలో వాయిదా వేశామన్నారు. బోధన సిబ్బంది మాత్రం జులై 3 నుంచే హాజరు కావాలన్నారు. ఇదిలా ఉండగా, హాస్టళ్లలో చేపడుతున్న మరమ్మతులను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ కె.సుధాకర్‌బాబు పరిశీలించారు. గడువులోపు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. -
హమ్మయ్య..ఎట్టకేలకు శిక్షణ ఇస్తున్నారు
ఎన్నికైన తొమ్మిది నెలలకు ఎస్ఎంసీలకు శిక్షణ జిల్లాలో 67,200 మంది ఎస్ఎంసీలు రాయవరం: ఎన్నికైన ఏడు నెలలకు ఎట్టకేలకు పాఠశాల యాజమాన్య కమిటీలకు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకు కమిటీలను ఎన్నిక చేస్తే..విద్యా సంవత్సరం ముగింపులో శిక్షణ ఇవ్వడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీలు ఎన్నికైన వెంటనే వారి విధులు, బాధ్యతలు తెలియజేస్తూ శిక్షణ ఇస్తారని భావించినా పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఎన్నికైన సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. జవాబుదారీతనం పెంచేందుకు.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. దుస్తులు మొదలుకొని భోజనం కూడా ఉచితంగా అందజేస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధన, వీటిని సమన్వయం చేసుకుంటూ వెళ్లేందుకు పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల సమస్యలను ప్రభుత్వం దష్టికి ఎస్ఎంసీ ఛైర్మన్లు, సభ్యులు తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటే ఎస్ఎంసీ సభ్యుల అధికారాలు, బాధ్యతలు వారికి తెలియాల్సి ఉంది. ఎస్ఎంసీ చైర్మన్లుగా, సభ్యులుగా ఎన్నికైన వారికి వారి విధులు, బాధ్యతలు తెలిసేలా వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ఎస్ఎంసీ ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలలకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 67,200 మందికి శిక్షణ.. జిల్లా వ్యాప్తంగా 3,982 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ముగ్గురు వంతున 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 24, ఉన్నత పాఠశాలలో తొమ్మిది వంతున ఎన్నిక చేశారు. వీరు కాకుండా ఆరుగురు సభ్యులను కోఆప్షన్ సభ్యులుగా నియమించారు. జిల్లా వ్యాప్తంగా 1.09లక్షల మంది ఎస్ఎంసీ సభ్యులు ఉండగా, వీరిలో ఎన్నికైన 67,200 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు. వీరిలో 50శాతం మంది మహిళలే ఉన్నారు. స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో.. ఎన్నికైన ఎస్ఎంసీ సభ్యులకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఇచ్చే శిక్షణ బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 322 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ఎస్ఎంసీ సభ్యులకు విజయవాడలో శిక్షణ పొందిన డీఆర్పీలు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో పాల్గొనే సభ్యులకు మాడ్యూల్, పెన్ను, నోట్‌బుక్ అందజేయడంతో పాటు శిక్షణలో పాల్గొనే సభ్యులకు లంచ్ ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఫలప్రదమవుతుందా.. విద్యా సంవత్సరం మరో వారం రోజులు ముగియనుండగా శిక్షణ ఇవ్వడం ఎంత వరకూఉపయోగమనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎస్‌ఎంసీల్లో ఉన్న వారిలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. రబీ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో శిక్షణ ఎంత వరకు ఫలప్రదమవుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్ఎంసీ సభ్యులకు బుధ, గురువారాల్లో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఎంసీ సభ్యులు హాజరయ్యేందుకు అనువుగా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఏర్పాటు చేశాం. సభ్యులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలకు అదేశాలిచ్చాం. – మేకా శేషగిరి, పీఓ, ఎస్ఎస్ఏ, కాకినాడ. ఏర్పాట్లు పూర్తి చేశాం.. జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంసీ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికైన సభ్యులకు లంచ్‌ను ఏర్పాటు చేశాం. – ఇంటి వెంకట్రావు, సీఎంఓ, ఎస్ఎస్ఏ, కాకినాడ. -
మార్చి 21 నుంచి పైతరగతుల బోధన
మార్చి 15 నుంచి ఒంటి పూట బడుల్లేవ్! సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో కూడిన అకడమిక్ కేలండర్ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నెలవారీ విద్యా కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలు, సెలవులు తదితర వివరాలతో కూడిన కేలండర్‌ను రూపొందిస్తోంది. జూన్‌లో ప్రారంభించాల్సిన పైతరగతుల బోధనను ఈసారి సీబీఎస్ఈ స్కూళ్ల తరహాలో మార్చి 21 నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. వేసవి ఎండల నేపథ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రతి ఏటా నిర్వహించే ఒంటి పూట బడుల విధానం లేకుండా చూడాలని భావిస్తోంది. ఆయా తేదీల్లోనూ రెండు పూటల బడులు నిర్వహిం చేలా కసరత్తు చేస్తోంది. పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభించి.. ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చింది. ఇక వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చేలా కేలండర్లో పొందుపరుస్తోంది. -
ఆర్యూ తరగతులు పునఃప్రారంభం
కర్నూలు(ఆర్యూ): సంక్రాంతి సెలవుల అనంతరం రాయలసీమ యూనివర్సిటీ తరగతులు పునఃప్రారంభమైనట్లు రిజిస్ట్రార్ ఆచార్య అమర్నాథ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెలవుల అనంతరం వర్సిటీ కళాశాల తరగతులు, మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి రావాల్సి ఉండగా హాజరు శాతం తక్కువగా ఉందన్నారు. నేటి నుంచి నగరంలో జరిగే నందినాటకోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 4 నాటకాలను విద్యార్థుల విభాగం నుంచి ప్రదర్శిస్తామని తెలిపారు. -
జనవరి 15న కలికిరి సైనిక స్కూలు ఎంట్రన్స్
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కలికిరిలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు 2017 జనవరి 15న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, కలికిరిలలో జరగనుంది. -
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీ తరగతులు
– జగన్నాథ గట్టులో నిర్మాణపు పనులను పరిశీలించిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే విద్యాసంవత్సరం నుంచి కర్నూలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని ట్రిపుల్ ఐటీల కంటే కర్నూలు ట్రిపుల్ ఐటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంగళవారం కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మరో రెండు నెలల్లో తరగతి గదులు, ల్యాబ్, పరిపాలనా భవనం తదితర పనులు పూర్తి చేస్తామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 100 మంది మహిళలకు, 150 మంది బాలురకు తరగతులు ప్రారంభిస్తామన్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణపు పనులు జరుగుతున్నాయని వాటిల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి 2018 నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. కాంపౌడు వాల్ చుట్టూ మొక్కలు నాటి పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. జగన్నాథగట్టులో పెద్దపెద్ద బండరాళ్లు ఉన్నాయని వాటిపై బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే ఇబ్బందిగా ఉందని, 50 ఎకరాల భూమి కెటాయించాలని ఇంజినీరింగ్ అధికారి కోరగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట కర్నూలు తహసీల్దారు రమేష్, ట్రిపుల్ ఐటీ సీసీడబ్ల్యూ ఇంజినీర్లు ఉన్నారు. -
నారాయణ..ఇదేమీ?
– సెలవుల్లోనూ తరగతులు – అడ్డుకున్న విద్యార్థి సంఘాలు – ఆర్‌ఐఓను నిలదీసిన విద్యార్థి నాయకులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ నారాయణ కళాశాల యాజమాన్యం నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్, గాయత్రీ ఎస్టేట్‌లోని కళాశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షలను అడ్డుకున్నారు. వెంటనే ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చి ఆయన్ను రప్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ మహేంద్ర మాట్లాడుతూ..నిబంధనలను ఉల్లంఘించిన నారాయణ కళాశాలలను సీజ్ చేయాలన్నారు. సెలువుల్లోనూ తరతగతులు, పరీక్షలు నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడిని పెంచి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నా ఇంటర్ బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రి నారాయణ అండతో నారాయణ కళాశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని, వారిని అదుపు చేసే అధికారులే కరువయ్యారని ఆరోపించారు. నారాయణ కళాశాలల్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విద్యార్థులపై కమిటీలు వేయడమే తప్ప ఒక్కదానిలో నివేదిక ఇవ్వలేదన్నారు. పరీక్షను జరపబోమని ప్రిన్సిపాళ్లతో సంతకాలు తీసుకొని విద్యార్థులకు ఇళ్లకు పంపడంతో వారు ఆందోళనను విరమించారు. అనంతరం ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ..సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఇంటర్ బోర్డుకుకళాశాల సీజ్‌కు నివేదిక ఇస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సుమన్, గణేష్, ఎల్లయ్య, గోపీ, జయసింహ, సాయి, పవన్ తదితరులు పాల్గొన్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహించే కళాశాలలపై చర్యలు తీసుకోవాలి దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించి ప్రై వేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్ఐఓ పరమేశ్వరెడ్డి ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు సునీల్, నారాయణ, ఖలీల్, శరత్‌కుమార్, సుంకన్న, భీమేష్ పాల్గొన్నారు. -
‘ప్రజానాట్య మండలి’ తరగతులు ప్రారంభం
అమరావతి: ప్రజానాట్యమండలి కళారూపాలలో ప్రజల ఇబ్బందులు, కష్టాలు ప్రతిబింబించాలని పోగ్రసివ్, డెమోక్రటిక్ ఫోరం ఎమ్మేల్సీ ఎమ్‌విఎస్ శర్మ అన్నారు. శనివారం స్థానిక శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ ఆడిటోరియంలో మూడు రోజులపాటు నిర్వహించే ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణాతరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజానాట్యమండలి ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వివిధ కళారూపాలు రూపొందించాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రజానాట్యమండలి ప్రతినిధి రమణలతో పాటు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి సుమారు వందమందిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
25 నుంచి ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు తరగతులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు(సైన్సు గ్రూపు) ఈనెల 25 నుంచి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8 నుంచి 1.30 గంటల వరకు తరగతులను ఉంటాయని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇస్తామని చెప్పారు. -
తెరగతి పాఠాలు
రౌతులపూడి: సాంకేతిక విప్లవం జోరందుకుంటున్న రోజులివి. మరి ఆ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే భవిష్యత్తులో కష్టమే. అందుకే ఆ మండలంలోని విద్యార్థులు కొందరు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో డిజిటల్ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. వీరికి పలువురు పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు అందజేసిన డిజిటల్ ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, కంప్యూటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయి. తరగతి గదుల్లో చెప్పిన దానికంటే.. తెరపై చూపుతూ పాఠ్యాంశాలను వివరిస్తే విద్యార్థులకు సులువుగా బుర్రకెక్కుతుందంటున్నారు ఉపాధ్యాయులు. అందుకే వారి కోసం డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. సైన్స్, సోషల్, లెక్కలు.. సబ్జెక్టు ఏదైనా ‘స్క్రీన్’పై ప్రయోగాత్మకంగా, బొమ్మల రూపంలో చూపిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు సులువుగా పాఠాలు నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెడితే డిజిటల్ ఇండియా, మేడిన్ ఇండియాలకు చేరువకావచ్చని వారు సూచిస్తున్నారు. పూర్వపు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల చేయూతతో.. ∙మండలంలోని రామకృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో ఆగ్రామ పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రొజెక్టర్, కంప్యూటర్లు విద్యార్థులకు పూర్తిస్థాయిలో దోహదపడుతున్నాయి. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు డిజిటల్ పాఠ్యాం శాలపై దగ్గరుండి విద్యార్థులతో ఆపరేటింగ్ చేయించడం ద్వారా మరింత అవగాహన కలిగిస్తున్నారు. ∙బలరామపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ స్వచ్ఛందసంస్థ ప్రతినిధి, ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రొజెక్టర్ విద్యార్థుల సృజనాత్మకశక్తినిపెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ∙రౌతులపూడి జెడ్పీ ఉన్నతపాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన కంప్యూటర్ విద్యనందించేందుకు ఆ గ్రామ పూర్వపు విద్యార్థి సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రొజెక్టర్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు ఉపయోగపడుతుంది. -
బీసీ స్టడీ సర్కిల్‌కు రూ. 3.65 కోట్లుమంజూరు
కామారెడ్డిః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిజామాబాద్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు రూ. 3.65 కోట్లు మంజూరు అయ్యాయని టీఆర్ఎస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి జీవో ఆర్టీ నం. 194 జారీ అయ్యిందని వివరించారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి పోచారం, ఎంపీలు కవిత, పాటిల్‌లతో పాటు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. -
26 నుంచి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు
నల్లగొండ టౌన్ : యాదగిరిగుట్టలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని బరిగెల వెంకటేష్ పిలుపునిచ్చారు. బుధవారం శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవంలబిస్తున్న విద్యా, వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ జమీర్, ఇ.వెంకటేష్, అశోక్, మందుల శేఖర్, మధు, లింగస్వామి, సుధాకర్, రాజీవ్, రవి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని తరగతుల బహిష్కరణ
కుభీర్ : తమ పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మాలేగాం ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో బైటాయించారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని, గుడ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు సరిగ్గా రావడం లేదని తెలిపారు. ఎప్పుడూ పప్పు మాత్రమే వండుతున్నారని, కూరగాయలు, గుడ్లు పెట్టడం లేదన్నారు. మరుగుదొడ్లు సక్రమంగా లేవని, నీటి సమస్య ఉందని, బెంచీలు లేక నేలపై కూర్చుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల భవనం ఉరుస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులను గ్రామపెద్దలు సముదాయించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ వివరాలు నోటీసు బోర్డుపై లేవు. చాక్‌పీస్‌లు, డస్టర్లు సక్రమంగా లేవన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను ప్రశ్నించగా అన్ని సక్రమంగానే ఉన్నాయని, విద్యార్థులను కొందరు ఉపాధ్యాయులే రెచ్చకొడుతున్నారని తెలిపారు. చివరకు ఉపాధ్యాయులు సముదాయించడంతో విద్యార్థులు తరగతుల్లోకి వెళ్లారు. -
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ టీచర్!
మెక్సికోః విద్యార్థులకు అర్థమయ్యేట్టు పాఠాలు బోధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ సైన్స్ పాఠాలు బోధించడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అందుకే ఓ టీచర్ పాఠాలు చెప్పేందుకు సింపుల్ సొల్యూషన్ కనిపెట్టాడు. విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా వినేందుకు, వారిలో అవగాహన పెంచడంతోపాటు పాఠం వినడంలో పిల్లలు నిమగ్నమయ్యేందుకు సైన్స్ ను చక్కగా వివరించేందుకు కొత్త మార్గాన్ని అవలంబించాడు. పాఠం చెప్పేందుకు క్లాస్ రూం కు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి వెళ్ళాడు. క్లాసులో పిల్లలు పాఠాలు శ్రద్ధగా, ఇష్టంగా వినాలంటే టీచర్ చెప్పే విధానం బాగుండాలి. అయితే ఎంతో అనుభవం ఉన్న టీచర్లు కూడ ఒక్కోసారి విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమౌతుంటారు. అయితే పిల్లలకు పుస్తకాలంటే బోర్ కొట్టకుండా, పాఠం శ్రద్ధగా వినేందుకు మెక్సికోకు చెందిన 26 ఏళ్ళ సైన్స్ టీచర్.. మోజెస్ వాజ్ క్వెజ్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించాడు. వాస్తవ జీవితంలో సూపర్ హీరోలా విద్యార్థులముందు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. మోజెస్ మెక్సికో నేషనల్ అటానమస్ విశ్వవిద్యాలయం (యుఎన్ ఏఎమ్) లో సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ పాఠాలపట్ల విసుగు చెందకుండా ఉండేందుకు మోజెస్ పలు స్పైడర్ మ్యాన్ కామిక్స్ ను ప్రయోగించి పాఠాలు బోధిస్తున్నాడు. పార్ట్ టైం సైన్స్ టీచర్, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ పీటర్ పార్కర్ స్ఫూర్తితో విద్యార్థులు సూపర్ హీరోగా భావించే స్పైడర్ మ్యాన్ సూట్ ధరించి పాఠాలు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనో, ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలనో తాను ప్రయత్నించడం లేదని, నిజాయితీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి, క్లాస్ రూం అంటే బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్ విద్యార్థుల్లో కలిగేట్లు ప్రయత్నిస్తున్నానని మోజెస్ చెప్తున్నాడు. తూర్పు మెక్సికోలో తన తల్లితోపాటు నివసిస్తున్న మోజెస్... స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజారవాణా వాహనాల్లోనే యూనివర్శిటీకి వెడుతుంటాడు. తోటి ప్రయాణీకులు అతన్ని సూపర్ హీరోగా భావించినప్పటికీ తాను విశ్వవిద్యాలయంలో సైన్స్ టీచర్ ను మాత్రమే అని వివరిస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచనపై మోజెస్ కుటుబం మొదట్లో అతడి కెరీర్ కు హాని కలిగిస్తుందేమోనని భయపడింది. కానీ మోజెస్ తనదైన రీతిలో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి తరగతులకు వెళ్ళి విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాడు. తన ఆలోచనతో ఒక్క విద్యార్థులనే కాక వర్శిటీలోని ఇతర ఉపాధ్యాయులనూ ఆకట్టుకున్నాడు. మొదటి రోజు వారంతా స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోయినా... తర్వాత సంతోషంగా నవ్వుతూ ఆహ్వానించారని, చేసే పనిపట్ల బాధ్యత కలిగి ఉంటే, శక్తి అదే వస్తుందని మోజెస్ చెప్తున్నాడు. -
తరగతులు ఈ ఏడాది నుంచే
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి తరగతులు నిర్వహించాలని సర్కారు సంకల్పించింది. అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. అయితే అక్కడ భవనాల నిర్మా ణం, మౌలిక సదుపాయాల కల్పన వంటివి పూర్తికాలేదు. జిల్లా ఆసుపత్రిని మాత్రమే బోధనాసుపత్రిగా చూపించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఎంసీఐ ఇటీవల తనిఖీలు చేసి, చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది నుంచి అక్కడ ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణకు ఎంసీఐ ఒప్పుకొనే పరిస్థితి లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నుంచే అక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించి తరగతులు నిర్వహించాలనేది సర్కారు సంకల్పం. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్, అడ్మిషన్లు పూర్తయి తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన మేర భవనాలు పూర్తిచేస్తామని ఎంసీఐకి హామీ పత్రం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వైద్య విద్య డెరైక్టర్ రమణి తదితరులు గురువారం ఢిల్లీ వెళ్లిహామీ పత్రం ఇస్తారని సమాచారం. -
కార్పొరేటర్ల శిక్షణా తరగతులు ప్రారంభం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణా తరగతులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా పొద్దటూర్లోని ప్రగతి రిసార్ట్స్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ తరగతులు జరుగుతాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కారించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.