Online Class Interrupted By Hackers: Plays Adult Videos In Middle Of Class - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి హ్యాకర్‌.. పోర్న్‌ వీడియోలతో రచ్చ

Published Mon, Jun 28 2021 2:56 PM | Last Updated on Mon, Jun 28 2021 6:40 PM

Hacker Plays Obscene Videos During College Online Class - Sakshi

ముంబై : కాలేజ్‌ ఆన్‌లైన్‌ క్లాసులోకి చొరబడ్డ ఓ హ్యాకర్‌ రచ్చ రచ్చ చేశాడు. పోర్న్‌ వీడియోలు ప్లే చేసి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, పిలే పార్లేలోని ఓ కాలేజ్‌ గత కొద్దిరోజులుగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతుండగా ఓ హ్యాకర్‌ లోపలికి ప్రవేశించాడు. పోర్న్‌ వీడియోలు ప్లే చేశాడు. దాదాపు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు.. మహిళా లెక్చరర్లు ఉన్న ఆ ఆన్‌లైన్‌ క్లాసులో కలకలం మొదలైంది.

దీంతో ఆన్‌క్లాసును రద్దు చేశారు. ఆ వెంటనే కాలేజ్‌ యజమాన్యం జుహు పోలీస్‌ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి కాలేజ్‌ సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి, సరదా కోసం పోర్న్‌ వీడియోలు ప్లే చేశాడని తెలిపారు. నిందితుడిని అతడి ఐపీ అడ్రస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తున్నామని, త్వరలో అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.

చదవండి : నగ్నంగా బీచ్‌లో.. ఊహించని ఘటనతో పరుగో పరుగు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement