తరగతులకు వేళాయె! | Kangana Attending Classes For Jayalalithaa Biopic | Sakshi
Sakshi News home page

తరగతులకు వేళాయె!

Published Wed, Aug 28 2019 7:35 AM | Last Updated on Wed, Aug 28 2019 7:35 AM

Kangana Attending Classes For Jayalalithaa Biopic - Sakshi

కంగనా రనౌత్‌

క్రమశిక్షణగా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. ఈ క్లాసులు ఎందుకంటే సినిమా కోసమే. ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్‌ పెట్టారు) చిత్రం కోసం కంగనా రనౌత్‌ భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ క్లాసులతోనే ఆమె బిజీగా ఉన్నారని తెలిసింది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం ప్రారంభం కానుంది. అందుకే భరతనాట్యం క్లాసులతో బిజీ అయ్యారు కంగనా. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement