తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్టార్ హీరోయిన్ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం "తలైవి". ఏఎల్ విజయ్ దర్శత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇదిలా వుండగా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లకు ఇంకా అనుమతులు రానందున పలు సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ క్రమంలో తలైవి చిత్రం కూడా ఓటీటీలో విడుదల కానుందని, ఇందుకు నిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో భారీ డీలింగ్ కుదుర్చుకున్నారని వార్తలు వెలువడ్డాయి. త్వరలోనే ఈ సినిమాను అరచేతిలో చూసేయవచ్చని అందరూ భావించారు అయితే ఈ చిత్రాన్ని ముందుగా ఓటీటీలో విడుదల చేసే సమస్యే లేదని చిత్ర యూనిట్ కుండలు బద్ధలు కొట్టినట్లు చెప్పింది. (నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది)
ఓటీటీలో తలైవి ప్రీమియర్ రానుందన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ముందుగా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామని తెలిపింది. ఆ తరువాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. కాగా తొలుత జూన్ 26న సినిమా విడుదల చేయానుకున్నప్పటికీ కరోనా వైపరీత్యం వల్ల సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో విడుదల తేదీని వాయిదా వేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ మూడు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలిసి నిర్మించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత తలైవి ద్వారా కంగనా నేరుగా తమిళ సినిమాలో నటిస్తోంది. ఇదిలా వుంటే ఇప్పటికే జయలలిత బయోపిక్‌పై 'క్వీన్' చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించింది. (తలైవికి నష్టం!)
Comments
Please login to add a commentAdd a comment