సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో 40% సిలబస్ బోధన ఆన్‌లైన్‌లోనే సాగేలా వెసులుబాటు కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఉన్నత విద్య కార్య క్రమాలు, విద్యా సంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహ ణకు సంబంధించి యూజీసీ ఇటీవల మార్గదర్శ కాలు జారీ చేసింది. అందులో 25% సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధించేందుకు అవకాశమిచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇటీవలి మార్గదర్శకాలను మరోసారి పరిశీలించాలని, విద్యార్థుల భద్రతకు చర్యలు చేపడుతూ మార్పులు చేయాలని రెండ్రోజుల కిందట యూజీసీని కేంద్ర ఎంహెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆదేశిం చారు. దీంతో ఆన్‌లైన్ బోధనకు వెసులుబాటు కల్పించేలా యూజీసీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కిందిస్థాయి సెమిస్టర్ పరీక్షలతో పాటు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలనూ రద్దుచేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్‌చేసే అంశాలపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Comments
Please login to add a commentAdd a comment