టి-సాట్ నెట్‌వర్క్‌ ఇక ఎయిర్‌టెల్‌‌లో... | T SAT Collaborates With Airtel For Online Classes | Sakshi
Sakshi News home page

టి-సాట్ నెట్‌వర్క్‌ ఇక ఎయిర్‌టెల్‌‌లో...

Published Fri, Aug 14 2020 5:30 PM | Last Updated on Fri, Aug 14 2020 5:42 PM

T SAT Collaborates With Airtel For Online Classes - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులకు వీడియోల ద్వారా పాఠాలను బోధిస్తు టిసాట్‌ సంస్థ అత్యంత ప్రజాదారణ చూరగొంది.  తాజాగా నిపుణులతో తరగతులను బోధిస్తున్న టి-సాట్ నెట్‌వర్క్‌ తమ ప్రసారాల్లో మరో ముందడుగు వేసింది. కమ్యూనికేషన్ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ డీటీహచ్లో టి-సాట్ విద్య, నిపుణ ఛానళ్లు ప్రసారం కానున్నాయి. ఛానల్ నెంబర్లు 948, 949లలో  ప్రసారాలకు అనుమతిస్తూ టి-సాట్ నెట్‌వర్క్‌ తో ఏయిర్ టెల్ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. టి-సాట్ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు శాటీలైట్, సోషల్ మీడియా వేదిక ద్వార డిజిటల్ ప్రసారాలు అందిస్తూ యూట్యూబ్ లో నాలుగు లక్షల సబ్ స్ర్కైబ్స్ కలిగి ఉంది.

కోవిడ్ మహామ్మారి దృష్ట్యా ఏయిర్ టెల్ నెట్‌వర్క్ సంస్థ తెలంగాణ విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందించేందుకు టి-సాట్ ఛానళ్లు విద్య, నిపుణ ప్రసారం చేసేందుకు అంగీకారం తెలిపింది. దేశంలోని మొబైల్ రంగంలో మూడవ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా డీటీహెచ్ ద్వార 10 లక్షలు, ఎక్స్ట్రీమ్ ద్వారా 1.5 కోట్ల  సబ్ స్ర్రైబ్స్ కలిగి ఉండటమే కాకుండా 18 దేశాల్లో విస్తరించి ఉంది. వైర్ లెస్, మొబైల్, ఫిక్స్డ్ లైన్, హై స్పీడ్, డీటీహెచ్ ద్వార సేవలందిస్తూ దేశ వ్యాపితంగా మార్చి-2020 వరకు 423 మిలియన్ కష్టమర్లను కలిగి ఉంది. ఫలితంగా టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు దేశ వ్యాప్తంగా విస్తృతమవనున్నాయి. 

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ఒప్పందం వలన నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఆగస్టు 15వ తేదీన 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టి-సాట్, ఎయిర్ టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టి- సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఎయిర్ టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

తొలిసారిగా టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్లు భారతీ ఎయిర్టెల్లో ప్రసారం చేస్తున్నందుకు సీఈవో శైలేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపగా, తెలంగాణ ప్రభుత్వ సంస్థ టి-సాట్ ద్వారా విద్యార్థులకు సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. సీఈవో అవనీత్ పురి. ఏయిర్ టెల్ డీటీహెచ్ తో పాటు ఏయిర్ టెల్ ఎక్స్ట్రీం యాప్ లోనూ విద్యార్థులు టి-సాట్ ప్రసారాలు చూడవచ్చని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement